ఆ వార్త నిజం కావాలి | Kiara Advani to play the lead in Love Aaj Kal 2 | Sakshi
Sakshi News home page

ఆ వార్త నిజం కావాలి

Published Thu, Jan 3 2019 4:15 AM | Last Updated on Thu, Jan 3 2019 4:15 AM

Kiara Advani to play the lead in Love Aaj Kal 2 - Sakshi

కియారా అద్వానీ

‘కళంక్, కబీర్‌సింగ్, గుడ్‌ న్యూస్‌’....బాలీవుడ్‌లో కియారా అద్వానీ నటిస్తున్న సినిమాల లిస్ట్‌ ఇది. తాజాగా ఈ లిస్ట్‌లోకి దాదాపు పదేళ్ల క్రితం ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ చిత్రం సీక్వెల్‌ కూడా చేరిందని బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ‘‘ఇంతియాజ్‌ సార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో నేను కథానాయికగా ఎంపికయ్యానని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికైతే ఆయన కానీ, ఆ టీమ్‌ కానీ నన్ను సంప్రదించలేదు. అయినా ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. గతేడాది మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగుతెరపై కనిపించిన కియారా ఈ ఏడాది రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ సినిమాలో కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement