suresh raina
-
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సురేశ్ రైనా దంపతులు (ఫొటోలు)
-
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్‌లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటినప్పటకి తనలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.ఈ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల మోత మోగించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను మిస్టర్ ఐపీఎల్ ఓ ఆట ఆడేసికున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రైనా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు మరోసారి బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రైనా.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ య్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రైనాతో పాటు ఉపుల్ తరంగా(40) పరుగులతో రాణించాడు. అనంతరం లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో న్యూయర్క్ లయన్స్ విజయం సాధించింది. Suresh Raina makes a roaring entry on the NCL stage with a stroke-filled half-century that lifted New York Lions to 126. 🔥#NCLonFanCode pic.twitter.com/4IS8waiIdF— FanCode (@FanCode) October 5, 2024 -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్‌పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్‌పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
'బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. పాక్‌నే ఓడించారు'
భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు.బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయద్దని భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు రోహిత్‌ను సూచించారు. కాగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించలేదు. కానీ బంగ్లా జట్టు మాత్రం ఇటీవల కాలంలో టెస్టుల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది ఆఖరిలో న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లా టైగర్స్.. తాజాగా పాకిస్తాన్‌ను వారి స్వదేశంలోనే చిత్తు చేశారు. కాబట్టి బంగ్లా జట్టు నుంచి భారత్‌కు పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.టీమిండియా ఐదు నెలల తర్వాత టెస్టుల్లో ఆడనుంది. బంగ్లాతో సిరీస్‌కు భారత టెస్టు జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. దులీప్ ట్రోఫీలో భారత టాప్ ప్లేయర్లను భాగం చేయడం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం.రెడ్‌బాల్ క్రికెట్(టెస్టు) ఆడినప్పుడు ఆటగాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవద్దు. బంగ్లా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్ భారత జట్టు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతోందని ఏఎన్ఐతో రైనా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ సైతం రైనా వ్యాఖ్యలను సమర్ధించాడు.ఇది గొప్ప సిరీస్ కానుంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. వారు రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఓడించారు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. -
ధోనీ రిటైర్మెంట్ గుట్టు విప్పిన రైనా!
2020 ఆగస్టు 15.. భారత క్రికెట్లో మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆ రోజు రాత్రి 7:29 గంటలకు మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే మరో స్టార్ క్రికెటర్, చిన్న తలా సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ తప్పుకుంటున్నానని షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో ఒకే రోజు ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల ప్రయాణం ముగిసింది. ఆ సమయంలో వీరిద్దరూ ఐపీఎల్-2020 సీజన్ బయోబబుల్‌లో ఉన్నారు. కాగా ఒకే రోజు ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయంశమైంది. అయితే ఒకే రోజు తను ధోని రిటైర్మెంట్ ప్రకటించడం వెనకగల కారణాన్ని అక్కడికి రెండు రోజుల తర్వాత సురేష్ రైనా వెల్లడించాడు.అసలు కారణమిదే?"శనివారం(2020 ఆగస్టు 15) రిటైర్మెంట్ ప్రకటించాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాము. అందుకు ఓ కారణముంది. ధోనీ జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3. రెండు కలిపితే 73 అవుతుంది. ఆ రోజు(ఆగస్టు 15)న మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు అని భావించాము. అందుకే ఒకేసారి ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాము. ధోనితో నాకు మంచి అనుబంధం ఉంది. ధోనీ తన కెరీర్‌ను డిసెంబర్ 23 (2004)న బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో ప్రారంభించగా, నేను జూలై 30 (2005)న శ్రీలంకపై అరంగేట్రం చేశాను. మేమిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 15 ఏళ్లు కలిసి ప్రయాణించాము. రిటైరయ్యాక ఐపీఎల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని" అప్పటిలో దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు."ఇంగ్లండ్‌లో ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
విరాట్, రోహిత్, రూట్: రైనా
ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో మొదటిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఉంటారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను క్రికెట్ సర్కిల్స్‌లో ఫాబ్ ఫోర్‌గా పిలుస్తారు. ఈ నలుగురితో పాటు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ పేర్లు కూడా అడపాదడపా వినిపిస్తుంటాయి.సురేశ్ రైనా ఛాయిస్ ఎవరంటే..?ఈ తరం అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నను టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎదుర్కొన్నప్పుడు సెకెను కూడా ఆలస్యం చేయకుండా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, జో రూట్ ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లని రైనా అభిప్రాయపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్ అనంతరం రైనా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.ఈ సందర్భంగా రైనాతో పాటు పలువురు మాజీలు ఇదే ప్రశ్నను ఎదుర్కోగా.. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కాంబినేషన్‌ను చూస్ చేసుకున్నారు. హర్భజన్ సింగ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలో జాక్ కలిస్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చేర్చగా.. ఆరోన్ ఫించ్.. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చెప్పాడు. రాబిన్ ఉతప్ప.. వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారా పేర్లు చెప్పాడు.ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో టీమిండియా ఛాంపియన్స్.. పాకిస్తాన్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి, తొట్టతొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
WCL 2024: రైనా హాఫ్ సెంచరీ వృథా.. పాకిస్తాన్‌పై భారత్ ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఆక్మల్(40 బంతుల్లో 77), షర్జీల్ ఖాన్(72), మసూద్(51) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పవన్ నేగి, అనురీత్ సింగ్, ఆర్పీ సింగ్, కులకర్ణి తలా వికెట్ సాధించారు.రైనా హాఫ్ సెంచరీ వృథా..అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో సురేష్ రైనా(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అంబటి రాయడు(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో షోయబ్ మాలిక్, రియాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, షోహిల్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి..
-
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి.. సచిన్, ధోని లానే: రైనా
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ఘనంగా విడ్కోలు పలికారు. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి వారు తమ టీ20 ప్రయణాన్ని ముగించారు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబర్ 45."బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనకుంటున్నాను. వరల్డ్‌కప్‌ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి. కాబట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను. ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి. ఇప్పటికే జెర్సీ నెం 10(సచిన్), నెం 7(ధోని)లకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్, రోహిత్ జెర్సీ నెంలను ఎవరికీ కేటాయించకూడదు. ఆ జెర్సీ నంబర్లను చూస్తే ప్రతీ ఒక్కరికి స్పూర్తి కలగాలి. నెం.18, నెం. 45ల జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించారు. ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024 -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్‌పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్‌కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్‌కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్‌పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆల్-క్యాష్ డీల్‌లో భాగంగా గుజరాత్ నుంచి ముంబై జట్టుకు ట్రేడ్ అయిన హార్దిక్.. కెప్టెన్‌గా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించింది. అదే విధంగా హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 18 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో హార్దిక్ విఫలమైనప్పటకి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో మాత్రం చోటు దక్కింది. కేఎల్ రాహుల్, గిల్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు ఇవ్వకుండా హార్దిక్‌ను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వరల్డ్‌కప్‌నకు హార్దిక్‌ను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సపోర్ట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో పాండ్యా సత్తాచాటుతాడని రైనా జోస్యం చెప్పాడు."హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తనవంతు న్యాయం చేసేవాడు. ఫామ్ అనేది తాత్కాలికం మాత్రమే. అది శాశ్వతం కాదు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హార్దిక్ బాగా రాణిస్తే, అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతారని" క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 1 నంచి ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదికైంది. రాయల్స్‌పై విజయానంతరం సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియమంతా కలియదిరుగుతూ టెన్నిస్ బంతులు స్టాండ్స్‌లోకి విసిరాడు.జట్టు వెంటరాగా ముందుండి నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తలా. దీంతో చెపాక్‌లో ఒకరకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడింది. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్‌ను తలా వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపించింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేశ్ రైనా కూడా జతకలిశాడు. ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తలా.. అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. జియో సినిమాలో సహ కామెంటేటర్ అభినవ్ ముకుంద్ రైనాను ఉద్దేశించి.. ఒక యుగం ముగిసిపోయినట్లేనా? అని అడిగాడు.ఇందుకు రైనా బదులిస్తూ.. ‘‘కచ్చితంగా కానే కాదు’’ అని పేర్కొన్నాడు. దీంతో తలా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సీఎస్కే మాజీ స్టార్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 లీగ్ దశలో చెన్నైలో సీఎస్కే తమ చివరి మ్యాచ్ ఆడేసింది. రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. కాగా క్వాలిఫయర్-2, ఫైనల్ మాత్రం చెపాక్ వేదికగానే జరుగనున్నాయి.చదవండి: ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాను అనుకోని దుర్ఘటనలు వెంటాడుతూ ఉన్నాయి. 2020 ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. రైనా మేనమామ కుటుంబం మొత్తాన్ని దోపిడి దొంగలు అతి కిరాతకంగా చంపేయగా.. తాజాగా మరో మేనమామ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా పఠాన్‌కోట్-మండియా జాతీయ రహదారిపై రైనా కజిన్ (మామ కొడుకు) సౌరభ్ కుమార్ (29) స్కూటర్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ ఇతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరభ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమయంలో సౌరభ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు.సౌరభ్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు శుభమ్ (19) అని సమాచారం. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ పేరు షేర్ సింగ్. ప్రస్తుతం షేర్ సింగ్ స్థానిక పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. -
T20 World Cup 2024: ఓ ఆటగాడి కోసం చీఫ్ సెలెక్టర్‌కు రెకమండ్ చేసిన రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్‌కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్‌కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్‌ను కోరాడు.ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్‌కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్‌ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024 కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుత సీజన్లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇరదీశాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బంతితో రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దక్కడం ఖాయం. -
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
IPL 2024 MI VS CSK: రోహిత్, ధోని ముంగిట భారీ రికార్డులు
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరిని భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ధోని మరో 4 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున కేవలం సురేశ్ రైనా (5529) మాత్రమే ఈ ఘనత సాధించాడు. సీఎస్కే తరఫున ధోని 249 మ్యాచ్‌ల్లో 4996 పరుగులు చేశాడు. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్ సీఎస్కే తరఫున ధోనికి 250వ మ్యాచ్ కావడం మరో విశేషం. సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు చేస్తే.. ముంబై, సీఎస్కే ఎల్ క్లాసికో మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 30 మ్యాచ్‌ల్లో 710 పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు చేసిన రోహిత్.. మరో 11 పరుగులు చేస్తే రైనా రికార్డును బద్దలు కొడతాడు. ఈ రికార్డు విభాగంలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. సీఎస్కే, ముంబై మ్యాచ్‌ల్లో (35) ధోని 655 పరుగులు చేశాడు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడం ద్వారా ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ క్యాచ్‌తో విరాట్ ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రికార్డును బద్దలుకొట్టాడు. ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు పట్టగా.. విరాట్ 242 మ్యాచ్‌ల్లో 110 క్యాచ్‌లు పట్టి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అవతరించాడు. కోహ్లి, రైనా తర్వాత ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత కీరన్ పోలార్డ్‌కు దక్కింది. పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి (గేల్ 22, బాబర్ ఆజమ్ 11 తర్వాత) ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్లో విరాట్ చేసిన సెంచరీలు.. 2016లో గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 నాటౌట్ 2016లో పూణేపై 58 బంతుల్లో 108 నాటౌట్ 2016లో గుజరాత్ లయన్స్‌పై 55 బంతుల్లో 109 2016లో కింగ్స్ పంజాబ్‌పై 50 బంతుల్లో 113 2019లో కేకేఆర్‌పై 58 బంతుల్లో 100 2023లో సన్‌రైజర్స్‌పై 63 బంతుల్లో 100 2023లో గుజరాత్ టైటాన్స్‌పై 61 బంతుల్లో 101 నాటౌట్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 నాటౌట్ ఇదిలా ఉంటే, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. జోస్ బట్లర్ మెరుపు శతకం చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.