
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు తండ్రికి తగ్గ తనయ అనేలా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన అందం అభినయంతో వేలాది అభిమానుల మనుసులను గెలుచుకుంది. అంతేగాదు తన విలక్షణమైన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ఎప్పటికప్పుడూ తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్‌చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తాజాగా సరికొత్త రాయల్టీ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. ఈ స్టైలిష్ లుక్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెబుతోంది.
ఏస్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ గోల్డ్ జ్యువెలరీ గౌనుని రూపొందించారు.రకరకాల వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో పొదిగిన గౌను అది. ఎంత అద్భుతంగా ఉందంటే..ఆ డిజైనర్‌వేర్‌లో సారా దేవతలా ధగధగ మెరిసిపోతోంది. మల్టీకలర్ రాళ్లు, పూసలుతో.. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌను ఇది. ఈ గౌనుని సాంప్రదాయ మేళవింపుతో కూడిని ఆధునిక డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దారు డిజైనర్లు.
ఆ ఆభరణాల గౌనులో సారా లుక్ నాటి రాజుల దర్పాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంది. అందుకు తగ్గట్లు జుట్టుని చక్కగా హెయిర్ బన్ మాదిరిగా వేసిన తీరు, సింపుల్ మేకప్ లుక్ సారా అందాన్ని రెట్టింపు చేశాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరీ..!.
(చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!)
Comments
Please login to add a commentAdd a comment