Inzamam-Ul-Haq Criticizes Wicketkeeper Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం మాత్రమే సాధించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ దూకుడు చూస్తే మ్యాచ్ తొందరగానే ముగిసిపోతుందని భావించారు. కానీ వారిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఆటతీరు గాడి తప్పింది. ఆఖర్లో పరుగులు రావడం చాలా ఇబ్బందిగా మారి ఉత్కంఠకు దారి తీసింది. పంత్ ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో మెరవడంతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. కానీ రిషబ్ పంత్ తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు.
చదవండి: Pujara Vs Jack Brooks: జాతి వివక్ష.. 9 ఏళ్ల తర్వాత పుజారాకు క్షమాపణ
''రిషబ్ పంత్‌పై నాకు మంచి అంచనాలు ఉన్నాయి. గత రెండేళ్లుగా అతని ప్రదర్శన చూస్తుంటే అది నిజమేనని అనిపించింది. ఆస్ట్రలియా, ఇంగ్లండ్ గడ్డపై పంత్ ఆడిన తీరు నన్ను ఆకట్టుకుంది. అతని ఆటతీరు చూసి మరో ధోనిలా కనిపించాడని.. టాప్ ఆర్డర్ ఫెయిలయ్యినప్పుడు ఐదు.. ఆరు స్థానాల్లో వచ్చే పంత్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ వరల్డ్‌కప్ నుంచి అతని ఆటతీరులో ఏదో మార్పు వచ్చింది.
ఇక కివీస్‌తో జరిగిన తొలి టి20లో 17 పరుగులతో మ్యాచ్ గెలిచిపించినప్పటికీ.. అతనిలో పాత పంత్ కనిపించలేదు. ఒత్తిడితో ఆడిన అతను అంచనాలను అందుకోలేకపోయాడు. చేయాల్సిన పరుగులు తక్కువగా ఉన్నాయి కాబట్టి పంత్‌కు పెద్దగా మెరవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రతీసారి ఇదే జరుగుతుందని చెప్పలేం. ఇది అర్థం చేసుకొని రానున్న మ్యాచ్‌ల్లో ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తాడని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా న్యూజిలాండ్ మధ్య రెండో టి20 నవంబర్ 19న జరగనుంది.
చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో విజయం.. రోహిత్ 9 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment