అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
విత్తన కంపెనీల గతేడాది బకాయిలను తీరుస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.
మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా
13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు.
త్వరలో రైతు సంఘాలతో సమావేశం
త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment