Railway Department
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అల్లూరి జిల్లా: గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది.రైల్వే అధికారుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.రైల్వే అధికారుల వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గృహాల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.ఆ సమయంలో అరకు వెళ్తున్న ఓ గూడ్స్ వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రాకపోకల్ని నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లను పునరుద్దించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. -
రైళ్లో దుప్పట్లు ఎన్ని రోజులకు ఉతుకుతారో తెలుసా?
రైల్వే ప్రయాణం చేస్తున్నారా? ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? అందులో వాడే ఉన్ని దుప్పట్లు ఎప్పుడు ఉతుకుతారో తెలిస్తే షాకవుతారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వయంగా రైల్వే విభాగం ఆసక్తికర సమాధానం ఇచ్చింది.ఏసీ కోచ్‌ల్లోని ఉన్ని దుప్పట్లు, బెడ్షీట్లు, కవర్లను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం స్పందించింది. బెడ్షీట్లు, పిళ్లో కవర్లు ప్రతి జర్నీ పూర్తయిన వెంటనే శుభ్రం చేస్తామని చెప్పింది. అయితే ఉన్ని దుప్పట్లను మాత్రం నెలలో ఒకటి లేదు రెండుసార్లు ఉతుకుతామని స్పష్టం చేసింది.‘ఏసీ కోచ్‌ల్లో రైలు ప్రయాణం పూర్తయిన వెంటనే పిళ్లో కవర్లు, బెడ్షీట్లు నిత్యం శుభ్రం చేస్తాం. అయితే చాలా సందర్భాల్లో దుప్పట్లు దుర్వాసన, తడిగా ఉండడం..వంటివి గమనిస్తే వెంటనే వాటిని ఉతకడానికి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. వారికి వెంటనే మరో దుప్పటి అందిస్తాం’ అని రైల్వేలో పదేళ్లు అనుభవం ఉన్న హౌజ్‌కీపింగ్ సిబ్బంది తెలిపారు.రైల్వే ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎం) సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా మాట్లాడుతూ..‘టిక్కెట్ ధరలో బెడ్ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి బెడ్షీట్లు, దిండ్లు, దుప్పట్లు ఇస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేస్తారు. ఉన్ని దుప్పట్లు ఉతకడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది’ అన్నారు. రైల్వేశాఖ ఆర్టీఐలో భాగంగా ఇచ్చిన రిప్లైలో..‘రైల్వే విభాగంలో అందుబాటులో ఉన్న లాండ్రీ సదుపాయాలకు అనుగుణంగా ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉతకాల్సి ఉంది’ అని పేర్కొంది. కాగా, రైల్వేలో బ్లాంకెట్లను పరిశుభ్రంగా ఉంచడం లేదని 2017లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రైల్వే విభాగానికి దేశవ్యాప్తంగా 46 డిపార్ట్మెంటల్ లాండ్రీ, 25 బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్-ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహించేవి) లాండ్రీ సదుపాయాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ లాండ్రీల్లోని సిబ్బంది తరచు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతున్నారు. దాంతో కొంత ఇబ్బందులున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బూట్ లాండ్రీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. -
సొంతూళ్లకు నగరవాసులు .. రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
-
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్‌ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్‌ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్‌ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
ట్రైన్ టికెట్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్.. దీని గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
రైల్వే ప్రయాణికుల శుభవార్త. ట్రైన్ టికెట్ బుకింగ్‌లో ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా? తెలిస్తే ఇకపై మీరు బుకింగ్ చేసుకునే టికెట్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. అంతేకాదు..సాధారణంగా మీరు మీ సొంత ఊరు వెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. వెంటనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు బుక్ చేసుకున్న టికెట్ కన్ఫామా, వెయింటింగ్ లిస్ట్ అనే అంశాలతో సంబంధం ఉండదు. కానీ ఐఆర్సీటీసీలో ఇప్పటికే ఉన్న సరికొత్త ఫీచర్‌ను ఉపయోగిస్తే.. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే డబ్బుల్ని డిడక్ట్ అవుతాయి. ఇందుకోసం మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (irctc) నిర్వహించే చెల్లింపుల గేట్‌వే ‘ఐ-పే’ ని వినియోగించాల్సి ఉంటుంది. దీన్ని 'ఆటోపే' అంటారు. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ ఐపే, యూపీఐ, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం రైల్వే టిక్కెట్ కోసం సిస్టమ్ పీఎన్ఆర్ నెంబర్ని రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఈ మెకానిజం యూపీఐ ఉపయోగించి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ ఐపే ఆటోపే వల్ల ఎవరికి ప్రయోజనం? ఐఆర్సీటీసీ ఐపే ఆటోపే సదుపాయం పెద్దమొత్తంలో ఆన్లైన్లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో పాటు వెయిటింగ్ లిస్ట్, జనరల్ లేదా తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. కింద పేర్కొన్న సందర్భాలలో ఐపే ఆటోపే ఉపయోగకరకంగా ఉంటుందని తెలిపింది. వెయిట్ లిస్ట్: మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికులు డబ్బులు చెల్లించినా 'బెర్త్ ఛాయిస్ నాట్ మెట్' లేదా 'నో రూమ్' వంటి సందర్భాలలో ఆటోపే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వెయిట్‌లిస్ట్ తత్కాల్: చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా తత్కాల్ వెయిట్‌లిస్ట్ చేయబడిన ఇ-టిక్కెట్ వెయిట్‌లిస్ట్‌లో ఉంటే, అటువంటి సందర్భాలలో వర్తించే ఛార్జీలు (రద్దు ఛార్జీలు, ఐటీఆర్సీటీసీ కన్వీనియన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు) చెల్లించినా ఆటోపే ఫీచర్ సాయంతో తిరిగి వెనక్కి పొందవచ్చు. ఇన్ స్టంట్ రీఫండ్: ఒక వ్యక్తి వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌ను బుక్ చేస్తుంటే, కన్ఫర్మ్ చేసిన టిక్కెట్ పొందలేకపోతే డిడక్ట్ అయిన మొత్తం మూడు లేదా నాలుగు వర్కింగ్ డేస్‌లో తిరిగి వాపస్ పొందవచ్చు. బుకింగ్ మొత్తం ఎక్కువగా ఉంటే, దాని కోసం తక్షణ రీఫండ్ పొందడం వలన అదనపు ఛార్జీలు లేకుండా వ్యక్తిగత బుక్ ప్రత్యామ్నాయ రవాణా ఎంపికలకు సహాయం చేస్తుంది. అయితే, ఒక వ్యక్తి వెయిట్‌లిస్ట్ టిక్కెట్లను బుక్ చేయడానికి ఐఆర్సీటీసీ ఆటోపే ఫీచర్‌ని ఉపయోగించినప్పుడు టిక్కెట్ కన్ఫామ్ కాకపోతే వెంటనే ఆ డబ్బులు మీ అకౌంట్‌కు రిటర్న్ అవుతాయి. -
వందేభారత్ స్లీపర్ కోచ్‌లు వస్తున్నాయోచ్..!
ఢిల్లీ: స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి దేశరవాణాలో అరుదైన మైలురాయిని చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేస్తోంది భారత రైల్వేశాఖ. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్‌ల ఫొటోలు షేర్ చేశారు. Concept train - Vande Bharat (sleeper version) Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023 వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్, ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్‌లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్ అన్ ఇండియా' ప్రోగ్రామ్‌లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్ లైన్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి. సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, విద్యుత్ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు. 21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్.. సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్లలోనూ స్టేషన్ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది. ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది. 77 కి.మీ. మేర పూర్తయిన మార్గం.. మనోహరాబాద్ –కొత్తపల్లి (కరీంనగర్) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ (77కి.మీ) వరకు లైన్ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు నేపథ్యం ఇదీ.. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
భద్రాద్రి రామయ్య భక్తులకు.. రైల్వేశాఖ తీపి కబురు!
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య భక్తులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. రామయ్య చెంతకు రైలు సౌకర్యం కల్పించే భద్రాచలం – మల్కన్‌గిరి (ఒడిశా) మార్గం నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుమార్గం నిర్మాణానికి ఫైనల్ లోకేషన్ సర్వేను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గును మరింత వేగంగా వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే లక్ష్యంతో డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వై లైన్‌కు రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గానికి కూడా ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణాలో డోర్నకల్ – భద్రాచలంరోడ్ బ్రాంచ్‌లైన్ మరింత కీలకంగా మారుతుంది. కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ఐరన్ ఓర్ గనులకు కేంద్రమైన కిరోండల్ వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఫైనల్ లొకేషన్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్తగూడెం – కిరోండల్ మధ్య దూరం కేవలం 180 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం కిరోండల్‌కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీ. దీంతో దగ్గరి దారిగా కొత్తగూడెం నుంచి కిరండోల్‌కు రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014 – 15 సంవత్సర బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. సర్వే కోసం కేవలం రూ.10 లక్షలు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ప్రాథమిక సర్వేను 2018 బడ్జెట్లో మంజూరు చేసింది. తాజాగా ఫైనల్ సర్వే రిపోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. భద్రాలచం – మల్కన్‌గిరి రైల్వేలైన్ తెలంగాణ – ఆంధ్రా మీదుగా ఒడిశాకు వెళ్తుండగా కొత్తగూడెం – కిరోండల్ మార్గం తెలంగాణ మీదుగా నేరుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లేలా నిర్మించే అవకాశం ఉంది. ప్రాథమిక సర్వేకు ఏడాది.. దట్టమైన ఏజెన్సీ ప్రాంతాలైన తెలంగాణలోని భద్రాచలం (పాండురంగాపురం రైల్వేస్టేషన్) నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. ఈ రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించేందుకు ప్రాథమిక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3 కోట్లు కేటాయించింది. ఏడాది పాటు జరిగిన ప్రాథమిక సర్వే రిపోర్ట్ 2022 జూన్‌లో వచ్చింది. ఇందులో ఒడిశాలోని మల్కన్‌గిరిలో బయలుదేరితే.. బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురంలో స్టేషన్లు నిర్మించాలని సర్వేలో పేర్కొన్నారు. ఈ రైలు మార్గం దారిలో గోదావరి, శబరితో పాటు చిన్నా పెద్దా కలిపి 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,592 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ లైన్‌కు సంబంధించి ప్రాథమిక రిపోర్టు వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఈ రైల్వేలైన్ నిర్మాణంపై ఉలుకూపలుకు లేదు. దీంతో భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం రైల్వేలైన్ల తరహాలో ఇది కూడా సర్వేలకే పరిమితం అవుతుందనే భావన జిల్లా వాసుల్లో ఏర్పడింది. ఫైనల్ లొకేషన్ సర్వే.. దేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఫలానా రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) చేపడుతుంది. ఈ సర్వేలో మరింత స్పష్టంగా వివరాలు సేకరిస్తుంది. అందులో రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి, నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్‌ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి, నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలు సేకరించి రిపోర్ట్ తయారు చేస్తారు. దీని ఆధారంగా మొత్తం పనిని పలు బిట్లుగా విభజించి నిధులు మంజూరు చేస్తారు. రెండేళ్లలో పనులు.. రైల్వే లైన్ నిర్మించే మార్గంలో ఉండే భౌగోళిక అననుకూలతలను బట్టి ఫైనల్ లొకేషన్ సర్వేకు ఎంత సమయం పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏడాదిలోగానే రైల్వేశాఖ ఫైనల్ సర్వేను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఫైల్ రైల్వే బోర్డుకు చేరుతుంది. అక్కడ ఆర్థిక పరమైన మదింపు తర్వాత నిధులు కేటాయిస్తారు. ప్రస్తుత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశాకు చెందినవారు కావడంతో మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో పురోగతి వేగంగా సాగుతోంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో రెండేళ్లలో ఈ రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే భద్రాచలం నుంచి దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా జిల్లా వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం మరింత విస్తృతం కానుంది. -
3,238 కోట్ల ఖర్చుతో గుంటూరు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు
సాక్షి, ఢిల్లీ: పలు కొత్త పథకాలతో పాటు కీలక నిర్ణయాలకు ఇవాళ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ‘‘పీఎం ఈ - బస్ సేవ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 169 నగరాల్లో 10వేల ఈ - బస్ లు ప్రవేశ పెట్టనుంది కేంద్రం. అలాగే.. 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది. ఇక పీఎం విశ్వ కర్మ నూతన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. చేతివృత్తుల వారికి రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం 32,500 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న కేంద్రం వీటిలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు - బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో.. విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి. -
ఒడిశా రైలు ప్రమాదం.. 3 నెలల ముందుగానే హెచ్చరిక
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్‌లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్‌ను బైపాస్‌గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్‌కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహన్‌గా బాజార్ స్టేషన్‌కు చెందిన మెయిన్ లైన్లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్లైన్లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్‌లు డౌన్‌లైన్‌లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్‌గా బాజార్ స్టేషన్లో ఈ ట్రైన్‌కు స్టాపేజీ లేదు. అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్‌లో డౌన్‌లైన్‌లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్‌పూర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్‌గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక.. -
ఏపీ లో రైల్వే శాఖ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-
టికెట్ లేని ప్రయాణం .. రైల్వే శాఖకు కోట్లలో లాభం
-
కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక
సాక్షి అమలాపురం: కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ నిర్మాణంలో ముందడుగు పడింది. కొన్ని పనులకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించింది. గౌతమి నదిపై దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిన ఈ వంతెన పైభాగంలో ఐరన్ రెయిల్స్, బాక్స్ గడ్డర్లు, ఇతర పనులు చేపట్టనున్నారు. కోటిపల్లి–నరసాపురం మధ్య 57.21 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణ అంచనా రూ.2,120.16 కోట్లు. ఈ ప్రాజెక్టులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి నది పాయలపై మూడు వంతెనల నిర్మాణం కీలకం. ఈ పనులు పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చినట్టే. తొలుత డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో కోటిపల్లి–శానపల్లిలంక మధ్య గౌతమి గోదావరి నదిపై 3.50 కిలోమీటర్ల వంతెన నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి మొత్తం 44 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. వైనతేయ గోదావరి పాయపై బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య 21 పిల్లర్లకుగాను 16 పూర్తయ్యాయి. ఐదు నిర్మాణదశలో ఉన్నాయి. వశిష్ట గోదావరి నదిపై జిల్లాలోని దిండి, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని చించినాడ మధ్య వంతెన నిర్మాణానికి 20 పిల్లర్లకుగాను 18 పూర్తయ్యాయి. గౌతమి నదిపై పిల్లర్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లవుతున్నా మిగిలిన వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదు. వరదలు, ఇతర కారణాల వల్ల వశిష్ట, వైనతేయ పిల్లర్ల నిర్మాణాలకు అవాంతరాలు ఏర్పడినా ఇటీవల పనులు జోరందుకున్నాయి. ఇక పనులు చకచకా.. గౌతమి నదిపై వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు ట్రాక్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వేశాఖ రూ.296.51 కోట్లు కేటాయించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఈ నిధులతో వంతెన నిర్మాణం పూర్తిచేయడంతోపాటు కోటిపల్లి వైపు 30 మీటర్లు, శానపల్లిలంక వైపు 100 మీటర్ల మేర ఎర్త్‌వర్క్ చేసి, కోటిపల్లి నుంచి శానపల్లిలంక వరకు ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 11న టెండర్లు పిలిచారు. వచ్చేనెల 26వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. దుష్ప్రచారాలకు తెర దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరిస్తామని హామీ ఇచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి చేతులు దులుపుకొంది. నిధులు విడుదల చేయలేదు. భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్నందున ఇవ్వాల్సిన వాటాను మినహాయించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఈ యత్నాలు ఫలించాయి. దీంతో రైల్వేశాఖ గౌతమి వంతెన నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో ఉండగా ఇదే అదనుగా టీడీపీ సహా విపక్షాలు వంతెన నిర్మాణ పనులు నిలిచిపో యినట్టు దుష్ప్రచారానికి దిగాయి. గౌతమి నదిపై వంతెన పనులు ఆగినా.. వైనతేయ, వశిష్ట నదులపై వంతెనల పనులు జరుగుతున్నా విషప్రచారం ఆపకపోవడం గమనార్హం. తాజాగా గౌతమి నదిపై వంతెన పనులు కూడా మొదలు కానున్నాయి. గౌతమి నదిపై వంతెన నిర్మాణ పనులకు టెండరు పిలవడంపై కోనసీమ జేఏసీ చైర్మన్ వి.దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహ నరావు అమలాపురంలో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషం కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టులో గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడంతో చాలా సంతోషంగా ఉంది. ఆగిపోయిన పను లు మొదలు కావడంతో ఈ ప్రాజెక్టుపై స్థాని కులకు ఉన్న బెంగ వీడింది. ఇందుకు సహక రి ంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.– బండారు రామ్మోహనరావు, కోనసీమ జేఏసీ కన్వీనర్ -
నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్కు ఘన చరిత్ర
నందలూరు (రాజంపేట): బ్రిటీషు రైల్వే పాలకుల నుంచి కొనసాగిన ఎంతో ఘన చరిత్ర కలిగిన నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ (మిగిలిన ఏకై క డిపార్టుమెంట్) ఎత్తివేతకు డెడ్‌లైన్ విధించారు. ముందుగా నందలూరుకు మోడర్ రన్నింగ్‌రూం కోటి వ్యయంతో మంజూరు చేశారు. దానిని అర్ధాంతరంగా రద్దుచేశారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రన్నింగ్‌స్టాప్ డిపో ఏర్పాటు అనుకూలం కాదని చెబుతున్నా గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. వారి అనాలోచిత నిర్ణయాలతో నందలూరు డిపోకు మంగళం పాడారని రైల్వే కార్మిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. 6న క్రూసెంటర్ క్లోజ్.. వచ్చేనెల 6న రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్‌ను క్లోజ్ చేయనున్నారు. ఈ మేరకు సంబంధితశాఖ అధికారులకు గుంతకల్ నుంచి సంకేతాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే దశలవారీగా లోకోఫైలెట్లు, అసిస్టెంట్ లోకోఫైలెట్లు, గార్డులను గుంతకల్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకున్న డిపోకు తరలించారు. ఇక పూర్తి స్థాయిలో నందలూరు క్రూ సెంటర్‌ను మూసేసేందుకు రంగంసిద్ధం చేశారు. – రన్నింగ్‌స్టాప్ సిబ్బందిని ఇప్పటికే గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు ఎర్రగుంట్ల డిపోకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు. వచ్చే నెల 6 నాటికి నందలూరులో క్లోజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి లోకోఫైలెట్లు, ఏఎల్పీ, గూడ్స్గార్డులు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. దీంతో నాగిరెడ్డిపల్లె అర్బన్ పంచాయతీలో అద్దె ఇళ్లను ఖాళీ చేసుకుంటున్నారు. ఎర్రగుంటల్లో నివాసం ఉండలేమని వారు అంటున్నారు. కాలుష్యం లేని, తాగునీటి వసతి తదితర సమస్యలు లేని సమీప నగరాల్లో ఉండేందుకు అద్దె ఇళ్లను అన్వేషించుకుంటున్నారు. నాలుగేళ్లలో.. ఆది నుంచి ఒక పథకం ప్రకారం నందలూరు రైల్వేకేంద్రాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసుకుంటూ వస్తోందని రైల్వే వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రూ సెంటర్ క్లోజ్ నేపథ్యంలో ఆ పార్టీకి రాజంపేట, నందలూరు ప్రాంతీయుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. హాల్టింగ్, ఉన్న డిపార్టుమెంట్లను ఎత్తివేయడం తదితర వాటిని రైల్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ నందలూరు రైల్వే వైభవం కోల్పోవడానికి నాంది పలికిందని.. ఇప్పుడు బీజేపీ పాలనలో పూర్తిగా గత వైభవంను క్లోజ్ చేశారనే విమర్శలు వెలువడుతున్నాయి. 170 ఏళ్ల తర్వాత నిర్వీర్యం దిశగా నందలూరు.. దక్షిణమధ్య రైల్వే చరిత్రలో గుంతకల్‌కు రైలుమార్గంలేని రోజులలోనే నందలూరుకు రైల్వేమార్గం ఉండేది. సదరన్ రైల్వే(తమిళనాడు)లో కీలక రైల్వే కేంద్రంగా విరాజిల్లింది. వేలాది మంది కార్మికులతో కళకళలాడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు నందలూరులో నివాసాలు ఉండటంతో దేశవ్యాప్త కల్చర్ నందలూరులో కొనసాగింది. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడంలేదు. ఇక గూడ్స్ రైళ్లు కూడా ఆగకుండా వెళ్లిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రన్నింగ్‌రూం, రైల్వే హాస్పిటల్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఎలక్ట్రికల్, రైల్వే ఇనిస్టిట్యూట్ తదితర విభాగాలు కూడా క్లోజ్ కానున్నాయి. ఆ విధంగా 170 ఏళ్ల చరిత్ర కలిగిన నందలూరు బీజేపీ పాలనలో గ్రామీణస్టేషన్గా అవతరించనున్నది. రన్నింగ్‌స్టాప్ డిపో క్లోజ్ చేస్తే .. నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ వచ్చేనెల 6న క్లోజ్ చేయనున్నారు. కళకళలాడే నందలూరు ఇక కళ తప్పనుంది. 170 ఏళ్ల రైల్వేచరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. గంతకల్ రైల్వేడివిజన్ ఉన్నతాధికారులు నందలూరుపై కత్తికట్టి మరీ నిర్వీర్యం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నేరుగా రైల్వేబోర్డులో కదిలిక తీసుకురావాలి. నందలూరు పూర్వవైభవం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. – జంబు సూర్యనారాయణ, సర్పంచి, నాగిరెడ్డిపల్లె అర్బన్, నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు.. నందలూరు అంటే రైల్వే అన్నట్లుగా కొనసాగింది. జిల్లాలో ఏ రైలు ఎక్కాలన్నా నందలూరుకు వచ్చేవారు. ఇప్పుడు ఏ రైలూ ఆగడం లేదు. ఉన్న విభాగాలను ఎత్తివేసే పరిస్థితులు నెలకొన్నాయి. నేడు నిర్వీర్యదిశగా పయనించడం బాధాకరం. నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వవైభవానికి కలిసికట్టుగా కృషిచేయాలి. – కమాల్‌బాష, రిటైర్డ్ లోకోఫైలెట్, నందలూరు -
టికెట్ చెకింగ్‌పై త్రినేత్రం
సాక్షి, విశాఖపట్నం: రైళ్లలో హింసాత్మక చర్యలను నిరోధించే లక్ష్యంతో రైల్వే బోర్డు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. టికెట్ చెకింగ్ సమయంలో వస్తున్న ఆరోపణలు, ప్రయాణికులతో వాగ్వాదాలకు చెక్ చెప్పేలా టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మధ్య రైల్వే జోన్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. మిగిలిన జోన్లకు విస్తరించేందుకు సమాలోచనలు చేస్తోంది. త్వరలోనే ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని వాల్తేరు డివిజన్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీలు చేసే సమయంలో ప్రయాణికులతో సిబ్బందికి తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టికెట్ కలెక్టర్లపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వెయిటింగ్ టికెట్ తనిఖీ చేసే సమయం, ఆర్ఏసీ ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లు కేటాయించే విషయంలోనూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వీటికి పూర్తిస్థాయిలో చెక్ చెప్పాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ తనిఖీ అధికారులకు బాడీ కెమెరాలు అమర్చుతోంది. పైలట్ ప్రాజెక్టుగా మూడు నెలల కిందట సెంట్రల్ రైల్వే పరిధిలో 50 మంది టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు అమర్చింది. అప్పటి నుంచి ఒక్క ఫిర్యాదు గానీ, ప్రయాణికుల వాగ్వాద సంఘటనలు గానీ నమోదు కాలేదు. దీంతో మిగిలిన జోన్లలోనూ అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఒక్కో కెమెరా రూ.9 వేలు.. రైల్వే నెట్వర్క్ పరిధిలోని అన్ని జోన్లకూ బాడీ కెమెరాలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బోర్డుకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో బాడీ కెమెరాలు అందించనున్నారు. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ పరిధిలో టీసీలకు వీటిని అమర్చనున్నారు. ఒక్కొక్కటి రూ.9,000 విలువైన ఈ బాడీ కెమెరాలు దాదాపు 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలవు. బాడీ కెమెరాలు టికెట్ తనిఖీ సమయంలో ఉద్యోగుల పారదర్శకతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. దీంతో పాటు అక్రమ చర్యలను నిరోధించవచ్చు. ఫిర్యాదుల సందర్భంలో, టిక్కెట్ తనిఖీ సమయంలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. వృత్తి నైపుణ్యం పెంచడంతో పాటు సిబ్బంది రక్షణకు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నర్సాపూర్-బెంగళూరు మధ్య వేసవి రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. చదవండి: సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07154) మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పట్టాయ్, బంగార్పేట్, కృష్ణార్జునపూరం స్టేషన్లలో ఆగుతుంది. చదవండి: బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్ -
రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని!
Railway Recruitment Scam: ప్రైవేట్ ఉద్యోగంలో ఆర్ధిక మాంద్యం భయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామంటే బోలెడంత కాంపిటీషన్. అయినా సరే కాలంతో పోటీ పడుతూ కోరుకున్న జాబ్‌ను దక్కించుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఆ కోచింగ్, ఈ ఈవెంట్లు అంటూ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఆ అవసరాన్నే క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తమిళనాడుకు చెందిన 28 మంది యువకులకు రైల్వే శాఖలో ఉద్యోగం. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ), ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ విభాగాల్లో జాబ్ డిజిగ్నేషన్ కోసం ఈ ఏడాది జూన్ - జులై నెలలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ ఏంటో తెలుసా? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లలో నెలకు ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నాయి. ఎన్ని రైళ్లు వస్తున్నాయో లెక్కపెట్టడమే. ఇందుకోసం ఆ యువకులు ఒక్కొక్కరు రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల వరకు..మొత్తంగా రూ.2.67 కోట్లు చెల్లించారు. పాపం సుబ్బుసామి తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన సుబ్బుసామి మాజీ సైనికుడు. మంచి వ్యక్తి. తన ఊరిలో, లేదంటే తనకు తెలిసిన యువకులకు ఉపాధి కల్పించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. ఈ తరుణంలో సుబ్బుసామి పనిమీద ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌కు వెళ్లగా.. అక్కడ కోయంబత్తూరు నివాసి శివరామన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో తనకు ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగం వచ్చేలా చేస్తానని శివరామన్.. సుబ్బుసామిని నమ్మించాడు. రూ.2.67 కోట్లు వసూలు అతని మాటలు నమ్మిన సుబ్బుసామి ముగ్గురు నిరుద్యోగుల్ని శివరామన్‌కు ఫోన్లో పరిచయం చేయించాడు. ఉద్యోగం కావాలంటే ఢిల్లీకి రావాల్సిందేనని ఆదేశించాడు. ఇలా ముగ్గురు నిరుద్యోగులు కాస్తా.. 25మంది అయ్యారు. దీంతో నిందితుడు తాను వేసిన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా బాధితుల్ని ఢిల్లీకి రప్పించాడు. అక్కడ అభ్యర్ధులకు వికాస్ రాణా’తో మాట్లాడించాడు. ఉద్యోగం, ట్రైనింగ్, మెటీరియల్, ఆఫర్‌లెటర్, జాబ్ డిజిగ్నేషన్ ఏంటో క్లుప్తంగా వివరించిన రాణా.. వారి వద్ద నుంచి రూ.2.67 కోట్ల వరకు వసూలు చేశాడు. వచ్చే, పోయే రైళ్లను లెక్కేయడమే ఉద్యోగం అనంతరం డబ్బులు తీసుకున్న కేటుగాళ్లు అభ్యర్ధులకు రైల్వే సెంట్రల్ హాస్పిటల్, కన్నాట్ ప్లేస్‌లో వైద్య పరీక్షల కోసం పిలిపించారు. ఆపై ఉత్తర రైల్వేలోని జూనియర్ ఇంజనీర్, శంకర్ మార్కెట్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఒక నెల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్‌లో రోజుకి 8 గంటల పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకు ఉన్న భోగీలు లెక్కించారు. ట్రైనింగ్ కూడా పూర్తయింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం వికాస్ రాణా వారికి ఆఫర్ లెటర్లు అందించాడు. ఆ ఆఫర్ లెటర్లు తీసుకొని న్యూ ఢిల్లీ రైల్వే శాఖ అధికారుల్ని ఆశ్రయించడంతో ఈ ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. నిందితులు చేతుల్లో మోసపోయామని భావించిన అభ్యర్ధులు న్యాయం చేయాలని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బుసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సుబ్బు సామి యువకుల్ని మోసం చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఈ జాబ్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. వికాస్ రాణా పచ్చి మోసగాడు డబ్బు వసూలు కోసం వికాస్ రాణా ఎప్పుడూ తమను బయట కలుస్తుంటాడని, ఏ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని బాధితులు చెబుతున్నారు. శిక్షణకు సంబంధించిన ఆర్డర్లు, గుర్తింపు కార్డులు, శిక్షణ పూర్తయిన సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ లెటర్లు వంటి అన్ని పత్రాలను రైల్వే అధికారులతో క్రాస్ వెరిఫై చేయగా నకిలీవని తేలిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. -
కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రీఫండ్ కోసం ఇక రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ రీఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్లైన్ ద్వారా రీఫండ్ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్ టికెట్లకు సైతం ఆన్లైన్ రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. అరగంట ముందు చాలు... ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ బుక్ చేసుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్లైన్ రీఫండ్ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 శాతం కౌంటర్ టికెట్లు ► ప్రతి ట్రైన్లో 30 శాతం వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్ లిస్టు జాబితా పెరిగిపోతుంది. ► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు. చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు -
‘స్కానింగ్’ అయ్యాకే రైళ్లలోకి పార్శిళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లలో రవాణా చేసే పార్శిళ్లను తనిఖీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటుచేసి, పరిశీలించాకే పార్శిళ్లను రైళ్లలోకి ఎక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి పార్శిళ్ల స్కానర్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటైంది. త్వరలో మిగిలిన ప్రధాన స్టేషన్లలోనూ ఏర్పాటు కానున్నాయి. దర్భంగా పేలుడుతో.. గతేడాది బిహార్‌లోని దర్భంగా స్టేషన్లో పార్శిల్ వ్యాగన్లో తీవ్రవాదులు అమర్చిన బాంబు పేలిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రయాణికుల రైళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పార్శిళ్లను వినియోగించాలని పథకాలు రచిస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. ప్రయాణికుల రైళ్లలో తీసుకెళ్లే పార్శిళ్ల కోసం తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రైల్వేని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రయాణికుల రైళ్లలో పార్శిళ్లు పెద్దమొత్తంలో తరలే స్టేషన్లలో నాంపల్లి తొలి స్థానంలో ఉంటుంది. దీంతో తొలి స్కానర్ ఏర్పాటుకు ఈ స్టేషన్‌నే ఎంపిక చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో.. స్కానర్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే దిశగా రైల్వే యోచిస్తోంది. ఇదే తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ యూనిట్‌ను ఇటీవలే ప్రారంభించింది. తాజాగా పార్శిల్ స్కానర్‌నూ ఏర్పాటు చేయించింది. ఇందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. నాంపల్లి నుంచి టన్నుల కొద్ది పార్శిళ్లు వెళ్తాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా వ్యాగన్ మొత్తాన్ని పార్శిల్ కోసం బుక్ చేసుకుంటాయి. వీటిని లీజ్డ్ వ్యా న్లుగా పేర్కొంటారు. ఇలాంటి లీజ్డ్ వ్యాన్లలో తరలే పార్శిల్‌కి రూ.5, లీజ్డ్ కాని వ్యాన్లలో తీసుకెళ్లే ప్రతి పార్శిల్‌కి రూ.10 చార్జ్ చేస్తారు. ఈ మొత్తం ఆ ప్రైవేటు సంస్థ తీసుకుంటుంది. స్కానింగ్ తరువాతే లోడింగ్.. భారతీయ రైల్వేలోని న్యూఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. స్కానర్ ద్వారా తనిఖీ చేసిన పార్శిళ్లపై ప్రత్యేకం గా స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. కంప్యూటర్ ఆధారిత స్కానర్ల వల్ల పార్శిళ్లలో ఉన్న వస్తువులను, ప్రమాదకర పదార్థాలను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి స్టేషన్లో స్కానర్లు అమర్చటంలో కీలకంగా ఉన్న సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తా, సిబ్బందిని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. -
ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది?
గుత్తి(అనంతపురం జిల్లా): రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి.. జనం ఉరుకులు పరుగులు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ ( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) క్షణాల్లో ప్రత్యక్షమైంది. ప్రయాణికులను కాపాడటంతో పాటు క్షతగాత్రులకు ఎలాంటి హాని జరగకుండా బోగీల్లోంచి వెలుపలికి తీసుకువచ్చారు. అసలేం జరిగింది..ఏం జరుగుతుందో తెలియక జనం దిక్కులు చూశారు. చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి! అయితే అదంతా రైల్వేశాఖ నిర్వహించిన మెగా మాక్ డ్రిల్ అని తెలిసి కుదుటపడ్డారు. బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌లోని సౌత్ క్యాబిన్ సమీపంలో గుంతకల్లు డీఆర్ఎం వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో రైల్వే ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం కిరణ్, ఏడీఆర్ఎం మురళి కృష్ణ, సీనియర్ డీఎంఈ పుష్పరాజ్, ఏడీఎస్ఓ బాలాజి, ఏసీఎం శ్రీనివాస్, ఏడీఎం విజయ కృష్ణ, ఏడీఎంఈ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ట్రైన్ S6 బోగీ వద్ద బ్రెక్ జామ్ కావడంతో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. భయంతో ప్రయాణికులు ట్రైన్ దిగారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు. బ్రేక్ ప్యాడ్స్ జామ్ కావడంతో పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. స్టేషన్లో రెండు లైన్లలో ట్రెయిన్లు ఆగడంతో అరగంటసేపు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో వచ్చిన పొగలను అదుపు చేసిన అనంతరం ట్రైన్ న్యూఢిల్లీ వెళ్ళిపోయింది. -
ఇకపై వాళ్లు గార్డులు కాదు.. రైల్వే శాఖ కొత్త నిర్ణయం
ఇండియన్ రైల్వేస్ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. రైలు లేదా గూడ్సులో చివరి పెట్టెలో తెల్లని డ్రెస్‌లో ఉంటూ ఎరుపు, పచ్చా జెండాలు ఊపుతూ కనిపించే గార్డు పోస్టుల్లో మార్పులు చేసింది. ఇకపై వారిని గార్డుల స్థానంలో ట్రైన్ మేనేజర్లుగా డిజిగ్నేషన్ మారుస్తూ రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 13న రైల్వే బోర్డు అన్ని జోన్లకి సర్క్యులర్ జారీ చేసింది. రైల్వేబోర్డు తాజాగా చేసిన మార్పులతో ఇకపై నుంచి అసిస్టెంట్ గార్డ్ని అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డుని గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ గూడ్సు గార్డుని సీనియర్ గూడర్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ ప్యాసింజర్ గార్డుని సీనియన్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డుని మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా హోదాలు మార్చింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత మార్పులు కేవలం హోదా వరకే అని విధులు, జీతం, ప్రమోషన్లలో ఎటువంటి మార్పులు లేవని రైల్వేబోర్డు స్పష్టం చేసింది. చదవండి: ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్.. -
వారం రోజుల పాటు.. ఈ టైంలో రైల్వే రిజర్వేషన్లు బంద్! కారణమిదే
Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి. స్పెషల్ 2020 మార్చిల లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ. సాఫ్ట్వేర్ అప్డేట్ టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు. The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs. During this period, no PRS Services will be available. Read: https://t.co/8MPZw1cGXx — PIB India (@PIB_India) November 14, 2021 చదవండి: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో ‘ కొవిడ్ స్పెషల్’ రైళ్లు, టికెట్ ధరలు సైతం తగ్గింపు! -
ఇకపై అన్నీ ఆధునిక బోగీలే
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బోగీలు క్రమేణా కనుమరుగు కానున్నాయి. ప్రయాణికుల భద్రత, వేగం పెంపు, నిర్వహణ ఖర్చులో పొదుపు తదితరాల దృష్ట్యా ఆధునిక లింక్ హాఫ్‌మెన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలు వాటి స్థానాన్ని ఆక్రమించుకోనున్నాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ బోగీలు రెండు దశాబ్దాల క్రితం నీలిరంగులోకి మారాయి. అయితే ప్రస్తుతం వస్తున్న ఎల్‌హెచ్‌బీ బోగీలు నారింజ రంగు ప్రధానంగా ఉంటున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికే దాదాపు 18 వేల వరకు ఇలాంటి ఆధునిక కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పాత బోగీలన్నీ మార్చి వీలైనంత తొందరలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని కూడా భారీగా పెంచింది. ఐసీఎఫ్లు పూర్తిగా పక్కకు.. భారతీయ రైల్వే ఇంతకాలం సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లను వినియోగిస్తూ వస్తోంది. తమిళనాడులోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వీటిని ఉత్పత్తి చేస్తున్నందున ఐసీఎఫ్ బోగీల పేరిటే కొనసాగుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్‌తో చాలా మందంగా ఉండే ఈ కోచ్‌లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ప్రత్యామ్నాయం లేక దశాబ్దాలుగా వాటినే వాడుతూ వస్తోంది. అయితే కొన్నేళ్ల కిందట జర్మనీ పరిజ్ఞానంతో కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి రావటంతో వాటివైపు మొగ్గుచూపింది. ఈ పరిజ్ఞానంతో కొత్త కోచ్‌ల తయారీకి పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీని కేటాయించింది. రైలు ప్రమాదాల సమయంలో భారీ ప్రాణనష్టం సంభవించకుండా తప్పించాలంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటు అవశ్యమని నిపుణులు రైల్వేకు సిఫారసు చేయటంతో ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రెండేళ్ల కిందట నిలిపేశారు. కానీ వినియోగంలో ఉన్న ఆ కోచ్‌లు నాణ్యతతో ఉండటంతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా.. అవి మన్నికగా ఉన్నా సరే పక్కన పెట్టేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచింది. తయారైనవి తయారైనట్టుగా వినియోగంలోకి తెచ్చి సంప్రదాయ కోచ్‌లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. దీంతో మరి కొన్నేళ్లలోనే ఐసీఎఫ్ బోగీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రయాణికుల భద్రతే ప్రధానం బోగీల మార్పు వెనక భద్రతే ప్రధాన కారణంగా కినిపిస్తోంది. ఇప్పటివరకు ఐసీఎఫ్ బోగీలలో డ్యూయల్ బఫర్ హుక్ కప్లర్స్‌ను వినియోగిస్తున్నారు. బోగీకి బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. దీంతోనే సమస్య ఏర్పడుతోంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిమీదికొకటి ఎక్కుతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం ఈ కప్లింగ్ వల్లనే సంభవిస్తున్నాయని గుర్తించారు. ఎల్‌హెచ్‌బీ బోగీలకు సెంటర్ బఫర్ కప్లర్లుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిమీదకు ఒకటి ఎక్కవు. బరువు తక్కువ .. వేగం ఎక్కువ ఐసీఎఫ్ బోగీలు గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లేలా రూపొందించారు. కానీ వాటికి అనుమతించిన గరిష్ట వేగం 120 కి.మీ. మాత్రమే. కాగా 110 కి.మీ. వరకు మాత్రమే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోవటం, పెద్ద శబ్దాన్ని సృష్టించటం ఇబ్బందిగా మారింది. ఇక ఎల్‌హెచ్‌బీ బోగీలు 200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రూపొందుతున్నాయి. అయితే వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటంతో ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నాయి. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉండటంతో గరిష్ట వేగానికి అనుమతించినా ఇబ్బంది ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. కుదుపులకు తావులేని సస్పెన్షన్ వ్యవస్థ ఐసీఎఫ్ బోగీలకు సంప్రదాయ స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించిన సమయంలో బోగీలు పైకి కిందకు ఊగకుండా కొంతమేర అడ్డుకోగలుగుతాయి, కానీ ఊయల లాగా పక్కకు ఊగకుండా నిలువరించలేకపోతున్నాయి. ఇది ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా ఉంటోంది. ఒక్కోసారి పైనుంచి బ్యాగులు కిందపడేంతగా బోగీలు ఊగుతున్నాయి. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో ఎయిర్ కుషన్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటోంది. దీనివల్ల వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండటం లేదు. మరోవైపు సంప్రదాయ బోగీల్లో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేకు వేశాక చాలా ముందుకు వెళ్లి ఆగుతుంది. ఎల్‌హెచ్‌బీ బోగీలకు డిస్క్ బ్రేకు విధానం ఉంటుంది. కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు. ఖరీదు ఎక్కువే అయినా.. ఐసీఎఫ్ కోచ్‌ల తయారీ ఖర్చు తక్కువ. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ.కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ.85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అదే మైల్డ్ స్టీల్‌తో రూపొందే ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లు రూ. రెండున్నర కోట్లు, స్లీపర్ అయితే రూ.కోటిన్నర వరకు ఖర్చు అవుతోంది. తయారీ ఖరీదే అయినా నిర్వహణ వ్యయం మాత్రం తక్కువగా ఉంటుంది. విడిభాగాల అవసరం కూడా చాలా తక్కువ. అయితే మన్నిక విషయంలో మాత్రం ఎల్‌హెచ్‌బీలే ముందుండటం గమనార్హం. ఇక సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లో 64 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. దీనికంటే దాదాపు 2 మీటర్ల పొడవు ఎక్కువుండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు. -
ఎన్నికల హామీలు ఏమయ్యాయి?
ముస్తాబాద్/సిరిసిల్ల: గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్ర గనులు, రైల్వే శాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్‌పాటిల్ ధన్వే డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎక్కడ అని ప్రశ్నించారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు కేంద్రమంత్రి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ఇప్పటివరకు కేంద్రమిచ్చిన నిధులకు లెక్కలెందుకు చూపడంలేదని నిలదీశా రు. కాగా,వడ్లు కొనేదిలేదని, దొడ్డు వడ్లు వేయొ ద్దని సీఎం కేసీఆర్ రైతులను బెదిరిస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగం గా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శుక్రవా రం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. -
మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ఇలాకాకు గూడ్స్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో గజ్వేల్‌కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం శరత్ చంద్రాయన్ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్స్ట్రక్షన్) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్
మీరు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు చాలా ఓల్డ్ డైలాగ్ కానీ మనం ఎక్కిన రైలు సరైన సమయానికి చేరుకోవడమన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటా. సరేలే అని సర్థుకుపోతాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు. అంతులేని ఆలస్యం కశ్మీర్‌కి చెందిన సంజయ్ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ ఫ్లైట్‌ని అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకి జమ్ము ఏయిర్పోర్టు చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు జమ్ము రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్ తన ఫ్లైట్‌ని మిస్ అయ్యాడు. దీంతో ప్రత్యేకంగా కారులో ప్రయాణించి శ్రీనగర్ చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్లో బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మా బాధ్యత కాదు రైల్వే శాఖ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బటి వాదిస్తూ ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26, పార్ట్ 1, వాల్యూమ్ 1 ప్రకారం రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. సమయానికి వెల కట్టలేం రైల్వే తరఫున సోలిసిటర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది, రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. జవాబుదారి తనం ఉండాలని సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది. పరిహారం చెల్లించండి నిర్దేశిత సమయానికి రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. చదవండి: ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? -
బెజవాడలో గోల్డ్ మాఫియా!
సాక్షి,విజయవాడ : మన దేశంలో బంగారం కొనుగోళ్లు అధికం. పండుగలు, శుభకార్యాల వేళల్లో పసిడి అంగళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ మార్గంలో బంగారు విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పోలీసుల అదుపులో ముఠా.. విజయవాడలో కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురు వ్యక్తులను విచారణ నిమిత్తం శనివారం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్, విజలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం. ►2018 నుంచి నగరంలో ఈ ముఠా బంగారాన్ని అనధికారికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ► విజయవాడ నగరానికి చెందిన వెంకటేశ్వరరావు, పీఎస్ నాగమణిలు ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని, రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు పైనా ఆరోపణలుండటంతో ముగ్గురినీ విచారిస్తున్నట్లు సమాచారం. ► 100 గ్రాముల బంగారం బిస్కెట్లను వాయు, జల మార్గాల ద్వారా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల ఖరీదు చేసే బిస్కెట్‌ను వీరు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు. ► ఈ నేపథ్యంలో వీరి వ్యాపారం జోరందుకోవడంతో పలువురు బంగారం కోసం వీరికి నగదు చెల్లించారు. నగదు చెల్లించిన 20 నుంచి 30 రోజుల వ్యవధిలో వీరు బిస్కెట్లను ఇస్తారని సమాచారం. ఎలా బయటకొచ్చిందంటే.. అయితే నాలుగు నెలల క్రితం నగదు తీసుకుని ఇప్పటి వరకు బిస్కెట్లు ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం నాగమణితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదాన్ని కిడ్నాప్‌గా మార్చుకుని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఇద్దరు వ్యక్తులను పిలిచి విచారించడంతో బంగారం స్మగ్లింగ్ అంశం తెరమీదకొచ్చింది. సౌదీ టు విజయవాడ వయా సింగపూర్.. బంగారం ఉత్పత్తి కేంద్రమైన సౌదీలోని ఖతర్ నుంచే స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్‌కు, అక్కడ నుంచి విజయవాడకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. 2018లోనే బీజం..! ► అయితే 2018లో సౌదీలోని ఖతార్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌తోనే ఈ స్మగ్లింగ్‌కు పునాది పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ►రైల్వే స్క్వాడ్ విధులతో పాటు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న ఆకుల వెంకట రాఘవేంద్రరావు ఆ గేమ్స్‌కు ఇండియన్ టీమ్ మేనేజర్‌గా వెళ్లారు. ►అప్పట్లోనే అక్కడున్న కొందరు స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని బంగారం బిస్కెట్ల అక్ర మ వ్యాపారాన్ని నగరంలో విస్తరించారని నగరంలోని పలు క్రీడా వర్గాలు చెప్పుకుంటున్నాయి. ► రాఘవేంద్రరావు గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వైనం క్రీడా సంఘాల నాయకుల మధ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైల్వే, దుర్గగుడి ఉద్యోగులే బాధితులు.. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ల(టీసీలు)తో పాటు, బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులే ఎక్కువమంది బంగారం బిస్కెట్ల కోసం ముఠా సభ్యులకు సొమ్ము చెల్లించినట్టు సమాచారం. సుమారు 20 మంది రైల్వే టీసీలు రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు ద్వారా ముఠాకు సుమారు రూ.6 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. నగదు చెల్లించిన వారిలో ఇద్దరు టీసీలపై ముఠా సభ్యురాలు నాగమణి పోలీసులకు తనను కిడ్నాప్ చేశారని ఇటీవల ఫిర్యాదు చేసింది. దుర్గగుడిలో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులు ముఠా సభ్యులకు సుమారు రూ.1.5 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారు. ముఠా సభ్యులకు చెల్లించిన నగదు బ్లాక్ మనీ కావడంతో లేనిపోని చిక్కులొస్తాయనే భావనతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని సమాచారం. అయితే ఈ నెల 4న ఈ వ్యవహారంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు బాధితులు ఫోన్ చేసి వివరాలు చెబుతున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
ఏసీ ఎకానమీ కోచ్.. ఛార్జీ తక్కువ సౌకర్యాలు ఎక్కువ
సరికొత్త బిజినెస్ పాఠాలతో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేను పరుగులు పెట్టించారు. మట్టిపాత్రల్లో టీలు, ఎక్స్ట్రా బెర్తులతో పాటు పేదల కోసం ప్రత్యేకంగా గరీబ్‌రథ్ పేరుతో ఏసీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సామాన్యులకు ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేవడం కోసం ఏసీ ఎకానమీ కోచ్‌లను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏసీ ఎకానమీ కోచ్‌లు ప్రస్తుతం రైల్వేలో ఏసీ ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలు ఉన్నాయి. వీటితో పాటు గరీబ్‌రథ్ ఏసీ రైళ్లు, కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ చెయిర్‌కార్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ చెయిర్ కార్, థర్డ్ క్లాస్ ఏసీల టిక్కెట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికంటే తక్కువ ధరకే ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. దీనికి ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పేరు పెట్టింది. ధర ఎంతంటే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ థర్డ్ క్లాస్ టిక్కెట్ ఛార్జీల కంటే 8 శాతం తక్కువగా వీటికి ఛార్జీలుగా నిర్ణయించారు. దీని ప్రకారం స్లీపర్ క్లాస్ టిక్కెట్ బేస్ ఫేర్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఏసీ ప్రయాణం చేయడం వీలవుతుంది. ఈ కోచ్‌లలో కనీస ఛార్జీ రూ. 440గా నిర్ణయించారు. తొలి ట్రైన్ ఇక్కడే అందులో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ మొదటి కోచ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2021 సెప్టెంబరు 6న ప్రయాగ్‌రాజ్ నుంచి జైపూర్‌కి వెళ్లే రైలులో ఈ కోచ్‌ను తొలిసారిగా ప్రవేశ పెడుతున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. సౌకర్యాలు సూపర్ వివిధ కోచ్ ఫ్యాక్టరీలో ఇప్పటికే 50కి పైగా ఏసీ ఎకానమీ కోచ్‌లు తయారై రెడీగా ఉన్నాయి,. వీటిని వివిధ జోన్లకు కేటాయించారు. వీటిని లింకే హఫ్‌మన్ బుష్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంటీరియర్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ కోచ్‌ల కంటే ఎకానమీ కోచ్‌లలో సౌకర్యాలు బాగున్నాయి, మన దగ్గర ఎప్పుడు ఏసీ ఎకామని కోచ్‌లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశపెడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. తొలి విడత కేటాయింపులో దక్షిణ మధ్య రైల్వేకు ఈ కోచ్‌లు కేటాయిస్తే అతి త్వరలోనే ఈ సౌకర్యం తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ ఏసీ ఎకానమీ కోచ్‌లను రెండు జోన్ల మధ్య తిరిగే రైళ్లలో ఎక్కువగా ప్రవేశ పెడుతున్నారు. చదవండి : ‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయంకర నిజాలు -
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
ఆన్లైన్లో రైల్వే స్మార్ట్ కార్డుల రీచార్జ్ సదుపాయం
సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌కార్డు ద్వారా రైల్వే ప్రయాణం చేసేవారు ఇక నుంచి ఆన్లైన్లోనే రీచార్జ్ చేసుకోవచ్చు. వెబ్‌పోర్టల్‌లో యూటీఎస్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. డిజిటలైజేషన్లో భాగంగా రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నించోవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను (ఏటీవీఎం) అందుబాటులోకి తెచ్చా రు. తాజాగా స్మార్ట్‌కార్డు రీచార్జ్ సదుపాయం కల్పించారు. సాధారణంగా ప్రయాణికులు తమ స్మార్ట్ కా ర్డులను రైల్వే బుకింగ్ కౌంటర్లలో మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి రావడం వల్ల ప్రతిసారి రైల్వే బుకింగ్ కౌంటర్లకు రావలసి వస్తోంది. తాజాగా ఆన్లైన్ రీచార్జ్ సదుపాయం కల్పించడం వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లయింది. ప్రస్తుత కోవిడ్ సమయంలో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది. సేవలు ఇలా.... ►ప్రయాణికులు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లో మొదట నమోదు చేసుకోవాలి. ►మెనూలో ‘స్మార్ట్ కార్డు రీచార్జీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ►డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లించవచ్చు. ►అనంతరం ప్రయాణికులు ఏటీవీఎమ్ రీడర్ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘రీచార్జి స్మార్ట్ కార్డు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఏటీవీఎమ్‌లో ఆన్లైన్ రీచార్జీ వివరాలు వస్తాయి. ఈ మేరకు స్మార్టు కార్డులో రీచార్జ్ అవుతుంది. ►ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెట్లను, ప్లాట్ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం ఉండదు. ►మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామ రుజువు, ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. ►ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీచార్జి చేసుకోవాలి. -
నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు రూ.1,144.35 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రధానమైన నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,144.35 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.2,500 కోట్లు కాగా, ఈ ఏడాది కేటాయింపులతో ప్రాజెక్టు పూర్తి కానుంది. దేశ వ్యాప్తంగా రైల్వే 56 ప్రాజెక్టులను ప్రకటించగా.. అందులో ఏపీకి సంబంధించి విజయవాడ–భీమవరం, గుడివాడ–మచిలీపట్నం, నరసాపురం–నిడదవోలు బ్రాంచ్ లైన్ల మధ్య గల 221 కిలోమీటర్ల రైలు మార్గాన్ని చేర్చింది. ఈ ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్లో రూ.1,200 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఈ మార్గంలో 106 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయింది. బడ్జెట్ కేటాయింపుల్ని రైల్వే బోర్డు బుధవారం పింక్ బుక్‌లో చేర్చింది. వీటికి కేటాయింపుల్లేవ్ భద్రాచలం–కొవ్వూరు,గూడూరు–దుగరాజపట్నం, కంభం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, అమరావతి న్యూ రైల్వే లైన్లకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, యార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్‌కు రూ.40 లక్షలే మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై ఇంకా చిన్నచూపే కొనసాగుతోంది. జోన్ నిర్మాణానికి రూ.పెద్ద మొత్తంలో నిధులు అవసరమని రైల్వే బోర్డు ప్రతిపాదించినప్పటికీ బడ్జెట్లో మాత్రం రూ.లక్షల్లో మాత్రమే కేటాయింపులు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ బడ్జెట్లో కచ్చితంగా రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు వస్తుందని.. పూర్తిస్థాయి నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రస్తావన తీసుకు రాలేదు. కేటాయింపుల పరంగా చూస్తే ఈ జోన్‌కు కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. దక్షిణ కోస్తా జోన్ నిర్మాణానికి రూ.169 కోట్లు అవసరమని బోర్డు నియమించిన ఓఎస్డీ తన డీపీఆర్‌లో పేర్కొన్నారు. కానీ, గత బడ్జెట్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే విడుదల చేసిన కేంద్రం.. ఈ బడ్జెట్లో మరింత కోత విధించి రూ.40 లక్షలు మాత్రమే కేటాయించింది. 2022 మార్చిలోపు 56 రైల్వే ప్రాజెక్టులు పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను పూర్తిచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ దిశగా రూ.2,15,058 కోట్ల మేర మూల ధన వ్యయాన్ని వెచ్చించనుంది. ఇందుకోసం సాధారణ బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,07,100 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయడంతో పాటు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులపై ఏకకాలంలో పనిచేయడంపై దృష్టి పెట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరణ, టెర్మినల్ వసతులు, రైళ్ల వేగం పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచడం, ప్రయాణికుల సౌకర్యాలు, ఆర్వోబీ, ఆర్యూబీల ద్వారా భద్రత పనులు చేపట్టడంపై 2021–22 వార్షిక ప్రణాళిక ప్రధానంగా దృష్టిపెట్టనుంది. అలాగే, కొత్త రైల్వే లైన్లకు రూ.40,932 కోట్లు, డబ్లింగ్‌కు రూ.26,116 కోట్లు, ట్రాఫిక్ సౌకర్యాలకు రూ 5,263 కోట్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల కోసం రూ.7,122 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. కాగా.. ట్రాఫిక్ సౌకర్యాల కేటాయింపులు 156 శాతం పెరిగాయని, కొత్త రైల్వే లైన్ల కేటాయింపులు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 52 శాతం పెరిగాయని రైల్వేశాఖ పేర్కొంది. ప్రజల సౌలభ్యం కోసం 1200కి పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జ్ (ఆర్యూబీ)లను, సబ్‌వేలను ఈ ఏడాది పూర్తిచేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించింది. -
పట్టాలెక్కనున్న 696 సబర్భన్ రైళ్లు
కోల్‌కతా: బెంగాల్లో నవంబర్ 11 నుంచి 696 సబర్భన్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో సబర్భన్ రైళ్ల సర్వీసులును కేంద్రం రద్దు చేసింది. సబర్భన్ రైళ్లలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరి చేస్తున్నట్టు, బెంగాల్ ప్రజల ప్రయాణానికి ఈ నిర్ణయం ఉపయోగపడనుందని, క్షేమకరమైనా, సులభతరమైనా ప్రయాణానికి కృషి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో తెలిపారు. (ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం) -
పండగ ప్రత్యేక రైళ్ల వేళలివే..
అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్లు.. లింగంపల్లి–కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: లింగంపల్లి స్టేషన్లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. నగరం వైపు వచ్చే రైలు కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. లింగంపల్లి–తిరుపతి లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు.. ప్రతిరోజూ నడిచేవి తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర) తిరుపతిలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కి అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి తిరుపతి చేరుకుంటుంది. రూట్:పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్‌ల మీదుగా.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ.. లింగంపల్లి–నర్సాపూర్ లింగంపల్లిలో రాత్రి 9.05కు బయలుదేరి మరుసటి రోజు 7.45కు నర్సాపూర్ చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 6.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, నల్లగొండ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా ప్రయాణిస్తాయి. -
నీట్ ప్రత్యేక రైళ్లు, షాక్ తిన్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పరీక్ష కోసం వేసిన ప్రత్యేక రైలును చూసి డెహ్రాడూన్ అధికారులు ఖంగుతిన్నారు. ఆదివారం నీట్ పరీక్ష జరగగా కోవిడ్ పరిస్థితుల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా కేంద్రం వారి కోసం ప్రత్యేకరైళ్లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులకు పరీక్షలు చేయడానికి వచ్చిన రైల్వే సిబ్బందికి మొండి చేయ్యె ఎదురయ్యింది. డెహ్రాడూన్‌లో మొత్తం 18 పరీక్ష సెంటర్లు, రూర్కీలో 12 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చాలా తక్కువ మంది ఆ రైలులో ప్రయాణించారు. కేవలం 21 మంది మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రయాణించారు. దీని గురించి డెహ్రాడూన్ రైల్వే అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక రైలును ఎక్కువ మంది విద్యార్థులు వినియోగించుకోలేదు. కోవిడ్ కారణంగా జాగ్రత్తగా ఉండటం కోసం వారు తమ సొంత వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. పరీక్షల కోసం ప్రత్యేక రైలును నడుపుతున్న రైల్వే శాఖ వీటి కోసం చాలా డబ్బును వెచ్చించింది. అయితే కేవలం రూ. 1040 మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రభుత్వానికి లభించాయి. చదవండి: నీట్‌పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర -
12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నారు. కోవిడ్–19 కారణంగా ఇప్పటి వరకు 14 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 రైళ్లకు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ► డివిజన్ పరిధిలోని ఒక్కో జిల్లాలో ఒకొక్క స్టేషన్లో మాత్రమే రైలు ఆగుతుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. ► షెడ్యూల్ రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలోలా ఈ 24ను ప్రత్యేక రైళ్లగానే నడుపుతారు. ముందుగానే రిజర్వేషన్లు ఇస్తారు. ► రైలులో ఎక్కేందుకు గంట ముందుగానే రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాలనే నిబంధన పెట్టారు. 12వ తేదీ నుంచి నడిచే 24 రైళ్లు ఇవే..... ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– చాప్రా (02669), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ(02615), హౌరా–సికింద్రాబాద్ (02703), విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805), హౌరా–యశ్వంత్‌పూర్ (02245), భువనేశ్వర్–ముంబై(01020), తిరుచ్చిరాపాలి –హౌరా (02664), దానాపూర్– కెఎస్ఆర్ బెంగళూరు (02296), చాప్రా–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02670), గుంటూరు– సికింద్రాబాద్ (07201), హౌరా–తిరుచ్చిరాపాలి (02663), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ (02433), బెంగళూరు కంటోన్మెంట్–గౌహతి (02509), ముంబై–భువనేశ్వర్(01019), న్యూఢిల్లీ–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02434), సికింద్రాబాద్–గుంటూరు (07202), గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్ (02510), సికింద్రాబాద్–హౌరా (02704), కెఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ (02295), యశ్వంత్‌పూర్–హౌరా (02246), న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806), హైదరాబాద్– విశాఖపట్టణం (02728), న్యూఢిల్లీ –ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02616), విశాఖపట్నం– హైదరాబాద్ (02727). -
చుక్‌బుక్ దందా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులను దళారులు దోచుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థతుల్లో సొంతూళ్లకు వెళ్లాల్సినవారిని, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతున్నప్పటికీ డిమాండ్దృష్ట్యా చాలా మందికి అవకాశం లభించడం లేదు. దీంతో చాలామంది కార్మికులు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లపై ఆధారపడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లపై అవగాహన ఉండటంలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్న అమాయక, నిరక్షరాస్యులైన వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని అక్రమార్జన పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రామిక్ రైళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యాప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు నిర్ధారిత టికెట్లు ఇస్తామంటూ కార్మికుల జేబులు లూటీ చేస్తున్నారు. మోసాలు ఇలా.. దానాపూర్‌కు వెళ్లే నలుగురు ప్రయాణికుల నుంచి ఇటీవల ఒక బ్రోకర్ రూ.8000 వరకు వసూలు చేశాడు. ట్రైన్ వచ్చే తేదీనాటికి కూడా తమకు టికెట్లు అందకపోవడంతో మోసపోయినట్లు వారు గుర్తించారు. ‘ఇద్దరు ప్రయాణికులను పంపించేందుకు ఓ మధ్యవర్తి రూ.2500 తీసుకున్నాడని, మరుసటి రోజు ట్రైన్ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్లిపోయాడని సుభాష్ అనే మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వలస కూలీలు ఈ తరహా మోసాలకు గురవుతుండగా, ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూసే సాధారణ ప్రయాణికులు కూడా ఏజెంట్ల చేతికి చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేని నిస్సహాయతను ఏజెంట్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో నగరంలో చిక్కుకుపోయినవారు ప్రస్తుతం ఏదో విధంగా సొంత గ్రామాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దళారులు, ఏజెంట్లు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల తిష్టవేసి ఇలాంటి ప్రయాణికులను గుర్తించి ఆన్లైన్ బుకింగ్‌ల పేరిట అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అన్నింటికీ ఆన్లైన్ బుకింగ్‌లే.. ప్రయాణికుల అవసరాల కోసం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రతిరోజూ 9 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్– బెంగళూర్ డైలీ, సికింద్రాబాద్– న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికిపైగా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లారు. అయినప్పటికీ వివిధ ప్రాంతాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. సాధారణ ప్రయాణికులతో పాటు వలస కూలీలు కూడా ప్రత్యేక రైళ్లలో బయలుదేరుతున్నారు. దీంతో సికింద్రాబాద్– దానాపూర్, సికింద్రాబాద్– హౌరా వంటి రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. ప్రతి రోజు సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. మరోవైపు సాధారణ బోగీల్లో ప్రయాణానికి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉండటంతో చాలా మంది ప్రయాణికులు ఆధార్ కార్డులతో ఏజెంట్ల వద్దకు తరలి వస్తున్నారు. ప్రయాణికుల తప్పనిసరి అవసరం, అప్పటికప్పుడు బయలుదేరాల్సి రావడంతో ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రయాణికుల వివరాల నమోదు కోసం ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్‌లు ఏజెంట్లు, దళారులకు వరంగా మారాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ పరిసరాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులు ఏ ఒక్కరికీ అధిక చార్జీలు చెల్లించరాదని, దళారులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు. -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
ముజఫర్‌పూర్ ఘటనపై కేసు నమోదు
న్యూఢిల్లీ: నిన్నంతా సోషల్ మీడియాతో పాటు పలు న్యూస్ చానళ్లు, వెబ్సైట్లలో ఓ వార్త బాగా ప్రచారం అయ్యింది. సరైన ఆహారం, నీరు లేక ఓ మహిళా వలస కూలీ మృతి చెందింది. విషయం తెలియని ఆ అభాగ్యురాలి కుమారుడు తల్లి చీర పట్టుకుని ఆమెను లేపేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ నేపథ్యంలో దారుణానికి కారకులైన రైల్వే అధికారులు, బిహార్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ లాయర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. బదర్ మహ్మద్ అనే లాయర్ ‘రాజ్యాంగంలోని 21వ ప్రకరణ దేశంలోని ప్రతి ఒక్కరికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత గౌరవానికి హామీ ఇస్తుంది. అలానే ఆదేశ సూత్రాలు ప్రతి రాష్ట్రం తన పౌరులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలుపుతున్నాయి. అయితే రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోలేదు. వలస కూలీలకు అవసరమైన ఆహారం, ఆరోగ్య సేవలు కల్పించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సదరు మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో మే 25 నాటి ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ సీసీటీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకుని ఈ దారుణానికి కారకులైన రైల్వే శాఖ, బిహార్ ప్రభుత్వాల మీద తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాక మృతురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందేలా చూడాలి’ అంటూ మానవ హక్కుల కమిషన్‌ను కోరాడుబదర్ మహ్మద్.(వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది) -
రైల్వే కౌంటర్లలో టికెట్ల బుకింగ్‌పై స్పష్టత
న్యూఢిల్లీ : త్వరలోనే మరిన్ని రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నేడు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పీయూష్ గోయల్ పలు అంశాలు వెల్లడించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి నిబంధనలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కొన్ని రాష్ట్రాలు తమకు సహకరించడం లేదని తెలిపారు. దాదాపు 40 లక్షల మంది వలసకూలీలు పశ్చిమ బెంగాల్‌కు చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 27 ప్రత్యేక రైళ్లు మాత్రమే ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టాయని చెప్పారు. కాగా, జూన్ 1 నుంచి 200 రైళ్లు అందుబాటులోకి రానున్నట్టు బుధవారం ప్రకటన చేసిన రైల్వే శాఖ.. నేటి నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించింది. అయితే ఈ బుకింగ్‌కు విశేషమైన స్పందన వచ్చింది. కేవలం గంటల వ్యవధిలోనే లక్షల టికెట్లు అమ్ముడయిపోయాయి.(చదవండి : నేటి నుంచే రైల్వే బుకింగ్స్) -
కొత్త రైళ్లతో రైల్వే షేర్లు స్పీడ్
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్‌ను ఈ నెలాఖరు వరకూ నాలుగోసారి పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడిలించింది. దీనిలో భాగంగా రైల్వే శాఖ శ్రామికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లను రెట్టింపునకు పెంచుతున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ వారం నుంచీ 400 శ్రామిక్ స్పెషల్స్ నడవనున్నాయి. కాగా.. మరోవైపు సాధారణ ప్రయాణికుల కోసం మరో 200 నాన్ఏసీ రైళ్లను సైతం జూన్ 1 నుంచీ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయితే వీటికి రిజర్వేషన్ సౌకర్యం ఆన్లైన్ ద్వారా మాత్రమే కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యూఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ ఈ 11 నుంచీ రైల్వే శాఖ 30 ఏసీ ట్రయిన్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండు నెలల లాక్‌డవున్ తదుపరి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలు తదితరాలు ఊపందుకోనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. లాభాల్లో.. ఎన్ఎస్ఈలో రైల్ రంగ కౌంటర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు అధికం కావడంతో ఐఆర్సీటీసీ లిమిటెడ్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 63.5 పెరిగి రూ. 1333ను అధిగమించింది. ఈ బాటలో రైల్ వికాస్ నిగమ్ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. రూ. 17.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. ఇక టెక్స్మాకో రైల్ 2.6 శాతం ఎగసి రూ. 21.7 వద్ద ట్రేడవుతోంది. -
పడకేసిన సంయుక్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి సంయుక్తంగా చేపట్టాలన్న నిర్ణయం వికటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మధ్య సమన్వయం కొరవడి పనులు పడకేస్తున్నాయి. తీవ్ర విభేదాలు నెలకొని మిగతా ప్రాజెక్టులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టుల అంచనా విలువ పెరిగి ఖజానాపై భారాన్ని పెంచుతోంది. కనీసం రెండు వైపుల సమన్వయం కోసం సమావేశాలు కూడా ఏర్పాటు కావట్లేదు. సమస్యకు కారణం మీరంటే మీరని లేఖల యుద్ధం నడుస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వట్లేదంటూ రైల్వే బోర్డుకు జీఎం లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారం.. ఆయా ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరు చేయటంలో పడుతుందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్త సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఇటీవల రైల్వే జీఎం గజానన్ మాల్యా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. కానీ తర్వాత ఏ భేటీ జరగలేదు. కాగా, రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేపట్టలేకపోతున్నామని రైల్వే జీఎం రైల్వే బోర్డు చైర్మన్ దృష్టికి తెచి్చన నేపథ్యంలో.. బడ్జెట్ కేటాయింపులు సంతృప్తిగా ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయగిరికి వెళ్లేనా..? ఘట్కేసర్–యాదాద్రి (రాయగిరి) ఎంఎంటీఎస్ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు పేరు వినగానే హైదరాబాద్ శివారు వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ అది ప్రకటనకే పరిమితమైంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ సహకారంతో రైల్వే చేపట్టింది. మూడో వంతు నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ సమన్వయం పూర్తిగా కొరవడింది. దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో ఇప్పటి వరకు రైల్వే ఆ పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్ సేవలు పరిమితంగా మారిపోయాయి. సగటున కేవలం 1.6 లక్షల మంది మాత్రమే నిత్యం ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కానీ ఆ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని సేవలను విస్తరించేందుకు ఏడేళ్ల క్రితం రెండో దశకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ముందుకు సాగట్లేదు. ఖర్చులో మూడో వంతు నిధులు మాత్రమే భరించాల్సిన రైల్వే.. అంతకంటే ఎక్కువే ఖర్చు చేసింది. కలల ప్రాజెక్టు పరిస్థితీ అంతే.. కరీంనగర్‌ను హైదరాబాద్‌తో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు విషయంలోనూ రైల్వే–రాష్ట్రప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఈ ప్రాజెక్టు కోసం యావత్తు తెలంగాణ రెండు దశాబాద్దాలుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు పట్టాలెక్కిన దీన్ని పరుగుపెట్టించటంలో మాత్రం రైల్వే విఫలమవుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులు పడకేశాయి. మనోహరాబాద్–గజ్వేల్ మధ్య 32 కి.మీ. మేర మాత్రం దాదాపు ఏడాది ఆలస్యంగా పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగతా చోట్ల భూసేకరణ వద్దే నిలిచిపోయాయి. దీనికి రాష్ట్రప్రభుత్వం మూడో వంతు నిధులివ్వాలి. భూసేకరణ ఖర్చు భరించాలి. కానీ నిధులు ఇవ్వక భారం రైల్వేపై పడుతోందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు రవాణాకు కీలకం.. బొగ్గు రవాణాకు అత్యంత కీలకం కానున్న భద్రాచలం–సత్తుపల్లి రైల్వే ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే సమస్య నెలకొంది. రూ.704 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే రెండేళ్లక్రితమే పచ్చజెండా ఊపింది. భూసేకరణ భారాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు ఖర్చును రాష్ట్రప్రభుత్వం పక్షాన సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. తమకు నిధులు అందలేదని చెబుతూ రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచబోతోంది. అసలు పనే మొదలు కాకుండా ఏకంగా రూ.200 కోట్ల మేర ఖర్చును పెంచుతూ కొత్త అంచనా వ్యయాన్ని ప్రకటించేందుకు రైల్వే సిద్ధమైంది. గత బడ్జెట్లో రూ.405 కోట్లు భూసేకరణకు కేటాయించింది. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. రాష్ట్రప్రభుత్వ పక్షాన నిధులు రానందున ఈ బడ్జెట్‌పై దాని ప్రభావం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. చివరికొచ్చాక తప్పని జాప్యం.. కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టు మెదక్–అక్కన్నపేట రైలు మార్గం. దీనికి రైల్వే తన వంతు వాటా నిధులు విడుదల చేసి పనులను చివరి దశకు చేర్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా నిధులు ఇవ్వట్లేదని ఇప్పుడు కినుక వహించింది. గత బడ్జెట్లో రూ.10 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తే, తుది దశలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేందుకు మరింత జాప్యం తప్పదు. -
రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్ విలీనం సమయంలో సర్దార్ వల్లభాయి పటేల్ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు. -
బొగ్గే ముద్దు.. జనాలు వద్దు!
పెరిగిన అంచనా వ్యయం.. కలగానే మారుతున్న సత్తుపల్లివాసుల రైలు ప్రయాణం.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైల్వే లైను నిర్మాణంతో కేవలం బొగ్గు రవాణాకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణ పనుల్లో మూడు స్టేషన్ల రద్దు తీవ్ర చర్చనీయాంశమైంది. సంబంధిత రైల్వే శాఖ అధికారులు దీనిని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ సీతంపేట రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల నిలిపివేతతో ఆ నిర్ణయం స్పష్టమవుతోంది. రైల్వే శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు రవాణాతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న 56 కిలోమీటర్ల నిడివి గల రైలు మార్గం బొగ్గు రవాణాకే పరిమితం కానుంది. చుక్.. చుక్ రైలొస్తుంది.. అందరు పక్కకు జరగండి.. ఆగకుండా వెళ్తుంది అన్న చందంగా తయారైంది సత్తుపల్లివాసుల పరిస్థితి. సాక్షి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణం కోసం 2015–16లో రూ.740కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో రైలుమార్గం నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.618కోట్లు, రైల్వే శాఖ భూ సేకరణ కోసం రూ.85కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. అయితే 2018–19లో ప్రాజెక్టు ప్రారంభం కావడంతో ప్రస్తుత అంచనా విలువ రూ.952కోట్లకు చేరింది. ఇందులో రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ వాటా రూ.618కోట్ల నుంచి రూ.704కోట్లకు పెరిగింది. అలాగే భూ సేకరణకు రైల్వే శాఖ అదనపు నిధులు చెల్లించనుంది. అయితే సింగరేణి సంస్థ తాము కేవలం రైల్వే లైను నిర్మాణానికే నిధులు ఇస్తామని, గతంలో కేటాయించిన నిధుల కంటే పెంచి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అంటే పెరిగిన సింగరేణి సంస్థ వాటా అంచనా వ్యయం సుమారు రూ.86కోట్లు అదనంగా ఇచ్చేది లేదని చెప్పింది. చేసేది లేక రైల్వే శాఖ.. రైల్వే లైను మార్గంలో కొన్ని పనులను తగ్గించి.. అందుబాటులో ఉన్న నిధులతోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం రైల్వే లైను మార్గంలో ఉన్న సుజాతనగర్ మండలం సీతంపేట, పెనుబల్లి మండలంలోని పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్డు(లంకపల్లి) రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులను నిలిపివేసింది. ఆ శాఖకు అక్కడ స్టేషన్ల నిర్మాణ వ్యయం తగ్గనుంది. కోయగూడెం, చండ్రుగొండ, భవన్నపాలెంలో మాత్రమే రైల్వే స్టేషన్లు నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. సీతంపేటలో సగం మేర నిర్మించిన రైల్వే స్టేషన్ పనులు నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్ స్టేషన్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే నిలిచిపోయిన మూడు రైల్వే స్టేషన్లు బొగ్గు రవాణాకు, ప్రజా రవాణాకు ప్రాముఖ్యత, అవసరం ఉన్నవే. ఆ స్టేషన్లే కీలకం.. భవిష్యత్‌లో సత్తుపల్లి రోడ్ నుంచి కొవ్వూరుకు 73 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం జరగాలంటే సత్తుపల్లి రోడ్(లంకపల్లి) స్టేషన్ ఏర్పాటే కీలకం. అలాగే పెనుబల్లి జంక్షన్ నుంచి విజయవాడ సమీపంలోని కొండపలి్లకి 80 కిలోమీటర్ల రైల్వే లైను విస్తరించాలంటే పెనుబల్లి జంక్షన్ అవసరం. సీతంపేటలో ఇప్పటికే సగం మేర చేపట్టిన స్టేషన్ నిర్మాణ పనులు మధ్యలో వదిలేస్తే నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. రైతులు, ప్రజా రవాణాకు కూడా రైల్వే లైను ఉపయోగపడుతుందనే తలంపుతో తమ భూములను భూ సేకరణలో కోల్పోయినప్పటికీ ప్రజా ప్రయోజనార్థం అంగీకరించారు. ప్రస్తుతం రైల్వే అధికారుల తీరుతో రైల్వే లైను కేవలం బొగ్గు రవాణాకే పరిమితం అవుతుందని, ప్రజా రవాణాకు ఉపయోగపడని.. సింగరేణి లాభార్జన కోసం ఉపయోగించే రైల్వే లైనుకు తమ భూములు ఎందుకివ్వాలంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. భూ సేకరణలో జాప్యం, అరకొర నిధుల కేటాయింపుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. వచ్చే డిసెంబర్ నాటికి.. ఇప్పటికే భూ సేకరణ 90 శాతం పూర్తయిందని, కోర్టు కేసులు, రైతులు నిరాకరించిన 10 శాతం భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు రైల్వే కట్ట నిర్మాణం 50 శాతం, బ్రిడ్జిల నిర్మాణం 50 శాతం, విద్యుద్దీకరణ పనులు 20 శాతం పూర్తయ్యాయి. వీటిలో భూ సేకరణకు రైల్వే శాఖ రూ.130కోట్లు, రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.150కోట్లు.. మొత్తం రూ.280కోట్లు రైల్వే నిర్మాణానికి ఖర్చు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. భూ సేకరణ సజావుగా పూర్తయి.. నిధులు సకాలంలో సమకూరితే డిసెంబర్ 2020 నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సింగరేణి సంస్థ లాభార్జనే ధ్యేయంగా కాకుండా.. బొగ్గు రవాణా వల్ల కాలుష్యం బారిన పడుతున్న రైల్వే మార్గంలోని గ్రామాల్లో మొదట్లో గుర్తించిన రైల్వే స్టేషన్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ప్రజలకు రవాణా సేవలు అందేలా చూడాలని సత్తుపల్లి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాగా.. దీనిపై సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.నరి్సంహారావును వివరణ కోరగా... బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించడం వరకే మా బాధ్యత. నిర్మాణం, పనుల వ్యవహారం అంతా రైల్వే శాఖ చూసుకుంటుంది. ఇంకా దీనిపై మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. -
ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు
న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మూడు రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. -
లీజు చుక్..చుక్..
సాక్షి,సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ప్రైవేట్ పరం కానున్నాయి. ఇప్పటికే ఈ జోన్ పరిధిలోని రైల్వేస్టేషన్లు, ప్రధాన మార్గాల్లో నడిచే రైళ్ల ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు, సికింద్రబాద్–విజయవాడ వంటి ప్రధాన మార్గాల్లో నడిచే పలు సర్వీసులను సైతం ప్రైవేట్ సంస్థల ద్వారా నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. అలాగే సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలను పూర్తిగా ప్రైవేటీకరించారు. తాజాగా రైల్వే స్థలాల లీజు బేరం తెరపైకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న స్థలాలను గుర్తించి లీజు ద్వారా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) కార్యాచరణను రూపొందించింది. ఈ స్థలాలను ప్రైవేట్ వ్యాపార సంస్థలకు కట్టబెట్టి అక్కడ షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల నిర్మాణ సంస్థలకు లీజు పద్ధతిలో అప్పగించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న భూములు, మార్కెట్ విలువ, అక్కడ ఏ రకమైన నిర్మాణాలు చేపడితే ప్రైవేట్ సంస్థలకు ఆదాయం సమకూరుతుంది.. అదే సమయంలో ఆయా భూముల లీజు ద్వారా రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే అంశాలపైన ఆర్ఎల్డీఏ అధ్యయనం చేపట్టింది. ఈ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా రైల్వేకు రూ.వందల కోట్ల ఆదాయం లభించగలదని ఆర్ఎల్డీఏ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మెట్టుగూడ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న 2.36 ఎకరాల రైల్వే మిలీనియం పార్కు స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ప్రైవేట్ వ్యాపార సంస్థలతో ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆసక్తిగల సంస్థల నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎల్డీఏ తెలిపింది. ఇతర భూములు కూడా.. మెట్టుగూడ తరహాలోనే మరిన్ని విలువైన భూములను సైతం లీజుకు ఇచ్చేందుకు ఆర్ఎల్డీఏ ప్రణాళికలను రూపొందించింది. మౌలాలీ ఫ్లైఓవర్‌కు ఆనుకొని ఉన్న 22 ఎకరాల భూమిలో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు డెవలపర్స్‌కు లీజుకు ఇవ్వనున్నారు. కమర్షియల్‌గా అభివృద్ధి చేసేందుకు అవకాశం లేని ఈ భూమిని నివాస ప్రాంతాలుగా మార్చడం ద్వారా ఆదాయం లభిస్తుందని అధికారులు యోచిస్తున్నారు. ఇక్కడ భూమి విలువ రూ.కోట్లలో ఉంటుంది. మార్కెట్ ధర ప్రకారం 22 ఎకరాల ధర సుమారు రూ.100 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. అంతటి విలువైన భూముల నుంచి ఆర్ఎల్డీఏ ఎంత వరకు ఆదాయాన్ని రాబట్టుకోగలదనేది ప్రశ్నార్థకమే. మరోవైపు లక్డీకాపూల్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌కు ఆనుకొని ఉన్న మరో రెండెకరాల స్థలాన్ని కూడా లీజు పద్ధతిలో కట్టబెట్టేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధంచేశారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల భూములపైనా ఆర్ఎల్డీఏ కసరత్తు చేస్తోంది. మెట్టుగూడ పైనే ఆశలు ఈ మూడు ప్రాంతాల్లోని స్థలాల్లోనూ మెట్టుగూడ రైల్ కళాభవన్‌కు ఎదురుగా, మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న 2.36 ఎకరాల భూమి లీజుపైనే ప్రస్తుతం ఆర్ఎల్డీఏ ఆశలు పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే ప్రీబిడ్ సమావేశం కూడా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి నాగోల్ మెట్రో రైల్ మార్గంలో ఉన్న మెట్టుగూడ నగరానికి తూర్పు వైపు అతిపెద్ద కమర్షియల్ హబ్‌గా అభివృద్ధి చెందగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్డీకాపూల్ కంటే ఇక్కడ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ నిర్మించి నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇవే అంశాలను ప్రీబిడ్ సమావేశంలోనూ ఆర్ఎల్డీఏ అధికారులు నిర్మాణ సంస్థలకు వివరించారు. ఇక మౌలాలీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కమర్షియల్ కార్యకలాపాలకు అవకాశం లేనందువల్ల అక్కడ కేవలం నివాస భవనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ‘ఆర్ఎల్డీఏ కొన్నింటిని 99 ఏళ్లకు లీజుకిస్తే మరికొన్నింటిని 49 ఏళ్లకు ఇస్తుంది. నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లోని స్థలాల ద్వారా రూ.350 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. లీజు పద్ధతిలో ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు ఇవ్వడం అనే ప్రయోగం ఉత్తరాదిలో విజయవంతమైంది. అదే తరహాలో ఇక్కడా భూములను లీజుకు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టారు’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం!
సాక్షి, ఢిల్లీ : రైల్వేల నిర్వహణను మెరుగుపరచడం కోసం ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర రైల్వే బోర్డులో 200 మంది దాకా డైరెక్టర్లు, ఆపై స్థాయి అధికారులు ఉన్నారు. వీరిలో 50 మందిని తొలగించి జోన్లకు పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. సిబ్బందిని క్రమబద్దీకరించి వారిని అధికారుల కొరత ఉన్న జోన్లకు పంపించాలని బోర్డు చైర్మన్ వీకే యాదవ్‌కు మంత్రి అంతర్గత ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే ఇలాంటి చర్యలకు కమిటీ వేసి నివేదిక సిద్ధం చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, రాజకీయ సంకల్పం లేక అమలుకు నోచుకోలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో జోన్ల పరిధిలో మెరుగైన సేవలకు అందిచడంతోపాటు, వనరుల సమర్ధ వినియోగం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్యూన్ల సంఖ్యను కూడా కుదించాలని భావిస్తున్నట్టు సమాచారం. -
ఊరికి పోవుడెట్ల?
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు రెగ్యులర్ రైళ్లలో రిగ్రేట్, ప్రత్యేక రైళ్లలో వందల్లో వెయిటింగ్ లిస్టు... మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్... వెరసి పండగ ప్రయాణంపై అనిశ్చితి నెలకొంది. ఇదికాస్త దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న లక్షలాది మంది ప్రయాణికులను సందిగ్ధంలోకి నెట్టింది. తెలంగాణలోని కొన్ని ప్రధాన పట్టణాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రైళ్లన్నీ నిండిపోయిన దృష్ట్యా బస్సులు తప్ప మరో గత్యంతరం లేదు. కానీ ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 5,000 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. రెండు రోజులుగా సుమారు 500 బస్సులు అదనంగా నడిపినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ అంచనా ప్రకారం 3–7 వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. నగరం నుంచి తెలంగాణ జిల్లాలు సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం 4, 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు అంచనా. అయితే సమ్మె అనివార్యమైతే 5వ తేదీ ఉదయం 5గంటల నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరం నుంచి ఊళ్లకు వెళ్లడమే కాదు... తిరిగి రావడం కూడా కష్టమే అవుతుంది. బతుకమ్మ, దసరా తెలంగాణలో ముఖ్యమైన వేడుకలు కావడంతో సిటీ నుంచి సుమారు 25లక్షల మందికి పైగా ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితమే పిల్లలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ మొదలైంది. సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 1.5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. రెండు రోజులుగా 30వేల మంది అదనంగా వెళ్లినట్లు అధికారుల అంచనా. రైల్వే రిగ్రేట్... నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల నుంచి ప్రతిరోజు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ నుంచి 85 ఎక్స్‌ప్రెస్‌లు వివిధ ప్రాంతాలకు నడుస్తాయి. అయితే అన్ని రెగ్యులర్ రైళ్లలోనూ రిగ్రేట్ కనిపిస్తోంది. ఇక దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మధ్య సుమారు 150 సర్వీసులను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ సర్వీసుల్లోనూ వెయిటింగ్ లిస్టు 150–200 వరకు ఉంది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. రద్దీని ఎదుర్కోవడం కష్టం. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లోని ప్రధాన పట్టణాలకు అందుబాటులో ఉండే విధంగా అదనంగా ప్యాసింజర్ రైళ్లను నడిపితే కొంతమేరకు ఊరట లభిస్తుంది. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఆర్టీఏ ఏర్పాట్లు... ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు రవాణాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది. ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను వివిధ రకాల వాహనాలకు ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను ఇవ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గ్రేటర్లో నడుస్తున్న 12,000 స్కూల్ బస్సులను ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు వినియోగిస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ రవాణా కార్యాలయాల వారీగా అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాలు, డ్రైవర్లను ఇప్పటి నుంచే అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ‘కాచిగూడ’లో ప్లాట్‌ఫామ్ టికెట్ల ధర పెంపు సాక్షి, సిటీబ్యూరో: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ పెంపు వర్తిస్తుందన్నారు. ప్రయాణికుల కోసం వచ్చే వారి బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు తాత్కాలికంగా చార్జీలను (15 రోజుల పాటు) పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గానీ వారు స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌లపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. బస్ బుకింగ్స్‌పై సమ్మె ఎఫెక్ట్.. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖ, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలు, బెంగళూర్, చెన్నై తదితర దూరప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ ఏసీ, నాన్ ఏసీ బస్సులపైన సమ్మె ప్రభావం ఇప్పటి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు వీకెండ్, మరోవైపు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నవారు అక్టోబర్ 5 నుంచి పెద్ద ఎత్తున రాకపోకలు సాగించనున్నారు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆ రోజు నుంచే సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా 5వ తేదీ కోసం ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ సమ్మె తప్పనిసరైతే ఆర్టీసీనే స్వయంగా బుకింగ్‌లను నిలిపివేసే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు
సాక్షి, అమరావతి: విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. గత ప్రభుత్వం హయాంలో హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు పేరుతో దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అంచనాలను ఆకాశానికంటేలా రూపొందించడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు లభించేలా ఆకర్షణీయంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఎలివేటెడ్ (పిల్లర్లపై) మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపగా, దానివల్ల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండడంతో భూమిపైనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) అధికారులకు సూచించారు. ఎలివేటెడ్ కంటే భూమిపై నిర్మించడం ద్వారా 20 నుంచి 30 శాతం వ్యయం తగ్గే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపైనే మొగ్గు చూపింది. పైగా ఈ ప్రాజెక్టుకు ఎలివేటెడ్ మార్గం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారని, ఇక్కడ కూడా అందమైన డిజైన్లు, గ్రీనరీతో పాటు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేయాలని ఏఎంఆర్సీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 104 కిలో మీటర్లు 4 నగరాలు విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 104 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి నంబూరు, అటు నుంచి అమరావతి, తిరిగి నంబూరు, అక్కడి నుంచి గుంటూరు, తెనాలి, అటు నుంచి విజయవాడ మీదుగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీకి చెందిన అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకు(యూఎంటీసీ) ఏఎంఆర్‌సీ అప్పగించింది. ఇప్పటికే యూఎంటీసీ సాధ్యాసాధ్యాల(ఫీజిబిలిటీ) నివేదికను తయారు చేసింది. ఈ రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన వ్యయం, భూసేకరణ, నిధుల సమీకరణ, డిజైన్లు తదితర అన్ని వివరాలతో నాలుగైదు నెలల్లో సవివర నివేదిక ఇవ్వనుంది. నంబూరు నుంచి అమరావతి వరకూ 18.5 కిలోమీటర్ల మార్గం ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రైల్వే శాఖ చేపట్టాల్సి ఉంది. మిగిలిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టి, మొత్తం ఖర్చులో 40 శాతాన్ని చెరో సగం భరించనున్నాయి. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో కాగితాలపైనే ప్రణాళికలు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయడం, అమరావతికి రాకపోకలు పెరగడంతో ఈ రూట్లకు మరింత ప్రాధాన్యం పెరిగింది. హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు ప్రతిపాదన వచ్చినా టీడీపీ ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగు నగరాలను అనుసంధానిస్తూ సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలో మాదిరిగా కాగితాలకే పరిమితం చేయకుండా, ఆచరణ సాధ్యమయ్యేలా ప్రణాళికలు ప్రతిపాదనలు తయారు చేయించి, అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. సెమీ హైస్పీడ్ సబర్బన్ రైలు సర్వీసు ఏర్పాటుపై ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సూచనలు చేశారని, వేగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారని, అందుకనుగుణంగా పని చేస్తున్నట్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. -
లైట్ తీస్కో.. బాబూ లైట్ తీస్కో!
పై ఫోటోలో ఉన్న సీన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం చాలాసార్లు చూసుంటాం.. లగేజీ స్కానర్ అక్కడే ఉంటుంది.. మనం మాత్రం లగేజీ స్కాన్ చేయించుకోకుండానే వెళ్లిపోతుంటాం. ఈ ఫొటోలోని వాళ్లలాగే.. అక్కడ ఉండే పోలీసులు కూడా స్కాన్ చేయించుకోవాలని ప్రయాణికులకు చెప్పరు..వాళ్ల ఫోన్లలో వారు బిజీ.. అండర్ వెహికిల్ స్కానర్.. మీకు తెలుసా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇది కూడా ఉంది.. పార్కింగ్‌కు వచ్చే వాహనాలు అండర్ వెహికిల్ స్కానర్ల మీదుగా వచ్చే ఏర్పాటు చేశారు. కానీ స్కానర్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది.. ఏర్పాటు చేయనే లేదు.. స్కానర్లు పనిచేస్తున్నా, వాహనాల దిగువన అనుమానిత వస్తువులు ఉన్నాయా లేదా అని పట్టించుకునేవాడే లేడు.. ఇంతేనా.. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లతో సిబ్బంది.. ఇలా చాలా ఉన్నాయి.. రోజూ 1.60 లక్షల మంది ప్రయాణికులు వచ్చే సికింద్రాబాద్ స్టేషన్లో కనిపిస్తున్న భద్రత ఏర్పాట్లివీ.. అన్నీ ఆన్‌లోనే ఉంటాయి.. కానీ ఇవన్నీ చూడ్డానికే.. వాడ్డానికి కానట్లు తయారయ్యాయి. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో, ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా టెర్రర్ అటాక్ అలర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.. అటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద హై అలర్టు అమలులో ఉంది. ఇలాంటి కీలక తరుణంలో భద్రత విషయంలో రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు మార్గాలున్నాయి. కానీ 2 మార్గాల్లో మాత్రమే లగేజీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆ రెండు మార్గాల్లోనే లోనికి వెళ్లేలా చేస్తే రద్దీ ఏర్పడి కీలక వేళల్లో తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో మరో రెండు చోట్ల లగేజీ స్కానర్లు ఏర్పాటు చేసి మిగతా మార్గాలను మూసేయాల్సి ఉంది. . కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. -
మౌలిక పెట్టుబడులపై భారీ నజర్
న్యూఢిల్లీ: ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తుల సరసన నిలిచే బలమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం దేశంలో మౌలిక వసతులను ప్రపంచస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, ఉద్యోగ కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేదిశగా దూసుకెళ్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామాలు–పట్టణాల మధ్య నెలకొన్న దూరాన్ని చెరిపేస్తూ.. వీటిని కలిపే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. ‘సరైన అనుసంధానతే ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అందుకే మౌలికవసతుల కల్పనకు ఏడాదికి రూ.20లక్షలకోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ దిశగా ఆర్థిక సహకారం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలు రూపొందిస్తోంది’అని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.80,250కోట్ల వ్యయంతో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. పీఎంజీఎస్‌వైతో అనుసంధానత గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థికపరమైన సానుకూలమార్పులు తీసుకురావడంతోపాటు అన్నిరకాల వాతావరణాల్లోనూ పట్టణ ప్రాంతాలతో అనుసంధానత విషయంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటుచేసే యోచనలోనూ ఉన్నట్లు చెప్పారు. 2018–19లో మొత్తం 300 కిలోమీటర్ల మేర మెట్రోలైన్లకోసం అనుమతులు ఇచ్చామన్న మంత్రి.. దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మెట్రోరైల్ నెట్వర్క్ వినియోగంలోకి వచ్చిందన్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎమ్సీ) ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన చెల్లింపుల వ్యవస్థ ద్వారా 2019 నుంచి మెట్రో సేవలు, టోల్ టాక్స్‌ల వద్ద వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైల్వేలకు రూ.50 లక్షల కోట్లు! 2018–30 మధ్య రైల్వేల్లో మౌలిక వసతులకల్పనకు రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరముందని సీతారామన్ పేర్కొన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకున్న స్థలాల్లో.. ప్రజలకు అవసరమైన వసతుల నిర్మాణాలను చేపట్టే యోచన ఉందని ఆమె తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం విషయంలో వినూత్నంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మంత్రి.. పూర్తయిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం (బ్రౌన్‌ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్) ద్వారా ఆర్థిక సమస్యలనుంచి బయటపడే విషయంలో భారత్ సానుకూల ఫలితాలను సాధించిందని వెల్లడించారు. విమానయానానికీ ఊతం పౌరవిమానయాన రంగాన్ని ప్రోత్సహించడంతోపాటుగా.. రోడ్లు, జలమార్గాలు, మెట్రో, రైలు రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన, పారిశ్రామిక కారిడార్లు, సరుకుల రవాణాకు ప్రత్యేక కారిడార్లు, భారత్‌మాల, సాగరమాల, జల్‌మార్గ్ వికాస్, ఉడాన్ వంటి పథకాను తీసుకొచ్చామని నిర్మల గుర్తుచేశారు. ‘సామాన్యులకు సేవలందించేందుకు భారీ మౌలికవసతుల సంస్కరణలను తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు కొనసాగేందుకు నిర్మాణ, మౌలికవసతుల రంగంతోపాటు, డిజిటల్ ఎకానమీ, చిన్న–మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగ కల్పన కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది’అని మంత్రి వెల్లడించారు. భారత్‌మాల,సాగరమాలతో.. భారత్‌మాల కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల కారిడార్లు, హైవేలను కలుపుతుండగా.. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టుల మధ్య అనుసంధానత పెరుగడంతోపాటు.. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ ఆధునీకరించబడుతోంది. జల్‌మార్గ్ వికాస్ ప్రాజెక్టు ద్వారా జాతీయ జలమార్గాలను నిర్మించడంతోపాటు జల రవాణాను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. రైలు, రోడ్డుమార్గాలకంటే అంతర్గత జలరవాణా ద్వారానే రవాణా వ్యయం తగ్గుతుంది. తద్వారా దేశీయంగా తయారైన వస్తువుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 2018 నవంబర్‌లో వారణాసిలో గంగానదిపై జలరవాణా టెర్మినల్ ప్రారంభం వినియోగంలోకి వచ్చింది. 2019–20ల్లోగా షాహిబ్‌గంజ్, హల్దియాల్లో టెర్మినల్స్ పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో గంగానదిపై కార్గోల ద్వారా రవాణా నాలుగురెట్లు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉడాన్ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ తేడాలను కలిపేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్.. విమాన కొనుగోలుకు ఆర్థికసాయం అందించడంతోపాటు భారత గడ్డపైనుంచి విమానసేవలను ప్రారంభించేందుకు అవసరమైన ‘లీజింగ్’కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు నిర్మల తెలిపారు. -
రైల్వే ప్రాజెక్టుల్లో 'పీపీపీ'
న్యూఢిల్లీ: రైల్వేల సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018 నుంచి 2030 సంవత్సరాల మధ్య రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్లో రైల్వే కోసం రూ. 65,837 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే మూలధన వ్యయం కింద గతంలో ఎన్నడూ లేనంతగా, అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్లను ఇచ్చారు. కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్‌కి రూ. 700 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం విభాగానికి రూ. 1,750 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రోలింగ్ స్టాక్ అవసరాల కోసం మరో రూ. 6,114.82 కోట్లు ఇచ్చారు. విభాగాల వారీగా చూస్తే చాలా వరకు విభాగాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చేసిన కేటాయింపులనే ఇప్పుడూ కొనసాగించారు. వాటిలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల మాట్లాడుతూ ‘ప్రత్యేక ప్రయో జక వాహకాల (ఎస్పీవీ) ద్వారా సబర్బన్ రైల్వేల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పీపీపీ పద్ధతిలో మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో భాగం అయ్యేందుకు రైల్వే శాఖను ప్రోత్సహిస్తాం’ అని చెప్పారు. సరకు రవాణా కోసం నదీ మార్గాలను కూడా ఉపయోగించుకోవడం ద్వారా రోడ్డు, రైల్వేలపై భారం తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తెలిపారు. ప్రయాణికుల సదుపాయాలకు 3 వేల కోట్లు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చెప్పుకోదగ్గ మొత్తంలోనే నిధులను బడ్జెట్లో కేటాయించారు. సౌకర్యాల మెరుగుదలకు రూ. 3,422.57 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం బడ్జెట్లో తెలిపింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యాలకు 200శాతం నిధులు కేటాయించారు. అయితే రైల్వేకు రెవెన్యూ వ్యయాలు తలనొప్పిగా మారాయి. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. 86,554.31 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది కంటే ఇది రూ. 14 వేల కోట్లు ఎక్కువ. నిర్భయ నిధి కోసం రూ. 267.64 కోట్లు, వీడియో నిఘాకు ఉపయోగించే వ్యవస్థకు రూ. 250 కోట్లు, కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌కు రూ. 17.64 కోట్లు కేటాయించారు. మొత్తంగా రైల్వేకు 2019–20లో రూ. 2,16,675 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. కాగా, 2018 ఏడాదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేకు మూలధన వ్యయం కింద రూ. 1.48 లక్షల కోట్లు ఇవ్వడంతోపాటు బడ్జెట్లో రూ. 55,088 కోట్ల నిధులు కేటాయించారు. ఆస్తులను అమ్మం,ఉద్యోగ భద్రత ఉంటుంది రైల్వే మంత్రి పియూష్ గోయల్ రైల్వే ఉత్పత్తి యూనిట్లను, ఇతర ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయను న్నారనే భయాలపై ఆ శాఖ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను అమ్మే ఆలోచన రైల్వేకి లేదనీ, ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగాలు పోతాయనడం అవాస్తవమని తెలిపారు. ట్రైన్–18ని తయారు చేసిన, ట్రైన్–20ని తయారు చేస్తున్న మన ఫ్యాక్టర్లీలోనే మెట్రో రైల్ బోగీలను కూడా తయారు చేసేందుకు తాము పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. -
ఇదేం ఏసీ.. ఛీఛీ..
రాజమహేంద్రవరం : న్యూఢిల్లీ నుంచి విశాఖ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. న్యూఢిల్లీలో రైలు బయలుదేరినప్పటి నుంచి జనరేటర్లలో లోపాలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చినా లోపం సరిచేయలేదని ఆరోపించారు. మూడు బోగీలకు ఒకటి చొప్పున ఏసీలు పని చేయకపోవడంతో చంటి పిల్లలు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఏసీలు లేకపోవడంతో బయటి కంటే బోగీల్లోనే వేడి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేడిని భరించలేక కొంత మంది చైన్ లాగి రైలును ఆపేశారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్న ఈ రైలు ప్రయాణికులు సుమారు మూడు గంటలకు పైగా రైల్వేస్టేషన్లోనే పిల్లలతో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొంతమందిని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పంపించగా, మరి కొంతమందిని ప్రత్యేక రైలులో 5.30 గంటలకు విశాఖకు తరలించారు. ఈ రైలులో మొత్తం 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డాం ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్నాను. మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే.. సమస్య తమ పరిధిలో కాదని చెప్పేవారు. ఫోన్ ద్వారా కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే.. పీఎన్ఆర్ నంబర్ వస్తుందని చెప్పి ఫోన్ పెట్టేసేవారు. రాత్రంతా ఏసీలు పని చేయలేదు. పిల్లలకు శ్వాస ఆడలేదు. మూడు గంటలకు పైగా స్టేషన్లోనే ఉండిపోయాం. రైల్వే అధికారులు ముందుగానే చెక్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. –శ్రీనివాస్, విశాఖపట్నం చెమటలు కక్కుతూ ప్రయాణించాం ఏసీలు పని చేయక చెమటలు కక్కుతూ ప్రయాణించాం. అసౌకర్యం భరించలేక కొంతమంది చైన్ లాగి రైలును ఆపేశారు. రైల్వే అధికారులు తప్పు ఉంది కనుక వారిపై కేసులు కూడా పెట్టలేదు. రైల్వే అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల ప్రయాణికులు నరకం చూశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – ఆర్టీ నాయుడు. విశాఖపట్నం పిల్లలతో ఎంతో బాధపడ్డాం నేను విజయవాడలో ఎక్కాను. ఇద్దరు పిల్లలతో విశాఖపట్నం వెళుతున్నాను. ఏసీలు పని చేయక పిల్లలు ఏడుపు మొదలు పెట్టారు. రైల్వే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? రైల్వే అధికారులకు డబ్బులు లేకపోతే ప్రయాణికుల వద్ద డొనేషన్లు తీసుకోవాలి. కావాలంటే మేమే ఇస్తాం. అంతేగాని ప్రయాణికులను ఇబ్బందులు గురి చేయరాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రైలు ప్రయాణం లేటు అవుతుందని బస్సుకు వెళుతున్నాను. – హైమారెడ్డి, విజయవాడ ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారు నేను ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళుతున్నా. రైలు బయలుదేరినప్పటి నుంచి ఏసీల్లో లోపం ఏర్పడింది. రైల్వే అధికారులు శ్రద్ధ తీసుకొని ఉంటే ఇంత మంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు కాదు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రయాణికులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలి. - బల్వీందర్ సింగ్, న్యూఢిల్లీ -
రెండు రోజులుగా రైలు టాయిలెట్లోనే..
