intex
-
20వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంకు రూ.1399లకే
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న క్రమంలో పవర్‌బ్యాంకుల ఆవశ్యకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బడ్జెట్‌ధరల్లో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న ఇంటెక్స్ స్మార్ట్ యూజర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. 20వేల ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న పవర్‌బ్యాంకును తగ్గింపుధరలో అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి పలు డివైస్‌లకు చార్జింగ్పెట్టుకునే అవకాశం ఉన్న ఇంటెక్స్ ఐటీ-పీబీఏ 20వేల లిథియం పాలిమర్ పవర్ బ్యాంకు (వైట్)ను కేవలం రూ.1399 లకే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర. రూ. 3550 లు. పత్ర్యేకంగా అమెజాన్ ద్వారా ఒక్కరోజుకే ఈ సేల్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు (ఫిబ్రవరి 11)కే పరిమితమని, అదీ స్టాక్ ఉన్నంత వరకేనని ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. With massive 20,000 mAh battery, charge multiple devices on the go with Intex IT-PBA 20K Poly. Buy for ₹1399 only during 'Deal of the Day' @AmazonIN. Offer valid only for today and till stock lasts. Buy now : https://t.co/w83gcaMDxv pic.twitter.com/CxTTt8Z6PR — Intex Technologies (@IntexBrand) February 11, 2019 -
మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్: ఇంటెక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న ఇంటెక్స్ టెక్నాలజీస్ ఇకపై మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ధరల శ్రేణి రూ.7 వేల లోపే ఉంటుందని కంపెనీ మొబైల్స్ ప్రొడక్ట్ హెడ్ ఇషిత బన్సల్ తెలిపారు. ఇన్ఫీ సిరీస్‌లో 18:9 ఫుల్ వ్యూ డిస్ప్లే ప్యానెల్‌తో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఫ్లాగ్షిప్ సిరీస్‌గా ఇన్ఫీ కొనసాగుతుందని చెప్పారు. -
తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీ దిగ్గజం ఇంటెక్స్ ‘ఆక్వా లయన్స్ టీ1 లైట్’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,449. ఐదు అంగుళాల డిస్ప్లే విపణిలో తక్కువ ధరలో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ అందించడానికి ఈ మొబైల్‌ను తీసుకువచ్చినట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ తెలిపారు. అలాగే ఈ మొబైల్ 21 భాషలను సపోర్టు చేస్తుందని వెల్లడించారు. ఇంటెక్స్ వాల్యూ యాడెడ్ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్-స్వైప్ యాక్సెస్), డాటాబాక్, ప్రైమ్ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేకతలు 5 అంగుళాల డిస్ప్లే 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ( 64 జీబీ వరకు పొడిగించుకునే అవకాశం) 1.3గిగా హెర్జ్ ప్రాసెసర్ క్వాడ్‌కోర్ 64 బిట్ మీడియాటెక్ చిప్సెట్ 5 మెగా పిక్సెల్ వెనక కెమెరా 2 మెగా పిక్సెల్ ముందు కెమెరా డ్యూయల్ సిమ్ 4జీ వీవోఎల్టీఈ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ -
ఎయిర్టెల్–ఇంటెక్స్.. చౌక 4జీ స్మార్ట్‌ఫోన్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ తాజాగా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘ఇంటెక్స్’ భాగస్వామ్యంతో చౌక ధరలో ‘ఆక్వా లయన్స్ ఎన్1’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1,649. అయితే ఇక్కడ కొన్ని షరతులున్నాయి. వినియోగదారులు రూ.3,149 డౌన్‌పేమెంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత 36 నెలలపాటు రూ.169తో రీచార్జ్ చేసుకోవాలి. కస్టమర్ 18 నెలల తర్వాత రూ.500, 36 నెలల తర్వాత రూ.1,000 క్యాష్ రిఫండ్ పొందొచ్చు. వినియోగదారుడు రూ.169 ప్లాన్ వద్దనుకుంటే ఇతర టారిఫ్‌లను ఎంచుకోవచ్చు. అయితే తొలి 18 నెలల కాలంలో రూ.3,000 మొత్తానికి సమానమైన రీచార్జ్‌లను చేసుకోవాలి. అప్పుడు రూ.500 రిఫండ్ పొందొచ్చు. తర్వాతి 18 నెలల్లో మరో రూ.3,000 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడు రూ.1,000 రిఫండ్ వస్తుంది. ఇక ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్‌లో 4 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. కాగా భారతీ ఎయిర్టెల్, ఇంటెక్స్ సంస్థలు సంయుక్తంగా ‘ఆక్వా ఏ4’, ‘ఆక్వా ఎస్’ అనే మరో రెండు స్మార్ట్ఫోన్లను కూడా ఆవిష్కరించాయి. వీటి ధర వరుసగా రూ.1,999గా, రూ.4,379గా ఉంది. -
జియోకు కౌంటర్ : ఎయిర్టెల్ మరో కొత్త ఫోన్
రిలయన్స్ జియో ఫోన్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కౌంటర్ ఇచ్చింది. అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1ను లాంచ్ చేసింది. రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటెక్స్ భాగస్వామ్యంలో ఎయిర్టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ భాగస్వామ్యంలోనే మరో రెండు ఇతర స్మార్ట్ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ.1999కు ఆక్వా ఏ4ను, రూ.4,379కు ఆక్వా ఎస్3ను లాంచ్ చేసింది. సెల్కాన్, కార్బన్లతో కూడా ఎయిర్టెల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఇంటెక్స్ భాగస్వామ్యంతో 'మెరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' కార్యక్రమాన్ని ఎయిర్టెల్ మరింత విస్తరిస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇంటెర్నెట్ ఎనాబుల్డ్ ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ కూడా దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారి మైక్రోమ్యాక్స్‌తో జతకట్టి, రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జియోఫోన్ లాంచింగ్ అనంతరం దిగ్గజ టెలికాం కంపెనీలు, మొబైల్ మేకర్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. నేడు లాంచ్ చేసిన ఈ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.0 నోగట్, డ్యూయల్ సిమ్ కార్డులు, 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, 1.1గిగాహెడ్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వైఫై ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ఎంఆర్పీ 3,799 రూపాయలు. రూ.3,149 డౌన్‌పేమెంట్ కట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ మొత్తం నుంచి రూ.1500ను ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తుంది. దీంతో అందుబాటులోకి వచ్చే ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ ధర 1,649 రూపాయలు. -
సూపర్ ఫీచర్స్‌తో చౌకగా..!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల తయారీదారు ఇంటెక్స్ బడ్జెట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇంటెక్స్ క్లౌడ్ స్టైల్ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేసిన ఇంటెక్స్ ధర రూ.5,799లుగా పేర్కొంది. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. షాంపేన్, గ్రే కలర్స్‌లో ఈ ఫోన్ లభించనుంది. ఫీచర్లు * 8ఎంపీ వెనుక కెమెరా * 5ఎంపీ ముందు కెమెరా * 5 అంగుళాల తెర * 1.3గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ * 1జీబీ ర్యామ్ * డ్యుయల్ సిమ్ * 8జీబీ స్టోరేజీ (మైక్రోఎస్ఈ కార్డు ద్వారా 32జీబీ వరకు) * 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
దీపావళి ఆఫర్‌తో ఇంటెక్స్ కొత్త టీవీ
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త ఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది. తన సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది. 3222 మోడల్ ఎల్ఈడిటీవీలో అన్ డ్యూ ల్యాగ్ తొలగించి, అన్ని వైపుల నుంచి స్మార్టీ లుకింగ్ వ్యూని అందించే ఐ సేఫ్ టి-మ్యాట్రిక్స్ టెక్నాలజీ ని అమర్చారు. ఇప్పటికే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన తాము తమ పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త శ్రేణి ఎల్ఈడి టీవీని జోడించడానికి సంతోషిస్తున్నామని , ఇంటెక్స్ డైరెక్టర్, బిజినెస్ హెడ్, నిధి మార్కండేయ ప్రకటించారు. అలాగు ఈ టీవీ కొనుగోలుపై దీపావళి ఆఫర్ గా వినియోగదారులు ఐదు సంవత్సరాల వారంటీ తో పాటు 8000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుతుందని నిధి వెల్లడించారు. -
బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ ఫోన్ మేకర్ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. 'క్లౌడ్ క్యూ 11' పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ. 4,699లు గా కంపెనీ నిర్ణయించింది. 3డీ కంటెంట్, ఎల్‌ఎఫ్‌టీవై లాంటి అధునాతన ఫీచర్లు తమ కొత్త స్మార్ట్ ఫోన్ సొంతమని, వీఆర్ ఎనేబుల్డ్ డివైస్ ను అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ఆనందంగా ఉందని ఇంటెక్స్ ఆన్ లైన్ మొబైల్ సేల్స్ జనరల్ మేనేజర్ గుర్విందర్ సోధి ప్రకటించారు. 'క్లౌడ్ క్యూ 11' ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 6.0 ఆండ్రాయిడ్ మార్ష్ మిల్లా ఆపరేటింగ్ సిస్టం, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 3 2జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ తెలుపు,నీలంరంగుల్లో అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. -
బ్రాండ్ అంబాసిడర్‌గా సురేష్ రైనా
న్యూఢిల్లీ : క్రికెట్ క్రికెట్ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సురేష్ రైనాను దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారి ఇంటెక్స్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. గుజరాత్ లయన్స్‌కు క్యాపిటెన్గా వ్యవహరిస్తున్న రైనాను కంపెనీ కొత్త రేంజ్ స్పీకర్స్ సెగ్మెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్(కన్సూమర్ డ్యూరెబుల్స్, ఐటీ పెరిఫెరల్స్) నిధి మార్కెండేయా తెలిపారు. ఏడాది ఒప్పందానికి రైనా సంతకం చేశారని నిధి చెప్పారు. ఇంటెక్స్ స్పీకర్స్‌కు బ్రాండ్ క్యాంపెయిన్‌గా ఇక సురేష్ రైనా బాధ్యతలు వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. ఇంటెక్స్ బ్రాండుతో ఈ కొత్త అధ్యాయనం ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని రైనా చెప్పారు. కేవలం క్రికెట్ మాత్రమే కాక, మ్యూజిక్ అంటే కూడా తనకు అపరిమితమైన ప్రేమ ఉందన్నారు. ఇంటెక్స్ స్పీకర్స్‌కు ఎంతో కాలం నుంచి గొప్ప పేరుందని రైనా చెప్పారు. -
మల్టీ టాస్కర్స్ కోసం ఇంటెక్స్ కొత్త ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫాస్టెస్ట్ ప్రాసెసర్ తో పాటు మల్టీ టాస్కింగ్ గా ఈ కొత్త ఫోన్ వినియోగదారులు సమర్థవంతమైన సహాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది. స్మార్ట్-మోషన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన "క్లౌడ్ ట్రీడ్" డివైస్ హ్యాండ్స్ ఫ్రీ అనుభవాన్నిస్తుందని పేర్కొంది. స్నాప్ డీల్ ద్వారా మాత్రమే లభ్యం కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.4,999 గా నిర్ణయించింది. 3 జీ ఆధారిత ఈ మొబైల్‌ను ఆగస్టు 29 దాకా ముందస్తు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంటుందని ఇంటెక్స్ ప్రకటించింది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి... 5 అంగుళాల హెచ్ డీ స్క్రీన్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 1.5 గిగాహెట్జ్ హెక్సా కోర్ ప్రాసెసర్ 2జీబీ రామ్ 16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్ 2200 ఎంఏహెచ్ బ్యాటరీ 5 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా దీంతోపాటుగా గెస్ట్చర్ కంట్రోల్స్, ఎమర్జెన్సీ, రక్షణ, వాయిస్ క్యాప్చర్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్ లాంటి మల్టిపుల్ నేవిగేషన్ ఫీచర్స్ తో తమ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కేశవ్ బన్సల్ చెప్పారు. -
ఇంటెక్స్ ఆక్వా కొత్త ఫోన్..ధర ఎంత?
ఇంటెక్స్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఇంటెక్స్ ఆక్వా సిరీస్‌లో భాగంగా 'ఆక్వా పవర్ హెచ్డీ4జీ' పేరుతో వస్తున్న ఈ ఫోన్ ధరను రూ.8,363గా వెబ్ సైట్ లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఎవైలబిలిటీ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేనప్పటికీ త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఇంటెక్స్ వెబ్ సైట్ లో లిస్టైన వివరాల ప్రకారం ఫీచర్లు ఇలా వున్నాయి. ఆక్వా పవర్ హెచ్డీ 4జీ ఫీచర్లు.. 5.1 లాలీపాప్, 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 6.0, 720x1280 పిక్సెల్స్ డిస్ ప్లే వింత్ 294 పీపీఐ 1 గిగాహెడ్జ్ ప్రాసెసర్ , 4జీ ఎల్టీఈ 8ఎంపీ వెనుక కెమెరా విత్ డ్యూయల్ ఎఈడీ ఫ్లాష్ 4ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ర్యామ్ , 32జీబీ ఎక్స్ పాండబుల్ 3900 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ విత్ 7గంటల బ్యాటరీ కాగా గత ఏడాది 'ఆక్వా పవర్ 4జీ' పేరుతో విడుదలైన స్మార్ట్ ఫోన్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ సరికొత్త హెచ్ డీ 4 జీ ఫోన్ ను తీసుకొస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం స్మార్ట్ ఫోన్ బ్లూ, గ్రే, మరియు ఛాంపేన్ కలర్స్ లోలభ్యంకానుంది. -
సెయిల్ఫిష్ ఓఎస్‌తో ఇంటెక్స్ వచ్చేసింది
ప్రపంచంలోనే మొట్టమొదటి సెయిల్ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్ ను ఇంటెక్స్ శుక్రవారం విడుదల చేసింది. ఆక్వా ఫిష్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,499గా ఇంటెక్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా ఈబే ఇండియా ప్లాంట్ ఫామ్‌పై ఉంచినట్టు పేర్కొంది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫిన్లాండ్ కంపెనీ జొల్లాకు చెందిన సెయిల్ఫిష్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నామని, దీనికోసం జొల్లాతో ఒప్పందం కుదుర్చుకున్నామని గతేడాది జూన్‌లో షాంఘై ఎమ్డబ్ల్యూసీలో ఇంటెక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ టెక్నాలజీలను కస్టమర్ల ముందుకు తీసుకురావడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తుంటామని, ఈ నేపథ్యంలోనే సెయిల్ఫిష్ ఓఎస్‌తో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశామని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. సెయిల్ఫిష్ యంగ్ మొబైల్ ఓఎస్ అని, సెయిల్ఫిష్ అనుభూతిని కస్టమర్లు ఆస్వాదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఓఎస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లకు కూడా సపోర్టు చేస్తుందన్నారు. సెయిల్ఫిష్ ఓఎస్ తో ఆక్వాఫిష్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉందని జోలా సహ వ్యవస్థాపకుడు సామి తెలిపారు. ఇంటెక్స్ ఆక్వా ఫిష్ ఫీచర్లు.. డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ 5 అంగుళాల హెచ్డీ రిసుల్యూషన్ టీఎఫ్టీ డిస్ప్లే 1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 2 జీబీ ఆఫ్ డీడీఆర్3 ర్యామ్ 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 2 మెగాపిక్సెల్ ముందు కెమెరా 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 32జీబీ విస్తరణ మెమరీ 4జీ ఎల్టీఈ 150 గ్రాముల బరువు 2500ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, ఆరెంజ్ రంగుల్లో ఫోన్ లభ్యం -
6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ హెచ్డీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5,599 లుగా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కి వీవో ఎల్టీఈ (వాయిస్ ఓవర్ )సపోర్ట్ కూడా ఉంది. కాగా ఇదే ఫీచర్స్ తో ఇంటెక్స్ , ఆక్వాసెక్యూర్ పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అయితే మిర్రర్ గ్లాస్ సపోర్టు తో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 720×1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం డ్యూయల్ సిమ్ (4జీ + 4జీ) 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 8జీబీ అంతర్గత మెమొరీ ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా 2200 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇండియాలో నెంబర్‌వన్ మొబైల్ బ్రాండ్ ఇంటెక్స్
హైదరాబాద్: భారత దేశపు అగ్రశ్రేణి మొబైల్ బ్రాండ్‌గా నిలిచామని ఇంటెక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐడీసీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 87,55, 697 ఇంటెక్స్ మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్ అమ్మకాలతో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ హెడ్ (మొబైల్స్) సంజయ్ కుమార్ కలిరోనా పేర్కొన్నారు. నాణ్యత గల మొబైల్ ఫోన్లను అందించడం వల్లే నంబర్‌వన్ భారత మొబైల్ బ్రాండ్‌గా నిలిచామని వివరించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ఆక్వా పవర్ ప్లస్, ఆక్వా 4జీ ప్లస్, ఆక్వా ట్రెండ్, ఆక్వా డ్రీమ్ టూ, క్లౌడ్ స్విఫ్ట్ వంటి వినూత్నమైన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. -
రిలయన్స్ జియోకి ఇంటెక్స్ హ్యాండ్సెట్స్
న్యూఢిల్లీ: దేశీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఇంటెక్స్.. కొత్తగా టెలికం కార్యకలాపాలు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి 4జీ హ్యాండ్‌సెట్స్‌ను సరఫరా చేయనుంది. దాదాపు 1 లక్ష ఫోన్లకు రిలయన్స్ జియో నుంచి ఆర్డరు వచ్చినట్లు ఇంటెక్స్ వెల్లడించింది. వీటిలో 20,000 హ్యాండ్‌సెట్స్‌ను త్వరలో డెలివరీ చేయనున్నట్లు వివరించింది. ఇంటెక్స్ బ్రాండింగ్‌తో ఉండే ఈ మొబైల్స్ ధర రూ. 10,000 లోపు ఉంటుందని, రిలయన్స్ రిటైల్ వీటిని విక్రయిస్తుందని సంస్థ పేర్కొంది. సుమారు రూ. 5,000 ఖరీదు చేసే 4జీ హ్యాండ్సెట్స్ మరిన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఇంటెక్స్ మొబైల్ బిజినెస్ విభాగం హెడ్ సంజయ్ కలిరోనా తెలిపారు. రిలయన్స్ జియో ఈ ఏడాది ఆఖరు నాటికి 4జీ సర్వీసులు ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. -
ఇంటెక్స్ నుంచి ‘ఐరిస్ట్’ స్మార్ట్ వాచ్
షాంఘై: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ఇంటెక్స్ ‘ఐరిస్ట్’ పేరుతో వేరబుల్ స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై నడిచే ఈ స్మార్ట్ వాచ్‌లో సిమ్ కార్డ్‌ను కూడా వేసుకోవచ్చు. అంటే వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఐరిస్ట్ స్మార్ట్‌వాచ్‌లో 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ, 600 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ కెమెరా, జీపీఎస్ నావిగేటర్, వై-ఫై, బ్లూటూత్, ఇన్‌బిల్ట్ ప్లేస్టోర్ యాప్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ నలుపు, ఆరెంజ్, పింక్ రంగుల్లో లభిస్తుంది. -
మెడికల్ టూరిజంలోకి ఇంటెక్స్!
దేశంలోని 5 నగరాల్లో ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఉపకరణాల సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ మెడికల్ టూరిజంలోకి అడుగుపెట్టింది. అందుబాటు ధరల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల్ని అందించేందుకు ‘ఇంటెక్స్ కేర్’ పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించినట్లు ఇంటెక్స్ కేర్, ఇంటెక్స్ టెక్నాలజీస్ డెరైక్టర్ పంకజ్ గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా నగరాల్లో ఇంటెక్స్ కేర్ సేవల్ని అందించనున్నామని, ఇందుకోసం ఆయా నగరాల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. త్వరలోనే ఇంటెక్స్ కేర్ సేవల్ని దేశంలోని ఇతర మెట్రో నగరాలకు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తామని తెలియజేశారు. -
భారీ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్...
కంప్యూటర్ పరికరాల తయారీ సంస్థ ఇంటెక్స్ తాజాగా తన ఇంటెక్స్ ఆక్వా శ్రేణిలో శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని విడుదల చేసింది. ఏకంగా 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న ఈ ఆక్వా పవర్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ కూడా పవర్‌ఫుల్లే. దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్‌ను వాడారు. స్క్రీన్ సైజు 5 అంగుళాలు కాగా, ర్యామ్ ఒక గిగాబైట్ వరకూ ఉంది. ప్రధాన కెమెరా ఆటోఫోకస్ సౌకర్యంతోపాటు 8 మెగాపిక్సెళ్ల సామర్థ్యంతో లభిస్తుంది. సెల్ఫీల కోసం ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా సామర్థ్యం రెండు మెగాపిక్సెళ్లు. ఫోన్ మెమరీ 8 గిగాబైట్లు ఉన్నప్పటికీ ఎస్డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ధర రూ.8499. -
ఇంటెక్స్.. అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్లు తయారు చేసే ఇంటెక్స్ కంపెనీ ఫైర్ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్.. క్లౌడ్ ఎఫ్ఎక్స్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.1,999 అని ఇంటెక్స్ టెక్నాలజీస్ డెరైక్టర్(మార్కెటింగ్) కేశవ్ బన్సాల్ చెప్పారు. భారత్‌లో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇదేనని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ ధర లేకుండానే మారాలనుకునేవారి కోసం ఈ ఫోన్‌ను అందిస్తున్నామని వివరించారు. 3 నెలల్లో 5 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఫైర్ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 128 ఎంబీ ర్యామ్, 256 ఎంబీ మెమెరీ, 4 జీబీ ఎక్సపాండబుల్ మెమెరీ, 2మోగాపిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1,250 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఎయిర్‌సెల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... 1 జీబీ డేటా రెండు నెలల పాటు ఉచితమని, ఫేస్బుక్ సైట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని బన్సాల్ వివరించారు. -
భారత్‌లోనే చౌకగా స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగుమతి రానురాను తగ్గిపోతోంది. భారత్‌లోనే చౌకగా స్మార్ట్ఫోన్లు దొరుకుతున్నాయి. పలు కంపెనీలు ఇక్కడే తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు పోటీపడి తయారు చేస్తున్నాయి. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. ఫైర్ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 29న భారత్‌లో లాంఛ్ కానుంది. ఇంటెక్స్, స్పైస్ సంస్థలు ఫైర్ఫాక్స్ ఫోన్‌ను విడుదల చేయనున్నాయి. ఫైర్ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ధర 2,229 రూపాయలు. -
రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్
న్యూఢిల్లీ: ఇంటెక్స్ కంపెనీ కొత్త 3జీ స్మార్ట్‌ఫోన్, ఆక్వా 3జీని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,555 అని ఇంటెక్స్ బిజినెస్ హెడ్(సంజయ్ కుమార్ కలిరోనా) చెప్పారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ రామ్, 12.25 ఎంబీ బిల్టిన్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 1400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పలువురు వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని, అందుకే మొబైల్ కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించాల్సిన అవసరముందని సంజయ్ కుమార్ వివరించారు. -
ఇంటెక్స్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ శుక్రవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఆక్వా ఐ4ప్లస్ పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.7,600గా నిర్ణయించామని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ మొబైల్ హెడ్ సంజయ్ కుమార్ కలిరోణ చెప్పారు. డ్యుయల్ సిమ్ ఫీచరున్న 3జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.2 గిగా హెట్స్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 4.0 వంటి ప్రత్యేకతలున్నాయి. 4.2.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితమని సంజయ్ వివరించారు. వుయ్ చాట్, ఓఎల్ఎక్స్ వంటి ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్స్‌ను ప్రి-ఇన్‌స్టాల్‌గా అందిస్తున్నామని పేర్కొన్నారు. మాతృభాష యాప్ ద్వారా తెలుగు, హిందీ సహా మొత్తం 22 భారతీయ భాషల్లో వినియోగదారులు తమకు నచ్చిన భాషలో ఈ ఫోన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు.