Sara Ali Khan
-
ఫ్రెండ్ పెళ్లిలో సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు 'సారా అలీఖాన్' (ఫోటోలు)
-
మాజీ ప్రియురాలితో సినిమా.. ప్రశంసలు కురిపించిన హీరో
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో కేదార్నాథ్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది ఏ వతన్ మేరే వతన్ మూవీతో మెప్పించిన సారా.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ముంబయిలో జరిగిన ఈవెంట్లో స్కై ఫోర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీలో సారా మాజీ ప్రియుడు వీర్ పహరియా కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన వీర్ పహారియా.. మాజీ ప్రియురాలు సారా అలీఖాన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షూటింగ్లో తనకు మద్దతు అందించినందుకు సారాకు కృతజ్ఞతలు తెలిపాడు.వీర్ పహారియా మాట్లాడుతూ.. "ఆమె చాలా మంచి వ్యక్తి. సారాకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. తనకు ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. అందువల్లే నాకు చాలా సహాయం చేసింది. ఈ విషయంలో సారాకు రుణపడి ఉన్నా. తన మొదటి సినిమాలో మద్దతుగా నిలిచినందుకు సారాకు ధన్యవాదాలు" అని అన్నారు.కాగా.. 2018లో కేదార్నాథ్ మూవీ ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు వీర్ పహారియాతో డేటింగ్ చేసింది. గతేడాది కాఫీ విత్ కరణ్ సీజన్- 7 లో పాల్గొన్న సారా ఈ విషయం బయటకొచ్చింది. ఈ షోలో జాన్వీ కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సమయంలోనే వీర్‌తో సారా డేటింగ్ చేస్తున్నారని హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను ఆటపట్టించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఎలాంటి రిలేషన్లో లేరు. వీర్ పహారియా, సారా అలీ ఖాన్ స్కై ఫోర్స్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24, 2025న విడుదల కానుంది.పొలిటీషియన్ కుమారుడితో డేటింగ్ రూమర్స్..మరోవైపు సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై గతంలో మరోసారి డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.కేదార్నాథ్ పర్యటన వల్లే..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. -
సారా టెండుల్కర్‌కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
బుంగమూతితో క్యూట్‌గా ఉప్పెన భామ.. నా సామిరంగ హీరోయిన్ నాటీ లుక్స్!
నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..సెల్ఫీలవ్ అంటోన్న సారా అలీఖాన్..నవంబర్ మెమొరీస్ షేర్ చేసిన శ్రద్ధాదాస్..బంగారం లాంటి శారీలో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..బుంగమూతితో మరింత క్యూట్‌గా ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్
ఫిట్నెస్, ట్రావెలింగ్ పట్ల అమితాసక్తి చూపించే ప్రముఖ నటి.. 'సారా అలీ ఖాన్' మొదటి సారి గోవాలోని ఎయిర్‌బీఎన్‌బీలో స్పెషల్ వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్ను నిర్వహించనున్నారు. దీనికోసం సూర్యరశ్మి, పచ్చటి ప్రకృతి మధ్య ఒక సెటప్ సెట్ చేసుకున్నారు.సినిమా రంగంలో ఫిట్నెస్ పట్ల అమితమైన అభిరుచి కలిగిన సారా అలీ ఖాన్.. ఇప్పుడు ఆరోగ్యం, యోగా పట్ల తనకున్న అభిరుచిని వెల్లడిస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పచ్చని ప్రకృతి మధ్య సారాతో నలుగురు వ్యక్తులు యోగా చేసే అవకాశం పొందవచ్చు.ఇక్కడ సారా వ్యక్తిగత వెల్నెస్ ఆచారాలు, ఇతర ఆరోగ్య రహస్యాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. గోవాలో ఈ వెల్నెస్ మరియు యోగా రిట్రీట్ కోసం బుకింగ్‌లు నవంబర్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.గోవాలో ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్‌కు అతిథులను స్వాగతించడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ.. మనస్సు, శరీరం, ఆత్మను పోషించడంపై దృష్టి పెట్టవచ్చు. జీవితంలో మరచిపోలేని సాధారణ ఆనందాలను స్వీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని సారా అలీ ఖాన్ అన్నారు. View this post on Instagram A post shared by Viralbollywood (@viralbollywood) -
పొలిటీషియన్ కొడుకుతో హీరోయిన్?
బాలీవుడ్లో డేటింగ్ రూమర్స్ సర్వసాధారణం. పలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ సెలెబ్రిటీతో అయినా కలిసి ఫోటో దిగితే చాలు..వాళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో కొన్ని నిజమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఈ సారి సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి.పొలిటిషీయన్ కొడుకుతో ప్రేమాయణంసారా అలీఖాన్ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)అలా మొదలైంది..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. (చదవండి: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు) View this post on Instagram A post shared by Arjun Pratap Bajwa (@bajwaarjun) -
ఆధ్యాత్మిక బాటలో హీరోయిన్.. పర్వతాల్లో ధ్యానం చేస్తూ!
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ఆధ్యాత్మిక బాటపట్టింది. ఇటీవల ముంబయిలో దివాళీ బాష్‌లో మెరిసిన ముద్దుగుమ్మ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. కొండల మధ్య ధ్యానం చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలోనూ సారా అలీఖాన్ తన ఫ్రెండ్ జాన్వీ కపూర్‌తో కలిసి కేదార్నాథ్ సందర్శించింది.కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం మెట్రో ఇన్డినోలో కనిపించనుంది. ఈ మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమాసనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఇది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం స్కై ఫోర్స్‌లో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు తండ్రికి తగ్గ తనయ అనేలా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన అందం అభినయంతో వేలాది అభిమానుల మనుసులను గెలుచుకుంది. అంతేగాదు తన విలక్షణమైన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ఎప్పటికప్పుడూ తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తాజాగా సరికొత్త రాయల్టీ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. ఈ స్టైలిష్ లుక్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెబుతోంది. ఏస్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ గోల్డ్ జ్యువెలరీ గౌనుని రూపొందించారు.రకరకాల వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో పొదిగిన గౌను అది. ఎంత అద్భుతంగా ఉందంటే..ఆ డిజైనర్‌వేర్‌లో సారా దేవతలా ధగధగ మెరిసిపోతోంది. మల్టీకలర్ రాళ్లు, పూసలుతో.. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌను ఇది. ఈ గౌనుని సాంప్రదాయ మేళవింపుతో కూడిని ఆధునిక డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దారు డిజైనర్లు.ఆ ఆభరణాల గౌనులో సారా లుక్ నాటి రాజుల దర్పాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంది. అందుకు తగ్గట్లు జుట్టుని చక్కగా హెయిర్ బన్ మాదిరిగా వేసిన తీరు, సింపుల్ మేకప్ లుక్ సారా అందాన్ని రెట్టింపు చేశాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరీ..!. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)(చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!) -
Sara Ali Khan: లెహెంగా బ్యూటీ.. సూపర్ సారా (ఫొటోలు)
-
‘రెట్రో’ చీరలతో లెహంగా.. సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!
ప్రముఖులు, సెలబ్రిటీలు ట్రెండ్‌కి తగ్గట్టు లగ్జరీయస్ దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్‌గా ఉంటుంది వారి డ్రెస్సింగ్ స్టైల్. అలాంటిది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ మాత్రం ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చే డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఈ ముద్దుగుమ్మ దుస్తుల వేస్ట్‌కి అడ్డుకట్ట వేసేలా పర్యావరణ హిత ఫ్యాషన్ శైలిని తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్ ధరించింది అనే కదా సందేహం..!అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలో ఓ రేంజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర తారలంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారా ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకుంది. డిజైనర్ మయ్యూర్ గిరోత్రా కోచర్ రూపొందించిన అందమైన లెహెంగాలో ఈ బుట్టబొమ్మ మెరిసింది. అయితే ఈ లెహంగాని డిజైనర్ 50, 60ల నాటి పాత చీరలను రీసైక్లింగ్ చేసి రూపొందిచారు. చూడటానికి ఈ లెహంగా వివిధ రంగుల చీరల కలయికతో అందంగా ఉంది. ఈ లెహంగాలో సారా స్టన్నింగ్ లుక్ చూపురులను తిప్పుకోని విధంగా ఆకర్షణీయంగా కనిపించింది. చెప్పాలంటే సారా ఎంచుకున్న డిజైనర్ వేర్ దుస్తుల వేస్ట్‌ని అరికట్టేలే ఫ్యాషన్ ట్రెండ్‌ని సరికొత్త విధంగా సెట్ చెయ్యొచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంది ఆమె మెస్మరైజ్ లుక్. ఈ మిక్స్డ్ కలర్ లెహంగాకి సారా పర్పుల్ కలర్ బ్లౌజ్‌ని జత చేసింది. ఈ బ్లౌజ్‌కి డోరీ టైస్ , గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టీ బార్డర్లు ఉన్నాయి. అలాగే ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా రాగి కలర్‌తో కలగలసిన బంగారు టిష్యు సిల్క్ దుప్పట గ్రాడ్ లుక్‌ని తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టు మంచి ఐషాడో, మిరుమెట్లుగొలిపే ఐలైనర్, న్యూడ్ లిప్షేడ్తో చాలా సింపుల్ మేకప్‌లో మెరిసింది. హెయిర్‌ని కూడా టై చేసి వదిలేసింది. అంతేగాదు తన లెహంగాకి మ్యాచింగ్ అయ్యేలా తలలో ఊదారంగు పూలను ధరించింది. అలాగే చెవులకు జుమ్మీలు, మెడకు పోల్కీ చోకర్ నెక్లస్‌తో గ్రాండ్‌గా కనిపించింది సారా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Mayyur Girotra Official (@mayyurgirotracouture) (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..
-
Sara Ali Khan: బాలీవుడ్ భామ సారా అలీఖాన్ బర్త్‌డే స్పెషల్.. రేర్ ఫోటోలు
-
సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!
అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం పరంగా సారాకి నూటికి నూరు మార్కులు పడతాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో చోటు కూడా దక్కించుకుంది. అలాంటి సారా సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు ఏకంగా 96 కిలోలు ఉండేది. ఆ తర్వాత సముతుల్య ఆహారం, వ్యాయామ దినచర్యలతో దాదాపు 40కి పైగా కిలోలు తగ్గిం 45 కిలోల బరువుకి చేరుకుంది. అంతేగాదు తాను యుక్తవయసులో ఊబకాయం, పీసీఓడీ సమస్యలతో పోరాడనని కూడా పేర్కొంది. అయితే పీసీఓడికి ఎలాంటి నివారణ లేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్య ద్వారానే సాధ్యం. అందుకోసం అని సారా సమతుల్య జీవనశైలికి కట్టుబడి ఉండటంతో బరువు తగ్గడమే గాక పీసీఓడీని నిర్వహించడంలో సహాయపడింది. ఇక్కడ సారా ఎలాంటి డైట్, వ్యాయామాలు ఫాలో అయ్యింది. అవి తనకు ఏవిధంగా సహాయపడ్డాయో చూద్దామా..!సారా అలీ ఖాన్ బరువు తగ్గించే ప్రయాణంలో తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్ ప్లాన్‌పై దృష్టి సారించి విజయవంతమయ్యింది. ఆమె రోజులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఒక భోజనానికే పరిమితం చేసింది. శరీరానికి శక్తినిచ్చేలా కొత్తిమీర, జీలకర్ర లేదా పండ్లు, కూరగాయాలతో చేసే స్మూతీ వంటి వాటిని, అలాగే ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకునేది. రోజుని గ్రీన్ లేదా నిమ్మ తేనెతో ప్రారంభించేది. ఇక్కడ సారా శరీర బరువుని తగ్గించడంలో సహాయపడింది కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, టోన్డ్ బాడీని పొందేలా వర్కౌట్లు చేసేది. ప్రారంభంలో తనకు ఇవన్నీ కష్టంగా అనిపించేవని తెలిపింది కూడా. ఐతే ఎంత ఇబ్బందిగా ఉన్నా..క్రమతప్పకుండా చేయడమే గాక కార్డియో వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. అంతేగాదు అదనపు కిలోలు తగ్గించుకునేలా యోగా, పైలేట్స్, వంటివి కూడా చేసింది. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామాలతో బరువుని అదుపులో ఉంచడమే గాక ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందింది. జీవనశైలిని మార్చుకుని, నిబద్దతతో వర్కౌట్లు చేస్తే ఎవ్వరైన బరవు తగ్గించొచ్చని చాటి చెప్పింది. చాలామంది స్ఫూర్తిగా నిలిచింది సారా.(చదవండి: సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!) -
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)
-
అంబానీ హల్ది ఫంక్షన్.. అందరికంటే ఈ బ్యూటీయే హైలైట్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ అంబానీ పెళ్లికి నెలల ముందు నుంచే సందడి మొదలైంది. జూలైలో జరగబోయే పెళ్లికి మార్చి నుంచే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. మార్చిలో గుజరాత్‌లోని జామ్ నగర్లో జరిగిన ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఆనందంగా గడిపారు. ఆ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా ఉంది.బంగారం వడ్డింపుతాజాగా ఆ సెలబ్రేషన్స్ సంగతులను సారా అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'అక్కడ ఏకంగా బంగారమే వడ్డించినట్లుగా అనిపించింది. అందరూ చపాతీతో పాటు పసిడి తిన్నట్లుగా ఫీలయ్యాను. ఎక్కడ చూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. అంత అద్భుతంగా వేడుక నిర్వహించారు. ఎంతో బాగా వెల్కమ్ చెప్పారు. అనంత్‌తో కలిసి నేను స్కూలుకు వెళ్లేదాన్ని. రాధికా మర్చంట్ కూడా తెలుసు. అది మాత్రం మర్చిపోలేనుఏదేమైనా.. అంబానీ కుటుంబసభ్యులంతా ఎంతో మంచి మనసుతో సాదరంగా వెల్కమ్ చెప్పారు. నిజంగా వీళ్లు బంగారంలాంటివాళ్లు! నీతా అంబానీ మేడమ్ స్టేజీపై డ్యాన్స్ చేయడం మాత్రం మర్చిపోలేని జ్ఞాపకం' అని చెప్పుకొచ్చింది. ఇటీవల క్రూయిజ్ షిప్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ సారా పాల్గొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన మెట్రో ఇన్ డినో మూవీ విడుదలకు రెడీ అవుతోంది.చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
-
హీరోయిన్‌తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్‌తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా అలీ ఖాన్‌తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్‌లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.. డేటింగ్ చేసి తప్పు చేశా: హీరో
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్‌తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇద్దరమ్మాయిలతో డేటింగ్ దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు. కనిపిస్తే అదే అడుగుతా మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్! -
యాచకులకు ఫుడ్ పంచిన హీరోయిన్.. ప్లీజ్ అలా చేయొద్దంటూ..
హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందం ఉండాలి. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్నవారు హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు. కానీ ఈ తరంలో మాత్రం బొద్దుగా ఉంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేరు. ఇంకో ఛాయిస్ లేనట్లు సన్నబడి తీరాల్సిందే! అలా సారా అలీ ఖాన్ సైతం తన బరువు తగ్గించుకుని సన్నబడింది. హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. దేవుడి దర్శనం అనంతరం.. ఈ మధ్య 'మర్డర్ ముబారక్', 'ఏ వాతా మేరే వాతా' అనే ఓటీటీ ప్రాజెక్టులతో వెబ్ ఆడియన్స్‌ను అలరించింది. శనివారం నాడు ఆమె ముంబై.. జుహులోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లింది. దేవుడిని దర్శించుకున్న అనంతరం బయట ఉన్న యాచకులకు స్వీట్లు పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు. మీరు మారరు దీంతో విసిగెత్తిన బ్యూటీ.. ప్లీజ్, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నేను అలిసిపోతున్నాను, కానీ మీరు మారడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీట్లు పంచిన అనంతరం అక్కడినుంచి విసురుగా కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
చీర సౌందర్యాలు, అందాల ఐశ్వర్యాలు (ఫోటోలు)
-
అందం ఉంటే సరిపోదు.. ఈ బ్యూటీలా దమ్ముండాలి
స్టేజీపై అందరిముందు హుందాగా, అందంగా నడవాలంటే టాలెంట్, ఒంపుసొంపులు ఉంటే సరిపోదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ నడక అందం రెట్టింపు అవుతుంది. ముంబైలో జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంతో దర్జాగా ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఈవెంట్లో సిల్వర్ కలర్ లెహంగా ధరించిన సారా తన ఒంపుసొంపులతో హొయలొలికించింది. ఆమె కళ్లలోనే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చేలా కనిపిస్తోంది. కవర్ చేయలేదు అంతేనా.. తన నడుముపై ఉన్న మచ్చను మేకప్‌తో కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. దాన్నలాగే వదిలేసింది. తన ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'కాలిన మచ్చను కవర్ చేయడానికి ప్రయత్నించలేదు చూడు, అక్కడే నచ్చేసింది.. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలని చాటిచెప్తోంది. నీ నిజాయితీ, గొప్పతనేమ నిన్ను మరింత బ్యూటిఫుల్‌గా మలుస్తోంది' అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వేడినీళ్లు ఒంటిపై పడటంతో అలా మచ్చలు ఏర్పడినట్లు తెలుస్తోంది. సారా ప్రస్తుతం ఆ మూవీలో.. సారా ప్రస్తుతం 'ఏ వాటన్ మేరే వాటన్' అనే సినిమాలో నటిస్తోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సారాతో పాటు సచిన్ కేడేకర్, అభయ్ వర్మ, స్పర్ష శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నీల్, ఆనంద్ తివారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: నల్లగా ఉన్నానని హేళన.. ఇంట్లోవాళ్లు ఆరేళ్లు మాట్లాడలేదు.. -
డైరెక్ట్‌గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, జానర్లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్లో జరిగిన ఓ మర్డర్ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్‌గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
ఆలియా చాలారోజుల తర్వాత అలా.. హీట్ పెంచుతున్న సీరత్!
చాలా ఏళ్ల తర్వాత క్లాసికల్ డ్యాన్స్.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్న ఆలియా భట్ చీరకట్టులో మరింత క్యూట్‌గా ముద్దుగుమ్మ ప్రియమణి కలర్‌ఫుల్ సీతాకోకచిలుకలా కనిపిస్తున్న సీరత్ కపూర్ మేకప్ లేకపోయినా సరే అందంగానే మీనాక్షి చౌదరి ఎక్సర్సైజ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి భర్తతో కలిసి హీరోయిన్ దీపికా పదుకొణె క్యూట్ పోజులు రోజురోజుకీ మరింత హాట్‌గా సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Musskan Sethi Adlakha (@musskansethi9) -
డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ డైరెక్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించారు. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. (ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీనవం.. ఇంతలో!) ఈ సినిమాను భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఓ మహిళ కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథనే సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంత రేడియో దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు. resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH — prime video IN (@PrimeVideoIN) February 13, 2024 -
పొట్టి నిక్కర్లో సీరియల్ బ్యూటీ.. అనసూయ మాత్రం అలాంటి లుక్!
బ్లాక్ అండ్ వైట్‌లో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న మీనాక్షి చౌదరి భరతనాట్యం లుక్‌లో అదాశర్మ కొత్త స్టిల్స్ క్యాట్ వాక్‌తో కేక పుట్టించిన హీరోయిన్ తాన్య హోప్ 7 మిలియన్ల మార్క్ క్రాస్ చేసిన 'ఉప్పెన' కృతిశెట్టి వంగి వంగి మరీ అందాలు చూపిస్తున్న సారా అలీ ఖాన్ సోయగాల బెండు తీస్తున్న తమిళ బ్యూటీ యాషికా ఆనంద్ జిగేలుమనే డ్రస్‌లో విచిత్రమైన పోజుల్లో సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అమృతా సింగ్‌ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్‌లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు. కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్‌తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్‌మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్‌ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్‌లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్‌ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్‌తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్‌లో..'!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్‌గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో కూడా నటించనుంది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) -
సారా అలీ ఖాన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సారా అలీ ఖాన్.. బాలీవుడ్లో ఎంటర్ అవడానికి ఆమెకున్న నటనా వారసత్వం ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆమె నిలబడింది మాత్రం అచ్చంగా తనలోని ప్రతిభతోనే! ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే! అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సెలబ్రిటీలు అని అనుకుంటారు కదా! కానీ నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్ డ్రెసెస్‌నే ఫ్రిఫర్ చేస్తాను! పునీత్ బలానా.. ‘వార్డ్‌రోబ్‌లోని మన కలెక్షన్.. మన ఫ్యాషన్ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్ బలానా. అందుకే అతని డిజైన్స్ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్ సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సారాఖాన్ ధరించి డ్రెస్ బ్రాండ్ పునీత్ బలానా ఖరీదు రూ. 1, 55, 000/-. జేకేజే జ్యూలర్స్ ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్‌గఢ్ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్తో ప్రారంభమై.. నేడు జైపూర్‌లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్‌గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్ కీర్తి అంతర్జాతీయ స్థాయికీ చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక సారాఖాన్ ధరించిన జేకేజే జ్యూలర్స్ ధర ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
Happy Birthday Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పుట్టినరోజు నేడు(సెప్టెంబరు 8). పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో జన్మించిన ఈ హ్యాండ్సమ్ బ్యాటర్ నేటి(శుక్రవారం)తో 24వ పడిలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం గిల్‌ను ప్రత్యేకంగా విష్ చేయడం హైలైట్‌గా నిలిచింది. కాగా 2018 అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు గిల్. 104.5 స్ట్రైక్‌రేటుతో 418 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా నాటి ఐసీసీ ఈవెంట్లో కెప్టెన్ పృథ్వీ షాకు డిప్యూటీగా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు అతడిని దాటుకుని టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. మరుసటి ఏడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు. డబుల్ సెంచరీ వీరుడు ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 టెస్టులు, 29 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన శుబ్‌మన్ గిల్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 966, 1514, 304 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు శతకాలు సాధించిన ఈ పంజాబీ కుర్రాడు.. వన్డేల్లో 4 సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ హవా పొట్టి ఫార్మాట్లోనూ ఒక శతకం సాధించి.. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడి ఖాతాలో ఏకంగా 3 సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని రోల్ మోడల్‌గా భావించే గిల్.. భవిష్యత్తులో అతడి స్థాయికి ఎదగలడని ప్రశంసలు అందుకుంటున్నాడు. భావి భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు గిల్ గురించి జోస్యం చెబుతున్నారు. సొట్ట బుగ్గల కుర్రాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు మేటి బ్యాటర్‌గా ఎదుగుతున్న శుబ్‌మన్ గిల్‌కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అహ్మదాబాద్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ యువతి.. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా గిల్ అంటూ ప్లకార్డు ప్రదర్శించడం చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ‘సారా’లతో ప్రేమాయణం పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ సొట్ట బుగ్గల కుర్రాడి ‘ప్రేమాయణాలు’ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే! సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారా టెండుల్కర్తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరు ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. అడపాదడపా కలిసి బయట కనిపించడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, దేవతలను ప్రేమించకూడదంటూ గిల్ పెట్టిన పోస్ట్‌తో సారాతో బ్రేకప్ అయ్యిందని ఊహాగానాలు వినిపించాయి. పటౌడీల యువరాణితో చెట్టాపట్టాల్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుబ్‌మన్ గిల్ కలిసి కనిపించడం మరోసారి రూమర్స్‌కు దారితీసింది. పటౌడీ పరగణా వారసురాలితో ఈ కుర్ర క్రికెటర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. కెరీర్‌పై ఫుల్ ఫోకస్ అయితే, ఇవన్నీ పట్టించుకోకుండా తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టాడు గిల్. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ.. టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. ప్రస్తుతం ఆసియా కప్-2023తో బిజీగా ఉన్న గిల్.. తదుపరి వన్డే వరల్డ్‌కప్-2023తో ఐసీసీ ఈవెంట్ బరిలో దిగనున్నాడు. సచిన్ టెండుల్కర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే తన కుమార్తె సారాతో గిల్ ప్రేమ వార్తల నేపథ్యంలోనూ సచిన్ టెండుల్కర్ ఈ యువ క్రికెటర్‌ను ఎప్పటికపుడు ఆకాశానికెత్తడం విశేషం. తన కళ్ల ముందే టీ20 మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సెంచరీ సాధించిన సందర్భంగా సచిన్ అతడిపై గతంలో ప్రశంసలు కురిపించాడు. తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే శుబ్‌మన్ గిల్. ఈ ఏడాది నువ్వు పరుగుల వరద పారించాలి. మరిన్ని గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాలి’’ అని సచిన్ ఆకాంక్షించాడు. ఇక రాబిన్ ఊతప్ప, అక్షర్ పటేల్ సహా సహచర క్రికెటర్లు బర్త్‌డే బాయ్ గిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: పాక్ ఫాస్ట్‌బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్! వాళ్లకు చుక్కలు ఖాయం - Double hundred in ODIs. - Hundred in Test. - Hundred in T20I. - Hundred in IPL. - Player of the tournament in U-19 WC. Happy Birthday to the future Super-star of the World Cricket, Shubman Gill. pic.twitter.com/xUs1IcAtFI — Johns. (@CricCrazyJohns) September 8, 2023 5️⃣8️⃣ intl. matches 2️⃣7️⃣8️⃣4️⃣ intl. runs Youngest ODI double-centurion (in Men's cricket) 🔝 Youngest all-format centurion in Men's intl. cricket 👌 Here's wishing Shubman Gill a very happy birthday 👏 🎂#TeamIndia pic.twitter.com/BAaXEBClRN — BCCI (@BCCI) September 8, 2023 Happiest birthday to you @ShubmanGill. May the upcoming year be full of runs and great memories. — Sachin Tendulkar (@sachin_rt) September 8, 2023 -
జవాన్లతో కియారా సెలబ్రేషన్స్, తొలిసారి ఆ పని చేసిన ఐటం బ్యూటీ
నవ్వుతో ఫిదా చేస్తున్న కీర్తి సురేశ్ చీర కడితే ఆ ఆనందమే వేరంటున్న అనన్య నాగళ్ల తన ఫేవరెట్ ఫోటోలు షేర్ చేసిన శ్రియ ఇప్పుడీ సన్గ్లాసెసే ఇష్టమంటోన్న మాళవిక మోహన్ ఫస్ట్ టైం లైవ్‌లో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఆర్మీ జవాన్లతో కియారా అద్వానీ సాహసాలు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Rani Mukerji 🔵 (@_ranimukerji) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Annie 🦋 (@thenameis_annie) -
Sara Ali Khan: ఒకప్పుడు 96 కిలోలు ఉండేది.. ఇప్పుడెంత నాజూకుగా అయిందో చూశారా? (ఫోటోలు)
-
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్‌స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్‌ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్‌స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
టవల్ కోసం అన్ని డబ్బులు తగలేస్తావా? అని ఒకటే తిట్టుడు..
సెలబ్రిటీల లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుందంటే.. చిన్న వస్తువు కోసం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవి వందలు, వేలు, లక్షలు, కొన్నిసార్లైతే కోట్లల్లో కూడా ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హుందాగా ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా సింపుల్‌గా ఉండాలనుకుంటారు. హీరోయిన్గా, సహాయ నటిగా మెప్పించిన ఒకప్పటి బాలీవుడ్ సీనియర్ నటి అమృత సింగ్ కూడా ఏదైనా భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎంత భారీగా అంటే ముఖం తుడుచుకునే టవల్ కూడా వేలు పోసి కొంటుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బయటపెట్టాడు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆన్‌స్క్రీన్ జంట ద కపిల్ శర్మ షోలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విక్కీ కౌశల్. 'ఒక రోజు సెట్లో సారా తన తల్లి అమృత మేడమ్‌ను తిడుతోంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా ఓకేనా? అని అడిగా. దానికామె.. మా అమ్మ రూ.1600 పెట్టి కొత్త టవల్ తీసుకుంది. అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. తను జోక్ చేస్తుందేమో అనుకున్నాను. నిజం చెప్పు? అని అడిగితే నిజమే చెప్తున్నానని అరిచింది. నేను షాకయ్యాను.. రూ.1600 పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతలో సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్‌లో ఉన్న ఫ్రీ టవల్స్ వాడుకోవచ్చుగా' అని పేర్కొంది. చదవండి: నిశ్చితార్థం జరిగిందంటూ అనుపమ పోస్ట్ -
సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గతంలో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు. (ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..) అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్‌ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నారు. -
‘జరా హట్కే జరా బచ్ కే’ మూవీ ప్రమోషన్స్‌లో సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ (ఫొటోలు)
-
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్‌కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్‌ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్‌లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్‌లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్‌వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
‘జరా హట్కే జరా బచ్ కే’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఎట్టకేలకు నోరు విప్పిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ..
Shubman Gill Reveals His Crush Name: టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఆటతోనే కాదు చూడచక్కటి రూపంతోనూ ఆకట్టుకునే యువ క్రికెటర్ల జాబితాలో ముందుంటాడు. ఈ సొట్టబుగ్గల కుర్రాడికి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 23 ఏళ్ల ఈ హ్యాండ్సమ్ బ్యాటర్‌కు.. ఇటీవల మైదానంలోనే ఓ అమ్మాయి ప్రపోజ్ చేసింది. తన స్వీట్ ప్రపోజల్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సచిన్ టెండుల్కర్ సమక్షంలో గిల్ శతకం బాది పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్.. ‘శుబ్మన్తో నాకు జోడీ కలపండి’’ అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. గిల్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి! సచిన్ తనయ.. సారాతో ఇక ఇప్పటికే సచిన్ తనయ సారా టెండుల్కర్, బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ పరగణా యువరాణి సారా అలీఖాన్‌తో కలిపి గిల్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సారాతో బ్రేకప్ అయిన తర్వాత సారా అలీఖాన్‌తో అతడు ప్రేమలో పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గిల్- సారా టెండుల్కర్ నా క్రష్ ఆమే! ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో సంభాషణలో భాగంగా శుబ్‌మన్ గిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. నీ క్రష్ ఎవరో చెప్పాలని కోరగా.. తొలుత సంశయించినప్పటికీ ఎట్టకేలకు నోరు విప్పాడు గిల్. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక మందన్న అంటే తనకు ఇష్టమన్నాడు. ఆమే నా సెలబ్రిటీ క్రష్ అంటూ నేషనల్ క్రష్ రష్మిక పేరు చెప్పాడు. గిల్- రష్మిక ఈ క్రమంలో గిల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘సారా’లలో ఎవరో ఒకరి పేరు చెప్తావనుకుంటే ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా! అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఆన్సర్‌కు రష్మిక ఎలా బదులిస్తూ చూడాలి అంటూ ఆట పట్టిస్తున్నారు. రష్మిక మందన నిరాశపరిచిన గిల్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్ ఆడగా.. అతడు విఫలమైన కారణంగా గిల్ మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఉసూరుమనిపించాడు. మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసిన గిల్ నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్న నాలుగో టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేనకు.. ఆఖరి టెస్టులో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు సిరీస్ ఫలితం తేలితేనే ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో పోటీ పడేది ఎవరన్న అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై బాధ్యత మరింత పెరిగింది. చదవండి: WI vs SA: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్! Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం -
వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..!
టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ అడ్డంగా బుక్కయాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారాతో రిలేషన్ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇనాళ్లు తాను దాచిన నిజాన్ని తన వాలెంటైన్స్ డే-2023 పోస్ట్‌తో పొరపాటున బహిర్గతం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా నయా స్టార్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారాతో డేటింగ్లో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) అయితే, ఈ విషయంపై మీడియా శుభ్‌మన్,సారాలను ఎన్ని సార్లు ప్రశ్నించినా స్పందించలేదు. ఇంతలో శుభ్‌మన్ డేటింగ్ చేస్తోంది సచిన్ కుమార్తె సారాతో కాదని, బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రియ తనయ సారా అలీ ఖాన్‌తో అని ప్రచారం మొదలైంది. శుభ్‌మన్-సారా అలీ ఖాన్ రిలేషన్‌ను కనుక్కునేందుకు అభిమానులు, మీడియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి క్లారిటీ దొరకలేదు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) దీంతో శుభ్‌మన్ ఏ సారాతో రిలేషన్లో ఉన్నాడని తెలుసుకోలేక సచిన్, సైఫ్, శుభ్‌మన్, ఇరువురు సారాల అభిమానులు జట్టు పీక్కున్నారు. తాజాగా శుభ్‌మన్ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ద్వారా అభిమానులకు ఓ విషయంపై క్లారిటీ వచ్చింది. శుభ్‌మన్ తన 2023 వాలంటైన్స్ డే పోస్ట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. What Day Is It Again? అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్‌లో ఫోటోనే శుభ్‌మన్, సారా టెండూల్కర్ రిలేషన్‌ను బయటపెట్టింది. ఈ ఫోటోలో శుభ్‌మన్ ఓ రెస్టరెంట్లో కాఫీ తాగుతూ కనిపించాడు. గతంలో ఇదే ప్లేస్‌లో దిగిన ఫోటోను సారా టెండూల్కర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇరువురు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బట్టి చూస్తే.. గతంలో శుభ్‌మన్, సారా టెండూల్కర్ ఇద్దరు ఇదే ప్లేస్‌లో కలిసి కూర్చున్న విషయం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా శుభ్‌మన్-సారా టెండూల్కర్‌తోనే రిలేషన్లో ఉన్నాడన్న విషయాన్ని అభిమానులు నిర్ధారించుకున్నారు. మరోపక్క ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. శుభ్‌మన్.. సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే. అయితే వారిద్దరు ఇప్పుడు విడిపోయారని, వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక శుభ్‌మన్ సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించాడని, ప్రస్తుతం సారా అలీ ఖాన్‌కు కూడా శుభ్‌మన్ బ్రేకప్ చెప్పాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. శుభ్‌మన్ వాలంటైన్స్ డే పోస్ట్ తర్వాత నెటిజన్లు మరో కొత్త విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. శుభ్‌మన్ ఇద్దరు సారాలతో డేటింగ్ చేసింది వాస్తవమే. అయితే గిల్ సారా టెండూల్కర్‌ను మర్చిపోలుకపోతున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ.. అభిమానులకు.. శుభ్‌మన్ సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేశాడన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గిల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. -
Viral: శుబ్మన్తో జోడీ కలపండి! ఆ ఛాన్స్ లేదు.. మ్యాచ్ ఫిక్స్ అయింది!
India Vs New Zealand- Shubman Gill: శుబ్‌మన్ గిల్.. ప్రస్తుతం తన కెరీర్లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడీ టీమిండియా యువ ఓపెనర్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన ఈ పంజాబీ బ్యాటర్.. టీ20 సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సమక్షంలో పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో తొలి సెంచరీ సాధించి.. ఈ జ్ఞాపకాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడు! ఇక ఆటలో తనదైన శైలిలో దూసుకుపోతూ అభిమానులను మురిపిస్తున్న 23 ఏళ్ల ఈ హ్యాండ్సమ్ బ్యాటర్.. అమ్మాయిల మనసును దోచుకోవడంలోనూ ముందు వరుసలోనే ఉన్నాడు. చూడచక్కని రూపంతో.. అందమైన చిరునవ్వుతో వెలిగిపోయే ఈ సొట్టబుగ్గల కుర్రాడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. శుబ్మన్తో జోడీ కలపండి అహ్మదాబాద్ మ్యాచ్ సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ బ్యాటింగ్ మెరుపులు ప్రతక్ష్యంగా వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి స్వీట్ ప్రపోజల్‌తో ముందుకు వచ్చింది. ‘‘శుబ్మన్తో నాకు జోడీ కలపండి’’ అంటూ డేటింగ్ యాప్‌ను అభ్యర్థిస్తున్నట్లుగా రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. నీకు ఆ ఛాన్స్ లేదు! ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘అయ్యో మీకు ఆ అవకాశం లేదక్కా! ఆల్రెడీ తన కోసం బీసీసీఐ మంచి పెళ్లి సంబంధం కుదిర్చినట్లుంది. సచిన్‌ను తీసుకు వచ్చారు. మీకింకా విషయం అర్థంకాలేదా?’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అండర్ 19 మహిళా ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును సత్కరించేందుకు సచిన్ అహ్మదాబాద్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. గిల్- సారా టెండుల్కర్ సారా(ల)తో ప్రేమలో? కాగా.. సచిన్ టెండుల్కర్ తనయ సారాతో గిల్ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో కథనాలు రాగా.. ప్రస్తుతం అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో రిలేషన్లో ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఏదేమైనా గత కొంతకాలంగా తన ఆట తీరు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో శుబ్‌మన్ గిల్ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. సారా అలీ ఖాన్- గిల్ భారీ విజయంతో ఇక అహ్మదాబాద్‌లో ఆఖరిదైన మూడో టీ20లో గిల్ 63 బంతుల్లోనే 126 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు అత్యుత్తమంగా రాణించడంతో పాండ్యా సేన 168 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా... టీ20 ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. Didi ka match karado koi pic.twitter.com/wDF99VpEaz — Shivani (@meme_ki_diwani) February 1, 2023 చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే అర్హత అతడికే ఉంది.. వేరే వాళ్లు వద్దు: డీకే Shubman Gill-Ishan Kishan: గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ -
వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?
Fact Check.. టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం జట్టులో భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గిల్ మూడు ఫార్మట్లలోనూ(టెస్టు, వన్డే, టి20లు) కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఓపెనింగ్ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలీ న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టి20 సిరీస్‌లోనూ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ముఖ్యంగా టి20 ఆటకు సరిపోడు అని విమర్శలు వచ్చిన వేళ.. కివీస్‌తో జరిగిన మూడో టి20లో 63 బంతుల్లోనే 126 పరుగులు నాటౌట్.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. తనపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ తొలగిపోయినట్లేనని చెప్పకనే చెప్పాడు గిల్. టీమిండియా మాజీ క్రికెటర్లు సహా కోహ్లి లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ అంటూ గిల్‌పై పొగడ్తలు కురిపించాడు. కచ్చితంగా భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో గిల్ పాత్ర కీలకం కానున్నట్లు స్పష్టంగా తెలియరానుంది. ఈ విషయం పక్కనబెడితే.. సోషల్ మీడియాలో శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్, నటి సారా అలీఖాన్‌తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నాళ్ల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అటు గిల్.. ఇటు సారా ఇద్దరు నోరు మెదపలేదు. అయితే మీడియా కంట పడకుండా వీరిద్దరు తమ ప్రేమాయణం కొనసాగిస్తునట్లు క్రికెట్ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే.. బుధవారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గిల్.. సారా అలీఖాన్‌లు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే వాళ్లిద్దరు నిజంగా కలుసుకున్నారా లేదంటే ఇదంతా గాసిప్ రాయుళ్ల ఎడిటింగ్ పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చక్కర్లు కొడుతున్న ఫోటో పాతదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి సారా అలీఖాన్ అహ్మదాబాద్‌కు రాలేదని.. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో ఎడిటింగ్ అని.. ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా క్రియేట్ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం గతేడాది కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో పెట్టారని.. అది ఇప్పటిది మాత్రం కాదని కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా గిల్-సారా అలీఖాన్‌లు మధ్య ప్రేయాయణం నడుస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. వీరికి సంబంధించిన వార్తలతో మాత్రం కొంతమంది బతికేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొన్నారు. ఇక గిల్, సారా అలీఖాన్‌లు కలిసి జైపూర్‌లోని ఒక రెస్టారెంట్లో తొలిసారి కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబీ నటి సోనమ్ భజ్వాతో టీవీ చాట్ షో సందర్భంగా గిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు.. ఆమె పేరు సారా అని మాత్రమే చెప్పాడు. అయితే సారా అని పేరు చెప్పి ముందు వెనకాల ఏం చెప్పకుండా అభిమానులను కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. దీంతో కొంతమంది గిల్.. సారా అలీఖాన్‌తో కాకుండా సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో రిలేషిన్షిప్ కొనసాగిస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. అయితే శుబ్‌మన్ గిల్ చెల్లెలలు షహనీల్కు సారా టెండూల్కర్ మంచి స్నేహితురాలు. వారిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు యాక్టివ్‌గా ఉంటారు. ఈ స్నేహం కూడా గిల్, సారా టెండూల్కర్లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో రిలేషన్షిప్ వార్తలకు కూడ బ్రేక్ పడినట్లయింది. దీంతో గిల్.. సారా అలీఖాన్తోనే డేటింగ్లో ఉన్నాడని.. వారిద్దరి ప్రేమాయణం నడుస్తుందంటూ మరోసారి సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. చదవండి: గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ -
పండ్ల తొక్కలు కూడా వదిలిపెట్టను! నా బ్యూటీ సీక్రెట్ అదే: హీరోయిన్
Sara Ali Khan Beauty Tips: నవాబుల వారసురాలు.. పటౌడి పరగణా యువరాణి.. ఒకప్పటి బీ-టౌన్ జోడీ సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ కుమార్తె.. అలనాటి హీరోయిన్ షర్మిలా ఠాగోర్ మనుమరాలు.. ఇన్ని ట్యాగ్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి ఎంతో కఠినంగా శ్రమించింది సారా అలీఖాన్. అధిక బరువు కారణంగా ఆరంభంలో ఇబ్బందులు పడ్డ ఆమె.. పట్టుదలతో సమస్య నుంచి విముక్తి పొందింది. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తనదైన అందం, అభినయంతో యువకుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. కాగా బాల్యంలోనే పీసీఓడీ బారిన పడిన కారణంగా సారా చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేది. అయితే, బాలీవుడ్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేసి.. ప్రస్తుత శరీరాకృతిని పొందింది. అయితే.. తన కాంతులీనే ముఖసౌందర్యానికి కారణం మాత్రం అమ్మ చెప్పిన చిట్కానే అంటోంది ఈ బ్యూటీ. సారా పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. పండ్ల తొక్క కూడా వదలను ‘నా బ్యూటీ సీక్రెట్ తాజా పండ్లు.. బాదం పప్పు. సీజన్లో దొరికే పండ్లను వదిలిపెట్టను. వాటి తొక్కను కూడా. పండ్లను తింటాను.. తొక్కతో మొహానికి మసాజ్ చేసుకుంటా. బాదం పప్పుతో ఫేస్‌ప్యాక్ వేస్తా. ఒక టీ స్పూన్ బాదం పప్పు పౌడర్‌లో ఒక టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పాలు, కొన్ని రోజ్ వాటర్ చుక్కలు కలిపి మొహానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తా. ఇది గనుక రెగ్యులర్‌గా చేస్తే ఇంకే కాస్మెటిక్స్ అవసరం లేదు.. రాదు. మా అమ్మ చెప్పిన చిట్కానా మజాకా మరి!’’ అంటోది సారా అలీ ఖాన్. చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్ ధర? Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా.. -
మా మధ్య ఏదో ఉందనుకుంటారు.. కానీ: డేటింగ్‌పై యంగ్ హీరో
ఇటీవల 'భూల్ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారాడు చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందించింది. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా పేరున్న ఆర్యన్‌పై డేటింగ్ రూమర్లు పెద్ద ఎత్తున వైరలయ్యాయి. ఈ జాబితాలో సారా అలీ ఖాన్, అనన్య పాండే కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తలపై ఎక్కడా నోరు విప్పలేదు కార్తీక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు తొలిసారి డేటింగ్ వార్తలపై స్పందించారు. కార్తీక్ మాట్లాడుతూ.. ' నాకు కాఫీ తాగడం అంటే ఇష్టం. ఎవరైనా నాతో కాఫీ తాగడానికి పిలిస్తే వారితో వెళ్లిపోతా. ఈ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటా. నాపై డేటింగ్ వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రజలు బయటి ప్రపంచంలో కనిపించే వాటినే ఎక్కువగా నమ్ముతారు. వార్తల్లో వచ్చిన వాటిని చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటారు. ' అని అన్నారు. కాగా.. కార్తీక్ 2020లో లవ్ ఆజ్ కల్లో సారా అలీ ఖాన్‌తో కలిసి పనిచేశాడు. పతి పత్నీ ఔర్ వో సినిమా సమయంలో కార్తీక్, అనన్య డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ప్రస్తుతం కృతి సనన్‌తో నటించిన షెహజాదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది. కార్తీక్ చేతిలో కెప్టెన్ ఇండియా, సత్యప్రేమ్ కీ కథ, ఆషికి 3 కూడా ఉన్నాయి. అతను హేరా ఫేరి 3లో కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. -
సుశాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సారా, వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి మూడేళ్లపైనే అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో తరచూ అతడి పేరు వినిపిస్తూనే ఉంది. శనివారం (జనవరి 21న) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది. ఎన్జీవోలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన సారా పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్‌డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం. ఈ రోజును ఇంత స్పెషల్‌గా మార్చినందుకు సునీల్ అరోరాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటివాళ్లు ఈ ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా, సురక్షితంగా, సంతోషకరంగా మార్చుతారు. మీరు కూడా ఇతరులకు సంతోషాన్ని పంచండి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా సారా చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. అదే సమయంలో కొందరు మాత్రం ఇదంతా వట్టి డ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సుశాంత్, సారా.. కేదార్నాథ్ (2018) సినిమాలో కలిసి పని చేశారు. ఈ చిత్రంతోనే సారా ఇండస్ట్రీకి పరిచయమైంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) చదవండి: ఈ ఏడాది ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? -
మాజీ లవర్‌తో న్యూ ఇయర్ వేడుకల్లో స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భూలయ్యా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్యార్ కా పంచ్‌నామా చిత్రంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా పారిస్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023కి స్వాగతం పలుకుతూ ఆదివారం ఓకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. గతంలో సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ జంట బ్రేకప్ విషయాన్ని గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒకసారి కరణ్ జోహార్ మాత్రమే తన చాట్ షోలో వీరిద్దరి రిలేషన్‌ను ప్రస్తావించారు. గతంలో ఈ జంట 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్నప్పుడు ఏడాది పాటు డేటింగ్లో ఉన్నారు. సినిమాల విషయాకొనిస్తే కార్తిక్ ఆర్యన్ చేతిలో 'షెహజాదా', 'సత్యప్రేమ్ కీ కథ', 'ఆషికి 3' 'కెప్టెన్ ఇండియా' ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో అనౌన్స్', 'గ్యాస్‌లైట్', 'నఖ్రేవాలి', విక్కీ కౌశల్‌తో లక్ష్మణ్ ఉటేకర్ అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించిన స్టార్ హీరోయిన్
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. జనాల కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్ మాత్రం ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది 'సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్లో ప్రయాణం చేశాను' అంటూ సారా తన ఇన్‌స్టా వీడియోలో చెప్పుకొచ్చింది. ట్రైన్ దిగిన తర్వాత కూడా సారా ఆటోలో ప్రయాణంచడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
హీరోయిన్‌తో డేటింగ్‌పై స్పందించిన టీమిండియా బ్యాటర్! ఒక్క మాటతో
Shubman Gill- Sara Ali Khan: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పొట్టి ఫార్మాట్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే జట్టుతో కలిసి న్యూజిలాండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న గిల్... టీ20 తుది జట్టులో చోటు దక్కించుకుని తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయ సారాతో అతడు డేటింగ్లో ఉన్నట్లు వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కావడం, ఫొటోలకు పరస్పరం కామెంట్లు చేసుకోవడంతో ఈ రూమర్లు తెర మీదకు వచ్చాయి. అప్పుడు ఆమె పేరు ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం గిల్.. ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో సారాతో బ్రేకప్ అయిందంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ వారసురాలు సారా అలీఖాన్‌తో కలిసి శుబ్‌మన్ డిన్నర్‌కు వెళ్లినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడు సారా ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది. నిజమే చెప్తున్నా ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పంజాబీ చాట్ షోలో పాల్గొన్న గిల్‌కు ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అంటూ హోస్ట్ అతడిని ప్రశ్నించారు. సారా కా సారా సచ్ బోలో(సారా గురించి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నిజం చెప్పేయాలి) అనగా.. ఇందుకు బదులుగా.. ‘‘సారా కా సారా సచ్ బోల్ దియా (మొత్తం నిజం చెప్పేశాను) నేను డేటింగ్లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక బాలీవుడ్లో అత్యంత ఫిట్‌గా ఉంటే నటి ఎవరు అడగ్గా.. ‘‘సారా’’ అంటూ గిల్ బదులివ్వడం విశేషం. దీంతో గిల్- సారా ప్రేమ నిజమేనని ఈ యువ క్రికెటర్ కన్ఫామ్ చేసేశాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 12 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్.. 579 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 11 టెస్టులాడి 579 పరుగులు సాధించాడు. చదవండి: India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..? -
ఒకే హోటల్లో సారా, శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్టయిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న ఫొటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సారా, శుభ్‌మన్ ఒకే హోటల్ నుంచి బయటకు వచ్చారు, అలాగే ఇద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కారు. ఇప్పుడు చెప్పండి, వీరు లవ్‌లో ఉన్నారనడానికి ఈ సాక్ష్యం సరిపోదా? అంటున్నారు నెటిజన్లు. 'అయినా బాలీవుడ్, క్రికెట్‌ది విడదీయరాని బంధం..', 'వీళ్లు మళ్లీ కలిసి కనిపించారు, అంటే కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నమాటే', 'ఢిల్లీలో వీరు కలిసి కెఫెకు కూడా వెళ్లారు, నా స్నేహితుడు వీళ్లను చూశాడు', 'అరేయ్ బాబు.. నువ్వు ముందు నీ ఆట మీద ఫోకస్ చెయ్.. అప్పుడే నువ్వు ఇంకో విరాట్ అవగలుగుతావు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సారా మొదట్లో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌ను ప్రేమించగా వీరిద్దరూ 2020లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక శుభ్‌మన్ గిల్.. సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్తో లవ్‌లో పడగా వీరి ప్రేమాయణం ఎంతోకాలం సాగలేదని తెలుస్తోంది. Is that sara and shubman together again 👀😂😉#SaraAliKhan #ShubmanGill pic.twitter.com/c1XRGPUBH2 — diksha (@Dikshyaa_R) October 13, 2022 చదవండి: ఏం పీకలేనన్నారు, నేనేంటో చూపిస్తా వెండితెర ఎంట్రీ ఇస్తున్న వంటలక్క -
సారాతో అడ్డంగా దొరికిన శుబ్ మన్ గిల్
-
Shubman Gill: సారాతో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్ డిన్నర్.. ఫొటో వైరల్!
Shubman Gill- Sara Ali Khan: కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్. ఇటీవల జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే వన్డే సిరీస్‌లలో ఓపెనర్‌గా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడో వన్డే సందర్భంగా కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. జట్టును గెలిపించడంతో పాటుగా వ్యక్తిగతంగానూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక 22 ఏళ్ల గిల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సచిన్ తనయ సారా టెండుల్కర్తో డేటింగ్లో ఉన్నాడంటూ గతంలో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సారాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ సారాతో.. అయితే, కొన్నాళ్ల క్రితం.. దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేయడంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకొందంటూ గాసిప్ రాయుళ్లు మరోసారి తమ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. కెరీర్లో తొలి సెంచరీ చేయడం సహా.. సచిన్ రికార్డును గిల్ బద్దలు కొట్టిన తరుణంలో సారా నుంచి విషెస్ వస్తాయని ఊహించామని.. అయితే, విడిపోయిన కారణంగానే ఆమె.. గిల్ విజయంపై స్పందించలేదని మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని.. ఇక వీరిద్దరి ప్రేమకథకు ఎండ్‌కార్డ్ పడిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సారా పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో గిల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో శుబ్‌మన్ గిల్.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో దుబాయ్‌లోని రెస్టారెంట్లో డిన్నర్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. టిక్‌టాక్ యూజర్ వీడియోతో.. ఓ టిక్‌టాక్ యూజర్ బస్తియాన్లో సారా అలీ ఖాన్‌ను చూశానంటూ 12 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో సారాతో ఉన్నది గిల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ టీమిండియా బ్యాటర్ ఇప్పుడు 27 ఏళ్ల సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా ఏంటి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏంటో సారా అనే పేరు గల వాళ్లే గిల్‌కు ఎందుకు నచ్చుతారో అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత క్రికెట్ రంగానికి, బాలీవుడ్‌కి విడదీయరాని బంధం ఉందన్న విషయం తెలిసిందే. చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్ నటీమణులతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. మొదటితరం క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. షర్మిలా ఠాగూర్‌ను పెళ్లాడారు. ఆ దంపతులు కొడుకు సైఫ్ అలీఖాన్ కూతురే సారా. అమృతా సింగ్‌తో సైఫ్‌నకు కలిగిన మొదటి సంతానం. ఇక అమృతా సైతం.. సైఫ్ కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రితో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Shubman gill date sara ali khan ko kar eha tha aur hum kisi aur hi sara ko lapet rhe the🥲#Shubmangill #CricketTwitter pic.twitter.com/oEAAXqXgOz — Arun (@ArunTuThikHoGya) August 29, 2022 -
అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్
Sara Ali Khan Janhvi Kapoor Dating With Two Brothers: అత్యధిక ప్రజాధరణ పొందిన టాక్ షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షో 7వ సీజన్ ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో రణ్వీర్ సింగ్, అలియా భట్ అలరించగా.. రెండో ఎపిసోడ్లో బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ సందడి చేశారు. అయితే వీరిద్దరూ పార్టిస్పేట్ చేసిన ఎపిసోడ్ ఫుల్ వీడియో గురువారం (జులై 15)న రిలీజైంది. ఈ ఎపిసోడ్లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్ కరణ్ జోహార్. కాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో వీరిద్దరు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి విజయ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు తెలిపాడు కరణ్ జోహార్. దీనికి షాకైన ఈ ముద్దుగుమ్మలు 'ఇంత ఓపెన్‌గా షోలో చెప్పేస్తావా ?' అని అన్నారు. తర్వాత ఆ అన్నదమ్ములతో స్నేహం లాక్డౌన్ సమయంలో జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆ బ్రదర్స్ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని తెలిపారు. కరణ్ చేప్పిన మాటలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. View this post on Instagram A post shared by veersara (@veerandsara) సారా, జాన్వీతో డేటింగ్ చేసిన ఆ అదృష్టవంతులు వీరేనంటూ పలు రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వారు డేటింగ్ చేసిన బ్రదర్స్ వీర్ పహారియా, శిఖర్ పహారియా (వరుసగా సారా, జాన్వీ)గా తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా వారి ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ వీర్, శిఖర్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త జోరందుకుంది. కాగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షో ఏడో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. for everyone whose wondering which brother duo janhvi and sara dated, it’s these two brothers called veer (sara) and shikhar (janhvi) pahariya, both maternal grandsons of the former chief minister of maharashtra! THANK ME LATER #KoffeewithKaranSeason7 pic.twitter.com/X1dO9uxgyn — siddhi. 👼🏻 (@aphrcdeityy) July 14, 2022 Who are the brothers #JhanviKapoor and #SaraAliKhan dated? 👀🙄 #KoffeewithKaranSeason7 — Ana 🌻💛 (@AnaaaWalia) July 14, 2022 Who were the siblings whom #SaraAliKhan and #JanhviKapoor dated and who lives in Karan's building?#KoffeeWithKaran — Mayank (@sarcasm_taken) July 14, 2022 Saif Ali Khan's daughter Sara Ali Khan with her boyfriend Veer Pahariya. Aren't they luk'n cute 2gether? pic.twitter.com/wjDjsvSTfX — Music India (@MusicIndiaTV) May 6, 2016 Janhvi Kapoor: Jahnavi Kapoor was seen very close by X boyfriend in Lonavla! – actress janhvi kapoor cozy photo with rumored ex boyfriend shikhar pahariya is viral on internet https://t.co/i6sPccV35R pic.twitter.com/iAtWQ6MGVS — TEJAS D KULKARNI (@kultejas18) January 28, 2020 Is Saif Ali Khan’s beautiful daughter Sara Ali Khan dating Veer Pahariya, grandson of… https://t.co/9hF3zx5LaV pic.twitter.com/IX7cGpwWga — Saif Ali Khan Online (@SaifOnline) May 6, 2016 -
విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్ రియాక్షన్ చూశారా!
‘రౌడీ’ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. సారా కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ ఆసక్తిగా స్పందించాడు. ఈ మేరకు.. సారాతో పాటు జాన్వీ కపూర్‌కు సైతం గట్టి హగ్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేశాడు విజయ్. కాగా సారా అలీ ఖాన్, జాన్వి కపూర్లు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ మేరకు వారిద్దరు తాజా కాఫీ విత్ కరణ్ జోహార్ సీజన్-7లో సందడి చేశారు. ఈ వీకెండ్లో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను తాజాగా హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ‘నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అతను ఎవరు?’ అని ప్రశ్నిస్తాడు హోస్ట్ కరణ్. దీనికి సారా సిగ్గు పడుతూ విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇస్తుంది. ‘నువ్వు కూడా విజయ్‌తోనేనా!’ అని కరణ్ జాన్వీతో అంటాడు. ఆ వెంటనే సారా అలీ ఖాన్ స్పందిస్తూ ‘ఏంటీ నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా?’ అని జాన్విని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇలా సాంతంగా ఈ ప్రోమోను విజయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీనికి విజయ్ ‘నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా గట్టి హగ్, ప్రేమ పంపిస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా విజయ్ అంటే క్రష్ అని గతంలో పలుమార్లు సారా, జాన్వీలు తమ మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే. తనదైన నటన, మ్యానరిజంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్‌కు సైతం పరిచయం కాబోతున్నాడు. అక్కడ కూడా తనదైన సైల్తో విజయ్ బి-టౌన్ హీరోయిన్ల మనసును కొల్లగోడుతున్నాడు. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్న ముగ్గురు హీరోయిన్లు
‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ముగ్గురు హీరోయిన్లకు అతిథులుగా ఆహ్వానం అందిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గల్లీబాయ్’ వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (రాఖీ.. రాణీల ప్రేమకథ). కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే అతిథులుగా కనిపించనున్నారన్నది బీ టౌన్ టాక్. అంతేకాదు.. కొన్ని సీన్స్‌లో కూడా వీరు ఉంటారట. కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’లో జాన్వీ, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అనన్యా పాండే, ‘సింబ’ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్లుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. సో.. కరణ్ రిక్వెస్ట్ మేరకు ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో జాన్వీ, సారా, అనన్యలు అతిథులుగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం. -
ఐఫా గ్రీన్ కార్పెట్‌పై బాలీవుడ్ తారల తళుకులు (ఫొటోలు)
-
దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ సారా అలీ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి నటించిన చిత్రం 'ఆత్రంగి రే'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో ప్రముఖ హిందీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో సందడి చేశారు అక్కీ, సారా. సినిమా చిత్రీకరణలో జరిగిన చిలిపి సన్నివేశాలు, సందడి గురించి ముచ్చటించారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తనదైన రీతిలో అడిగి ఆకట్టుకున్నాడు కపిల్ శర్మ. అయితే ఈ క్రమంలో అక్షయ్ తనపై ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడో చెప్పుకొచ్చింది సారా. నేను ఏం ట్రిక్ ప్లే చేశాను అని అక్షయ్ అడగ్గా.. సర్ మీరు నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు. అది కూడా దేవుడి ప్రసాదం (నైవేద్యం) అని చెప్పారు మీరు. 'ఇదిగో బేటా ఇది దేవుడి ప్రసాదం' అని అన్నారు. అది కొంచెం వండిన వెల్లుల్లి కూడా కాదు. పచ్చి వెల్లికాయ.' అని తెలిపింది సారా. దీనికి 'అది నిన్ను బాధపెట్టిందా' అని అక్షయ్ అడిగితే 'అవును నాకు కొంచెం ఆనారోగ్యంగా అనిపించింది.' అని చెప్పింది సారా. ఈ మాటతో 'నువ్ తిన్నట్లు నీ కెరీర్‌పై ప్రమాణం చేసి చెప్పు' అని అడగ్గా 'నేను దాన్ని తింటే కచ్చితంగా అనారోగ్యంగా అనిపించేది' అని బదులిచ్చింది సారా అలీ ఖాన్. దీంతో ఒక్కసారిగా షోలో నవ్వులు చిందాయి. ఇదీ చదవండి: సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్ -
కాబోయే భర్తపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇల్లరికం వస్తేనే పెళ్లి
Sara Ali Khan Said About Her Future Husband Where He Will Live: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కేదరినాథ్'తో హీరోయిన్గా తెరంగ్రేటం చేసిన సారా 'లవ్ ఆజ్కల్', 'కూలీ నం 1'లో నటించింది. ఇటీవల విడుదలైన 'ఆత్రంగి రే' సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ఇద్దరికీ చాలా సన్నిహితంగా ఉంటుంది. తన తల్లి పెంపకానికి ఎంతగానో అలవాటు పడింది సారా. అయితే ఇటీవల ఆత్రంగి రే సక్సేస్ మీట్లో పాల్గొన్న సారాకు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది సారా అలీ ఖాన్. 'నాకు మా అమ్మే సర్వస్వం. ఆమెతో ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నా తల్లి సహాయం లేకుండా మ్యాచింగ్ బ్యాంగిల్స్, దుస్తులను వేసుకోలేను. ఇలా ఇంటర్వ్యూలకు సైతం అటెండ్ కాలేను. నేను ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చేది మా అమ్మ దగ్గరికే. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆమె చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తాను ఎప్పుడూ అలాగే ఉంటుందని భావిస్తున్నా. నా తండ్రి బలమైన, అధునాతన మనిషి. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుంటే నేను మా అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే వివాహం చేసుకుంటాను (ఇల్లరికం). నేను ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.' అని సారా తెలిపింది. ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
'నా నంబర్ ప్లేట్ ఎలా వాడతారు?' హీరో విక్కీ కౌశల్‌పై ఫిర్యాదు
యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. కారణం.. విక్కీ నడుపుతున్న బైక్ నంబర్ ప్లేట్ తనదే కావడంతో చిత్రయూనిట్‌పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్ ప్లేట్ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఆ బైక్ సీన్లో వాడిన నంబర్ ప్లేట్ నాది. ఈ విషయం సదరు చిత్రయూనిట్‌కు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నా అనుమతి తీసుకోకుండా అలా నంబర్ ప్లేట్ వాడుకోవడం మాత్రం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు' అని యాదవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో చూడాలి! -
గతంలో చాలా తప్పులు చేశాను, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి: స్టార్ హీరోయిన్
Sara Ali Khan Opens Up On Her Mistake And Social Media Trolls: గతంలో తాను తప్పులు చేశానని, కానీ వాటి గుణపాఠాలు నేర్చుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టిన సారా ఆ తర్వాత తనదైన నటన, అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘కేదార్నాథ్’, ‘సింబా’, ‘లవ్ ఆజ్కల్2’, ‘కూలీ నం.1’ చిత్రాలతో మెప్పించిన సారా ప్రస్తుతం ‘అత్రంగి రే’ అనే సినిమాలో నటిస్తోంది. చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ ఇందులో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌లు హీరోలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ‘జీ5’లో స్ట్రీమింగ్ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సారా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను నా మూడ్స్‌ని చూపించడానికి సోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్, ట్విటర్) ఉపయోగిస్తాను. చదవండి: కత్రినాపై విక్కీ కౌశల్ కజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు అంతేకానీ వాటికి నా మూడ్స్‌ని నియంత్రించే అవకాశం ఇవ్వను. నచ్చితే పోస్ట్ పెడతాను. లేకుంటే లేదు. సామాజిక మాధ్యమాల్లో నాపై వచ్చే నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. నేను నిజాయతీగా ఉండాలనుకుంటాను. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. గతంలో నేను చాలా తప్పులు చేశాను. కొన్ని పబ్లిక్‌గా కూడా జరిగాయి. కానీ అవేవి నన్ను పెద్దగా బాధించలేదు. ఎందుకంటే ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాను’ అంటూ సారా చెప్పుకొచ్చింది. -
ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్
Sara Ali Khan Hot Comments On Telugu Hero: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ టాలీవుడ్‌కు చెందిన ఓ క్రేజీ హీరో విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా సారా తాజాగా నటించిన చిత్రం అటట్రాంగి రే చిత్రం డిసెంబర్ 24న ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సారా ఇటీవల ఓ ఇంటరర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను దక్షిణాదిలో ఏ హీరో చేయాలని ఉందని అడగ్గా వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది సారా. చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్ అంతేకాదు విజయ్ దేవరకొండ చాలా చాలా హాట్‌గా ఉంటాడంటూ తన మనసులో మాట బయటపెట్టింది ఈ పటౌడి వారసురాలు. కాగా లైగర్ మూవీ నిర్మాణంలో భాగంగా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో విజయ్-సారాలు కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ క్లోజ్‌గా దిగిన సెల్ఫీని సారా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ నేరుగా హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయిన పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రంతో బి-టౌన్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చదవండి: ఆ షాట్‌తో చరణ్, తారక్‌ల బాండింగ్ అర్థమైంది: రాజమౌళి లైగర్ చిత్రాన్ని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరణ జరుపుకోవడం బాలీవుడ్ నిర్మాత ఈ సినిమాలో భాగవడంతో విజయ్‌కు బి-టౌన్ సెలబ్రెటీలతో పరిచయం ఏర్పడింది. దీంతో అక్కడి వారికి ప్రస్తుతం విజయ్ బాగా సుపరిచితడయ్యాడు. -
శ్రేయా ఘోషల్‌కు క్షమాపణలు చెప్పిన టాప్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్‌సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్‌కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్‌గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. చదవండి: ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ -
ఇలా ప్రవర్తించవద్దు.. క్షమాపణలు చెప్పిన హీరోయిన్.. వీడియో వైరల్
Sara Ali Khan Apologizes For Pushing A Photographer: సినిమా వాళ్లు కనపడితే అభిమానులు, మీడియా, ఫొటోగ్రాఫర్లు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోతారు. ఫ్యాన్స్ అని చూడకుండా వారిపై అరుస్తారు, తిడతారు, కొడతారు కూడా. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన మృదువు స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోమవారం జరిగిన ఒక ఈవెంట్లో నెట్టివేయబడిన ఒకరి కోసం నిలబడింది సారా. సారా అలీ ఖాన్ రాబోయే చిత్రం 'ఆత్రంగి రే'లోని చక్ చక్ పాటను లాంచ్ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఫెస్ట్ 'క్షితిజ్'కు హాజరయింది. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది చూసిన సారా, కారు ఆపి 'ఎవరిని కిందకు తోసారు' అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది. దానికి వారు 'ఎవరూ కింద పడలేదు' అని సమాధానం ఇచ్చారు. దానికి 'లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అప్పటికే వెళ్లిపోయాడు.' అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో 'సారీ చెప్తున్నా, థ్యాంక్యూ' అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో 'ఇలా ప్రవర్తించవద్దు. ఎవరినీ నెట్టవద్దు.' అని స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆత్రంగి రే' చిత్రంలోని ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ 'చక్ చక్'ని విడుదల చేశారు మేకర్స్. ఉల్లాసభరితమైన ఈ పాటలో సారా నియాన్ గ్రీన్, పింక్ చీర ధరించి బీట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సౌత్ ఇండియన్ స్టైల్ సెలబ్రేషన్ ఈవెంట్లో సెట్ చేసిన ఈ పాటలో ధనుష్ నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది చదవండి: బాలీవుడ్ బ్యూటీకి ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్.. ఎంత క్యూట్‌గా నవ్విందో.. వీడియో వైరల్ -
హీరోహీరోయిన్లకు మధ్య 28 ఏళ్ల వ్యత్యాసం! స్పందించిన డైరెక్టర్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ ధనుష్, అందాల తార సారా అలీఖాన్ కలిసి నటించిన చిత్రం ఆత్రంగి రే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజవగా నటీనటుల వయసు తేడాపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి 2018లో సారా ఇండస్ట్రీలో అడుగుపెట్టేనాటికి ఆమె వయసు 26. ధనుష్ 2002లో నటనారంగంలో ఎంట్రీ ఇచ్చే సమయానికి అతడి వయసు 38 ఏళ్లు. 1991లో కెరీర్ ఆరంభించిన అక్షయ్ కుమార్ ఈ సెప్టెంబర్‌లో 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. తనకంటే 25-28 ఏళ్ల వ్యత్యాసం ఉన్న హీరోల సరసన సారా నటించడంపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. తాజాగా దీనిపై ఆత్రంగి రే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ స్పందించాడు. 'ఆత్రంగి అంటే విచిత్రం అని అర్థం. సినిమా తీయడంలో దర్శకుడు ఎంత ఓపికగా ఉంటాడో, ఆ నటీనటులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారని ఫిల్మ్ మేకర్ భావిస్తాడు. మనుషులను అంచనా వేయడం మనకు అలవాటు. ప్రజలు రెండు గంటలపాటు సినిమా చూసి ఆ తర్వాత స్పందించాలని కోరుకుంటున్నాను 'అని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్లు చూసి బాధపడటం లేదన్న ఆనంద్ తన జయాపజాయల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానని పేర్కొన్నాడు. కాగా ఆనంద్ తను వెడ్స్ మను: రిటర్న్స్, రంజానా వంటి హిట్ చిత్రాలను అందించాడు. షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి తీసిన జీరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆత్రంగి రే సినిమా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజవుతోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
'ఆత్రంగి రే' ట్రైలర్ వచ్చేసింది.. సినిమా విడుదల ?
Atrangi Re Movie Trailer Out And Releasing On December: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, తమిళ స్టార్ ధనుష్‌లు కలిసి నటించిన హిందీ చిత్రం ఆత్రంగి రే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇవాళ (నవంబర్ 24) విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాగా అనుభూతి కలుగుతుంది. ఇందులో సారా అలీ ఖాన్, ధనుష్ ఒకరికొకరు బలవంతంగా పెళ్లి చేసుకునే పాత్రలో అలరించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కీ తనకంటే పెద్దవయసు పాత్రలో కనిపించనున్నారు. అలాగే ట్రైలర్లో అక్షయ్ ఎంట్రీ విజిల్స్ వేసేలా ఉంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) 'ఆత్రంగి రే' చిత్రంలో సారా అలీ ఖాన్ ప్రేమలో రెండు భిన్నమైన అభిరుచులను కలిగి ఉన్న పాత్ర చేసింది. ధనుష్, సారాల యాస, నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను సారా అలీ ఖాన్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆత్రంగి రే ట్రైలర్ వచ్చేసింది. 'ఈ అద్భుత క్షణాలను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. మీ అందరికీ నా రింకు పాత్రను పరిచయం చేస్తున్నాను' అని రాసుకొచ్చింది. నవంబర్ 23న అక్షయ్, సారా, ధనుష్ పాత్రల ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'ఆత్రంగి రే' విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
అభిమాని నుంచి సమోసా పావ్ తీసుకున్న బ్యూటీ.. ఎంత క్యూట్‌గా నవ్విందో
Sara Ali Khan Took Samosa From Her Fan: బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్(Sara Ali Khan) తరచుగా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ముంబైలో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో తన అభిమాని నుంచి ఆమెకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా పావ్‌ను తీసుకుంటున్నట్టు కనిపించింది. సమోసా తీసుకొని, క్యూట్‌గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పిందీ కూలీ నెం 1 హీరోయిన్. వీడియోలో సారా వెంట హీరో విక్కీ కౌషల్ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల కేదార్నాథ్ సందర్శన కోసం వెళ్లిన సారా అలీ ఖాన్ ట్రోల్‌కు గురైంది. ఈ నెలలో తన తల్లిదండ్రుల డైవర్స్ గురించి కూడా మాట్లాడింది సారా. ఓ ఇంటర్వ్యూలో మీ తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కష్టంగా ఉందా అని అడిగిన హోస్ట్ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. ' నా వయసులో ఇతరుల కంటే కొంచెం ఎక్కువ పరిపక్వం చెందే ధోరణి నాకు ఎప్పుడూ ఉంటుంది. తొమ్మిదేళ్ల వయసులో కూడా అలాగే ఉన్నాను. మా ఇంట్లో కలిసి జీవించే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా లేరని అనిపించింది. తర్వాత వారు రెండు వేర్వేరు కొత్త ఇళ్లల్లో సంతోషంగా గడపడం చూశాను. పదేళ్లలో ఒక్కసారైన మా అమ్మ నవ్విందని నేను అనుకోను, అలాంటింది అకస్మాత్తుగా సంతోషంగా ఉంది. అలా ఇద్దరు వేర్వేరు ఇళ్లల్లో సంతోషంగా ఉంటారంటే నేను ఎందుకు సంతోషంగా ఉండను'. సారా అలీ ఖాన్ చివరిసారిగా వరుణ్ ధావన్ నటించిన కూలీ నెం 1లో నటించింది. ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం 'ఆత్రంగి రే'లో అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి యాక్ట్ చేయనుంది. -
వైరల్: బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ.. ఎంజాయ్ చేసిన సారా
ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. మరొకరు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. స్టార్ వారసురాళ్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీస్ అనంతరం తమ అందచందాలతో పాటు నటనతోనూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టారు. ఈ అందగత్తెలు తాజాగా బెల్లీ డాన్స్ వేసి మరోసారి అందరి మనసులను దొచుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, సల్మాన్ ఖాన్ బాటలో పయనిస్తూ రణ్‌వీర్‌సింగ్ ‘ది బిగ్ పిక్చర్’ అనే షోకి హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో కలర్స్ టీవీలో ప్రసారమవుతోంది. తాజాగా జాన్వీ, సారా గెస్ట్స్‌గా వచ్చిన ఎపిసోడ్ ప్రొమోని సోషల్ మీడియాలో షేర్ చేసింది టీవీ మేనేజ్మెంట్. అందులో జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్ నేర్చుకుందని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని అడిగాడు రణ్వీర్. తన నడుమును వయ్యారంగా ఊపుతూ వారికి చూపించింది ఈ బ్యూటీ. పక్కనే ఉన్న సారా ఆమెను ఉత్సాహపరుస్తూనే తను సైతం బెల్లీ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఇద్దరూ అందాల భామలు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
యువరాణులు అంటే ఇలా ఉంటారన్న సారా, పట్టరాని సంతోషంలో కృతీ
జాన్వి కపూర్‌తో ఫొటో షేర్ చేసిన సారా అలీ ఖాన్, యువరాణుల ఒకరి అంటే ఇలా ఉంటారంటున్న సారా హాలీడే రోజు ఇది నా విందు అంటూ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోను పంచుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం సితాకోక చిలుకలా ఎగురుతున్నంత ఆనందంలో ఉన్నానంటున్న కృతీ సనన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ravi Babu (@ravibabuofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by MONALISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
శారీలో సారా అలీ ఖాన్
-
టెన్షన్ పడుతున్న అరియాన, తగ్గేదే లే అంటున్న శేఖర్ మాస్టర్!
► బిగ్‌బాస్ బజ్‌లో టెన్షన్ పడుతున్న అరియాన గ్లోరీ, తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్‌తో మాజీ కంటెస్టెంట్ చిట్‌చాట్ ► హోయలు పోతున్న బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ► బ్లాక్ డ్రెస్‌లో రష్మి ఫొటోషూట్, ఫిదా చేస్తున్నా యాంకర్మ ► చీరకట్టులో యాంకర్ వర్షిణీ ► అల్లు అర్జున్‌తో శేఖర్ మాస్టర్, తగ్గేదే లే అంటున్న ఈ టాప్ కొరియోగ్రాఫర్ ► రోమియో.. జూలియట్ అంటూ ప్రేమకథలు చెబుతున్న ఊర్వశి రౌతెల View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
సోషల్ హల్చల్: బాధను ఇలా దాచమంటున్న మోనాల్, కింగ్-కాంగ్‌తో ధనుష్
► కింగ్-కాంగ్‌కు గ్రాండ్ వెల్కమ్ అంటూ ఇంటికి ఆహ్వానించిన హీరో ధనుష్ ► అప్పట్లో ఇనోసెంట్ని అంటూ చీరకట్టు ఫొటోలు షేర్ చేసి అనన్య ► బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలు పోతున్నా ఐశ్వర్య రాజేష్ ► నవ్వుతో బాధను ఇలా కప్పేయమంటున్న బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ► ఫ్యాన్స్‌ను షూక్రియా అంటూ పలకరించిన భూమిక ► కూతురికి నటుడు ఆలీ బర్త్‌డే విషెస్ View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) View this post on Instagram A post shared by Ali (@ali_the_actor) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
జెహ్ ఫొటో షేర్ చేసిన సారా, కరీనా షాక్
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ల రెండవ కుమారుడు జెహ్ ఫొటో బయటకు వచ్చింది. ఫిబ్రవరిలో జెహ్‌కు జన్మనించిన కరీనా ఇప్పటి వరకు అతడిని ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేయలేదు. జెహ్ ఫొటోలు షేర్ చేసినప్పటికీ అందులో అతడి మొహం కనిపించకుండా జగ్రత్త పడింది. అయితే నిన్న(సోమవారం) సైఫ్ బర్త్‌డే సందర్భంగా ఈ కపుల్స్ మాల్దీవులు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బర్త్‌డే వేడుక సంబరాల్లో మునిగి తెలుతున్న కరీనా ఫ్యామిలీకి సారా అలీ ఖాన్ షాక్ ఇచ్చింది. తండ్రికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపే క్రమంలో సారా కరీనా రెండవ కుమారుడు జెహ్ ఫొటోను రివీల్ చేసింది. సైఫ్, కరీనాలతో తన పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తండ్రికి బర్త్‌డే విషెష్ తెలిపింది. ఇందులో జెహ్ను కరీనా ఎత్తుకుని ఉండగా.. సారా అతడితో ఆడుతూ కనిపించింది. వారి వెనకాలే సైఫ్ నిలబడి ఉన్నాడు. అయితే జెహ్ మొహం ఈ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన నెటిజన్లు ‘జెహ్ అచ్చం తైమూర్‌లాగే ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే అబ్బా.. మీరు నా సూపర్ హీరో, మంచి స్నేహితుడు కూడా. ఎల్లప్పుడు నాకు సపోర్టుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. కరీనా కపూర్ కూడా సైఫ్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపింది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సైఫ్-కరీనా జంటకు ప్రస్తుతం 4 ఏళ్ల కుమారుడు తైమూర్ కాగా ఇటీవల రెండవ కుమారుడు జన్మించాడు. అయితే సారా సైఫ్ అలీఖాన్‌కు మొదటి భార్య అమృత సింగ్‌ల సంతానం. అలాగే వీరికి కుమారుడు ఇబ్రహ్మీం అలీ ఖాన్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
హల్చల్ : పర్ఫెక్ట్ కాదంటున్న అనసూయ.. ఫేవరేట్ అంటున్న సురభి
♦ మహారాష్ట్ర ట్రెడిషనల్ లుక్‌లో సదా ♦ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సారా అలీ ఖాన్ ♦ హిమాచల్ అందాలను ఆస్వాదిస్తున్న అనితా రెడ్డి ♦ మంచు మోహన్ బాబు వివాహ వార్షికోత్సవం ♦ పెటల్ పింక్ కలర్ శారీలో శ్రద్ధాదాస్ ♦ ఎక్కడి నుంచైనా సంతోషాన్ని వెతుక్కోవచ్చంటున్న సోనమ్ ♦ తాను పర్ఫెక్ట్ కాదంటున్న అనసూయ ♦ బ్లాక్ కలర్ చీరలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ♦ ఫేవరేట్ మార్నింగ్స్ అంటున్న సురభి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో స్టార్ హీరో కూతురు!
'కేదార్నాథ్' సినిమాతో వెండితెరపై కెరీర్‌ను ఆరంభించింది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో సుశాంత్, సారా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తర్వాత ఆమె యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమాయణం జరుపుతున్నట్లు టాక్ నడిచింది. వీళ్లిద్దరిదీ విడదీయరాని అనుబంధం అంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే తాజాగా సారా మరో వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 'కేదార్నాథ్' అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో ఆమె ప్రేమలో పడిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలన్నా చేకూరుస్తూ.. సముద్ర తీరాన జెహన్ హండాతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సారా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా "లవ్ యూ.. నన్ను మళ్లీ అక్కడకు తీసుకెళ్లిపో" అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో వీళ్లిద్దరూ నారింజ రంగు దుస్తులను ధరించగా సారా అతడిపై వాలిపోవడం చూడొచ్చు. ఇదిలా వుంటే గతేడాది జెహన్.. సారా పుట్టినరోజు చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. 'మన స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలను మార్చడం ఎవరి తరమూ కాదు, నేనెప్పటికీ నీతో ఉంటానని మాటిస్తున్నా'నని చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ స్టార్ కిడ్ ఎవరో గుర్తు పట్టారా? -
ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
లాక్డౌన్లో సెలబ్రెటీలు తమకు సంబంధించిన జ్ఞాపకాలను, వారి చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరోహీరోయిన్ల చిన్న ఫొటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్హీరో సైఫ్ అలీ ఖాన్ సోదరి సబా అలీ ఖాన్ గత కొద్ది రోజులు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పాత ఫొటోలను షేర్ చేస్తూ వారితో తనకున్న అనుభూతిని పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన మేనకోడలు, సైఫ్ ముద్దుల తనయ, నటి సారా అలీ ఖాన్ చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేశారు. క్యూట్ నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిన సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ హల్ చల్ చేస్తుంది. దీనికి సబా ‘నేను సారాతో నవ్వమని చెప్పాను. కానీ తను ఇది బెటర్ అని నిర్ణయించుకుంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. అంతేగాక సారా ఇలా తన అల్లరితో ఎప్పుడు నవ్విస్తుందంటూ మనకోడలిపై ప్రేమను కురిపించారు ఆమె. అలాగే ఇదే ఫొటోను సారా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్ చేశారు. కాగా సారా చిన్ననాటి ఫొటీ చూసి ఆమె అభిమానులు, ఫాలోవర్స్ మురిసిపోతున్నారు. సారా ఫొటో షేర్ చేసినందుకు సబాకు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) చదవండి: ఓటీటీ: ఈ వారం కొత్త సరుకు, ఓ లుక్కేయండి -
హల్చల్ : మసాజ్‌తో సారా..చీరలో దీప్తి సునయన..రీల్స్‌తో వర్షిణి
♦ రాజీ స్కెచ్‌లో సమంత ♦ చీరకట్టులో మెరిసిపోతున్న దీప్తి సునయన ♦ నీకు నేనున్నానని ధైర్యం చెప్తున్న కౌశల్ ♦ బుక్ రీడింగ్‌లో మునిగిపోయిన తాప్సీ ♦ రీల్స్‌తో అలా సరదాగా అంటున్న వర్షిని ♦ గుర్రపు స్వారీ చేస్తోన్న అభిజీత్ ♦ అమ్మతో ఆయిల్ మసాజ్ అంటోన్న సారా అలీఖాన్ ♦ నిన్నే చూస్తానంటున్న అషూ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సోషల్ హల్చల్ : ఆర్జీవీతో అరియానా జిమ్.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ
మొదటి స్టెప్ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. పెంచ్ మెమోరీస్ అంటూ హాట్ ఫోటోని షేర్ చేసింది శ్రీముఖి ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్‌ని షేర్ చేసింది లక్ష్మీరాయ్ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకుంటి బిగ్‌బాస్ బ్యూటీ అరియానా మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
చిట్టి గౌనులో సారా, చీరలో విద్యా..మత్తెక్కిస్తున్న ఈషా
చిట్టి గౌనులో అదరగొట్టిన సారా అలీఖాన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బా ఇంట్లో దోశలు వేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది శ్రుతి హాసన్ బ్లాక్ సారీలో దర్శనమించి ఆకట్టుకుంటున్న విద్యాబాలన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
మ్యాజిక్ చూపిస్తానంటున్న అక్షయ్
‘అత్రంగీ రే’ సినిమాలో తన మ్యాజిక్ ఏంటో చూపిస్తానంటున్నారు హీరో అక్షయ్‌కుమార్. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రధారులు. శనివారంతో ఈ సినిమా షూటింగ్‌కు బైబై చెప్పారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ–‘‘అత్రంగీ రే’ సినిమా సెట్లో నాకు శనివారమే ఆఖరు రోజు. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను మీరు (ఆడియన్స్) చూస్తారు. ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్‌లో భాగమైన ధనుష్, సారా అలీఖాన్‌లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు అక్షయ్‌కుమార్. ఈ ఏడాది ఆగస్టు 6న ఈ సినిమా విడుదల కానుంది. -
బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీ మూడ్‌లో లైగర్: వైరల్ పిక్స్
సాక్షి, ముంబై: తన అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ తో షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పార్టీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో మకాం వేసిన లైగర్ టీం, అర్జున్‌రెడ్డి బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి లీజర్ టైంలో పార్టీ చేసుకుంటోంది. షూటింగ్ విరామంలో రౌడీతోపాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ తెరకెక్కించే లైగర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫైల్ ఫోటో) -
అది విజయ్ క్రేజ్.. మరో బాలీవుడ్ భామతో రొమాన్స్
హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయిన తెలుగు ‘అర్జున్ రెడ్డి’ మూవీ బీ-టౌన్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి వరకు సక్సెస్ లేక మొహం వాచి ఉన్న హీరో షాహిద్ కపూర్‌కు ఈ మూవీ మంచి విజయాన్ని అందించింది. అలాగే తెలుగు ‘అర్జున్ రెడ్డి మూవీ’లో హీరో నటించిన విజయ్ దేవరకొండకు కూడా ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్ నేషనల్ హీరోగా మారాడు. హిందీలో కూడా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కావడంతో విజయ్ పేరు బాలీవుడ్లో మారుమ్రోగుతోంది. దీంతో ఈ ‘రౌడీ’ హీరోగా మాస్ దర్శకుడు పూరి జగన్నాద్ ‘లైగర్’ పేరుతో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు పలు బాషల్లో విడుదల కానుంది. ఇందులో విజయ్ సరసన ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజా టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ తన తదుపరి చిత్రంలో మరో బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్‌తో రొమాన్స్ చేయనున్నట్లు ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో విజయ్ సరసన నటించేందుకు సారా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ముంబైలో కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో విజయ్ పాల్గొన్నారు. ఈ పార్టీలో విజయ్‌తో కలిసి సారా సందడి చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ దిగిన ఫొటోను సారా షేర్ చేస్తూ వారిద్దరూ మంచి స్నేహితులు అయినట్లు పేర్కొంది. అంతేగాక విజయ్‌కి తను పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పింది. చదవండి: విజయ్‌తో సారా అలీఖాన్ సెల్ఫీ.. ఫొటో వైరల్ బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ! అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా -
సోషల్ హల్చల్: వేడెక్కిస్తున్న సారా, కాలం ఆగిపోవాలంటున్న రాశీ
► ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ► బీచ్ తీరాన వేడివేడిగా విటమిన్ సీ తీసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ► మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూడకపోవడం వెనక ఓ కారణం ఉంది అని చెబుతున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ► మీ పరిధిని విస్తరించండి అంటూ భరత నాట్య భంగిమను షేర్ చేసిన సీనియర్ నటి శోభన. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ!
గీతా గోవిందంలో ఏమీ తెలియని అమాయకుడిలా, అర్జున్ రెడ్డిలో అందరినీ ఎదిరించే రౌడీలా నటించడం ఒక్క విజయ్ దేవరకొండకే చెల్లింది. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసే విజయ్ ప్రస్తుతం "లైగర్: సాలా క్రాస్ బ్రీడ్" సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారిగా బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా పని చేస్తున్నాడు. ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో చిత్రయూనిట్ ఫిబ్రవరి నెలారంబంలోనే ముంబైకి మకాం మార్చింది. ఈ క్రమంలో తరచూ అక్కడి బీటౌన్ సెలబ్రిటీలను కలుస్తూ, హడావుడి చేస్తూ బాలీవుడ్ టీమ్‌గా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నటి, నిర్మాత ఛార్మీకౌర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో లైగర్ టీమ్ పార్టీ చేసుకున్న ఫొటోలను ఛార్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'ఈ పార్టీని ఏర్పాటు చేసిన మనీష్‌కు కృతజ్ఞతలు. పార్టీ చాలా సంతోషంగా గడిచింది. అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ పీపుల్' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ పార్టీలో చార్మీ, విజయ్ దేవరకొండతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వాణీ, సారా అలీఖాన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, నిర్మాత కరణ్ జోహార్ పాల్గొనడం విశేషం. దీంతో ఈ బాలీవుడ్ పార్టీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇటేవలే కరణ్ నివాసంలో జరిగిన పార్టీకి సైతం విజయ్‌కు ఆహ్వానం అందగా అక్కడి స్టార్ నటులు దీపికా పదుకొనె, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ సహా తదితరులతో కలిసి పార్టీని ఎంజాయ్ చేశాడు. ఇక లైగర్ సినిమా విషయానికొస్తే ఇందులో అనన్య పాండే కథానాయికగా కనిపించనుండగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) చదవండి: ఫ్యాన్ మూమెంట్: విజయ్‌తో సారా సెల్పీ భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక -
విజయ్‌తో సారా అలీఖాన్ సెల్ఫీ.. ఫొటో వైరల్
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా ఎంతోమంతి ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌తో ఈ ‘రౌడీ’ స్టార్‌కు బాలీవుడ్లో కూడా అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ భామలు సైతం అతడికి అభిమానులు అయిపోయారు. ఇందుకు ఈ తాజా సంఘటనే ఉదాహరణ. గతవారం ముంబై వెళ్లిన విజయ్ అక్కడ ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ పార్టీకి బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ కూడా వచ్చింది. ఈ క్రమంలో అక్కడ విజయ్‌తో ఆమె తీసుకున్న సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనికి ‘ఫ్యాన్ మూమెంట్’ అంటూ విజయ్ను ట్యాగ్ చేసింది. దీంతో ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇక అది చూసిన విజయ్ అభిమానులంత మురిసిపోతున్నారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 13న) కరణ్ నివాసంలో నిర్వహించిన పార్టీకి విజయ్‌ని ఆహ్వానించాడు. ఈ పార్టీలో విజయ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ నటీనటులు దీపికా పదుకొనె, ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేదీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. చదవండి: రౌడీ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్..‘లైగర్’వచ్చేస్తున్నాడు ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ రిపీట్? అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా -
అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా
ముంబై: వరుణ్ ధావన్ వల్ల తాను తిట్లు తినాల్సి వచ్చిందన్నారు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్. అతడు చేసిన ఆలస్యం కారణంగా డైరెక్టర్ తనపై అరిచారని చెప్పుకొచ్చారు. కాగా కూలీ నెం.1 సినిమాలో సారా- వరుణ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 1995లో విడుదలైన కూలీ నెం. 1 రీమేక్ ఇది. మాతృకకు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.టీజర్లు, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సారా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. ‘‘మైతో రాస్తే సే పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో డేవిడ్ సర్‌కు చాలా కోపం వచ్చింది. నాపై గట్టిగా అరిచేశారు. నిజానికి నేను షూట్‌కు సిద్ధంగానే ఉన్నాను. డిజైనర్, కాస్ట్యూమ్ సరిచేస్తున్నారు. కానీ అప్పటికి వరుణ్ ఇంకా తన వ్యాన్లోనే ఉన్నాడు. దీంతో డేవిడ్ సర్ అప్సెట్ అయ్యారు. మీ వల్లే షూట్ ఆలస్యం అవుతోంది అంటూ చివాట్లు పెట్టారు. వరుణ్‌పై కోపం నాపై చూపించారనిపించింది. అయితే ఆ తర్వాత అంతా సద్దుమణిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?) తండ్రీకొడుకుల మధ్య విభేదాలు! కాగా సినిమా విడుదల విషయంలో తండ్రీకొడుకులైన డేవిడ్, వరుణ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొన్నిరోజులుగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఓటీటీలో కూలీ నెం.1 రిలీజ్ చేయాలని డేవిడ్ భావించగా, తాను ఓటీటీ యాక్టర్ అని పిలుపించుకునేందుకు సిద్ధంగా లేనని, థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని వరుణ్ పట్టుబట్టినట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే సీనియర్ డైరెక్టర్ అయిన డేవిడ్ మాటను ఆయన కుమారుడు వినక తప్పలేదని, దీంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలవుతోందని వారి సన్నిహితులు పేర్కొన్నారు. -
జెట్ స్పీడ్
ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ నార్త్ ఇండియాలో జరుగుతోంది. ధనుష్, సారా అలీ ఖాన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో ఈ సినిమాలో ధనుష్ పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. లాక్డౌన్ తర్వాతే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు ధనుష్. అప్పుడే జెట్‌స్పీడ్‌లో తన పాత్రని పూర్తి చేస్తున్నారాయన. ఈ సినిమాలో ధనుష్ ఓ పాట కూడా పాడటం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
‘కూలీ నెం 1’ ట్రైలర్ విడుదల
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘కూలీ నెం 1’ ట్రైలర్ వచ్చేసింది. ఆద్యంతం నవ్వులూ పూయిస్తూ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వరుణ్ సరసన సారా అలీఖాన్ నటించింది. ఎప్పుడు వస్తుంది ఈ నవ్వులు పండించే ట్రైన్ అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా అభిమానులు ముందుకు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కూలీ నెం 1 డేవిడ్ ధావన్‌కి 45వ చిత్రం. 1995లో విడుదలైన కూలీ నెం 1 చిత్రాన్ని, ఇప్పుడు అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వాసు భగ్నానీ ఉన్నారు. వరుణ్ ధావన్‌కు 'సూయిధాగ్' వంటి హిట్ తర్వాత ఆ స్థాయిలో హిట్ రాలేదు. 'కళంక్', 'స్ట్రీట్డాన్సర్' సినిమాలు అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయాయి. కూలీ నెం 1తో అయినా హిట్ దక్కుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్మెహతా తెరకెక్కిస్తున్న 'జుగ్ జుగ్ జియో' (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్లో వరుణ్ ధావన్ బిజీగా ఉన్నాడు. ఇందులో కియారా అడ్వాణీ జోడీగా నటించనుంది. ఆ తర్వాత అమర్‌కౌశిక్ రూపొందిస్తున్న హారర్ కామెడీ సినిమా 'భేదియా', సాజిద్ నదియావాలా తీస్తున్న యాక్షన్ చిత్రం 'సంకి'.. షూటింగ్‌ల్లో పాల్గొననున్నాడు వరుణ్. -
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంతమందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకొని వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. విచారణలో రియా వెల్లడించిన కొన్ని విషయాల ఆధారంగా కొంతమంది హీరోయిన్లు రకుల్, దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ వంటివారికి ఎన్సీబీ బృందం విడివిడిగా విచారించడం మొదలుపెట్టింది. అయితే వీరిని విచారించిన అనంతరం బాలీవుడ్ భామలకు ఊరట లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లకు ఎన్సీబీ దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని ఎన్సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2017 వాట్సప్ చాట్‌లో దీపికా, ఆమె మేనేజర్ వాల్, మాల్, వీడ్, హాష్, డూంబ్ అనే పదాలను ఉపయోగించారని ఎన్సీబీ విచారణలో వెల్లడయ్యింది. అయితే అవి వివిధ రకాల సిగరెట్ల కోసం సరాదాగా కోడ్‌తో పిలుచుకున్నామని దీపికా, ఆమె మేనేజర్ విచారణలో తెలిపినట్లు తెలిసింది. . స్లిమ్ సిగరెట్స్ కోడ్‌గా హ్యాష్, మందపాటి సిగరెట్లకు కోడ్‌గా వీడ్, తక్కువ నాణ్యత గల సిగరెట్లను మాల్ ఇలా పలు రకాలుగా వారు పిలుచుకునే వారని తెలిపారు. దీపికా, ప్రకాశ్‌లను వేర్వేరు గదులలో ఉంచి విచారించగా, వారి ఇచ్చిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని వీటితో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందినట్లు ఒక అధికారి తెలిపారు. మరి కొద్ది రోజులలో వీరికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పారు. అదే జరిగితే ఇక బాలీవుడ్ భామలకు డ్రగ్స్ కష్టాలు తప్పినట్లే. చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు? -
డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణుల పేర్లే ఇప్పటిదాకా తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో గతంలో డిలీట్ అయిన డేటాను ఎన్సీబీ తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్సీబీ గుర్తించింది. బడా హీరోలుగా చెలామణి అవుతున్న కొందరు డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్సీబీ విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును రకుల్ ప్రీత్‌సింగ్ ఆశ్రయించిన నేపథ్యంలో స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. (చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
ఉడ్తా బాలీవుడ్
-
డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్
సాక్షి, ముంబై : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్‌లను విచారించిన అధికారులు మరో కీలక ముందడగు వేశారు. శుక్ర,శనివారాల్లో వీరి విచారణ ముగిసిన అనంతరం నలుగురు నటీమణులు ఫోన్లను సీజ్‌చేశారు. నలుగురు హీరోయిన్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్, జయ షాల ఫోన్ల్‌ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ ఆదివారం ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపింది. ఇక ఇదే కేసులో శుక్రవారం ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. (ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ) మరోవైపు కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఆధారం చాటింగ్ చేసినట్లు 7 గంటల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని ఆధారాల కోసం వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ముగిసిన విచారణలో రకుల్‌పై ఎన్సీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆమె నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. రియాకు రకుల్‌కు మధ్య డ్రగ్స్ గురించి వాట్సప్‌లో చాటింగ్ జరిగినట్లు, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్ కూడా రియాకు చెందినట్లు రకుల్ వెల్లడించింది. తాజాగా వీరి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడంతో విచారణ ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. -
టాలీవుడ్‌ను షేక చేస్తోన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
-
సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?
మంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్ ప్రీత్) ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం. (సుశాంత్‌కు అరుదైన నివాళి...) -
‘సుశాంత్-సారా విడిపోవడానికే వారే కారణం’
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మాటల దాడికి దిగుతూ అందరిని ఏకిపారేస్తున్నారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజు తన ఘాటైన వ్యాఖ్యలతో బీటౌన్‌ను షేక్ చేస్తున్న కంగనా మరోసారి రెచ్చిపోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ సంబంధంపై నోరు విప్పారు. ఇంతకముందు కూడా సుశాంత్ సారా వీడిపోవడానికి బాలీవుడ్ బంధుప్రీతి కారణమని కంగనా చెప్పిన విషయం తెలిసింతే. తాజాగా ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. సుశాంత్ సారాతో డేటింగ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు వారు విడిపోయేలా చేశారని పేర్కొన్నారు. (‘ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రావాలంటే అలా చేయాలసిందే’) ఇపుడు ఇదే గ్యాంగ్ మూవీ మాఫియా తనను కూడా లక్ష్యంగా పెట్టుకుందని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. సుశాంత్‌తో డేటింగ్ చేయవద్దని సారాను కరీనా కపూర్ కోరినట్లు పేర్కొన్నారు. ‘నీ మొదటి హీరోతో డేటింట్ చేయకు’ అని కరీనా చెప్పిన రికార్డ్ కూడా ఉందన్నారు. సుశాంత్ బయటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇండస్ట్రీ ఎగతాళి చేసిందని, మూవీ మాఫియా బహిరంగంగానే అతనిని హత్య చేసిందన్నారు. దాంతో మానసిక కుంగుబాటుకు లోనైన సుశాంత్‌పై రాబంధుల సమూహం వచ్చి అనుకున్నది చేసిందన్నారు. కాగా 2018 లో సుశాంత్‌తో కలిసి ‘ కేదార్నాథ్’ సినిమాతో సారా సినీరంగ ప్రవేశం చేశారు. (బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) -
సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు
ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్‌హౌస్ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ ఒక న్యూస్ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు సుశాంత్ వద్ద పనిచేసే జగదీష్ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు. సుశాంత్ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్ మేనేజర్ రీస్ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్ ఫామ్‌హౌస్‌లో రీస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్ హౌస్‌ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్ పేపర్లను కూడా ఆర్డర్ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని రీస్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్‌పుత్ ఈ ఫామ్‌హౌస్‌కు వచ్చేవారని రీస్ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఆ ఫామ్ హౌస్‌లో జరుపుకుంది అని రీస్ తెలిపారు. పార్టీలలో స్మోక్ పేపర్ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్డౌన్లో ఫామ్‌హౌస్‌లో గడపాలని సుశాంత్ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు. చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు -
డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్సీబీ త్వరలో సారా, రకుల్, సిమోన్లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సుశాంత్ గెస్ట్ హౌజ్, పావనా డ్యామ్ ద్వీపంలోని పార్టీలపై ఎన్సీబీ దృష్టి చారించింది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. (చదవండి: రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...) ఈ కేసులో నిందితులైన రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు సుశాంత్ ఫాంహౌస్, పవనా డ్యామ్ హోమ్‌లో జరిగే పార్టీలపై ఎన్సీబీ బృందం దృష్టి సారించింది. రియా, సుశాంత్‌తో కలిసి ఇక్కడి పార్టీలకు చాలాసార్లు వచ్చారని, అంతేగాక సారా సుశాంత్‌తో కాలిసి 4 నుంచి 5 సార్లు, శ్రద్దా కపూర్ కూడా సుశాంత్ కలిసి ఈ పార్టీలకు హాజరైనట్లు విచారణలో వెల్లడైనట్లు ఎన్సీబీ తెలిపింది. కాగా డ్రగ్స్ కేసులో రియాను మూడు దశలుగా విచారించిన ఎన్సీబీకి చివరి విచారణలో ఆమె బాలీవుడ్‌కు 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీల వివరాలను వెల్లడించింది. అనంతరం రియాను ముంబైలోని బైకూల్లా మహిళా జైలుకు తరలించగా.. ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో మరో ముగ్గురిని కూడా పురుషుల జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఎన్సీబీ సారా, రకుల్, సిమోన్‌లను విచారించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతేగాక ద్వీపంలోని పార్టీలకు వచ్చిన వారిపై కూడా ఎన్సీబీ నిఘా పెట్టింది. (చదవండి: సుశాంత్‌కు స్లో పాయిజన్ ఇచ్చారు: నటి) -
డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటున్న మరికొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, డ్రగ్స్ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ( జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..) కాగా, సెప్టెంబర్ 8 నార్కోటిక్స్ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. -
హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
పటౌడి యువరాణి సారా అలీఖాన్ నిత్యం ఏదో ఒక విషయంలో నెటిజన్ల ట్రోట్స్కు గురవుతున్నారు. ఇంతకముందు తను షేర్ చేసిన కొన్ని ఫోటోలు అసభ్యకరంగా ఉన్నాయంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేయగా, మరోసారి ఆమెను ట్రోల్స్ చిక్కుల్లో పడేశాయి. ముస్లిం అయిన సారా కుటుంబం ప్రతి పండుగను జరుపుకుంటారు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్చేస్తారు. ఈ క్రమంలో గురువారం గణేశ్ చతుర్థి సందర్భంగా వినాయకుడి వేడుకల వద్ద దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘గణపతి బప్పా మోరియా’ అంటూ క్యాప్షన్ చేశారు. (‘ఛీ ఛీ.. సారా.. ఇదేం ఫొటో’: నెటిజన్ల ఫైర్!) ప్రస్తుతం ఈ పోస్టు కారణంగా సారాపై టోల్రింగ్ జరుగుతోంది. హిందూ పండగను జరుపుకోవడంపై కొంతమంది మండిపడుతున్నారు. ‘సారా.. ముస్లింవా లేక హిందు’వా అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో ట్రోలింగ్ సారా కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అయితే సారా అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. మతపరమైన విషయాలు వారి ఇష్టాలపై అధారపడి ఉంటాయని, సారా అన్ని పండగలకు విలువిచ్చి జరుపుకుంటారని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కాగా కేదార్నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్ ఆజ్కల్ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె నటించిన కూలీ నెం.1 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. (‘అప్పట్లో సుశాంత్, ఆమె ప్రేమలో ఉన్నారు’) View this post on Instagram Ganpati Bappa Morya 🙏🏻💐💗💞 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Aug 27, 2020 at 8:03am PDT -
‘అప్పట్లో సుశాంత్, ఆమె ప్రేమలో ఉన్నారు’
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజు రోజుకు అసక్తికర విషయాలు బయటకే వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్, సుశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శామ్యూల్ ఈ విషయం గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘కేదార్ నాథ్' చిత్రంలో సుశాంత్, సారా ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్, సారా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు’ అని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకోచ్చాడు. సుశాంత్ తదుపరి సినిమా 'సోన్ చిరియా' ప్లాప్ అవ్వడంతో సారా అతడిని విడిచి వెళ్లిపోయిందని, ఈ విషయం తనను ఆశ్చర్యపరిచిందని శామ్యూల్ చెప్పాడు. (చదవండి: రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది) View this post on Instagram We accept the love we think we deserve -Stephen Chbosky A post shared by Samuel Haokip (@jamlenpao) on Aug 19, 2020 at 9:21pm PDT బాలీవుడ్ మాఫియా వల్లే సుశాంత్ ‘సోన్ చిరియా’ చిత్రం ఫ్లాప్ అయిందని అతడు ఆరోపించాడు. అదే విధంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ కూడ ఆసుశాంత్, సారాల రిలేషన్‌షిప్‌పై ట్వీట్ చేశారు. ‘‘బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఎస్ఎస్ఆర్), సారాల రిలేషన్షిప్. వారి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం మీడియాలో ముఖ్యాంశంగా మారింది. అవుట్ డోర్ షూటింగ్లో వారిద్దరూ ఒకే రూంలో ఉన్నారన్న విషయం కూడా స్పష్టం అవుతోంది. ఈ ఫ్యాన్సీ నేపోటిజంలో స్టార్ కిడ్స్ బయటి నుంచి వచ్చిన వారి డ్రీమ్స్‌తో ఆడుకుంటారు. ఆ తరువాత వారి జీవితాలను బహిరంగంగా నాశనం చేస్తారు’ అంటూ కంగనా ట్వీట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్ డబ్బును దొంగలించిందని, అతడి ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించేదని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్తగా సారా పేరు వినిపించడంతో కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పుకొవచ్చు. (చదవండి: సుశాంత్ డిప్రెషన్ వల్లే చనిపోయి ఉండొచ్చేమో) News of SSR and Sara affair was all over the media, apparently they were even sharing a room during their outdoor, why these fancy Nepotism kids show dreams to vulnerable outsiders and then publicly dump them?No wonder he fell for a vulture post that. https://t.co/A4er01wZ6p — Kangana Ranaut (@KanganaTeam) August 20, 2020 -
సారా ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సారా ఖాన్ 25వ యేటలోకి అడుగుపెట్టింది. తన కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో బెలూన్లు, కేక్స్, ఇంకా షాంపిన్ బాటిల్ వుంది. తన ఇంటిలో హ్యాపీ బర్త్‌డే అని రాసి బెలూన్లతో అలంకరించిన ప్రదేశంలో సారా ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది. సారా పుట్టిన రోజు సందర్భంగా రెండు కేక్‌లను తెప్పించారు. వాటిలో ఒకటి తన సోదరుడు తెప్పించినట్లుగా సారా తెలిసింది. బర్త్‌డే ఫోటోలతో పాటు తన సోదరుడితో కలిసున్న ఫోటోను సైకిలింగ్ చేస్తున్న వీడియోను కూడా సారా షేర్ చేసింది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు సారాను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సినిమాల్లోకి 2018లో ఎంట్రీ ఇచ్చిన సారా.. కేధర్‌నాధ్, సింబా సినిమాలతో హిట్ అందుకుంది. ప్రస్తుతం వరణ్ థావన్తో కలిసి ఆమె నటించిన చిత్రం కూలీ నెంబర్ 1 విడుదల కావాల్సి ఉంది. View this post on Instagram Gone with the Wind 💨🧢🚲🌈🌴🌧☔️☮️💟 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Aug 10, 2020 at 4:41am PDT చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎంత మార్పు! View this post on Instagram Post Rakhi bonding vibe 🌴🌴🐒🐒 To match with me i had to bribe 💵 My younger brother- begged him to join my tribe 🙇🏻♀️ But his day out was fun- he says ‘I can’t describe’ 💁🏻♀️ To see more please like share and subscribe 🙏🏻 #doubletrouble #twinning #winning A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Aug 5, 2020 at 10:28pm PDT -
హీరోయిన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్
బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అంతేకాకుండా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మినహా మిగతా కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరోయిన్ సారా అలీ ఖాన్ చేరారు. తన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. తనతో పాటు మిగతా కుటుంబసభ్యులకు, ఇతర సిబ్బందికి కూడా టెస్టులు జరిగాయని.. అందరికి నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా సారా ఓ ప్రకటన విడుదల చేశారు. (‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’) View this post on Instagram 🙏🏻🙏🏻🙏🏻 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Jul 13, 2020 at 11:28am PDT ‘మా డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. బీఎంసీ దీని గురించి వెంటనే అప్రమత్తమై అతడిని క్వారంటైన్‌కు తరలించింది. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, ఇతర సిబ్బందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మేమంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నాతోపాటు నా కుటుంబ సభ్యులందరి తరఫునా బీఎంసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండడి’ అంటూ సారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. బిగ్‌బి, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (విలన్ కరోనా) -
సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో
బలవన్మరణానికి పాల్పడిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై ఇప్పుడు కొంతమందికి.. కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సానుభూతి ముసుగులో నటన చేసే బదులు.. ఆరోజు నిశ్శబ్దం పాటించి ఉంటే బాగుండేదని విమర్శించాడు. ఈ విషాదకర ఘటనను చాలా మంది తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు అవకాశాలు లేకపోవడం వల్లే సుశాంత్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ బాలీవుడ్ పెద్దలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.(సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సైఫ్ అలీఖాన్.. ‘‘ఇది నిజంగా భయంకర ఘటన. అయితే కొంతమంది ఈ విషాదం గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. పాపం సుశాంత్. అతడి మరణం గురించి కొంతమంది వెంటనే స్పందించారు. అయితే నిజంగా వాళ్లకు అతడిపై ఉన్న ప్రేమతో జరిగిందా లేదా ఇందులో కూడా ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అర్థంకావడం లేదు. ఇక సోషల్ మీడియాలో చాలా మంది రాద్ధాంతం చేస్తున్నారు. చెత్త నింపుతున్నారు. ఇది నిజంగా కాస్త ఇబ్బందిగా ఉంది. నిజానికి వాళ్లంతా నిశ్శబ్దం పాటించి ఉంటే బాగుండేది’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఎవరినీ పట్టించుకోం.. అదే విధంగా.. ఇండస్ట్రీలో రోజుకో సవాలు కూడుకున్నదే అని.. సుశాంత్ విషయంలో ఇప్పుడు బాధ పడటం అతడిని అవమానించినట్లేనని పేర్కొన్నాడు. ‘‘నిజానికి మేం(సెలబ్రిటీలు) ఎవరినీ పట్టించుకోం. ఇక్కడ ఎవరి పని వారికి ఉంటుంది. ఇప్పుడేదో కొత్తగా ఇతరుల గురించి పట్టించుకున్నట్లు నటించడం దారుణం. సుశాంత్ ఆత్మను వారు అవమానించినట్లే’’అని చెప్పుకొచ్చాడు. అలాగే.. అవకాశాలు రాకపోవడం వల్లే సుశాంత్ చనిపోయాడడని అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. లాక్డౌన్ కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయని.. సుశాంత్ మరణానికి వ్యక్తిగత కారణాలేమైనా ఉండవచ్చు కదా అని వ్యాఖ్యానించాడు. ('కావాలనే సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') వాస్తవాలు తెలిశాకే.. ఇక కొంతమంది ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. అయితే వాస్తవాలేమిటో తెలుసుకున్న తర్వాతే తాను ఈ విషయం గురించి స్పందించగలనన్నాడు. కాగా సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ తన తొలి చిత్రం కేదార్‌నాథ్‌లో సుశాంత్‌తో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ.. సుశాంత్ సెట్లో ఎన్నో మంచి విషయాలు చెప్పేవాడని. తనకు ఎంతో నాలెడ్జ్ ఉందని సారా చెప్పిందన్నాడు. ఇక స్టార్ కిడ్ అయిన సైఫ్ అలీఖాన్.. కపూర్ ఖాన్దాన్ వారసురాలు కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్య అమృతాసింగ్ కూడా గతంలో హీరోయిన్గా వెలుగొందారు. ఇప్పుడు సైఫ్ వారసురాలిగా సారా బీ-టౌన్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెపోటిజమ్ గురించి మాట్లాడిన కంగనను ఉద్దేశించే సైఫ్ ఇలా మాట్లాడి ఉంటారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.(నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) -
నల్లజాతి నినాదం సారాపై ట్రోలింగ్
All lives matter అని పోస్ట్ చేసినందుకు సారా అలీఖాన్‌పై ట్రోలింగ్ జరుగుతోంది. #Blacklivesmatter అనే నల్లజాతి నినాదంలోని Black అనే మాటను ఎర్రగీతతో కొట్టేసి, దానిపైన అ అని రాసి సారా షేర్ చేసిన ఆ పోస్టులో అసలు నినాద చిత్రంలో ఉన్నవిధంగా పిడికిలి బిగించి ఒక తెల్ల చెయ్యి, ఒక గోధుమ రంగు చెయ్యి, ఒక నల్ల చెయ్యి ఉంటాయి. వాటి పక్కన సారా అదనంగా ఏనుగు తొండాన్ని మరొక పిడికిలిలా యాడ్ చేశారు. చేసి, జీవులందరి ప్రాణాలూ ముఖ్యమైనవే అనే అర్థంలో అ అనే మాటను పెట్టారు. ఇటీవల కేరళలో ఒక ఏనుగును అమానుషంగా చంపడాన్ని దృష్టిలో పెట్టుకుని సారా అలా చేశారు. అయితే అది వివాదం అయింది. సహనటుడు కరణ్వీర్ బోరా.. సారాకు మద్దతుగా ఆమె ఉద్దేశాన్ని విడమరిచి చెబుతూ ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది. సారా అలీఖాన్, కరణ్వీర్ బోరా -
హీరోయిన్ వీడియోకు నెటిజన్లు ఫిదా!
-
అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎంత మార్పు!
పటౌడి పరగణా యువరాణి సారా అలీఖాన్ హీరోయిన్ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి ఎంతో కఠినంగా శ్రమించింది. స్టార్ కిడ్ అయినప్పటికీ అధిక బరువు కారణంగా తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె.. పట్టుదలతో నాజూకుగా తయారై నేడు యువకుల డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. నేడు తను ఈ స్థాయికి రావడం వెనుక దాగున్న శ్రమను ప్రతిబింబించే వీడియోను సారా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘లాక్డౌన్ ఎడిషన్: సంపూర్ణ సారా నుంచి సగం సారా’’ అంటూ చమత్కారంతో కూడిన క్యాప్షన్ జోడించింది. టూర్‌గైడ్ ఎపిసోడ్లో భాగంగా స్లిమ్‌గా తయారుకావడానికి తాను చేసిన కార్డియో ఎక్సర్సైజులు, స్విమ్మింగ్, బైక్ రైడింగ్ తదితర వర్కౌట్లకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. (మహేష్‌తో జోడీ కుదిరిందా?) ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 33 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ క్రమంలో.. ‘‘నిజంగా అది నువ్వేనా. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించావు. నీది గొప్ప ప్రయాణం. మాలో స్ఫూర్తిని నింపావు’’ అంటూ నెటిజన్లు 24 ఏళ్ల సారాను కొనియాడుతున్నారు. కాగా బాల్యంలోనే పీసీఓడీ బారిన పడిన కారణంగా సారా చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్గా వెండితెరపై మెరవాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు జిమ్‌లో తీవ్రంగా శ్రమించి ప్రస్తుత రూపాన్ని పొందారు. కేదార్నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్ ఆజ్కల్ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం కూలీ నెం.1 సినిమాలో నటిస్తున్నారు.(‘నా భర్తతో కలిసి ఉండలేను.. సాయం చేయండి’) -
‘మీరు నాతో ఉంటే.. నేను ఎప్పటికీ గెలుస్తా'
లాక్డౌన్లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు సోషల్ మీడియాల ద్వారా అభిమానులకు చేరువుగా ఉంటున్నారు. రోజూ తాము చేసే పనులను, గత కాలపు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన చిన్నప్పటి ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో సారాతో పాటు తన స్నేహితులు ఇషికా ష్రాఫ్, వేదికా పింటో ఉన్నారు. 'మీరు నాకు పరిచయమయ్యి నేటికి 8395 రోజులు అవుతుంది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నా ప్రాణ స్నేహితులుగా మారారు. మీరు నా స్నేహితులుగా ఉంటే నేను ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాను' అంటూ తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. (రానా, మిహీక ప్రేమ చిగురించింది అక్కడే!) View this post on Instagram Through thick and thin (Literally 🐣🐥👧🏻👩🏻🎃) Known you for 8,395 Din.. 🗓 Thick as thieves, close as Kin💓👭 If you two are my friends I’ll always Win 👑 @ishroff @vedikapinto A post shared by Sara Ali Khan (@saraalikhan95) on May 13, 2020 at 8:52am PDT ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు సంవత్సరాలే అవుతున్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. కాగా సారా ఇలా త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా మదర్స్ డే సందర్భంగా తల్లి, అమ్మమ్మకు చెందిన చిత్రాలను పంచుకుంటూ.. 'మా అమ్మను ఇచ్చినందుకు నీకు(అమ్మమ్మ) ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. కరోనా కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సారా నటిస్తున్న అక్షయ్ కుమార్, ధనుష్ సినిమా కూడా వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం సారా ముంబైలో తన తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి క్వారంటైన్ సమయాన్ని క్వాలిటీ టైమ్‌గా మార్చుకుంటోంది. ఇంట్లో వంటలు, క్లీనింగ్, టీవీ చూడటం, పుస్తకాలు చదవడం, వర్కవుట్లు చేస్తూ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. (పుకార్లపై స్పందించిన సల్మాన్ ఖాన్) ప్రభాస్ సినిమాలో 'మైనే ప్యార్ కియా' నటి రాజసం ఉట్టిపడుతోన్న హీరోయిన్ చిన్ననాటి ఫొటో -
అక్కడ నేనే మహారాణి: హీరోయిన్
తక్కువ కాలంలోనే తగినంత పాపులారిటీ తెచ్చుకుందీ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. రెండేళ్ల కిందట ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సారా సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడమే కాక స్టార్ హీరోల సరసన జట్టు కడుతూ అందాల ఆరబోతకూ సై అంటోంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కుందనపు బొమ్మలా తయారై ఉన్న ఈ ఫొటోలో సారా చూడచక్కగా ఉందంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక రాజసం ఉట్టిపడుతున్న ఈ ఫొటో గురించి సారా తనను తానే రాణిగా అభివర్ణించుకుంటోంది. (లాక్డౌన్ నాకు కొత్త కాదు!) "నా కలల్లో ఎప్పటికీ నేనే మహారాణిని" అంటూ సదరు ఫొటోకు క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోకు ఫిదా అయిన అభిమానులు కూడా ఆమె మాటను ఏకీభవించకుండా ఉండలేకపతున్నారు. నిజంగానే మీరు ఎంతో అందంగా, తేజస్సుతో వెలిగిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సారా ముంబైలో తన తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి క్వారంటైన్ సమయాన్ని క్వాలిటీ టైమ్‌గా మార్చుకుంటోంది. ఇప్పుడు సినిమాలు లేవు కదా అని బద్ధకించకుండా వర్కవుట్లు చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధపెడుతూ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. (‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’) View this post on Instagram मेरे सपनों की रानी... hamesha main hi thi... 💭 🤔 👑 💫🌟💛 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Apr 27, 2020 at 2:14am PDT -
జోడీ కుదిరిందా?
పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు పరశురాం. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మహేష్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ నటిస్తారని టాక్. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే సారాకు ఇదే తొలి తెలుగు సినిమా అవుతుంది. సారా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె అనే సంగతి తెలిసిందే. జూన్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. -
‘ఛీ ఛీ.. సారా.. ఇదేం ఫొటో’: నెటిజన్ల ఫైర్!
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ తీరుపై అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల ఆమె తన సొదరుడు ఇబ్రహీంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తమ్ముడి బర్త్‌డేను సెలబ్రేట్ చేయలేకపోయిన సారా.. తాజాగా తన తమ్ముడిని ట్రిప్‌కి తీసుకెళ్లారు. అక్కడ సముద్ర తీరాన ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి.. ‘మా తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోల్లో సారా బికినీ ధరించి ఉండటంపై నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అంతేగాక తమ్ముడి పక్కన తను నిలబడిన తీరుపై మండిపడుతున్నారు. ‘ఇది సరైన పద్ధతి కాదు. నీ తమ్ముడు చూడు ఎంత అసౌకర్యంగా ఉన్నాడో. ఎంత హీరోయిన్ అయితే మాత్రం తమ్ముడి పక్కన ఇలా నిలబడటం పద్దతి కాదు’ అంటూ సారాకు క్లాస్ పీకుతున్నారు.(అది నన్ను చాలా బాధించింది: హీరోయిన్) View this post on Instagram Happiest birthday Brother 🎂 🍰 🎁👫 I love you more than you know and am missing you lots today!! Wish I was with you 🤗 #tbt @ncstravels @luxnorthmale A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Mar 4, 2020 at 11:58pm PST ‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’ మరికొందరు స్టార్డమ్ సారాను ప్రభావితం చేయడం ప్రారంభించిందని కామెంట్లు చేస్తున్నారు. ‘ పలుకుబడి, డబ్బుతో మనుషులు ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తారని సారాను చూస్తే మరోమారు రుజువైందని, పిల్లలకు తెలియకపోతే కనీసం పెద్దవాళ్లైనా ఏది సరైనదో, కాదో చెప్పాలి కదా’ అంటూ సూచిస్తున్నారు. అదేవిధంగా తను ఎలాంటి దుస్తులు వేసుకుందన్నది ముఖ్యం కాదు.. కానీ తమ్ముడితో కలిసి అలా పోజ్ ఇవ్వడం చూడటానికి అసభ్యకరంగా ఉంది’ అంటూ మండిపడుతున్నారు. కాగా సారాను ఇది వరకు కూడా ‘లవ్ ఆజ్ కల్’లో తన నటన చాలా ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో సాంప్రదాయ దుస్తుల్లో ఉండి అసభ్యకరంగా మాట్లాడటం ఎంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..
తాత పేరు టైగర్ పటౌడి.ఆయన పటౌడి నవాబు.తండ్రి సైఫ్ అలీ ఖాన్. చిన్న నవాబు.లెక్కప్రకారం తను యువరాణిపటౌడి పరగణాకి.కాని అలా జరగలేదు.తల్లి తండ్రి విడిపోయారు.తల్లితో బతకాల్సి వచ్చింది. కాని ఖాన్దాన్ను నిలబెట్తే సత్తాతనకే ఉందని నిరూపించుకుంది.ఇవాళ పటౌడి సంస్థానం ఆమెను చూసి గర్వపడుతోంది. తల్లి అమృతా సింగ్: అమృతా సింగ్ అంటే ‘బేతాబ్’ హీరోయిన్. సన్ని డియోల్‌తో కలిసి ఆమె 1983లో మొదటిసారి వెండితెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు ఆమె గ్లామర్‌కు దాసోహం అయ్యారు. ఆ తర్వాత ఆమె ‘సాహెబ్’, ‘మర్ద్’, ‘చమేలీ కి షాదీ’ వంటి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు. అమృతా సింగ్ కోసం బాలీవుడ్ హీరోలు చాలామంది ప్రేమలేఖలు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. కాని అమృతా సింగ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెటర్ రవిశాస్త్రి మరీ ఇష్టం. వారి మధ్య ప్రేమ నడిచింది. రవిశాస్త్రి గ్రౌండ్లో ఫోర్ కొట్టినప్పుడల్లా కెమెరా వైపుకు తిరిగి గాలిలో చూపుడు వేలితో ‘డి’ అక్షరం రాసేవాడు. ‘డి’ అంటే డింగీ అని అర్థం. ఇది బేతాబ్‌లో అమృతా సింగ్ ముద్దుపేరు. తండ్రి సైఫ్ అలీ ఖాన్: సైఫ్ అలీ ఖాన్ టైగర్ పటౌడి కుమారుడు.నటి షర్మిలా టాగూర్ ముద్దుల కొడుకు. అతడు టైగర్‌లా క్రికెటర్ కావచ్చు. కాని లండన్‌లో చదువుకున్నాక తల్లిలా సినిమా రంగానికి వద్దామనుకున్నాడు. పటౌడీ యువరాజు సినిమా రంగంలో వస్తానంటే కాదనేవారెవరు. షర్మిలా టాగోర్ దగ్గరుండి అతణ్ణి సినిమాల్లో 1993లో ప్రవేశ పెట్టింది. ‘మై ఖిలాడీ తూ అనాడీ’, ‘కచ్చేధాగే’, ‘హమ్ సాత్ సాత్ హై’ లాంటి ఒకటి రెండు సినిమాలు హిట్ కావడం తప్పితే పెద్దగా బ్రేక్ రాలేదు. కెరీర్ అగమ్యగోచరంగా ఉంది. కుటుంబం: అయితే సైఫ్ అలీ ఖాన్ సినిమాల్లోకి రాక ముందే అమృతా సింగ్ ప్రేమలో పడ్డాడు. చదువు ముగించుకుని ముంబై వచ్చాక అమృతా సింగ్ సినిమాలు చూసి ఆమె కాంటాక్ట్ సంపాదించి పొగడటం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి డిన్నర్‌కు తీసుకువెళ్లేవాడు. సైఫ్ అమృతా సింగ్ కంటే 12 ఏళ్లు చిన్నవాడు. మొదలు ఇదంతా ఆటగా ఉండేది. కాని రాను రాను అమృతా అతడి ఆకర్షణలో పడింది. అమృతా సింగ్ కెరీర్ అప్పటికే పదేళ్లు ముగించుకోవడంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉండగా ఊపిరి సలపనివ్వక సైఫ్ ఆమె వెంట పడ్డాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామనుకోవడం పెద్ద దుమారం రేపింది. సైఫ్ ఇంట్లో ఈ పెళ్లి సుతరామూ ఇష్టం లేదు. అందరినీ ఎదిరించి ఈ పెళ్లి చేసుకున్నాడు. అది నిలవదని చాలామంది జోస్యం చెప్పారు. కాని 1991లో పెళ్లయితే 2004 వరకు ఆ పెళ్లి నిలిచింది. కూతురు సారా అలీ ఖాన్, కొడుకు ఇబ్రాహీమ్ అలీ ఖాన్... మొత్తం నలుగురు సభ్యుల కుటుంబం కళకళలాడింది. కాని 2004లో విడాకులతో చెదిరిపోయింది. సారా అలీ ఖాన్: తల్లిదండ్రులు విడిపోయే సమయానికి సారాకు 9 సంవత్సరాలు. తమ్ముడు నాలుగేళ్ల చిన్నపిల్లవాడు. 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తాహై’ సినిమా ఈ విడాకులకు పరోక్ష కారణం అని చెప్పవచ్చు. ఆ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ స్టార్డమ్కు చేరుకున్నాడు. బిజీ అయిపోయాడు. కొత్త ఆకర్షణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కుటుంబం నుంచి దూరం కాసాగాడు. ఇది తట్టుకోలేని అమృతా సింగ్ విడాకులకు సిద్ధమైంది. కాని విడాకులు తీసుకున్నాక అతని నీడ పిల్లల మీద పడకూడదు అన్నంత పంతంగా వ్యవహరించింది. చాలా రోజులు సారా తల్లే లోకంగా పెరిగింది. నిజానికి త్యాగమంతా అమృతాదే. పెళ్లి చేసుకున్నాక సైఫ్ కోసం సినిమా కెరీర్ వదిలేసింది. విడాకుల తర్వాత పిల్లల కోసం సినిమాలను వద్దనుకుంది. తల్లి వేదనకు సారా సాక్షిగా నిలిచింది. కాని తండ్రితో అనుబంధం కోసం ఎఫర్ట్ పెట్టింది. అమృతాకు ఇష్టం లేకపోయినా తండ్రితో ఆమె అనుబంధం పునరుద్ధరించుకోగలిగింది. అమృతా చేసిన గారాలు ఆమెకు స్థూలకాయం తెచ్చాయి. న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లే సమయానికి ‘పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్’ బారిన పడటంతో దాని వల్ల కూడా లావు అయిపోయింది. వీటన్నింటి మధ్య ఆమెను ఉత్సాహంగా ఉంచింది ఒకే ఒక కల. హీరోయిన్ కావడం. కల: సారా అలీ ఖాన్ కరణ్ జొహర్ సినిమాలు చూస్తూ పెరిగింది. అయితే ఐశ్వర్యారాయ్ క్రేజ్ ఆమెను ప్రభావితం చేసింది. అంత కంటే ఎక్కువగా శ్రీదేవి వెండి తెర మీద ఒక దేవతలా వెలిగిపోతుండటం చూసి ఆమెలా ఎప్పటికైనా హీరోయిన్ కావాలనుకుంది. కాని అప్పటికే ఆమెకు ‘నజర్ బట్టు’ (దిష్టిబొమ్మ) అని పేరు. ఇంత లావుగా (85 కేజీలు) ఉన్న అమ్మాయి హీరోయిన్ ఎలా అవుతుంది? సారాలో ఖాన్ రక్తం ఉంది. తల్లి నుంచి వచ్చిన పంజాబీ పౌరుషం ఉంది. అందుకే సారా సంకల్పించుకుంది... ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఒకటిన్నర సంవత్సరం ఆమె శ్రమ చేయని రోజు లేదు. కడుపు మాడ్చుకోని పూట లేదు. తగ్గి.. తగ్గి.. తగ్గి.. ఆమె ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. అందరూ ఆమెను తమ సినిమాల్లోకి రమ్మని రెడ్ కార్పెట్ పరిచారు. దానికి ముందే యాడ్స్‌లో టాప్ మోడల్‌గా అవతరించింది. ‘కేదార్నాథ్’ (2018)తో హీరోయిన్ అయ్యింది. నెరవేరిన కల: కేదార్నాథ్ టెంపుల్ దగ్గర ఒక ముస్లిం గైడ్‌తో ప్రేమలో పడే హిందూ అమ్మాయిగా సారా నటించిన ‘కేదార్నాథ్’ సినిమా మిక్స్డ్ రివ్యూస్‌ను పొందినా సారా నటన విషయంలో మాత్రం ముక్తకంఠంగా మంచి మార్కులు వేశారు. ఒక తార ఉదయించిందన్నారు. పులి కడుపున పులే పుడుతుందన్నారు. ఇక్కడ పులి అమృతా సింగ్ కూడా కావచ్చు. తర్వాత ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’లో నటించింది సారా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మూడో సినిమా ‘లవ్ ఆజ్ కల్’ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. వేలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ సినిమా మరో సారి సారా నటనను ప్రతిభావంతంగా చూపించగలిగింది. సారా ఇప్పుడు పూర్తి స్థాయి స్టార్. వరుణ్ ధావన్‌తో నాటి సూపర్ హిట్ ‘కూలీ నంబర్ 1’ రీమేక్‌లో నటిస్తోంది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ 100లో సారా 66వ స్థానంలో సారా నిలిచింది. చిన్న వయసులో ఇది పెద్ద ఘనత. సారాను చూసి తల్లి ఎలాగూ గర్వపడుతోంది. తండ్రి నిశ్శబ్దంగా మెచ్చుకుంటున్నాడు. హర్యానాలోని పటౌడి పరగణ మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటోంది. ప్రస్తుతం: సారా తన తండ్రి రెండవ కుటుంబాన్ని కూడా సన్నిహితం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మారు తల్లి కరీనా కపూర్‌తో సఖ్యంగా ఉంటోంది. మారు తమ్ముడు తైమూర్ అలీఖాన్‌ను ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. కాని ఆమె అమ్మ కూతురుగానే ఈ లోకంలో తన అస్థిత్వాన్ని ఎక్కువగా కాపాడుకుంటోంది. ఆ అస్థిత్వమే ఆమెకు ఎక్కువ గౌరవం తెచ్చిపెడుతోంది. మంచి కారణాలతోకాని చెడు కారణాలతో కాని తండ్రి దూరమైనా తల్లి తోడుగా ఒక అమ్మాయి గట్టిగా నిలబడగలదు అని చెప్పడానికి సారా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇది ఈ తరం గెలుపు అని కూడా సారా చాటింపు వేస్తోంది. ఆ చాటింపు చాలామందికి స్ఫూర్తి కావాలని కోరుకుందాం.– సాక్షి ఫ్యామిలీ -
నీరసించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ కలెక్షన్లు
ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘లవ్ ఆజ్ కల్ 2’. ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. సస్స్ర్కీన్ ప్లే వీక్‌గా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కానీ కొంతమంది ప్రేమికులు మాత్రం సారా, కార్తీక్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఈ జంట రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ.12 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ.8 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం సుమారు రూ.10 కోట్లు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ రూ.6 కోట్లతో సరిపెట్టుకుంది.(ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది) ఇప్పటివరకు మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం థియేటర్లలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఈ చిత్రం సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే నటించిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ సీక్వెల్‌కు సైతం దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. కథలో కొత్తదనం లేదని, పాత చింతకాయ పచ్చడే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్ ఓవర్ యాక్షన్ మాత్రం భరించలేకున్నామని మరికొందరు ఘాటుగానే స్పందించారు. తొలిరోజు అదుర్స్ అనిపించిన కలెక్షన్లు తర్వాత డీలా పడిపోయాయి. (‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!) చదవండి: ‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ రూ. 12 కోట్లు -
‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ అదుర్స్.. కానీ!
బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ సారా అలీ ఖాన్, రణ్‌దీప్ హూడాలు ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫ్రిబ్రవరి 14)న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంతీయాజ్ అలీ 2009లోని ‘లవ్ ఆజ్ కల్’కు స్వీకెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్న ప్రేమకథ భావాలతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు కూడా సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అలా ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 12.40 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ సినిమా అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది. అటు అభిమానుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్! దర్శకుడు ఇంతీయాజ్ కాలానుగుణంగా ప్రేమలో వచ్చే మార్పులను చూపించేందుకు భిన్న ప్రేమ కథలను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా కార్తీక్ ఆర్యన్ 2020 నాటి ప్రేమికుడు వీర్, 1990 నాటి రఘుగా ద్విపాత్రలు పోషించాడు. ఇక వీర్‌కు ప్రియురాలిగా సారా నటించగా.. 1990 నాటి రఘు ప్రేయసిగా లిలా పాత్రలో ఆరూషి నటించిది. ఇక ఆరూషికి ఇదే మొదటి సినిమా కూడా. ఇకపోతే విడుదలైన రోజునే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సారా అలీ ఖాన్ చేసిన ఓవరాక్షన్ భరించలేపోయామంటు సారాపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం కార్తీక్ నటన మాత్రమే బాగుందని.. మిగతాదంతా అంతా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్యారాచూట్‌పై ఉన్న ఓ వ్యక్తి భయపడుతూ కళ్లు మూసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘కావాలంటే 500 ఇస్తాం దయచేసి సినిమా ఆపండ్రా బాబు’ అంటూ క్రియోట్ చేసిన మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’
బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్ ఆజ్ కల్ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి బీ-టౌన్లో ఎక్కడ చూసిన వీరే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కార్తీక్, సారాను ఆటపట్టించడం, వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం వారు సరదాగా ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కార్తీక్ వారికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కార్తీక్ ఇద్దరబ్బాయిలతో ఫుట్‌బాల్ ఆడుతుండగా.. వెనకాల వచ్చిన సారాను చూసి ఓ బాలుడు ‘కార్తీక్ అన్నయ్య.. వదిన వచ్చింది చూడు’ అనగానే కార్తీక్ కాస్తా షాక్‌కు గురయ్యాడు. ఇక అది విన్న సారా నవ్వులు చిందిస్తూనే.. వదిన అని ఎవరూ పిలిచారు అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత ఆ బాలుడి వైపు నడుస్తూ.. ‘అతనే కదా.. నిన్ను వదిన అని పిలవమన్నాడు’ అని కార్తీక్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించిన ఈ వీడియోను కార్తీక్ ‘వదిన అని ఎవరు పిలిచారు’ అనే క్యాప్షన్‌కు బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేసి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆ జంట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్ చేయండి’ కాగా ఇటీవలల ఓ ఇంటర్యూలో కార్తీక్‌తో ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును ప్రేమిస్తున్నాను కానీ సినిమాలో’ అంటూ వారిమధ్య ప్రేమ లేదని చెప్పకనే చెప్పి తెలివిగా తప్పించుకుంది ఈ భామ. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కార్తీక్ సారాను స్టేజీపైకి చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడంతో వీళ్తు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటజన్లంతా మండిపడ్డారు. కార్తీక్ స్వయంగా వంట చేసి సారాకు తినిపించడం, అప్పుడప్పుడూ కార్తిక్, సారాను సోషల్ మీడియాలో ఆటపంటించడం చూసి వీరిద్దరిని లవ్ బర్డ్స్‌గా ఫిక్సైపోతున్నారంతా. కాగా తాజా సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులను పలకరించనుంది. చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో View this post on Instagram Bhabhi kisko bola ☺️ A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 13, 2020 at 3:38am PST -
‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!
సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్ చేయాలని చెప్పింది. అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్ చేసింది. మరోవైపు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2009లో సైఫ్ అలీఖాన్, దీపికా నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి : కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
బైక్‌పై చక్కర్లు కొడుతున్న బాలీవుడ్ జంట!
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు ‘లవ్ ఆజ్ కల్ 2’తో తొలిసారిగా జతకట్టారు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటీ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమయాణం సాగుతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలో వాటిని సారా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సారా, కార్తీక్‌లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కార్తిక్, సారాతో కలిసి బైక్ వెళుతున్న బుమరాంగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఛలాన్ కడతావా.. అయితే నాది కూడా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తూ సారాను సరదాగా ఆటపట్టించాడు. కార్తిక్ పోస్టుకు సారా స్పందిస్తూ.. కోపంగా ఉన్న ఎమోజీని కామెంటు చేసింది. ఇక కార్తిక్ వెంటనే ‘జోక్ చేశాను అంతే.. పడుకో..’ అంటూ సారాను సముదాయించాడు. ఇలా సారాను సందర్భం చిక్కినప్పుడల్లా కార్తీక్ సోషల్ మీడియాలో ఆటపట్టిస్తూనే ఉంటాడు. (చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో) View this post on Instagram Challan Katega Aur mera bhi .... A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 11, 2020 at 9:01am PST ఇటీవల సారాకు స్వయంగా తన చేతితో తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా బక్కచిక్కిపోయావు.. నువ్వు మళ్లీ ముందులా మారిపోవాలి’ అంటూ కార్తీక్ ఆర్యన్ ఆటపట్టించాడు. ఇక సారా లావుగా ఉన్నప్పుటీ ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సారా తన సినిమా కేరిర్ కోసం 96 కిలోగ్రాముల బరువు ఉన్న సారా నాజుగ్గా తయారయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్లోని ఓ కార్యక్రమంలో కార్తీక్, సారాను స్టేజీపైకి ఎత్తుకొని తీసుకెళ్లిన ఫొటోలు, ఓ స్వీమ్మింగ్ ఫూల్ దగ్గర సారా దిగుతానంటే కార్తీక్ వద్దంటూ ఆపుతూ... ప్రేమికుల్లా ప్రవర్తించిన తీరును చూసి ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో
సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, యువనటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా విపరీతమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’లో జోడీ కట్టిన వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని వస్తున్న వార్తలను సారా గతంలోనే ఖండించారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో కార్తీక్ సారాని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజీపైకి తీసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు ఇది కూడా అబద్ధమంటారా అని సెటైర్లు విసిరారు. తాజాగా వీళ్లిద్దరూ మరోసారి ప్రేమికుల్లా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కార్తీక్ ఆర్యన్.. సారాకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. వీరి ప్రేమానురాగాలను ఫొటోలో బందిస్తూ దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నువ్వు చాలా చిక్కిపోయావు. మళ్లీ సాధారణ బరువుకు రావాలి’ అటూ క్యాప్షన్ జోడించాడు. (ఆస్కార్ 2020 : ఉత్తమ నటుడిగా ‘జోకర్’ హీరో) ఇంకేముంది.. నెటిజన్లు ఊరుకుంటారా. ‘బాలీవుడ్లో కొత్త జంట’, ‘ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు’ అంటూ వారిని ప్రేమ పక్షులుగా ఫిక్సయిపోతున్నారు. అంతేకాదు, కార్తీక్.. ప్రేయసి కోసం స్వయంగా వంటచేశాడేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్లో అడుగుపెట్టే సమయానికి 96 కిలోల బరువుండేది. కానీ రానురానూ నాజూకు సుందరిగా మారిపోయింది. దీనిపై హీరోయిన్ కరీనా కపూర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నేను బొద్దుగా ఉండే పాత సారాను మిస్ అవుతున్నాను. ఇప్పుడు నీకెంతో ఇష్టమైన పిజ్జాలు తినడం కూడా మానేసావు కదా’ అని అడిగింది. దీనికి సారా ‘ అవును, కానీ ఇప్పుడు పిజ్జాలు కొనేందుకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నాను. దానికి ఏమంటావు?’ అని సమాధానమిచ్చింది. ఆమె నాజూకుగా మారడం కరీనాకే కాదు, కార్తీక్‌కు కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఇక సారా, కార్తీక్ తొలి సారి జోడీ కట్టిన ‘లవ్ ఆజ్ కల్2’ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. (కార్తీక్‌తో ప్రేమలో ఉన్నా: సారా) చదవండి: ఈ ఏడాదే రణ్‌బీర్, అలియాల పెళ్లి!? (యాక్షన్ ఫీట్లతో అదిరిపోయిన భాగీ-3 ట్రైలర్) -
‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’
సైఫ్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చేసింది రెండు సినిమాలే అయినా ఎంతో క్రేజ్‌ను తెచ్చుకున్నారు సారా. అయితే ఈ భామ యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తుందని వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో ఈ అమ్మడు చాలా ఓవర్ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీటిపై సారా స్పందిస్తూ.. ‘నా బరువు, అందం, ఫ్యాషన్‌పై విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను.. కానీ నా నటన, నైపుణ్యంపై విమర్శలు వచ్చాయి. అదే నాకు పెద్ద పరీక్ష’ అన్నారు. మొదటి సారిగా విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా కాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో సారా ‘నువ్వు నన్ను బగ్ చేస్తున్నావా’ అని చెప్పిన డైలాగ్‌కు విమర్శలు వస్తున్నాయి. ఆమె నటన అతిగా ఉందని, ఆ డైలాగ్ చెప్పెటప్పుడు తను ఎలాంటి దస్తులు ధరించిందో, తను చెప్పిన డైలాగ్ ఎంటో ఓసారి చూసుకుంటే బాగుండని, జో గా నటించిన ఆ ఒక్కసీన్ తన అభిమానులను నిరాశకు గురిచేసిందంటూ సారాకు క్లాస్ పీకుతున్నారు. ఇక తనపై వస్తున్న విమర్శల గురించి దర్శకుడు ఇంతియాజ్‌తో కూడా మాట్లాడానని సారా చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో తన నటన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొవడానికి ఈ విమర్శలు ఉపయోగకరంగా ఉంటాయని సానుకూలంగా స్పందించారు. 2010లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనెలు నటించి ‘లవ్ ఆజ్ కల్’ డైరెక్టర్ ఇంతియాజ్ అదే సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు. గత కొద్ది రోజులుగా సారా, యువ హీరో కార్తిక్ ఆర్యన్లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు కార్తిక్, సారాలు దీనిపై స్పందించక పోవడంతో వారిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారంతా. ఇక సారా తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేశారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కార్తిక్‌తో ప్రేమ విషయం అడగ్గా.. ‘నేను కార్తిక్‌తో కలిసి పని చేస్తున్నానని అనుకోవడం లేదు. నేను వీర్‌తో కలిసి సెట్లో డేటింగ్ చేస్తున్నా. ఎందుకంటే మేము సేట్లో సారా, కార్తిక్‌లా కాకుండా జో, వీర్(సినిమాలోని పాత్రల పేర్లు)లా ఉంటాము’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.(ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్) ‘అవును కార్తిక్‌తో ప్రేమలో ఉన్నాను.. కానీ బయట కాదు సినిమాల్లో. ప్లీజ్.. మీరంతా తెరపై 2.5 గంటలు పాటు కనిపించే మా ప్రేమను చూడండి’ అంటూ సారా అలీ ఖాన్ పేర్కొన్నారు. అలాగే తను యువతరానికి చెందినదానినా లేదా పాత కాలం అమ్మాయినా అనే విషయం తనకే తెలియదని.. కొన్నిసార్లు ప్రేమంటే నచ్చుతుంది. మరికొన్ని సార్లు ప్రేమకు దూరంగా ఉంటానని చెప్పారు. కాగా కాఫీ విత్ కరణ్ షోలో.. సారా వృత్తి పరంగా.. కార్తిక్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కార్తిక్ కూడా సారా గురించి చెప్పాడు. దీంతో వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. సారా, కార్తిక్‌లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్’ ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు సమాచారం.(హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!) -
ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్
ఖిలాడి అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, స్టార్ కిడ్ సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘ఆత్రంగి రే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ ఎల్ రాయ్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.(హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!) కాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ సారా అలీఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆత్రంగీ రే. నా అదృష్టాన్ని నమ్మలేకున్నా’ అనే క్యాప్షన్‌తో అక్కీ, ధనుష్‌లతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. కేవలం పది నిమిషాల్లోనే డైరెక్టర్‌కు ఓకే చెప్పానని పేర్కొన్నాడు. సారా- ధనుష్‌ల జంట బాగుంటుందని.. వెండితెర మీద వాళ్లు మ్యాజిక్ చేస్తారని చెప్పుకొచ్చాడు. View this post on Instagram I can’t believe my luck 💫🌼☀️🌞🤩 My next film 🎥 🎞 : ATRANGI RE 👏🏻 Blessed to be working with @aanandlrai sir 🙏🏻 🤗 In an @arrahman musical 🎶 And so thankful to have @akshaykumar sir join hands with the extremely talented and incredibly humble @dhanushkraja and myself 🤝🤜🤛 Presented by @itsbhushankumar's @TSeries, @cypplofficial & #capeofgoodfilms 💁🏻♀️ And written by Himanshu Sharma Sir 📝📚 CANNOT WAIT TO START🧿💙 And cannot wait to come ⏰ Again, on Valentine’s Day ❤️ 14th February 2021‼️ A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Jan 29, 2020 at 8:21pm PST -
హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!
-
హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!
కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్ సారా అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన సింబా చిత్రం హిట్‌గా నిలవడంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి లవ్ ఆజ్కల్ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆమె తండ్రి సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్కల్కు సీక్వెల్ కావడం విశేషం. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సారా.. తాజాగా షేర్ చేసిన తన పాత వీడియో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాలో చదువుకున్న రోజుల్లో సారా దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి పీసీవోడీతో బాధపడుతున్న కారణంగా వేగంగా బరువు పెరిగానని గతంలో ఆమె వెల్లడించారు. కాగా కొలంబియా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని భావించిన సారా... తల్లి అమృతా సింగ్ సూచన మేరకు నాజూగ్గా తయారయ్యారు. ఇందుకోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమించారు. అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అధిక బరువుతో ఉన్ననాటి పాత వీడియోను సారా తాజాగా షేర్ చేశారు. తన ప్రస్తుత రూపానికి కారణం ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ అని పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షలకు మందికి పైగా వీక్షించగా.. తొమ్మిదిన్నర లక్షల మంది లైక్ కొట్టారు. దీంతో సారా పోస్టు వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తున్న సారాను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం.. ఇంత మార్పు ఎలా సాధ్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు
నెపోటిజమ్‌పై అనన్య పాండేకు మంచి అభిప్రాయం లేదంటున్నారు బాలీవుడ్ నటి పూజ బేడి కూతురు అలయా. కాగా అలయా ‘జవానీ జానేమాన్’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలయ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అవును.. అనన్యకు నెపోటిజమ్ మీద మంచి అభిప్రాయం లేదు కానీ నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుత వర్థమాన నటి, నటుల చిత్రాలను చూస్తున్నానని, వారి నటన తీరు, ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటున్నానని చెప్పారు. కాగా కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ టైలర్ ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అలయా మాట్లాడుతూ.. ‘సారా, కార్తీక్‌ల బెడ్ సీన్ చూశాను. అది చూసిన తర్వాత నాకు కూడా కార్తిక్‌తో అలాంటి సన్నివేశంలో నటించాలనిపించింది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కార్తిక్‌ను మీ బెడ్‌పై చూస్తే అప్పుడు మీ స్పందన ఎంటి అని అడిగిన ప్రశ్నకు ‘ఒకవేళ నేను లేచేసరికి కార్తిక్ నా బెడ్‌పై కనిపించినా ఆశ్చర్యపోను.. ఎందుకంటే అది నేను కోరుకున్న విషయమే.. ఇది ఇంతకు ముందే చెప్పాను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. అంతేకాదు ‘నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఓ బంధంలో ఉండటమంటే నా దృష్టిలో కష్టమే’ అని పేర్కొన్నారు. కాగా రాపిడ్ ఫైర్ గేమ్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు.. ‘పెళ్లి వరుణ్ దావన్ చేసుకుంటాను. డేటింగ్ కార్తిక్ ఆర్యన్‌తో చేస్తాను. ఇషాన్ ఖత్తర్‌ను చంపేస్తాను’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాగే ఒకే జెండర్‌తో అయితే ‘సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంటా, జాన్వీ కపూర్‌తో డేటింగ్ చేస్తా.. అనన్యను చంపేస్తా’ అని చమత్కరించడం విశేషం. -
‘ఇది ప్రపంచలోనే చెత్త విషయం’
అమృత సింగ్‌తో విడాకుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఇప్పటికీ దానిని అసౌకర్యంగా భావిస్తానని తెలిపారు. ప్రస్తుతం జవానీ జనేమాన్ చిత్రంలో నటిస్తున్న సైఫ్ పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించనున్న సైఫ్.. తన ముగ్గురు పిల్లల (సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, తైమూరు) గురించి కూడా మాట్లాడారు. అలాగే అమృతతో విడాకులపై కూడా స్పందించారు. అమృతతో విడాకులు తీసుకున్న విషయాన్ని సారా, ఇబ్రహీంలకు ఎలా చెప్పారని ప్రశ్నించగా సైఫ్ స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచలోనే చెత్త విషయం. దీన్ని భిన్నమైన విషయంగా భావిస్తున్నాను. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని ఎప్పటికీ అనుకోను. కొన్ని సంఘటనల నుంచి ఎప్పటికీ బయటపడలేమన్నా విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంద’ని భావోద్వేగానికి లోనయ్యారు. ‘కానీ వీలైనంత వరకు దీని నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నించాను. అప్పుడు నా వయసు 20 ఏళ్లు మాత్రమే.. కుర్రాడిగా ఉన్నప్పుడే నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. కాబట్టే నేను ఈ విధంగా చేయాల్సివచ్చిందని సమర్థించుకుంటాను. తల్లిదండ్రులు విడిపోయి రెండు కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండడమనే విషయం ఊహించలేనిదని.. అందుకే ఇప్పటికీ నేను అసౌకర్యానికి లోనవుతుంటాను’ అని సైఫ్ తెలిపారు. ఇక ఆధునిక కుటుంబంగా ఉంటూనే ఒకరిపట్ల ఒకరు ఎంతో గౌరవంతో ఎలా ఉండగలుగుతున్నారన్నా మరోప్రశ్నకు.. ‘ఎలాంటి పరిస్థతుల్లో అయినా కుటుంబానికి తోడుగా ఉండాలి. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఎప్పుడూ ఫిర్యాదు చేసుకొకుండా అర్థం చేసుకుని మెలగాలి. అయితే ఇద్దరు తల్లిదండ్రులను కలిగి ఉండటమనేది గొప్పవిషయం కాకపోవచ్చు.. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఇలాంటివి చోటు చేసుకుంటాయి’ అని సైఫ్ అన్నారు. స్థిరమైన ఇల్లు, మంచి కుటుంబ వాతావరణాన్ని పిల్లలకు ఇస్తే అదే మోడ్రన్ ఫ్యామిలీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి : ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి -
ఆ సినిమాకు రూ.100 కోట్లు డిమాండ్ చేశాడా?!
బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం కోసం నిర్మాత వద్ద పారితోషికం భారీగానే డిమాండ్ చేశాడనే వార్తలు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన అత్యధిక ధనార్జన నటుల జాబితాలో అక్షయ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో సౌత్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌లతో పాటు అక్షయ్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం దర్శకుడు ఆనంద్, అక్షయ్ బృందాన్ని సంప్రదించగా వారు రూ.100 కోట్లకు పైనే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అక్షయ్‌కు పెరిగిన క్రేజ్, అక్కీ నటించిన తాజా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో అంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నటన పరంగా కూడా అక్కీ.. వంద కోట్లకు మించిన పారితోషికానికి అర్హుడని సన్నిహితవర్గాలు అభిప్రాయపడుతున్నట్లు ఓ న్యూస్ ఛానెల్ పేర్కొంది. కాగా .. ‘గుడ్‌న్యూస్’, ‘హౌస్‌ఫుల్’ వంటి కామెడి డ్రామాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్‌ను.. కొన్ని వెబ్ సిరీస్, సాటిలైట్ ఛానెల్‌లు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అక్షయ్ అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నట్లు బాలీవుడ్లో గుసగుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అక్షయ్ తాజా నటించిన గుడ్‌న్యూస్ చిత్రం గత డిసెంబర్ విడుదలై బీ-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన నటించిన హౌస్‌ఫుల్ 4, మిషన్ మంగళ్ బ్లాక్బస్టర్లుగా నిలవడంతో ‘కిలాడి’ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. కాగా 2019లో ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 అత్యధిక ఆర్జన గల నటుల జాబితాలో అక్షయ్ 4వ స్థానంలో నిలవగా ద్వాయానె జాన్సన్, క్రిస్ హెమ్సన్‌వర్త్, రాబర్ట్ డౌనే 1,2, 3 స్థానాలు పొందిన సంగతి తెలిసిందే. -
అభిమాని హద్దు మీరిన చర్య
-
హీరోయిన్ చేతిని ముద్దాడబోయిన అభిమాని
తమకు నచ్చిన సెలబబ్రిటీ కళ్లముందు కనబడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దొరికిందే చాన్స్ అనుకొని సెలబబ్రిటీల దగ్గర మితిమీరి ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల సిసీనటులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు కూడా ఇలాంటి చేదు ఘటన ఎదురైంది. జిమ్ నుంచి బయటకు వచ్చిన సారా అక్కడి మీడియా ప్రతినిధులను నవ్వుతూ పలకరించింది. కొన్ని ఫొటోలకు స్టిల్స్ ఇవ్వండి అంటూ ఓ మీడియా కోరగా దాన్ని సున్నితంగా తిరస్కరించింది. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో సెల్ఫీలు దిగి, షేక్‌హ్యాండ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తున్న సారా చేతిని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సారా తన చేయిని వెనక్కు తీసుకుంది. మితిమీరి ప్రవర్తించిన అభిమానిని అక్కడి సెక్యూరిటీ గార్డు కోపంతో కొట్టడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై సారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు ఓ బాడీగార్డును నియమించుకోవచ్చు కదా’ అంటూ సారాకు సలహాలిస్తున్నారు. ‘అభిమాని హద్దు దాటి ప్రవర్తించడం ఏమీ బాగోలేదు’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. కాగా సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కూలీ నం.1 రీమేక్, లవ్ ఆజ్ కల్ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: వధూవరులుగా సారా-వరుణ్‌లు! ఇక రెచ్చిపోతా! -
వధూవరులుగా సారా-వరుణ్‌లు!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సారా అలీఖాన్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టరును చిత్ర యూనిట్ తాజాగా షేర్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు వధూవరులుగా కనువిందు చేశారు. ఫిలింట్రేడ్ అనలిస్టు ట్విటర్లో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వాసు భగ్నానీ, జాక్లీ భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్‌లు తెరకెక్కిస్తున్న వరుణ్, సారాల కూలీ నెం.1 2020 న్యూగ్లింప్స్’ అని పేర్కొన్నారు. ఇందులో ధావన్ వైట్ సూట్ ధరించగా.. వెడ్డింగ్ ఫ్రాక్‌లో సారా ఫొటోకు ఫోజులిచ్చారు. కాగా గతేడాది ఆగష్టులో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలింసిందే. అందులో ధావన్ ఎరుపు రంగు చొక్కా, తెల్లటి ప్యాంటు, నెహ్రు టోపి ధరించి కూలీలా కనిపిస్తాడు. ఇక 1995లో విడుదలై విజయం సాధించిన కూలీ నెం.1 సినిమాను అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు డేవిడ్ ధావన్. ఆనాటి కూలీ నెం.1లో గోవింద, కరిష్మా కపూర్లు నటించగా.. రీమేక్‌లో వరుణ్, సారా జోడికట్టారు. ఇది తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ నటించడం రెండోసారి. ఈ సినిమా 2020 మే1న విడుదల కానున్నట్లు సమాచారం. #VarunDhawan and #SaraAliKhan... New glimpse from #CoolieNo1... Directed by David Dhawan... Produced by Vashu Bhagnani, Jackky Bhagnani and Deepshikha Deshmukh... 1 May 2020 release. pic.twitter.com/0w4ROEafOs — taran adarsh (@taran_adarsh) 2 January 2020 -
చిట్టి తమ్ముడికి హీరోయిన్ విషెస్
బీ- టౌన్ స్టార్ కిడ్, పటౌడీ చోటా నవాబ్ తైమూర్ అలీఖాన్ పుట్టినరోజు వేడుకలు ముంబైలో గురువారం అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమ గారాల పట్టి మూడో పుట్టినరోజు వేడుకలకు బంధువులు సహా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. తైమూర్ మేనత్త, నటి సోహా అలీఖాన్ తన కుటుంబంతో సహా పార్టీకి హాజరుకాగా.. బాలీవుడ్ జంట జెనీలియా- రితేశ్ దేశ్‌ముఖ్ తమ పిల్లలతో కలిసి తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరీనా అక్క కరిష్మా కపూర్, ఆమె పిల్లలు, తైమూర్ అమ్మమ్మ బబిత తదితరులు పుట్టినరోజున తైమూర్‌ని ఆశీర్వదించారు. బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పిల్లలు సహా పలువురు చోటా సెలబ్రిటీలు తైమూర్ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. కాగా తైమూర్ అక్క, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మాత్రం అతడి పుట్టినరోజుకు హాజరుకాలేకపోయారు. షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా సోషల్ మీడియా వేదికగా తన చిట్టి తమ్ముడు తైమూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ హ్యాపీ బర్త్‌డే చిన్నారి టిమ్ టిమ్’ అంటూ తైమూర్‌తో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసి అతడిపై ప్రేమ చాటుకున్నారు. దీంతో వీరిద్దరి క్యూట్ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. ‘అందమైన అక్కాతమ్ముళ్లు మీరు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సారా అలీఖాన్... సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ దంపతుల కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram Happiest birthday little Tim Tim 🤗🎂🧁💓🌈🧿💋💥👼 #munchkin #cutiepie #birthdayboy A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Dec 19, 2019 at 6:26pm PST View this post on Instagram #kareenakapoorkhan & #saifalikhan celebrating son #taimuralikhan birthday #virabhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Dec 19, 2019 at 3:18am PST -
పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే!
ఇస్లామాబాద్: ఈ ఏడాదిగానూ పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌లు టాప్-10లో నిలిచారు. పాకిస్తాన్లో అత్యధిక మంది వీరికి సంబంధించిన సమాచారం గురించే వెదికినట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. అదే విధంగా ఇండియన్ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని కనబరిచారని వెల్లడించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేసినా రహస్య సమాచారం వారికి ఇవ్వకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత్‌తో పాటు పాక్ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఇక సారా అలీఖాన్.. పటౌడీ వంశ వారసురాలు, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సారా.. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు పొందారు. అదే విధంగా వివిధ కార్యక్రమాల్లో తన కట్టూబొట్టుతో ఫ్యాషన్ ఐకాన్‌గా యువతలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ నంబర్.1’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా భారతీయులు ఆర్టికల్ 370, అయోధ్య కేసు, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి తదితర అంశాల గురించి అత్యధికంగా వెదికినట్లు గూగుల్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే.(మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?) -
‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’
ముంబై: కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ గారాల పట్టి సారా ఆలీఖాన్. బీ-టౌన్లో అడుగుపెట్టిన ఏడాదిలోనే మూడు సినిమాల్లో నటించి మెప్పించి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీంతో సారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తాజాగా సారా అలీఖాన్ షేర్ చేసిన తన చిన్ననాటి ఫోటోలకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోలో సారా అలీఖాన్ రాజస్థానీ సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం పటౌడీ యువరాణిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఎరుపు, నల్లని రంగు గాగ్రచోలీతో పాటు ఐషాడో, గ్లాసీలిప్స్టీక్తో పెద్ద చెవి దిద్దులు, బంగారు గాజులు ధరించిన ఈ ఫోటోలో సారా ఆలీఖాన్ భలే ముద్దుగా ఉందంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే మరో ఫోటోలో షీమ్మెరి బ్లాక్ లెహంగాతో పాటు బంగారు చెవి దిద్దులు, మాంగ్ తిలకం, గాజులు ధరించి.. ఎరుపు రంగు పాగా తలపై ధరించి ఉన్న ఫోటోకి ‘2000 సంవత్సరం నుంచి ఈ షాట్ కోసమే ఎదురు చుశాను’ అనే క్యాప్షన్ జత చేసి షేర్ చేసింది సారా అలీఖాన్. ప్రస్తుతం ఈ ఫోటో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram Waiting for my shot since 2000 ⏰ 🎥 🎬🔌🔜🙇🏻♀️#apnatimeayega #tbt #sarakadrama A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Nov 7, 2019 at 1:41am PST ఇక గతేడాది వచ్చిన కేదర్నాథ్, సింబా సినిమాలతో హీరోయిన్గా మంచి విజయాలు సాధించిన సారా.. ఈ ఏడాది వరుణ్ ధావన్ కూలీ నెం.1 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడంతో మరో విజయాన్ని సారా తన ఖాతాలో వేసుకుంది. కాగా సారా ఈ సినిమా షూటింగ్లో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి చేసిన అల్లరి ఫోటోలను కూడా షేర్ చేసింది. View this post on Instagram Cool and Coolie💁🏻♀️🙆🏽♂️🧳👜👫🌈 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Nov 4, 2019 at 8:34pm PST -
పద్ధతి గల మహిళలు
‘అమ్మాయిలూ.. మీరెలా ఉంటే అదే పద్ధతి. మీరెలా ఉండాలనుకుంటే అదే పద్ధతి’ అంటూ ‘రూల్స్‌ని బ్రేక్ చేయడం ఎలా?’ అని ప్యూమా కంపెనీ.. నలుగురు సెలబ్రిటీల చేత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అమ్మాయిలకు కొత్త పాఠాలు చెప్పిస్తోంది. అవి వినే పాఠాలు కాదు! కలిసి ఆడే పాటలు, కలిసి పాడే ఆటలు! స్త్రీలు అలా ఉండాలని, ఇలా ఉండాలని వాళ్లు పుట్టినప్పట్నుంచీ సమాజం స్టిక్ పట్టుకుని పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మేథ్స్, ఫిజిక్స్లా.. ఒద్దిక, అణుకువ అనేవి అమ్మాయిలకు సమాజం టీచ్ చేసే ముఖ్యమైన సబ్జెక్టులు! ఆ సబ్జెక్టుల్లో పాస్ అయితేనే చివరికి వారికి ‘ప్రాపర్ లేడీ’ అనే ప్రశంసాపత్రం వస్తుంది. ఆ పత్రం ఉంటేనే అమ్మాయి అమ్మాయిగా పెరిగినట్లు. ‘ప్రాపర్ లేడీ’ అంటే పద్ధతిగా పెరిగిన పిల్ల అని! అయితే ఇప్పుడు ‘ఫ్యూమా’ అనే అంతర్జాతీయ స్పోర్ట్స్ కంపెనీ ‘పద్ధతిగా లేకపోవడమే పద్ధతి’ అనే ఒక వీడియో క్యాంపెయిన్ మొదలు పెట్టింది! ‘ఎప్పుడూ ఎంపవర్మెంట్ని సాధించే పనేనా? సాధించిన ఎంపవర్మెంట్ని వేడుక చేసుకునేది ఎప్పుడు?’.. అని సారా అలీ ఖాన్, మేరీ కోమ్, అంజలీ లామా, ద్యుతీ చంద్ ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతారు. మీ చెయ్యి పట్టుకుని వాళ్లలోకి మిమ్మల్ని లాగేసుకుంటారు. సారా అలీఖాన్ బాలీవుడ్ వర్ధమాన నటి. మేరీ కోమ్ ఇండియన్ ఒలింపిక్స్ బాక్సర్. ద్యుతీ చంద్ ఇంటర్నేషనల్ అథ్లెట్, అంజలీ లామా ట్రాన్స్‌జెండర్ మోడల్. వీళ్లంతా స్టార్స్ కదా! పద్ధతిగా పెరగకపోతే, పద్ధతిగా ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంతవరకూ వస్తారా అనేదే మీ సందేహమైతే ఆ సందేహాన్ని తుడిచిపెట్టేయండి. వాళ్లు వాళ్లలాగే ఉంటూ.. ఇంత పైకి వచ్చారు. ‘వాళ్లలాగే అంటే..?’ అని ఇంకో డౌటా! ఒరిజినల్‌గా వీళ్లేమిటో ప్యూమా కంపెనీ తయారు చేయించిన ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ వీడియో చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కో పోకిరి పిల్ల్ల, కుండల్ని బద్దలు కొట్టే పిల్ల, ఎవరేమనుకుంటే నాకేంటి అనే పిల్ల, నీ గేమ్ నీ లైఫ్ అనే పిల్ల సాక్షాత్కరిస్తుంది. కుర్చీలో ‘అదోలా’ కూర్చుంటుంది ద్యుతీచంద్. నోటినిండా బబుల్గమ్ ఊదుతూ ఇంత కళ్లేసుకుని చూస్తుంది సారా అలీఖాన్. ‘ఉంటే జిమ్‌లో ఉండు.. లేదంటే స్ట్రీట్ ఫైట్‌లో ఉండు’ అంటుంది రింగ్‌లో జారి గిలబడి ఉన్న మేరీకోమ్. ‘నాకు ఇష్టమైనది తప్ప నాకు ఇంకేదీ వద్దు’ అని తెగే వరకు లాగి చెప్పేస్తుంది అంజలీ లామా! నేడో రేపో ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ అనే ఈ ప్యూమా కంపెనీ ప్రచారం ప్రారంభం కాబోతోంది. చూడండి. ‘పద్ధతిగా ఉండండి’. నీ గేమ్.. నీ లైఫ్..! సారా అలీఖాన్ నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చినట్లు నేనుంటా. మేరీ కోమ్ పంచ్ ఇస్తే తప్ప లైఫ్ దారికి రాదనుకుంటే పంచ్ ఇవ్వాల్సిందే ద్యుతీ చంద్ ఒకటేదైనా అనుకుంటే వదిలిపెట్టకు. నువ్వు అనుకున్నదాని కోసం నిన్ను నువ్వు వదులుకున్నా తప్పేం లేదు. అంజలీ లామా నా అన్వేషణ శిఖరంపై ఉన్నప్పుడు నేనెందుకు నేలపై వెదుక్కుంటాను? -
ఏదైనా నేర్చుకోవడమే
గత ఏడాది ‘కేధార్నాథ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఆ తర్వాత రోహిత్‌శెట్టి ‘సింబ’లో హీరోయిన్గా మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేవిడ్ ధావన్ (కూలీ నం 1 తాజా రీమేక్), ఇంతియాజ్ అలీ (లవ్ ఆజ్ కల్ సీక్వెల్) వంటి సీనియర్ దర్శకులతో వర్క్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే బాగా అనుభవం ఉన్న దర్శకుల సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా? అన్న ప్రశ్నకు సారా బదులిస్తూ–‘‘అలా ఏం లేదు. డేవిడ్, ఇంతియాజ్సార్లతో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నా లక్ కూడా. ఇంతియాజ్సర్ షూటింగ్ ఉందంటే రెండు వారాల ముందే రిహార్సల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక డేవిడ్సర్ సినిమా అంతా సెట్లో అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఉంటుంది. ఈ రెండు అనుభూతులు నాకు వినోదాత్మకంగానే ఉన్నాయి. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. ఏదైనా నేర్చుకోవడమే అనుకుని కష్టపడుతున్నాను. నా పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. గ్లామర్, డ్యాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఇష్టమే కానీ నేను చేసే కమర్షియల్ సినిమాల్లో నా పాత్రలో పెర్ఫార్మెన్స్, ఎమోషన్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఉందో లేదో చూసుకుంటాను’’ అన్నారు. -
‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’
దేశమంతా బొజ్జ గణపయ్య వేడుకల్లో మునిగిపోయిన వేళ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా గణనాథుని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. పూజలు నిర్వహించి అనంతరం షూటింగ్ నిమిత్తం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘ గణపతి బప్పా మోరియా!! మీకున్న అడ్డంకులు తొలగించి, ఏడాదంతా సానుకూల దృక్పథంతో నవ్వుతూ సంతోషాలు సొంతం చేసుకునేలా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో సారా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. ‘నువ్వసలు ముస్లింవేనా? పవిత్ర మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా? ఇంతకీ నీ మతం ఏమిటో గుర్తుందా లేదా’ అంటూ సారాను ట్యాగ్ చేస్తూ విపరీతమైన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ట్రోల్స్‌పై స్పందించిన ఆమె అభిమానులు...‘లౌకిక దేశమైన భారత్‌లో ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన రీతిలో భగవంతుడిని కొలవచ్చు. వినాయక చవితితో పాటు ఈద్ కూడా గొప్పగా జరుపుకోవాలి సారా’ అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. కాగా సారా అలీఖాన్ ఒకప్పటి బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్‌ల కూతురన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బీ-టౌన్లో ఎంట్రీ ఇచ్చిన సారా సింబాతో హిట్ కొట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా గతేడాది తన ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి.. దేవుడికి మొక్కుతున్న చిన్నారి అబ్రాం ఫొటో షేర్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. View this post on Instagram Ganpati Bappa Morya!! May Ganesh Ji remove all your obstacles, and fill your year with laughter, positivity and success. 🙏🏻🙌🏻💐🌸💫🌠💥🍰🧿🔮🎊🎉🎈💝🕉 #happyganeshchaturthi A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Sep 2, 2019 at 4:27am PDT -
ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?
ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? స్టార్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన బ్యూటీ ఈమె. ఆమె ఎవరో కాదు, సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్. సినీ ప్రముఖుల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చేందుకు తమని తాము ఎంతో మార్చుకుంటారు. అలా సారా అలీఖాన్ కూడా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తరువాతే తెరంగేట్రం చేశారు. గత ఏడాది రిలీజ్ అయిన కేథార్నాథ్, సింబా సినిమాలతో ఆకట్టుకున్న సారా ప్రస్తుతం కూలీ నెంబర్ 1తో పాటు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ‘నన్ను ఎవరూ విసిరేయలేని రోజుల్లోని ఫోటో’ అంటూ కామెంట్ చేశారు. తల్లి అమృతా సింగ్‌తో కలిసి దిగిన ఈ ఫోటోలో సారాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. భారీకాయంతో ఉన్న సారాను ఈ ఫోటోలో గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇండస్ట్రీలోకి రాక ముందు సారా 90 కేజీలకు పైగా బరువు ఉండేవారు. ఒబెసిటీ కారణంగా ఆమె ఆరోగ్యసమస్యలను కూడా ఎదుర్కొన్నారు. అయితే హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవాలన్న పట్టుదలతో సరైన ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ నాజుగ్గా రెడీ అయ్యారు. తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సారా షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. View this post on Instagram Throw🔙 to when I couldn’t be thrown🔙☠️🙌🏻🎃🐷🦍🍔🍕🍩🥤↩️ #beautyinblack A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Sep 4, 2019 at 1:54am PDT -
‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’
చేసింది రెండు చిత్రాలే అయినా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సారా అలీ ఖాన్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించడం.. రెండో చిత్రంలో ఏకంగా రణ్వీర్ సింగ్‌తో జత కట్టి అందరి దృష్టిని ఆకర్షించారు సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్-అమృతా సింగ్‌ల గారాల పట్టి అయినా సారా అలీఖాన్ తాజాగా ఫెమినా షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీనా కపూర్ గురించి సారా అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీనా కపూర్‌ని నా స్నేహితురాలిగా భావిస్తాను. అంతకు మించి తను మా నాన్నకు భార్య. తను మా నాన్నను సంతోషంగా ఉంచుతుంది. అందుకే ఆమె అంటే నాకు గౌరవం. పైగా ఇద్దరం సినిమాలకు చెందిన వాళ్లమే.. ఇద్దరి ఒకే ప్రపంచం. అందుకే మేమిద్దరం కలిస్తే.. ఎక్కువ భాగం సినిమాల గురించే మాట్లాడుకుంటాం’ అని తెలిపారు. గతంలో కాఫీ విత్ కరణ్ షో సందర్భంగా కూడా సారా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘కలిసి ఉండి నిత్యం గొడవ పడే బదులు.. వీడిపోయి స్నేహంగా ఉండటం మంచిది. మా తల్లిదండ్రులు కూడా ఇదే చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక కరీనా నాకు మంచి స్నేహితురాలు. తను నాతో ఎప్పుడు ఓ మాట చెప్తుంది. ‘మీ అమ్మ చాలా గొప్పది. ఆ స్థానాన్ని నేను ఎన్నటికి తీసుకోను. నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను’ అనేది’ అన్నారు. అంతేకాక తన తండ్రి కూడా కరీనాను మారు తల్లిగా ఎప్పుడు తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికోస్తే.. ప్రస్తుతం సారా, వరుణ్ ధావన్ కూలీ నం.1 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’
‘నా కాళ్లు మొక్కి డబ్బులు ఇచ్చి, ఏదో ఒకటి తినిపించి.. ఆత్మీయంగా హత్తుకుంటావు కదా. ఒట్టేసి చెబుతున్నా నిన్ను సతాయించడం మానను, నీ డబ్బులు లాక్కుంటూనే ఉంటాను, నీ దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ నేనే తినేస్తా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమగా ఆలింగనం చేసుకుంటా. ఈరోజు నిన్ను చాలా మిస్సవుతున్నా. నా చిన్ని తమ్ముడికి రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌కు ఆత్మీయ సందేశం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ్ముడు ఇబ్రహీంను ఆత్మీయంగా చూస్తున్న సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ పటౌడీ కుటుంబానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ దంపతుల తనయ అయిన సారా కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్ రోజు తోబుట్టువుకు దూరంగా ఉన్న సారా సోషల్ మీడియాలో తనకు విషెస్ చెప్పారు. ఇక అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్ అలీఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram Happy Rakhi to my baby brother 🍼👶🤗👫 Missing you today- touching my 🦶, giving me 💰, feeding me 🍬 and hugging me 🤗. I promise to bully you, extort you, greedily eat all your food and force love and cuddles out of you forever. #bestbrother #partnerincrime #safeandsecure A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Aug 14, 2019 at 10:17pm PDT -
బర్త్‌డే రోజూ షూటింగ్లో బిజీబిజీ..
ముంబై : కేదార్నాథ్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ రెండో సినిమా సింబాతో రూ 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్గా మారింది. సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా 24వ పుట్టినరోజు కావడంతో ఈరోజంతా ఆమె పార్టీల్లో మునిగితేలుతుంది అనుకుంటే పొరపడినట్టే. బర్త్‌డే రోజూ ఈ భామ షూటింగ్తోన బిజీబిజీగా గడపనున్నారు. వరుణ్ ధావన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న కూలీ నెంబర్ 1 రీమేక్ షూటింగ్ కోసం సారా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నారు. బర్త్‌డే రోజు పనికి విరామం ఇచ్చేందుకు మూవీ రూపకర్తలు ముందుకొచ్చినా సారా సున్నితంగా తోసిపుచ్చినట్టు తెలిసింది. గత ఏడాది సైతం బర్త్‌డే రోజు ఆమె తన తొలి మూవీ కోసం సన్నద్ధమయ్యేందుకు రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇక ఈసారి బ్యాంకాక్‌లో షూటింగ్లో ఉండటంతో సెట్లోనే బర్త్‌డేను జరుపుకోనున్నారు. -
నంబర్ 1 కూలీ
కొత్త లైసెన్స్ తీసుకుని పని మొదలుపెట్టాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. కానీ వరుణ్ లైసెన్స్ తీసుకున్నది కూలి పని చేయడానికి. కొత్తగా కష్టం ఏం రాలేదు. కొత్త సినిమా ‘కూలీ నం 1’ను స్టార్ట్ చేశాడంతే. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ‘కూలీ నం.1’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేశారు వరుణ్ ధావన్. ‘‘సరిగ్గా ఏడాది తర్వాత నం.1 కూలీ వస్తాడు. మస్త్ మజా చేస్తాడు’’ అని ఈ సందర్భంగా వరుణ్ పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. డేవిడ్ థావన్ దర్శకత్వంలోనే 1995లో వచ్చిన ‘కూలీ నం.1’ చిత్రానికి ఈ 2019 ‘కూలీ నం.1’ రీమేక్ అని బీటౌన్ టాక్. -
రెడీ టు ఓట్!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే పండుగే. ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఐదేళ్లకోసారి వస్తుంది. అలాంటిది తొలిసారి ఓటు హక్కు వస్తే ఆ కిక్కే వేరబ్బా. యువతలో ఉత్సాహం పొంగిపొరలుతుంది. ఓటుహక్కు వినియోగించుకొని సిరా చుక్క ఉన్న వేలుని చూపిస్తూ సెల్ఫీ దిగితే చాలు.. ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం. ఈ ఉత్సాహానికి సామాన్యులా, సెలబ్రిటీలా అన్న తేడా లేదు. ఓటింగ్ పెంచడానికే ఈసారి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి ఫొటోలు దిగి ప్రచారాన్ని ప్రారంభించారు. మరెందరో బాలీవుడ్ నటీనటులు ఓటు వేయండహో అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. రాజకీయ రంగం మాదిరిగానే బాలీవుడ్‌లోనూ వారసులదే హవా. ఈసారి ఏయే తారల నట వారసులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారంటే.. అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, శ్రీదేవి వెండితెర సామ్రాజ్యాన్ని ఏలినవారు. వీరి వారసులు కూడా అదే స్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి కూడా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తమ స్టైల్‌తో, సెల్ఫీలతో ఆకట్టుకునే ఈ యంగ్ తరంగ్‌లో చాలామంది తొలిసారి ఓటు వేయనున్నారు. ముంబైలో ఈ నెల 29న జరగనున్న పోలింగ్‌లో వీరిలో చాలామంది తొలిసారి తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న బాలీవుడ్ స్టార్ వారసులు వీరే... ఇరా ఖాన్ ఆమిర్‌ఖాన్ మొదటి భార్య రీనా చిన్న కుమార్తె ఇరా ఖాన్. 22 ఏళ్ల ఇరా ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించదు. తండ్రితో బయట కనిపించినప్పుడు మాత్రం వార్తల్లో వారి చిత్రాలు చోటు చేసుకుంటాయి. తొలిసారి ఓటింగ్‌కి ఇరా సిద్ధమవుతోంది. ఆలియా ఫర్నీచర్‌వాలా హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన నటి పూజా బేడీ కూతురు ఆలియా. 21 ఏళ్ల ఆలియా సైబర్ బుల్లీయింగ్‌పై గళం ఎత్తటంతో గత ఏడాది వార్తాల్లోకి ఎక్కింది. ఈమె ఎక్కువ శాతం విదేశాల్లోనే గడుపుతుంటుంది. అయినా ఓటు వేసే అవకాశం ఉంది. ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్, అమృతాసింగ్‌ల కుమారుడు ఇబ్రహీం అలీఖాన్. 18 ఏళ్లు నిండటంతో ఓటు వెయ్యడానికి అర్హత సంపాదించుకున్నాడు. అయితే ఇబ్రహీం ఓటింగ్ తేదీకి నగరంలో ఉంటాడో లేదో స్పష్టత లేదు. నవ్య నవేలి నందా అమితాబ్‌బచ్చన్ మనవరాలు నవ్యకి 22 ఏళ్లు. ఢిల్లీలో నివసించే ఈమె మొదటిసారి తన ఓటుని మే 12న వినియోగించుకోనుంది. అక్కాచెల్లెళ్లు పోలింగ్ కేంద్రానికి వెళతారా? శ్రీదేవి–బోనీకపూర్‌ల పెద్ద కూతురు జాహ్నవికి ఇప్పుడు 22 ఏళ్లు. ‘ధడక్’ హిందీ చిత్రంతో గట్టి ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి ఇప్పుడు ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది తన ఓటు హక్కుని వినియోగించుకోనుంది. ఈమె సోదరి ఖుషీ కపూర్‌కు 19 ఏళ్లు. సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది ఖుషీ. అమ్మ, అక్క బాటలో ఈమె త్వరలో చిత్రరంగంలోకి ప్రవేశించనుంది. అక్కాచెల్లెళ్లిద్దరూ తొలిసారి ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అనన్య పాండే బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు అనన్యకి ఇటీవలే 20 ఏళ్లు రావటం తో ఓటెయ్యడానికి సిద్ధమైం ది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2 చిత్రంతో సినీ ప్రవేశం చేస్తోంది. అన్నాచెల్లెళ్లకి ఆ స్ఫూర్తి ఉందా? ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు. ఈ అబ్బాయి సిటీలోకి వస్తే చాలు పాపారాజీ మొదలు. ఎక్కడికెళ్లినా ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేస్తుంటారు. ఆ పాపారాజీకి చిక్కితే ఆర్యన్ తండ్రితో కలిసి ఓటు వెయ్యటం వైరల్ వీడియోగా మారొచ్చు. అయితే 21 ఏళ్ల జూనియర్ ఖాన్ విదేశాల్లో చదువుతున్నందు వల్ల వచ్చి ఓటేసే అవకాశాలపై అనుమానాలున్నాయి. ఇక షారుక్ కుమార్తె సుహానా ఖాన్.. ఆర్యన్లాగే సుహానా ఒక్క ఫొటో దొరికితే చాలు ఇంటర్నెట్ అంతా హల్చలే. షారుక్, గౌరీ ఖాన్ గారాల పట్టి సుహానాకు నిరుడు 18 ఏళ్లు నిండాయి. ఆమె ఈ ఏడాది తొలిసారి ఓటు వెయ్యవచ్చు. శనాయా కపూర్ బాలీవుడ్ హీరో అనిల్‌కపూర్ తమ్ముడు, హీరో సంజయ్ కపూర్ కూతురు శనాయా కపూర్. ఈమెకి 19 ఏళ్లు. ఈ ఏడాది మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకోనుంది. పెదనాన్న కూతురు సోనమ్ కపూర్ నటనా స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది శనాయా. -
‘నా మనవరాలిని చూస్తే గర్వంగా ఉంది’
కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీఖాన్ తనయ సారా అలీఖాన్ ‘సింబా’తో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతేకాదు చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ కిడ్‌గా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో సారా నానమ్మ, పాత తరం హీరోయిన్ షర్మిలా ఠాగూర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. లైఫ్ టైమ్ అవార్డు అందుకునేందుకు ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ... ‘ సారా సినిమాలు, ఇంటర్వ్యూలు చూశాను. తను పరిణతితో మాట్లాడుతోంది. అద్భుతంగా నటిస్తోంది. వృత్తి పట్ల తన అంకిత భావం అమోఘం. నిరాండంబరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుంది. మానవత్వం గల వ్యక్తి. అయితే అన్నింటి కన్నా కూడా పెద్దల పట్ల సారాకున్న మర్యాద, వారితో ప్రవర్తించే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే సారాను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది’ అని మనవరాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా సారా... సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘లవ్ ఆజ్కల్2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సారాకు జంటగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నాడు. -
కొత్త ప్రేమాయణం
ప్రేమించుకునేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు హీరో హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్ అండ్ సారా అలీఖాన్. అక్కడి నుంచి పంజాబ్‌కు ప్రయాణిస్తారట. వారి ప్రేమ జ్ఞాపకాలను వెండితెరపై చూడాలంటే చాలా టైమ్ ఉంది. ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘లవ్ ఆజ్ కల్’కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు ఇంతియాజ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తారు. ఢిల్లీ షెడ్యూల్ తర్వాత ఈ టీమ్ పంజాబ్ వెళ్తుందట. ముంబైలో కూడా కొన్ని సీన్స్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ సినిమాలో సారా అలీఖాన్ తండ్రి, ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాలో సైఫ్ నటించడం లేదని, ఆయన్ను ఆనుకున్న పాత్రలో రణ్‌దీప్ హుడా నటించనున్నారని తెలిసింది. ఇంతకుముందు ‘హైవే’ చిత్రం కోసం ఇంతియాజ్ అండ్ రణ్‌దీప్ కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. తాజా సీక్వెల్‌ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట. -
‘నీ చదువు నీకిదే నేర్పిందా?’
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యంహకారి అంటూ నెటిజన్లు సారాపై మండిపడుతున్నారు. సారా పోస్ట్ చేసిన ఓ మ్యాగ్జైన్ కవర్ ఫోటో ఈ విమర్శలకు కారణం అయ్యింది. వివరాలు.. సారా తొలిసారి ‘ఫిల్మ్‌ఫేర్’ అనే మ్యాగ్జైన్ కవర్ పేజీ మీద కనిపించింది. ఈ ఫోటో షూట్లో భాగంగా సారా ఓ మసాయి తెగ వ్యక్తితో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ చదువు నీకిదే నేర్పిందా. ఇతరులు మన సంస్కృతిని గౌరవించాలని ఎలా భావిస్తామో.. అలానే మనం కూడా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని తెలీదా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ‘పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను, వారి సంస్కృతులను కించపర్చడం మంచిది కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలతో జనాలకు విసుగు తెప్పించకు. నీ ఫోటోలు జాత్యంహకారానికి నిదర్శనంగా నిలిచాయం’టూ మండిపడుతున్నారు. -
పెద్దింటి అమ్మాయి
చేసింది రెండు సినిమాలే అయినా తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది సారా అలీఖాన్. గర్ల్–నెక్స్ –డోర్ ఇమేజ్ సొంతం చేసుకున్న సారా అలనాటి అందాల కథానాయిక షర్మిలా టాగోర్ ముద్దుల మనవరాలు. సైఫ్ అలీఖాన్–అమృతాసింగ్‌ల కూతురు. బాలీవుడ్ న్యూ ఫేవరెట్ ఫేస్ సారా గురించి కొన్ని ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ఫోన్లో పాటలు! ఇంట్లో సినిమా వాతావరణం పెద్దగా లేకపోయినప్పటికీ, ‘నువ్వు సినిమాల్లో నటించాల్సిందే’ అని ఎవరూ అనకపోయినప్పటికీ సినిమాలు ఇష్టంగా చూస్తుండేదాన్ని. ఏదైనా పాత్ర బాగా నచ్చితే ‘ఈ పాత్రలో నేను నటిస్తే ఎంత బాగుండేది’ అనుకునేదాన్ని. స్కూల్ హెడ్మాస్టర్కి ఫోన్ చేసి హిందీ పాటలు పాడటం నుంచి, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్‌ను అనుకరిస్తూ గంతులు వేయడం వరకు రకరకాల చిలిపిపనులు చేసేదాన్ని. అచ్చంలా అలాగే! చిన్నప్పటి సరదా జ్ఞాపకం ఇది...ఎప్పుడైనా అమ్మతో గొడవపడుతున్నప్పుడు, ఆమెకు విసుగొచ్చేది. ‘ప్చ్...అచ్చం నువ్వు మీ నాన్నాలాగే’ అనేది.ఎప్పుడైనా నాన్నతో గొడవైనప్పుడు... ‘ప్చ్...నువ్వు అచ్చం మీ అమ్మలాగే’ అంటుండేవాడు! మరీ అంతొద్దు... ఈ ఆన్లైన్ యుగంలో ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసుకుని బాధ పడనక్కర్లేదు. దీనివల్ల ఆరోగ్యానికి చేటు తప్ప ఒరిగేదేమీ లేదు. నేను ఒకసారి క్యాప్ ధరించడం చూసి ఒకరు అన్నారు: ‘‘బఫూన్లా ఉన్నావు’’ అని. అంతమాత్రాన నేనేమీ చిన్నబోలేదు. అరవలేదు. హాయిగా నవ్వుకున్నాను. ఆన్లైన్ కామెంట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాను. చదువు... నా దృష్టిలో చదువుకు బాగా ప్రాధాన్యత ఉంది. చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. చదువుకున్న వ్యక్తిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన జ్ఞానం వస్తుంది. సొంతకాళ్ల మీద ఎలా నిలబడాలో తెలుస్తుంది. కొత్త జీవితం ‘నటన అంటే ఆషామాషీగా తీసుకోవాల్సిన వృత్తి కాదు’ అని చెబుతుంటారు నాన్న. ఆ ఒక్క మాటలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. బయట సంగతి ఎలా ఉన్నా ఇంట్లో మామూలు అమ్మాయిగానే పెరిగాను. సినిమాల్లోకి వచ్చాకే...దీపావళి పార్టీ, క్రిస్మస్ పార్టీ, బర్త్ డే పార్టీ, హాయ్ పార్టీ, బై పార్టీలు పరిచయమయ్యాయి. చెప్పాలంటే ఇప్పుడు నాకు జీవితం కొత్తగా ఉంది. -
హ్యాపీ మూడ్
చిన్నప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా నాన్నను చూసుకున్న కూతురికి ఆయనతో కలిసి నటించే చాన్స్ వస్తే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఆ హ్యాపీ మూడ్‌లోనే ఉన్నారట సారా అలీఖాన్. ఎందుకంటే ఆమె తన నెక్ట్స్ మూవీ ‘లవ్ ఆజ్ కల్ 2’లో తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించబోతున్నారట. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తారు. ఇంతియాజ్ ఆలీ దర్శకుడు. కార్తీక్– ఇంతియాజ్ కాంబినేషన్లోనే 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమాలో ఒక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ఓ సీనియర్ నటుడి అవసరం వచ్చింది. వెంటనే డైరెక్టర్ సైఫ్‌నే ప్రిఫర్ చేశారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రియల్ లైఫ్‌లో మాదిరిగానే ఈ రీల్ లైఫ్‌లోనూ సైఫ్, సారా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
రూ.200కోట్ల దిశగా ‘సింబా’
పూరి జగన్నాద్ మార్క్ మ్యానరిజం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించాలని బాలీవుడ్, కోలీవుడ్ ప్రయత్నించాయి. కోలీవుడ్‌లో విశాల్ ‘అయోగ్య’ గా తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్లో రణవీర్‌సింగ్ ‘సింబా’ గా రీమేక్ చేశారు. ఈ చిత్రం గతవారం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ నటనకు, రణవీర్ నటకు పోలిక లేకున్నా.. సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వందకోట్లు, ఏడు రోజుల్లోనే 150కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఇదే జోరును కొనసాగిస్తే.. ‘సింబా’ 200కోట్లను దాటేసి.. 250కోట్లను వసూళ్లు చేసే అవకాశంఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్గా నటించారు. #Simmba benchmarks... Crossed ₹ 50 cr: Day 3 ₹ 100 cr: Day 5 ₹ 150 cr: Day 7 With no major release today, #Simmba is sure to dominate the marketplace... ₹ 200 cr mark is definitely within reach... Can even touch ₹ 250 cr, depending on how it trends from next week [11 Jan]. — taran adarsh (@taran_adarsh) 4 January 2019 -
‘అవకాశం కోసం.. ఆమె నా వెంటపడింది’
రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘సింబా’. తెలుగులో హిట్ సినిమాగా నిలిచిన ‘టెంపర్’ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ శుక్రవారం విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ‘సింబా’ ప్రమోషన్లలో భాగంగా రోహిత్ శెట్టి కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సారాను హీరోయిన్గా ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘ సారా నా దగ్గరికి వచ్చి హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం తనకే ఇవ్వాలంటూ నా వెంటపడింది. బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ దంపతుల ముద్దుల తనయ నా దగ్గరికి వచ్చి అలా అడిగే సరికి నా కళ్లు చెమర్చాయి. సింబాలో సారాను తీసుకోవాలని సైఫ్ నన్ను ఒక్కసారి సంప్రదించలేదు. సారాపై నమ్మకంతో తనను హీరోయిన్గా ఫైనల్ చేశాను’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా సామాజిక సందేశం మిళితమైన ‘సింబా’ వంటి సినిమాలో భాగమయ్యేందుకు తానే డైరెక్టర్ రోహిత్ శెట్టిని బతిమిలాడానంటూ సారా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మొదట తన రిక్వెస్ట్‌ను రోహిత్ పట్టించుకోలేదని... కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేస్తున్నట్లు తనకు ఫోన్ చేశాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ‘సింబా’ సారాకు రెండో సినిమా. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన కేదార్నాథ్ సినిమాతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.