‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’ | Kartik Aaryan Shares Video That Sara Ali Khan Being Called Bhabhi | Sakshi
Sakshi News home page

‘వదినా.. అతనే కదా అలా పిలవమని చెప్పింది’

Published Fri, Feb 14 2020 8:48 AM | Last Updated on Fri, Feb 14 2020 9:20 AM

Kartik Aaryan Shares Video That Sara Ali Khan Being Called Bhabhi - Sakshi

బాలీవుడ్‌ యువనటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌లు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్‌ ఆజ్‌ కల్‌ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి బీ-టౌన్‌లో ఎక్కడ చూసిన వీరే కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కార్తీక్‌, సారాను ఆటపట్టించడం, వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్‌ చేయడం వారు సరదాగా ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కార్తీక్‌ వారికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

కార్తీక్‌ ఇద్దరబ్బాయిలతో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా.. వెనకాల వచ్చిన సారాను చూసి ఓ బాలుడు ‘కార్తీక్‌ అన్నయ్య.. వదిన వచ్చింది చూడు’ అనగానే కార్తీక్‌ కాస్తా షాక్‌కు గురయ్యాడు. ఇక అది విన్న సారా నవ్వులు చిందిస్తూనే.. వదిన అని ఎవరూ పిలిచారు అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత ఆ బాలుడి వైపు నడుస్తూ.. ‘అతనే కదా.. నిన్ను వదిన అని పిలవమన్నాడు’ అని కార్తీక్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించిన ఈ వీడియోను కార్తీక్‌ ‘వదిన అని ఎవరు పిలిచారు’ అనే క్యాప్షన్‌కు బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేసి షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆ జంట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 

‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్‌ చేయండి’

కాగా ఇటీవలల ఓ ఇంటర్యూలో కార్తీక్‌తో ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును ప్రేమిస్తున్నాను కానీ సినిమాలో’ అంటూ వారిమధ్య ప్రేమ లేదని చెప్పకనే చెప్పి తెలివిగా తప్పించుకుంది ఈ భామ. కాగా ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో కార్తీక్‌ సారాను స్టేజీపైకి చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడంతో వీళ్తు చాలా ఓవరాక‌్షన్‌ చేస్తున్నారంటూ నెటజన్లంతా మండిపడ్డారు. కార్తీక్‌ స్వయంగా వంట చేసి సారాకు తినిపించడం, అప్పుడప్పుడూ కార్తిక్‌, సారాను సోషల్‌ మీడియాలో ఆటపంటించడం చూసి వీరిద్దరిని లవ్‌ బర్డ్స్‌గా ఫిక్సైపోతున్నారంతా. కాగా తాజా సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలంటైన్స్‌ డే సందర్భంగా ప్రేమికులను పలకరించనుంది.

చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement