ఖమ్మం వైరా రోడ్: ఈపీఎఫ్, వేతనాలు చెల్లించాలన్న డిమాండుతో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ రూరల్ వాటర్ సప్లై, శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మద్దెల రవి మాట్లాడుతూ.. తమకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్, వేతనాలు చెల్లించాలని అధికారులను, కాంట్రాక్టర్లను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వేతన బకాయిలు 20లక్షల రూపాయల వరకు ఉన్నాయన్నారు.
ఈపీఎఫ్ డబ్బు 22లక్షలు చెల్లించాల్సుందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఖాతరు చేయలేదని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్లు, కార్మికుల సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబూరావు, రవీంద్రప్రసాద్, కిన్నెర ఉపేందర్, సురేందర్‌రెడ్డి, హరిప్రసాద్, రవి, వెంకటరత్నం, రవికుమార్, పుల్లారెడ్డి, షాబీర్‌హుస్సేన్, రాజు, ఎంవిఎల్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
Published Sat, Aug 23 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement