బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు.
గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.
ధోని రికార్డు బద్దలు
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు.
ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment