Necklace
-
ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..
ప్రముఖ యూట్యూబర్‌గా పేరుగాంచిన ప్రజక్తాకోలి తన చిరకాల ప్రియుడు వృషాంక్ ఖనాల్ని వివాహం చేసుకుంది. ఆమె మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన కామెడీతో ఫేమస్ అయ్యింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్మ్యాచ్డ్లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ప్రీ వెడ్డింగ్, వివాహ వేడుకల్లో మహారాష్ట్ర సంప్రదాయన్ని హైలెట్ చేసేలా ఆమె లుకింగ్ స్టైల్ ఉంది. అయితే ఆమె ధరించి ఆకుపచ్చ నెక్లెస్ తిల్హరి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అసలేంటి నెక్లెస్..? దాని విశిష్టత ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ప్రజక్తా తన వివాహ వేడుకలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆమె ధరించిన దుస్తులు, నగలు టాక్ ఆఫ్ ది టౌగా మారాయి. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ లుక్స్ కోసం మినిమలిస్టిక్‌గా ఉండే స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. సంప్రదాయం ఉంట్టిపడేలా ఆధునిక ఫ్యాషన్ తగ్గ దుస్తుల శైలిని ఎంచుకున్నారు. అయితే ఈ జంట రిసెప్షన్ కోసం నేపాలి సంప్రదాయాన్ని అనుసరించారు. వరుడు వృషాంక్ బ్రౌన్ బ్లేజర్ ధరించి, ఐవరీ కుర్తా సెట్‌తో అందంగా కనిపించాడు. నేపాలీ టచ్ కోసం సాంప్రదాయ ఢాకా టోపీని జోడించారు. ఇక ప్రజక్త సాంప్రదాయ నేపలీ క్రిమ్సన్ బంగారు పట్టు నేత చీరను ఎంపిక చేసుకుంది. దానికి తగిన విధంగా బంగారు ఆభరణాలను జత చేసింది. మెడలో ధరించి ఆకుపచ్చ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీన్ని తిల్హారీ నెక్లెస్ అని పిలుస్తారు.తిల్హారీ నెక్లెస్ అంటే..?తిల్హారీ నెక్లెస్ అనేది మంగళసూత్రం లాంటిది. ఇది నేపాల్‌లో మహిళల వైవాహిక స్థితికి సంకేతం. ఇది పోటే అని పిలిచే పూసలతో తయారు చేసిన దండవలె ఉండి, కింద తిల్హారీగా పిలిచే స్థూపకార లాకెట్టు ఉంటుంది. నెక్లెస్ రెండు భాగాలను విడిగా తీసుకువచ్చి ఆపై ఒకదానితో ఒకటి సమలేఖనం చేస్తారు. వధువులు తిల్హారీ ధరించడం అనేది పవిత్రమైనది, శుభప్రదమైనదిగా చెబుతుంటారు.(చదవండి: 37 ఏళ్ల తర్వాత కుంభమేళాలో కలుసుకున్న స్నేహితులు..!) -
Nita Ambani: కోడలికి గిఫ్ట్‌గా కోట్ల విలువైన 'ఖాందానీ హార్'! ప్రత్యేకత ఇదే
కోట్లకు పడగలెత్తితే..ఆ కుంటుంబాల్లో ఇచ్చే బహుమతులు, కానుకలు వార్తల్లో నిలుస్తాయి. డబ్బుంటే ఆ రేంజ్‌కి తగ్గ బహుమతులతో ప్రేమను కురిపిస్తారు. బడా వ్యక్తుల మధ్య ప్రేమ కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అలాంటి కోవలో మొదటి స్థానంలో నిలిచేది అంబానీల కుటుంబమే. ఇటీవల కాలంలో ఆ ఇంట జరిగిన విలాసవంతమైన వివాహ వేడుకలే అందుకు నిదర్శనం. గతేడాది చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి వేడుక ఎంత విలాసవంతంగా జరిగిందో తెలిసిందే. అదీగాక చిన్న కోడలు రాధికా మర్చంట్‌కి అంబానీ కుటుంబం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు కూడా హైలెట్‌గానే నిలిచాయి. తాజాగా నీతా అంబానీ తన అందమైన కోడలు రాధికాకు మరో అద్భుతమైన నెక్లెస్‌ని కానుకగా ఇచ్చింది. అది వారి కుటుంబ వారసత్వానికి సంబంధించిన నగ అట. మరీ ఆ నెక్లెస్ విశేషాలెంటో చూద్దామా..!అంబానీలు కుటుంబ సంప్రదాయాలకు గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో భాగంగానే తమ వారసత్వాన్ని సూచించే విలువైన వస్తువులను వారి కోడళ్లకు బహుమతులుగా ఇస్తుంటారు. అలానే చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్(Radhika Merchant)కి పచ్చలు, వజ్రాలతో పొదిగిన 'ఖందానీ హార్(khandani haar)'ని బహుమతిగా ఇచ్చారట నీతా అంబానీ(Nita Ambani ). దీని ఖరీదు రూ. 1.8 కోట్లు పైనే ఉంటుందట. ఈ నెక్లెస్ అంబానీల కుటుంబ వారసత్వం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విలువైన నగ అట. నీతా ఇంతకు మునుపు కూడా ఇలానే ముత్యాలు, వజ్రాలు పొదిగిన ఖరీదైన చోకర్‌ని బహుమతిగా ఇచ్చారు. నిజానికి కుటుంబ బంధంతో ముడిపడి ఉన్న నగలు విలువ వెలకట్టలేం. కాగా, నీతా ఇలా తన పెద్ద కోడలు శ్లోకా మెహతాకు కూడా అత్యంత ఖరీదైన మౌవాద్ ఎల్'ఇన్‌కంపారబుల్ నెక్‌పీస్ నగని బహుమతిగా ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలతో డిజైన్ చేసిన నగ ఇది. ఇలాంటి విలాసవంతమైన బహుమతులతో అంబానీ కుటుంబ సంప్రదాయాలు, వైభవం ఒకదానికొకటి గట్టిగా ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.(చదవండి: ఎవరీ విశ్వనాథ్ కార్తికే..? జస్ట్ 16 ఏళ్లకే అరుదైన ఘనత సాధించాడు!) -
నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ చిత్రసీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక వెనుదిరిగి చూడకుండా బాలీవుడ్, హాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉండే నటిగా పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు గ్లోబల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ముంబైలో తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలలో తళుక్కుమంది. ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, ఆభరణాలు హైలెట్‌గా నిలిచాయి. డిజైనర్ మనీష్ మల్హోత్రా 9 గజాల బెర్రీ-హ్యూడ్ షిఫాన్ చీరను ధరించింది. ఆ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా బల్గారీ బ్రాండ్‌కి చెందిన అద్భుతమైన ఆభరణాలతో మెరిశారు. ఐకానిక్ రోమన్ జువెలరీ మైసన్కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక, లగ్జరీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్‌కి చెందిన ఆభరణాలను ధరించింది. సర్పెంటైన్ కలెక్షన్ నుంచి డైమండ్ బ్రాస్ లెట్, వింటేజ్ ముత్యాల నెక్లెస్ ను ఎంచుకుంది. సర్పెంటీ వైపర్ బ్రేస్ లెట్‌గా పిలిచే ఈ బ్రేస్లెట్ మొత్తం డైమండ్స్‌తో కూడిన 18 క్యారట్ వైట్ గోల్డ్ సెట్లో వన్ కాయిల్ డిజైన్‌ను కలిగి ఉంది. అధికారిక బల్గారి వెబ్సైట్ ప్రకారం దీని విలువ అక్షరాలా 30,79,000/- పలుకుతుందట. అలాగే ముత్యాల నెక్లేస్ ధర అంతకు మించి అన్న రేంజ్లో ఉంది. హై జ్యువెలరీ పెర్ల్, రూబీస్, వైట్ గోల్డ్ ,డైమండ్స్‌లో కూడిన ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 8 కోట్లు పలుకుతుందట. ఆమె ఇలా లగ్జరీ ఆభరణాలు ధరించడం మొదటిసారి కాదు. ఇంతకుమునుపు బల్గారీ బ్రాండ్ 140వ వార్షికోత్సవంలో అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించి వార్తల్లో నిలిచింది. ఆ వేడుకలో ప్రియాంక సర్పెంట్ ఏటర్నా నెక్లస్‌ని ధరించింది. ఈ నెక్లస్‌ని రూపొందించడానికి ఏకంగా 2,800 గంటలు పట్టిందట. అంతేగా 140 ఏళ్ల వార్షికోత్సవానికి ప్రతీకగా 140 క్యారెట్లతో కూడి అత్యంత బరువున్న వజ్రం, ప్లాటినమ్, పియర్ ఆకారంలోని డైమండ్లతో తీడైమన్షనల్ వేవ్ స్ట్రక్చర్‌లో తీర్చిదిద్దారు కళాకారులు. (చదవండి: 102 ఏళ్ల బామ్మ సాహసం..ఏకంగా ఏడువేల అడుగుల ఎత్తు నుంచి..) -
స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!
స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్ ఏంటిరా బాబు..! అనుకోకండి. ఎందుకంటే సాధారణ నెక్లెస్‌లా ధరించగానే మెడకు సెట్ అయ్యిందా లేదా చూసుకుంటాం. కానీ ఇది అలా అంత అందంగా ఉండదు గానీ అంతరంగిక స్నేహితుడిలా వెన్నంటే ఉంటూ ఓ అందమైన ఫీల్‌ని ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మెడకు ధరించే ఓ చక్కటి స్నేహితుడిలాంటి నెక్లస్. ఇది మనకు రియల్ మావన కనెక్ట్‌విటీని భర్తీ చేయలేకపోయినా..మనం ఒంటిరిగా లేం అనే అనుభూతిని ఇస్తుంది. ఇది మెడ చుట్టూ ధరించగలిగే ఏఐ ఆధారిత లాకెట్టు పరికరం. సాంకేతికతతో పరిచయమవుతున్న ఫ్రెండ్ నెక్లెస్. పరిమాణం పరంగా కంఫర్ట్‌గా ఉంటుంది. పైగా ఇది మీ రహస్యలను ఎట్టిపరిస్థితుల్లో బయటపెట్టని ఓ మంచి స్నేహితుడు. దీన్ని స్నేహితుడి సాంగత్యాన్ని పొందే లక్ష్యంతో రూపొందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి తన ఇష్టమైన వ్యక్తితో కూర్చొని తన ఏఐ లాకెట్టుతో సంభాషించేందుకు వెనుకాడుతున్నట్లు కనిపిస్తుంది. మరో అమ్మాయి తాను ధరించిన లాకెట్టుతో తన చుట్టు ఉన్న పర్యావరణ అందాన్ని షేర్ చేసుకుంటుంది. అందుకు రిప్లైగా తన ఫోన్‌కి అనుసంధానించిన దాంట్లో తన భావాలను వ్యక్తపరిచేలా మెసేజ్‌లు ఇస్తుంటుంది. ఇది ఫ్రెండ్ మాదిరి ధరించగలిగే లాకెట్టులా కనిపించే ఏఐ చాట్‌బాట్. వాస్తవానికి నిజమైన స్నేహం పూడ్చలేనిదే అయినా..మీకు కావాల్సినప్పుడూ సరదాగా ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే ఫ్రెండ్ లాకెట్టు ఇది. ధీని ధర ఏకంగా రూ. 8 వేలు వరకు పలుకుతోంది. (చదవండి: 'ది స్కై క్వీన్': 34 ఏళ్లకే ఏకంగా 10 ప్రైవేట్ జెట్లు..!) -
దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్‌తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటి. బిలియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది. దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్సెట్తో ఉంది. మధ్యలో ఓవల్ షేప్‌లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.ఆ నగ బాజుబ్యాండ్ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్ సింగ్‌కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్ తోషఖానా) కోహ్ ఇ నూర్ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్‌కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్‌పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్ వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ముత్యాల హారాలతో గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి (ఫోటోలు)
-
