ఇటీవల యువత కంటెంట్ క్రియేటర్లుగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సత్తా చాటుతున్నారు. తమ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. చిన్నగా బ్లాగర్‌గా మొదలుపెట్టి ఊహించని స్థాయిలో కోట్లు ఆర్జిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కోమల్ పాండే.
ఫ్యాషన్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. దేన్నయినా కామెడీ టచ్‌తో క్యాచీగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఢిల్లీలో పుట్టిపెరిగిన కోమల్ పాండే బీకామ్ గ్రాడ్యుయేట్. ఆమె ఫ్యాషన్ సెన్స్ చూసి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో 2012లో ది కాలేజ్ ఆప్ కౌచర్’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌కి సంబంధించిన అన్ని విషయాలూ డిస్కస్ చేసే ఆమె బ్లాగ్ షార్ట్ టైమ్‌లోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత ఆమె యూట్యూబ్ చానల్‌నూ మొదలుపెట్టింది. పదిలక్షల సబ్‌స్క్రైబర్స్‌కి రీచై, యూట్యూబ్ గోల్డ్ బటన్‌ను అందుకుంది. దేశంలోనే టాప్ 7 డిజిటల్ స్టార్స్ లిస్ట్‌లో చేరి, ఫోర్బ్స్ మేగజీన్ కవర్ మీద మెరిసింది. దాదాపు 40 కోట్ల నెట్ వర్త్‌తో రిచెస్ట్ యూట్యూబర్స్‌లో ఒకరిగా ఉంది.
(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment