
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్.. ఆ తర్వాత కూడా తనకు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పంత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రిషబ్.. 8 సగటుతో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ.27 కోట్ల దండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది సీజన్‌లో పంత్ చేసిన స్కోర్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: 0 (6)
సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 (15)
పంజాబ్ కింగ్స్: 2 (5)
ముంబై ఇండియన్స్: 2 (6)
కోల్‌కతా నైట్ రైడర్స్: బ్యాటింగ్ చేయలేదు
గుజరాత్ టైటాన్స్: 21 (18)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో పూరన్(61), మార్‌క్రమ్(28) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు