rws office
-
రామన్‌పాడు నీటిని అందించాలి
– ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముట్టడి నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రాంతానికి రామన్‌పాడు నీటిని సరఫరా చేయాలని కోరుతూ రామన్‌పాడు జలసాధన పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వినర్ సర్ధార్‌అలీ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా రామన్‌పాడు నీరు రాకున్నా ఎమ్మెల్యేగానీ, చైర్మన్‌గానీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతానికి ఏకైక నీటి వనరు రామన్‌పాడు అని, మోటార్లు కాలిపోయాయంటూ నీటి సరఫరా పై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలన్నారు. పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు హిమబిందు, గాయత్రి, లావణ్య, స్వాతి, కావలి శ్రీను, వజ్రలింగం, నరేందర్, వైఎస్సార్సీపీ నాయకులు హుస్సేన్, హెచ్.శేఖర్, సత్యం యాదవ్, జమాల్‌పాషా, కమిటీ కో కన్వినర్ గీతా, సభ్యులు మాదవరెడ్డి, రవిందర్‌గౌడ్, జయశంకర్ పాల్గొన్నారు. -
అద్దాలు పగులగొట్టి 5 లక్షలు చోరీ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బాదితుని వివరాల మేరకు.. బాల్నగర్ మండల జెడ్పీటీసీ పి. ప్రభాకర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఎస్బీహెచ్ నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేశాడు. డబ్బులు కారులో ఉంచి డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ఆర్‌డబ్యుఎస్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం నుంచి తిరిగి వచ్చే సరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో ఆయన డ్యాష్ బోర్డు తెరిచి చూడగా రూ.5 లక్షలు కనిపించలేదు. దీంతో బాదితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
ఖమ్మం వైరా రోడ్: ఈపీఎఫ్, వేతనాలు చెల్లించాలన్న డిమాండుతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ రూరల్ వాటర్ సప్లై, శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మద్దెల రవి మాట్లాడుతూ.. తమకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, వేతనాలు చెల్లించాలని అధికారులను, కాంట్రాక్టర్లను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వేతన బకాయిలు 20లక్షల రూపాయల వరకు ఉన్నాయన్నారు. ఈపీఎఫ్ డబ్బు 22లక్షలు చెల్లించాల్సుందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఖాతరు చేయలేదని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్లు, కార్మికుల సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాబూరావు, రవీంద్రప్రసాద్, కిన్నెర ఉపేందర్, సురేందర్‌రెడ్డి, హరిప్రసాద్, రవి, వెంకటరత్నం, రవికుమార్, పుల్లారెడ్డి, షాబీర్హుస్సేన్, రాజు, ఎంవిఎల్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.