Inzamam ul-Haq
-
ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!
పీసీబీ చైర్‌పర్సన్‌గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్ క్రికెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మిస్బా ఉల్ హక్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్‌లతో కూడిన క్రికెట్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసిన అష్రాష్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్కు మరోసారి పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ బాధ్యతలు అప్పజెప్పాలని అష్రాఫ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఇంజామామ్ పనిచేశాడు. ఈ మెరకు త్వరలో జరగనున్న క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛీప్‌గా నజామ్ సేథీ ఉన్న సమయంలో ఆ జట్టు కోచ్‌లు మిక్కీ ఆర్థర్,బ్రాడ్‌బర్న్, డేటా ఎనలిస్ట్ హసన్ చీమాకు కూడా పాకిస్తాన్ సెలక్షన్ కమిటీలో భాగమయ్యారు. ఇప్పుడు వారిని సెలక్షన్ కమిటీలో కొనసాగించాలా లేదా అన్నది కూడా క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెలక్షన్ ప్యానల్లో హెడ్ కోచ్ ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో కూడా ఈ టెక్నికల్ కమిటీ చర్చించనుంది. ఆసియాకప్‌కు జట్టు ఎంపిక ముందు కొత్త సెలక్షన్ ప్యానల్‌ను ఖారారు చేసే అవకాశం ఉంది. చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్! కెప్టెన్ దూరం -
ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు
Inzamam-Ul-Haq Criticizes Wicketkeeper Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం మాత్రమే సాధించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ దూకుడు చూస్తే మ్యాచ్ తొందరగానే ముగిసిపోతుందని భావించారు. కానీ వారిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఆటతీరు గాడి తప్పింది. ఆఖర్లో పరుగులు రావడం చాలా ఇబ్బందిగా మారి ఉత్కంఠకు దారి తీసింది. పంత్ ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో మెరవడంతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. కానీ రిషబ్ పంత్ తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. చదవండి: Pujara Vs Jack Brooks: జాతి వివక్ష.. 9 ఏళ్ల తర్వాత పుజారాకు క్షమాపణ ''రిషబ్ పంత్‌పై నాకు మంచి అంచనాలు ఉన్నాయి. గత రెండేళ్లుగా అతని ప్రదర్శన చూస్తుంటే అది నిజమేనని అనిపించింది. ఆస్ట్రలియా, ఇంగ్లండ్ గడ్డపై పంత్ ఆడిన తీరు నన్ను ఆకట్టుకుంది. అతని ఆటతీరు చూసి మరో ధోనిలా కనిపించాడని.. టాప్ ఆర్డర్ ఫెయిలయ్యినప్పుడు ఐదు.. ఆరు స్థానాల్లో వచ్చే పంత్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ వరల్డ్‌కప్ నుంచి అతని ఆటతీరులో ఏదో మార్పు వచ్చింది. ఇక కివీస్‌తో జరిగిన తొలి టి20లో 17 పరుగులతో మ్యాచ్ గెలిచిపించినప్పటికీ.. అతనిలో పాత పంత్ కనిపించలేదు. ఒత్తిడితో ఆడిన అతను అంచనాలను అందుకోలేకపోయాడు. చేయాల్సిన పరుగులు తక్కువగా ఉన్నాయి కాబట్టి పంత్‌కు పెద్దగా మెరవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రతీసారి ఇదే జరుగుతుందని చెప్పలేం. ఇది అర్థం చేసుకొని రానున్న మ్యాచ్‌ల్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాడని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా న్యూజిలాండ్ మధ్య రెండో టి20 నవంబర్ 19న జరగనుంది. చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో విజయం.. రోహిత్ 9 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్ -
ఇంతకంటే అధ్వాన్నం ఉండదు!
కరాచీ: దాదాపు 14 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో పర్యటించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ సల్మాన్ భట్‌తో పాటు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించి తొలి ఓవర్ ఆ ఫీట్ నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.కాగా, ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయినా పాకిస్తాన్నే విజయం వరించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కమ్రాన్ అక్మల్ సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ జట్టులో అప్పుడు కొత్తగా అడుగుపెట్టిన అక్మల్‌పై ఎటువంటి ఒత్తిడి లేకుండా శతకం నమోదు చేశాడు. అయితే తాను సెంచరీ చేయడానికి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఇచ్చిన సలహానే కారణమన్నాడు. క్రిక్ కాస్ట్ యూట్యూబ్ చాట్‌లో 2006 కరాచీ టెస్టు మ్యాచ్ విశేషాల్ని కమ్రాన్ గుర్తు చేసుకున్నాడు. ‘ నిజం చెప్పాలంటే నా మైండ్‌లో ఏమీ లేదు. అప్పటికే ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి మా జట్టును కష్టాల్లోకి నెట్టాడు. నేను కూడా కొత్త ముఖాన్నే. దాంతో పెద్దగా ఒత్తిడి తీసుకోలేదు. ఆ మ్యాచ్‌కు ఇంజీ భాయ్ వెన్నుగాయంతో దూరమయ్యాడు. (గంగూలీ చేసిందేమీ లేదు!) కాకపోతే డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంజీ ఒక్కటే చెప్పాడు. ఇప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దది. ఇంతకంటే అధ్వానం ఏమీ ఉండదు. నువ్వు మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోవద్దు. నీ సహజసిద్ధమైన ఆటనే ప్రదర్శించు. భారత్‌పై ఎలా ఆడతావో అలానే ఆడు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకో. కేవలం నీ నేచురల్ గేమ్‌ను మాత్రమే ఆడు. ఏదీ జరిగినా పర్వాలేదు. ఇప్పటికే చాలా పెద్ద నష్టం జరిగింది. నువ్వు ఎలా ఆడిన ఇంతకంటే అధ్వానం కాదు’ అని ఇంజీ తనలో ప్రేరణ నింపినట్లు కమ్రాన్ తెలిపాడు. దాంతోనే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి పాక్‌ను పటిష్ట స్థితిలో నిలిపినట్టు తెలిపాడు. ఇదే తమ విజయానికి బాటలు వేసిందన్నాడు. అది తన కెరీర్లోనే అత్యుత్తమ మ్యాచ్ అని ఈ సందర్భంగా కమ్రాన్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 245 పరుగులకు ఆలౌట్ కాగా, కమ్రాన్ 113 పరుగులు చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 238 పరుగులకే ఆలౌట్ కాగా, పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఫలితంగా భారత్‌కు 607 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా 265 పరుగులకే చాపచుట్టేయడంతో పాకిస్తాన్ 341 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
కోచ్ గా మారనున్న పాక్ మాజీ బ్యాట్స్ మన్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు. ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్ సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్ ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.