ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే.. | Tilhari Necklace Worn By Prajakta Koli At Her Wedding Reception | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..

Published Fri, Feb 28 2025 4:07 PM | Last Updated on Fri, Feb 28 2025 4:08 PM

Tilhari Necklace Worn By Prajakta Koli At Her Wedding Reception

ప్రముఖ యూట్యూబర్‌గా పేరుగాంచిన ప్రజక్తాకోలి తన చిరకాల ప్రియుడు వృషాంక్ ఖనాల్‌ని వివాహం చేసుకుంది. ఆమె మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన కామెడీతో ఫేమస్‌ అయ్యింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్‌మ్యాచ్డ్‌లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ప్రీ వెడ్డింగ్‌, వివాహ వేడుకల్లో మహారాష్ట్ర సంప్రదాయన్ని హైలెట్‌ చేసేలా ఆమె లుకింగ్‌ స్టైల్‌ ఉంది. అయితే ఆమె ధరించి ఆకుపచ్చ నెక్లెస్‌ తిల్హరి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అసలేంటి నెక్లెస్‌..? దాని విశిష్టత ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.

ప్రజక్తా తన వివాహ వేడుకలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆమె ధరించిన దుస్తులు, నగలు టాక్‌ ఆఫ్‌ ది టౌగా మారాయి. ప్రీ వెడ్డింగ్‌, వెడ్డింగ్‌ లుక్స్‌ కోసం మినిమలిస్టిక్‌గా ఉండే స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. సంప్రదాయం ఉంట్టిపడేలా ఆధునిక ఫ్యాషన్‌ తగ్గ దుస్తుల శైలిని ఎంచుకున్నారు. అయితే ఈ జంట రిసెప్షన్‌ కోసం నేపాలి సంప్రదాయాన్ని అనుసరించారు. 

వరుడు వృషాంక్ బ్రౌన్ బ్లేజర్ ధరించి, ఐవరీ కుర్తా సెట్‌తో అందంగా కనిపించాడు. నేపాలీ టచ్‌ కోసం సాంప్రదాయ ఢాకా టోపీని జోడించారు. ఇక ప్రజక్త సాంప్రదాయ నేపలీ క్రిమ్సన్ బంగారు పట్టు నేత చీరను ఎంపిక చేసుకుంది. దానికి తగిన విధంగా బంగారు ఆభరణాలను జత చేసింది. మెడలో ధరించి ఆకుపచ్చ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీన్ని తిల్హారీ నెక్లెస్‌ అని పిలుస్తారు.

తిల్హారీ నెక్లెస్ అంటే..?
తిల్హారీ నెక్లెస్ అనేది మంగళసూత్రం లాంటిది. ఇది నేపాల్‌లో మహిళల వైవాహిక స్థితికి సంకేతం. ఇది పోటే అని పిలిచే పూసలతో తయారు చేసిన దండవలె ఉండి, కింద తిల్హారీగా పిలిచే స్థూపకార లాకెట్టు ఉంటుంది. 

నెక్లెస్‌ రెండు భాగాలను విడిగా తీసుకువచ్చి ఆపై ఒకదానితో ఒకటి సమలేఖనం చేస్తారు. వధువులు తిల్హారీ ధరించడం అనేది పవిత్రమైనది, శుభప్రదమైనదిగా చెబుతుంటారు.

(చదవండి: 37 ఏళ్ల తర్వాత కుంభమేళాలో కలుసుకున్న స్నేహితులు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement