న్యూఢిల్లీ: రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలు క్రోడీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది. హౌస్ కీపింగ్, క్లీనింగ్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్ తదితర సర్వీసుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యవస్థీకృత రంగ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కుల ఉల్లంఘనపైనా దీని ద్వారా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు జనరల్ కండీషన్స్ ఆఫ్ కాంట్రాక్టు (జీసీసీ) నిబంధనలు రూపొందించింది. ఆ ప్రకారం వంతెనలు, భవనాలు, గేజ్ మార్పిడి ప్రాజెక్టులు, ఇతర సేవలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్ల నియమాలను మార్చనుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వేకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల కోసం డిజిటల్ కాంట్రాక్టు లేబర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. కార్మికుల వ్యక్తిగత వివరాలు, పోలీస్ వెరిఫికేషన్, ఆరోగ్య బీమా, పీఎఫ్ రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు సమాచారం, పని వేళలు, జీతం, కార్మికుల బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment