
రిషబ్ పంత్ సోదరి పెళ్లిలో ధోనీ భార్య సందడి
తనదైన ఫ్యాషన్‌తో ఆకట్టుకున్న సాక్షి సింగ్ ధోనీ
ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి ధోని హాజరయ్యారు. సతీసమేతంగా ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ధోని సందడి చేశాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పెళ్లిలో ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన ఆకర్షణీయమైన శైలితో వార్తల్లో నిలిచింది.
సాక్షి ధోని ఫ్యాషన్, స్టైల్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో పెళ్లైన ఇన్నాళ్ల తరువాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన పెళ్లి రోజున ఆభరణాలను ఆభరణాలను తిరిగి ధరించింది.ఆ ఆభరణాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నట్టు వజ్రాలు, పచ్చలు పొదిగిన గోల్డ్ జ్యుయల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్ చోకర్ నెక్‌పీస్, లేయర్డ్ నెక్లెస్, ముక్కెర, జుమ్కాలతో తన లుక్‌కు మరింత స్టైల్ యాడ్ చేసింది. లెమన్ గ్రీన్ కలర్ పట్టుచీర, స్కాలోప్-నెక్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్, దీనికి జతగా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్ దుపట్టాతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాక్షి, దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

మరోవైపు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మధ్య ఆకర్షణీయ సంభాషణ కూడా వైరల్‌గామారింది. తమ రిలేషన్ షిప్ లో ధోనీనే లక్కీ అని సాక్షి సిగ్గుల మొగ్గలవుతూ చెప్పింది. ఇంతలో మధ్యలో కల్పించుకున్న పంత్, ఆడవాళ్లందరూ ఇలాగే అనుకుంటారని తుంటరి కమెంట్ చేయడంతో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తాయి.
సాక్షి ధోని పెళ్లి రోజు లుక్
15 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహానికి, భారీ నెక్లెస్, చూడామణి లాంటి ఆభరణాలు సహా బుటీ వర్క్, జర్దోసి ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది 2010 జూలై 10న డెహ్రాడూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Comments
Please login to add a commentAdd a comment