
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ముంబై స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.22 సగటుతో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శనను చూడలేదంటూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ ధరక తగ్గ న్యాయం పంత్ చేయలేకపోతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ముంబై ఇండియన్స్ చేతిలో 54 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు.
Rishabh Pant, absolute garbage performance.
If you have any shame, return the 27 crore.#MIvsLSG #MIvLSG pic.twitter.com/JEeboJpQWJ— Chintan (@CricketChintan) April 27, 2025