బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనా
బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనా
Published Sat, Sep 24 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
న్యూఢిల్లీ : క్రికెట్ క్రికెట్ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సురేష్ రైనాను దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారి ఇంటెక్స్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. గుజరాత్ లయన్స్కు క్యాపిటెన్గా వ్యవహరిస్తున్న రైనాను కంపెనీ కొత్త రేంజ్ స్పీకర్స్ సెగ్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్(కన్సూమర్ డ్యూరెబుల్స్, ఐటీ పెరిఫెరల్స్) నిధి మార్కెండేయా తెలిపారు. ఏడాది ఒప్పందానికి రైనా సంతకం చేశారని నిధి చెప్పారు.
ఇంటెక్స్ స్పీకర్స్కు బ్రాండ్ క్యాంపెయిన్గా ఇక సురేష్ రైనా బాధ్యతలు వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. ఇంటెక్స్ బ్రాండుతో ఈ కొత్త అధ్యాయనం ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని రైనా చెప్పారు. కేవలం క్రికెట్ మాత్రమే కాక, మ్యూజిక్ అంటే కూడా తనకు అపరిమితమైన ప్రేమ ఉందన్నారు. ఇంటెక్స్ స్పీకర్స్కు ఎంతో కాలం నుంచి గొప్ప పేరుందని రైనా చెప్పారు.
Advertisement
Advertisement