supply
-
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్‌లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్‌లో తన తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్‌లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్‌కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్‌గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్‌కు ఎగుమతి అయిన స్మార్ట్‌ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్‌కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్‌లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్‌లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్‌గా చైనాను అధిగమించే అవకాశం భారత్‌కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్‌లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది. -
సర్దుబాటు షాక్రూ. 8,113.60 కోట్లు
సాక్షి, అమరావతి: ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) మంగళవారం వెల్లడించాయి. ఏపీఈఆర్సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.1901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థ(ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి. ప్రతి నెలా ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75 శాతం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. ‘బాబు’ గుదిబండ పీపీఏ కోసమే రుణాలుగత ప్రభుత్వంలో సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022–23లో రూ.6,522 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి. దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరా దారులకు యూనిట్ రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్నిబట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్తు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గ్రామాల్లో మంచినీటి సహాయకులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి సరఫరా విషయంలో నూతన ఒరవడికి ప్రభుత్వం నాంది పలికిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలకూ సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యత పరిశీలనతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు జరిగేలా, లీకేజీలను సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని వివరించారు. సోమవారం సచివాలయం నుంచి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా వివిధ విభాగాలవారీగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. విభాగాలవారీగా నూతన పనులకు కార్యాచరణ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లా హాజరయ్యారు. -
ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిపోయిన కొత్త అఫోర్డబుల్ ఇళ్లు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. మరోవైపు 2023 క్యాలెండర్ ఇయర్లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘రియల్ ఎస్టేట్ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా ప్రకారం హైదరబాద్‌లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్‌కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గింది. -
ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా 13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు. త్వరలో రైతు సంఘాలతో సమావేశం త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు. -
సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/కాకినాడ/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో గురువారం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన పునరుద్ధరణ.. ఏపీఎస్పీడీసీఎల్లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. నెల్లూరు సర్కిల్లో 33/11కేవి సబ్స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్ 16, 11కేవీ పోల్స్ 514, 173 డీటీఆర్లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు. డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్ 1,247, డీటీఆర్లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. -
పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలపై పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన ఎనిమిది మంది మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం చార్జిషిట్ దాఖలు చేసింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై 2023 జూన్ 5న చెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులపై ఐపీసీ సెక్షన్ 120(బీ), 143, 147, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 10,13,18,20ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. పట్టుబడిన నిందితులు మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్నట్లు చార్జిషీట్లో తెలిపింది. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేథ్ మెషీన్లు సరఫరా చేస్తుండగా పునెం నాగేశ్వరరావు, దేవనూరి మల్లికార్జున రావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు జన్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి ఆరోగ్యం, బొంత మహేందర్, సోనబోయిన కుమారస్వామిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. పునెం నాగేశ్వరావు, దేవనూరి మల్లికార్జునరావు, వొల్లిపోగుల ఉమాశంకర్‌లు 2023 మార్చిలో డ్రిల్ మిషన్, మే 2023లో ఒక లేథ్ మిషన్ కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ ముగ్గురు నిందితులు మే లో డ్రోన్లు, పేలుడు పదార్థాలు గుర్తించినట్లు తెలిపింది. -
చైనాకు షాక్.. భారత్ నుంచి తైవాన్‌కు వేలాది కార్మికులు!
చైనాకు గట్టి షాక్ ఇచ్చే పని చేస్తోంది భారత్. పక్కనే ఉన్న తైవాన్ దేశానికి వేలాది మంది కార్మికులను పంపనుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య వచ్చే నెలలో కార్మిక ఒప్పందం జరగనుందని తెలిసింది. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనుంది. ఎంప్లాయిమెంట్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై డిసెంబర్లో భారత్, తైవాన్లు సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో వయసు పైబడినవారి జనాభా పెరిగిపోయింది. ఫలితంగా పనిచేసే సామర్థ్యం ఉన్న యువతకు అక్కడ కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. అదే సమయంలో భారత్‌లో దీనికి విరుద్ధ పరిస్థితి నెలకొంది. దేశంలో యువత జనాభా పుష్కలంగా ఉంది. లేబర్ మార్కెట్లోకి ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఈ ఉపాధి ఒప్పందం చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను రాజేసే అవకాశం ఉంది. ఎందుకంటే తైవాన్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా చైనాకు నచ్చదు. తైవాన్ స్వతంత్ర ప్రాంతంగా ఉన్నప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. ధ్రువీకరించిన అధికారి భారత్-తైవాన్ ఉపాధి ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాకు తెలియజేశారు. అయితే తైవాన్ కార్మిక శాఖ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తమ దేశానికి కార్మిక సహకారం అందిస్తే స్వాగతిస్తామని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు చెప్పింది. కాగా భారత్ ఇప్పటి వరకు జపాన్, ఫ్రాన్స్, యూకే సహా 13 దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. నెదర్లాండ్స్, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్లతోనూ ఇదే విధమైన ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
పరువు పోగొట్టుకున్న రామోజీ !
-
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
దిగొస్తున్న టమాటా ధర
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది. ఈ ధరలు వచ్చే సెపె్టంబర్ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్‌లోని పింపాల్‌గావ్ బస్వంత్ మార్కెట్‌కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది. -
హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్, గంజాయి సీజ్
-
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్‌హౌజ్‌ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది. సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు. వాడింది 240 మెగావాట్లే! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్‌లలోకి నీళ్లను ఎత్తిపోశారు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్‌ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌కి నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్‌ను నడిపారు. దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్‌ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో అనుమతిచ్చింది. యాదాద్రి విద్యుత్ వస్తే.. తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్‌కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్‌కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్‌కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్‌కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్‌ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా బ్యారెల్‌పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్‌ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్‌ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్‌కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
మంచి నీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్
-
చింతబావి బస్తీలో నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా
-
విద్యుత్ పాదుపు..ప్రగతికి మలుపు
-
అన్నదాతను అనుసంధానించాలి
ఇది సమాచార విప్లవ యుగం. సరైన సమాచారం ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ ఉంటే ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతన్నకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. చాలా సందర్భాలలో ఉత్పత్తి దారులూ, వినియోగదారులూ ఒకే ప్రాంతంలో ఉన్నా ఆ విషయం వారికి తెలియక దూర ప్రాంతాల వారితో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఉదాహరణకు నా దృష్టికి వచ్చిన ఉదంతం చెబుతాను. సత్యసాయి జిల్లా కదిరిలో పండిన వేరుశనగ వంగడాన్ని నల్లగొండ జిల్లా వాసి కొనుగోలు చేశాడు. కదిరి ప్రక్కనే ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండల వాసికి కదిరిలో ఆ వంగడం ఎవరిదగ్గర ఉందో తెలియక దళారీ ద్వారా నల్లగొండ జిల్లా వాసి నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుబాటులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సహజంగా ఏ వస్తువైనా ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అమ్మకపుదారు నుండి ధరలో రాయితీ లభిస్తుంద న్నది వాస్తవం. మన చుట్టు పక్కల వినియోగదారులను కలిపే ఒక అప్లికేషన్ లాంటిది ఉంటే ఒక వీధిలోనో లేదా ఊరులోనో ఉన్నవారందరూ ఉమ్మడిగా తక్కువ ధరకు కొని సరుకును పంచుకోవచ్చు. అలాగే అమ్ముకునేవారికీ ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయి లాభం కలుగుతుంది. చాల సందర్భాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రత్యేకత ఉన్నా దానిని లాభదాయకంగా అమ్ము కోవడంలో రైతు విఫలమవుతున్నాడు. రైతుల ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియజేసే ఒక సమాచార వ్యవస్థ ఉంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నా ఇంకొక ప్రాంతం వారికి అంతగా తెలియడం లేదు. ఉదాహరణకు రుచికరమైన కోనసీమ చక్కరకేళి అరటిపండ్లు నేపాల్ దేశానికి ఎగుమతి చేస్తారు. 2015 సంవత్సరంలో నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వాటిని ఎగుమతి చేయలేక, రోడ్ల మీద పడవేయ వలసి వచ్చింది. నిజానికి రాయలసీమ ప్రాంతంలో వాటి గురించి చాలా తక్కువగా తెలుసు. ఒక వేళ తెలిసి ఉంటే కనీస ధరకన్నా కోనసీమ రైతుల దగ్గర రాయలసీమ వినియోగదారులు కొనుక్కుని ఉండేవారు. పైన పేర్కొన్నట్లు రైతులకూ, వినియోగదారులకూ సరైన సమాచారం అందించడానికి సచివాలయ వ్యవస్థను బాగా వాడుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రైతు భరోసాకేంద్రాలను అనుసంధానించాలి. ఆయా గ్రామాల్లో పండించే పంటల వివరాలను, రైతు ఫోన్ నంబరుతో సహా సచివాలయ వెబ్సైట్లో ఉంచాలి. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలన్నింటినీ అనుసంధానించి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచే సమాచార వ్యవస్థను రూపొందించగలిగితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఆయా సచివాలయ సిబ్బందితోగానీ లేదా రైతుతోగానీ సంప్రదించి కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇందులో దళారీల ప్రమేయం లేదు కాబట్టి అటు రైతుకూ, ఇటు కొనుగోలుదారునికీ కూడ ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను ఉపయోగించి ఒక్కో సచివాలయం పరిధిలోని ప్రజలను ఒక కొనుగోలు దారుల గ్రూపుగా తయారుచేయవచ్చు. ఉదాహరణకు సచివాలయ పరిధిలోని ప్రజలు కలసి టమోటా అవసరమనుకుంటే వాటిని ప్రక్క గ్రామంలో ఉన్న రైతే నేరుగా సరసమైన ధరకు అందించవచ్చు. గూగుల్ యాప్‌లో తమకు కావలసిన వస్తువులు దగ్గరలో ఎక్కడ దొరకుతాయో వెబ్సైట్లో వెతికి తెలుసుకునే సౌకర్యం ఉంది. అటువంటి సౌకర్యమే ఈ అప్లికేషన్లో పొందు పరచవచ్చు. కేవలం రైతు పండించే పంటలకే కాక చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల వివరాలనూ ఈ సమాచార వ్యవస్థలో భాగం చేయాలి. ఇందువల్ల రాష్ట్రంలో ఏఏ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయో తెలియడమే గాక వాటికి ఉన్న డిమాండ్ కుడా తెలుసుకోవచ్చు. ఇలా సప్లయ్, డిమాండ్ల సమాచారం తెలియడం వల్ల వాటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా అయితే ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ మేలు చేకూరుతుంది. - డాక్టర్ జి.వి. సుధాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు -
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్‌పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్ పాయింట్‌ను జిల్లా అధికారులు ప్రారంభించారు. సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!. ఇళ్ల మంజూరు ఇలా... పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సక్రమంగా ఇసుక అందేలా... ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్ కన్స్ట్రక్ష న్స్‌కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్‌లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి హర్షవర్దన్ ప్రసాద్ చెప్పారు. ఇసుక పక్కదారి పట్టకుండా... గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనరేట్ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు స్టాక్ పాయింట్‌కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు. సత్వరమే బిల్లుల చెల్లింపు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి. – ఎస్వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం -
చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: సరఫరాల్లో సమస్యల కారణంగా కొత్త స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ తగ్గింది. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల విచక్షణారహిత వినియోగానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్ ఫోన్లకు (నవీకరించినవి) గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యంత్రా అన్నది మొబైల్ రిపేర్, రీఫర్బిష్డ్ సేవల్లోని కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్‌జా మాట్లాడుతూ.. రూ.4,000–6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ల నిల్వలు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే నవీకరించిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు గడిచిన ఏడాది కాలంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్సెట్లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. వచ్చే 12–18 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 450 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. యంత్ర ప్లాట్‌ఫామ్ వినియోగించిన ఫోన్లను ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేస్తుంటుంది. వాటిని నిపుణులతో తనిఖీ చేయించి తిరిగి మంచి స్థితిలోకి తీసుకొచ్చి (రీఫర్బిష్డ్) విక్రయిస్తుంటుంది. కొత్త ఫోన్ల మాదిరే రీఫర్బిష్డ్ ఫోన్లపైనా ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. కరోనా రాకతో ఆన్లైన్ వినియోగం పెరగడం తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్‌ల సాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్లైన్ పాఠాలకు మళ్లడం చూశాం. ఈ పరిస్థితులు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్‌ను పెంచేశాయి. 4.8 కోట్ల విక్రయాలు.. గతేడాది కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లు ప్రకటించడం తెలిసిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాతో చైనాలోని విమానాశ్రయలు, ఓడరేవుల్లో కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించాల్సి వచ్చింది. దీంతో చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిభాగాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడం వంటి పరిస్థితులు పాత ఫోన్లకు డిమాండ్‌ను తెచ్చిపెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల ల్యాప్‌టాప్‌లు, రూ.10,000–15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. 2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. జగనన్న కాలనీలకు ఇసుకను నేరుగా రీచ్‌ల నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ-పర్మిట్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగా నిల్వలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 50 లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకి 3 లక్షల టన్నుల ఇసుక తీస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి -
‘ఏపీలోనే కాదు.. యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదు’
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు. చదవండి: ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’ -
కరోనా వ్యాక్సిన్ ఆన్లైన్లో దొరకనుందా..!
దేశ ప్రజలకు కరోనా టీకాలను చేరువ చేయడంలో హెల్త్ అగ్రిగేటర్లు (ఆన్లైన్ హెల్త్‌కేర్/ఫార్మసీ సంస్థలు) కూడా పాలుపంచుకోనున్నారు. 1ఎంజీ, ఫార్మ్ఈజీ, మెడిబుడ్డి తదితర సంస్థలు ఇప్పటికే టీకాల తయారీ సంస్థలతో చర్చలు కూడా మొదలు పెట్టాయి. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో టీకాలను దేశంలోని నలుమూలలకూ వేగంగా సరఫరా చేయడంతోపాటు తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు హెల్త్ అగ్రిగేటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ టీకాల టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ కోవిన్‌తో అనుసంధానం కావడం ద్వారా ప్రతీ టీకా నమోదు చేయడంలో భాగస్వామ్యం అవ్వాలని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కోవిన్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌లు అనుసంధానం కావడం వల్ల పెద్ద ఎత్తున వైద్యులు, క్లినిక్‌లు, ఆరోగ్య సిబ్బందితో నెట్వర్క్ భారీగా విస్తృతం అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 వేల ప్రభుత్వ, 7 వేల ప్రైవేటు కేంద్రాల్లోనే టీకాలను వేస్తుండగా.. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకాలను వేగంగా ఇవ్వాలంటే ఈ నెట్వర్క్ చాలదు. హెల్త్‌కేర్ అగ్రిగేటర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తే నెట్వర్క్ విస్తృతం కావడం ద్వారా మరింత మందికి టీకాలను చేరువ చేసే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక పాత్ర..: ‘‘ప్రస్తుతం టీకాలను ఇచ్చే కార్యక్రమం పరిమితంగానే ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రులపై ఇప్పటికే ఎంతో భారం నెలకొంది. కనుక ఈ విషయంలో మా వంటి నెట్వర్క్ ప్రొవైడర్లు పెద్ద పాత్ర పోషించవచ్చు’’ అని 1ఎంజీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ టాండన్ పేర్కొన్నారు. ప్రజలు తమ వంటి పోర్టళ్లలో పేర్లను నమోదు చేసుకుంటే.. వారికి సమీపంలో టీకాలను ఇచ్చే క్లినిక్ లేదా ల్యాబ్ విషయమై సూచనలు చేయడానికి వీలుంటుందన్నారు. 1ఎంజీ ఆన్లైన్ ఫార్మసీ, ల్యాబ్ తదితర సేవలను ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థకు 1.5 కోట్ల కస్టమర్లు ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు, పెద్ద హౌసింగ్ సొసైటీల్లో టీకాల క్యాంపులను ఏర్పాటు చేసేందుకు 1ఎంజీ ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించింది. ‘‘కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత దృష్ట్యా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి సుముఖత చూపకపోవచ్చు. లేదా కొందరు బయటకు రాలేని పరిస్థితి ఉండొచ్చు. కనుక అటువంటి వారి ఇంటికే నేరుగా వెళ్లి టీకాలిచ్చేందుకు మేము ఆసక్తిగా ఉన్నాము. కాకపోతే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది’’అని ప్రశాంత్ టాండన్ వివరించారు. నేరుగా టీకాలు ఇచ్చేందుకు సుముఖం.. భారీ ఆస్పత్రుల చైన్లతోపాటు ఆరోగ్య సంరక్షణ సంస్థలు సైతం కో విన్ ప్లాట్‌ఫామ్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా 30 పట్టణాల పరిధిలో మాకు కోల్డ్ చైన్ నెట్వర్క్ (శీతలీకరించిన నిల్వ, సరఫరా నెట్వర్క్) ఉంది. మా సిబ్బందికి టీకాలు ఇవ్వడంపై శిక్షణ కూడా ఇచ్చాం. టీకాలను నేరుగా కొనుగోలు చేసి పెద్ద కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము’’ అని హోమ్ హెల్త్‌కేర్ సేవల సంస్థ పోర్టియా మెడికల్ సీఈవో మీనా గణేష్ తెలిపారు. ఫ్లూ వ్యాక్సిన్ల దేశవ్యాప్త సరఫరా అనుభవం తమకు ఉందన్నారు. టీకాల సరఫరాదారులతో ఈ సంస్థ ఇప్పటికే చర్చలు కూడా నిర్వహిస్తోంది. -
ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లం.. ఓ వైద్యుడి భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తగా కరోనా మహమ్మారి విలయం రోజుకు రోజుకు మరింత ఉధృతమవుతోంది. దీంతో దేశంలో ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 ప్రభావిత రాష్ట్రం ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాధితులు ఊపిరాడక తమ కళ్లముందే విలవిల్లాడుపోతోంటే తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో దుర్భర పరిస్థితి, రోగుల ప్రాణాలను కాపాడలేని తమ నిస్సహాయతపై ఒక సీనియర్ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని అతిపెద్ద ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లకల్లోలమవుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించాయి. తక్షణమే అన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య సదుపాయాలు, రోగుల ప్రమాదకర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సునీల్ సాగర్ కంట తడిపెట్టారు. వైద్యులుగా రోగుల ప్రాణాలను కాపాడాల్సిన తాము, కనీసం ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న చాలామందిని డిశ్చార్జ్ చేయవలసిందిగా వైద్యులను కోరామని, చాలా క్రిటికిల్ గా ఉన్న వారికి ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ప్రాణాలను నిలపాల్సిన తాము చివరికి ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతే... పరిస్థితి ఏమిటి... వారు చనిపోతారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆసుపత్రిలో ఉన్న స్టాక్స్ మహా అయితే రెండు గంటలకు సరిపోతుందని డాక్టర్ సాగర్ చెప్పారు. తమ రెగ్యులర్ సరఫరాదారు ఐనాక్స్ కాల్స్‌కు స్పందించడం మానేసిందని ఆరోపించారు. మరోవైపు రోహిణి సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, 51 ఏళ్ల ఆశిష్ గోయల్ వెంటిలేటర్లో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బందులనెదుర్కాను. అయితే 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ దగ్గర ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా భయంకరంగా ఉంది.. తమకు ఎవరూ రక్షణ లేరంటూ బావురుమన్నారు గోయల్. అటు ఘజియాబాద్‌లోని లక్ష్మీచంద్ర ఆసుపత్రి అంబులెన్స్‌లు ఇప్పుడు రోగులకు బదులుగా ఆక్సిజన్ రీఫిల్స్ సిలిండర్లను రవాణా చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అదే జిల్లాలోని చంద్రలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గోయల్, " మా వద్ద ఆక్సిజన్ లేదు, మందులు లేవు.. పేషంట్లను స్వీకరించలేను క్షమించండి’’ అంటూ ఏకంగా బోర్టు పెట్టేశారు. ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజధానిలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఒక జాబితా విడుదల చేశారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, తీరత్ రామ్ షా హాస్పిటల్, యూకే నర్సింగ్ హోమ్, రాఠి హాస్పిటల్ , శాంటం హాస్పిటల్ ఇందులోఉన్నాయి. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) చదవండి : ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా #WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "...We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged...It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG — ANI (@ANI) April 22, 2021 -
కరోనా టెస్టులకు గండం.. చేతులెత్తేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని కొంద రు అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కరోనా పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే అనేకచోట్ల కొద్దిమందికే పరీక్షలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోనైతే ఈ రోజుకు ఇంతేనని చెప్పి పంపుతున్నారు. కొరత నేపథ్యంలో వైద్యాధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిట్ల నిల్వ అయిపోయే వరకు నిద్రపోయారా అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. అత్యవసరంగా లక్షన్నర కిట్లు రెగ్యులర్‌గా అవసరానికి తగినట్లుగా సరఫరా చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. మహారాష్ట్ర సహా దేశంలో కరోనా విజృంభణ పెరగడంతో కంపెనీ ఆయా ప్రాంతాలకు కిట్లను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఒకేసారి అధికంగా కిట్లను సరఫరా చేయలేమంది. ఢిల్లీలో లాక్డౌన్ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఆ ప్రభావం రాష్ట్రంలో కిట్ల కొరతకు దారితీసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బుధవారం వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్షలోపు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, లక్షన్నర లోపు ఆర్టీపీసీఆర్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి కరోనా పరీక్షలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై లక్షన్నర కిట్లను కొనుగోలు చేశారు. ఈ కిట్లు బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయనీ, గురువారం అన్ని పరీక్ష కేంద్రాలకు కిట్లను పంపిస్తామని అధికారులు తెలిపారు. అయితే రెండ్రోజులు ఎలాగోలా నెట్టుకొస్తారు తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మూడు నెలలకు సరిపోయేలా... కరోనా పరీక్షలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం నెలకొనడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు తక్షణం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలలకు సరిపోయేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతి ఇచ్చింది. దీంతో నూతన టెండర్‌కు వెళ్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్‌కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్ల విటమిన్–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్‌కతాతోపాటు రాజస్తాన్ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్ మార్కెట్‌కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్‌కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్‌సేల్‌లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మ, కివీ సైతం... ఇక సీ-విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్‌కు వెయ్యి బాక్స్‌ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్‌లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం -
విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ లో అమ్మకాలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే కాదు.. విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్మెంట్లో నైపుణ్యాన్ని పొందవచ్చు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య కీలకంగామారిన ఇకామర్స్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి లాంచ్‌ప్యాడ్ రూపొందించామనీ, దీర్ఘకాలంలో మంచి అర్హత కలిగిన, బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన నిపుణులతో తమ సప్లయ్ చెయిన్ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. (వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు) ఫ్లిప్‌కార్ట్ ఇందుకోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, ఉలుబేరియా, డంకుని (పశ్చిమబెంగాల్), కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్మెంట్ గురించి ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యా సేతు యాప్, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటి సంబంధిత కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తామని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు యువ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. గత ఏడాది ప్రారంభించిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో 'ది బిగ్ బిలియన్ డేస్ 2019' సందర్భంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు శిక్షణ పొందారని గుర్తు చేశారు. -
‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు
సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నీటి విడుదలతో.. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. ధర తక్కువంటూ.. ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్ పురుగు, దోమలకు , మూవ్ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నష్టాలు ఎక్కువే... గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి -
కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఎస్ఐఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచ జనాభా అంతటికీ అందించేందుకు నాలుగైదేళ్ల సమయం పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ ఆధార్ పూనావాలా పేర్కొన్నారు. 2024 వరకూ కరోనా వ్యాక్సిన్ కొరత ప్రపంచాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా మొత్తానికి సరిపోయేలా వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఫార్మా కంపెనీలు పెంచడంలేదని వాపోయారు. దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవసరమైన కోల్డ్‌చైన్ మౌలిక సదుపాయాలు లేవని భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 40 కోట్లకు మించిన డోసులపై మన దగ్గర ఇప్పటికీ ఎలాంటి ప్రణాళిక లేదని, దేశానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం మనకున్నా దాన్ని వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండరాదని ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోసుల కార్యక్రమంగా చేపడితే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు. కాగా, కరోనా వైరస్ వ్యాక్సిన్ల తయారీకి ఆస్ర్టాజెనెకా సహా ఐదు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో సీరం ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్స్ఫర్డ్-ఆస్ర్టాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి 100 కోట్ల డోసులను తయారు చేసేందుకు ఎస్ఐఐ సంసిద్ధమైంది. వీటిలో సగం భారత్‌లో సరఫరా చేస్తారు. ఇక ఇటీవల నిలిచిపోయిన ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలకు వైద్య నియంత్రణ మండలి అనుమతి లభించడంతో పున:ప్రారంభమయ్యాయి. చదవండి : వచ్చే ఏడాది మొదట్లో టీకా -
అడ్డదారుల్లో మద్యం అమ్మకాలు
మద్య నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఉన్నతాశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చి విక్రయాలు చేస్తూ వ్యాపారంగా మార్చుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అడ్డదారుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను (ఎన్డీపీ) అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దృష్టి సారించింది. ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించి విక్రయాలకు బ్రేక్ వేస్తోంది. నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీ మద్యనిషేధం అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ, 33 శాతం దుకాణాల కుదింపు, పరి్మట్రూమ్ల రద్దు, బెల్టుషాపులపై ఉక్కుపాదం తదితర చర్యలు తీసుకుంది. మద్య వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను భారీగా పెంచింది. దీంతో కొందరు మందుబాబులు స్వచ్ఛందంగా మద్యానికి స్వస్తి పలుకుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంకొందరు దీనిని వ్యాపారంగా మార్చుకుని తమిళనాడు మద్యం బాటిళ్లను జిల్లాకు తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా.. ►తమిళనాడు రాష్ట్రం జిల్లాకు సరిహద్దు ప్రాంతం. మన రాష్ట్రాంలో ఓ బ్రాండ్ క్వార్టర్ మద్యం ధర రూ.450 ఉండగా అదే మద్యం ధర తమిళనాడు రాష్ట్రంలో రూ.300కే దొరుకుతోంది. ►ఈక్రమంలో సూళ్లూరుపేట, తడ, మన్నారుపోలూరు, చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, నడిమికుప్పం తదితర ప్రాంతాలకు చెందిన అనేకమంది మందుబాబులు పక్క రాష్ట్రంలోని ఆరంబాకం, గుమ్మడిపూండి, చిన్నోబులాపురం, వీరకాడు తదితర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ►కొందరు అక్రమార్కులు ఇదే అవకాశాన్ని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. ►తడ నుంచి తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లేందుకు వివిధ మార్గాలు ఉండడంతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని తమిళ మద్యాన్ని జిల్లాలోకి తీసుకువస్తున్నారు. ►ఫుల్ బాటిల్‌పై రూ.500 నుంచి రూ.800 మార్జిన్ పెట్టుకుని విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచి వివిధ మార్గాల్లో అక్కడి మద్యం సైతం జిల్లాలో అందుబాటులో ఉంది. తనిఖీలు నామమాత్రమే.. ►జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులున్నా అక్కడ తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ►పక్కా సమాచారం ఉంటే తప్ప చెక్‌పోస్ట్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ►కొందరు సిబ్బంది సైతం అక్రమరవాణాకు సహకరిస్తున్నారని ప్రచారం ఉంది. బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల ద్వారా మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ప్రత్యేక నిఘా ►పొరుగు మద్యం అక్రమ విక్రయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దృష్టి సారించింది. ►ఆ విభాగ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి.రాధయ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ►ఎస్ఈబీ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసాచారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సరిహద్దు చెక్‌పోస్టులతోపాటు అంతర్గత రహదారుల వద్ద నిఘా పెట్టి దాడులు ముమ్మరం చేశారు. ►నెలరోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 70.02 లీటర్ల మద్యం, 3.9 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. ►మద్యాన్ని తరలిస్తున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ►తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అధికారులు సుమారు 146 లీటర్ల మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో కట్టడికి.. స్థానిక పోలీసుల సహకారంతో పొరుగు రాష్ట్ర మద్యాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్ఈబీ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా అక్రమరవాణా, విక్రయాలపై నిఘా ఉంచనున్నారు. అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్న సిబ్బంది ఎవ్వరనే విషయంపై రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. దాడులు ముమ్మరం మద్యం అక్రమరవాణా, నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై జిల్లావ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తున మద్యం పట్టుకోవడంతోపాటు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం (ఎన్డీపీ) మద్యం అక్రమరవాణా, విక్రయాలపై దృష్టి సారించాం. దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ఈబీ ఏర్పాటైన నాటినుంచి ఎన్డీపీ విక్రయాలు, రవాణాపై ఇప్పటివరకు 21 కేసులు నమోదు చేశాం. నాటుసారా తయారీ, విక్రయాలపై దాడులు చేసి కేసులు పెట్టాం. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తాం. –డాక్టర్ వి.రాధయ్య,ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ -
భారత్‌కు సువర్ణావకాశం
ముంబై: ఏకైక సరఫరా మార్కెట్‌గా చైనాపై ప్రపంచం అధికంగా ఆధారపడడం కరోనా తర్వాత తగ్గిపోతుందని, ఇది భారత్‌కు మంచి అవకాశమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. గ్రూపు కంపెనీ టీసీఎస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆన్లైన్లో నిర్వహించగా.. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (ఇంటి నుంచే పని) విధానానికి మారుతోందని.. టీసీఎస్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. చైనాతోపాటు మరో 50 దేశాల్లో టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా దేశాల్లోని ఉద్యోగులను స్థానిక ప్రాజెక్టులతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులకూ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏజీఎంలో వాటాదారులు వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించగా.. ప్రస్తుతం ఈ విధానానికి మళ్లడం అన్నది ఖర్చుతో కూడుకున్నదంటూ.. కరోనా తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంటి నుంచే పని చేయవచ్చని చంద్రశేఖరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీసీఎస్ కేంద్రాల్లో 25 శాతం మందే పనిచేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఊహించి రాసినవిగా పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సరికొత్త ధోరణిగా పరిగణిస్తూ దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. అనుసంధానం, కంప్యూటర్ పరికరాలే కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ఇంటి వద్దకే ఇసుక
-
మస్తుగా ఇసుక!
సాక్షి ప్రతినిధి విజయనగరం: వర్షాలు విస్తారంగా కురవడంతో వచ్చిన వరదల కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలకు అంతరాయం కలిగింది. అంతేగాకుండా సరఫరాలో పారదర్శకత ఉండాలనీ... ఎలాంటి అక్రమాలకు తావుండకూడదనీ కొత్తగా ఇసుక పాలసీ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సరఫరాలో కాస్తంత అతరాయం జరిగింది. దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని విపక్షం చూసింది. ఇదేదో ఘోర వైఫల్యం అన్నట్టు ఆందోళనలకు... విమర్శలకు తెరతీసింది. కానీ అనూహ్యంగా వారి కుట్రలను భగ్నం చేస్తూ విరివిగా రీచ్‌లు ప్రారంభించి... అవకాశం ఉన్న చోట స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి కావలసినంత ఇసుక అందుబాటు ధరకు సరఫరా చేయడంతో వారి గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడినట్టయింది. గత నెల 15న ఇసుక వారోత్సవాల పేరుతో జిల్లాలో ఇసుక సరఫరా మొదలుపెట్టారు. ప్రారంభంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇసుక అందించేవారు. ఇప్పుడిక ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇసుక అందుబాటులోకి రావడంతో ఆఫ్‌లైన్‌లోనే అందిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలకు నగదు చెల్లించి ఇసుక తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ట్రాక్టర్ ఇసుక ఇసుక రేటు, లేబర్ చార్జీలతో కలుపుకుని దాదాపు రూ.1600 వరకూ ఉంది. వాహనాన్ని వినియోగదారుడే తీసుకువెళితే ఈ రేటు. లేదంటే వాహనం అద్దెను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రీచ్‌లలో తవ్వకాల జోరు.. జిల్లాలో మొత్తం 76 ఇసుక రీచ్‌లుండగా వీటిలో 60 రీచ్‌లను తెరిచారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 1,34,577.25 టన్నుల ఇసుక సరఫరా చేశారు. డెంకాడ స్టాక్‌యార్డ్ నుంచి ఇప్పటి వరకూ 3156.5 టన్నులు, బొబ్బిలి స్టాక్‌యార్డ్ నుంచి 400 టన్నులు డెంకాడ పట్టాభూమి నుంచి 9014 టన్నులు ఇసుక విక్రయించారు. ఆదివారం ఒక్కరోజే 974 టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించారు. డెంకాడ పట్టాభూముల్లో ఇసుక విక్రయాలు ఆదివారంతో ముగిశాయి. అక్కడే మరో 20వేల టన్నుల ఇసుక త్వరలోనే అందుబాటులోకి రానుంది. అధికారులు ఇప్పటికే భూమిని పరిశీలించి ప్రభుత్వ అనుమతికోసం నివేదిక పంపించారు. నిర్మాణానికి ఇక కొరత ఉండదు నిర్మాణ పనులకు ఇసుక కొత లేకుండా అవసరమైన మేరకు లభ్యతను బట్టి వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రేవులకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్లు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటినీ అదిగమించాం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీస్, రెవిన్యూ, గనుల శాఖలతో మూడు చెక్‌పోస్టులు కూడా నడుపుతున్నాం. ఇకపై ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
వంటింట్లో ఉల్లి మంట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి మళ్లీ ఘాటెక్కింది. పొరుగు రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, ధరలపై నియంత్రణ లేకపోవడంతో వంటింట్లో ఉల్లి మంటెక్కిస్తోంది. వారం రోజుల కిందటి వరకు మేలురకం కిలో ఉల్లి ధర రూ.50 పలుకగా అది ప్రస్తుతం ఏకంగా రూ.100కి చేరింది. సాధారణ రకం ఉల్లి ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గడం, మరో ఇరవై రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ధరల కళ్లేనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. పొరుగు నుంచి తగ్గిన సరఫరా రాష్ట్రంలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 13వేల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది అది 5వేల హెక్టార్లకే పరిమితమైంది.ఆలంపూర్, నారాయణఖేడ్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది పంట చాలా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహారాష్ట్రలోని పూణే, ఔరంగాబాద్, కర్ణాటకలోని బగల్‌కోఠ్, కొల్హాపూర్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్‌లో క్వింటాలు ధర కనిష్టంగా రూ.310, గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండగా అవి సెప్టెంబర్ నుంచి పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4,070కు చేరింది. ప్రస్తుతం క్వింటాల్‌ను రూ.4,650 వరకూ విక్రయిస్తున్నారు. నియంత్రణ ఉందా? ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపారుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఈ పరిమితులపై నిఘా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎక్కడా నిల్వలపై విజిలెన్స్ దాడులు జరిగిన దాఖలాలు లేవు. -
ప్రతి ఇంటికీ శుద్ధజలం
సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్న సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న సాగునీటి రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని ప్రజలందరికీ సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదు. మరోవైపు జిల్లాలో వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఒక్క నాగావళి నది ద్వారా 16టీఎంసీల నీరు ఏటా ప్రవహిస్తుండగా అందులో 4టీఎంసీలు కూడా వినియోగించుకోలేకపోతున్నాం. చంపావతి, వేగావతి, గోస్తనీ... ఇలా ఏ నది చూసినా ఇలానే ఉంది. ఆ నదుల నీటిని వినియోగించుకునేందుకు వాటిపై జలాశయాలు ఉన్నా నీరంతా నిల్వ చేయకపోవడంతో కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఒక శాశ్వత ప్రాజెక్టు రూపకల్పన చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా శుద్ధి చేసిన నీరు మాత్రమే సరఫరా చేసేలా కసరత్తు చేయాలని సూచించింది. ప్రాజెక్టులున్నా... తాగునీటికి కటకటే.. ఇప్పటివరకు ప్రజలకు బోర్ల ద్వారానే తాగునీరు అందుతోంది. రక్షిత మంచినీటి పథకాలు కొన్ని చోట్ల, పైపులైన్ల ద్వారా మరికొన్ని చోట్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ల ద్వారా నేరుగా ఇంటికే కొన్ని గ్రామాలు, పట్టణాల్లో నీటిసరఫరా జరుగుతుండగా కొన్నిచోట్ల మాత్రం పథకాల నుంచే జనం తెచ్చుకుంటున్నారు. బోర్లు పాడైనా, భూగర్భజలాలు ఇంకినా తాగునీటి సరఫరా అందడం కష్టంగా మారింది. వాస్తవానికి జిల్లాలో జలాశయాలున్నా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే పథకాలు జిల్లాలో లేవు. తోటపల్లి నుంచి పార్వతీపురానికి, తారకరామతీర్థసాగర్ నుంచి విజయనగరానికి నీరందించే ప్రతిపాదనలు ఉన్నా అమలు కాలేదు. తాటిపూడి నీరు విశాఖ వాసుల గొంతు తడుపుతున్నా జిల్లాకు ఉపయోగపడటం లేదు. శుద్ధ జలం కోసం రూ.2600కోట్లుతో డీపీఆర్‌జిల్లాలో ప్రాజెక్టుల నుంచే తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నుంచి గ్రావిటీ ద్వారానే నేరుగా నీరు పట్టణాలు, గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు అందించడం, పైపులైన్ల ద్వారా సరఫరా తెచ్చి ఇంటింటికి కుళాయి ద్వారా అందించడం లక్ష్యంగా ప్రాజెక్టు రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ విధంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పీడబ్ల్యూ స్కీంలు, సీడబ్ల్యూ స్కీంలు, కేంద్ర ప్రభుత్వం సుజల పథకం, ఇతర తాగునీటి వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్తగా చేపట్టాల్సిన పనుల కోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను జిల్లా అధికారులు తయారు చేశారు. ఇందుకు మొత్తం రూ.2600కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రిపోర్టుపై రెండురోజుల క్రితం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించారు. ఆయన సూచన మేరకు చిన్నచిన్న మార్పులు చేసి రిపోర్టును ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. సంక్షేమం ఒక వైపు... సమగ్రాభివృద్ధి మరోవైపు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో చేపడుతున్న కార్యక్రమాలు. ఒకవైపు వివిధ వర్గాల అభ్యున్నతికి పలు పథకాలను రూపొందించి అమలు చేస్తుండగా... ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటికీ శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో ఓ బృహత్తర పథకానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం జిల్లాలోని నదీజలాలను సద్వినియోగించుకునేలా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు రూపొందించారు. రిపోర్టు పంపిస్తున్నాం ప్రాజెక్టుల నుంచి శుద్ధ జలం ప్రాజెక్టుపై నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనల మేరకు కొంచెం మార్పులు చేసి శుక్రవారం పంపించాం. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నిధులు మంజూరైతే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తాం. 2021 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ సూచన మేరకు సకాలంలో పక్రియ పూర్తి చేశాం. – రవికుమార్, ఇన్‌ఛార్జి ఎస్ఈ, విజయనగరం డీపీఆర్ ప్రకారం ప్రతిపాదనలు ఇలా... ⇔ తోటపల్లి నుంచి కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలు, పార్వతీపురంలో మూడు, సాలూరులో 1, గజపతినగరంలో 2, విజయనగరంలో 1, నెల్లిమర్లలో 4, బొబ్బిలిలో 3మండలాలు(మొత్తం 19 మండలాలు), అన్ని పురపాలక సంఘాలకు. ⇔ శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని నాగావళి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు. ⇔ మడ్డువలస నుంచి బలిజిపేట, తెర్లాం ⇔ పెద్దగెడ్డ నుంచి పాచిపెంట ⇔ వెంగళరాయసాగర్ నుంచి: సాలూరు రూరల్ ⇔ తాటిపూడి నుంచి ఎస్.కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు, గజపతినగరం నియోజకవర్గంలో గంట్యాడ, బొండపల్లి మండలాలకు. -
ట్రంకు పెట్టెల గోల్మాల్
సాక్షి, అనంతపురం: బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు ట్రంకు పెట్టెల సరఫరాలో గోల్మాల్ జరిగింది. పెట్టెల సరఫరా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద, రెండొందలు కాదు.. ఏకంగా రూ.89,50లక్షలు ఏజెన్సీ ఖాతాలోకి జమ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు చేరకపోవడం చూస్తే.. అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి పెట్టెలను హాస్టళ్లకు సరఫరా చేసిన తర్వాత నిబంధనల ప్రకారం నాణ్య తను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే, ఒక్కటంటే ఒక్క పెట్టె సరఫరా చేయక ముందే బిల్లు చెల్లించడం గమనార్హం. ఫిబ్రవరిలో బిల్లు పెట్టిన అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న బిల్లు మంజూరు చేసిన అధికారులు ట్రెజరీకి పంపించారు. అయినా సదరు ఏజెన్సీ పెట్టెలు సరఫరా చేయలేదు. అనివార్య కారణాల వల్ల బిల్లు ట్రెజరీలో పెండింగ్ పడినా మే 2న ఏజెన్సీ ఖాతాలో జమ అయ్యింది. నాలుగు రోజులు గడిస్తే సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేసినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారమైనా ఇంకా 2,784 ట్రంకు పెట్టెలు సరఫరా చేయాల్సి ఉంది. 8వేల పెట్టెలు మాత్రమే సరఫరా చేశారనేది బీసీ సంక్షేమశాఖ అధికారుల లెక్క. అంటే.. ఇంకా 3,784 సరఫరా చేయాల్సి ఉంది. ఎవరి లెక్కలు వాస్తవమో వారికే తెలియాలి. టెండరు దక్కించుకున్న తర్వాత నెలలోపు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడు నెలలవుతున్నా పూర్తిస్థాయిలో పెట్టెలు సరఫరా చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అన్నింటా ఇదే పరిస్థితి హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రలు సరఫరా చేయడంలోనూ అధికారులు ఇదేరకంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వస్తువులు సరఫరా చేయకముందే పునీత్ ఏజెన్సీకి రూ.73 లక్షల బిల్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్లేట్లు, గ్లాసులకు సంబంధించి రూ.13,81,610, వాటర్ డ్రమ్ములకు రూ.2,88,000, చార్జింగ్ లైట్లకు రూ.5,25000 చెల్లించారు. అలాగే వంటపాత్రల సరఫరాకు దాదాపు రూ.51 లక్షలు ముట్టజెప్పారు. ఈ బిల్లులను ఏకంగా జనవరి 10వ తేదీనే పెట్టారు. ట్రెజరీలో జాప్యం జరగడంతో వెనక్కు వచ్చాయి. తిరిగి 20 రోజుల కిందట ఈ మొత్తం బిల్లులు ట్రెజరీకి పంపించేశారు. ఏ క్షణమైనా ఏజెన్సీ ఖాతాలో జమ కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్క గ్లాసు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఇంకా నెల పట్టొచ్చు హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు సరఫరా చేసేందుకు ఇంకా నెల పట్టొచ్చు. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేశాం. ఇంకా 2,784 ఇవ్వాల్సి ఉంది. సచివాలయ పరీక్షల నిర్వహణకు వివిధ మెటీరియల్ అవసరమని జిల్లా అధికారులు చెప్పడంతో పెట్టెల తయారీని పక్కనపెట్టాం. – శతృసింగ్, పునీత్ ఏజెన్సీ నేను రాకముందే ఇచ్చేశారు ట్రంకు పెట్టెలకు సంబంధించిన బిల్లు నేను చార్జ్ తీసుకోకముందే ఇచ్చేశారు. పెట్టెలు సరఫరా చేయాలని ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటిదాకా 8వేలు ఇచ్చారు. హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రల సరఫరాకు సంబంధించిన బిల్లు ట్రెజరీకి పంపాం. ఇన్ ఆపరేషన్ అకౌంటులో ఉండేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వస్తువులు సరఫరా చేసిన తర్వాతే ఆ మొత్తం డ్రా చేసుకునేలా చూస్తాం. – యుగంధర్, బీసీ సంక్షేమ శాఖ డీడీ -
38 మండలాలు.. 15,344 క్లస్టర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదల విందు పరి పూర్ణం కానుంది. తెలుపు రంగు రేషన్‌కార్డు గల పేదలకు పౌర సరఫరాల విభాగం ద్వారా నా ణ్యమైన బియ్యాన్ని ఇంటికే తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బృహత్తర కార్యక్రమం తొలి విడత లబ్ధిదారుల జాబితా లో మన జిల్లా కూడా ఉంది. రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలి దశ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లకు క్లస్టర్ల ఏర్పాటు, వారి రేషన్ కార్డుల అనుసంధానం, బియ్యం సరఫ రా చేసేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవడం, వాటికి రవాణా ఖర్చులు అంచనా వేయడం వంటి చర్యలతో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన పనులు సుమారుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. లోపాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఒకటో తేదీ నాటికి సజావుగా పంపిణీ జరిగేలా కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాస్, సివిల్ సప్లై, డీఎస్ఓ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 15,344 క్లస్టర్ల ఏర్పాటు.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు, ఇతర గ్రామ పంచాయతీలు, నగర పాలక, పురపాలక సంస్థలను కలిపి 15,344 క్లస్టర్లుగా విడదీశారు. ఒక్కో క్లస్టర్‌కి 50 నుంచి 60 కుటుంబాలను చేర్చారు. ఒక్కో క్లస్టర్లో ఒక్కో వలంటీర్ సేవలు అందిస్తారు. ఇప్పటికే నియమితులైన వలంటీర్లు ఆయా క్లస్టర్లలో కుటుంబాలను పరిచయం చేసుకునే కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే వారి కార్డులు, క్లస్టర్ వలంటీర్ లాగిన్‌కి మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. ఈ పనిలో ఇప్పటికే 96 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన శాతాన్ని ఈ గడువులో పూర్తి చేయనున్నారు. పంపిణీ వ్యయం సగటున రూ.383: ప్రభుత్వం పేదలకు అందజేసే నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలం టే గతంలో కంటే కొంత ఖర్చు పెరుగుతుంది. అయినా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించేందుకు ఆర్థిక భారాన్ని లెక్క చేయడం లేదు. ఈ సరుకులు అందించేందుకు సగటున రూ.383 ఖర్చవుతుంది. ఇప్పటి వరకు చేస్తున్న హమాలీలు బియ్యంను గోదాముల్లో లోడ్ చేయ డం, అన్లోడ్ చేయడం, ఎఫ్‌పి షాపులకు తరలించడం కోసం ఒక్కో ప్రక్రియకు రూ.9లు వంతున ఖర్చు చేసేవారు. అయితే ఈ ప్రకియతోపాటుగా అదనంగా క్లస్టర్లలో వాహనాలకి ఇచ్చే ఖర్చు పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో కొండకోనల్లో ఉన్న గూడేలకు ఈ నాణ్యమైన బియ్యాన్ని సరఫరాలకు మరికాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఈ వాహనాల ఖర్చు సుమారుగా రూ. 58,76,980గా ఉండబోతోంది. నాణ్యమైన బియ్యం.. ఇప్పటివరకు పౌర సరఫరాల ద్వారా ఎఫ్పీ షాపులకు, అక్కడ నుంచి తెల్లకార్డుల లబ్ధిదా రులకు అందజేసే బియ్యం అధికంగా 25 శాతం కంటే ఎక్కువగా నూకలు, తవుడు చెత్తతో కూడి ఉండేది. వీటిలో నాణ్యత తక్కువగా ఉండేది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందజేసే నాణ్యమైనబి య్యంలో ఈ నూకల శాతం చాలా తక్కువగా ఉంటుంది. బి య్యం కంప్యూటర్ మెజర్ ప్రకారం సార్ట్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. తూర్పు గోదావరి నుంచి బియ్యం దిగుమతి.. నాణ్యమైన బియ్యం మనకు కావాల్సిన స్థాయిలో స్థానికంగా లభ్యం లేనందున, తొలి విడతలో మన జిల్లాకు కావల్సిన 13,242 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, కాకినాడ, రామచంద్రాపురం, మండలపేట తదితర ప్రాంతాల్లోని సుమారుగా 300 రైస్ మిల్లులను నుంచి ఈ నాణ్యమైన బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యం అక్కడ సిద్ధంగా తూనికలు, ప్యాకింగ్ ను పూర్తి చేసుకొని ఉంది. ఈ నెల 28వ తేదీ నాటికి జిల్లాకు చేర్చడానికి జిల్లా యంత్రాగం అన్ని చర్యలు సిద్ధం చేసింది. నేరుగా ఎఫ్పీ షాపులకే బియ్యం.. సెప్టెంబర్ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యాన్ని తెలుపు రంగు కార్డుదారులకు అందజేయనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ నెల 28 నాటికి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం జిల్లాకు చేరుతోంది. ఈ బియ్యం ప్యాకెట్ నేరుగా గ్రామాల్లోని ఎఫ్పీ షాపుల డీలర్లు గోదాములకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి వలం టీర్లు డోర్ టు డోర్గా లబ్ధిదారులకు అందజేస్తారు. – జి.నాగేశ్వరరావు, డీఎస్ఓ, శ్రీకాకుళం -
పంచాయతీ ఎన్నికలు: అంబులెన్స్‌లో మద్యం సరఫరా
-
‘విద్యుత్’ ఎత్తిపోతలే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో ఏర్పడిన తీవ్ర కొరతను అధిగమించి అనతి కాలంలోనే కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరాను అందించింది. తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భారీ ఎత్తిపోతల పథకాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది నుంచే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించుకోవడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరాను ప్రారంభిస్తే రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 12,500–13,000 మెగావాట్లకు పెరగనుంది. ఇప్పటికే 10,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సన్నద్ధమై ఉండగా, వివిధ మార్గాల నుంచి మరో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘ఆగస్టు–జనవరి’ ప్రధానం ఏటా ఆగస్టు–జనవరి మధ్య కాలంలో గోదావరి నదిలో నీటి లభ్యత ఉంటుంది. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర పాత ఎత్తిపోతల ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరం పథకం ద్వారా ఈ సమయంలో నీటిని తోడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు–జనవరి మధ్య కాలంలో నీటిపారుదల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. వచ్చే జూలై 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించాయి. సెప్టెంబర్ తర్వాత విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మళ్లీ 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించనున్నాయి. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి వారం మరో 1,000 మెగావాట్ల కొనుగోళ్లు జరపాలని భావిస్తున్నాయి. ఖరీఫ్‌లో 23 లక్షల బోరు బావుల కింద పంటలతోపాటు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా అందిస్తే రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,500 నుంచి 13,000 మెగావాట్లకు చేరనుందని అంచనా వేశాయి. దీంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రికార్డులో స్థాయిలో పెరగనుంది. గత మార్చి 8న నమోదైన 10,220 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఇప్పటి వరకు అత్యధికం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13 వేల మెగావాట్లకు చేరినా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు 3,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 1,900 మెగావాట్లు అవసరం కాగా, ఇప్పటికే వినియోగంలో ఉన్న దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర పథకాలకు మరో 1,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. -
మండుతున్న చమురు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరింత ఎగిశాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్ స్టాక్పైల్స్ సైతం 3.79 మిలియన్లు తగ్గిందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడురోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. వరుసగా పెట్రోల్ , డీజిల్ ధరలు ఇప్పటికే కొత్త గరిష్టాలను తాకుతున్న సంగతి తెలిసిందే. -
నేటినుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు ఆదివారం నుంచి మూడో విడత సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉండి పుస్తకాలను అందుకోవాలని, అక్కడి నుంచి వెంటనే పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నీళ్లొస్తాయ్
కొవ్వూరు/నిడదవోలు/భీమవరం : జిల్లాలోని కాలువలకు నీటి విడుదలను మరో రెండు రోజులు పొడిగించారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి కాలువలను మూసివేయాలని నిర్ణయించారు. అయితే, వరి కోతలు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాల్లోని తాగునీటి చెరువులు నిండకపోవడంతో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నది నుంచి మరో రెండు రోజులపాటు నీరివ్వాలని నిర్ణయించారు. బ్యాంక్ కెనాల్ పరిధిలోని వడ్డిలంక కాలువ ద్వారా మంచినీటి చెరువుల్ని నింపాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే 80 శాతంపైగా చెరువులను నీటితో నింపామని, రానున్న రెండు రోజుల్లో అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. పశ్చిమ డెల్టాకు ప్రస్తుతం 4,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటి విడుదలను నిలిపివేస్తారు. తిరిగి జూన్ 1వ తేదీన విజ్జేశ్వరంలోని గోదావరి హెడ్ స్లూయిస్ తలుపులు తెరుస్తారు. రొయ్యల చెరువులకు తరలించడంతో సమస్య ఎన్నడూ లేనివిధంగా ఈసారి రొయ్యలు, చేపల చెరువులకు నీటిని పెద్దఎత్తున తోడుకోవడంతో జిల్లాలోని మంచినీటి చెరువులకు కొరత ఏర్పడింది. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు బడా వ్యక్తులు ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్ల సాయంతో కాలువల్లోని నీటిని ఆక్వా చెరువుల్లో తోడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, సెంట్రల్ డెల్టాలకు ఈనెల 10వ తేదీన కాలువల్ని మూసివేశారు. అదే రోజున పశ్చిమ డెల్టాకూ నీటి విడుదలను నిలిపివేయాల్సి ఉండగా.. చేలు, చెరువులకు వెళ్లాల్సిన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించారు. దీంతో మంచినీటి చెరువులు నిండలేదు. ఈ నేపథ్యంలో కాలువల మూసివేతను మరో వారం రోజులపాటు పొడిగించి.. సోమవారం సాయంత్రం 6 గంట లకు నీటి విడుదలను నిలిపివేయాలని భావించారు. అయినప్పటికీ మంచినీటి చెరువులు నిండకపోవడం, శివారు ప్రాంతాల్లో వరి చేలు కోత దశకు చేరుకోకపోవడంతో మరో రెండు రోజులపాటు నీటి విడుదలను పొడిగించక తప్పలేదు. అయినా.. మంచినీటి చెరువులు పూర్తిగా నిండుతాయో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు నగదును నేరుగా అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామన్నారు. బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచామని, ఈ నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు సులువుగా నగదు చేర్చే విధానాలను అన్వేషిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రూ. 500 నోట్ల పంపణీని నిన్ననే ప్రారంభించామని, త్వరలోనే (రేపు లేదా నేడు) రూ.2వేల నోట్లను ఏటీంలలో అందుబాటులోఉంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ. 50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
-
రామన్‌పాడు నీటిని అందించాలి
– ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముట్టడి నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రాంతానికి రామన్‌పాడు నీటిని సరఫరా చేయాలని కోరుతూ రామన్‌పాడు జలసాధన పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వినర్ సర్ధార్‌అలీ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా రామన్‌పాడు నీరు రాకున్నా ఎమ్మెల్యేగానీ, చైర్మన్‌గానీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతానికి ఏకైక నీటి వనరు రామన్‌పాడు అని, మోటార్లు కాలిపోయాయంటూ నీటి సరఫరా పై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలన్నారు. పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు హిమబిందు, గాయత్రి, లావణ్య, స్వాతి, కావలి శ్రీను, వజ్రలింగం, నరేందర్, వైఎస్సార్సీపీ నాయకులు హుస్సేన్, హెచ్.శేఖర్, సత్యం యాదవ్, జమాల్‌పాషా, కమిటీ కో కన్వినర్ గీతా, సభ్యులు మాదవరెడ్డి, రవిందర్‌గౌడ్, జయశంకర్ పాల్గొన్నారు. -
డిమాండ్‌లో దూసుకెళ్తున్న గెలాక్సీ నోట్7
ఐరిస్ స్కానర్‌తో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన కొత్త గెలాక్సీ నోట్7కు డిమాండ్ భారీగా పెరుగుతుందట. కంపెనీ అంచనాలను అధిగమించి ఈ ఫోన్ డిమాండ్ నమోదవుతుందని టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. గ్లోబల్‌గా సప్లైను డిమాండ్ అధిగమించడంతో లాంచింగ్ కావాల్సిన మార్కెట్లలో ఆవిష్కరణ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్టు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ప్రీమియం డివైజ్, తమ వ్యాపారాలను మరింత వృద్ధి బాటలో నడిపిస్తుందని, అత్యధిక రాబడులను ఆర్జించడానికి దోహదం చేస్తుందని ప్రపంచపు స్మార్ట్‌ఫోన్ రారాజు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పెరుగుతున్న డిమాండ్‌తో దానికి పోటీగా మరో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలల్లోనే ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతుంది. గణనీయమైన స్మార్ట్‌ఫోన్ విక్రయాలతో ఈ త్రైమాసికంలో కూడా శాంసంగే ఆధిపత్యంలో నిలుస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా సప్లై చేయలేని నేపథ్యంలో శాంసంగ్ రెవెన్యూలను కోల్పోవాల్సి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది కూడా కర్వ్డ్ డిస్ప్లే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ను శాంసంగ్ ఆశించిన మేర సప్లై చేయలేకపోయిందని గుర్తుచేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా త్వరలోనే గెలాక్సీ నోట్7 ఉత్పత్తులు చేపడతామని కంపెనీ తెలిపింది. సప్లై సమస్యను వెంటనే పరిష్కరించి డిమాండ్‌ను చేధిస్తామని వెల్లడిస్తోంది. -
రూ.1కే చల్లని మంచినీరు!
నేటి నుంచి వరంగల్‌లో కొత్త పథకం సాక్షి ప్రతినిధి, వరంగల్: కేవలం రూపాయికే లీటరు చల్లని మంచినీరు సరఫరా చేసే కార్యక్రమం వరంగల్‌లో మొదలవుతోంది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి అమలు చేయనున్నాయి. గ్రేటర్ వరంగల్ వాసులకు రూపాయికే లీటరు చల్లని మంచి నీరందించేందుకు ప్రధాన రహదారి పొడవునా 11 ప్రత్యేక నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. బాల వికాస సుజల్ ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్) పేరిట అమలయ్యే ఈ కార్యక్రమంలో మొదటి దశలో నాలుగు పంపిణీ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. నీటి పంపిణీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు వడ్డేపల్లి చెరువు వద్ద గంటకు ఆరు వేల లీటర్ల నీటిని శుద్ధీకరణ చేసే ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. దేశంలోనే మొదటిసారిగా వరంగల్‌లో అందిస్తున్నామని బాలవికాస ఈడీ తెలిపారు. -
అవని ఒడి.. కన్నీటి తడి
అడుగంటుతున్న భూగర్భ జలాలు అందని ఎన్టీఆర్ సుజల, కుళాయిల నీరు చెలమలే దిక్కు వేసవి తరుముకొచ్చింది. గుక్కెడు నీళ్ల కోసం గొంతు తడారిపోతోంది.. చెరువులన్నీ నీళ్లు లేక రోదిస్తున్నారుు.. బోర్లు అడుగంటి బోరుమంటున్నారుు.. మూడు కాళ్ల ముసలమ్మ నుంచి ఇంటి పెద్దదిక్కు వరకూ బిందెనెత్తికెత్తి.. కావడి కట్టి మైళ్ల దూరం.. మండే ఎండలో జల పోరాటం చేస్తున్నారు.. ఎడారిలో ఒయూసిస్సులా అక్కడక్కడా చెలమలు.. పేదల ఎక్కిళ్లకు అవే మహా ప్రసాదం.. బిందె నిండితే మహాదానందం.. ఇదీ వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వాసుల నిత్యం జల పోరాటం. వీరులపాడు : మండలంలోని దొడ్డదేవరపాడు ప్రజలు మంచినీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామంలో 2,300 మంది జనాభాకు గానూ రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఒకదానికి వి.అన్నవరం వద్ద రక్షిత చెరువు నుంచి, మరో ట్యాంకుకు దొడ్డదేవరపాడు వద్ద ఏటిలో మోటార్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే, ఈ నీరు చాలడం లేదు. పదిరోజులకోసారి నీటి సరఫరా గ్రామంలో బావులు, బోర్లతోపాటు వైరా, కట్టలేరు పూర్తిగా ఎండిపోయాయి. పంచాయతీ సరఫరాచేసే నీరు పదిరోజులకోసారి కూడా రావడం లేదు. అప్పుడైనా కనీసం గంటసేపు నీరు సరఫరా కావట్లేదు. ఆర్థిక స్తోమత ఉన్నవారు రూ.15 వెచ్చించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి వైరా, కట్టలేరుల్లో చెలమలు తీసుకుని బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. వృద్ధులకు సైతం ఈ తిప్పలు తప్పడంలేదు. ‘ఎన్టీఆర్ సుజల’ హామీకే పరిమితం టీడీపీ అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఇంటింటికీ రూ.2కే మినరల్ వాటర్‌ను అందిస్తామన్న చంద్రబాబు హామీ అమలు కావట్లేదు. తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామారావును వివరణ కోరగా, మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పథకాలు ఏర్పాటు ఆలోచనలేదని తేల్చి చెప్పారు. ఉన్నవాటిని బాగుచేయిస్తామని స్పష్టం చేశారు. -
మాటంటే మాటే..
♦ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం ♦ సాగుకు 9గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం ♦ పగలు 6, రాత్రి 3 గంటలు రైతులకు ఊరట ♦ వచ్చే ఖరీఫ్ నుంచి 9గంటలు పగటి పూటే ♦ శుక్రవారం నుంచే అమల్లోకి.. గజ్వేల్/జోగిపేట: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినట్టుగానే శుక్రవారం నుంచే జిల్లాలో అమలులోకి తెచ్చింది. అయితే పట్టపగలే నిరంతరాయంగా ఇస్తామన్న హామీ మాత్రం నెరవేరలేదు. ఇది వచ్చే ఖరీఫ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం పగలు ఆరు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున మొత్తం 9 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2.40 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా వీటి కోసం 6 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను వాడుకుంటున్నారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం మరో 9మిలియ న్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉంది. ప్ర స్తుతం వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా పెంచడంతో మరో 3మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరిగింది. వ్యవసాయానికి మొత్తం 9 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాబోతుంది. ప్రస్తుతం 6గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా అసలే కరువులో ఉన్న రైతులకు సరఫరా సరిపోక అల్లాడిపోతున్నారు. తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలిగే అవకాశముంది. ఈ విషయమై ట్రాన్సకో ఎస్ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ 9గంటల సరఫరాను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం వేళల్లో ఆరుగంటలు, రాత్రి వేళల్లో 3గంటలపాటు సరఫరా చేస్తామన్నారు. దీన్ని ఏ, బీ గ్రూపులుగా విభజించినట్టు తెలిపారు. రైతులు బోరుబావుల వద్ద ఆటోమెటిక్ స్టార్టర్లను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆటోమెటిక్ స్టార్టర్ల వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వేళలు.. ♦ రెండు గ్రూపులుగా విభజించి విద్యుత్‌సరఫరా చేస్తున్నారు. ♦ ఏ-గ్రూపులో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, రాత్రి 7నుంచి రాత్రి 10 వరకు. ♦ బి-గ్రూపులో ఉ.11 నుంచి సా.5వరకు, తెల్లవారుజాము 2 నుంచి ఉ.5 వరకు సరఫరా. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను అందిస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఆ మేరకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇలాంటి హామీలను గతంలో ఎవరు కూడా నిలబెట్టుకోలేదు. రైతులమీద ఉన్న ప్రేమతోనే విద్యుత్ సరఫరా విషయంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రెప్పపాటు కరెంటు పోకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరాతో కొంతవరకు ఊరట లభిస్తుంది. అధికారులు కూడా విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చూపరాదు. - డాక్టర్ పి.బాబూమోహన్, అందోలు ఎమ్మెల్యే -
ఐఎస్‌కు ఇండియా నుంచి ఏడు సంస్థల సాయం
లండన్: ప్రపంచాన్ని వేధిస్తున్న ఉగ్రభూతం ఇస్లామిక్ స్టేట్ కు సహాయం అందించే సంస్థల్లో ఇండియా నుంచి కూడా కొన్ని సంస్థలు ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ కు చెందిన కాన్ఫ్లిక్ట్ అర్మనెంట్ రిసెర్చ్(కార్) అనే అధ్యయన సంస్థ తెలిపింది. మొత్తం 20 దేశాల్లోని సంస్థలు ఇస్లామిక్ స్టేట్‌ను పెంచి పోషిస్తుండగా భారత్‌కు చెందిన ఏడు సంస్థల అండదండలు దీనికి ఉన్నట్లు వెల్లడించాయి. ఐఎస్ తయారు చేసే బాంబులకు కావాల్సిన రసాయన పదార్థాలు ఇతర వస్తువులు భారత్‌నుంచి వెళుతున్నట్లు, వాటిని పట్టుకునేందుకు చాలా జాగ్రత్తగా వ్యూహం పన్నాల్సిన అవసరం ఉందని కూడా సూచించింది. 20 దేశాల్లోని 51 కంపెనీలు ఈ సంస్థకు సహాయపడుతున్నట్లు పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, టర్కీ, రోమానియా, రష్యా, నెదర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, భారత్ వంటి దేశాల నుంచి మొత్తం 700 రకాల సామాగ్రి ఐఎస్‌కు పంపిణీ అవుతుండగా వీటిలో ఎక్కువగా టర్కీ నుంచే 13 సంస్థలు ఐఎస్ కు బాంబు తయారీ సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు వివరించింది. వీటిని తీవ్ర ప్రభావాన్ని చూపగల ఐఈడీ బాంబులకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఈ సంస్థ బాంబులను పేల్చివేసేందుకు ఎక్కువగా నోకియా 105 మోడల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు కూడా తెలిపింది. -
బెల్ట్ షాపులే లక్ష్యం!
జిల్లాలో సుమారు 1500 షాపులు యథేచ్ఛగా కల్తీ మద్యం సరఫరా లీటర్ మద్యంలో ఆరు లీటర్ల నీరు, స్పిరిట్ యనమలకుదురు ఉదంతంతో వెలుగులోకి కట్టడికి ఎక్సైజ్ అధికారుల యత్నం విజయవాడ : జిల్లాలో కల్తీ మద్యం మాఫియా తన హవా కొనసాగిస్తోంది. బెల్ట్ షాపులే లక్ష్యంగా నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. యనమలకుదురు, బందరులో నకిలీ మద్యం వ్యవహారం మరోసారి వెలుగులోకి రావటంతో ఎక్సైజ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయవాడ స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనను మరువకముందే మరోమారు ఈ ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. జిల్లాలో గ్రామాలు మొదలుకొని విజయవాడ నగరం వరకు ఉన్న ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 35 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయనేది అధికారులకూ తెలిసిందే. వైన్ షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు దాడులు చేసి కేసుల నమోదు, అరెస్టులు చేస్తున్నా అదే తీరు కొనసాగుతోంది. జిల్లాలో 336 వైన్ షాపులకు అనుసంధానంగా సుమారు 1500 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 5,164 కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈక్రమంలో బెల్ట్ విక్రయాలు తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుంటోందని తెలుస్తోంది. ట్రాక్ అండ్ ట్రేసింగ్‌లో... వరుస ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కొంత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అన్ని బార్లు, వైన్ షాపులను తనిఖీ చేసి మద్యం బ్యాచ్ నంబర్లను పరిశీలించారు. మరోవైపు డిస్టిలరీల్లోనే ప్రతి మద్యం సీసాల నంబర్లు నమోదు చేయటంతో పాటు ప్రతి బార్, వైన్ షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేసింగ్ విధానం పెట్టి ప్రతి బాటిల్‌పై బార్‌కోడ్‌ను నోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కల్తీ కట్టడి అయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు సాక్షితో మాట్లాడుతూ కల్తీ ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, దాడులు ముమ్మరం చేస్తామని చెప్పారు. కల్తీ మద్యం తయారీ ఇలా... జిల్లాలో రెక్టిఫైడ్ స్పిరిట్ తయారుచేసే యూనిట్లు 12 వరకు ఉన్నాయి. వాటి నుంచి కొందరు అనధికారికంగా సిర్పిట్‌ను కొనుగోలు చేసి మద్యంలో కలిపి విక్రయిస్తున్నారు. జిల్లాలో మద్యం కల్తీ 1989 నుంచీ అధికంగా ఉంది. మద్యం కల్తీ రెండు రకాలుగా చేస్తుంటారు. చీప్ లిక్కర్ అయితే లీటరు మద్యంలో ఐదు లీటర్ల వరకు నీటిని కలిపి మద్యం రంగు పోకుండా చూసి, కిక్ కోసం స్పిరిట్‌ను వినియోగించి మళ్లీ డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యం సీసాల మాదిరిగా స్టిక్కర్లు, ధరల లేబుళ్లు అన్నీ అతికించి ఎక్కడా అనుమానం రాకుండా విక్రయాలు చేస్తుంటారు. ఇంకో కల్తీ ఎలాగంటే.. లీటర్ చీప్ లిక్కర్లో ఆరు లీటర్ల నీరు, ఒక లీటర్ సిర్పిట్‌ను కలిపి సిద్ధం చేసి క్వార్టర్ సీసాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా కల్తీ చేసిన చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌ని రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తుంటారు. దానిని పలు బ్రాండ్ల క్వార్టర్ సీసాల్లో నింపటం ద్వారా నాలుగు రెట్లు లాభాలు ఆర్జిస్తున్నారు. -
రోగుల నోట్లో బురద!
{పభుత్వ దవాఖానాల్లో ‘మంచి’నీరు కరువు నెలల తరబడి క్లీన్ చేయని వాటర్ సంపులు ట్యాంకుల్లో నాచు, పక్షుల వ్యర్థాలు, తోక పురుగులు కుళాయిల నుంచి రంగుమారిన నీరు సరఫరా సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా సరిగా దొరకడం లేదు. అసలే రోగంతో ఆస్పత్రికి వస్తున్న వారు ఇక్కడి అపరిశుభ్రమైన నీరు తాగి మరిన్ని ఇక్కట్లకు గురవుతున్నారు. మొత్తమ్మీద వైద్యాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి రోగుల నోట్లో బురద చల్లుతున్నారు. రోజుల తరబడి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయక పోవడం, ట్యాంకులపై మూతల్లేకపోవడంతో దుమ్ముదూళి కణాలు నీటిలో చేరడంతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు, బురద తేలిఆడుతోంది. తెలియక ఈ నీరు తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మళ్లీ అదే ఆస్పత్రిలో చేరుతున్నారు. నగరంలోని ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఈఎన్టీ, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఫీవర్ ఆస్పత్రుల్లో నిర్వహణ లోపం వల్ల ఒక్కో నీటి సంపు అడుగు భాగంలో భారీగా బురుదనీరు పేరకపోయి కుళాయిల నుంచి రోగులకు సరఫరా అవుతోంది. ఉస్మానియా ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 2000-2500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యిమంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో రెండు వేలు ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపై గా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పోవడంతో దుమ్ము, ధూళీ వచ్చి చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలిఆడుతోంది. మల, మూత్ర విసర్జన అవ సరాలకు మినహా ఇతర అవసరాలకు వినియోగించడం లేదు. కలుషిత నీరుతాగి మూడేళ్ల క్రితం 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ట్యాంకులను ప్రతి పదిహేను రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చే యాల్సి ఉన్నా కనీసం నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరి శీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు. గాంధీ మంచినీటి ట్యాంకుల్లో ఈ కొలి బ్యాక్టీరియా ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గాంధీ జనరల్ ఆస్పత్రిలో కూడా మంచినీటికి కటకటే. ఎప్పటికప్పుడు ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలుతోంది. కుళాయిల నుంచి సరఫరా అవుతున్న నీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడు నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు మంచినీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే. సంపులు క్లీన్ చేయకపోవడం వల్లే.. కంటి ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వానికి జలమండలి నివేదిక సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల బురుద నీరు సరఫరా కావడం, 250కిపైగా శస్త్రచికిత్సలు నిలిచిపోవడం తెలిసిందే. బురద నీరు సరఫరా చేయడం వల్లే శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత జలమండలి అధికారులు ఏడు ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించి, పరీక్షించగా అసలు విషయం బయట పడింది. ఆస్పత్రిలోని వాటర్ ట్యాంకులను నెలల తరబడి క్లీన్ చేయకపోవడం వల్లే ట్యాంకు అడుగు భాగంలో ఐదు ఇంచుల మేర బురద మట్టి పేరుకపోయింది. ట్యాంక్‌లోని నీరు ఖాళీ అవడంతో బురద నీరు కుళాయిల్లోకి వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని జలమం డలి అధికారులు స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. మంచినీరు కొనాల్సిందే గోలి వేసుకుందామంటే గుక్కెడు మంచి నీళ్లు దొరకడం లేదు. దాహమేస్తే చాలు ఖాళీ సీసాలు పట్టుకుని రోడ్డువెంట పరుగెట్టాల్సి వస్తుంది. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కన్పించినా తాగు నీరు దొరకడం లేదు. ఉన్న నీరు కూడా కలుషితం కావడంతో తాగేందుకు పనికి రావడం లేదు. డబ్బులు పెట్టి మంచినీళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది. - జి.శ్రీనివాస్ యాదవ్, మంగళ్‌హట్ -
గ్రామాల గొంతెండుతోంది..!
నిలిచిపోయిన పొందుగులలోని పెలైట్ ప్రాజెక్టు రెండు నెలలుగా సరఫరా కాని తాగునీరు అడుగంటిన మంచినీటి బావులు నీరు మోసుకొచ్చేందుకు అగచాట్లు పడుతున్న మహిళలు దాచేపల్లి మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి మనిషి మనుగడకు ఆధారం జలం. భూమాత ఒడిలో సేదతీరే జలరాశి రోజురోజుకూ అందనంత దూరంగా జరిగిపోతోంది. మనిషి పెంచిన కాలుష్యం కాలచక్రం గతిని తప్పించడంతో వర్షాకాలంలో కూడా వానజల్లు పలకరించని పరిస్థితులు దాపురించాయి. దీంతో భూగర్భజలాల వినియోగం పెరిగి జలరాశి ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాదికేడాది గంగ పాతాళానికి జారిపోతూ భవిష్యత్తుపై బెంగపెంచుతోంది. చిలకలూరిపేట : పాతాళగంగ ఉబికి రానంటోంది. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. భూగర్భ జలాల సంరక్షణకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాలతో అరకొర నీటి సరఫరా జరిగినా అవి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలను తీర్చలేకపోయాయి. నవంబరులోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్నరోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని భావిస్తున్నారు. తగ్గుతున్న భుగర్భ జలాలు.. ఈ ఏడాది అప్పుడప్పుడు మురిపించిన నల్లని మబ్బులు తప్పా సరైన వర్షం కురవలేదు. దీంతో పలు గ్రామాల్లో మంచినీటి చెరువులు ఎండిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో గతంలో కంటే భూగర్భ జలాలు అడుగంటాయన్న నివేదికలు కలవరానికి గురిచేస్తున్నాయి. వర్షం నీరు వృథా కాకుండా ఏ విధంగా భద్రపరచాలన్న విషయంలో స్పష్టమైన ప్రణాళికలు అధికారులు, పాలకుల వద్ద లేవు. కొందరు నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2014 మేలో 29.80 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంటే 2015 మే నాటికి 34.62 మీటర్ల లోతుకు వెళ్తే కానీ నీరు లభ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే నరసరావుపేటలో గతంలో 2.93 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు 3.34 మీటర్లకు, చిలకలూరిపేటలో 1.50 నుంచి 1.28 మీటర్లకు తగ్గింది. మాచర్లలో అయితే గత ఏడాది 6.78 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు ఈ ఏదాది 12.92 మీటర్లకు దిగజారింది. వినుకొండలో గతంలో 4.78 మీటర్లుగా ఉన్న నీటి లభ్యత ప్రస్తుతం 10.27 మీటర్ల పెరిగింది. పొంచిఉన్న ముప్పు.. వర్షాభావ పరిస్థితుల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. జిల్లాలో 51,407 వేల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా 1.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లో పొలాల రైతులు కూడా వ్యవసాయ బోర్లపై ఆధారపడే పంటల సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల వాడటం పెరిగింది. తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితిలో పట్టణాల్లో సైతం విచ్చలవిడిగా వేసిన బోర్లు భూగర్భ జలాలను హరించివేశాయి. వివిధ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అనుమతులు లేకుండా వేసినబోర్లు రోజుకు లక్షల లీటర్ల భూగర్భ జలాలను పీల్చివేశాయి. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో నీటి అవసరాల కోసం పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడటంతో భవిష్యత్తు అంధకారంగా మారనుంది. 50 ఏళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో వాటిపై ఆధారపడిన రైతులు, పశువులకు కూడా నీరు అందని పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు భూగర్భ జలాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తే తప్ప పొంచిఉన్న ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కనిపించటం లేదు. -
‘జల’దోపిడీ
నాణ్యత గాలికి అనుమతిలేని వాటర్ ప్లాంట్లు యథేచ్ఛగా నీటి అమ్మకాలు సిండికేట్‌గా మారి ధరల పెంపు బీఐఎస్ సర్టిఫికెట్ లేకుండానే కొనసాగింపు ధనదాహమే లక్ష్యంగా నిర్వహణ జవహర్‌నగర్ జనాభా దాదాపు రెండు లక్షలు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి తాగునీరు సరఫరా లేదు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా గ్రామంలో దాదాపు 35 మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. నీటి ప్లాంట్ల నిర్వహణకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అనుమతులు ఉండాలి. అదేవిధంగా యూవీ కిరణాల ద్వారానే నీటిని శుభ్రం చేయాలి. ప్లాంట్ల సామర్థ్యం 30 హెచ్‌పీ దాటితే పంచాయతీ, విద్యుత్, భూగర్భ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రతీ ప్లాంటులో కెమిస్ట్రీ, మైక్రో ల్యాబ్‌లు ఉండాలి. నీటిని తొలుత క్లోరినేషన్, ఆపై శాండ్ ఫిల్టర్‌లో వడగట్టి తర్వాత కార్బన్ ఫిల్టర్‌లో 25 మైక్రాన్ కంటే సూక్ష్మ స్థాయిలో ఉన్న ఫిల్టర్‌లో నీటిని వడకట్టాలి. ఇలా వచ్చిన నీటిని మాత్రమే వినియోగించాలి. కానీ చాలా ప్లాంట్లు అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా కేవలం ఆర్ఓ సిస్టం ద్వారానే నీటిని శుద్ధి చేసి నీటిని విక్రయిస్తున్నాయి. ఇలా.. ఒక్కొక్కరు రోజుకు సరాసరి 400 క్యాన్లు విక్రయిస్తున్నారు. నెలకు 12 వేల క్యాన్ల విక్రయిస్తున్నారు. కాలనీకో ప్లాంటు గ్రామంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలనీకో వాటర్ ప్లాంటు చొప్పున దాదాపు 35 పైగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బోర్లను ఏర్పాటు చేసి నీటిలో కొన్ని లవణాలను తొలగించి నీటిని విక్రయిస్తున్నారు. నీటిని శుభ్రం చేసి ప్యాకింగ్ చేయాలంటే ఆహార నిరోధక శాఖ అధికారుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉన్నా.. ఇక్కడ అలా జరగడం లేదు. కనీసం క్యాన్లను కూడా శుభ్రం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జాడకైనా కనిపించని ఐఎస్ఓ మినరల్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లలో కనీస నియమాలు పాటించి, స్వచ్ఛమైన నీటిని అందించే ప్లాంట్లకు ఐఎస్ఓ అనుమతి ఉంటుంది. జవహర్‌నగర్‌లోని ఆయా ప్లాంట్లకు అసలు ఐఎస్ఓ కాదు కదా, పంచాయతీ అనుమతి సైతం లేదు. ఇక యూవీ సిస్టం అసలుకే కనపడవు. పట్టించుకోని అధికారులు ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్లను తీసుకుంటూ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వాటర్ ప్లాంట్ నిర్వాహకులు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని గతంలో పలుమార్లు సార్లుఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటిని విక్రయించాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అనుమతి తప్పనిసరి. దీనికి తోడు నీటిని మూడు దశల్లో శుద్ధి చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన కవర్లు, బాటిళ్లు వినియోగించాలి. అయితే ధనార్జనే ధ్యేయంగా కేవలం ఆర్ఓ సిస్టం ద్వారానే నీటిని శుద్ధి చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్లాంట్ నిర్వాహకులు. ఇలాంటి నీటినే జవహర్‌నగర్‌లో ప్రతి వెయ్యి మందిలో 80 శాతం మందికి పైగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. - జవహర్‌నగర్ సిండికేట్‌గా ధరల పెంపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి నీటి క్యాన్ల ధరను అమాంతగా పెంచేశారు. గతంలో ప్లాంట్ వద్ద క్యాన్ వాటర్‌కు రూ. 5 ఉండగా ప్రస్తుతం దానిని రూ. 8కు పెంచారు. ఇంటికి సరఫరా చేస్తే గతంలో రూ. 10 ఉండగా ప్రస్తుతం అది కాస్తా రూ. 20కి చేరింది. అనుమతులు లేకపోతే కఠిన చర్యలు అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో గ్రామంలోని అన్ని ప్లాంట్లను తనిఖీ చేస్తాం. నిబంధనలకు పాటించని వారిపై వాల్టాచట్టం కింద కేసు నమోదు చేస్తాం. - దేవుజా నాయక్, తహశీల్దార్, శామీర్‌పేట పత్తాలేని మంజీరా నీరు జవహర్‌నగర్ ఏర్పడిన నాటిన నుంచి తాగునీటి సమస్య నేటికీ తీరలేదు. ఎన్నికల సమయంలో మాత్రం పాలకులు మంజీనా నీటిని అందిస్తామని చెబుతున్నా.. దానిని అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మంత్రులు స్పందించి అనుమతి లేని వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి గ్రామానికి మంజీరా నీరు అందించాలని కోరుతున్నారు. -
తమిళనాడు అతలాకుతలం
-
నీళ్ల చారే గతి..
పప్పన్నమే కాదు..పప్పు చారు కూడా లేదు అంగన్వాడీలకు కందిపప్పు సరఫరా నిలిపేసిన సర్కార్ పాఠశాలలు, హాస్టళ్లకు ఇవ్వలేమంటున్న కాంట్రాక్టర్లు కందిపప్పు నిజంగానే బె‘ధర’గొడుతోంది. సామాన్యులు..మధ్యతరగతి ప్రజలనే కాదు..పప్పంటే లొట్టలేసే చిన్నారులకు కూడా దూరమైంది. చుక్కలనంటిన ధరల పుణ్యమాని ఒక వైపు సర్కార్, మరో వైపు కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో చిన్నారులు పప్పన్నం కాదుకదా..పప్పుచారన్నానికి దూరమవుతున్నారు. ధరల దెబ్బకు నీళ్ల చారే వీరికి దిక్కవుతోంది. విశాఖపట్నం: బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర డబుల్ సెంచరీ దాటడంతో పప్పు కొనాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం అంగన్వాడీ, పాఠశాల చిన్నారులపై పడింది. అధిక మాంసకృత్తులు, పోషకాలు ఉన్న కంది పప్పు సరఫరాను కాంట్రాక్టు సంస్థలతో పాటు సర్కార్ కూడా నిలిపి వేయడంతో జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్ల మెనూలో పప్పున్నం మాయమై పోయింది. జిల్లాలో 4140 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలుండగా మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు 2,59,047 మంది ఉన్నారు. గతేడాదిగా కందిపప్పు ధరలు పెరుగుతున్నప్పటికీ మూడు నెలలుగా కనివినీ ఎరుగని రీతిలో ధర లు అమాంతంగా పెరగడంతో మధ్యా హ్న భోజన నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులతో కందిపప్పు కొనే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారు. కూరగాయల ధరలు కూడా రోజుకో రీతిలో ఉండడంతో వా రంలో నాలుగు రోజులు ఆకుకూరలు, రసంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రెండ్రోజులు మాత్రమే తక్కువధరకు లభించే కూరగాయలతో కానిచ్చేస్తు న్నారు. ఎక్కడా పప్పు వాసన కూడా తగలనీయడంలేదు. ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాంసకృత్తులు, ప్రొటీన్లు అందక విద్యార్థులు బలహీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 65 వసతి గృహాల్లో 5,661మంది విద్యార్థులున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 64 హాస్టళ్లలో 6,600 మంది విద్యార్థులున్నారు. వసతిగృహాలకు కిలో రూ.110కే కందిపప్పు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200లు దాటడం తో కంది పప్పు సరఫరా చేయడంలేదు. దీంతో హాస్టల్ మెనూలో కూడా పప్పన్నం మాయమైపోయింది. ఇక జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3587 మెయిన్, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో మూడునెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 65,317 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 87,353, బాలింతలు 28,106, గర్భిణులు27,285మంది ఉన్నారు. వీరికి ఆయా కేంద్రాల్లో అమృత హస్తం, బాలామృతం కింద పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి. ఇందుకోసం బియ్యం, కందిప్పు ప్రతీ నెలా ప్రభుత్వమే సరఫరా చేస్తుంటుంది. మూడు నెలల క్రితం నుంచి వీటికి కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో అంగన్వాడీల్లో చిన్నారులకే కాదు...గర్భిణులు.. బాలింతలకు సైతం పోషకవిలువలను ఇచ్చే పప్నన్నం పెట్టడం మానేశారు. దీంతో విద్యార్థులు, చిన్నారులకు పౌష్టికాహారం లోపానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలను అదుపుచేయడంతోపాటు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీల్లో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. -
రిలయన్స్ జియోకి ఇంటెక్స్ హ్యాండ్సెట్స్
న్యూఢిల్లీ: దేశీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఇంటెక్స్.. కొత్తగా టెలికం కార్యకలాపాలు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి 4జీ హ్యాండ్‌సెట్స్‌ను సరఫరా చేయనుంది. దాదాపు 1 లక్ష ఫోన్లకు రిలయన్స్ జియో నుంచి ఆర్డరు వచ్చినట్లు ఇంటెక్స్ వెల్లడించింది. వీటిలో 20,000 హ్యాండ్‌సెట్స్‌ను త్వరలో డెలివరీ చేయనున్నట్లు వివరించింది. ఇంటెక్స్ బ్రాండింగ్‌తో ఉండే ఈ మొబైల్స్ ధర రూ. 10,000 లోపు ఉంటుందని, రిలయన్స్ రిటైల్ వీటిని విక్రయిస్తుందని సంస్థ పేర్కొంది. సుమారు రూ. 5,000 ఖరీదు చేసే 4జీ హ్యాండ్సెట్స్ మరిన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఇంటెక్స్ మొబైల్ బిజినెస్ విభాగం హెడ్ సంజయ్ కలిరోనా తెలిపారు. రిలయన్స్ జియో ఈ ఏడాది ఆఖరు నాటికి 4జీ సర్వీసులు ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. -
గుట్కా ప్యాకెట్లు సరఫరా: వ్యక్తి అరెస్ట్
కరీంనగర్ టౌన్: కరీంనగర్ పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద సుమారు రూ.5 వేల విలువైన గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ మార్కెట్లోని పలు షాపులకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసినట్టు పట్టుబడిన వ్యక్తి తెలిపాడు. అయితే సదరు వ్యక్తి దొరకడంతో మిగతా వ్యాపారులు గోదాములకు, షాపులకు తాళాలు వేసుకుని పరారయ్యారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
గొంతెండనీయం
ప్రతి ఇంటికీ 24 గంటలపాటు తాగునీరు కార్యాచరణకు త్వరలోనే మంత్రుల కమిటీ రెండోరోజు టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 24 గంటలపాటు మంచినీటిని సరఫరా చేస్తామని, కార్యాచరణ కోసం త్వరలోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు తాగునీటిని ఉచితంగా ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద విజయవిహార్‌లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ఆది వారం రెండోరోజూ కొనసాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పలువురు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం లాభసాటి కాదనే భావనను పోగొట్టాలని, సాగును ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం పేర్కొన్నారు. త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులను హైదరాబాద్ పిలిపించి, వారితో మాట్లాడి వ్యవసాయ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు రైతులను ఎంపిక చేసి ఆధునిక వ్యవసాయం చేయిస్తామన్నారు. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘మనం ఇజ్రాయెల్ వెళ్లడం కాదు.. ఆ దేశస్థులే అధ్యయనం కోసం మన దగ్గరకు వచ్చేలా వ్యవసాయం వృద్ధి చెందాలి’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ చొరవ తీసుకోవాలన్నారు. వ్యవసాయాభివృద్ధికి నిధుల కొరత రానీయబోమని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమిస్తామని చెప్పారు. సాగులో ఉత్పాదకత పెరగాలని, తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండేలా వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, గోదాముల సంఖ్యను పెంచుతున్నామని వివరించారు. ఇప్పటివరకు గ్రామం యూనిట్‌గా ఉన్న పంటల బీమాను రైతు యూనిట్‌గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని, దీనిపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం వంటి సౌకర్యాల వల్ల పట్టణాలు పెరుగుతున్నాయని, జనాభాకు తగ్గట్టు కనీస సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సౌకర్యాలు మెరుగుపడాలన్నారు. ప్రజాప్రతినిధి ఏ పనిచేసినా మన మంచికేనన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రభుత్వ పథకాలకు మద్దతు లభిస్తుందన్నారు. ఇందుకు సిద్ధిపేట మంచినీటి పథకమే ఉదాహరణ అని, ఆ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో నల్లాలు ఏర్పాటు చేయించాలని, ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు విధిగా పాఠశాలలకు మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. పాత్ర ఉంటేనే ఆసక్తి.. బడ్జెట్ రూపకల్పనను ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోవాలని సీఎం సూచించారు. ప్రతి రాజకీయ పార్టీలో బడ్జెట్‌పై చర్చ జరగాలని, ఇందుకోసం పార్టీలు అంతర్గతంగా సెక్రటేరియట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోనూ ఈ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్యులకు శాఖలను కేటాయిస్తామని చెప్పారు. ఏ అంశంలోనైనా పాత్ర ఉన్నప్పుడే దానిపై ఆసక్తి ఉంటుందన్నారు. సభలో ఏ సభ్యుడైనా బిల్లును పెట్టవచ్చని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లును సి.హెచ్. విద్యాసాగర్‌రావు పెట్టారని, దాన్ని సభ ఆమోదించిందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో సభా మర్యాదలు మంట కలుస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొత్త విధానాలను తెచ్చేటప్పుడు సభ్యులంతా పాలుపంచుకునే వారని, ఇప్పుడు పరస్పర విమర్శలే మిగులుతున్నాయన్నారు. సభలో కొట్టుకుంటున్నారని, సస్పెన్షన్లు అనివార్యమవుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం వ్యాఖ్యానించారు. పరిస్థితిలో మార్పు రావాలని, సభ్యులు ప్రవర్తనా నియమావళిని తెలుసుకోవాలని సూచించారు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే సభలో నినాదాలు, ధర్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు సహనం ఉండాలని హితవు పలికారు. అర్థమయ్యే భాషలో చెబుతాం వ్యవసాయంపై జరిగిన చర్చలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు వాడిన కొన్ని సాంకేతిక పదాలు కొందరు నేతలకు అర్థం కాలేదు. గ్రీన్హౌస్ గ్యాస్, ఫామ్ మెకనైజేషన్‌లాంటి పదాలపై వారు సందేహాలు వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. దీంతో కేసీఆర్ కలుగజేసుకుని వ్యవసాయ నిపుణులు చెప్పిన అంశాలు బాగున్నాయని, అయితే వాటిని సభ్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ బలం కూడా అదేనని, తమ విధానాలేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌గ్యాస్, ఫామ్ మెకనైజేషన్ అనే పదాలకు అర్థాలను సభ్యులకు కేసీఆరే వివరించారు. రెండో రోజు శిక్షణలో.. రెండో రోజు వ్యవసాయంపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషలాఫీసర్ వి.ప్రవీణ్‌రావు, పట్టణాభివృద్ధిపై ఆస్కి డెరైక్టర్ శ్రీనివాసాచారి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు అనే అంశంపై అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. రాజాసదారం, శాంతిభద్రతలపై హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శిక్షణనిచ్చారు. వీరిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సోమవారం నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల అధ్యక్షులు కూడా పాల్గొంటారు. పోలీస్ పైరవీలు వద్దు పోలీస్ కార్యకలాపాల్లో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుంటేనే మంచిదని సీఎం సూచిం చారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులను ప్రతినిధులుగా, సాధనాలుగా మార్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో అదనంగా బస్‌బేలను, లక్ష వరకు సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునిక పోలీస్స్టేషన్లను కూడా నిర్మిస్తామన్నారు. వరంగల్, ఖమ్మం, రామగుండంను పోలీస్ కమిషనరేట్లుగా మారుస్తామన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. -
రూ.250 కోట్లువిద్యుత్ బకాయిలు
హన్మకొండ సిటీ : జిల్లాలో విద్యుత్ బిల్లుల బకాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బకాయిల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించినా పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాల నుంచి మొదలు పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, గ్రామీణ, నగర, పట్టణ నీటిసరఫరా, వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం రూ.249.58 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినవే రూ.84 కోట్ల ఉన్నాయి. నోటీసులు ఇచ్చినా బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. దీంతో ముఖ్యంగా గ్రామపంచాయతీల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో పంచాయతీల తాగునీటి పంపుసెట్ల కనెక్షన్లు తొలగించొద్దని కలెక్టర్ అదేశించడంతో వాటిని పునరుద్ధరించారు. గ్రామపంచాయతీలకు చెందిన విద్యుత్ బిల్లులు గతంలో ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. ప్రస్తుతం సర్కారు నుంచి చెల్లింపులు లేకపోవడంతో వీధిలైట్లు, తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లులను గ్రామ పంచాయతీల నుంచే నేరుగా చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో వీధి లైట్లకు సంబంధించి రూ.10.93 కోట్లు, తాగు నీటి పథకాలకు రూ.7.90 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్న పంచాయతీల్లో వీధిల్లైట్లకు రూ.17.55 కోట్లు, వాటర్ వర్క్సకు రూ.28.72 కోట్లు, కార్పొరేషన్ పరిధిలో వీధిలైట్లకు రూ.3.10 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.1.18 కోట్లు, మునిసిపాలిటీల్లో వీధిలైట్లకు రూ.75 లక్షలు, వాటర్వర్సకు రూ. 1.32 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్కు అన్ని శాఖలు కలిపి రూ.249.58 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ ఆదాయం క్రమేణా తగ్గుతోంది. వ్యవసాయ బకాయిలు రూ.23 కోట్లు వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌కు ఎన్పీడీసీఎల్ కస్టమర్ చార్జీల కింది ఒక పంపుసెట్‌కు నెలకు రూ.30 చొప్పున వడ్డిస్తోంది. వీటిని ప్రతి ఏటా రెండు దఫాలుగా వసూలు చేస్తోంది. ఇవి బకాయి పడడంతో రూ.23 కోట్లు పేరుకుపోయాయి. జిల్లాలో మొత్తం 2,79.000 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల గృహాలకు అందిస్తున్న ఉచి త విద్యుత్‌కు చెందిన పెండింగ్ రూ.68 కోట్లు ఉంది. విద్యుత్ బిల్లుల వసూలుకు చర్యలు విద్యుత్ బిల్లుల వసూళ్లకు చర్యలు తీసుకొంటున్నాం. ఇందుకోసం ముందస్తుగా నోటీసులు జారీ చేయడతోపాటు బిల్లులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు బకాయిలు చెల్లించి సహకరించాలి. - ఎస్ఈ మోహన్‌రావు -
వాటర్ గ్రిడ్ల ద్వారా తాగునీరు
ఏపీ మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి సాక్షి, హైదరాబాద్: సముద్రం పాలవుతున్న నదీ జలాలను అరిక ట్టి ప్రజల అవసరాలకు, పరిశ్రమలకు నీటిని అందజేసేందుకు ఏపీ రాష్ట్రంలో ఆరు వాటర్గ్రిడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇందుకోసం తాను, మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించినట్లు చెప్పారు. ఆయన బుధవారం సాయంత్రం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. 13 జిల్లాలను 6 జోన్లుగా విభజించి వాటిలో వాటర్గ్రిడ్లను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. -
డిల్లీ తరహ హైదరాబాద్‌లో ఉచ్చిత నీరు సాద్యమే!
-
సబ్సిడీ చెల్లించకుంటే కేంద్రం విద్యుత్తు కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ చెల్లించకుంటే కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్ కోటాలో కోత పడనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ప్రతి నెలా కరెంటు బిల్లులు చెల్లించాల్సిందే. లేని పక్షంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే విద్యుత్ కోటా కట్ కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లును ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. ముసాయిదా బిల్లుపై సూచనలు చేయాలని పేర్కొంది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ కోటా కోత పొంచి ఉందని ఇంధనశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వస్తోందే తక్కువ...!: వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి కేంద్ర నుంచి విద్యుత్తు కోటా తక్కువగా ఉంది. మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 2010లో 3006 మెగావాట్ల విద్యుత్ రాగా... 2013 నాటికి ఇది కేవలం 3,700 మెగావాట్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు 2010 నాటికి కేవలం 3433 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే పొందిన మహారాష్ర్ట 2013 నాటికి ఏకంగా 6396 మెగావాట్ల విద్యుత్‌ను పొందగలిగింది. మధ్యప్రదేశ్‌కు కూడా 2010లో కేవలం 2268 మెగావాట్లు రాగా 2013 నాటికి ఏకంగా 4295 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం నుంచి రాబట్టగలిగింది. డిస్కంలకు ప్రభుత్వశాఖల నుంచి కరెంటు బకాయిలు ఏళ్ల తరబడి భారీగా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖలు కరెంటు బకాయిల రూపంలో విద్యుత్ సంస్థలకు రూ.1300 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రానికి అందే విద్యుత్తులో మరింత కోత పడే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వంట.. మంట
సాక్షి, సిటీబ్యూరో:ధరల సెగ దడ పుట్టిస్తోంది. కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. వంటింట్లో ప్రధాన వస్తువులైన పచ్చిమిర్చి, ఉల్లి ధరలైతే.. సామాన్యలకు అందనంత పైకి ఎగబాకాయి. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కిస్తుండగా, ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. వీటి ప్రభావం మిగతా కూరలపై చూపుతోంది. మార్కెట్లో ఏ రకం కొందామన్నా.. రూ.30-80 మధ్య ధర పలుకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు సీమాంధ్రలో ఆందోళనలు, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలో మిర్చి, ఉల్లి, ఇతర కూరగాయలకు కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం పెరగడంతో ధరల దెయ్యం జడలు విప్పుకుంది. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా నగర అవసరాలను ఏమాత్రం తీర్చలేక పోతున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరల కత్తి దూస్తున్నారు. ఇష్టారీతిన పెంచేసి దగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. పాలకులకు పదవులు, పార్టీ వ్యవహారాలు తప్ప అదుపు తప్పిన నిత్యావసరాల ధరలు, ప్రజల బాధల గురిం చి పట్టించుకొనే తీరికే లేకుండా పోయింది. దీంతో సంబంధిత శాఖలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ముందు చూపేదీ? సీమాంధ్రలో ఆందోళనల వల్ల అక్కడి నుంచి నగరానికి కూరగాయలు దిగుమతి ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటప్పుడు ముందస్తు చర్యలు చేపట్టి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తెప్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖది. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రవాణా నిలిచిపోవడంతో మిర్చి కొరత ఎదురైందని సాకుగా చూపుతూ మార్కెటింగ్ శాఖ మౌనం వహిస్తోంది. నగర అవసరాలకు రోజుకు 100-150 టన్నుల మిర్చి కావాల్సి ఉండగా, ప్రస్తుతం 40-50 టన్నులకు మించి సరుకు రావట్లేదు. అలాగే మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులు అనూహ్యంగా పెరగడం, దసరా నాటికి ధరలు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు రైతులు ఉల్లిని గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఉల్లికి మరింత డిమాండ్ ఏర్పడింది. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మహారాష్ట్రలోనే నేరుగా ఉల్లి కొనుగోలు చేసి నగరానికి తెప్పిస్తే ధరలు అదుపులో ఉండేవి. కానీ పట్టించుకోలేదు. ఇక్కడి హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చిన సరుకులోనే కొంత (థర్డ్ గ్రేడ్) కొనుగోలు చేసి నామమాత్రంగా ఒక్కో రైతుబజార్‌కు 10 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి మమ అన్పించారు. రైతుబజార్లో కిలో రూ.25 చొప్పున ఒక్కొక్కరికి 2 కేజీలు అందించి 15 రోజుల పాటు సబ్సిడీపై ఇస్తున్న భ్రమలు కల్పించారు. ప్రస్తుతం సబ్సిడీ ఉల్లి విక్రయాలు సైతం నిలిచిపోయాయి. వాటిపైనా ప్రభావం.. మిర్చి, ఉల్లి ధరలు పెరగడంతో ఈ ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. నిజానికి క్యారెట్, క్యాప్సికం, చిక్కుడు వంటివి తప్ప మిగతా కూరగాయలన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అయితే, వ్యాపారులు సమైక్య ఉద్యమాన్ని సాకుగా చూపి, ధరలు పెంచేశారు. ఉద్యమం ప్రారంభం కాకముందు, అంటే.. జూలై 29 నాటి ధరలతో ప్రస్తుత కూరగాయల ధరలు పోల్చి చూస్తే కిలోకు రూ.5-30 పెరుగుదల కన్పిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ ధరలకు.. రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. రెట్టింపు రేట్లతో వ్యాపారులు వినియోగదారుడి జేబును పిండుకొంటున్నారు. మార్కెటింగ్ శాఖ స్పందించక పోతే.. ఉల్లి, మిర్చి ధరలు కిలో రూ.100కు చేరే అవకాశం లేకపోలేదు. రేపటి నుంచి రూ.35కే ఉల్లి చాదర్‌ఘాట్: ఉల్లి ధర ఉరుముతుండడంతో మార్కెటింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం నుంచి రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.35కే విక్రయించనున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కల్పనాదేవి తెలిపారు. ఒక్కొక్కరికి కిలో మాత్రమే అందించనున్నట్లు పేర్కొన్నారు. ధర తగ్గే వరకూ ఈ విక్రయాలు కొనసాగుతాయన్నారు. వారు బుధవారం ఉల్లి వర్తకులతో సమావేశమై చర్చలు జరిపారు. రోజూ 60 క్వింటాళ్ల ఉల్లిని సరఫరా చేసేందుకు వారు అంగీకరించారని తెలిపారు. హాస్టళ్లు, మెస్ చార్జీలకూ రెక్కలు సనత్‌నగర్, న్యూస్‌లైన్: పెరిగిన కూరగాయల ధరల ప్రభావం బ్యాచిలర్స్పైనా పడింది. కూరల ధరలు కొండెక్కడంతో హాస్టళ్లు, మెస్‌లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా అమాంతం ధరలు పెంచారు. పెరిగిన ధరల పేరుతో.. వినియోగదారులకు భారీగానే ‘వడ్డిస్తున్నారు’. నిన్న మొన్నటి వరకూ రూ.2,800 ఉన్న హాస్టల్ అద్దె ఇప్పుడు రూ.3,200కు చేరింది. ఇక మెస్‌లలో భోజనం మరింత ప్రియంగా మారింది. చిన్నపాటి మెస్‌లో కూడా ప్లేట్ మీల్స్ రూ.80కి చేరింది. కర్రీ పాయింట్ సెంటర్లు కూడా ధరలను పెంచేశాయి. నిన్నటి వరకూ రూ.8-10లకు కర్రీ ఇస్తుండగా, ఇప్పుడు రూ.15 వరకూ పెంచేశారు. దీంతో యువత గగ్గోలు పెడుతోంది. రెండుసార్లు పెంచారు.. మాది శ్రీకాకుళం జిల్లా. ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్ ఉంటూ గ్రూప్-2 ప్రిపేర్ అవుతున్నా. ఏడాదిలోపే రెండుసార్లు అద్దె పెంచారు. అదేమంటే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయనే సాకు చెబుతున్నారు. - సునీల్‌కుమార్, ఎస్ఆర్నగర్ ఎలా బతికేది? మాది కర్నూలు. అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్లో ఉండి వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నా. వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. హాస్టల్ అద్దెను రూ.2,800 నుంచి 3,000కు పెంచారు. అదేమంటే ధరలు పెరగడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పేది ఒక రకంగా బలమైన కారణమే అయినా.. నాలాంటి సామాన్యులు నగరంలో ఎలా బతికేది? -కాశీం, అమీర్‌పేట్ -
కూడంకుళంలో మొదలైన విద్యుత్ ఉత్పత్తి