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ వివిధ రకాల డిజైనర్ దుస్తులతో అబిమానులను అలరిస్తుంది. అంతకుమునుపు ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ధరించిన చీర కూడా హైలెట్‌గా నిలిచింది. ఆ చీరపై ఏకంగా మొత్తం క్రికెట్ స్టేడియంనే చక్కగాత్రీకరించారు. అదికూడా 1983 ప్రపంచకప్‌లో జరిగిన ఘట్టాన్ని చక్కగా చేతితో ఆవిష్కరించారు. అది మరువక మునుపే క్రికెట్ నెక్లెస్‌తో మనముందుకు వచ్చింది జాన్వీ.డిజైనర్ అర్పితా మెహతా పూలా లెహంగా ధరించి మరీ చెన్నైలో మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌కు వచ్చింది. క్రికెట్‌తో తీసిన మూవీకి ఆమె ధరించిన పూల లెహంగాకి సంబంధం ఎలా అని ఆశ్యర్యంగా ఉన్నా.. ఆమె ధరించిన నెక్లెస్ అందుకు చక్కటి సమాధానం ఇచ్చేలా నిలిచింది. ఆమె ధరించిన నెక్లెస్‌లో బ్యాట్, బాల్, వికెట్‌తో కూడిన లాకెట్‌ని చాల చక్కగా తీర్చిదిద్దారు. ఇది ఆమెకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని ఇచ్చింది. ఏదీఏమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచేలా జాన్వీ ఆహార్యం డ్రెస్సింగ్ స్టయిల్ హైలెట్‌గా ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Arpita Mehta Official (@arpitamehtaofficial) అంతేగాదు జాన్వీ ధరించే ప్రతి డిజైనర్ డ్రెస్, చీరలు ఫేమస్ అయ్యి మూవీ ప్రమోషన్స్ రేంజ్‌ని పెంచాయి. పైగా ఈ ప్రమోషన్స్ ముగిసేలోగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుందేమో అన్నట్లు ఉంది ఆమె లుక్. చీర దగ్గర నుంచి లెహంగా వరకు ప్రతీది ఆమె మూవీకి తగ్గట్టు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మూవీ సారాంశాన్ని పరోక్షంగా తెలియజేసేలా నెక్లెస్ నుంచి చెవిపోగుల వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశారు. ఆ క్రికెట్ నెక్లెస్, ఆ అద్భుతమైన లెహంగాలో కొత్త జాన్వీని చూస్తున్నామనేలా మిస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!) -
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
-
కేన్స్ ఫెస్టివల్లో హైలెట్‌గా 'కృష్ణ గువా నవరత్న హారం'!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు. గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.పోల్కీ వజ్రాల చరిత్ర..ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్లు, అద్భుతమైన నెక్లస్లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు. View this post on Instagram A post shared by Nidarshana Gowani (@nidarshana_gowani) (చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..) -
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్‌తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్‌పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్‌లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పింక్ కలర్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) అయితే ఈ ట్రోల్స్‌పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్ అంత ధర ఉంటుందా? జోక్ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్‌లోనూ కనిపించింది. -
నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం...
నెక్లెస్‌కు, ఆరోగ్యానికి సంబంధమేంటి? ఇదేదో బోడితలకు మోకాలికి ముడిపెట్టే వ్యవహారంలా ఉందనుకుంటు న్నారా? మీరు తప్పులో కాలేశారన్న మాటే! ఇక్కడ చెప్పుకుంటున్నది సాదాసీదా నెక్లెస్‌ల గురించి కాదు. అలాగని కళ్లు మిరుమిట్లుగొలిపించే రవ్వల నెక్లెస్ కూడా కాదు. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఇది స్మార్ట్ నెక్లెస్. దీన్ని మెడలో వేసుకుంటే చాలు, అనుక్షణం మీ ఆరోగ్యాన్ని కనిపెడుతూనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ నెక్లెస్ వేసుకునేటప్పుడు, మెడవెనుక భాగంలో ఒక సెన్సర్ అమర్చి ఉంటుంది. ఈ సెన్సర్ చెమట ద్వారా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉంటుంది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ నెక్లెస్‌ను రూపొందించారు. ఇప్పటికే దీనిని మనుషులపై ప్రయోగించి, అన్ని రకాల పరీక్షలూ చేశారు. సెన్సర్ అమర్చిన ఈ నెక్లెస్ చెమటలోని సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్ల పరిమాణాన్ని 98.9 శాతం కచ్చితంగా గుర్తించగలుగుతోంది. అలాగే చెమటలో గ్లూకోజ్ స్థాయిలో వచ్చే మార్పులను ఇది ఇట్టే గుర్తించగలుగుతోందని ఒహాయో వర్సిటీ పరిశోధన బృందానికి చెందిన ప్రొఫెసర్ జింఘువా లీ తెలిపారు. డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని, దీని ద్వారా ఒంట్లోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని వివరించారు. -
హాట్ సమ్మర్...కూల్ లుక్స్
గేదర్డ్ ఫెర్న్ కుర్తా... పూల డిజైన్లు ప్రతి వేసవి రూపాన్ని శాసించే ఎవర్ గ్రీన్ ట్రెండ్. అదే పాత పూల ప్రింట్లతో విసిగిపోయి ఉంటే, కలెక్షన్‌కు మసాలా యాడ్ చేయడానికి ఈ ఫెర్న్ ప్రింట్ కుర్తాని ప్రయత్నించవచ్చు. ఈ వేసవి సీజన్లో ’గేదర్డ్ ఫెర్న్ కుర్తా’ను బ్లూస్/ గ్రీన్స్‌లో తగిన అలంకరణతో ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. మరింత స్టైలిష్‌గా కనిపించడం కోసం ఈ కాటన్ ఫెర్న్ కుర్తాను ఆఫ్ఘని ప్యాంటుతో కలపవచ్చు. కాటన్స్ జైపూర్ డాట్‌కామ్ ధర: రూ.2,199 కూల్ గాగుల్స్... ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉండాలి. అటు కళ్లకు చల్లదనంతో పాటు జెయిన్ ఎక్స్ అర్నెట్టె అందించే గుల్వింగ్ హాటెస్ట్ లుక్‌ని ఎలివేట్ చేస్తుంది. బ్లీచ్డ్ టై–డై కలర్ ఎఫెక్ట్స్, ఫ్లాట్ మిర్రర్స్ కలయిక మరింత అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ ధర: రూ.8,079 టెన్నిస్ నెక్లెస్.. యాక్సెసరీస్ మన రూపాన్ని మెరుగుపరుస్తాయి, అయితే వేసవిలో ఎలా పడితే అలా స్టైల్‌ని యాక్సెసరైజ్ చేయడం కష్టం. ఈ అందమైన స్టీల్ కోటింగ్ కలిగిన ఎ–టెన్నిస్ నెక్లెస్ సీజనల్ యాక్సెసరీస్ ఎంపికగా చక్కగా నప్పుతుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ అజియో & టాటా క్లిక్ ధర: రూ. 8,079 గ్రీన్ ఫ్లోరల్ ఫ్లోవీ డ్రెస్.. స్నేహితులతో కలిసి డే అవుట్‌కి వెళ్లినా లేదా వర్క్ ప్లేస్‌కి లీజర్‌గా వెళ్లినా... ఈ ఫ్లూ డ్రెస్ వేడి వాతావరణంలో చల్లగా ఉంచుతుంది. ఈ బొటానికల్ డ్రెస్‌ని వేసవిలో కుర్తాగా దుస్తులుగా ధరించవచ్చు. బాడీస్‌పై అందమైన చతురస్రాకార బట¯Œ లతో ఉన్న ఈ దుస్తులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అమెజాన్, టాటా క్లిక్ అండ్ అజియో ధర: రూ 6190 -
కాన్స్‌లో దీపిక ధరించిన ఈ నెక్లెస్ ధరెంతో తెలుసా?
Cannes Filim Festival 2022: 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే సినీ సెలబ్రెటీలకు అతిపెద్ద పండుగ. ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన తారంతా రెడ్ కార్పెట్ హోయలు పోతారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందిరిని ఆకట్టుకుంటారు. ఇందుకోసం స్పెషల్ డిజైన్ చేసిన దస్తులు, ఆకర్షణీయమైన ఆభరణాలతో తళుక్కున మెరుస్తారు సీని తారలు. చదవండి: యూరప్‌లో పర్సు పోయింది, పైసా లేదు.. ఎవరూ సాయం చేయలేదు ఇదిలా ఉంటే ఈ ఏడాది కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మన భారత్‌కు గౌరవ సభ్య దేశంగా హోదా దక్కడంతో కేంద్ర మంద్రి అనురాగ్ ఠాగూర్ నేతృత్వంలో మన భారత సెలబ్రెటీల టీం హాజరైంది. అయితే ఈసారి ఈ అవార్డుల వేడుకలో దీపికా పదుకొనె జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సందర్భంగా దీపకా ధరించిన దుస్తులు, ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ క్రమంలో దీపికా ధరించిన ఓ నెక్లెస్, దాని ధర ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కంటెను తలపించేలా ఉన్న ఈ నెక్లెస్‌పై అందరి దృష్టి పడటంతో దాని ఖరీదేంటుందని ఆరా తీయం ప్రారంభించారు నెటిజన్లు. దీంతో దాని ధర తెలిసి నెటిజన్లను షాక్ అవుతున్నారు. చదవండి: కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. పూజా హెగ్డేకు చేదు అనుభవం కాగా నలుపు రంగు సూట్ మీద దీపికా ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్సించింది. తాతమ్మల కాలంనాటి కంటెను తలపించేలా ఉన్న ఈ నగకు ముందు భాగంలో పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ పులుల కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగి ఉంది. అయితే ఈ నెక్లెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ తయారు చేసిందట. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్ ధర సుమారుగా 3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక దీని ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కాగా ఈసారి భారత్ నుంచి ఐశ్వర్యారాయ్, ఆర్ మాధవన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, ఎఆర్ రెహమాన్, పూజా హెగ్డే, నయనతార, తమన్నా, దీపికా పదుకొనె తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. -
ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తి పని బట్టబయలు
పాకిస్తాన్ తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. అవినీతి ఆరోపణల ఉచ్చు బిగియడం మొదలైంది. పదవి దిగిపోయి వారం గడవక ముందే ఖరీదైన ఓ ఆభరణం విషయంలో చిక్కుల్లో పడ్డాడు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రధాని హయాంలో బహుమతిగా అందుకున్న ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్ట్ రిపోజిటరీలో డిపాజిట్ చేయకుండా.. డబ్బు కక్కుర్తితో ఓ నగల వ్యాపారికి విక్రయించారనే ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ఉన్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. తోషా ఖానా(స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి కాకుండా.. స్పెషల్ అసిస్టెంట్ జుల్ఫికర్ భుఖారికి ఇచ్చారని, అక్కడి నుంచి ఆ ఆభరణం లాహోర్‌లో ఓ వ్యాపారి వద్ద 18 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం మేరకే ఖాన్ ఆ పని చేసి ఉంటాడని సదరు కథనం ఉటంకించింది. ఈ మేరకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA).. ఈ ఆరోపణలకు గానూ ఇమ్రాన్ ఖాన్‌ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజా బహుమతులపై సగం ధర చెల్లించి వ్యక్తిగత గదిలో ఉంచుకోవచ్చు. కానీ, ఖాన్ మాత్రం వచ్చిన సొమ్మును విరుద్ధంగా జమ చేశాడు, ఇది చట్టవిరుద్ధమని సదరు ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది. -
కత్తికి పదునే కాదు.. ధర కూడా ఎక్కువే
మన భారతదేశంలో వజ్ర వైడుర్యాలకు కొదువే లేదు. భారత్‌ను పాలించిన మహారాజులు వాడిన అపురూప ఆభరణాలు ఎన్నో ఎన్నెన్నో... మరి అలాంటి ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు వేలం వేయగా వచ్చిన డబ్బెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అమూల్యమైన ఈ సంపదను దక్కించుకున్న ఆ సంస్థ ఏంటి? నిజాం నవాబు వాడిన కత్తి ఎంత ధరకు అమ్ముడుపోయింది? ఎన్ని దేశాలు ఈ వేలంలో పాల్లొన్నాయి.... ఆ విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి. -
డోరీ నెక్లెస్
నూలు దారాన్ని వరుసలుగా పేర్చి, ఒడుపుగా అల్లి, దానికి ఆభరణాన్ని జత చేర్చితే డోరీ నెక్లెస్ అవుతుంది. దీనినే థ్రెడ్ నెక్లెస్ అనీ అంటారు. ఈ నెక్లెస్ తయారీకి ఇమిటేషన్ జువెల్రీనే కాదు, రత్నాలు పొదిగిన బంగారు పెండెంట్స్, బీడ్స్ వాడి అందంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. తయారీకి కావల్సినవి: 1. నచ్చిన లేదా నలుపు రంగు నూలు/సిల్క్ దారం 2. గ్లూ 3. కత్తెర 4. ప్లకర్, కటర్ 5. హుక్ చెయిన్ లేదా గోల్డ్ కలర్ దారం తయారీ: 1. దారాన్ని మెడకు సరిపోయేలా తగిన ంత పొడవులో కొన్ని వరసలు తీసుకోవాలి. వాటన్నింటిని మూడు సమభాగాలుగా తీసుకోవాలి. 2. ఒకవైపు మూడి వేయడం లేదా ప్లాస్టర్‌తో అతికించాలి. 3. మూడు భాగాలను జడ మాదిరి అల్లాలి. పూర్తి అల్లిక గట్టిగా ఉండాలి. పూర్తిగా అల్లిన తర్వాత చివరలను ముడివేయాలి. 4. నచ్చిన పెండెంట్ లేదా పూసలను తీసుకొని అల్లిన నూలు దారానికి కటర్ సాయంతో జత చేయాలి. లేదంటే దారాన్ని అల్లుతున్నప్పుడే పెండెంట్స్‌ని సెట్ చేసుకోవచ్చు. అన్నింటిని సెట్ చేసిన తర్వాత చివరలను కలుపుకుంటూ గోల్డ్ కలర్ దారంతో చుట్టాలి. ఈ రెండు దారాలు ఊడిపోకుండా గట్టిగా చుట్టి, రెండువైపులను కలుపుతూ ఒక పేద్ద పూసను గుచ్చాలి. ఈ పూస చేత్తో కదిలిస్తే వెనక్కీ ముందుకూ కదిలేలా ఉండాలి. చివరన దారంతో చేసిన టస్సెల్(దారాలతో చేసిన కుచ్చు)ను జత చేస్తే అలంకరణకు డోరీ నెక్లెస్ రెడీ. -
హోటల్లో రూ.10 లక్షల విలువైన నెక్లెస్ మాయం
హైదరాబాద్ : బెంగళూరుకు చెందిన ఓ మహిళ బంగారు నెక్లెస్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కెన్స్ హోటల్లో చోరీకి గురైంది. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ నెక్లెస్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు మల్లేశ్వరం 8 మెయిన్‌రోడ్డు రూలా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కె.జయప్రకాశ్ తన కుటుంబంతో కలసి తెలిసిన వారి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చారు. హోటల్ రూమ్ నంబర్ 204లో ఈ నెల 3న మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో దిగారు. రాత్రి 7.30కి పెళ్లికి వెళ్లేందుకు ముస్తాబవుతుండగా కప్‌బోర్డులో ఉండాల్సిన నెక్లెస్ కనిపించలేదు. వెంటనే హోటల్ నిర్వాహకుల ను అప్రమత్తం చేశారు. రాత్రి 11.30 గంటల వరకు వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ క్రైం సీఐ సిబ్బందితో కలసి వచ్చి రికార్డులు పరిశీలించారు. సీసీ ఫుటేజీలు తెప్పించారు. బంజారాహిల్స్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు సేకరించి ఆధారాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ ..
దొరికిన నగల బ్యాగు అప్పగింత పరకాల: దారిలో తనకు దొరికిన బ్యాగును ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన కొంగొండ సాంబరాజు, అనూష దంపతులు రూ.80 వేల విలువైన నెక్లెస్‌ను బ్యాగులో పెట్టుకొని బైక్‌కు తగిలించారు. మార్గమధ్యలో బ్యాగ్ వాహనం నుంచి కిందపడిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగు కనిపించ డం లేదని చూసుకొని లబోదిబోమంటూ పరకాల పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే కనిపర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తనకు బ్యాగు దొరికిందని ఇందులో విలువైన బంగారు గొలుసు ఉందంటూ పరకాలకు పోలీసులకు అందజేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సీఐ జాన్ నర్సింహులు నెక్లెస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకొని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీతాకోక పూలు
ఇంటికి - ఒంటికి ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున... లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి. మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి! -
మళ్లీ రెచ్చిపోయారు
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. కొద్ది రోజుల కిందట చోటుచేసుకున్న వరుస దురాగతాల మాదిరే శుక్రవారం రాత్రి కూడా ఐదు చోట్ల గొలుసులు చోరీ చేశారు. ఎంజీబీఎస్, మాదాపూర్, పురానాపూల్, బన్సీలాల్ పేట, నారాయణ గూడాల్లో ఐదుగురు మహిళల మెడల్లోని బంగారు గొలుసుల్ని ఎత్తుకెళ్లారు. కాగా, ఇన్నాళ్లూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే చైన్ స్నాచింగ్ లు ఇప్పుడు ఎంజీబీఎస్ వంటి అత్యంత రద్దీ ప్రదేశాల్లోనూ చోటుచేసుకుంటూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు ఇంకాస్త సమర్థవంతంగా వ్యవహరించి సిటీలోని చైన్ స్నాచర్ల భరతం పట్టాలని జనం కోరుతున్నారు. -
మోదీకి నక్లెస్..సుష్మాకు టై
-
వెంట్రుకల నెక్లెస్
హెయిర్ ఆర్ట్ తలపైన నల్లగా నిగనిగలాడుతూ ఒత్తై జుట్టు ఉంటే మనిషికి అందం. అదే వెంట్రుకలు రాలిపోతుంటే విపరీతమైన బాధ. కానీ, ఊడిన వెంట్రుకలు మెడలో హారాలుగా మారితే..!! ఈ ఆలోచనతోనే వెంట్రుకలతో నెక్లెస్‌లను రూపొందించడం మొదలుపెట్టారు లండన్‌కు చెందిన పాతికేళ్ల కెర్రీ హౌలేస్. లోహపు ఆభరణాల అంతటా ఉన్నవే, వాటిలో ప్రత్యేకత ఏముంది? కొత్త ఆలోచనతో క్రొంగొత్త ఆభరణాలను ధరిస్తేనే మన ప్రత్యేకత నలుగురికీ తెలిసేది అంటున్నారు ఈ విభిన్నమైన డిజైనర్. అయితే, వెంట్రుకలతో ఒక నెక్లెస్ తయారుచేయడానికి 60 గంటలకు పైనే సమయం పట్టిందట. మొదట తన తల్లి శిరోజాలనూ, ఆమె స్నేహితుల వెంట్రుకలనూ ఇందుకోసం సేకరించి, పగలూ రాత్రి తేడా లేకుండా వెంట్రుకల హారాలను కెర్రీ తయారుచేసిందంట. వెంట్రుకల హారాలు నలుగురికి పరిచయడం కోసం ఎన్నో ఎగ్జిబిషన్లనూ నిర్వహించింది. ఎన్నో అవార్డులూ సొంతం చేసుకుంది. -
మగాళ్లు కూడా కొంటున్నారు!
సర్వే పూర్వం రాజులు కంఠాభరణాలు, హారాలు, కంకణాలు మొదలైనవాటిని ధరించేవారు. రాణిగారితో పోటీ పడినట్లు ఉండేది రాజుల వస్త్రాభరణాల అలంకరణ. అయితే, సామాన్య జనాలకు వచ్చేటప్పటికి స్త్రీలు మాత్రమే ఆభరణాలు ధరించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మగాళ్లూ ఆభరణాల మీద మోజుపడుతున్నారు. తాజాగా నేషనల్ ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో... పురుషులకు సంబంధించిన ఆభరణాలు, అలంకరణ సామగ్రికి గిరాకీ పెరిగినట్లు తేలింది. అన్ని వయసుల పురుషులూ ఖరీదైన ఆభరణాలను కొంటున్నారట. గుజరాత్ పురుషులు మాత్రం కాయిన్లు, బిస్కట్ల రూపంలో విలువైన బంగారు, ప్లాటినం, వెండి కొంటున్నారు తప్ప ఆభరణాలను కొనడం లేదు. అయితే... ముంబై, అహ్మదాబాద్, బరోడా, పుణె, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, కొచ్చిన్ తదితర ప్రాంతాల్లోని పురుషులు ఆభరణాలు బాగా కొంటున్నారు, ధరిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. బంగారం, వెండి, ప్లాటినం ధరల్లో ఈ పదేళ్లలో వచ్చిన పెరుగుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.