contract workers
-
స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. 200 మంది ఉద్యోగుల అష్టదిగ్బంధనం
సాక్షి,విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.స్టీల్‌ప్లాంట్‌లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్‌లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు. మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు. -
స్టీల్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు ధర్నా కొనసాగింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.చివరకు ఒత్తిడిల నేపథ్యంలో యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో తొలగించిన కార్మికులకు నెలవారీ పాసులు, వేరే రంగు పాసులు ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి ఆగ్రహించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసు బలగాల మోహరింపు ధర్నాకు ముందెన్నడూ లేనివిధంగా విధుల్లో ఉన్న కార్మికులు కూడా హాజరయ్యారు. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులను నిలువరించేందుకు ఈడీ భవనం ముందు, వెనుక గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు భవనం ఎదుట కారిడార్‌లో బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులు రెండు గేట్ల వద్ద బైఠాయించడంతో భవనం నుంచి ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒకానొక దశలో పోలీసులు ఆందోళనాకారులను లాఠీల సాయంతో పక్కకు నెట్టారు. అప్పటికే అక్కడికి మీటింగ్‌కు వచ్చి ఉన్న వివిధ విభాగాధిపతులు మధ్యాహ్నం భోజనానికి తమ విభాగాలకు వెళ్లలేక పోయారు. సాయంత్రం 5.30కు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులను కూడా బిల్డింగ్ బయటకు అనుమతించక పోవడంతో వారు తమ కార్యాలయాల్లో నిలిచిపోవాల్సి వచి్చంది.డిమాండ్లపై యాజమాన్యం ససేమిరా డిమాండ్ల సాధన కోసం యాజమాన్యం ప్రతినిధులతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. గతంలో మాదిరిగా పాసులు ఇవ్వాలని, వారికి పాత రంగులో పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం రాతపూర్వకంగా హామీ కోరగా.. యాజమాన్యం ససేమిరా అనేసింది. దీంతో రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెగేసి చెప్పారు. వర్క్స్ ఉన్నతాధికారులు, హెచ్ఆర్ అధికారులు ఉన్నత యాజమాన్యం అనుమతి కోసం ప్రయత్నం చేసినా సానుకూల స్పందన రాలేదు. ఫలితంగా కార్మికులు మంగళవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఒకేసారి 4 వేల మంది తొలగింపు!.. రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్‌లో విలీనం చేయాలి. ప్లాంట్‌కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలి. మూడు బ్లాస్ట్ ఫర్నిస్ను పూర్తిస్థాయిలో నడపాలి’’ అని కార్మికులు కోరుతున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది.నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఇదీ చదవండి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం -
3 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల నిరసన..
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాస్తంత భరోసా ఇవ్వలేరా అని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘పండుగ లేదు, పబ్బం లేదు, రోజూ పనిచేస్తున్నారు. అయినా వారు కాంట్రాక్టర్ల వేధింపులకు గురవుతున్నారు’అని వాపోయారు. గ్రామీణ జనానికి నీళ్లు అందిస్తున్న 15 వేల మంది మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల చట్టబద్ధ హక్కులను కాలరాస్తూ, వారికి కనీసవేతనాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్ కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రగతిభవన్ సారుకు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్న సోయి లేదా అని షర్మిల ప్రశ్నించారు. -
నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి, సీనియారిటీ ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. నిమ్స్ హాస్పిటల్లో 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నా.. కనీస వేతనం నెలకు రూ.14,700 మాత్రమే వస్తోందని తెలిపారు. లేబర్ కమిషన్ ముసాయిదా ప్రకారం వీరికి రూ.20 వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ గెజిట్ జారీ చేయలేదని తమ్మినేని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీనియారిటీ ప్రకారం జూనియర్లకు రు.20 వేలకు తగ్గకుండా, సీనియర్లకి వారి సీనియారిటీని బట్టి జీతం పెంచేలా చూడాలని ఆ లేఖలో కోరారు. -
‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. -
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ భగ్నం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎస్వీకే వద్దకు చేరుకున్న వందలాది మంది కార్మికులతో సభ జరిగింది. అనంతరం కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ర్యాలీగా బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ర్యాలీని భగ్నం చేయటంతోపాటు పలువురిని అరెస్టు చేసి మలక్‌పేట, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, అలాంటి కార్మికుల శ్రమ దోపిడీ చేయటం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు సింగరేణి కార్మికులను పొగుడుతూనే, వారి సంక్షేమం విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ, ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం, బీఎంఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని (రామగుండం)/సింగరేణి(కొత్తగూడెం): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కార్మికులు విధులు బహిష్కరించారు. మరోమూడు రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తామని.. సమ్మె యోచన విరమించాలని యాజమాన్యం గురువారం కోరినా కాంట్రాక్టు కార్మిక సంఘాలు ససేమిరా అన్నాయి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, ఆర్జీ–1,2,3, ఏపీఏ, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పలు విభాగాల్లో పనులు నిలిచిపోయాయి. అత్యవసర విభాగాల్లో మాత్రం పనులు కొనసాగాయి. డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె.. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమను యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని, సీఎంపీఎఫ్ అమలు చేయాలని, లాభాల్లో వాటా ఇవ్వాలి, కార్మికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అన్నీ సమస్యలు పరిష్కరించాలని, కేటగిరీ ఆధారంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని, రామగుండం, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. భూపాలపల్లిలో రాస్తారోకో, మణుగూరులో ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
దిక్కుతోచని స్థితిలో గిగ్ వర్కర్లు
ముంబై: తాజా నైపుణ్యాలను అలవరుచుకోవడం లేదా కొత్త ఉపాధిని వెతుక్కోవడమనే సవాలును ఎదుర్కొంటున్నట్టు కాంట్రాక్టు పనివారు (గిగ్ వర్కర్లు) అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ఏర్పాటైన స్లార్టప్ ప్లాట్‌ఫామ్ సీఐఐఈ.కో ఒక నివేదికను విడుదల చేసింది. పనివాతావరణం తమకు సవాలుగా ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న వర్కర్లలో 52 శాతం మంది చెప్పారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదంటే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన సవాలును ఎదుర్కొంటున్నట్టు వీరు తెలిపారు. స్వల్పకాల ఆదాయం కోసం ప్లాట్‌ఫామ్‌లలో కాంట్రాక్టు పనికోసం చేరిన వారు దీర్ఘకాలం పాటు, ఎటువంటి వృద్ధి లేకుండా కొనసాగాల్సి వస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ‘‘మేము అభిప్రాయాలు తెలుసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సమీప కాలంలో ఉద్యోగాలు మారే విషయమై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అధిక వేళలపాటు పనిచేయాల్సి రావడం, నైపుణ్యాలను పెంచుకునే వాతావరణం లేకపోయినా కూడా మూడింట రెండొంతుల మంది ఉద్యోగాలు మారే విషయమై ప్రణాళికతో లేరు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. నైపుణ్యాల అంతరం దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఇలా అయితే నష్టం.. యూనివర్సిటీల నుంచి వస్తున్న ఉద్యోగార్థులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు మొదటి ఉద్యోగ వేదికలుగా ఉంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. వారు ఈ ఉద్యోగాలకే అతుక్కుపోయి నైపుణ్యాలు పెంచకోకుండా, మెరుగైన సంస్థల్లో కొలువులు పొందలేకపోతే.. అది మానవనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సుదుపాయం ఉన్నా కానీ, నేడు గిగ్ వర్కర్లలో 50 శాతం మంది రిఫరల్ రూపంలోనే పనిని పొందుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 4,070 మంది గిగ్ వర్కర్ల నుంచి సీఐఐఈ అభిప్రాయాలు తెలుసుకుని ఈ నివేదిక రూపొందించింది. -
రామగుండం ఎన్టీపీసీ వద్ద ఉద్రిక్తత
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2018 నాటి ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గేట్ సమావేశం నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఒక దశలో కార్మికులు ప్లాంట్ గేట్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో 30 మందికిపైగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేసి దాడిచేశారని కార్మికు లు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే చందర్ సీఐఎస్ఎఫ్ లాఠీచార్జిలో గాయపడిన కాంట్రాక్టు కార్మికులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిలకుపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ ఆలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వెల్లడించార. -
సింగరేణిలో ఇదేం వివక్ష ?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా పరిగణించబడుతున్నారు. ఏడేళ్లుగా హైపవర్ వేతనాలు ఇచ్చే విషయంలోనూ పట్టింపు లేని సింగరేణి యాజమాన్యం.. కోవిడ్ బారిన పడిన కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. చివరకు కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు పరిహారం చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. కరోనాతో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని 2020 ఆగస్టు 14న కోలిండియా పరిధిలో జరిగిన 408వ బోర్డు మీటింగ్‌లో నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పర్మినెంట్ కార్మికులు మృతి చెందితేనే వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు. ఈ వివక్షపై ప్రశ్నించినా ఫలితం లేదని, గుర్తింపు సంఘం నాయకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మృతిచెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్‌కు బీఎంఎస్ నాయకులు ఇటీవలే వినతిపత్రం అందజేశారు. గత ఏడాది కాలంలో సింగరేణి వ్యాప్తంగా 40 మంది కాంట్రాక్ట్ కార్మికులు కరోనాతో మృతిచెందినట్లు గణాంకాల్లో ఉన్నా.. వారి కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విస్తృత సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో పర్మినెంట్ కార్మికులు కోవిడ్ పేషంట్లను ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు కోవిడ్ పేషంట్ల మధ్య, మృతదేహాల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పేషంట్లకు మందులు ఇవ్వకపోతే జీతం కట్, మృతిచెందిన వారిని పట్టుకోకుంటే ఉద్యోగం అవుట్ అంటూ కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు మోయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, మృతదేహాలను తరలిస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు సివిక్, సివిల్, పారిశుద్ధ్యం, సులభ్, లోడింగ్, అన్లోడింగ్, రైల్వే క్రాసింగ్, అంబులెన్స్, కోల్ శాంప్లింగ్, గార్డెనింగ్, క్యాంటీన్స్, ఫిల్టర్బెడ్లలో నీటి శుద్ధి, ఆఫీస్ బాయ్స్, కంప్యూటర్ ఆ పరేటర్లు, బెల్ట్ క్లీనింగ్, బ్లాస్టింగ్, క్రషర్.. ఇలా పలు విభాగాలలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గనుల చట్టం 1952 ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉంది. అ యినప్పటికీ నామమాత్రపు వేతనాలు చెల్లించి శ్రమదోపిడీకి గురిచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థను బానిస వ్యవస్థగా అభివర్ణించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్పు లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లయినా అమలుకాని హైపపర్ వేతనాలు కోలిండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు 2013 నుంచి హైపవర్ వేతనాలు అమలవుతున్నాయి. అయితే సింగరేణిలో హైపవర్ వేతనాలు అమలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు. చివరకు కనీస వేతనం జీవోను సైతం అమలు కావడం లేదు. ఒక పర్మినెంట్ కార్మికుడి జీతంతో సుమారు 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పని చేస్తున్నారు. దీంతో సింగరేణికి కోట్లాది రూపాయలు మిగులుతున్నాయి. అయినా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్యం సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయడంతో పాటు, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే మెరుగైన వైద్యం అందించాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయాలపై సింగరేణి జీఎం పర్సనల్ (ఐఆర్‌పీఎం) అందెల అనందరావును ‘సాక్షి’ వివరణ కోరగా కాంట్రాక్ట్ కార్మికుల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయమై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
గాంధీలో కొనసాగుతున్న సమ్మె..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. -
బినామీ ‘బాబు’కు చెక్
సాక్షి, తిరుపతి : బినామీ బాబుల శ్రమ దోపిడీకి ప్రభుత్వం చెక్ పెట్టింది. చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా అక్రమాలకు ఏజెన్సీ నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసింది. శుక్రవారం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తూ కాంట్రాక్టర్ భాస్కర్‌నాయుడు అవినీతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల కష్టం దళారీ పాలుకావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వారికి నెలవారీ వేతనాలు సక్రమంగా అందించేందుకే కార్పొరేషన్‌ను ప్రవేశపెట్టామని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కట్టబెట్టేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల్లో పారిశుధ్య కారి్మకుల కాంట్రాక్టులన్నీ పద్మావతి సంస్థ పేరుతో భాస్కర్‌నాయుడే దక్కించుకున్నారు. ఉద్యోగులకు కనీసం టైంస్కేల్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. పద్మావతి హౌస్ కీపింగ్ సంస్థ తీరుపై కారి్మకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇష్టారాజ్యంగా సిబ్బందిని తొలగించడం, వేతనాల్లో కోత వేయడం వంటి చర్యలతో పలుమార్లు కారి్మకులు ఆందోళన బాటపట్టారు. పద్మావతి సంస్థకు వ్యతిరేకంగా రోజుల తరబడి దీక్షలు చేపట్టారు. అయితే ఆ సంస్థ అధినేత భాస్కర్‌నాయుడుకి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో దగ్గర సంబంధాలు ఉండడంతో అధికారులెవరూ నోరెత్తలేదు. ఒకప్పుడు టీటీడీకి సంబంధించిన కాటేజీల్లో పలు సంస్థలు పారిశుధ్య పనులు నిర్వహించేవి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం భాస్కర్‌నాయుడు సంస్థ ఆక్రమించింది. నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే భాస్కర్‌నాయుడుకి టీటీడీ అధికారులు అనుకూలంగా వ్యవహరించారని కారి్మకులు చెబుతున్నారు. వందల కోట్ల కాంట్రాక్టులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను భాస్కర్‌నాయుడు దక్కించుకున్నారు. వంద మంది చేయాల్సిన పనిని కేవలం 50 మందితో చేయించి శ్రమదోపిడీకి పాల్పడేవారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కార్మికులు తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భాస్కర్‌నాయుడి అవినీతినిపై ఫిర్యాదు చేశారు. కారి్మకుల ఇబ్బందులను తెలుసుకున్న వైఎస్ జగన్ చలించిపోయారు. నాడు వారికి ఇచ్చిన హామీని నేడు నేరవేర్చారు. ఔట్సోర్సింగ్ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రారంభించారు. -
ఈ జీతంతో బతికేదెలా..? బతుకు బండికి బ్రేక్..
చెన్నై : ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్రస్ధాయికి చేరుకుంది. కార్లు, బైక్‌లతో పాటు కమర్షియల్ వాహన విక్రయాలు పడిపోవడంతో ఆటోమొబైల్ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మారుతి సుజుకి ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేయగా, ఆటో దిగ్గజం అశోక్ లేలాండ్ ఈ నెలలో 5 నుంచి 18 రోజుల పాటు ప్లాంట్ల మూసివేతతో ఉత్పత్తిలో కోత విధించింది. అశోక్ లేలాండ్ నిర్ణయంతో ఆయా ప్లాంట్లలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. కంపెనీ నిర్ణయంతో సెప్టెంబర్‌లో తనకు రూ 13,000 రావాల్సి ఉండగా కేవలం రూ 4000 మాత్రమే చేతికి అందుతాయని చెన్నైలోని ఎన్నోర్ ప్లాంట్‌లో పనిచేసే మురళి అనే కాంట్రాక్టు కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం తన ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతాయని చెప్పుకొచ్చాడు. జీతం డబ్బుల్లో కోత పడుతుండటంతో తన పది నెలల చిన్నారితో పాటు తన భార్యను ఆమె పుట్టింటికి పంపానని తనకు పూర్తి జీతం రూ 13,000 వచ్చినా తాను కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నానని, ఆ జీతంలోనూ కోతపడితే తాను ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. చెన్నై ప్లాంట్‌లోనే మురళి వంటి కాంట్రాక్టు కార్మికులు మూడు వేల మంది వరకూ పనిచేస్తున్నారు. వీరంతా నో వర్క్..నో వేజెస్ ప్రాతిపదికనే పనుల్లో కొనసాగుతున్నారు. ఈ జీతంతో బతికేదెలా..? శాశ్వత ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధిస్తున్నారని..అలవెన్సులు, ఇన్సెంటివ్ల్లోనూ కోత పెట్టేందుకు కంపెనీ సన్నద్ధమవుతోందని సురేష్ అనే మరో ఉద్యోగి వాపోయారు. తనకు స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారని, నెలవారీ బడ్జెట్లో భారీ కోత పడితే ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రోజుకు రెండు పాల ప్యాకెట్లకు బదులు ఒక ప్యాకెట్‌తోనే సర్ధుకుంటున్నామని, గతంలో వారానికి రెండు సార్లు మాంసాహారం తీసుకునేవాళ్లమని, ఇప్పుడు ఒకసారికే పరిమితమవుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ నెలలో తమకు కేవలం ఎనిమిది రోజులే పని ఉందని, 16 రోజులు సెలవలు ఇచ్చారని వచ్చే నెల అంటేనే తాము భయపడుతున్నామని ఆవేదన చెందారు. పరిహారం ప్రకటించాలి పనిలేక పస్తులుంటున్న కార్మికులకు పరిహారం ప్రకటించి ఆదుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామన్ అశోక్ లేలాండ్‌ను కోరారు. గత ఏడాది కంపెనీకి రూ 1983 కోట్ల లాభం వచ్చిందని..ఇక సంక్షోభం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కంపెనీ తమ కోసం, తమ వాటాదారుల కోసం లాభాలు దండుకోవాలని చూస్తూ కార్మికుల ప్రయోజనాలను గాలికివదిలేసిందని మండిపడ్డారు. మరోవైపు అశోక్ లేలాండ్ వాహన విక్రయాలు సగానికి పైగా పతనమయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో 16,628 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఆగస్ట్‌లో వాహన విక్రయాలు 50 శాతం పడిపోయి కేవలం 8,296 యూనిట్లకు పరిమితమయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, భారత్ సిక్స్ ప్రమాణాలకు మారడం, ఎలక్ర్టానిక్ వాహనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. ఆటోమొబైల్ పరిశ్రమపై విధించే 28 శాతం జీఎస్టీని తగ్గించాలని, ఎలాంటి నియంత్రణలు లేకుండా వాహన రుణాలను విరివిగా మంజూరు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. -
విద్యుత్ కార్మికులపై ఉక్కుపాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ‘చలో అమరావతి’ కార్యక్రమం చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్, పీస్ రేట్ రద్దు, విద్యుత్సంస్థలో కార్మికులను విలీనం చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చలో అమరావతి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు. తొలుత ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లకు పైబడి విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా మగ్గుతున్నామని, తమ బాధలు ఆలకించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ వద్దకు ప్రభుత్వ ప్రతినిధులు గానీ, యాజమాన్యం గానీ వచ్చి డిమాండ్లు పరిష్కరిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు ధర్నాచౌక్ నుంచి అమరావతి వెళ్లేందుకు రోడ్డెక్కారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల చర్యను అడ్డుకున్నారు. వారిని రోడ్లపై పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో విసిరేశారు. ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన దూరప్రాంతాల వారిని సైతం వెంటపడి లాక్కొచ్చి వాహనాల్లోకి ఎక్కించారు. ఆ సమయంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్మికులు చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికులను అరెస్టు చేసి ఉయ్యూరు, పమిడిముక్కల, నున్న పోలీస్స్టేషన్లకు తరలించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక చైర్మన్ బాలకాశి మాట్లాడుతూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే పోలీసులతో అరెస్టు చేయించారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక వైస్ చైర్మన్ స్వతంత్రకుమార్, సెక్రటరీ జనరల్ మల్లికార్జునరెడ్డి, కన్వీనర్ వి.గంగయ్య, కట్టా నాగరాజు, కె.నారాయణరెడ్డి, 13 జిల్లాల కార్మికులు పాల్గొన్నారు. -
యుద్ధభూమిని తలపించిన ‘ధార్మిక స్థలం’
తిరుపతి అర్బన్: తిరుమల–తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పనిచేస్తున్న 14,370 మంది కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో టీటీడీ పరిపాలనా భవనం ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షల స్థలం మంగళవారం యుద్ధభూమిని తలపించింది. నాలుగు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న దీక్షా స్థలం పరిసరాల్లోకి అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో పోలీసు అధికారుల జీపులు, ప్రత్యేక బలగాలు, పోలీసు బస్సులు చేరుకోవడంతో నగర వాసులు, టీటీడీ ఉద్యోగులు, అటు వెళ్తున్న భక్తులు ఆందోళన చెందారు. తాము నాలుగు రోజులుగా శాంతియుత నిరాహార దీక్షలు చేస్తున్నా ధార్మిక సంస్థ పాలకులు కనీసం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి సన్నద్ధమయ్యాయి. దీంతో అధికార పార్టీ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో నగరంలోని అలిపిరి, ఈస్ట్. వెస్ట్ పోలీస్ స్టేషన్ల పోలీసు వాహనాలతో భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ముందుగా అటు వరదరాజనగర్ పెట్రోల్ బంక్ వద్ద, ఇటు భవానీనగర్ సిగ్నల్స్ వద్ద రోడ్డును పూర్తిగా దిగ్బంధం చేయించి దీక్షా స్థలం వద్దకు పోలీసులు చేరుకోవడం గమనార్హం! దీక్షను భగ్నం చేయాలని వారు యత్నించడంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రతిఘటించారు. మరోవైపు పోలీసులు కార్మిక సంఘాల నాయకులు, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా వాహనాల్లోకి, జీపుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అయినా కార్మికులు వెనుకంజ చేయకుండా శాంతియుత దీక్షలను కొనసాగించేందుకే పూనుకోవడంతో పోలీసులు, అదనపు బలగాలు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి స్త్రీ, పురుషులు అని చూడకుండా కార్మికులందరినీ వాహనాల్లోకి ఎక్కించారు. ఒక దశలో మహిళా కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినాగానీ వాటిని లెక్కచేయని పోలీసులు కార్మికులను పోలీసుస్టేషన్లకు తరలించడమే లక్ష్యంగా వారితో దుర్మార్గంగా వ్యవహరించారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. పోలీసులు, ప్రత్యేక బలగాలు చేరుకోవడంతోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 మందికి పైగా కార్మికులు, కార్మిక నేతలు అరెస్ట్ ఉదయం 9 గంటల నుంచే కార్మికుల దీక్షా శిబిరానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నగర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నారాయణబాబు, హాకర్స్ సంఘం కార్యదర్శి బుజ్జి, టీటీడీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, గోపీనా«థ్, రజని, బీసీ సంఘం రాష్ట్రనేత ఆల్మెన్రాజు, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు చేరుకున్నారు. ముందుగా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో సానుకూల ప్రకటన రానిపక్షంలో తదుపరి చేయాల్సిన కార్యాచరణపై చర్చించుకుంటున్న సమయంలో పోలీసులు, అదనపు బలగాలు ఒక్కసారిగా చేరుకుని అరెస్టులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో వామపక్షాల నేతలు, కార్మిక సంఘాల ముఖ్య నాయకులే కాకుండా టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల్లో చాలామందిని కలిపి సుమారు 60 మందిని వరకు అరెస్ట్ చేసి అలిపిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్ వద్ద కూడా కార్మికులు తమ ఆందోళనపథం వీడలేదు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్మికుల ప్రధాన డిమాండ్‌లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న రూ.6500 వేతనాలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు రూ.12,500కు పెంచాలని శాంతియుత దీక్షలతో టీటీడీ అధికారులకు తెలిపే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేసి భయానికి గురిచేయడం దారుణమని నిరసించారు. పోలీసులతో కార్మికుల ఉద్యమాలను అణిచివేయాలని యత్నిస్తే ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
పర్మినెంట్‌కు పంగనామాలు!
టీటీడీ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ. అలాంటి ఆధ్యాత్మిక సంస్థలో పర్మినెంట్ పోస్టుల భర్తీ ఇక తీరని కలేనా.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందే మేలని టీటీడీ భావిస్తోందా? ధార్మిక సంస్థ తీరు తెన్నులు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. టీటీడీ పరిధి పెరుగుతున్నా పదేళ్లుగా భర్తీకాని పోస్టులు, పెరుగుతున్న కాంట్రాక్టు కార్మికులు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు సంస్థ ఆదాయ, వ్యయాల మధ్య లోటును తగ్గించడానికి టీటీడీ ఆర్థిక శాఖాధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. తిరుమల: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 1933లోనే అప్పటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటుచేసిన వ్యవస్థ టీటీడీ. 1999లోనే టీటీడీ శాశ్వత ఉద్యోగులు 16 వేలకుపైనే. అప్పట్లో శ్రీవారి దర్శనార్థం నిత్యం విచ్చేసే భక్తులు 15 వేలు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య 70 నుంచి 80 వేలకు చేరుకుంది. సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష పైగానే. రద్దీకి అనుగుణంగా శాశ్వత ఉద్యోగులు పెరగాల్సి ఉండగా, టీటీడీలో భిన్నంగా తగ్గిపోతూ వస్తోంది. పర్మినెంట్ పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుంటున్నారు. వాస్తవానికి ఏ సంస్థలోనైనా శాశ్వత ఉద్యోగుల సంఖ్యతో పోల్చితే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఖ్య 30 శాతం మించకూడదు. కానీ టీటీడీలో మాత్రం శాశ్వత ఉద్యోగులు దాదాపుగా 7 వేలకు పడిపోతే, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఖ్య 15 వేలు దాటేసింది. లోటు బడ్జెట్ కారణంతోనేనా..? టీటీడీలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వైపు పరుగులు తీయడానికి టీటీడీ ఆర్థిక పరిస్థితే కారణంలా కనిపిస్తోంది. ఘనంగా రూ.2,950 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టినా వాస్తవానికి టీటీడీ లోటు బడ్జెట్లో ఉంది. శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకులను కార్పస్ ఫండ్‌గా పేర్కొన్న టీటీడీ వాటిని మొత్తంగా ఫిక్స్డ్ డిపాజిట్స్‌గా వేయాలి. నిబంధనలు మేరకు కనీసం 60 శాతం నిధులను తప్పనిసరిగా ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేయలి. కానీ గత రెండేళ్లుగా టీటీడీ ఫిక్స్డ్ æడిపాజిట్లలో కోత పెడుతోంది. 2016–17కి గాను రూ.757 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా రూ.475 కోట్లు మాత్రమే చేసింది. 2017–18కి గాను రూ.533 కోట్లను అంచనాల్లో చూపించగా రూ.268 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. ఇక ఈ ఏడాది అంచనాల్లో రూ.200 కోట్లు మాత్రమే చూపించింది. టీటీడీ గత అనుభవాలతో చూస్తే ఈ ఏడాది అసలు ఒక్క రూపాయి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం లేదు. టీటీడీకి సంబంధిం చి ప్రధాన ఆదాయ వనరులు హుండీ కానుకల ఆదాయం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆ రెండు కలిపితేనే దాదాపుగా రూ.1900 కోట్ల వరకు చేరుకుంటుంది. హుండీ ఆదాయం దాదాపుగా గత మూడేళ్లుగా ఇంచుమించు రూ.1100 కోట్లు మాత్రమే లభిస్తోంది. అటు తర్వాత ప్రధాన ఆదాయంగా వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని బ్యాంకులు తగ్గించడంతో ఇప్పటికే రూ.800 కోట్ల్ల వరకు వస్తున్న వడ్డీ ఇప్పుడు రూ.750 కోట్లకు తగ్గిపోయింది. ఇక టీటీడీలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు చెల్లించే జీతభత్యాలు రూ.900 కోట్లకు చేరుకున్నాయి. ఇలా టీటీడీ వ్యయం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఆదాయం, వ్యయాల మధ్య లోటు ఏర్పడుతోంది. దీంతో టీటీడీ ఆర్థిక శాఖాధికారులు టీటీడీలో శాశ్వత ఉద్యోగుల కంటే కాంట్రా క్ట్ ఉద్యోగులే ముద్దు అన్నట్టుగా అడుగులు వేస్తున్నారు. టీటీడీలోని 7వేల మంది ఉద్యోగులకు రూ.300 కోట్లు, పెన్షన్‌దారుల కోసం మరో రూ.300 కోట్లు వెచ్చిస్తుండగా, 13 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.215 కోట్లు మాత్రమే చెల్లించి టీటీడీ చేతులు దులుపుకుంటోంది. పరిధి పెరుగుతున్నా భర్తీ కాని పోస్టులు కొన్నేళ్లుగా టీటీడీ పరిధిలో భర్తీకాని పోస్టుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ధర్మప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ నూతనంగా ఆలయాలను నిర్మిస్తోంది. ఇప్పటికే కురుక్షేత్రం, కన్యాకుమారిలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయాలను ప్రారంభించగా, మార్చిలో హైదరాబాద్‌లో ఆలయాన్ని ప్రారంభించనుంది. దీంతో పాటు అమరావతి, భువనేశ్వర్, వైజాగ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా టీటీడీ శరవేగంగా శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. ఇలా రోజురోజుకు టీటీడీ పరిధి పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఉద్యోగుల భర్తీపై మాత్రం టీటీడీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. పెరుగుతున్న పని భారం గత పదేళ్ల నుంచి పైగా టీటీడీలో ఉద్యోగుల భర్తీని చేపట్టకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం అధికమవుతోంది. ప్రతి నెలా ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో పనిభారం పెరుగుతోంది. దీంతో కొంతమంది ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టుపరం చేస్తే ఊరుకోం తరతరాలుగా కొనసాగుతున్న హిందూధార్మిక సంస్థ టీటీడీలో కొన్ని విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని చూస్తే ఒప్పుకోం. ఇప్పటికే దేశంలో అనేక ప్రభు త్వ రంగసంస్థలు ప్రైవేటు పరం కావడంతో ఇటు ఉద్యోగులకు, అటు ప్రజలకు సౌకర్యాలు పెరగకపోగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ధార్మిక విలువలు తెలిసిన టీటీడీ వ్యవస్థలో కీలకమైన విభాగాలను కాంట్రాక్టు పరం చేస్తే ధార్మికతకు విలువుండదు. – గోల్కొండ వెంకటేశం, టీటీడీ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరీ ఉద్యోగుల వ్యతిరేక చర్య 80 ఏళ్ల సుదీర్ఘ ధార్మిక చరిత్ర కలిగిన టీటీడీలోని కొన్ని విభాగాలను కాంట్రాక్టు సిబ్బందితో నింపాలనుకోవడం ఉద్యోగుల వ్యతిరేక చర్యలో భాగం. ఇప్పటికే ఉద్యోగులు పని ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ధార్మిక సంస్థ నిబంధనలతో సేవలను కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ పెరిగితే ఉద్యోగులు పనిచేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. – చీర్ల కిరణ్, టీటీడీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తాం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముందుగా కాంట్రాక్టు కార్మికులందరిని పర్మినెంట్ చేసి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు– 2018ను ఉపసంహరించాలంటూ 1104 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అ«ధ్యక్షడు జగదీశ్వర్ చేస్తున్న నిరాహార దీక్షను సందర్శించి జగదీశ్వర్‌కు నిమ్మరసం ఇచ్చి సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డిలు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ బుధవారం సాయంత్రం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ కార్మిక సోదరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చూస్తే చాలా బాధాకరమన్నారు. నాలుగేళ్లుగా జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో ఔట్ సోర్సింగ్ బాధితులు చాలా ఎక్కువగా కన్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సీఎం రమేష్ నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 600 మెగావాట్ల యూనిట్‌ను పెంచిన వ్యక్తి వైఎస్సారే అని యువతకు ఉపాధి కల్పించారన్నారు. ఈ రోజు ఆ యూనిట్లను రన్ కాకుండా నిలుపుదల చేసే పరిస్థితి ఉందన్నారు. 600 మెగావాట్లను రన్ కాకుండా చేస్తున్నారని చెప్పారు. జిల్లా వాసి అయిన సీఎండీ ఈ ప్రాంత వాసులను అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బినామీగా సీఎం రమేష్, నారా లోకేష్ ద్వారా బొగ్గులో కుంభకోణం జరిగిందన్నారు. ఉక్కు పరిశ్రమ వస్తే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం టీడీపీ ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్ అవినీతిమయం అయిందని తెలిపారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాగానే ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు పనిచేసేలా బాధ్యత తీసుకుంటామన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఉచిత హామీలను ఇచ్చి మోసం చేశారన్నారు. కార్మికులకు సంపూర్ణ మద్దతు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రవేటీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను మూయించే ఆలోచనలో ఉందన్నారు. అందులో భాగంగానే గతంలో సీసీఐను ప్రవేటీకరణ చేసి ఎందరో ఉద్యోగులను, కార్మికులను రోడ్డున వేశారన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలను కూడా ప్రవేటీకరణ చేసి పెద్ద కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయని, అందుకే బిల్లు ఆమోదం పొందకుండా ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీపీపీని స్థానిక అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని చెప్పారు. బ్యాక్‌డౌన్ పేరుతో ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసి దానిని మనుగడను కాపాడిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు. అందుకే వైఎస్ జగనన్న సీఎం అయితే మన ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర అ««ధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌లు ప్రసంగించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
-
టీటీడీ ఉద్యోగుల సమస్యలపై..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు మీడియాకు వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికి 6 మంది సభ్యులతో కమిటీ నియమిస్తున్నట్టు తెలిపారు. టీటీడీలోకి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు 3 సంవత్సరాల తరువాత మాతృసంస్థకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే, ఒకే చోట 3 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని బోర్డు తెలిపింది. నవంబర్ 1 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించింది. పాలకమండలి భేటీ-ముఖ్య నిర్ణయాలు.. తిరుమలలోని వివిధ వసతి సముదాయాల ఆధునీకరణ కు 112 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం. టీటీడీలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులకు పరకామణి డిప్యుటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్ల పెంపుకు నిర్ణయం. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 120 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద 2వేల గదుల వసతి సముదాయ నిర్మాణనికి ఆమోదం. అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ టెండర్లకు ఆమోదం. -
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
-
వేతనాలు అడిగితే ఈడ్చేశారు
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘వేతనాలు పెంచండి మహాప్రభో’ అని నినదించిన కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. న్యాయమైన వేతనాల కోసం ఆందోళనబాట పట్టిన వారిపై పోలీసు జులుం ప్రదర్శించింది. వందలాదిమంది కార్మికులను పోలీసులు బలవంతంగా ఈడ్చేసి అరెస్టులు చేశారు. డిమాండ్ల సాధన కోసం ఓ కార్మికుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎక్కడికక్కడ అరెస్టులు వేతనాలు పెంపు ఇతరత్రా డిమాండ్లతో విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు కొన్ని నెలలుగా దశలవారీగా ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపట్టారు. అయితే విద్యుత్ సౌధకు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే మూసివేశారు. తనిఖీలు చేస్తూ విద్యుత్తు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో దాదాపు వెయ్యిమందిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 200 మందికిపైగా కార్మికులు వేరేమార్గంలో ఒక్కసారిగా గుణదల చేరుకుని విద్యుత్ సౌధను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చివేసి వాహనాల్లోకి ఎక్కించారు. కార్మికుల వెంటపడి మరీ లాఠీలతో కొడుతూ అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.గఫూర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జునరెడ్డి, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కల్లేపల్లి శైలజ తదితరులతోపాటు 200 మంది కార్మికులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇంతలో విజయ్ అనే కార్మికుడు విద్యుత్ సౌధ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు గంట తరువాత ఇద్దరు కానిస్టేబుళ్లు టవర్‌ఎక్కి ఆయన్ని ఒప్పించి కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, న్యాయమైన వేతనాలు కల్పించాలన్న తమ ఆందోళనను పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని కె.మల్లికార్జునరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాన్చుడు వైఖరి విడనాడి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అణచివేత వైఖరికి బెదిరేదిలేదని ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
దొందూ.. దొందే!
సాక్షి ప్రతినిధి కడప: వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వర్గీయులు సైతం నేతలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు. అధికారం కోసం ఛీ కొట్టిన పంచన చేరిన నేత ఒకరైతే. అవమానాలు భరిస్తూ నే అదే పార్టీలో కొనసాగుతోన్న నేత మరొకరు. పరస్పర విరుద్ధ వైఖరితో ఉన్న వారు కాంట్రాక్టు పనుల కోసం భాయి.. భాయి అంటూ పంపకాలు చేసుకున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతలకు పాల్పడుతోన్న వైనమిది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పరస్పర దాడులు చేసుకున్నారు. ఈక్రమంలో టీడీపీ పెద్దల జోక్యం అనివార్యమైంది. కాంట్రాక్టు పనులు పంపకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు మున్సిపాలిటీలో డ్రైనేజీ, సీసీరోడ్లు, పైప్‌లైన్ మరమ్మత్తుల పేరుతో14 పనులకు టెండర్లకు పిలిచారు. రూ.1.56కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇరువర్గాలకు పంపకాలు చేశారు. ఆమేరకు శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో ఓవర్గం, ఎం.బాలపుల్లారెడ్డి పేరుతో మరో వర్గం ముందస్తుగా నిర్ణయించుకున్న పనులకు సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లును ఆమోదించేందుకు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చా లేకుండానే సమావేశానికి ముగింపు పలికారు. శ్రీనివాస ఇన్ప్రాస్టక్చర్ రూ.79 లక్షలు, ఎం.బాలపుల్లారెడ్డి రూ.77 లక్షల విలువ గల పనులకు మున్సిపల్ కౌన్సిల్ అమోదం తెలిపింది. వర్గాలు వేరైనా విరుద్ధభావాలు వ్యక్తమైనా కాంట్రాక్టు పనులు కోసం ఏకం అవుతోన్న ఆ ఇరువురు నేతలు మరోవైపు గ్రామస్థాయిలో ఆధిపత్యం కోసం ఆరాటం ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలోనే చిన్నకొమెర్ల ఘటన ఇటీవల తెరపైకి వచ్చింది. అదే కోవలోనే చిన్నదుద్యాల, పెద్దదండ్లూరు, శిరిగేపల్లె, కొండాపురం ఘటనలు తలెత్తాయి. ఆదాయం కోసం అంతర్గత ఒప్పందాల మేరకు పనులు పంచుకోనే నేతలు, గ్రామాలల్లో ఘర్షణలను కూడా నియంత్రించాల్సిన నైతిక బాధ్యత ఉందని పలువురు అభిప్రాయ పడుతుండటం విశేషం. -
కాంట్రాక్ట్ కార్మికులందరికీ బోనస్ చెల్లించాలి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు చెందిన భూగర్భ గనుల్లో టన్నెల్, బెల్ట్ క్లీనింగ్, రూఫ్ బోల్టింగ్ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ 2018 ఏప్రిల్ నుంచి 8.33 శాతం బోనస్ చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు యర్ర గాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే-7షాఫ్ట్, పీవీకే-5బీలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రొడక్షన్ సైడ్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టరు చెల్లించటంలేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ కార్మికుల శ్రమను దోచుకుంటుంటే గని అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మి కులు ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె కిరణ్, బాలకృష్ణ, మోహన్, సురేష్, సత్యనారాయణ, విజయ్, కిరణ్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారు
-
‘పచ్చచొక్కా వేసుకుంటేనే ఉద్యోగాలా?’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేత గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారని గౌతమ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పచ్చ చొక్కాలు వేసుకుంటేనే ఉద్యోగాలు ఇస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచమంటే నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్‌కు వ్యతిరేకంగా వరుసగా జరిగిన హింసాత్మక ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. కడలూర్ జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సోమవారం పలువురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అధికారుల తీరుకు నిరసనగా 25 మంది కార్మికులు మూకుమ్మడిగా నీళ్లలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తారనే భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు
గోదావరిఖని: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణిలో షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మారు పేర్లతో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. గని కార్మికులకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అవకాశం ఉన్నా కొత్త గనులను ప్రారంభించడంలో ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. సంస్థ సీఎండీ శ్రీధర్ టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై విచారణ జరిపించి బ్లాక్ లిస్టులో పెడతామని ఉత్తమ్ తెలిపారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులను సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో కాకుండా సీఎం, కేటీఆర్, ఈటల రాజేందర్ నియోజకవర్గాలలో ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జైపూర్ విద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు పర్మనెంట్ ఉద్యోగులను నియమించలేదని పేర్కొన్నారు. సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. 300 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటు వారికి ఇవ్వడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు అసలే లేరని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం చెప్పారని, కానీ.. 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారందరినీ పర్మనెంట్ చేస్తా మని ఉత్తమ్ హామీ ఇచ్చారు. డిస్మిస్ అయిన కార్మికులను కూడా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులకు బెదరొద్దు
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం నుంచి, కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, అయినా బెదరవద్దని వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌భవన్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని మరిచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల పట్ల సానుకూలంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎటువంటి పురోగతిలేదన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే అందరికీ ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్న కార్మికులపై యాజమాన్యం కర్కశంగా ప్రవర్తిస్తే తాము వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పీస్‌రేట్ రద్దు, క్రమబద్ధీకరణ వంటి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి చెప్పేది చేయడన్న అపవాదును తొలగించుకోవాలని తెలిపారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు పతంజలి, కృష్ణ, జీవీ శివయ్య, శరత్, సుమన్, బాబు, ఇంతియాజ్, సంజయ్‌లతోపాటు 1100 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు రైల్వే కార్మికుల వివరాల క్రోడీకరణ
న్యూఢిల్లీ: రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలు క్రోడీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది. హౌస్ కీపింగ్, క్లీనింగ్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్ తదితర సర్వీసుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యవస్థీకృత రంగ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కుల ఉల్లంఘనపైనా దీని ద్వారా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు జనరల్ కండీషన్స్ ఆఫ్ కాంట్రాక్టు (జీసీసీ) నిబంధనలు రూపొందించింది. ఆ ప్రకారం వంతెనలు, భవనాలు, గేజ్ మార్పిడి ప్రాజెక్టులు, ఇతర సేవలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్ల నియమాలను మార్చనుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వేకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల కోసం డిజిటల్ కాంట్రాక్టు లేబర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. కార్మికుల వ్యక్తిగత వివరాలు, పోలీస్ వెరిఫికేషన్, ఆరోగ్య బీమా, పీఎఫ్ రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు సమాచారం, పని వేళలు, జీతం, కార్మికుల బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. -
గట్టిగా మాట్లాడితే జీతాలు ఇప్పించను
అనకాపల్లి: ‘ఏయ్ ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు.. గట్టిగా మాట్లాడితే జీతాలిప్పించను’ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై మండిపడ్డారు. 42 నెలలుగా తమకు రావాల్సిన వేతన బకాయిల కోసం అడగడానికి వెళ్లిన కార్మికులపై మంత్రి విరుచుకుపడడంతో వా రు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సోమవారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగిన 59వ కిసాన్ మేళా సందర్భంగా ఈఘటన జరిగింది. ఈ మేళాకు మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక ఎక్కే ముందు కార్మికులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్మికులకు 42 నెలలుగా జీతాల్లేవని, ఇటీవల ఎన్ఎంఆర్ కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు తాము భరోసా ఇస్తామని చెప్పి ప్రసంగం ముగించారు. మంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటూ సీపీఎం నేత బాలకృష్ణ, ప్రజా రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ కనిశెట్టి సురేశ్‌బాబు, ఆమ్ఆద్మీ పార్టీ నేత కొణతాల హరనాథబాబులు నినాదాలు చేశారు. సమస్యలను ప్రస్తావిస్తానంటూనే మంత్రి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి తమ గురించి మాట్లాడతారని ఎదురుచూసిన ఎన్ఎంఆర్ కార్మికులు నిరాశ చెంది నినాదాలు చేశారు. స్పందించిన మంత్రి సోమిరెడ్డి ఎన్ఎంఆర్ కార్మిక నేత నర్సింగరావును పిలిచి ఏం అరుస్తున్నావ్ అని అడిగారు. తమ కష్టాల గురించి స్పందించలేదంటూ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేస్తూనే.. జీతాలను ఇప్పించాలని కోరారు. దీంతో గట్టిగా అరిస్తే జీతాలు రానీయకుండా చేస్తాననడంతో కార్మికులు అసంతృప్తికి గురయ్యారు. కార్మికులకు భరోసా ఇచ్చేలా మాట్లాడకుండా మంత్రి వ్యవహరించడం దారుణమని ప్రజా సంఘాల నేతలు అన్నారు. -
రోజువారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు.. నల్లధనంపై యుద్ధంలా ప్రకటించిన ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇస్తుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినా.... మరోవైపు చిన్న కార్మికులు చితికిపోయారు. నోట్ల రద్దు తర్వాత చేపట్టిన ఎన్నో అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అంతేకాక ప్రభుత్వం తాజాగా చేపట్టిన సొంత సర్వేలో కూడా ఈ విషయమే వెల్లడైంది. నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజువారీ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడంలో తీవ్ర ప్రతికూలం ఏర్పడిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ సొంత సర్వే ప్రకటించింది. అయితే సాధారణ ఉద్యోగాలు వృద్ధి చెందాయని లేబుర్ బ్యూరో నిర్వహించిన అధికారిక సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి కాలంలో మొత్తం ఉద్యోగాల సృష్టి 1,85,000 ఉందని బ్యూరో ఐదవ క్వార్టర్లీ రిపోర్టు పేర్కొంది. తయారీ, నిర్మాణ, వాణిజ్యం, రవాణా, నివాసం, రెస్టారెంట్లు, ఐటీ, విద్య, ఆరోగ్యం వంటి ఎనిమిది రంగాల్లో లేబర్ బ్యూరో సర్వే చేపట్టింది. మొత్తం 81 శాతం ఉద్యోగాలు ఈ రంగాలే కల్పిస్తున్నాయి. అయితే జనవరి-మార్చి కాలంలో మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులు 26వేలకు తగ్గారని, ముందటి క్వార్టర్లో ఈ సంఖ్య 1,24,000గా ఉందని తెలిపింది. అదేవిధంగా రోజువారీ కూలీ అందుకునే వర్కర్లు 2016-17 క్వార్టర్లో 53వేలకు పడిపోయారని పేర్కొంది. ముందటి క్వార్టర్లో ఈ ఉద్యోగులు కూడా 1,52,000గా ఉన్నారు. రెగ్యులర్ జాబ్స్ మాత్రం 1,97,000కు పెరిగినట్టు వెల్లడైంది. అధికారిక రంగంలో ఫుల్‌టైమ్ వర్కర్లకు వేతనాలు చెక్‌లు లేదా బ్యాంకు అకౌంట్లకు చెల్లిస్తారని, కానీ కాంట్రాక్ట్, రోజువారీ కూలీలకు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఐజీసీ ఇండియా సెంట్రల్ ప్రొగ్రామ్ దేశీయ డైరెక్టర్, గణాంకాల మాజీ అధికారి ప్రొనబ్ సేన్ తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్లలో తయారీ, వాణిజ్యం,ఐటీ రంగాల్లో ఉద్యోగాల సృష్టి తక్కువగా జరిగిందని, నిర్మాణం, రవాణా, విద్య, నివాసం రంగాల్లో ఉద్యోగాల కోత చూశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాల సృష్టి నెమ్మదించిందని చెప్పారు. -
పెద్దాయన బతికుంటే..
పెద్దాయన బతికుంటే మా బతుకులు ఇంకోలా ఉండేవని నిత్యం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుని పంచాయతీలో కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 897 పంచాయతీల్లో సుమారు 1,200 మంది పార్టుటైం జేఏబీసీలు, పంపు ఆపరేటర్లు, కాంట్రాక్టు ఆపరేటర్లు, స్వీపర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పాలకొల్లు అర్బన్: జిల్లాలోని పంచాయతీల్లో కాంట్రాక్టు, టెండర్, అవుట్ సోర్సింగ్ విధానంలో బిల్లు కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, గుమస్తా, ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్, ప్లంబర్‌గా వందలాది మంది పార్టుటైమ్ ఉద్యోగులుగా చేరినా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్ణీత సమయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్లు అయితే అర్ధరాత్రి.. అపరాత్రి లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. ఆ సమయంలో వీరికి ఏమైనా అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పాలకొల్లు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 మంది కాంట్రాక్టు కార్మికులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రెన్యువల్‌కు ఏటా తప్పని తిప్పలు ఆయా గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టులను కాంట్రాక్టు జిల్లా అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏటా అధికారులకు లంచం ఇస్తేగాని రెన్యువల్ చేయడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాది ఉద్యోగం కాంట్రాక్టు పొడిగించడానికి కనీసం రూ.1500 ఒక్కొక్కరి నుంచి డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు ముగుస్తుంది. తిరిగి ఏప్రిల్‌లో వీరి కాంట్రాక్టు ఉద్యోగం పొడిగించాలి. అయితే లంచం సొమ్ముల కోసం అధికారులు ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకూ తీవ్ర జాప్యం చేసి.. అప్పుడు ఉద్యోగ కాల పరిమితిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. వీరిలో 30 ఏళ్ల నుంచి అరకొర జీతం పొందుతూ కాలం వెళ్లదీస్తున్న కార్మికులు ఎందరో ఉన్నారు. పంచాయతీ ఆదాయంలో 30 శాతం మించకుండా సిబ్బంది జీతాలు ఖర్చు చేసే వెసులు బాటు లేకపోవడంతో ఒక్కొక్క కార్మికుడు సీనియార్టిని బట్టి రూ.6 వేల నుంచి రూ.9 వేల జీతం పొందుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణించినవారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని వీరంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్సార్ జీవించి ఉంటే .. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ను రాష్ట్రంలోని పంచాయతీ కాంట్రాక్టు కార్మికులంతా కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అర్హత, సీనియారిటీ ప్రకారం తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీనియారిటీ జాబితా రూపొందించాలని వైఎస్సార్ పంచాయతీ రాజ్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారని, ఆ వెంటనే రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆ పెద్దాయన మృత్యువాత పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మహానుభావుడే జీవించి ఉంటే మా ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యేవని చెబుతున్నారు. ఏ టేబుల్ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా.. 1983లో గోరింటాడ పంచాయతీలో రూ.3 జీతానికి చేరా. ఆ తరువాత సగం చెరువులో 1985లో రూ.6 జీతానికి కుదిరా. 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేశా. ఏటా ఉద్యోగ కాల పరిమితి పొడిగించుకోవడానికి తిప్పలు పడుతున్నా. రూ.1500 ఖర్చు చేస్తే గాని ఏడాది కాలానికి ఉద్యోగ కాల పరిమితి పొడిగించరు. నా ఉద్యోగ సేవా కాలంలో ఏ టేబుల్ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా. బెజవాడ వెంకటేశ్వరరావు, పార్టుటైమ్ జేఏబీసీ చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా.. పదేళ్ల నుంచి పార్టుటైమ్ బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తున్నా. పేరుకి పార్టుటైమ్ ఉద్యోగమే కానీ, పూర్తి సమయం దీనికే కేటాయిస్తున్నా. జీతం రూ.6 వేలు ఇస్తున్నారు. ఇరువురు సంతానం. కుటుంబ పోషణ భారంగా మారింది. వేరే ఏ పని చేసుకోలేక ఉద్యోగం రెగ్యులర్ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నా. టి.రాజేంద్రప్రసాద్, పార్టుటైమ్ బిల్లు కలెక్టర్ 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా.. ఐటీఐ చదివాను. 1998లో పైపులైన్ ఫిట్టర్‌గా విధుల్లో చేరా. 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా. రూ.650 జీతానికి చేరా. ప్రస్తుతం రూ.8 వేలు ఇస్తున్నారు. మూడు పంచాయతీలకు సంబంధించి రికార్డు వర్కు చేస్తున్నా. పనిభారమైంది. జీతం పెరగలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఆర్థిక ఇబ్బందులతో బతుకు బండి లాగుతున్నా. –శిల్పం దేవరాయులు, ఫైపులైన్ ఫిట్టర్ -
58 ఏళ్లు నిండితే ఔట్?
కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు ఎన్టీపీసీ నిర్ణయం? జ్యోతినగర్(రామగుండం): 58 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు ఎన్టీపీసీ (రామగుండం యూనిట్) సంస్థ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీపీసీలో పని చేస్తుండగా, జరిగిన ప్రమాదంలో గాయపడిన కాంట్రాక్టు కార్మికుడు సంపత్‌రావు (55) ఇటీవల మృతిచెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో కార్మికులు గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఆ తర్వాత చర్చల అనంతరం మృతుడి కుటంబానికి రూ.8.5 లక్షలు, రూ.40 వేలు, దహన సంస్కారాలకు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు కార్మికుడిగా నియమించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంస్థలో 58 ఏళ్లు నిండిన కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల చర్చలు విఫలం
హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి, కాంట్రాక్టు కార్మికుల జేఏసీకి మధ్య బుధవారం రీజినల్ లేబర్‌కమిషన్ కార్యాలయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చట్టబద్ధమైన హక్కుల కోసం కాంట్రాక్టు కార్మికుల జేఏసీ మంగళవారం సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె పిలుపుతో యాజమాన్యం బుధవారం జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. చర్చల్లో సింగరేణి డైరెక్టర్ పవిత్రన్ కుమార్, కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేతలు పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్, పీఎఫ్, హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని జేఏసీ నేతలు కోరగా, సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేస్తామని చర్చల్లో యాజమాన్యం తెలిపింది. సమస్యల పరిష్కరానికి నిర్ధిష్టమైన హామీలను యాజమాన్యం ఇవ్వకపోవడంతో సింగరేణి వ్యాప్తంగా సమ్మెను కొనసాగించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. చర్చల్లో బీఎంఎస్ నాయకుడు పులి రాజిరెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు సత్యనారాయణ, ఐఎఫ్టీయూ శంకర్, వెంకన్న, సీఐటీయూ మధు, ఐఎఫ్టీయూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర కార్యదర్శి యాకుబ్‌షావళి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
ఆదిలాబాద్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఉదయం సమ్మెకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి లోని రామకృష్ణ ఓపెన్ కాస్ట్లో పని చేసే కాంట్రాక్టు కార్మికులు విధులకు హాజరుకాలేదు. డాట్ కంపెనీ వారు విధులకు హాజరుకమ్మని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులు ససేమిరా అంటున్నారు. మందమర్రి పరిధిలో దాదాపు 25 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి జేకే ఓపెన్ కాస్ట్ ముందు కాంటాక్ట్ కార్మికులు బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని చెప్పారు. -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె సైరన్
హైదరాబాద్: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకు జరిపిన చర్చల్లో యాజమాన్యం పాల్గొనకపోవడంతో సింగరేణి కాంట్రాక్టు జేఏసీ నేతలు బుధ వారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మంగళవారం రీజనల్ లేబర్ కమిషన్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు జేఏసీకి, యాజమాన్యానికి జరగాల్సిన చర్చల్లో యాజమాన్యం పాల్గొనలేదు. సింగరేణి వ్యాప్తంగా 26 వేల మంది కాం ట్రాక్టు కార్మికులకు పీఎఫ్, బోనస్, హైపవర్ వేతనాలు యాజమాన్యం అమలు చేయట్లేదని జేఏసీ నేత సాదినేని వేంకటేశ్వరరావు పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఫిబ్రవరిలోనే సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహ రించటం సరికాదన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులందరూ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు జేఏసీ నేతలు బీఎంస్ రాజిరెడ్డి, సీఐటీయూ మధు, ఏఐటీయూసీ సత్యనారాయణ, దాసు, ఐఎఫ్టీయూ శంకర్, వెంకన్న, బీఎంఎస్ రాజు, ఉపేందర్ పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తలపెట్టిన సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. వారసత్వ ఉద్యోగాలపై ముగిసిన వాదనలు - ‘సింగరేణి’పై తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వా లన్న ప్రభుత్వ నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యంలో మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, అనారోగ్య కారణాలతో వైదొలిగే ఉద్యోగుల వారసులకు అవకాశాలు కల్పిస్తే ఇబ్బంది లేదని కోర్టుకు విన్నవించారు. అయితే వారసత్వ ఉద్యోగాల భర్తీకి అనారోగ్యాన్ని సాకుగా వాడుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షల మంది నిరుద్యోగ యువత నష్టపోతుందన్నారు. తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారి వారసులకు ఉద్యోగాలిస్తున్నామన్నారు. వైద్యపరంగా అనర్హులై విధులను నిర్వర్తించలేని వారి వారసుల కోసం ఈ నియామకాలు చేపట్టామన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పథకం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని, 1981 నుంచి అమల్లో ఉందని తెలిపారు. 30 వేల వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు పిటిషనర్ చెబుతున్నారని, అది అవాస్తవమని, కేవలం 5వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
సమస్యల పరిష్కారం కోసం కృషి
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గోదావరిఖని : కాంట్రాక్టు కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల జీవన ప్రమాణాలు పెరగాలని, ఇందుకోసం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశమైన సందర్భంలో రాష్ట్రంలో మూడు ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సమ్మతించగా...అందులో ఒకటి రామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుమతిచ్చారన్నారు. అయితే ఇందుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని అప్పగిస్తే రెండేళ్లలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అనువైన స్థలం కోసం పరిశీలన చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్టు కార్మికులందరికి ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ వర్తింపచేయాలని, ప్రమాద బీమా రావాలని సూచించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులందరు సంఘటితమై కలిసి పోరాటం చేస్తే హక్కులు సాధించుకోవచ్చన్నారు. కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అలవెన్స్ లు చెల్లించే విషయాన్ని ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. టీబీజీకేఎస్ నాయకులు ఎన్ .రామయ్య వై.సారంగపాణి, నూనె కొమురయ్య, ఆరెల్లి పోశం, పూర్మ సత్యనారాయణ, గుడి రమేష్‌రెడ్డి, లక్కాకుల లక్ష్మన్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు కందుకూరి రాజరత్నం, ఎండీ కరీం, ఎర్రగొల్ల కొమురయ్య, విజయ్‌కుమార్, సాహెబ్‌హుస్సేన్, బొమ్మ అంజయ్య, పోలుదాసరి నారాయణ, గుంపుల ఓదెలు, పిల్లి రమేష్ పాల్గొన్నారు. అంతకుముందు కాంట్రాక్టు కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం నాయకులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. -
హామీలను విస్మరించిన కేసీఆర్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భూపాలపల్లి: ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తమ్మినేని చేపట్టిన యాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడచినా ఆచరణలోకి రాలేదన్నారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని, నిరుపేద హరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలేక నానా తంటాలు పడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ఓపెన్ కాస్టు విధానం రద్దు చేస్తామని ప్రకటించి, తిరిగి బొందల గడ్డలుగా మార్చడానికి శ్రీకారం చుట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జాన్ వెస్లీ, ఎస్.రమ, ఎంవీ రమణ, ఎండీ.అబ్బాస్, ఆశయ్య, బందు సాయిలు, కంపేటి రాజయ్య, వెలిశెట్టి రాజయ్య, చక్రపాణి పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగి అన్న పదమే లేకుండా చేస్తామని, ప్రభుత్వం ఏర్పడగానే కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భూపాలపల్లిలోని కేటీపీఎస్‌లో పనిచేస్తున్న 750 మంది కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించకపోగా వారిని ఔట్సోర్సింగ్ కార్మికులుగా మార్చారన్నారు. కార్మిక చట్టాల ప్రకారం వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్లాంట్ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన బాధిత కుటుంబాలకు పునరావాస కాలనీలు నిర్మించి, కేంద్ర భూసేకరణ, 2013 ప్రకారం వారికి పరిహారమివ్వాలని విజ్ఞప్తిచేశారు. -
టీటీడీ చైర్మన్ ఇంటి ముట్టడి
తిరుపతి : టీటీడీ చైర్మన్ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. పద్మావతి నగర్‌లోని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. నెల జీతం పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం రూ.18 వేల జీతం ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్, నాయుడుపేటలో జరుగుతున్న సీఎం సభలో ఉన్నారు. దీంతో అక్కడివారు ఫోన్లో టీటీడీ చైర్మన్‌తో మాట్లాడించడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరట!
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన ► కాంట్రాక్టు కార్మికుల ఆందోళన ► పర్మినెంట్ ఆశలపై నీళ్లు గోదావరిఖని : సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల విషయంలో గురువారం శాసనసభలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన విధంగా స్పందించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు నైరాశ్యంలో పడ్డారు. సీఎం వైఖరిని కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఎండగడుతున్నాయి. సింగరేణిలో రోజురోజుకు కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 16 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో నిర్వహిస్తున్న ఓవర్‌బర్డెన్ (మట్టి తొలగింపు) పనుల్లో 10 వేల మంది, సివిక్, హౌస్ కీపింగ్‌లో నాలుగు వేల మంది, సివిల్ డిపార్ట్మెంట్లో ప్లంబర్, మేషన్ తదితర విధుల్లో 700 మంది, హర్టికల్చర్ విభాగంలో 600 మంది, లోడింగ్, అ¯ŒSలోడింగ్ విభాగంలో 800 మంది, రైల్వే సైడింగ్ మెయింటనెన్స్ లో 200 మంది, కోల్ ట్రాన్స్ పోర్టులో 500 మందితోపాటు పలు భూగర్భ గనుల్లో పర్మినెంట్ కార్మికులు చేసే రూఫ్‌బోల్టింగ్ çపనుల్లో, అన్వేషణ విభాగంలో, గనుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో, ఓసీపీల వద్ద బెల్ట్‌క్లీనింగ్ పనుల్లో కలిపి మొత్తం 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. యాజమాన్యమే ప్రిన్సిపుల్ ఎంప్లాయర్ సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ప్రిన్సిపుల్ ఎంప్లాయర్‌గా సింగరేణి యాజమాన్యమే వ్యవహరి స్తోంది. కాంట్రాక్టర్‌కు ఇచ్చే డబ్బులను నిలిపివేసి యాజమాన్యమే కాంట్రాక్టు కార్మికుల తరఫున సీఎంపీఎఫ్ చెల్లిస్తోంది. ఇలా చెల్లించగా మిగిలిన డబ్బులనే కాంట్రాక్టర్‌కు అందజేస్తుంది. ఇలా కాంట్రాక్ట్ కార్మికులతో యాజమాన్యం సత్సంబంధాలు కలిగి ఉంది. హైపర్ కమిటీ వేతనాలకు దిక్కులేదు కోల్ఇండియాలో జరిగిన జేబీసీసీఐ సమావేశంలో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కాట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కోల్ఇండియా పరిధిలోని బల్లార్షా, చాందాలలోని బొగ్గు గనుల్లో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల కింద రూ.18 వేల వేతనం, బోనస్, ఇతర అలవెన్స్ లు చెల్లిస్తున్నారు. అయితే ఇదే రకంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని పలువురు శాసనసభ్యులు ప్రభుత్వానికి విన్నవించగా...అసలు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని ముఖ్యమంత్రి పేర్కొనడంతో కాంట్రాక్టు కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను విస్మరించిన సీఎం : కార్మిక సంఘాలు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యులవుతూ కంపె నీ లాభాల్లోకి వెళ్లడానికి కృషి చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించ డం సరైంది కాదని కాంట్రాక్టు కార్మిక సంఘాలై న ఎస్సీసీడబ్ల్యూ, ఇప్టూ, ఏఐసీటీయూ, ఏఐఫ్టీయూ, డీఐటీయూ, టీన్ టీయూసీ, ఎస్‌ఓబీ సీడబ్ల్యూ నాయకులు కె.విశ్వనాథ్, ఎంఏ.గౌస్, జె.చంద్రయ్య, చిలుక ప్రసాద్, వెల్తురు సదానందం, దాసరి దుర్గయ్య, ఐ.రాజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కాం ట్రాక్టు కార్మికులను గుర్తించి ఒకటో క్యాటగిరీ వేతనాలను చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. -
నిమ్స్‌లో ‘చిల్లర’ మాయం!
రోగులు చెల్లించిన 10 లక్షలు మాయమైనట్లు సమాచారం హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చెల్లిస్తున్న చిన్న నోట్లు మాయమవుతున్నాయి. ఓ ఉన్నతాధికారి తన అధికారంతో అతనివద్ద ఉన్న పెద్ద నోట్లను క్యాష్ కౌంటర్ల లో ఉంచి.. రూ.100, రూ.50 నోట్లను పెద్ద మొత్తంలో తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తు న్నాయి. ఇలా ఇప్పటివరకూ రూ.10 లక్షల వరకు చిల్లర మాయమైనట్లు సమాచారం. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అవినీతి అధికారు లు వారి వద్ద ఉన్న దొంగ సొమ్మును ఎలా వైట్ చేసుకోవాలఅన్న ఆలోచనలో పడ్డారు. నిమ్స్‌లోని ఓ ఉన్నతాధికారి దీనికి ఆసుపత్రి నే వాడుకుంటూ తన సొత్తును వైట్ చేసుకుం టున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిమ్స్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి చేస్తున్నారు. ఉదయం పూట ఓపీకి రూ.50, చిన్న వైద్య పరీక్షలకు రూ.100,రూ.200 మాత్రమే అవుతుండడం, ఎక్కువమంది పేదలు ఆసుపత్రికి వస్తుం డడంతో రూ.500, రూ.వెరుు్య నోట్లకన్నా చిల్లరే ఎక్కువగా తీసుకువస్తారు. పెద్ద నోట్లు క్యాష్ కౌంటర్లో... క్యాష్ కౌంటర్లో ఉన్న చిల్లరను ఓ అధికారి తన వద్ద ఉన్న బ్లాక్‌మనీని ఆ స్థానంలో ఉంచి రూ.100, రూ.50 నోట్లను తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సుమారు రూ.10 లక్షల వరకూ ఉన్నట్టు సమాచారం. అలాగే కొంతమంది అధికారులు నిమ్స్‌లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు పెద్దమొత్తంలో నగదు ఇచ్చి వారి ఖాతాలో జమ చేసు కొమ్మని చెపుతున్నట్లు సమాచారం. కాంట్రా క్ట్ వర్కర్లు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది గట్టిగా ప్రశ్నించగా వారు అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది. -
కేంద్ర నిర్ణయాలతో కార్మికులకు మేలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వ్యవసాయేతర , నైపుణ్యం లేని, ‘సీ కేటగిరి’ ప్రాంతాల్లోని కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 246 నుంచి రూ.350కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్ణయం తీసుకున్న కేంద్రానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్లు, సరఫరా సంస్థల రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేయ డం కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులకు కనీస పింఛను రూ. వెయ్యికి పెంచడం ఆహ్వానించదగినదని, 11 లక్షల సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక గుర్తింపు పత్రాలు ఇవ్వడం వారికి మేలు చేసే నిర్ణయమన్నారు. ఇందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, బండారు దత్తాత్రేయకు ధన్యవాదాలు తెలిపారు. -
'కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన'
-
సీఎం ఇంటి వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్: నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం, నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం: ఎంపీ కవిత
హైదరాబాద్: కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే అడ్డుకుంటామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు కార్మికులకు స్థిర వేతనం కల్పించేందుకు చట్టం చేయబోతున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై వారి కనీస వేతనం పదివేల రూపాయలు గా ఉండేందుకు చట్టం రూపొందించామని చెప్పారు. దేశం మొత్తం కార్మికులకు ఒకే రకమైన వేతనం ఉండేలా చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఇందుకోసం కాంట్రాక్టు కార్మికుల చట్టంలో 25 మార్పులను చేయబోతున్నట్టు చెప్పారు. ఈ చట్టం రూపొందించే విషయంలో ప్రతిపక్షాలు సహకరించడం లేదని విమర్శించారు. పార్లమెంటు సరిగా పని చేయని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక చట్టమే మార్గమన్నారు. కేంద్ర న్యాయశాఖకు పరిశీలనకు ఫైలును పంపినట్టు తెలిపారు. ప్రతి కాంట్రాక్టర్ కార్మిక శాఖ దగ్గర తప్పకుండా రిజిష్ట్రేన్ చేయించుకోవాలని మంత్రి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల ఆధారంగా వేతనం, కరువు భత్యం(డీఏ) ఉండాలని సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈచట్టం అమల్లోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నలక్ష మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ వ్యాప్తంగా కోట్లమంది కార్మికులు లబ్ధి పొందుతారు. -
మేమెక్కడ పనిచెయ్యాలే?
► రాజన్న గుడి మెట్లపై కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ► కాంట్రాక్టర్‌తో ముగిసిన ఒప్పందం ► ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ ► అధికారుల హామీతో ఆందోళన విరమణ వేములవాడ : మేమంతా ఎక్కడ పనిచెయ్యూలంటూ రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం గుడి మెట్లపై ధర్నా చేశారు. ఏడాదిగా ఆలయంలో పనిచేస్తున్నామని, ఇప్పుడు కాంట్రాక్టర్ గడువు ముగియడంతో పని ఇవ్వలేనని పేర్కొన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి నేరుగా దేవస్థానమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా నాయకులు గుర్రం అశోక్ నిలిచారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 109 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయూలని కోరారు. నెల కు రూ.5,500 చెల్లిస్తున్న ఆలయ అధికారులు కార్మికులతో వెట్టిచాకిరీ చేరుుంచుకుంటున్నార న్నారు. రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వద్దకు ఏఈవో హరికిషన్, శానిటరీ అధికారి బుద్ధి భగవాన్, నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ చేరుకుని ఈవో రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. ముగిసిన ఒప్పందం ఆలయంలో వివిధ పనుల నిర్వహణ కు గతేడాది ఏప్రిల్ 1 నుంచి 2016, మార్చి 31 వరకు కార్మికుల సరఫరాకు సిరిసిల్లకు చెందిన అంబేద్కర్ మ్యూచువల్లీ ఏడెడ్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్ రాంచందర్ 109 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన ఆలయంలో పనులకు నియమించుకున్నారు. తన గడువు ముగుస్తుంద ని, రానున్న కాలంలో అనుభవం ఉన్న సొసైటీలకే అవకాశం ఇవ్వాలని ఫిబ్రవరి 15న ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ లిఖిత పూర్వకంగా విన్నవించారు. అరుుతే తనకు ఆలయం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి కార్మికులకు తనకు సంబంధం లేదని తెలిపినట్లు తెలిసింది. దేవస్థానమే నేరుగా చెల్లించాలి మేమెంత పని జెప్పినా వెనుకాడుత లేదు. దేవుని దగ్గరికి వచ్చే భక్తులకు వసతులు మంచిగా ఉండేలా చూస్తున్నం. కాంట్రాక్టు విధానం రద్దు చేసి మాకు దేవస్థానం సార్లే నేరుగా జీతాలు ఇవ్వాలి. - పెరిగె దేవమ్మ, కాంట్రాక్టు కార్మికురాలు -
మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా
279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
ప్రభుత్వం హామీ నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని నగర పంచాయతి కార్యలయ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నతమను ప్రభుత్వం మోసం చేసిందని.. వేతనాలను పెంచుతామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని మేయర్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ హామీ వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. -
అనుకున్నదానికన్నా ఎక్సెస్‌కు టెండర్లు
-
కాణిపాకంలో టవరెక్కిన ఆలయ మాజీ సిబ్బంది
కాణిపాకం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన సిబ్బంది గడువు ముగియడంతో సోమవారం వారిని విధుల నుంచి తొలగించారు. దాంతో మనస్థాపానికి గురైన వసంత్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆలయంలో పనిచేసేందుకు 126 మంది సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. వారి కాంట్రాక్టు గడువు మూడేళ్లు నిన్నటితో ముగియడంతో ఆలయ ఈవో పాత ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే తొలగించిన 126 మందిలో ఇద్దరు మంగళవారం ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. ఆందోళనకారులు ఆలయ ఈవోను ఘెరావ్ చేశారు. దీంతో ఆలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కొత్త ఏజెన్సీకి ఆలయ ఉభయదార్లు మద్దతు ప్రకటిస్తుండగా, కొత్త ఏజెన్సీవారికి బోర్డు సభ్యుల మద్దతు ఉంది. దాంతో సమస్య జటిలంగా మారింది. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరి సెల్ టవర్ ఎక్కినవారిని దిగమని విన్నవిస్తున్నారు. ఆందోళనకారులు దిగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
30 రోజుల పోరాటం
వేతనాలు పెంచాలంటూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో నేటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కార్మికులపై ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. నేటి నుంచి ఆమరణ దీక్షలు - నిరవధికంగా కొసాగుతున్న మున్సిపల్ సమ్మె - పట్టుబిగిస్తున్న ప్రభుత్వం.. వెనక్కి తగ్గని కార్మికులు.. - పనిచేసిన రోజులకు జీతం చెల్లించని బల్దియా సాక్షి, హన్మకొండ : వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో 2015 జులై 6వ తేదీ నుంచి మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లతో పాటు జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగరపంచాయతీల్లో మొత్తం 3,074 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా వీరిలో 2051 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఏకధాటిగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువవపోవడంతో అన్ని పురపాలక కార్యాలయ ఎదుట నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహారిస్తోంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకే వేతనాల పెంపును ప్రభుత్వం వర్తింప చేసింది. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పెంపుపై ప్రభుత్వం మౌన దాల్చింది. ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు మండిపడుతున్నారు. తమకు వేతనాలు పెంచే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా ఇప్పటికే వరంగల్ నగరంతోపాటు మిగిలిన మున్సిపాలిటీలు అపరిశుభ్రంగా మారాయి. ఫాగింగ్, గ్యాంగ్ వర్క్‌లు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. నేటి నుంచి ఆమరణ దీక్షలు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపంచాయతీలతో పోల్చితే గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మె తీవ్రత కొనసాగుతూనే ఉంది. సమ్మెను నీరుగార్చే లక్ష్యంతో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. చెత్త ఎత్తేందుకు 148 మంది దినసరి కూలీలను పనిలోకి తీసుకుంది. దానితోపాటే సమ్మెలో పాల్గొంటున్న 42 మంది కార్మికులపై వేటు వేశారు. దానితో క్రమంగా విధుల్లో చేరుతున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. అరుునప్పటికీ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 318 మంది కార్మికులు ఇప్పటికీ సమ్మెలో పాల్గొంటున్నా రు. క్రమంగా సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల సం ఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో నేటి నుంచి ఆమరణ దీక్షకు కార్మికులు సి ద్ధమవుతున్నారు. 2015 ఆగస్టు 6 ఉదయం 10:00 గంటల నుంచి గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష మొదలవనుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు కార్మికులు. జీతాలు ఇవ్వని బల్దియా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు ప్రతీనెల 25 నుంచి 25 వరకు ఉన్న పని దినాలను లెక్కించి తొలివారంలో వేతనం చెల్లిస్తారు. జు లై ఆరు నుంచి సమ్మె కొనసాగుతోంది. దానితో జు న్లో ఆరు, జులైలో ఐదు రోజులు కలిపి మొత్తం ప దకొండు రోజుల వేతనాన్ని కార్పొరేషన్ నుంచి కా ర్మికులకు చెల్లించాల్సి ఉంది. ఆగస్టు 1వ తేదీన కార్మికులకు బల్దియా వేతనాలు చెల్లించింది. అయితే కా ర్మికులందరికీ వేతనం ఇవ్వలేదు. ప్రస్తుతం బల్దియా పరిధిలో మొత్తం 2,983 మంది కార్మికులు ఉండగా కార్పొరేషన్ అధికారుల సూచన మేరకు వీరిలో 1,453 మంది కార్మికులు జులై 25 నుంచి విధుల్లోకి వస్తున్నారు. కేవలం తమ విజ్ఞప్తిని మన్నించిన 1,45 3 మంది కార్మికులకే 11 రోజుల వేతనాన్ని బల్దియా చెల్లించింది. మిగిలిన కార్మికులకు అసలు వేతనాలు చెల్లించలేదు. వేతనం పొందిన 1,453 మంది కార్మికులకు సైతం అన్ని మినహాయింపులు పోను సగటు న ఒక్కో కార్మికునికి రూ 1100 జీతమే చేతికి అం దింది. చాలీచాలనీ వేతనంతో కాంట్రాక్టు కార్మికు లు తాము ఇబ్బంది పడుతోంటే, కార్పోరేషన్ అధికార యంత్రాంగం అభద్రత వాతవరణం కల్పిస్తోం దంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రామన్‌పాడులో సమ్మె సైరన్
- నేటినుంచి పెండింగ్ జీతాల కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మికులు - శుక్రవారం అర్ధరాత్రి నుంచి మోటార్లు బంద్ - 130 గ్రామాలకు నిలిచిపోనున్న నీటి సరఫరా గోపాల్పేట : అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. పెండింగ్ జీతాల కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి పంప్‌హౌసుల్లో మోటార్లు బంద్ చేసి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో రామన్‌పాడు హెడ్‌వర్క్ నుంచి పూర్తి స్థాయిల్లో సరఫరా స్తంభించిపోయి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 130 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇటీవల పలుచోట్ల లీకేజీలు, పగిలిన చోట మరమతు పనులు పూర్తి చేసి గురువారం నుంచి సరఫరాను పునరుద్ధరించారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో 130 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రతరమైంది. 4 నెలల పెండింగ్ జీతాలు, పీఎఫ్ అమలు చేయాలని, లేకుంటే అగస్టు 1 నుంచి సమ్మె చేస్తామని ముందస్తుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు రామన్‌పాడు కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. రామన్‌పాడు మంచినీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులకు ఏప్రిల్ నుంచి జూలై వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఎఫ్ అమలు కావడంలేదు. గతంలో కార్మికుల జీతాలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మోటార్లు బంద్ చేసి పంప్‌హౌస్‌లకు తాళాలు వేసి ఆందోళనలకు దిగారు. ప్రతిసారి కార్మికులు ఆందోళనలు చేయడం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడడం.. ఆ తర్వాత గడువు ఇచ్చి జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇలా రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిరకం పైపులతో తరుచూ సరఫరాను నిలిపివేస్తుండడంతో దీనిపైనే ఆదారపడిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నిధులు మంజూరు కాలేదు జీతాల కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలుసు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి పథకాల మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల కాలేదు. కాబట్టి ఏప్రిల్ నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టర్‌ను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలి. -రాములుగౌడు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
విజయనగరంలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె
విజయనగరం: విజయనగరంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. మే నెలలో సమ్మె బకాయిలు చెల్లింపుతో పాటు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలో సమ్మె కొనసాగించాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమ్మెపై శనివారం చర్చలు జరిపిన అనంతరం ఏపీ ప్రభుత్వం శనివారం తీసుకున్న నిర్ణయంతో అక్కడి మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో భాగంగా కార్మికుల జీతం రూ. 11 వేలకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మున్సిపల్ కార్మిక సంఘాల 16 రోజుల సమ్మెకు తెరపడింది. దాంతో రేపటినుంచి కార్మిక సంఘాలు విధులకు హాజరుకానున్నారు. -
చెత్త ఫైటింగ్
కార్మికుల మధ్య తోపులాట నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పారిశుధ్య విధుల్లో డ్వాక్వా మహిళలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కార్మికుల మధ్య ‘చెత్త’ ఫైటింగ్ ఆరంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిపై విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలతో ఔట్సోర్సింగ్ సిబ్బంది వాదనకు దిగారు. మా పొట్టలు కొట్టొద్దంటూ విన్నపాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ససేమిరా అనడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి. కృష్ణలంక, లంబాడీపేట, కుమ్మరిపాలె ం, పాయకాపురం, పటమట ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మల్లికార్జునపేటలో కార్మికుల మధ్య వివాదం ముదరడంతో ప్రజారోగ్య శాఖాధికారులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్వాక్వా మహిళల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. ఫలిస్తున్న ప్రయత్నాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కమిషనర్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. డ్వాక్వా మహిళలు పారిశుధ్య విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్కిల్-1లో 102, 2-లో 130, 3-లో 60 మంది చొప్పున కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎన్సీసీ విద్యార్థులు వీధులను శుభ్రపరిచారు. కార్మిక సంఘాల అత్యవసర భేటీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు సాగించడంపై ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రెస్‌క్లబ్‌లో అత్యవసర భేటీ నిర్వహించారు. సమ్మె సెగను మరింత రగిలించాలని నిర్ణయించారు. గురువారం నుంచి నగరంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 17న సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటన్నారు. పోలీసు కేసులకు వెరచేది లేదని స్పష్టం చేశారు. -
‘ఉపాధి’ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
హన్మకొండ అర్బన్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన ఆందోళనలో పలువురు ఆత్మహత్యకు యత్నించారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధి హామీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన సోమవారం 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు. పెట్రోల్ బాటిళ్లతో కలెక్టరేట్ భవనం పెకైక్కి ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు ఉద్యోగులను కిందకు తీసుకువచ్చారు. ఆందోళనలో నాగేశ్, మేకల రవి, సుజన, సుప్పజ, సతీష్, సర్వేశ్వర్ పాల్గొన్నారు. -
ఎటు చూసినా చెత్తే!
-
ఎటు చూసినా చెత్తే!
* కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం * పరిష్కారంపై దృష్టిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం * ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్తాచెదారం * ఐదు రోజులుగా కుళ్లి దుర్గంధం.. వెలువడుతున్న విష వాయువులు * పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు * వర్షాలు పడితే అంటురోగాలు ప్రబలే ప్రమాదం * అరకొర రెగ్యులర్ కార్మికులపైనే భారం * సమ్మె విరమించినా.. ‘చెత్త’ పోవాలంటే వారం పట్టే అవకాశం జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కాంట్రాక్టు కార్మికులు (సుమారుగా): 26,000మంది ఒకరోజులో తరలించే వ్యర్థాలు: 3,800 టన్నులు రోజులో ఊడ్చే రహదారుల పొడవు: 8,000 కి.మీ. రోజులో శుభ్రం చేసే కాల్వల పొడవు: 749 కి.మీ. సాక్షి, హైదరాబాద్: ప్రధాన రహదారుల నుంచి వీధుల చివరిదాకా ఎక్కడ చూసినా చెత్త.. పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురికినీరు.. ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం, విష వాయువులు.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంస్థల్లో పరిస్థితి ఇది. కుళ్లిపోతున్న వ్యర్థాలతో కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి. వీధులన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంస్థల కార్మికుల సమ్మెతో ఏర్పడిన పరిస్థితి ఇది. వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం వారు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా.. పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కార్మిక నేతలతో మంత్రులు ఈటల, నాయిని చర్చించినా.. ఎవరూ ఒక మెట్టుకూడా దిగిరాకపోవడంతో ఫలితం శూన్యం. మరోవైపు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండడంతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చెత్త తరలింపునుకు అధికారులు చేస్తున్న యత్నాలేవీ ఫలించడం లేదు. దాదాపు 40 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉండగా.. అరకొర సంఖ్యలో ఉన్న రెగ్యులర్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే ప్రతిష్టంభన.. కనీస వేతనాల పెంపుతో పాటు 16 డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగినప్పటికీ.. ప్రధానంగా వేతన పెంపుపైనే ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో రూ.8,500, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 కనీస వేతనం చెల్లిస్తున్నారు. అయితే ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్మెంట్తో 10వ పీఆర్సీని తమకు కూడా వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలను పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170కి, ఇతర కార్మికులకు రూ.17,380కి పెంచాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక నేతలతో సోమ, మంగళ, బుధవారాల్లో మంత్రులు ఈటల, నాయిని జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గురువారమైతే చర్చల కోసం ప్రభుత్వం నుంచి కార్మిక నేతలకు పిలుపే రాలేదు. వ్యర్థాల తరలింపు కష్టమే! ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజూ 3,800 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా.. మిగతా 67 నగర, పురపాలికల్లో మరో 2,000 టన్నుల చెత్త వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోజుకు దాదాపు 6,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమ్మె కారణంగా నాలుగు రోజులుగా పారిశుద్ధ్య పనులు 90 శాతం నిలిచిపోవడంతో... రాష్ట్రవ్యాప్తంగా 20 వేల టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్మికులు సమ్మె విరమించినా.. ఈ వ్యర్థాలను తొలగించేందుకు వారంపైనే పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిభారంతో సతమతం ఆరు వేల టన్నుల వ్యర్థాల తరలింపు, 15వేల కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్లు, వీధులను ఊడ్చడం, 10 వేల కిలోమీటర్ల పొడవున్న మురికి కాల్వలను శుభ్రం చేయడం... ఇదంతా కేవలం 40 వేల మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చేస్తున్న పని. ఒక్కో కార్మికుడు ముగ్గురు, నలుగురి పని చేస్తున్నారు. అసలు వీరి సేవలను వేతనాలతో పోల్చడం సాధ్యం కాదు కూడా. ప్రస్తుతం ఈ కార్మికులకు అరకొర వేతనాలే అందుతున్నాయి. అందులోనూ ఈఎస్ఐ, పీఎఫ్‌ల పేరిట మినహాయించుకున్న కోట్ల రూపాయలను లేబర్ కాంట్రాక్టర్లు, అధికారులు స్వాహా చేసేశారు. జబ్బు చేస్తే ఈఎస్ఐ సదుపాయం సైతం అందడం లేదని కార్మికులు వాపోతుండడం ఆందోళనకరం. కాగా.. నాలుగు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజధానిలోనూ దుస్థితి సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె కారణంగా నాలుగు రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 16,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. చాలా చోట్ల రోడ్లు, బస్తీలన్నీ దుర్గంధ భరితంగా మారాయి. దోమలు పెరిగిపోయాయి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్‌లోని దాదాపు 1,500 బస్తీలు, 900 కాలనీల్లో ఇదే దుస్థితి. చెత్త గుట్టలుగా పేరుకుపోయి.. రోడ్ల నిండా విస్తరిస్తోంది. ఇక హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చార్మినార్ వద్ద చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. తాము సమ్మె చేస్తుండగా.. ఈ పనులెలా చేస్తారంటూ నిలదీశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఓ కార్మికురాలికి చేతికి గాయమైంది. అయితే తమది ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమమేనని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు జీహెచ్ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీల్లో.. తరలించే వ్యర్థాలు: 1,961.75 టన్నులు పట్టణ రోడ్ల మొత్తం పొడవు: 9,609.14 కిలోమీటర్లు ఒకరోజులో ఊడ్చే రహదారులు: 7,591 కిలోమీటర్లు (79%) మొత్తం మురికి కాల్వల పొడవు: 8,547.59 కిలోమీటర్లు ఒకరోజులో శుభ్రపరిచే మురికి కాల్వల పొడవు: 6,698.34 (78%) కంపు కొడుతున్న కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతోఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ప్రధాన రహదారుల నుంచి వీధుల వరకు ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 964 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులతో పాటు వారికి మద్దతుగా 256 మంది సిబ్బంది కూడా సమ్మెకు దిగారు. దీంతో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వరంగల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో 3,074 మంది కార్మికులు ఉండగా.. 2,051మంది సమ్మెలో పాల్గొంటున్నారు. రోడ్లు, వీధులన్నీ అపరిశుభ్రంగా మారారుు. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలలో రోడ్లన్నీ చెత్తమయం అయ్యాయి. పందులు స్వైర విహారంతో దుర్గంధం వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, మిర్యాలగూడ మున్సిపాలిటీలు చెత్తతో నిండిపోయాయి. పలు కాలనీల్లో డ్రైనేజీలు నిండిపోయి కంపుకొడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, మధిర మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయి. వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పట్టణ కేంద్రాలు కంపుకొడుతున్నాయి. కాలనీలన్నీ కంపుకొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మందమర్రి మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తొలగిస్తున్నాం: జీహెచ్ఎంసీ జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని, పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా వాడుకుంటున్నామని వివరించింది. చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. చెత్త తొలగించేందుకు చర్యలు చేపట్టామన్న జీహెచ్ఎంసీ వివరణను నమోదు చేసుకుని విచారణను వాయిదా వేసింది. -
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
శ్రీరాంపూర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ సింగరేణి సీహెచ్‌పీలో బుధవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మేరుగు శ్రీకాంత్(26) మృతి చెందాడు. మరో ఏడుగురికి త్రుటితో ప్రాణాపాయం తప్పింది. బుధవారం సీహెచ్‌పీలోని బంకర్‌పై మల్మ (బొగ్గు చూర) క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ పనుల్లో ఉండగా.. శిథిలావస్థలో ఉన్న బంకర్ బాటం(గాండ్రీ) ఒక్కసారిగా కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తు నుంచి శ్రీకాంత్ కిందపడ్డాడు. అతనిపై మల్మ, బాటం శిథిలాలు వచ్చి పడడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఏడుగురు బాటం విరిగే శబ్దాలు విని క్షణాల్లో తప్పుకున్నారు. కంపెనీ ఎస్ఓటు జీఎం పీపీ సత్యనారాయణ, డీజీఎం రామలింగం సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బందిని పిలిపించి శిథిలాల కింద ఉన్న శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు మృతదేహంతో బైఠాయించాయి. కంపెనీ నుంచి వచ్చే డబ్బులను సకాలంలో చెల్లిస్తామని, అదనపు ఎక్స్‌గ్రేషియా, ఇతర నష్టపరిహారాలపై కారొరేట్ స్థాయిలో చర్చిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఉపాధి హామీ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
ఆదిలాబాద్ : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నాటి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
పేలుతున్న నిర్లక్ష్యం.. ప్రాణమే మూల్యం
పరిశ్రమల్లో కార్మికులకు కరువైన రక్షణ రియాక్టర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏడాదిలో దాదాపు 30 మంది మృత్యువాత పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో 400 పైచిలుకు భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ రసాయన పరిశ్రమలే. సుమారు పది వేల మంది పర్మినెంటు, 35 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల్లో 50 శాతం పైగా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు పలువురు కాంట్రాక్టు కార్మికులుగా విధులను నిర్వహిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో పని చేసే వారికి తగిన అనుభవం, అవగాహన నైపుణ్యం తప్పనిసరి కాగా, చాలామంది అవే మీ లేకుండానే విధుల్లోకి చేరిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు.. ప్రమాదమని తెలిసీ జీవనభృతి కోసం ఆయా విధులు నిర్వర్తించడానికి సిద్ధమైపోతున్నారు. కార్మికుల అవసరాన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఆసరాగా తీసుకుని వారి చేత ఇష్టానుసారం పనులు చేయించుకుంటున్నాయి. ప్రాణాలు మింగేస్తున్న రియాక్టర్లు రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. గడచిన ఏడాదిలో దాదాపు 30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాతపడినట్టు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రియాక్టర్లను సరిగా నిర్వహించకపోవడం, వాటి వద్ద అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని విధుల్లో ఉంచకపోవడమే దుర్ఘటనలకు కారణమవుతోంది. కొన్నిసార్లు రియాక్టర్లు పేలి.. ఇంకొన్ని సార్లు వాటిలోకి దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్టాలకు చెందిన కార్మికులే ఉన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు మృతి చెందితే వారిని రహస్యంగా స్వస్థలాలకు తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. నష్టపరిహారం ఊసే లేదు. స్థానికంగా ఉన్న కార్మికులు మృతి చెందితే కార్మిక సంఘాల ఒత్తిడికి తలొగ్గి యాజమాన్యాలు ఎంతోకొంత పరిహారం ఇస్తున్నాయి. కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు? పారిశ్రామికవాడల్లోని కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నా.. కార్మిక శాఖ అధికారులు అందుకు కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. తాజాగా గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామికవాడల్లోని రెండు పరిశ్రమల్లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద కారణాలను వెలికి తీయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా?, పరిశ్రమను సక్రమంగా నిర్వహిస్తున్నారా?, అన్ని అనుమతులు ఉన్నాయా?, కార్మికుల భద్రతకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? అనే వాటిపై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించిన దాఖలాల్లేవు. అతి తక్కువ వేతనాలకు కార్మికులను విధుల్లోకి తీసుకుని వారి చేత ప్రమాదకర పనులు చేయిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలివే.. ► అనుభవం, నైపుణ్యం గల కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం ► రియాక్టర్లు, ఇతర ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించకపోవడం ► భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కార్మిక శాఖ తనిఖీ చేయడం లేదు ► రక్షణ విషయంలో కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలి. అది జరగడం లేదు. -
కార్మికులపై కాఠిన్యం
మంత్రి వస్తారు, తమ సమస్యలు పరిష్కరిస్తారు అని ఎదురు చూసిన కార్మికులకు నిరాశ ఎదురైంది. మంత్రి మాట మార్చడంతో ఆగ్రహించిన వారు జెడ్పీ వైస్ చైర్మన్, టీడీపీ నాయకులను నిర్బంధించారు. ఉదయం నుంచి వేచి ఉన్న పోలీసులు సాయంత్రం కార్మికులపై తమ ప్రతాపం చూపించారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు ఆడ,మగ అన్న తేడాలేకుండా అందర్నీ ఈడ్చుకుని వెళ్లి వ్యాన్‌లో పడేశారు. దీంతో గరివిడిలో సోమవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గరివిడి: ఫేకర్‌లో పనిచేస్తున్న వేగన్,లారీ, కాంట్రాక్టు కార్మికులను విచ్చక్షణా రహితంగా అరెస్ట్ చేసి, ప్రభుత్వం పండుగ కానుక ఇచ్చింది. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరడమే వారు చేసిన తప్పయింది. సమస్య పరిష్కరించడానికి సోమవారం మంత్రి మృణాళిని గరివిడి వస్తానన్నారు. కానీ ఆమె రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సుమారు 300 మంది కార్మికులు.... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, ఇతర టీడీపీ నాయకులును మండల పరిషత్ కార్యాలయలంలో దిగ్బంధించారు. మాటమార్చిన మంత్రి తమ సమస్యల పరిష్కారం కోసం ఫేకర్కు చెందిన వేగన్, లారీ లోడింగ్, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఆందోళన చేసిన సమయంలో చర్చించేందుకు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వస్తానని జిల్లా పరిషత్వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి మృణాళిని తె లిపారు. ఇదే విషయాన్ని బలగం తన ఇంటిని ఆదివారం ముట్టడించిన కార్మికులకు తెలిపారు. సోమవారం ఉదయం డాగ్ స్క్వాడ్ కూడా మండల పరిషత్ కార్యాలయానికి రావడంతో అందరూ మంత్రి వస్తారని భావించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి మాజీ ఎంపీపీ పైల బలరాం, వైస్ ఎంపీపీ బలగం వెంకట్రావు, పలు గ్రామాలకు చెందిన టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సోమవారం ఉదయం 10 గంటలకే మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని వైస్‌చైర్మన్ రూంలో కూర్చున్నారు . ఇదే సమయంలో సుమారు 300 మంది కార్మికులు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మంత్రి తమ మాటను మార్చి, కొంతమంది కార్మిక నేతలను ప్రజాప్రతినిధులను, విజయనగరం రమ్మని పోలీసుల ద్వారా సమాచారం అందించారు. దీంతో కార్మికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మండల పరిషత్ కార్యాలయంలో గల రూంలోనే టీడీపీ నేతలను, వైస్ చైర్మన్ నిర్బంధించారు. మంత్రి మృణాళిని వచ్చి సమస్య పరిష్కరించేంత వరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు. కార్యాలయం ప్రాంగణంలో వంటావార్పు నిర్వహించి ఆందోళన కొనసాగించారు. దీంతో చీపురుపల్లి సీఐ రాఘవులు ఆధ్వర్యంలో సుమారు ఆరుగురు ఎస్ఐలు, 150 మంది వరకు కానిస్టేబుల్ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకూ వేచి ఉన్న పోలీసులు ఒక్కసారిగా కార్మికులపై తమ ప్రతాపం చూపించారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యం లో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. ఈ గలాటలో పలువురు మహిళా కార్మికులకుగాయాలయ్యాయి. కొంతమంది సొమ్మసిల్లిపోయారు. అయినప్పటికీ విచిక్షణారహితంగా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. మం త్రి వస్తారని తమగోడును వినిపించుకొని సమస్యను పరిష్కరించుకుందామని ఆశించిన కార్మికులకు ప్రభుత్వం పోలీసులతో సమాధానం చెప్పింది. సుమారు 300 మందిని కార్మికులను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని పోలీసు వ్యానులో బయటకు తీసుకువెళ్లారు. -
సింగరేణికి వయోభారం
కొత్తగూడెం(ఖమ్మం): సింగరేణికి యువరక్తం ఎక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. సంస్థలో పనిచేసే కార్మికుల్లో అత్యధికులు 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంతో రోజురోజుకు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోంది. పర్మనెంట్ కార్మికులు గణనీయంగా తగ్గిపోయారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఖాళీల భర్తీకి అంతర్గత నియామకాలపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో 2015లో రిటైర్డయ్యే కార్మికుల సంఖ్య 2 వేల వరకు ఉండడం గమనార్హం. 40 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ.. 1990 నుంచి సింగరేణి సంస్థలో ఆర్థిక సంస్కరణలు, నూతన యాంత్రీకరణ అమల్లోకి రాగా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. సంస్థలో వీఆర్ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీంలను అమల్లోకి తెచ్చారు. డిపెండెంట్ ఎంప్లాయీమెంట్‌ను కూడా పూర్తిగా ఎత్తి వేశారు. 1990కి పూర్వం సంస్థలో 1.20 లక్షల మంది కార్మికులు ఉండగా తర్వాత పద్నాలుగేళ్లలో ఆ సంఖ్య సగానికి తగ్గింది. గత పదిహేనేళ్లుగా కొత్తగా నియామకాలు లేవు. టెక్నికల్ విభాగంలో ఇంజినీర్లను మాత్రమే అరకొరగా నియమిస్తున్నారు. పాతవారే కొనసాగుతుండడంతో ప్రస్తుత కార్మికుల్లో 80 శాతం మంది 40 ఏళ్ల వయస్సు పైబడిన వారే. ఇందులో 50 ఏళ్లకు పైబడిన కార్మికుల సంఖ్య సగం వరకు ఉంది. యాంత్రికరణ.. ఔట్ సోర్సింగ్‌పై దృష్టి.. యాంత్రిరణ నేపథ్యంలో కోల్ఫిల్లింగ్ను సంస్థ విస్మరించింది. ఓపెన్‌కాస్టులపై ఎక్కువగా దృష్టి సారించి భూగర్భ గనుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎల్ఈడీ యంత్రాలను ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న తట్టా చెమ్మస్ సంస్కృతి కనుమరుగైంది. ఇలా ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నా.. నియామకాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులను భూగర్భ గనుల్లోనూ పనులకు వినియోగించుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రస్తుతం సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అనారోగ్యాల బారిన కార్మికులు నియామకాలు విస్మరిస్తుండడంతో పనిలో మెళకవలు తెలిసిన కార్మికులు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కార్పొరేట్ శాఖలో క్లరికల్ గ్రేడ్ నియామకాల్లో జాప్యం చేయడం వల్ల ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉన్న కార్మికులపై పనిభారం పెరిగి అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తోంది. ఈ ఏడాది పెద్దసంఖ్యలో రిటైర్మెంట్లు ఉన్నందున రిక్రూట్మెంట్పై యాజమాన్యం దృష్టిపెట్టాలనే డిమాండ్ విన్పిస్తోంది. -
విభజించు... పాలించు
ఎర్రగుంట్ల: విభజించు.. పాలించు... ఇది బ్రిటీష్ పాలకుల రీతి.. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. బ్రిటీష్ పాలకులను తలదన్నేలా ఆర్టీపీపీ అధికారులు ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలమేరకు కార్మికుల కడుపు కొడుతున్నారు. ఏకంగా 300 మంది కార్మికులను విధుల్లోకి రానీయలేదు.. వారి స్థానంలో తెలుగుతమ్ముళ్లను తీసుకున్నారు. దీంతో విధులకు దూరమైన కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీపీపీ కార్మికులు ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోనలు చేపట్టారు. 15వ తేదీ తర్వాత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీపీపీ మెయిన్‌గేటు వద్ద శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికార పక్షంతో పాటు ఏపీజెన్కో యాజమాన్యం స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో సుమారు 100 మంది తన అనుచరులను ఆర్టీపీపీలో చేర్పించారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు అధికారులను కలిశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.నిబంధనలతో కూడిన ఒప్పంద పత్రంపై సంతకం చేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని అధికారులు కార్మికులకు తెలిపారు. దీంతో కొంతమంది కార్మికులు అధికారుల హెచ్చరికలకు తలొగ్గి విధుల్లో చేరారు. దుర్మార్గం ఆర్టీపీపీలో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము.. మేమంతా వైఎస్సార్సీపీకి చెందిన వారమని విధుల్లోనుంచి తప్పించారు.. అధికారులు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరైనది కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారైతే ఒకరకం.. ఇంకొకరైతే మరో రకమా... భారతి, జువారి సిమెంటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతు ఇచ్చిన టీడీపీ నేత సీఎం సురేష్‌నాయుడు ఆర్టీపీపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు మద్దతు ఇవ్వకుండా వారి కడుపులు కొట్టేలా వ్యవహరించడం ఎంత వరకు న్యాయమని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు పలికారు. కాంట్రాక్టు కార్మికులందరూ ఒకే డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీపీపీ సీఈ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాగా ఆర్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరసనలను భగ్నం చేయడానికి ఆర్టీపీపీ యాజమాన్యం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఒక డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీఎఫ్, స్పెషల్ పార్టీ, ఏఆర్ పార్టీలతో కూడిన బలగాలను రంగంలోకి దించారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల మెరుపు సమ్మె
అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి! జిల్లాలో 850 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవాడ : విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు దిగా రు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి వెళ్లి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మధ్నాహ్నం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ నేతలు జిల్లా ఎస్ఈ మోహనక ృష్ణకు సమ్మె నోటీసు అందజేశారు. జిల్లాలోని 209 సబ్స్టేషన్లలో 850 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 30 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 180 సబ్స్టేషన్లలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉన్నారు. గతంలోనే విద్యుత్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించిన క్రమంలో సదరన్ కంపెనీ ఈ నెల 23న వారిని చర్చలకు ఆహ్వానించింది. అయితే వారు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి వెళ్లి విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలో సబ్స్టేషన్ల పరిధిలో జరిగే తక్షణ మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో గత 18 ఏళ్లుగా 15 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ... విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. గ్లోబల్ టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి. థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టర్లు చెల్లించే సూపర్వైజ్ చార్జీలను కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. -
29, 30 తేదీలలో జేఏసీ సమ్మె
గోదావరిఖని/మంచిర్యాల సిటీ : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జేబీసీసీఐ హైపవర్ కమిటీవేతనాలను అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30 తేదీలలో సమ్మె చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. సోమవారం గోదావరిఖనిలోని సీఐటీయూ శ్రామికభవన్‌లో బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బి.మధు, ఏఐటీయూసీ కార్యదర్శి రాజరత్నం, ఇప్టూ అధ్యక్షుడు ఎ.వెంకన్న, హెచ్ఎంఎస్ కార్యదర్శి ఆర్.కేశవరెడ్డి, టీసీసీఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు శంకర్‌ముదిరా జ్, టీఎంసీడబ్ల్యుయూ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్, తెలంగాణ 42, 43 ప్రజాసమితి నాయకులు మంద రవికుమార్ హాజరయ్యా రు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఓబీ, కోల్ ట్రాన్స్‌పోర్టు, సివిల్, అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యథావిధిగా ఇఫ్టూ సమ్మె గతంలో నిర్ణయించిన విధంగా ఇఫ్టూ అనుబం ధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూ నియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈనెల 18, 19 తేదీలలో తలపెట్టి న టోకెన్ సమ్మె యథావిధిగా కొనసాగుతుంద ని ఆ యూనియన్ అధ్యక్షుడు కె.విశ్వనాథ్ ప్రకటించారు. జేఏసీ సమావేశానికి హాజరైన ఆయన సమ్మె కోసం కాంట్రాక్టు కార్మికులు సిద్ధమైన నేపథ్యంలో ఈ రెండు రోజులు సమ్మె నిర్వహిస్తామని, ఆ తర్వాత 29, 30 తేదీలలో జేఏసీ నిర్వహించతలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. నాలు గు నెలల కాలం నుంచి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సమ్మె చేయడానికి నిర్ణయించి కార్మికులను సన్నద్ధం చేశామని, వారి కోరిక మేరకు సమ్మె చేసి తీరుతామని ప్రకటించారు. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఎన్టీటీపీఎస్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి తాను కృషి చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎన్టీటీపీఎస్లో కాంట్రాక్టు కార్మికుడు నుంచి తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన పర్వతనేని సాంబశివరావుకు శుక్రవారం రాత్రి ఏకాలనీ ఎస్వీఎస్ కల్యాణ మండపంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో థర్మల్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సాంబశివరావు రాష్ట్ర అధ్యక్షుడు కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సాంబశివరావును ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు. తొలుత ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ నుంచి ఎ-కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె. సమ్మయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ చీదిరాల ప్రసూన, వైఎస్ ఎంపీపీ వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, ఇబ్రహీంపట్నం గ్రామ మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావు, టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య, తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, ప్రాంతీయ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌చేస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎన్టీయూఐ, కచరా వాహతుక్ శ్రామిక్ మంచ్, సర్వశ్రామిక్ మంచ్ ఆధ్వర్యంలో రాణిబాగ్ నుంచి ఆజాద్‌మైదాన్ వరకు జరిగింది. ఇందులో నవీముంబై, షోలాపూర్, పుణే, నాసిక్, నాగపూర్ తదితర కార్పొరేషన్లకు చెందిన దాదాపు ఐదు వేలకుపైగా పారిశుద్ధ్య కార్మికులు, ఇతర శాఖలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు పాల్గొన్నారు. బీఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని ఇండస్ట్రియల్ కోర్టు ఆదేశించింది. ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే జీవోలను తీసుకురావడం అయోమయానికి గురిచేసిందని ఆరోపించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పనికితగ్గ వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతరేక విధానాలను రద్దు చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించడం మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి రిలయన్స్ ఎనర్జీ కార్మిక సంఘం, తెలంగాణ సంఘీభావ వేదిక మద్దతు పలికాయి. ర్యాలీలో ఎన్టీయూఐ అధ్యక్షుడు వాసుదేవన్, బలరాం, సైదులు, వెంకటేశ్, దుర్గేశ్ అక్కనపెల్లి, గుండే శంకర్, సత్తన్న, భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. బీఎంసీలో పర్మినెంట్ కానున్న ‘పారిశుద్ధ్య’ కొలువులు అనేక సంవత్సరాలుగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పారిశుద్ధ్యం లాంటి అత్యవసర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని పరిశ్రమల (ఇండస్ట్రియల్) కోర్టు ఆదేశించింది. అంతేగాక వారు విధుల్లో చేరినప్పటి నుంచి చెల్లించాల్సిన వివిధ భత్యాలు (పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా) చెల్లించాలని సూచించింది. ఈ నిర్ణయంతో బీఎంసీలో వివిధ అత్యవసర శాఖల్లో పనిచేస్తున్న 2,700 మంది కాంట్రాక్టు కార్మికులకు ఊరట లభించింది. తమను పర్మినెంట్ చేయాలని కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. బీఎంసీలోని అనేక శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నారు. కాని కాంట్రాక్టు కార్మికులు కావడంతో బీఎంసీ వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుద్ధ్య శాఖ కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. పారిశుద్ధ్య శాఖ లాంటి అత్యవసర శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించరాదని కోర్టు హెచ్చరించింది. -
ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ లాకౌట్
గర్భాం (మెరకముడిదాం) :మండలంలోని గర్భాం ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమను శనివారం రాత్రి నుంచి మూసివేశారు. మొన్నటివరకు విద్యుత్ సరఫరా లేక.. ఇప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించలేక యాజమాన్య పరిశ్రమను మూసివేసింది. కొన్ని నెలల క్రితం గరివిడి ఫేకర్ లాకౌట్ కావడంతో అందులోని వందల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమ కూడా లాకౌట్ ప్రకటించడంతో వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే గరివిడి ఫేకర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి మృణాళినికి ఈ పరిశ్రమ లాకౌట్ కూడా మరిన్ని ఇబ్బందులు సృష్టించనుంది. మండలంలోని గర్భాం ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమను శనివారం రాత్రి నుంచి మూసివేశా రు. పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికలను ఇటీవల యాజమాన్యం తుపానుల కారణంగా విద్యుత్ సరఫరా లేదన్న కారణంతో పది రోజుల వరకూ విధులకు హాజరుకావొద్దని తెలిపింది. అయితే దీనికి కార్మికులు తొలుత ఒప్పుకోలేదు. యాజమాన్యం చెప్పినట్టుగా పది రోజుల్లో విద్యుత్ సరఫరా వస్తే పరవాలేదని, ఒకవేళ విద్యుత్ సరఫరా కాకపోయినా తమను విధుల్లోకి తీసుకుంటామని అగ్రిమెంట్ రాయాలని కాంట్రాక్ట్ కార్మికులకు చెందిన నాయకలు ఎస్.వెంకటపతిరాజు, రెడ్డి లక్ష్మణ, రౌతు కృష్ణ, తాడ్డె వేణుగోపాలరావు, కిరణ్‌కుమార్, జన, కళ్యాణి శ్రీను తదితరులు యాజమాన్య ప్రతినిధులను కోరారు. దీనికి యాజమాన్య ప్రతినిధులు ఒప్పుకున్నారు. అయితే కొద్దిరోజులు వరకూ విద్యుత్ సరఫరా కాకపోవడంతో మళ్లీ యాజమాన్యం విద్యుత్ సరఫరా కాలేదని, అందుకని విధులకు హాజరుకావొద్దని కాంట్రాక్ట్ కార్మికులకు తెలిపారు. ఇలా చెప్పిన రెండు రోజుల్లోనే పరిశ్రమకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కావడం తో ఇప్పుడు కార్మికులు...తమకు విధులకు రావొద్దని చెప్పిన రోజులకు కలిపి వేతనాలు, అలాగే పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలని, ప్రతి నెలా 10 వతేదీ లోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరిస్తేనే తాము విధులకు హాజరవుతామని, లేకపోతే సమ్మె చేస్తామని తెలి పారు. ఈ మేరకు యాజమాన్యం ప్రతినిధులు జేఎండీ నిమ్మిఖం డేల్‌వాల్, జీఎం మూర్తి కార్మిక సంఘ నేతలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు విఫలం కావడంతో యాజమాన్యం లా కౌట్ వైపు మగ్గు చూపింది. ఈ మేరకు శనివారం రాత్రి 8. 30 గంటలకు లాకౌట్ ప్రకటించింది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న 700 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. -
పురపాలకంలో ‘పరాయి’ పాలన
ఖమ్మం సిటీ : ఖమ్మం నగరపాలక సంస్థలో ఇష్టారాజ్య కొనసాగుతోంది. కార్పొరేషన్‌కు సంబంధం లేని ఓ అధికారి కాంట్రాక్ట్ సిబ్బంది విషయంలో అంతా తానై వ్యవహరిస్తున్నాడు. ఇతడిని నమ్ముకున్న 13 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇన్నాళ్లు ఆనందంగా గడిపినా ఇప్పుడు వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అసలేం జరిగిందంటే... ఖమ్మం మున్సిపాలటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ ఇందులో విలీనమైంది. ఆ సమయంలో ఖానాపురం హవేలిలో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించేందుకు అప్పటి గ్రామ పంచాయతీ మహాత్మగాంధీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 231 మంది స్వీపర్లను నియమించింది. అందులో కొంతమంది కార్మికులు తాము చాలాకాలంగా పని చేస్తున్నామని, తమను పర్మనెంట్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖానాపురం హవేలి కార్పొరేషన్లో విలీనం చెందిన తర్వాత కూడా వారినే కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీలో అప్పుడు ఉన్న అవసరాల దృష్ట్యా అధికారుల వారిలో కొంత మందిని వివిధ పనులకు ఉపయోగించుకున్నారు. కార్పొరేషన్‌గా విలీనం చెందినప్పుడు సైతం స్వీపర్లుగానే ఉన్నా వారిలో కొందరు ఆ పనులు నిర్వర్తించలేదు. స్వీపర్ల పేరుతో కార్యాలయంలో కూర్చుని జీతాలు పొందారు. ఈ క్రమంలోనే హవేలిలో ఉన్న ఓ అధికారి డిప్యూటేషన్ మీద కార్పొరేషన్‌కు రావడంతో వారికి కలిసి వచ్చింది. ఇక్కడ సైతం పారిశుద్ధ్య పనులు చేయకుండా వివిధ విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో శానటరీ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి 231 మందిలో 13 మంది తన వద్ద పని చేయడం లేదని, వారికి తాను హాజరు వేయలేనని అప్పటి కమిషనర్ బి.శ్రీనివాస్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో 13 మందికి ప్రత్యేక స్వీపర్ల ప్యాకేజి ద్వారా జీతాలు ఇచ్చారు. ఇందులో ఇద్దరు మినహా మిగిలిన వారెవ్వరూ కార్యాలయానికి హాజరైన దాఖలాలు లేవు. వారంతా హవేలి పంచాయతీ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారి సొంత పనులకు ఉపయోగపడ్డారు. ఇలా రెండేళ్లుగా కొనసాగినా ఆ అధికారిని అడిగే నాథుడే కరువయ్యాడు. అప్పటి కమిషనర్ అతడికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి ఆ అధికారి పనులు చేసినా చేయకపోయినా హాజరు వేయించి జీతాలు అందించారు. ఈసారి కూడా వీరిని ప్రత్యేక ప్యాకేజీగా పిలిచేందుకు ఆయన ఫైల్ సిద్ధం చేశాడు. అయితే... కార్పొరేషన్ ను ఇటీవల తనిఖీ చేసిన కలెక్టర్ ఇలంబరితి నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కమిషనర్ వేణుమనోహర్‌ను ఆదేశించారు. దీంతో ఎంత మంది పని సిబ్బంది ఉన్నారు... ఎక్కడెక్కడ పని చేస్తున్నరని శానటరీ ఇన్స్పెక్టర్ను కమిషనర్ ఆరా తీశారు. 13 మంది సిబ్బంది స్వీపర్లుగా ఉండి కార్యాలయంలో పనులు ఎలా చేస్తున్నరని కింది స్థాయి అధికారులను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కార్యాలయంలో వినియోగించ కూడదని, వారిని తొలగించి కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. దీంతో అధికారులు వారిని తొలగించి టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో నవంబర్ 1 నుంచి కొత్త కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ 13 మంది పేర్లు లేకపోవడంతో వారిని కాంట్రాక్టర్లు విధుల్లోకి శనివారం నుంచి రావద్దని చెప్పారు. -
కదిరి కౌన్సిల్లో దుమారం
తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల డిమాండ్ కదిరి: నోటీసు ఇవ్వకుండా స్థానిక మునిసిపాలిటీలో పనిచేస్తున్న 55 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో దుమారం లేచింది. 23వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పార్నపల్లి షాహినా బే గం ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. కార్మికులకు న్యాయం జరిగే వారికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఇందుకు చైర్పర్సన్ సురయాభాను మాట్లాడుతూ కార్మికులను తొలగించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే వచ్చింద న్నారు. అప్పుడు మీరు కౌన్సిలర్‌గా ఉన్నారు కదా.. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి నుద్దేశించి అన్నారు. దీంతో ఆయన స్పందిస్తూ ఁమీరు తొలిసారిగా కౌన్సిల్లో అడుగు పెట్టారు. ఆ రోజే నేను కార్మికులకు అండగా నిలిచాను. మీకు తెలియకపోతే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అడిగి తెలుసుకోండి* అని చైర్‌పర్సన్‌కు చురకంటించారు. రెండు రోజుల్లో తొలగించిన కార్మికులకు న్యాయం చేస్తామని ఆమె చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. అంతకు మునుపు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్‌కుమార్, ఖాదర్‌బాషా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ జూసినా ఆక్రమణలు ఎక్కువయ్యాయని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్ షబ్బీర్ అంబేద్కర్ కూడలిలో కొంత ప్రభుత్వ స్థలం ఉందని, ఇప్పుడు అక్కడ అత్తార్ రెసిడెన్సీ వెలసిందన్నారు. ఖాదర్‌బాషా సమాధానమిస్తూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హిందూపూర్ సర్కిల్లోని వక్ష్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆక్రమణల విషయంపై ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు సాగాయి. ఆక్రమణ అంశాన్ని లేవనెత్తిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైస్ చైర్పర్సన్ వసంత తెలిపారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మైనుద్దీన్ కౌన్సిల్, టీడీపీ కౌన్సిలర్ షబ్బీర్ మాట్లాడుతూ తమ వార్డులో అర్హులైనవారి పింఛన్లు తొలగించారని సమావేశం దృష్టికి తెచ్చారు. ఎక్స్‌అఫియో సభ్యుడు ఎవరు? మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరు హాజరు కావచ్చునని చైర్‌పర్సన్‌ను వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా ప్రశ్నించారు. ఇందుకు ఆమె కాసేపు మౌనం వహించి, తనకు తెలియదన్నారు. పక్కనే ఉన్న వైస్ చైర్పర్సన్ వసంత కలుగజేసుకొని ఇంకా నియమించలేదన్నారు. టీడీపీ కౌన్సిలర్ రాజశేఖరాచారి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుడు అత్తార్ చాంద్‌బాషా ఎక్స్‌అఫియో సభ్యుడని తెలపడంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అవాక్కయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడికి మున్సిపాలిటీ తరపున గాంధీ జయంతి రోజు ఎందుకు ఆహ్వానం పంపలేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా నిలదీశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూస్తామని చైర్పర్సన్, కమిషనర్ వెంకటరమణ తెలిపారు. -
చీకటి బతుకులు
* కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం * ఆర్డర్లు రద్దవుతున్నాయంటూ యాజమాన్యాల ఆందోళన * ఉపాధి కోల్పోతున్న కార్మికులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరెంటు కోతలు కార్మికుల ఉపాధికి వాతలు పెడుతున్నాయి. వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. పవర్ హాలీడేతో నెలలో 10 రోజుల పాటు పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో యాజమాన్యాలు కాంట్రాక్ట్ కార్మికులను, దినసరి కూలీలను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె నుంచి పట్నం వచ్చి బడుగు జీవుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌నే అధికారులు కేటాయించారు. ఇందులో 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో అధికారులు పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ప్రకటించారు. వారానికి రెండు రోజులతో పాటు, మధ్యమధ్యలో కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో నెలకు కనీసం 10 నుంచి 12 రోజుల పాటు పరిశ్రమలు నడవడం లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యంలో దాదాపు 40 శాతం ఉత్పత్తులు ఆగిపోతున్నాయి. జిల్లాలోని చాలా పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమయానికి ఉత్పత్తులు ఇవ్వడం లేదన్న కారణంతో బయ్యర్లు ముందస్తు ఆర్డర్లను తిరస్కరించి, మరో రాష్ట్రం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉత్పత్తులు నిలిచిపోవడంతో ఆదాయ వ్యయాల్లో తీవ్ర వ్యత్యాసం వస్తోంది. దీంతో ఉద్యోగులు, కార్మికుల వేతనాల చెల్లింపులు కూడా పరిశ్రమల యాజమాన్యాలకు కష్టంగా మారుతోంది. జిల్లాలో ఒక్కొక్క భారీ పరిశ్రమలో కనీసం 350 నుంచి 500 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. దినసరి కూలీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల్లో సగటున 50 నుంచి 100 మంది కూలీల పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రత్యక్షంగా దాదాపు 2 లక్షల మంది కార్మికులు, పరోక్షంగా మరో లక్ష మంది పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు. నెలకు 10 రోజుల పాటు పరిశ్రమల ఆగిపోవడం వల్ల అందులో పని చేసే కార్మికుల జీతాల్లో యాజమాన్యం కోత పెడుతోంది. ఇంకొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో దినసరి కూలీలు, కాంట్రాక్టు కార్మికుల ఆర్థిక పరిస్థితి భారంగా మారుతోంది. కాంటాక్ట్ కార్మికుల మీద ప్రభావం... డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ను సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పుత్తులు ఆగిపోతున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించడంతో ఈ ప్రభావం నేరుగా దినసరి కూలీల మీద పడుతోంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుండటంతో పరిశ్రమలకు వారానికి కనీసం 2 రోజుల పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. జిల్లాలో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. 11 కేవీ విద్యుత్‌తో నడిచే భారీ పరిశ్రమలు దాదాపు 1,500 వరకు ఉన్నాయి. 10 కేవీ విద్యుత్తుతో నడిచే అంటే మధ్యతరహా, చిన్న పరిశ్రమలు 7,500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడలో సోమవారం, మంగళవారం, జిల్లాలోని మిగిలిన పారిశ్రామిక వాడల్లో బుధ, గురువారాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతోంది. ఫార్మా, ఐరన్, స్టీల్, బాయిల్డ్, విత్తన, జౌళి పరిశ్రమలపై విద్యుత్ కోతల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఐరన్, బాయిల్డ్ పరిశ్రమల్లో బాయిలర్స్ వేడెక్కాలంటే దాదాపు 1000 ిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇందుకోసం దాదాపు 5 నుంచి 10 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. కరెంటు కోతల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగాా హైటెన్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ అంత ఖర్చు భరించి పరిశ్రమలు నడపటం సాధ్యం కాదని యాజమాన్యాలు అంటున్నాయి. విధిలేని పరిస్థితిలోనే పవర్ హాలీడే ప్రకటించిన రెండు రోజులు ఉత్పత్తి నిలిపివేస్తున్నామని వారు చెప్తున్నారు. మిగిలిన 5 దినాల్లో కూడా నిరంతరాయంగా కరెంటు రావడం లేదని, మధ్యమధ్యలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా నిలిచిపోతున్నట్లు పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వర్గాల మీదా ప్రభావం... రసాయన పరిశ్రమలు 24 గంటలు 365 రోజులు నడవాల్సిందే. కెమికల్ జోన్లో రసాయన గుణాన్ని బట్టి 24 గంటలు, 36 గంటల ప్రతిచర్యలు (రియాక్షన్స్) ఉంటాయి. కరెంటు కోతలతో రసాయనిక ప్రతి చర్యలు ఆగిపోయి ఉత్పత్తులు తగ్గడం, నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇలాంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటం లేదు. ఫలితంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పరిశ్రమల ఆగటంతో యాజమాన్యం, కార్మికులు మాత్రమే కాదు.. పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడం..విక్రయించడం.. వాటిని వివిధ రూపాల్లోకి మార్చే అనేక వర్గాల మీద ప్రభావం చూపుతుంది. రవాణ వాహనాలు, డ్రైవర్లు, ఏజెన్సీలు, డీలర్లు, దుకాణదారులు, మధ్యవ ర్తులు ఇలా ప్రతి వారి మీదా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. -అంజిరెడ్డి, ఎస్సార్ కెమికల్స్, ఎస్సార్ ట్రస్టు అధినేత -
ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?
అధికారులు కుమ్మక్కయ్యారు. వారు చేసే పనికి ఐఏ‘ఎస్’ అండగా నిలబడ్డారు. బల్దియాలో ఇక అడ్డేముంది? నిబంధనలతో పనేముంది? అర్హతలు లేకున్నా నచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అదేదో లక్ష, రెండు లక్షల విలువ చేసే పనులకున్నారా? అట్లా భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 10 కోట్ల విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించే దస్త్రంపై సంతకం చేశారు. అందుకు ప్రతిఫలంగా అధికారులకు ఎంత ముట్టిందనేది మాత్రం రహస్యమే. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆనోటా ఈనోటా పడి తీరా టెండర్ అక్రమాల గుట్టు రట్టవడంతో కంగుతిన్న అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. రాజీమార్గం కోసం అమాత్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఈ టెండర్ అక్రమాల కహానీ, అర్హతలేని కాంట్రాక్టర్‌తో అధికారుల కుమ్మక్కు, వారికి అండగా బల్దియా కమిషనర్ సాగించిన బాగోతమేమిటో పరిశీలిద్దాం. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో సుమారు వెయ్యిమంది కాంట్రాక్టు కార్మికుల నియామకానికి ప్రతి పాదనలను సిద్ధం చేసిన అధికారులు జూలై 30న టెండర్లను ఆహ్వానించారు. రూ.9.8 కోట్ల అంచనా తో కూడిన ఈ టెండర్లో పాల్గొనేందుకు సంస్థలు 19 రకాల ధువ్రీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా, అందులో 14 పత్రాలను తప్పనిసరి (మాండేటరీ)గా సమర్పించాలనే నిబంధనలను పొందుపరిచారు. వీటిలో క్లాస్-4 రిజిస్ట్రేషన్, ఈఎండీ, ఏపీటీఎస్ ట్రాన్సాక్షన్ ఫీజు, రూ.లక్ష అదనపు సెక్యూరిటీ డిపాజిట్, వ్యాట్ డాక్యుమెంట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ తోపాటు జూన్ నెల వరకు పీఎఫ్, ఈఎస్ఐ క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి నిబంధనల్లో ఉన్నా యి. ఆగస్టు 18న టెక్నికల్ బిడ్ తెరిచి ఒక్కో పనికి 8నుంచి 10షెడ్యూళ్లు దాఖలైనట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటినే ప్రెజ్ బిడ్‌లో తెరవాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి టెండర్లను నెలరోజుల పాటు డౌన్లోడ్ చేసేందుకే సమయం తీసుకున్నారు. తప్పనిసరి అర్హతలివి.. మొత్తం 8కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. తక్కువ మొత్తానికి కోట్ చేసిన శ్రీరాజరాజేశ్వరి వీఎల్సీసీఎస్ లిమిటెడ్ అనే సంస్థను సక్సెస్ఫుల్ బిడ్డర్‌గా ఎంపిక చేశారు. ఇంతవరకు బాగా నే ఉన్నా.. సదరు సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత పత్రాలే లేకపోవడం గమనార్హం. తప్పనిసరిగా పేర్కొన్న 14 పత్రాల్లో కీలకమైన ఈపీఎఫ్, ఈఎస్ఐ, టర్నోవర్ వంటి పత్రాలనూ ఆ కాంట్రా క్టు సంస్థ సమర్పించలేదు. అర్హతలేకున్నా.. అప్పగింత అర్హత లేని ఈ సంస్థకు ఏకంగా రూ.10 కోట్ల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘అసలే అర్హతల్లేవు... అందులోనూ మ్యాన్‌పవర్ సరఫరాలోనూ పెద్దగా అనుభవం లేకున్నా కార్మికుల నియామకపు పనులు అప్పగించేందుకు అధికారులు ఉత్సాహం చూపడంలో మతలబు ఏమిటి?’ అని మిగిలిన కాంట్రాక్టర్లంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పత్రాలను తరువాత ఎప్పుడైనా సమర్పించే అవకాశం సదరు సంస్థకు ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘కరీంనగర్లో మొత్తం 125 కాంట్రాక్టు సంస్థలున్నా అర్హతల్లేవనే కారణంతో అందులో సింహభాగం టెండర్లలో పాల్గొనలేదు. ఆ సంస్థకు ఇచ్చినట్లు వెసులుబాటు ఇస్తే కనీసం వంద కాంట్రాక్టు సంస్థలు కూడా అందులో పాల్గొనేవి కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నా అంతకం టే తక్కువకు టెండరు వేసిన సంస్థకు పనులు ఎట్లా అప్పగిస్తారని, అలాంట ప్పుడు తమ పరిస్థితేమిటని కార్మికులు వాపోతున్నారు. ‘నిబంధనలు రూపొం దించి టెండర్లు అప్లోడ్ అయ్యాక అనుకూలమైన వారి కోసం మార్చడం ఎంతవరకు సమంజసం? తప్పనిసరి అర్హతలను మార్చే అధికారం బల్దియా కమిషనర్‌కు సైతం లేదు. అయినా తుంగలో తొక్కారంటే దీనివెనుక పెద్ద మతలబే ఉంది’ అని సంస్థలోని ఉద్యోగులూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా? మొదట శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేని ఫైలుపై సంతకాలు చేసిన అధికారులు... ఆ తరువాత అదే సంస్థకు రూ.10 కోట్ల పనుల అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. అందుకోసం మాండేటరీ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు ఫైలు సిద్ధం చేస్తే దానిపై బల్దియా కమిషనర్ అయిన ఐఏఎస్ శ్రీకేశ్ లట్కర్ సం తకం చేయడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ అయితే నిబంధన లు వర్తించవన్నట్లుగా గుడ్డిగా సంతకం చేయడమేంటని, తప్పులు సరిదిద్దాల్సి న కమిషనరే తప్పు చేస్తే బల్దియా అక్రమాలను అడ్డుకునేదెవరని ప్రశ్నిస్తున్నా రు. ఈ బాగోతంలో బల్దియా ఎస్ఈ, ఈఈ అసలు సూత్రధారులనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర సంస్థకు కనీస అర్హతల్లేనందున సదరు దస్త్రంపై తాను మాత్రం సంతకం చేయబోనని డెప్యూటీ ఈఈ సంపత్‌రావు తెగేసి చెప్పినప్పటికీ, పక్కనపెట్టి సదరు సంస్థకు పనులు అప్పగించడం విశేషం. రాజీకి అధికారుల పాట్లు టెండర్ అక్రమాల బాగోతం బట్టబయలవడంతో బల్దియా కమిషనర్ సహా సదరు అధికారులంతా రాజీ యత్నాలు ప్రారంభించారు. నగర మేయర్, కార్పొరేటర్ల వద్దకు వెళ్లి పొరపాటైందని, దీనిని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడుతున్నారు. బల్దియా కమిషనర్ శ్రీకేష్ లట్కర్ సైతం ‘ఇందులో నా తప్పేమీ లేదు. కిందిస్థాయి అధికారులు రూపొం దించిన ఫైలుపై చూసుకోకుండా సంత కం చేశాను’ అని రాజీ బేరానికి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టెండర్ బాగోతంపై నగర మేయర్ రవీందర్‌సింగ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కమలాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. అదే సమయంలో మేయర్ సైతం కమిషన ర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. -
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
కొండమల్లేపల్లి : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొండమల్లేపల్లి డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆదివారం జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, కరెంట్ కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తయ్య, జిల్లా అధ్యక్షుడు సురేష్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, వెంకటేష్, దేవేందర్, లింగయ్య, ఎంపీటీసీలు కైలాసం, వస్కుల తిరుపతమ్మ కాశయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
పండుగపూట పస్తులుండాల్నా..?
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ శివారులో ఉన్న సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. దసరా పండుగకు సంబంధించి కంపెనీ యజమాన్యం బోనస్ చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో మొత్తం 400 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా యజమాన్యం బోనస్ చెల్లించాలని కార్మికులు కోరగా యజమాన్యం నిరాకరించింది. కాంట్రాక్టు కార్మికులకు 6 నెలలకు ఓసారి ఇచ్చే డీఏ కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. బోనస్ చెల్లించకపోతే పండుగపూట పస్తులుండాల్నా..? అని జీఎం శ్రీవాస్తావను కంపెనీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు కంపెనీ ఎదుట వంటవార్పు నిర్వహించారు. యజమాన్యం దిగివచ్చే వరకు ఆందోళన ఆపబోమని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హేమంత్‌కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు జంగయ్య, గౌసొద్దీన్, శంకర్, సుధాకర్, రూప్సింగ్ తదితరులున్నారు. -
‘కాంట్రాక్టు’ వ్యవస్థను రద్దుచేయండి
నిజామాబాద్ నాగారం : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌చేస్తూ శనివారం తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు వ్య వస్థను రద్దు చేసి యాజమాన్యమే కార్మికులకు నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. స్థానిక ఆర్యనగర్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అక్కడి నుంచి వినాయక్‌నగర్, పు లాంగ్మీదుగా క లెక్టరేట్ చేరుకున్నారు. అక్కడినుంచి బస్టాండ్, గాంధీచౌక్, ఆర్ఆర్చౌరస్తా నుం చి వర్ని చౌరస్తా మీదుగా ఖిల్లాలోని జిల్లా విద్యుత్కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాం ట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం మాట మార్చవద్దన్నారు. యాజ మాన్యం సైతం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సాయిలు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థను నమ్ముకొని 20 ఏళ్ల నుంచి కష్టాలు అనుభవిస్తూ సంస్థ అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకున్నా, ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందని ఆశతో ఎదు రు చూస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్లు కార్మికుల నుంచి రూ. వెయ్యి నుంచి రూ. రెండువేల వరకు ముందుగా తీసుకున్న తర్వాతే వేతనాలు బ్యాంకు ఖాతాలలో వేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది కాంట్రాక్టర్లు తెగించి ఏటీఎం కార్డులు వారి వద్ద ఉంచుకొని కార్మికులపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కార్మిక శాఖ ఆదేశాల మేరకు 2005 నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ కార్మికులకు కట్టాలని ఆదేశాలు ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోకుండా జేబుల్లో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా కాంట్రాక్టర్లు, అధికారు లు కుమ్మక్కై కార్మికులకు చెల్లించాల్సిన డీఏలను చెల్లించడం లేదన్నారు. కొంతమంది కార్మికులను అకారణంగా తొలగిస్తున్నారని అన్నారు. అన్ని అర్హతలున్నా, పర్మినెంట్ చేస్తామని కార్మికుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను క్రమద్ధీకరించాలని, లేకుంటే సమ్మెచేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెట్టు జాషువ, కార్యదర్శి మల్లయ్య, సభ్యులు బీర్రాథోడ్, తిరుపతి, విజయ్, రమేష్, గోపీ, ముస్తాప, సతీష్,సుమారు 600మంది కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ
4,322 మందిని రెగ్యులర్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు ఆంధ్రాలో 2,327, తెలంగాణలో 1,995 త్వరలో మరో 4,000 మందిని రెగ్యులర్ చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న 4,322 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో 2,327 మంది, తెలంగాణలో 1,995 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ కార్మికులుగా గుర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి క్రమబద్ధీకరించిన కార్మికుల్లో కండక్టర్లు 1,391 మంది, డ్రైవర్లు 2,931 మంది ఉన్నారు. ఏపీకి సంబంధించి 2,327 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో కండక్టర్లు 615, డ్రైవర్లు 1,712 మంది ఉన్నారు. వీరంతా 2012 డిసెంబర్ 31కి ముందు కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. వీరి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీ ఎండీ జె.పూర్ణచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి వీరిని రెగ్యులర్ కార్మికులుగా గుర్తించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు నాలుగు దశల్లో 17,738 మందిని రెగ్యులర్ చేశారు. త్వరలో మరో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ కానున్నట్లు సమాచారం. గతేడాది జూలై 4న అప్పటి రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణతో యూనియన్ నేతలు జరిపిన చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ హామీ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 2013 మే 1, సెప్టెంబర్ 1, 2014 మే 1, సెప్టెంబర్ 1 తేదీల్లో నాలుగు దశల్లో కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ పూర్తయింది. ఈ క్రమబద్ధీకరణతో కాంట్రాక్టు కార్మికుల జీతం రెట్టింపుకానుంది. ఏపీకి సంబంధించి రెగ్యులర్ అయిన కాంట్రాక్టు కార్మికుల్లో అధికంగా కృష్ణా జిల్లాలో 500 మంది, గుంటూరు జిల్లాలో 407 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్ హర్షం వెలిబుచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉపసంఘం: ఏపీఎన్జీవోలకు సీఎం హామీ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అశోక్‌బాబు నేతృత్వంలోని ఏపీఎన్జీవోల ప్రతినిధి బృందం బుధవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో కలిసింది. ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాల జీవోను ఎన్జీవోల మనోభావాలకు అనుగుణంగా రూపొందించామని.. గురువారం జీవో వెలువడుతుందని సీఎం వారికి వివరించారు. కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన నాన్ గెజిటెడ్ అధికారులను బదిలీ చేయాలని.. ఉద్యోగుల మొత్తం బదిలీలు 20 శాతం మించకుండా ఉండాలని, పాత నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చామని సీఎం తెలిపారు. గుర్తింపు పొందిన సంఘాల్లో పనిచేస్తున్న అధ్యక్ష, కార్యదర్శులకు మినహాయింపు కొనసాగించనున్నామని సీఎం వెల్లడించారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల మార్గదర్శకాలు కూడా త్వరలో జారీ చేస్తామని హామీఇచ్చారు. ప్రతినిధి బృందంలో చంద్రశేఖరరెడ్డి, వీరేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి తదితరలు ఉన్నారు.