
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లోనూ పంత్ విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. 5 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీకంటే రూ. 30 లక్షల తీసుకున్న యువ ఆటగాళ్లు ఎంతో బెటర్ అని పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్.