‘కూలీ నెం 1’ ట్రైలర్‌ విడుదల | Varun Dhawan, Sara Ali Khan's Comedy Coolie No 1 Trailer | Sakshi
Sakshi News home page

వరుణ్‌ ధావన్‌ సరసన సారా అలీఖాన్‌

Published Sat, Nov 28 2020 4:48 PM | Last Updated on Sat, Nov 28 2020 4:56 PM

Varun Dhawan, Sara Ali Khan's Comedy Coolie No 1 Trailer - Sakshi

బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్ ‘కూలీ నెం 1’ ట్రైలర్‌ వచ్చేసింది. ఆద్యంతం నవ్వులూ పూయిస్తూ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వరుణ్‌ సరసన సారా అలీఖాన్‌ నటించింది. ఎప్పుడు వస్తుంది ఈ నవ్వులు పండించే ట్రైన్‌ అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్​మస్ కానుకగా అభిమానులు ముందుకు ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  కూలీ నెం 1 డేవిడ్‌ ధావన్‌కి  45వ చిత్రం. 1995లో విడుదలైన కూలీ నెం 1 చిత్రాన్ని, ఇప్పుడు అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వాసు భగ్నానీ ఉన్నారు. వరుణ్ ధావన్​కు 'సూయిధాగ్​' వంటి హిట్ తర్వాత ఆ స్థాయిలో హిట్‌ రాలేదు. 'కళంక్​', 'స్ట్రీట్​డాన్సర్' సినిమాలు అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయాయి. కూలీ నెం 1తో అయినా హిట్‌ దక్కుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ప్రస్తుతం రాజ్​మెహతా తెరకెక్కిస్తున్న 'జుగ్​ జుగ్​ జియో' (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్​లో వరుణ్ ధావన్ బిజీగా ఉన్నాడు. ఇందులో కియారా అడ్వాణీ జోడీగా నటించనుంది.  ఆ తర్వాత అమర్​కౌశిక్ రూపొందిస్తున్న హారర్​ కామెడీ సినిమా 'భేదియా', సాజిద్ నదియావాలా తీస్తున్న యాక్షన్ చిత్రం 'సంకి'.. షూటింగ్​ల్లో పాల్గొననున్నాడు వరుణ్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement