Love Aaj Kal
-
స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్
ముంబై: హిందీ సినీ పరిశ్రమలో మొన్ననే యువ నటుడు వరుణ్ ధావన్ వివాహం చేసుకోగా తాజాగా సినీ గాయని శిల్పారావు వివాహం చేసుకుంది. తన స్నేహితుడు రితేష్ కృష్ణన్‌ను బుధవారం సాయంత్రం శిల్పారావు పెళ్లాడారు. హిందీ సినీ పరిశ్రమలో పదేళ్లుగా గాయనిగా శిల్పారావు రాణిస్తూ అభిమానులను పెంచుకుంది. తాజాగా తన స్నేహితుడు చేసిన పెళ్లి ప్రతిపాదనను అంగీకరించి వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో ముంబైలో అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో శిల్పారావు ఫొటోలు పంచుకుంది. మా మొదటి సెల్ఫీ అంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దాంతోపాటు రితేశ్‌తో ఉన్న తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేసింది. హే దిల్ హై ముష్కిల్, లవ్ ఆజ్ కల్, బచ్నా హై హసీనా వంటి సినిమాల్లో శిల్పారావు పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
నీరసించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ కలెక్షన్లు
ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘లవ్ ఆజ్ కల్ 2’. ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. సస్స్ర్కీన్ ప్లే వీక్‌గా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కానీ కొంతమంది ప్రేమికులు మాత్రం సారా, కార్తీక్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఈ జంట రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ.12 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ.8 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం సుమారు రూ.10 కోట్లు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ రూ.6 కోట్లతో సరిపెట్టుకుంది.(ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది) ఇప్పటివరకు మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం థియేటర్లలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఈ చిత్రం సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే నటించిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ సీక్వెల్‌కు సైతం దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. కథలో కొత్తదనం లేదని, పాత చింతకాయ పచ్చడే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్ ఓవర్ యాక్షన్ మాత్రం భరించలేకున్నామని మరికొందరు ఘాటుగానే స్పందించారు. తొలిరోజు అదుర్స్ అనిపించిన కలెక్షన్లు తర్వాత డీలా పడిపోయాయి. (‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!) చదవండి: ‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ రూ. 12 కోట్లు -
‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’
బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన జంట. వీరిద్దరూ తొలిసారిగా జతకట్టిన సినిమా లవ్ ఆజ్ కల్ 2 నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి బీ-టౌన్లో ఎక్కడ చూసిన వీరే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కార్తీక్, సారాను ఆటపట్టించడం, వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం వారు సరదాగా ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కార్తీక్ వారికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కార్తీక్ ఇద్దరబ్బాయిలతో ఫుట్‌బాల్ ఆడుతుండగా.. వెనకాల వచ్చిన సారాను చూసి ఓ బాలుడు ‘కార్తీక్ అన్నయ్య.. వదిన వచ్చింది చూడు’ అనగానే కార్తీక్ కాస్తా షాక్‌కు గురయ్యాడు. ఇక అది విన్న సారా నవ్వులు చిందిస్తూనే.. వదిన అని ఎవరూ పిలిచారు అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత ఆ బాలుడి వైపు నడుస్తూ.. ‘అతనే కదా.. నిన్ను వదిన అని పిలవమన్నాడు’ అని కార్తీక్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించిన ఈ వీడియోను కార్తీక్ ‘వదిన అని ఎవరు పిలిచారు’ అనే క్యాప్షన్‌కు బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేసి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆ జంట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘అసభ్యకర సన్నివేశాలు తగ్గించి.. బిప్ చేయండి’ కాగా ఇటీవలల ఓ ఇంటర్యూలో కార్తీక్‌తో ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును ప్రేమిస్తున్నాను కానీ సినిమాలో’ అంటూ వారిమధ్య ప్రేమ లేదని చెప్పకనే చెప్పి తెలివిగా తప్పించుకుంది ఈ భామ. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కార్తీక్ సారాను స్టేజీపైకి చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడంతో వీళ్తు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటజన్లంతా మండిపడ్డారు. కార్తీక్ స్వయంగా వంట చేసి సారాకు తినిపించడం, అప్పుడప్పుడూ కార్తిక్, సారాను సోషల్ మీడియాలో ఆటపంటించడం చూసి వీరిద్దరిని లవ్ బర్డ్స్‌గా ఫిక్సైపోతున్నారంతా. కాగా తాజా సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులను పలకరించనుంది. చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో View this post on Instagram Bhabhi kisko bola ☺️ A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 13, 2020 at 3:38am PST -
‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!
సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు షరతులు విధించింది. ఈ చిత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని వాటిని తీసివేయాల్సిందిగా డైరెక్టర్‌కు సూచించింది. అలాగే హీరో, హీరోయిన్ సంభాషణల్లో కొన్ని అసభ్యకర పదాలు ఉన్నాయని.. ఆ మాటలను బీప్ చేయాలని చెప్పింది. అలాగే సారా, కార్తీక్‌ల మధ్య ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది. అదే విధంగా సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్ చేసింది. మరోవైపు ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2009లో సైఫ్ అలీఖాన్, దీపికా నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చదవండి : కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
బైక్‌పై చక్కర్లు కొడుతున్న బాలీవుడ్ జంట!
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్, యువ నటుడు కార్తీక్ ఆర్యన్లు ‘లవ్ ఆజ్ కల్ 2’తో తొలిసారిగా జతకట్టారు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటీ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమయాణం సాగుతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలో వాటిని సారా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సారా, కార్తీక్‌లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కార్తిక్, సారాతో కలిసి బైక్ వెళుతున్న బుమరాంగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఛలాన్ కడతావా.. అయితే నాది కూడా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తూ సారాను సరదాగా ఆటపట్టించాడు. కార్తిక్ పోస్టుకు సారా స్పందిస్తూ.. కోపంగా ఉన్న ఎమోజీని కామెంటు చేసింది. ఇక కార్తిక్ వెంటనే ‘జోక్ చేశాను అంతే.. పడుకో..’ అంటూ సారాను సముదాయించాడు. ఇలా సారాను సందర్భం చిక్కినప్పుడల్లా కార్తీక్ సోషల్ మీడియాలో ఆటపట్టిస్తూనే ఉంటాడు. (చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో) View this post on Instagram Challan Katega Aur mera bhi .... A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Feb 11, 2020 at 9:01am PST ఇటీవల సారాకు స్వయంగా తన చేతితో తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా బక్కచిక్కిపోయావు.. నువ్వు మళ్లీ ముందులా మారిపోవాలి’ అంటూ కార్తీక్ ఆర్యన్ ఆటపట్టించాడు. ఇక సారా లావుగా ఉన్నప్పుటీ ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సారా తన సినిమా కేరిర్ కోసం 96 కిలోగ్రాముల బరువు ఉన్న సారా నాజుగ్గా తయారయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రమోషన్లోని ఓ కార్యక్రమంలో కార్తీక్, సారాను స్టేజీపైకి ఎత్తుకొని తీసుకెళ్లిన ఫొటోలు, ఓ స్వీమ్మింగ్ ఫూల్ దగ్గర సారా దిగుతానంటే కార్తీక్ వద్దంటూ ఆపుతూ... ప్రేమికుల్లా ప్రవర్తించిన తీరును చూసి ఓవరాక్షన్ చేస్తున్నారంటూ నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
చిక్కిపోయావంటూ గోరుముద్దలు తినిపించిన హీరో
సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, యువనటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా విపరీతమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’లో జోడీ కట్టిన వీళ్లిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని వస్తున్న వార్తలను సారా గతంలోనే ఖండించారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో కార్తీక్ సారాని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజీపైకి తీసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు ఇది కూడా అబద్ధమంటారా అని సెటైర్లు విసిరారు. తాజాగా వీళ్లిద్దరూ మరోసారి ప్రేమికుల్లా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కార్తీక్ ఆర్యన్.. సారాకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. వీరి ప్రేమానురాగాలను ఫొటోలో బందిస్తూ దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నువ్వు చాలా చిక్కిపోయావు. మళ్లీ సాధారణ బరువుకు రావాలి’ అటూ క్యాప్షన్ జోడించాడు. (ఆస్కార్ 2020 : ఉత్తమ నటుడిగా ‘జోకర్’ హీరో) ఇంకేముంది.. నెటిజన్లు ఊరుకుంటారా. ‘బాలీవుడ్లో కొత్త జంట’, ‘ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు’ అంటూ వారిని ప్రేమ పక్షులుగా ఫిక్సయిపోతున్నారు. అంతేకాదు, కార్తీక్.. ప్రేయసి కోసం స్వయంగా వంటచేశాడేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్లో అడుగుపెట్టే సమయానికి 96 కిలోల బరువుండేది. కానీ రానురానూ నాజూకు సుందరిగా మారిపోయింది. దీనిపై హీరోయిన్ కరీనా కపూర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నేను బొద్దుగా ఉండే పాత సారాను మిస్ అవుతున్నాను. ఇప్పుడు నీకెంతో ఇష్టమైన పిజ్జాలు తినడం కూడా మానేసావు కదా’ అని అడిగింది. దీనికి సారా ‘ అవును, కానీ ఇప్పుడు పిజ్జాలు కొనేందుకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నాను. దానికి ఏమంటావు?’ అని సమాధానమిచ్చింది. ఆమె నాజూకుగా మారడం కరీనాకే కాదు, కార్తీక్‌కు కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఇక సారా, కార్తీక్ తొలి సారి జోడీ కట్టిన ‘లవ్ ఆజ్ కల్2’ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. (కార్తీక్‌తో ప్రేమలో ఉన్నా: సారా) చదవండి: ఈ ఏడాదే రణ్‌బీర్, అలియాల పెళ్లి!? (యాక్షన్ ఫీట్లతో అదిరిపోయిన భాగీ-3 ట్రైలర్) -
‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’
సైఫ్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చేసింది రెండు సినిమాలే అయినా ఎంతో క్రేజ్‌ను తెచ్చుకున్నారు సారా. అయితే ఈ భామ యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తుందని వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో ఈ అమ్మడు చాలా ఓవర్ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీటిపై సారా స్పందిస్తూ.. ‘నా బరువు, అందం, ఫ్యాషన్‌పై విమర్శలు వచ్చినా నేను పట్టించుకోను.. కానీ నా నటన, నైపుణ్యంపై విమర్శలు వచ్చాయి. అదే నాకు పెద్ద పరీక్ష’ అన్నారు. మొదటి సారిగా విమర్శలు నన్ను చాలా బాధపెట్టాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా కాగా ‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్లో సారా ‘నువ్వు నన్ను బగ్ చేస్తున్నావా’ అని చెప్పిన డైలాగ్‌కు విమర్శలు వస్తున్నాయి. ఆమె నటన అతిగా ఉందని, ఆ డైలాగ్ చెప్పెటప్పుడు తను ఎలాంటి దస్తులు ధరించిందో, తను చెప్పిన డైలాగ్ ఎంటో ఓసారి చూసుకుంటే బాగుండని, జో గా నటించిన ఆ ఒక్కసీన్ తన అభిమానులను నిరాశకు గురిచేసిందంటూ సారాకు క్లాస్ పీకుతున్నారు. ఇక తనపై వస్తున్న విమర్శల గురించి దర్శకుడు ఇంతియాజ్‌తో కూడా మాట్లాడానని సారా చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో తన నటన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొవడానికి ఈ విమర్శలు ఉపయోగకరంగా ఉంటాయని సానుకూలంగా స్పందించారు. 2010లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనెలు నటించి ‘లవ్ ఆజ్ కల్’ డైరెక్టర్ ఇంతియాజ్ అదే సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా
బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు. గత కొద్ది రోజులుగా సారా, యువ హీరో కార్తిక్ ఆర్యన్లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు కార్తిక్, సారాలు దీనిపై స్పందించక పోవడంతో వారిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారంతా. ఇక సారా తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేశారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కార్తిక్‌తో ప్రేమ విషయం అడగ్గా.. ‘నేను కార్తిక్‌తో కలిసి పని చేస్తున్నానని అనుకోవడం లేదు. నేను వీర్‌తో కలిసి సెట్లో డేటింగ్ చేస్తున్నా. ఎందుకంటే మేము సేట్లో సారా, కార్తిక్‌లా కాకుండా జో, వీర్(సినిమాలోని పాత్రల పేర్లు)లా ఉంటాము’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.(ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్) ‘అవును కార్తిక్‌తో ప్రేమలో ఉన్నాను.. కానీ బయట కాదు సినిమాల్లో. ప్లీజ్.. మీరంతా తెరపై 2.5 గంటలు పాటు కనిపించే మా ప్రేమను చూడండి’ అంటూ సారా అలీ ఖాన్ పేర్కొన్నారు. అలాగే తను యువతరానికి చెందినదానినా లేదా పాత కాలం అమ్మాయినా అనే విషయం తనకే తెలియదని.. కొన్నిసార్లు ప్రేమంటే నచ్చుతుంది. మరికొన్ని సార్లు ప్రేమకు దూరంగా ఉంటానని చెప్పారు. కాగా కాఫీ విత్ కరణ్ షోలో.. సారా వృత్తి పరంగా.. కార్తిక్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కార్తిక్ కూడా సారా గురించి చెప్పాడు. దీంతో వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. సారా, కార్తిక్‌లు నటిస్తున్న ‘లవ్ ఆజ్ కల్’ ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు సమాచారం.(హీరోయిన్ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!) -
కార్తిక్‌తో ఆ సీన్లో నటించాలని ఉంది: నటి కూతురు
నెపోటిజమ్‌పై అనన్య పాండేకు మంచి అభిప్రాయం లేదంటున్నారు బాలీవుడ్ నటి పూజ బేడి కూతురు అలయా. కాగా అలయా ‘జవానీ జానేమాన్’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలయ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అవును.. అనన్యకు నెపోటిజమ్ మీద మంచి అభిప్రాయం లేదు కానీ నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుత వర్థమాన నటి, నటుల చిత్రాలను చూస్తున్నానని, వారి నటన తీరు, ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటున్నానని చెప్పారు. కాగా కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్లు నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ టైలర్ ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అలయా మాట్లాడుతూ.. ‘సారా, కార్తీక్‌ల బెడ్ సీన్ చూశాను. అది చూసిన తర్వాత నాకు కూడా కార్తిక్‌తో అలాంటి సన్నివేశంలో నటించాలనిపించింది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కార్తిక్‌ను మీ బెడ్‌పై చూస్తే అప్పుడు మీ స్పందన ఎంటి అని అడిగిన ప్రశ్నకు ‘ఒకవేళ నేను లేచేసరికి కార్తిక్ నా బెడ్‌పై కనిపించినా ఆశ్చర్యపోను.. ఎందుకంటే అది నేను కోరుకున్న విషయమే.. ఇది ఇంతకు ముందే చెప్పాను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. అంతేకాదు ‘నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఓ బంధంలో ఉండటమంటే నా దృష్టిలో కష్టమే’ అని పేర్కొన్నారు. కాగా రాపిడ్ ఫైర్ గేమ్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు.. ‘పెళ్లి వరుణ్ దావన్ చేసుకుంటాను. డేటింగ్ కార్తిక్ ఆర్యన్‌తో చేస్తాను. ఇషాన్ ఖత్తర్‌ను చంపేస్తాను’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాగే ఒకే జెండర్‌తో అయితే ‘సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంటా, జాన్వీ కపూర్‌తో డేటింగ్ చేస్తా.. అనన్యను చంపేస్తా’ అని చమత్కరించడం విశేషం. -
‘లవ్ ఆజ్ కల్’ ట్రైలర్ లాంచ్
-
కొత్తగా వచ్చారు!
కేవలం మన సినిమాల ప్రభావమే కాదు.. మన సంక్రాంతి పండగ ఎఫెక్ట్ బాలీవుడ్‌పై కూడా పడినట్లుంది. కొన్ని హిందీ సినిమాల ఫస్ట్‌లుక్, కొత్త పోస్టర్స్ మన సంక్రాంతి పండగ సమయంలోనే విడుదలై హిందీ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. బాలీవుడ్ యువ కథానాయిక ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘షేర్ షా’ చిత్రం కోసం సైనికుడిగా మారి సరిహద్దుల్లో శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తున్నారు సిద్దార్థ్ మల్హోత్రా. విష్ణువర్థన్ దర్శకత్వం. కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన పరమవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. గురువారం (జనవరి 16) సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘షేర్ షా’ చిత్రం ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇంతియాజ్ అలీ. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. వరుణ్ ధావన్ తర్వాతి చిత్రానికి ‘మిస్టర్ లేలే’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కానుంది. మరో సినిమా ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘గో గోవా గాన్’కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దినేష్ విజన్ వెల్లడించారు. ఇంకా మరికొన్ని బయోపిక్‌లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటనలు గత మూడు రోజుల్లో వెల్లడి కావడం విశేషం. సిద్ధార్ధ్ మల్హోత్రా అలియాభట్ -
కొత్త ప్రేమాయణం
ప్రేమించుకునేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు హీరో హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్ అండ్ సారా అలీఖాన్. అక్కడి నుంచి పంజాబ్‌కు ప్రయాణిస్తారట. వారి ప్రేమ జ్ఞాపకాలను వెండితెరపై చూడాలంటే చాలా టైమ్ ఉంది. ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘లవ్ ఆజ్ కల్’కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు ఇంతియాజ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తారు. ఢిల్లీ షెడ్యూల్ తర్వాత ఈ టీమ్ పంజాబ్ వెళ్తుందట. ముంబైలో కూడా కొన్ని సీన్స్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ సినిమాలో సారా అలీఖాన్ తండ్రి, ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాలో సైఫ్ నటించడం లేదని, ఆయన్ను ఆనుకున్న పాత్రలో రణ్‌దీప్ హుడా నటించనున్నారని తెలిసింది. ఇంతకుముందు ‘హైవే’ చిత్రం కోసం ఇంతియాజ్ అండ్ రణ్‌దీప్ కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. తాజా సీక్వెల్‌ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట. -
హ్యాపీ మూడ్
చిన్నప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా నాన్నను చూసుకున్న కూతురికి ఆయనతో కలిసి నటించే చాన్స్ వస్తే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఆ హ్యాపీ మూడ్‌లోనే ఉన్నారట సారా అలీఖాన్. ఎందుకంటే ఆమె తన నెక్ట్స్ మూవీ ‘లవ్ ఆజ్ కల్ 2’లో తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించబోతున్నారట. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తారు. ఇంతియాజ్ ఆలీ దర్శకుడు. కార్తీక్– ఇంతియాజ్ కాంబినేషన్లోనే 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమాలో ఒక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ఓ సీనియర్ నటుడి అవసరం వచ్చింది. వెంటనే డైరెక్టర్ సైఫ్‌నే ప్రిఫర్ చేశారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రియల్ లైఫ్‌లో మాదిరిగానే ఈ రీల్ లైఫ్‌లోనూ సైఫ్, సారా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
ఆ వార్త నిజం కావాలి
‘కళంక్, కబీర్‌సింగ్, గుడ్ న్యూస్’....బాలీవుడ్లో కియారా అద్వానీ నటిస్తున్న సినిమాల లిస్ట్ ఇది. తాజాగా ఈ లిస్ట్‌లోకి దాదాపు పదేళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రం సీక్వెల్ కూడా చేరిందని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. ‘‘ఇంతియాజ్ సార్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో నేను కథానాయికగా ఎంపికయ్యానని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆయన కానీ, ఆ టీమ్ కానీ నన్ను సంప్రదించలేదు. అయినా ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగుతెరపై కనిపించిన కియారా ఈ ఏడాది రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. -
అప్పుడు ధ్యానం చేస్తా!
‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సక్సెస్ అయిన ప్రతి సారీ నా చిత్రాల ఎంపికలో మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తాను. ‘లవ్ ఆజ్ కల్ ’ సినిమా తర్వాత నా ఐదు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అప్పుడే నా కెరీర్ మీద నాకో అవగాహన వచ్చింది. ఎలాంటి సినిమాలు చేయాలి..? నేనెలాంటి పాత్రలు చేయగలను ..? అనే వాటిపై స్పష్టత వచ్చింది. నాలో మంచి నటి ఉందని ప్రోత్సహించిన దర్శకుడు హోమీ అడజానియా. ఆయన దర్శకత్వంలో నటించిన ‘కాక్టైల్’ సినిమా నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. అయినా సక్సెస్ అయితేనే విలువ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారీ విమర్శలు వస్తాయి. సద్విమర్శలను నా కెరీర్‌కు ఉపయోగించుకుంటాను. భరించలేనివైతే మెడిటేషన్ చేసి ఆ ఒత్తిడి తగ్గించుకుంటాను. కొంతమంది ఇలా చేయాలి.. అలా చేయాలి అని ఉచిత సలహాలిస్తారు. కానీ వాటిని పట్టించుకోను’’. - దీపికా పదుకొనే -
రిస్కు కాదు.. సవాలే..!
‘ఫైండింగ్ ఫ్యానీ’ వంటి ఆఫ్ బీట్ ఆంగ్ల భాష సినిమాలో నటించడం ఓ సవాలు వంటిదని బాలీవుడ్ నటి దీపికా పదుకొణే అభిప్రాయపడింది. ‘ఓం శాంతి ఓం’, ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్టైల్’, ‘రేస్ 2’ ‘యే జవానీ హై దివానీ’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, ‘రాంలీలా’ తదితర హిట్ సినిమాల్లో నటించిన దీపిక...హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలోనూ ఓ పాత్రను పోషిస్తోంది. ‘ఇది చాలా రిస్కుతో కూడిన పని అని అనేకమంది నాకు చెప్పారు. అయితే నేను మాత్రం ఆవిధంగా అనుకోవడం లేదు. ఈ సినిమాలో చేసేందుకు తగినంత ధైర్యం నాకు ఉంది’ అని అంది. ‘ నేను హోమిని విశ్వసించాను. ఆయన ముందుచూపు నాకు బాగా నచ్చింది’ అని పేర్కొంది. కాగా దీపిక గతంలో హోమి దర్శకత్వంలో విడుద లైన ‘కాక్ టైల్’ సినిమాలో నటించింది. ‘సినిమాకు తొలి ప్రాధాన్యమిస్తా. ఆ తర్వాతే పాత్ర గురించి ఆలోచిస్తా. విభిన్నమైన సినిమాలో నటించాలని ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నా. ఈ సినిమాలో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. హిందీ అలవాటైన భాష అయినందువల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అయితే ఆంగ్ల భాషా సినిమాల్లో చేసే సమయంలో కలిగే అనుభవం విభిన్నంగా ఉంటుంది. ఈ భాష సినిమాల్లో అవకాశాలు అంతంతగానే ఉంటాయి. అయితే పరభాష సినిమాల్లో నటించడమనేది ఓ సవాలు వంటిది.’ అని అంది. ఈ సినిమా షూటింగ్ కోసం గోవాలో సెట్లు వేశారు. షూటింగ్లో భాగంగా అక్కడ కొంకణి భాషలో మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయమై దీపిక మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడమంటే ఇష్టమని చెప్పింది.