రామన్‌పాడు నీటిని అందించాలి
Published Tue, Aug 30 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
– ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ముట్టడి
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రాంతానికి రామన్‌పాడు నీటిని సరఫరా చేయాలని కోరుతూ రామన్‌పాడు జలసాధన పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వినర్ సర్ధార్‌అలీ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా రామన్‌పాడు నీరు రాకున్నా ఎమ్మెల్యేగానీ, చైర్మన్‌గానీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతానికి ఏకైక నీటి వనరు రామన్‌పాడు అని, మోటార్లు కాలిపోయాయంటూ నీటి సరఫరా పై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలన్నారు. పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు హిమబిందు, గాయత్రి, లావణ్య, స్వాతి, కావలి శ్రీను, వజ్రలింగం, నరేందర్, వైఎస్సార్‌సీపీ నాయకులు హుస్సేన్, హెచ్.శేఖర్, సత్యం యాదవ్, జమాల్‌పాషా, కమిటీ కో కన్వినర్ గీతా, సభ్యులు మాదవరెడ్డి, రవిందర్‌గౌడ్, జయశంకర్ పాల్గొన్నారు.
Advertisement