సాక్షి, నరసాపురం: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. టాయిలెట్‌కు వెళ్లి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి రెండు రోజులు అందులోనే ఉండిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గురువారం బాధితుడి కుమారుడు రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌కుమార్ వద్దకు అతని తండ్రి నర్సీరావు తరచూ వెళ్లి వస్తుంటాడు. గత నెల 31న రాత్రి ఏడు గంటలకు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో టాయిలెట్‌కు వెళ్లిన ఆయన అందులోనే స్పృహతప్పి పడిపోయాడు. మర్నాడు ఉదయం 6 గంటలకు రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ బోగీలను తనిఖీచేసి, శుభ్రం చేసే సిబ్బంది లోపల గడియపెట్టి ఉన్న బోగీని పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి నాంపల్లి నుంచి బయలుదేరిన రైలు రెండో తేదీ ఉదయం నరసాపురం చేరుకుంది. అక్కడ బోగీని కడిగే సమయంలో సిబ్బంది.. టాయిలెట్ లోపల ఎవరో ఉండిపోయారన్న విషయాన్ని గుర్తించారు. గడియ పగులగొట్టి లోపల అపస్మారక స్థితిలో ఉన్న నర్సీరావును నరసాపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన జేబులో ఉన్న బుక్‌లో ఫోన్ నంబరు ఆధారంగా కుమారుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రిని ఎవరూ పట్టించుకోలేదని.. ఫోన్, డబ్బులు అపహరించారని రాజ్‌కుమార్ వాపోయాడు. రైలు ఎక్కిన తన తండ్రి హైదరాబాద్ రాకపోవడంతో ఒకటో తేదీనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
వాటిపై ఈసీ మరోసారి ఆగ్రహం : రెండవ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియా బోర్డింగ్ పాస్‌లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మల వివాదంపై శనివారం మరోసారి నోటీసులు జారీ చేసింది. టికెట్లపై మోదీ బొమ్మలను ఇంకా ఎందుకు తొలగించలేదని ఈసీ ప్రశ్నించింది. దీనిపై ఈ రోజే సమాధానం ఇవ్వాలంటూ రెండవ సారి నోటీసులిచ్చింది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతోరైల్వేటికెట్లు, ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా జారీ చేసే బోర్డింగ్ పాస్‌లపై ప్రధాని ఫోటోలను తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రధాని మోదీ బొమ్మలపై ఈసీ కన్నెర్ర -
కొత్త రైళ్లు లేవు.. కొత్త లైన్లూ లేవు
సాక్షి,సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం మినహా తాజా బడ్జెట్లో ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయలేదు. ఐదేళ్ల నుంచి నత్తనడక సాగుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలే కేటాయించారు. అలాగే రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నిధులను కేటాయించారు. రెండేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు మరో రూ.5 కోట్లు ఇచ్చారు. మౌలాలిలో నిర్మించనున్న రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌కు మరో రూ.1.5 కోట్ల నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ మినహా ఎలాంటి పురోగతి లేని మిగతా మూడు ప్రాజెక్టులకు ప్రస్తుత నిధులు సైతం అరకొరే. గతంలో ప్రకటించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రతిపాదన, లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ హోదా, నర్సింగ్ కళాశాల నిర్మాణం, వట్టినాగులపల్లి టర్మినల్ వంటి ప్రతిపాదనలు మరోసారి పెండింగ్ జాబితాలోకి చేరిపోయాయి. జంటనగరాల నుంచి షిరిడీ, బెంగళూరు, శబరిమలై, పట్నా, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ఎంతోకాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పట్టాలెక్కించేందుకు పాట్లు నగర శివార్లను అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు దక్షిణమధ్య రైల్వే పాట్లు పడుతోంది. రూ.817 కోట్లతో, 2012–13 లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. అన్ని మార్గాల్లో లైన్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.10 లక్షలు కేటాయించింది. యాదాద్రి ..సర్వేలకే పరిమితం ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మిస్తున్న సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గానికి పొడిగింపుగా ఘట్కేసర్–రాయిగిరి మధ్య 33 కి.మీ రైల్వేలైన్ నిర్మించేందుకు 2016–17లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. రూ.412 కోట్ల అంచనాలతో దీనికి ప్రణాళిక రూపొందించారు. ఆర్వీఎన్ఎల్సర్వే కూడా పూర్తి చేసింది. నిర్మాణ వ్యయంలో 51 శాతం రాష్ట్రం వాటాగా, 49 శాతం రైల్వే వాటాగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. దీనికి తాజాగా కేంద్రం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకూ టెండర్లు ఖరారు కాలేదు. నిమ్స్, ఎయిమ్స్‌కు మొండిచేయి కేంద్ర బడ్జెట్లో ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బీబీనగర్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆయుస్మాన్ భవ’ సహా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కీలక ఆస్పత్రులకు కనీస నిధులు కేటాయించలేదు. సాధారణ నిధులను మినహాయిస్తే.. ఆస్పత్రులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజగుట్ట నిమ్స్‌లో ట్రామాకేర్, సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం, ఆధునీకీకరణ పూర్తిగా కేంద్ర బడ్జెట్‌తోనే జరిగింది. ఇటీవల నిమ్స్ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రతినెలా ఉద్యోగుల వేతనాలు, ఫించన్ల చెల్లింపు కోసం రూ.12 కోట్ల వరకు అవసరం అవుతుండగా, ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో వేతనాల చెల్లింపునకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటుందని భావించినా ఫలితం దక్కలేదు. బీబీనగర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు ఇటీవల రూ.1028 కోట్లు కేటాయించడం మినహా తాజా బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేయలేదు. హెచ్‌సీయూ సహా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్ నిరాశేమిగిల్చింది. -
పండుగ చేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారులు, రైల్వేశాఖ, ఆర్టీసీ, మెట్రోసంస్థలు పండుగ చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటికి కాసులపంట పండింది. రూ.వందకోట్ల మేర మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించినవారితో రైల్వేశాఖకు రూ.50 కోట్లు, ఆర్టీసీకి రూ.15 కోట్లు, మెట్రోకు రూ.5 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఆయా విభాగాల అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అటు మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. నగరం ఒక చివరి నుంచి మరో చివరికి.. అంటే అత్యధిక రద్దీ ఉండే ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ.) మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి రావడంతో మెజార్టీ సిటిజన్లు మెట్రోసేవలను వినియోగించుకున్నారు. ఐదురోజులుగా మెట్రోకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో నుమాయిష్‌ను తిలకించేందుకు మెజార్టీ సిటిజన్లు మెట్రోరైళ్లలో ప్రయాణం చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీకి రూ.15 కోట్లు.. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, నగరాలకు సుమారు పదివేల రెగ్యులర్, ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో 4 రోజులుగా సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ సందర్భంగా రూ.50 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు కిటకిటలాడాయి. వరుస సెలవులు రావడంతో 4 రోజుల్లో వందకోట్ల విలువైన మద్యం విక్రయమైనట్లు ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది. -
పెద్దపల్లి: రికార్డుల ‘గని’!
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి సంస్థ ఒకే రోజు 2,43,731 టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలోనే అత్యధికంగా 46 రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేయడంతో సింగరేణి మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఈ నెల 27న అత్యదిక బొగ్గు రవాణాతో రికార్డు సాధించింది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా సంస్థ భారీగా పెంచుకుంది. సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రతీవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహిస్తున్న ఉత్పత్తి, రవాణా సమీక్షలు ఫలితాలిస్తున్నాయి. రైల్వేశాఖ వారితో నిర్వహిస్తున్న సమన్వయం ఫలితంగా తగినన్ని రేక్‌లు బొగ్గు రవాణా కోసం అందుబాటులోకి రావడంతో విద్యుత్ సంస్థలకు బొగ్గు సమకూర్చే వీలు కలిగింది. సాధారణంగా రోజుకు 30–33 రేక్‌ల బొగ్గును రవాణా చేసే కంపెనీ ఈ నెల 12న 41 రేక్‌లు, 10, 20న 42 రేక్‌లు, 22న 43 రేక్‌లు, 24న 44 రేక్‌లు, 27న అత్యధికంగా 46 రేక్‌ల బొగ్గు రవాణా చేయడం విశేషం. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ద్వారా 27న పెద్దఎత్తున బొగ్గు రవాణా జరిగింది. అత్యధికంగా 10 రేక్‌లను కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సీహెచ్‌పీ నుంచి రవాణా చేశారు. మణుగూర్ కొండాపురం సీహెచ్‌పీ నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–2 నుంచి ఆరు రేక్‌లు, ఇల్లందు నుంచి ఆరు రేక్‌లు, బెల్లంపల్లి నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–1 నుంచి నాలుగు రేక్‌లు, శ్రీరాంపూర్ నుంచి నాలుగు రేక్‌లు, మందమర్రి నుంచి నాలుగు రేక్‌లతో బొగ్గు రవాణా చేశారు. 27న రవాణా అయిన రేక్‌లలో తెలంగాణ జెన్కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అత్యధికంగా 12 రేక్‌లు, ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాలైన ఆర్టీపీఎం, వీటీపీఎస్‌లకు ఆరు రేక్‌లు, కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన మూడు విద్యుత్ కేంద్రాలకు ఐదు రేక్‌లు, మహారాష్ట్ర జెన్కోకు అనుబంధంగా ఉన్న పర్లి, కొరాడి, పరాస్, భూసాలి, చాపూర్ విద్యుత్ కేంద్రాలకు ఎనిమిది రేక్‌లు, ఎన్టీపీసీ రామగుండం, కుడ్గి, శోలాపూర్, మౌదా, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆరు రేక్‌లు, ఎన్టీపీసీ (జేవీసీ)కి చెందిన మూడు కేంద్రాలకు ఒక రేక్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్)కు రెండు రేక్‌లు, సిమెంట్ తదితర పరిశ్రమలకు కలిపి ఆరు రేక్‌ల బొగ్గును ఒక్క రోజునే సరఫరా చేసింది కంపెనీ. విద్యుత్ కేంద్రాల్లో తగితనంత నిల్వలు.. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి సంస్థ క్రమం తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తోంది. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి అందుకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసి రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో గరిష్ట విద్యుత్ వినియోగం ఉంటున్న తెలంగాణ విద్యుత్ కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా బొగ్గు రవాణా జరుపుతోంది. కనుక బొగ్గు కొతర లేకుండా విద్యుత్ ఉత్పత్తి సజావుగా కొనసాగుతోంది. మహారాష్ట్ర అభ్యర్థనపై... ఇటీవల మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా సింగరేణి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పెరిగిన విద్యుత్ వాడకం రిత్యా అదనంగా నాలుగు రేక్‌ల బొగ్గు సరఫరా చేయాలని కోరగా, సింగరేణి తక్షణమే స్పందించి ఈనెల 27న ఎనిమిది రేక్‌ల బొగ్గు సరఫరా చేసింది. సీఎండీ అభినందనలు.. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిన అన్ని ఏరియాల ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందికి సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తి రవాణాను మరింతగా పెంచాలని, ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలు దాటి ముందుకు పోవాలని కోరారు. -
రైలు ఆపి.. వందలాది ప్రాణాలు కాపాడి!
రేణిగుంట: సోమవారం.. తెల్లవారుతున్న వేళ... పొలంలో నాట్లు వేసే పని నిమిత్తం ఓ రైతు మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతూ గుర్తించిన ఓ దృశ్యం, తర్వాత ఆయన చేసిన సాహసం... వందలాది మంది ప్రాణాలను నిలబెట్టింది. ప్రమాద ఘంటికలను మోగిస్తూ విరిగిపోయి ఉన్న రైలు పట్టాలను గమనించిన అన్నదాత ప్రమాదమని తెలిసినా ఎర్రటి టీషర్టు ఊపుతూ రైలుబండికి ఎదురెళ్లి ఆపేశాడు. చిత్తూరు జిల్లా రేణిగుంట–శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పెను ప్రమాదమే తప్పింది. వెదుళ్లచెరువుకు చెందిన రైతు మల్లికార్జున్ తన పొలంలో నాట్లు కోసం కూలీలను పిలిచేందుకు సోమవారం తెల్లవారుజామున ఎస్టీ కాలనీ వైపు వెళుతుండగా రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపు ఉన్న ఓ రైలు పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. సమీపంలో వెళుతున్న ఎస్టీ కాలనీకి చెందిన మచ్చ అంకయ్యను అరిచాడు. ఇంతలోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు దూరంగా కూతపెడుతూ వస్తుండటాన్ని గమనించారు. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు. అంకయ్య వేసుకున్న ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. గమనించిన రైలు డ్రైవర్ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. రైల్వే గ్యాంగ్‌మెన్ తేజకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటపాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి ఆగి ఉన్న రైలును సురక్షితంగా పంపారు. తర్వాత విరిగిన పట్టాలను శాశ్వత మరమ్మతులు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని వాకబు చేసి తప్పిన ప్రమాదంతో ఊపిరి పీల్చుకున్నారు. మల్లికార్జున్‌ను రైల్వే అధికారులు, ప్రయాణికులతోపాటు గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. -
కూ..చుక్..చుక్.. 150 ఏళ్లు
సాక్షి సిటీబ్యూరో: ‘హైదరాబాద్’ పేరు చెబితే ఘనమైన చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. ఒకనాడు దేశంలోనే సుసంపన్నమైన, ప్రపంచంలోనే ధనవంతులైన నిజాం రాజ్యంలో అన్నీ అద్భుతాలే. బ్రిటీష్ వలస నీడకు దూరంగా ఎదిగిన ఈ రాజ్యంలో సొంత కరెన్సీ, పోస్టల్, ఎయిర్వేస్ స్వతంత్రగా ఎదిగాయి. వీటికితోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా తన ఖాతాలో వేసుకుంది. అదే సొంత రైల్వే వ్యవస్థ. దేశంలో సొంతంగా రైల్వేను నడిపిన ఘనత హైదరాబాద్ సంస్థానానికే దక్కింది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం అక్టోబర్ 8న తొలి రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. ఆ పరుగు వెనుకు ఉన్న కథ ఇదీ.. 1857 తరువాత బ్రిటిష్ పాలకులు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. కానీ తన రాజ్యంలో బ్రిటీష్ ఆధిపత్యాన్ని నిజాం అంగీకరించలేదు. అయితే, అభివృద్ధికి అధునిక అవసరాలను గుర్తించిన నిజాం సర్కారు సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది. ఐదో నిజాం మీర్ తహీనియత్ అలీఖాన్ ఆఫ్జలుదౌలా అధికారంలోకి వచ్చిన పదకొండో ఏట.. 1868లో ‘నిజాం స్టేట్ రైల్వే’ ఏర్పాటుకు ఫర్మానా జారీ చేశారు. అయితే, మరుసటి ఏడు నిజాం చనిపోయారు. అప్పటికే ప్రధానమంత్రిగా ఉన్న ఒకటో సాలార్జంగ్ రైల్వేలైన్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అందుకు అవసరమైన ధనం కోసం ఆయన లండన్ మనీ మార్కెట్ నుంచి లోన్ తీసుకున్నారు. భారత పాలకులతో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా లండన్ మనీ మార్కెట్‌కు వెళ్లడం ఆరోజోల్లో పెద్ద సంచలనం. ఆధునిక రాజ్యానికి పునాదులు ఐదో నిజాం పాలనా కాలంలో హైదదరాబాద్ అభివృద్ధి బాటలో పడింది. ప్రధాని సాలార్ జంగ్ బ్రిటీష్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి పోటీగా ఇక్కడా అభివృద్ధి చేపట్టారు. సంస్థానంలో సొంత రైల్వే, పోస్టల్, టెలిగ్రాఫ్ డిపార్టమెంట్‌తో పాటు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనలోనూ ప్రధానిగా ఒకటో సాలార్జంగ్ కొనసాగారు. దీంతో అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అక్టోబర్ 8న తొలి రైలు పరుగులు కర్ణాటకలోని బ్రిటీష్ రైల్వే జంక్షన్ వాడీని అనుసంధానం చేసేలా 1870లో సికింద్రాబాద్ టు వాడీ లైన్ పనులు మొదలయ్యాయి. 1874 నాటికి 115 మైళ్లు పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలతో 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది. ఆ నాటి ప్రధాన రైల్వే లైన్లు ఇవీ.. ♦ హైదరాబాద్– కాజీపేట–బెజవాడ లైన్ 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. ♦ బొగ్గు రవాణాకు కోసం సింగరేణి పుట్టిల్లు ఇల్లెందుకు అప్పట్లోనే రైల్వే ట్రాక్ వేశారు. ♦ 1884లో నిజాం గ్యారెంటేడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది. తిరిగి 1930లో హైదరాబాద్ స్టేట్ ఆధీనంలోకి వచ్చింది. ♦ నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా గోదావరి వ్యాలీ రైల్వే ఉండేది. మహారాష్ట్రలోని మన్నామాడ్ లింక్ చేసే ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. 1900లో హైదరాబాద్– మన్నమాడ్ మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లన్నీ నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారత్‌తో కలిపే రైల్వేలైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1950 నాటికి 2,353 కిలోమీటర్ల పట్టాలను నిజాం రైల్వే పరిచింది. నిజాం రైల్వే స్టేట్‌ను అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సెంట్రల్ రైల్వేలో విలీనం చేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారిపోయింది. నిజాంకు ప్రత్యేక రైలు నిజాం పాలకులు ప్రయాణించేందుకు ఆనాడు ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు ఈ ప్రత్యేక రైల్లోనే వెళ్లారు. ఇందులో నిజాం కోసం బెడ్రూమ్, కిచెన్, సెలూన్, బాత్రూమ్ ఉండేవి. సికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లో దీన్ని నిలిపేవారు. నాంపల్లి రైల్వే స్టేషన్.. నాంపల్లి రైల్వే స్టేషన్ 1907లో మీర్ మహబూబ్అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. అయితే, 1921 వరకు ప్రయాణికులను అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్ రైళ్ల కోసం మాత్రమే వినియోగించేవారు. బొంబాయి తదితర ప్రదేశాల నుంచి వచ్చే సరుకులను దించేందుకు నాంపల్లి అనువుగా వాడేవారు. ♦ కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే హెడ్ క్వార్టర్‌గా దీన్ని ఏర్పాటు చేశారు. -
రైల్వేలో కాంట్రాక్టు నియామకాలు
న్యూఢిల్లీ: వేర్వేరు విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లోని కీలక రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. ఆవిరితో నడిచే లోకో మోటివ్‌లు, పాత రైల్వే బోగీలు, సిగ్నల్స్ నిర్వహణ, పరిరక్షణకు పదవీవిరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని తీసుకోనున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు నియామకాలను చేపట్టాలని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే నియామకాల బోర్డు(ఆర్ఆర్బీ) ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాజీ ఉద్యోగుల్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే అధికారాన్ని జోనల్ మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టు విధానంలో ప్రధానంగా స్టెనోగ్రాఫర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేస్తామన్నారు. -
రైల్వే వెబ్సైట్ హ్యాకర్ అరెస్టు
కాశీబుగ్గ : రైల్వే టికెట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి 35 నకిలీ ఐడీలతో టికెట్లు పొందుతున్న వ్యక్తిని పలాస రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన పత్తి బాలకృష్ణ(36) తప్పుడు మార్గాల్లో టికెట్లు పొందుతుండగా ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది పేరుతో తీసుకున్న రిజర్వేషన్ టికెట్లు, ఖాళీ రిజర్వేషన్ పత్రాలు, రెండు సెల్ఫోన్లు, రూ.8270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ డి.కుమార్ నిందితుడిపై రైల్వే సెక్షన్ 143 కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం విలేకరుల ముందు ప్రవేశపెట్టి విశాఖపట్నం సెకెండ్ క్లాస్(ఎంఎం) రైల్వేకోర్టుకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించారు. -
రైలులో పుట్టాడు.. బంపర్ ఆఫర్ కొట్టాడు..!
పారిస్ : రైలులో జన్మించిన ఓ శిశువుకు ఫ్రెంచ్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకు రైలులో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. అసలేం జరిగిందంటే... సోమవారం రైలులో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసవించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న రైల్వే సిబ్బంది.. సెంట్రల్ ప్యారిస్‌లోని ఔబర్ స్టేషన్లో రైలును ఆపి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో.. బిజీగా ఉండే సెంట్రల్ ప్యారిస్ రైల్వే మార్గంలో 45 నిమిషాల పాటు రైళ్లు నిలిచిపోయాయని రైల్వే అధికారి తెలిపారు. అయితే ప్రసవ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో 15 మంది రైల్వే సిబ్బంది ఆ మహిళకు సాయంగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని... రైలులో జన్మించిన ఈ బుడతడికి తమ వంతు కానుకగా 25 ఏళ్ల పాటు రైలులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్టీఏపీ (ప్యారిస్ ప్రజా రవాణా వ్యవస్థ) ప్రకటించింది. -
రైల్వే శాఖ తొలి వినూత్న ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది. First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT — Ministry of Railways (@RailMinIndia) June 9, 2018 -
టికెట్ కన్ఫర్మ్ అయ్యే చాన్సెంతో చెప్పేస్తుంది
న్యూఢిల్లీ: రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌తో ఇబ్బందిపడే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతుందో ప్రయాణికులు దీంతో తెలుసుకోవచ్చని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతమున్న ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతశాతం ఉందో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. రైళ్ల ఆలస్యంపై వీడియో రైళ్ల రాకపోకల ఆలస్యానికి గల కారణాలను అన్ని రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫాం స్క్రీన్లపై వీడియో రూపంలో ప్రదర్శించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు ఆలస్యానికి కారణాన్నీ వీడియోలో వివరిస్తారు. ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పనున్నారు. ప్రస్తుతం దేశంలో 30శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ నివేదికలో వెల్లడైంది. -
బోగీల్లో ప్యానిక్ బటన్ -ఈశాన్య రైల్వే
సాక్షి, లక్నో: రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బోగీల్లో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నామని ఈశాన్య రైల్వే విభాగం (ఎన్ఈఆర్) ప్రకటించింది. అలాగే రాత్రి పూట మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. రైళ్ళలో మహిళల భద్రతను బలోపేతం చేయాలన్న యోచన దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళల నియామకాలతోపాటు, రాత్రిపూట రైళ్ళలో మహిళా బోగీలన్నింటిలో మహిళా పోలీసులను నియమించాలని, ప్యానిక్ బటన్ వ్యవస్థను నెలకొల్పనున్నట్లు ఎన్ఈఆర్ సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ప్రకటించారు. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ ప్యానిక్ బటన్‌ను నొక్కిన వెంటనే బోగీ బయట, రైలు డ్రైవర్ వద్ద, కంట్రోల్ రూంలో ప్రమాద హెచ్చరిక లైట్లు వెలుగుతాయని వివరించారు. ప్రస్తుతం, మహిళా ప్రయాణీకులు కాల్ లేదా ఎస్ఎంఎస్ , హెల్ప్‌లైన్ నెంబర్లు,లేదా అత్యవసర పరిస్థితిలో గొలుసు-లాగడం లాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తోందీ కానీ ప్యానిక్బటన్ వ్యవస్థతో తక్షణమే చర్య తీసుకునేఅవకాశం ఉందని తెలిపారు. సబర్బన్ రైళ్ల బోగీల్లో సీసీటీవీ ఏర్పాటును కూడా ఆలోచిస్తున్నామన్నారు. అలాగే మహిళా బోగీలను తొందరగా గుర్తించేందుకు వీలుగా రంగులను మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
జీఆర్పీ ఎస్సై అరెస్టు
బరంపురం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్‌పై బరంపురం రైల్వే స్టేషన్లో దాడి చేసి గాయపరిచిన కేసులో బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా అరెస్టయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 17వ తేదీ రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న బరంపురం జీఆర్పీ స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను బి–1 కోచ్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్ టికెట్ అడగడంతో వాగ్వాదం జరిగింది. బరంపురం రైల్వేస్టేషన్ రాగానే బి.కిరణ్ సాగర్‌ను జీఆర్పీ ఎస్సై, ఇతర జీఆర్పీ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుడు బి.కిరణ్ సాగర్ విశాఖపట్నం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఏడీజీ జీఆర్పీ బరంపురం పోలీస్‌స్టేషన్ ఐఐసీ రాజేంద్ర కుమార్ ముండాపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం ఈ కేసును బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో గురువారం బరంపురం జీఆర్పీ పోలీసులు ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా పెట్టుకున్న బెయిల్‌ను ఎస్డీజేఎం కోర్టు తిరస్కరించింది. -
22 బోగీలు 13 కి.మీ... ఇంజిన్ లేకుండా
భువనేశ్వర్: ఒడిశాలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులతో ఉన్న 22 బోగీలు ఇంజిన్ లేకుండానే 13 కిలోమీటర్ల దూరం పరుగులు తీశాయి. ఈ ఘటనకు కారణమైన ఏడుగురు సిబ్బందిని రైల్వే శాఖ తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. అహ్మదాబాద్–పూరి ఎక్స్‌ప్రెస్‌కు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్లో ఇంజిన్‌ను మారుస్తున్న సమయంలో ఈ తప్పిదం చోటుచేసుకుంది. టిట్లాగఢ్ నుంచి కేసింగ స్టేషన్ వైపునకు ఉన్న రైల్వే మార్గం కొంత వాలుగా ఉంటుందనీ, స్కిడ్ బ్రేక్‌లను సరిగ్గా వేయకపోవటం వల్ల రైలు బోగీలు కదిలాయని తూర్పు కోస్తా రైల్వే అధికారి ఆదివారం చెప్పారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది పట్టాలపై రాళ్లు పెట్టి రైలును ఆపి పెను ప్రమాదాన్ని నివారించారని వెల్లడించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆ రైళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లకు టాటా!
రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లను ప్రయాణీకులు ధ్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్సెట్లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్సీడీ స్క్రీన్లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట. -
కాంట్రాక్టు రైల్వే కార్మికుల వివరాల క్రోడీకరణ
న్యూఢిల్లీ: రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలు క్రోడీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది. హౌస్ కీపింగ్, క్లీనింగ్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్ తదితర సర్వీసుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యవస్థీకృత రంగ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కుల ఉల్లంఘనపైనా దీని ద్వారా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు జనరల్ కండీషన్స్ ఆఫ్ కాంట్రాక్టు (జీసీసీ) నిబంధనలు రూపొందించింది. ఆ ప్రకారం వంతెనలు, భవనాలు, గేజ్ మార్పిడి ప్రాజెక్టులు, ఇతర సేవలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్ల నియమాలను మార్చనుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వేకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల కోసం డిజిటల్ కాంట్రాక్టు లేబర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. కార్మికుల వ్యక్తిగత వివరాలు, పోలీస్ వెరిఫికేషన్, ఆరోగ్య బీమా, పీఎఫ్ రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు సమాచారం, పని వేళలు, జీతం, కార్మికుల బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. -
రైల్వే మంత్రిగారూ.. దయచేసి వినండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రైల్వే బడ్జెట్ ప్రతిసారీ ఊరించి ఉస్సూరనిపిస్తోంది. కొత్త రైళ్ల ఊసే ఉండడం లేదు. కొత్త రైల్వే లైన్ల పరిస్థితి కూడా అంతే. జిల్లా ఎంపీల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సమస్యల కూతలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నా స్టేషన్ల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. బడ్జెట్లో ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రధానమైన ప్రతిపాదనలివీ... కాకినాడ–కోటిపల్లి రైల్వేను లైన్ నర్సాపురం వరకు విస్తరించేందుకు మరో రూ. 600 కోట్లు రైల్వే శాఖ నుంచి రావల్సి ఉంది. అవి వస్తే తప్ప కోటిపల్లి నుంచి రైల్వే పనులు ప్రారంభంకావు. వీటి విషయంలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ 30 ఏళ్ల క్రితం నివేదిక ఆధారంగా పిఠాపురం– కాకినాడ మెయిన్ లైన్ సాధ్యం కాదని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. రద్దీ పెరిగింది. కొత్తగా కోటిపల్లి– నర్సాపురం లైన్ వేస్తుండటంతో ఈ మెయిన్ లైన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎంపీ తోట నర్సింహం తీసుకెళ్లారు. గత బడ్జెట్లో 200 కేటాయించినందున దీన్ని పూర్తి చేయాలని కోరారు. ఎంపీ తోట నర్సింహం పరువు నిలుపుతారో లేదో చూడాలి. ♦ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో 3,4 ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి కోసం గత బడ్జెట్లో రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు ఆ నిధులు రాలేదు. పనులు మొదలు కాలేదు. ♦ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకాస్త ప్రయోజనకరంగా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం, రేపెల్లె, నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు కలిపే కోస్తా రైలు మార్గం అవుతుందని,ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. ♦ జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్లో ‘వైఫై’ సదుపాయం లేదు. ఇక నూతన రైల్వే లైన్ల ఊసే ఉండటం లేదు. కొత్తగా రైళ్లు రావడం లేదు. ఎంపీలు కోరడమే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికి ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందో లేదంటే ఎప్పటిలాగే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తుందో చూడాలి. గతంలో ప్రకటించిన నిధులు ఈసారైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రకటించినట్టుగా మన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందో? గత బడ్జెట్ మాదిరిగా మొండి చేయి చూపుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. -
ఈ సారైనా.. వచ్చేనా?
రాజంపేట: రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుపై ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయి. స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను పాలకలకు చూపిస్తూ రైల్వేపరంగా నందలూరుకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేసేందుకు స్ధానిక నేతలకు ఉపయోగపడింది. ఇక అదికూడా రైల్వే యాజమాన్యం లేకుండా చేసింది. వందేళ్ల కిందటి స్టీమ్లోకోషెడ్ బ్రిటీషు రైల్వేపాలకుల చరిత్రకు ఇన్నాళ్లు ఆనవాళ్లుగా నిలిచింది. ఇప్పుడు ఈ షెడ్‌ను రైల్వే స్క్రాప్ కింద వేలం పెట్టి తొలిగించేసింది.ఈ షెడ్ ఉంటే నందలూరు రైల్వేపరిశ్రమ ఏర్పాటు ప్రస్తావన కొనసాగుతూనే ఉంటుందనే భావనతో తొలగించినట్లు ఉందని ఉద్యమకారులు పెదవివిరిస్తున్నారు. ఫలించని పోరాటలు.. ఉద్యమాలు నందలూరు రైల్వేకేంద్రంలో 1880 ప్రాంతంలో బ్రిటీషు రైల్వేపాలకులు స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి చెన్నై, గుంతకల్ వరకు రైలింజన్లతో ప్యాసింజరు, గూడ్స్‌రైళ్లను నడిపించేవారు. వందలాది క్వార్టర్స్, నివాసగృహాలతో వైభవంగా వెలుగొందింది నందలూరు. కాలానుగుణంగా ఆధునికసాంకేతికలో మార్పులు రావడంతో డీజల్, కరెంటు రైలింజన్లు రావడంతో షెడ్డ్లో ఉన్న 20 బొగ్గు ఇంజన్లను స్క్రాప్ కింద వేలంవేశారు. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని పదేళ్ల కిందట అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు రైల్వే ఐక్య పోరాటసమితిగా ఏర్పడ్డారు. 70రోజుల పాటు రిలేదీక్షలు, రాస్తారోకోలు, చేశారు. యూపీఏ ప్రభుత్వహయాంలో రైల్వేమంత్రి లాలుప్రసాద్ వద్దకు వెళ్లారు. ఆయన లోక్‌సభలో వ్యాగిన్ రిపేరువర్క్‌షాపు లేదా ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ పెడతామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయదిగ్గజాలు నందలూరును సందర్శించారు. తమ ప్ర«భుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రైల్వేపరిశ్రమను తీసుకొస్తామని హామీలు ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు వెంకయ్యనాయుడు, పురందేశ్వరి, కేంద్రమంత్రులు సందర్శించివెళ్లారు. సర్వే, స్ధలనివేదికలు బుట్టదా ఖాలా అయ్యాయి. ఎంపీ మిథున్‌రెడ్డి అలుపెరగని కృషి.. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన శక్తిమేరకు కృషిచేస్తూనే ఉన్నారు. అనేక మార్లు రైల్వేమంత్రులను కలిసి వినతులు సమర్పించారు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, తమ ప్రాంతా లకు రైల్వేపరిశ్రమను తీసుకెళ్లేం దుకు జరుగుతున్న పరిణామాల్లోనే నందలూరుకు రైల్వేపరిశ్రమ రాని వ్వకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రైల్వే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్ : కడప రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. సుందర్రాజ్ (53) గురువారం మధ్యాహ్నం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం తోటి సిబ్బంది ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మూడున్నర సంవత్సరాల నుంచి చింతకొమ్మదిన్నె సమీపంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా తాను పని చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, 16న(గురువారం) రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు రెండు రోజుల సెలవు ఇవ్వాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్టాన్లీని కోరినట్లు తెలిపారు. అయితే ఆయన లీవ్ మంజూరుచేయకపోవడంతో మనస్తాపంతో వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై బాధితుడి భార్య ప్రమీల మాట్లాడుతూ అధికారి వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
500 రైళ్ల ప్రయాణ సమయం తగ్గింపు
న్యూఢిల్లీ: ఎక్కువ దూరం ప్రయాణించే దాదాపు 500 రైళ్ల ప్రయాణ సమయాన్ని వచ్చే నెల నుంచి సరాసరి దాదాపు 15 నిమిషాల నుంచి 2 గంటల వరకూ తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. రైల్వే మంత్రి ఆదేశాల మేరకు ఈ కొత్త టైం టేబుల్‌ను నవంబర్ నుంచి అమలు చేయనున్నారు. కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన వెంటనే 51 రైళ్ల ప్రయాణ సమయం గంట నుంచి 3 గంటల వరకూ తగ్గుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీన్ని క్రమంగా 500 రైళ్లకు పెంచుతామని చెప్పారు. రైళ్ల వేగం పెంపులో భాగంగా 50 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ సర్వీసుగా మార్చుతామని ఆయన పేర్కొన్నారు -
లాలూపై సీబీఐ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో భాగమైన రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు అక్రమాల కేసులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం ఏకంగా ఏడు గంటలపాటు విచారించింది. గురువారం కూతురు మీసా భారతితో కలసి లాలూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. భారతిని లాబీలో వేచి ఉండమని చెప్పి లాలూను అధికారులు సుదీర్ఘంగా విచారించారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా 2006నాటి రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు ఒప్పందంలో లొసుగులు, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ యజమానులతో సత్సంబంధాలు, లావాదేవీలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. లాలూ కొడుకు తేజస్విని సీబీఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించనున్నారు. -
రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం
సాక్షి, హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఉద్యోగులు బాసటగా నిలవాలని కోరా రు. సోమవారం ఉదయం ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ), కాజీపేట-ముంబై తడోబా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లను, నిజామాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రెండు లిఫ్టులను రిమోట్ ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని నాగులపల్లి స్టేషన్-ఢిల్లీలోని తుగ్లకాబాద్ మధ్య కార్గో ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ప్రారంభించారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రైల్వేకు విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయం పెద్ద సమస్యగా మారింది. ఈ దశలో ఖర్చును నియంత్రించే చర్యలు చేపట్టడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిం చాలి. అందుకే సంస్కరణల దిశగా సాగుతున్నాం’’ అని అన్నారు. తాను ఇక దక్షిణాదిలో రైల్వే విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. రైల్వే స్థలాల్లో ఉన్న చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించి ఆ నీటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల ఇటీవల రూ. 3,500 కోట్ల పొదుపు సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలిచే క్రమంలో నాగులపల్లి, చర్లపల్లి స్టేషన్లలో భారీ హరిత టెర్మినళ్లను నిర్మించనున్నట్లు ప్రభు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హన్సరాజ్ గంగారామ్ అహిర్, బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయి ని నర్సింహారెడ్డి మహేందర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. రైల్వేకు స్వర్ణయుగం తేవాలి అంతకుముందురైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో సురేశ్ ప్రభు పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల విషయంలో ఉద్యోగులు చూపే ఉత్సాహాన్ని రైల్వే కు స్వర్ణయుగం తేవటంలోనూ చూపాలన్నా రు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూని యన్ ప్రతినిధులు శివగోపాల్ మిశ్రా, శంకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. -
రైల్వే స్టేషన్లలో చెత్త అమ్మకం!
న్యూఢిల్లీ: ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో తయారయ్యే చెత్తను అమ్మకానికి పెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైల్వే స్టేషన్ల నుంచి కిలోకు రూ. 1.50 చొప్పున చెత్తను కొనుగోలు చేసేందుకు ఒక వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ ముందుకు వచ్చిందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. తొలి దశలో అమృతసర్, అంబాలా, ఛత్రపతి శివాజీ టెర్మినస్ - ముంబైతోపాటు తదితర 12 స్టేషన్లలో చెత్తను సేకరిస్తామని ఆ సంస్థ పేర్కొందన్నారు. చెత్త సేకరణ, రవాణా, నిర్వహణ.. తదితర విధులు ఆ సంస్థవేనన్నారు. దీనివల్ల రైల్వేకు ఆదాయం సమకూరడంతో పాటు, స్టేషన్ల పరిశుభ్రత కూడా సాధ్యమవుతుందన్నారు.