
నూలు దారాన్ని వరుసలుగా పేర్చి, ఒడుపుగా అల్లి, దానికి ఆభరణాన్ని జత చేర్చితే డోరీ నెక్లెస్ అవుతుంది. దీనినే థ్రెడ్ నెక్లెస్ అనీ అంటారు. ఈ నెక్లెస్ తయారీకి ఇమిటేషన్ జువెల్రీనే కాదు, రత్నాలు పొదిగిన బంగారు పెండెంట్స్, బీడ్స్ వాడి అందంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు.
తయారీకి కావల్సినవి:
1. నచ్చిన లేదా నలుపు రంగు నూలు/సిల్క్ దారం
2. గ్లూ
3. కత్తెర
4. ప్లకర్, కటర్
5. హుక్ చెయిన్ లేదా గోల్డ్ కలర్ దారం
తయారీ:
1. దారాన్ని మెడకు సరిపోయేలా తగిన ంత పొడవులో కొన్ని వరసలు తీసుకోవాలి. వాటన్నింటిని మూడు సమభాగాలుగా తీసుకోవాలి.
2. ఒకవైపు మూడి వేయడం లేదా ప్లాస్టర్‌తో అతికించాలి.
3. మూడు భాగాలను జడ మాదిరి అల్లాలి. పూర్తి అల్లిక గట్టిగా ఉండాలి. పూర్తిగా అల్లిన తర్వాత చివరలను ముడివేయాలి.
4. నచ్చిన పెండెంట్ లేదా పూసలను తీసుకొని అల్లిన నూలు దారానికి కటర్ సాయంతో జత చేయాలి. లేదంటే దారాన్ని అల్లుతున్నప్పుడే పెండెంట్స్‌ని సెట్ చేసుకోవచ్చు.
అన్నింటిని సెట్ చేసిన తర్వాత చివరలను కలుపుకుంటూ గోల్డ్ కలర్ దారంతో చుట్టాలి. ఈ రెండు దారాలు ఊడిపోకుండా గట్టిగా చుట్టి, రెండువైపులను కలుపుతూ ఒక పేద్ద పూసను గుచ్చాలి. ఈ పూస చేత్తో కదిలిస్తే వెనక్కీ ముందుకూ కదిలేలా ఉండాలి. చివరన దారంతో చేసిన టస్సెల్(దారాలతో చేసిన కుచ్చు)ను జత చేస్తే అలంకరణకు డోరీ నెక్లెస్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment