హ్యాపీ మూడ్‌ | Saif Ali Khan to Play Sara Ali Khan's Onscreen Father in Love Aaj Kal | Sakshi
Sakshi News home page

హ్యాపీ మూడ్‌

Jan 27 2019 2:59 AM | Updated on Jan 27 2019 2:59 AM

Saif Ali Khan to Play Sara Ali Khan's Onscreen Father in Love Aaj Kal - Sakshi

సారా అలీఖాన్‌

చిన్నప్పటి నుంచి సిల్వర్‌ స్క్రీన్‌పై హీరోగా నాన్నను చూసుకున్న కూతురికి ఆయనతో కలిసి నటించే చాన్స్‌ వస్తే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఆ హ్యాపీ మూడ్‌లోనే ఉన్నారట సారా అలీఖాన్‌. ఎందుకంటే ఆమె తన నెక్ట్స్‌ మూవీ ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’లో తండ్రి సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి నటించబోతున్నారట. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తారు. ఇంతియాజ్‌ ఆలీ దర్శకుడు. కార్తీక్‌– ఇంతియాజ్‌ కాంబినేషన్‌లోనే 2009లో ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ అనే సినిమా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమాలో ఒక హీరోయిన్‌ తండ్రి పాత్ర కోసం ఓ సీనియర్‌ నటుడి అవసరం వచ్చింది. వెంటనే డైరెక్టర్‌ సైఫ్‌నే ప్రిఫర్‌ చేశారు. ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రియల్‌ లైఫ్‌లో మాదిరిగానే ఈ రీల్‌ లైఫ్‌లోనూ సైఫ్, సారా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement