రిలయన్స్ జియోకి ఇంటెక్స్ హ్యాండ్‌సెట్స్
న్యూఢిల్లీ: దేశీ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ ఇంటెక్స్.. కొత్తగా టెలికం కార్యకలాపాలు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి 4జీ హ్యాండ్‌సెట్స్‌ను సరఫరా చేయనుంది. దాదాపు 1 లక్ష ఫోన్లకు రిలయన్స్ జియో నుంచి ఆర్డరు వచ్చినట్లు ఇంటెక్స్ వెల్లడించింది. వీటిలో 20,000 హ్యాండ్‌సెట్స్‌ను త్వరలో డెలివరీ చేయనున్నట్లు వివరించింది. ఇంటెక్స్ బ్రాండింగ్‌తో ఉండే ఈ మొబైల్స్ ధర రూ. 10,000 లోపు ఉంటుందని, రిలయన్స్ రిటైల్ వీటిని విక్రయిస్తుందని సంస్థ పేర్కొంది. సుమారు రూ. 5,000 ఖరీదు చేసే 4జీ హ్యాండ్‌సెట్స్ మరిన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఇంటెక్స్ మొబైల్ బిజినెస్ విభాగం హెడ్ సంజయ్ కలిరోనా తెలిపారు. రిలయన్స్ జియో ఈ ఏడాది ఆఖరు నాటికి 4జీ సర్వీసులు ప్రారంభించే సన్నాహాల్లో ఉంది.