పీసీబీ చైర్‌పర్సన్‌గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మిస్బా ఉల్ హక్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్‌లతో కూడిన క్రికెట్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసిన అష్రాష్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌కు మరోసారి పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ బాధ్యతలు అప్పజెప్పాలని అష్రాఫ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఇంజామామ్ పనిచేశాడు.
ఈ మెరకు త్వరలో జరగనున్న క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛీప్‌గా నజామ్ సేథీ ఉన్న సమయంలో ఆ జట్టు కోచ్‌లు మిక్కీ ఆర్థర్,బ్రాడ్‌బర్న్, డేటా ఎనలిస్ట్ హసన్ చీమాకు కూడా పాకిస్తాన్ సెలక్షన్ కమిటీలో భాగమయ్యారు. ఇప్పుడు వారిని సెలక్షన్ కమిటీలో కొనసాగించాలా లేదా అన్నది కూడా క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెలక్షన్ ప్యానల్‌లో హెడ్ కోచ్ ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో కూడా ఈ టెక్నికల్ కమిటీ చర్చించనుంది. ఆసియాకప్‌కు జట్టు ఎంపిక ముందు కొత్త సెలక్షన్ ప్యానల్‌ను ఖారారు చేసే అవకాశం ఉంది.
చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్! కెప్టెన్ దూరం
Comments
Please login to add a commentAdd a comment