2020 ఆగస్టు 15.. భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆ రోజు రాత్రి 7:29 గంటలకు మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.
అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే మరో స్టార్ క్రికెటర్, చిన్న తలా సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ తప్పుకుంటున్నానని షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో ఒకే రోజు ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల ప్రయాణం ముగిసింది.
ఆ సమయంలో వీరిద్దరూ ఐపీఎల్-2020 సీజన్ బయోబబుల్‌లో ఉన్నారు. కాగా ఒకే రోజు ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయంశమైంది. అయితే ఒకే రోజు తను ధోని రిటైర్మెంట్ ప్రకటించడం వెనకగల కారణాన్ని అక్కడికి రెండు రోజుల తర్వాత సురేష్ రైనా వెల్లడించాడు.
అసలు కారణమిదే?
"శనివారం(2020 ఆగస్టు 15) రిటైర్మెంట్ ప్రకటించాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాము. అందుకు ఓ కారణముంది. ధోనీ జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3. రెండు కలిపితే 73 అవుతుంది. ఆ రోజు(ఆగస్టు 15)న మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు అని భావించాము. అందుకే ఒకేసారి ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాము. ధోనితో నాకు మంచి అనుబంధం ఉంది. ధోనీ తన కెరీర్‌ను డిసెంబర్ 23 (2004)న బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో ప్రారంభించగా, నేను జూలై 30 (2005)న శ్రీలంకపై అరంగేట్రం చేశాను.
మేమిద్దరం అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 15 ఏళ్లు కలిసి ప్రయాణించాము. రిటైరయ్యాక ఐపీఎల్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని" అప్పటిలో దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment