Saif alikhan
-
#Devara : ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ HD (ఫొటోలు)
-
భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 150కి పైగా కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విక్రయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ చిత్రం నాన్-థియేట్రికల్ వసూళ్ల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!) -
ఆ సిరీస్ చూడలేకపోయా.. కానీ ఇప్పుడు గర్వంగా ఉంది: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది భామ. ఆ తర్వాత ప్రభాస్ సరసన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్‌లో నటిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్‌లో సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిపురుష్ చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని.. ప్రేక్షకులు తనను వారితో సమానంగా గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక ఈ సినిమాలో సీత పాత్ర తనకెంతో నచ్చిందని కృతి సనన్ పేర్కొంది. తన చిన్నతనంలో రామానంద్ సాగర్ సూపర్ హిట్‌గా నిలిచిన దూరదర్శన్ సిరీస్ 'రామాయణ్'ని చూడలేకపోయానని తెలిపింది. అయితే ఈ చిత్రం యువతరానికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా అలరిస్తుందని ఆమె పేర్కొంది. కృతి సనన్ మాట్లాడుతూ..' ఆదిపురుష్ లాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలతో పిల్లలకు విజ్ఞానం పెరుగుతుంది. విజువల్ మెమరీ అన్నిటికంటే బలంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇలాంటి ఇతిహాసాన్ని పిల్లలకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం. వారి మనస్సులో రామాయణాన్ని ముద్రించటం చాలా ముఖ్యం.' అని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఊహించని రీతిలో అభిమానులు నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
పిల్లాడు ఏడుస్తుంటే ఫోటో పిచ్చేంటి.. బాలీవుడ్ జంటపై ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దీపావళి సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ఈ బాలీవుడ్ జంట సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఎందుకంటే అందులో వారిద్దరి కుమారుల్లో ఒకరు కిందపడి ఏడుస్తూ కనిపించారు. అయినప్పటికీ ఈ జంట అవేం పట్టించుకోకుండానే నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఆ విధంగా చేయకూడదన్నది కొందరి అభిమానుల వాదన. మరి కొందరేమో పండగ వేళ సంతోషంలో అలా చేసి ఉంటారని సమర్థిస్తున్నారు. మరీ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అంత ఫోటో పిచ్చి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలను అలా వదిలేసి మనం ఆనందంలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం అని సగటు అభిమాని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by kareena kapoor 💕💖❤❤❤ (@kareena_kapoor_khan_fanpage) -
ఆదిపురుష్ టీజర్‌పై ఫిర్యాదు.. వారిద్దరిని కించపరిచారంటూ..!
ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' టీజర్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీజర్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొందరు బాగాలేదంటూ బహిరంగంగా విమర్శిచగా.. మరికొందరేమో యానిమోషన్ మూవీలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా రాజకీయ నాయకులు ఆదిపురుష్ టీజర్‌పై విమర్శలు చేశారు. తాజాగా ఆదిపురుష్ టీజర్‌పై కోర్టును ఆశ్రయించాడు ఓ న్యాయవాది. హిందూ దేవుళ్లను కించపరిచేలా చూపించారని ఆయన ఫిర్యాదు చేశారు. (చదవండి: 'ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒసామాబిన్ లాడెన్ గుర్తొస్తున్నారు') ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మణ సంఘాలు నిరసనలు తెలుపుతుండగా.. ఈ సినిమాలోని నటీనటులు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో హనుమంతుడిని తోలు దుస్తులలో చూపించగా, రాముడు కూడా నెగిటివ్‌గా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్, ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్, భూషణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై లక్నో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
రికార్డులు కొల్లగొడుతున్న ఆదిపురుష్ టీజర్.. విడుదలైన 17 గంటల్లోనే..!
అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో కేజీఎఫ్-2 సాధించిన రికార్డును 'ఆదిపురుష్' బద్దలుకొట్టింది. అలాగే 932 కె లైక్స్ సాధించి నెంబర్‌వన్‌గా నిలిచింది. విక్రమ్ వేద 931 కె లైక్స్‌తో రెండోస్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. (చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్) అయోధ్య వేదికగా నిన్న రిలీజైన ఆదిపురుష్ టీజర్ విజువల్ వండర్‌ను తలపిస్తోంది. కొంతమంది అభిమానులు ప్రభాస్ రాముడి లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల కానుంది. మైథలాజికల్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. -
హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను ఆ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో హృతిక్ రోషన్ తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. హృతిక్‌రోషన్ హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. గణేశ్ హెగ్డే కొరియోగ్రాఫి అందించారు. కాగా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విక్రమ్‌వేద చిత్రాన్ని వైనాట్ స్టుడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. -
నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు
Netizens Trolls Kareena Kapoor Over Her Dressing: సెలబ్రిటీలు ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తోంది. ఇక తారలు వారి తీరు, వస్త్రధారణపై సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్‌కు గురవుతారు. ఏ సందర్భంలో అయినా హీరోయిన్లు వస్త్రధారణ కాస్తా భిన్నంగా కనిపిస్తే చాలు ఇక వారిని ఆడేసుకుంటారు నెటిజన్లు. ఇప్పటికే జాన్వి కపూర్ తన యాటిటూడ్తో విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ నెటజన్ల ట్రోల్స్‌కు బలైంది. ఎప్పుడూ ట్రెండీ లుక్‌తో అందరిని ఆకర్శించే కరీనా తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్‌తో బయటకు వచ్చిన ఆమె ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ దర్శనమిచ్చింది. బ్లాక్ జీన్స్, నెక్లెస్ ఓపెన్ టాప్‌తో ఇలా కరీనాను చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. చదవండి: ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, విడుదల తేదీ ప్రకటన ఇక ఫొటోలు బయటకు కావడంతో నెటిజన్లు కరీనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ అని, కొంతమంది ‘ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అని, కొంతమంది ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అని కరీనాని ట్రోల్ చేస్తున్నారు. నైటీ వేసుకుని బయటకు వచ్చింది. ఈ దుస్తులతో ఆమెకు ఉన్న స్టైలిష్ బ్రాండ్ అనే ఇమేజ్ మొత్తం పోయింది. హే భగవాన్ ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండిష: అత్యంత డేంజర్ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్‌సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్‌సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్‌ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు. -
శివుడి పాత్రలో..?
ప్రభాస్ హీరోగా నటించనున్న మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. మరో కీలకమైన శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆది పురుష్’లో తొలుత రావణుడి పాత్ర కోసం అజయ్‌ని సంప్రదించగా డేట్ల సమస్యతో తిరస్కరించారట. దీంతో ఆ పాత్రకు సైఫ్‌ని తీసుకున్నారు. అయితే శివుడి పాత్రకు అజయ్ సరిగ్గా సరిపోతారని ఓం రౌత్ భావిస్తున్నారట. ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేయమని అజయ్‌ను అడగాలనుకుంటున్నారని సమాచారం. -
మొత్తం స్టూడియోలోనే?
‘ఆది పురుష్’ అనే పీరియాడికల్ సినిమాలో నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనున్నారు. సైఫ్ అలీఖాన్‌ది రావణుడి పాత్ర. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తాన్ని స్టూడియోల్లోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ‘300, జంగిల్ బుక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాదాపు స్టూడియోల్లోనే పూర్తి చేశారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ‘ఆది పురుష్’ చిత్రీకరణను దాదాపు గ్రీన్ స్క్రీన్లోనే జరుపుతారట. దీనికోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్య నేర్చుకుంటున్నారు. తన శరీరాకృతిని కూడా అందుకు తగ్గట్టు మారుస్తున్నారు. -
మొరాకో వీధుల్లో కరీనా, సైఫ్ జంట!
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తరచు తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తన భర్త సైఫ్ అలీఖాన్, ముద్దుల తనయుడు తైమూర్‌తో సరదాగా గడిపిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కరీనా ఓ త్రోబ్యాక్(పాత) ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. View this post on Instagram Saturday Mood: Morocco '09 💯 A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 9, 2020 at 1:53am PDT 2009లో దిగిన ఈ ఫొటోలో కరీనా, సైఫ్‌లు మొరాకో వీధుల్లో విహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘సాటర్డే మూడ్: మొరాకో ‘09’’ అని కరీనా కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరూ 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. ఈ జంట 2016లో తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చింది. లాక్డౌన్ సందర్భంగా ఇటీవల సైఫ్ ఇంట్లోనే తైమూర్ జుట్టు కత్తిరిస్తున్న ఫొటోను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘ఎవరైనా జుట్టు కత్తిరించవచ్చు?’ అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram Haircut anyone? 💁🏻♀️🤭 A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 2, 2020 at 4:58am PDT -
అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం ‘గుడ్‌న్యూస్’. ఈ సినిమా విడుదలై బీ-టౌన్లో భారీ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నప్పటికీ.. కరీనా నేటితరం హీరోయిన్లకు దీటుగా సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలుగుతున్నారు. అందంలోనూ, స్టైల్లోనూ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ యువ హీరోయిన్లతో పోటీపడుతున్నారు. కాగా న్యూయర్ సెలబ్రేషన్స్ కోసం కరీనా తన భర్త సైఫ్ అలీఖాన్, ముద్దుల తనయుడు తైమూర్, సోదరి కరిష్మా కపూర్లతో కలిసి లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలలో సరదాగా గడిపి తిరిగి సోమవారం ముంబై చేరుకున్నారు ఈ పటౌడి ఫ్యామిలీ. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు చిక్కిన ఈ నవాబ్ కుటుంబం రిచ్ స్టైలిష్ లుక్‌లో కళ్లు చెదిరేలా దర్శనమించారు. లైట్ పింక్ షర్టుపై కోటు ధరించిన సైఫ్ హుందాగా కనిపించగా.. బ్లూ టి-షర్టు, ప్యాంట్‌పై స్నీకర్స్ షూతో ఉన్న చోటా నవాబ్ ముద్దుగా ఉన్నాడు. ఇక ఆలివ్ గ్రీన్ షూ.. బ్లాక్ పైజామాపై కో-ఆర్డర్ కోటు ధరించి దానికి మ్యాచ్ అయ్యే హర్మిస్ బిర్కిన్ బ్యాగ్‌తో సింపుల్‌గా కరీనా అదరగొట్టారు. అయితే కరీనా బ్యాగ్ విలువ తెలిస్తే ప్రతి ఒక్కరు కంగుతినాల్సిందే. ప్రఖ్యాత బ్రాండ్‌కు చెందిన ఆ హ్యాండ్ బ్యాగ్ ధర 18,237 డాలర్లు(సుమారు రూ. 13 లక్షలు). ఇక కరీనా దగ్గర ఇంకా ఇలాంటివి 5 బ్యాగులు ఉన్నాయట. ఒక్కొక్క బ్యాగు ధర కనీసం పది లక్షలకు తక్కువ ఉండదు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో... ‘అమ్మో! అంతా ఖరీదైన బ్యాగు వాడుతున్నారా.. కరీనా నిజంగా బిలియనీరే. అయినా పటౌడి ఫ్యామిలి అంటే ఆ మాత్రం ఉండాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!) -
ఆమిర్ వర్సెస్ సైఫ్
ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ మీద తలపడనున్నారు. మరి ఎవరు గెలుస్తారు? ప్రస్తుతానికి సస్పెన్స్. 2017లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్ వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి రూపొందించారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో పలువురు హీరోలు నటిస్తారని వార్తలు వినిపించాయి. ఫైనల్‌గా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ఈ రీమేక్‌లో నటించనున్నారు. మాధవన్ పాత్రలో సైఫ్, సేతుపతి పోషించిన పాత్రను ఆమిర్ ఖాన్ చేస్తారట. 2020 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వై నాట్ స్టూడియోస్, నీరజ్‌పాండే, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించనున్నాయి. -
పగ తీరేనా?
సైఫ్ అలీఖాన్ తన లేటెస్ట్ సినిమా కోసం నాగ సాధువుగా మారారు. నాగ సాధువు ప్రయాణం, పగ, ప్రతీకారం చుట్టూ ఈ కథ సాగనుందట. సైఫ్ ముఖ్య పాత్రలో ‘ఎన్‌హెచ్ 10’ ఫేమ్ నవదీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ కెప్టెన్’. ఏరోస్ సంస్థతో కలసి ఆనంద్ ఎల్. రాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే ‘లాల్ కెప్టెన్’ను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నటు ప్రకటించారు. ‘‘సైఫ్‌లోని నటుడిని పూర్తిగా వినియోగించుకునే పాత్ర ఇది. ఈ చిత్రం కాన్సెప్ట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇరవై ఏళ్ల తర్వాత...!
రెండు దశాబ్దాల కాలచక్రం తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు సైఫ్ అండ్ టబు. ఫిల్మిస్తాన్ (2012), మిత్రోం (2018), నోట్‌బుక్ (2019) చిత్రాలను తెరకెక్కించిన నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఓ ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో సైఫ్అలీఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలియా ఎఫ్ అనే కొత్త అమ్మాయి సైఫ్ కూతురి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలోనే టబు కూడా ఓ కీలకపాత్ర చేయనున్నారు. 1999లో ‘బివి నం.1, హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాల్లో కలిసి నటించారు సైఫ్ అండ్ టబు. మళ్లీ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ‘‘టబుకి కథ వినిపించాం. ఆమెకు నచ్చింది. నటించడానికి ఒప్పుకున్నారు. ఆమె పాత్ర గురించి ఇప్పుడే చెప్పడం సరికాదు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. లండన్‌లో 45రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిన్ని రోల్లో చిన్నోడు
ముంబై ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్ అలీఖాన్ తెలియనివారుండరు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్. బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఆ మధ్య తైముర్ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుడ్ న్యూస్’లో చిన్న గెస్ట్ రోల్ చేయనున్నాడట ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట. తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశాడట తైముర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరి కొన్ని సినిమాల్లో కనిపిస్తాడా? వేచి చూడాలి. -
స్టార్‌డమ్‌ని పట్టించుకోను
యాక్టర్స్‌గా మారిన ప్రతి ఒక్కరూ స్టార్‌డమ్‌ను సంపాదించాలని కలలు కంటారు. కానీ సైఫ్ అలీఖాన్ కుమార్తె, బాలీవుడ్ నయా ఎంట్రీ సారా అలీఖాన్ మాత్రం స్టార్‌డమ్‌ని నమ్మను అంటున్నారు. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ‘సారా ఈ పాత్ర చేయలేదేమో?’ అనే సందేహం వ్యక్తపరచకూడదు. యాక్టర్‌గా నా టార్గెట్ అదే. స్టార్డమ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఆ టాపిక్కే చాలా విచిత్రంగా, ఫన్నీగా అనిపిస్తుంది. అలా అని మన స్టార్స్ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు. నేను శ్రీదేవిగారికి వీరాభిమానిని. తనే లాస్ట్ సూపర్‌స్టార్ అని నా ఉద్దేశం. ఇప్పుడు స్టార్స్ కూడా చాలా కామన్ అయిపోయారు. అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటున్నప్పుడు స్టార్డమ్ అనే కాన్సెప్ట్ ఏంటి? నా వరకూ ప్రతీ ప్రేక్షకుడు మన వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి. అలాంటి సినిమాలు చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా చేస్తున్నారు. -
పెద్దింటి అమ్మాయి
చేసింది రెండు సినిమాలే అయినా తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది సారా అలీఖాన్. గర్ల్–నెక్స్ –డోర్ ఇమేజ్ సొంతం చేసుకున్న సారా అలనాటి అందాల కథానాయిక షర్మిలా టాగోర్ ముద్దుల మనవరాలు. సైఫ్ అలీఖాన్–అమృతాసింగ్‌ల కూతురు. బాలీవుడ్ న్యూ ఫేవరెట్ ఫేస్ సారా గురించి కొన్ని ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ఫోన్లో పాటలు! ఇంట్లో సినిమా వాతావరణం పెద్దగా లేకపోయినప్పటికీ, ‘నువ్వు సినిమాల్లో నటించాల్సిందే’ అని ఎవరూ అనకపోయినప్పటికీ సినిమాలు ఇష్టంగా చూస్తుండేదాన్ని. ఏదైనా పాత్ర బాగా నచ్చితే ‘ఈ పాత్రలో నేను నటిస్తే ఎంత బాగుండేది’ అనుకునేదాన్ని. స్కూల్ హెడ్మాస్టర్కి ఫోన్ చేసి హిందీ పాటలు పాడటం నుంచి, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్‌ను అనుకరిస్తూ గంతులు వేయడం వరకు రకరకాల చిలిపిపనులు చేసేదాన్ని. అచ్చంలా అలాగే! చిన్నప్పటి సరదా జ్ఞాపకం ఇది...ఎప్పుడైనా అమ్మతో గొడవపడుతున్నప్పుడు, ఆమెకు విసుగొచ్చేది. ‘ప్చ్...అచ్చం నువ్వు మీ నాన్నాలాగే’ అనేది.ఎప్పుడైనా నాన్నతో గొడవైనప్పుడు... ‘ప్చ్...నువ్వు అచ్చం మీ అమ్మలాగే’ అంటుండేవాడు! మరీ అంతొద్దు... ఈ ఆన్లైన్ యుగంలో ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసుకుని బాధ పడనక్కర్లేదు. దీనివల్ల ఆరోగ్యానికి చేటు తప్ప ఒరిగేదేమీ లేదు. నేను ఒకసారి క్యాప్ ధరించడం చూసి ఒకరు అన్నారు: ‘‘బఫూన్లా ఉన్నావు’’ అని. అంతమాత్రాన నేనేమీ చిన్నబోలేదు. అరవలేదు. హాయిగా నవ్వుకున్నాను. ఆన్లైన్ కామెంట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాను. చదువు... నా దృష్టిలో చదువుకు బాగా ప్రాధాన్యత ఉంది. చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. చదువుకున్న వ్యక్తిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన జ్ఞానం వస్తుంది. సొంతకాళ్ల మీద ఎలా నిలబడాలో తెలుస్తుంది. కొత్త జీవితం ‘నటన అంటే ఆషామాషీగా తీసుకోవాల్సిన వృత్తి కాదు’ అని చెబుతుంటారు నాన్న. ఆ ఒక్క మాటలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. బయట సంగతి ఎలా ఉన్నా ఇంట్లో మామూలు అమ్మాయిగానే పెరిగాను. సినిమాల్లోకి వచ్చాకే...దీపావళి పార్టీ, క్రిస్మస్ పార్టీ, బర్త్ డే పార్టీ, హాయ్ పార్టీ, బై పార్టీలు పరిచయమయ్యాయి. చెప్పాలంటే ఇప్పుడు నాకు జీవితం కొత్తగా ఉంది. -
హ్యాపీ మూడ్
చిన్నప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా నాన్నను చూసుకున్న కూతురికి ఆయనతో కలిసి నటించే చాన్స్ వస్తే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఆ హ్యాపీ మూడ్‌లోనే ఉన్నారట సారా అలీఖాన్. ఎందుకంటే ఆమె తన నెక్ట్స్ మూవీ ‘లవ్ ఆజ్ కల్ 2’లో తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించబోతున్నారట. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తారు. ఇంతియాజ్ ఆలీ దర్శకుడు. కార్తీక్– ఇంతియాజ్ కాంబినేషన్లోనే 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమాలో ఒక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ఓ సీనియర్ నటుడి అవసరం వచ్చింది. వెంటనే డైరెక్టర్ సైఫ్‌నే ప్రిఫర్ చేశారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రియల్ లైఫ్‌లో మాదిరిగానే ఈ రీల్ లైఫ్‌లోనూ సైఫ్, సారా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
ఆ తప్పు జరగనివ్వను
కథానాయికగా కరీనా కపూర్ ఖాన్ మంచి విజయాలు సాధించారు. పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ను చూసిన ఆమెను ఓ బాధ వెంటాడుతోంది. చిన్న వయసులో సినిమాల్లోకి రావడంవల్ల చదువుకోలేకపోయానన్న బాధ కరీనాకి ఉంది. ‘‘నేటి ఆధునిక యుగంలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నా 17 ఏళ్ల వయసులో నేను కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత చదువుకోవడం కుదర్లేదు. అప్పుడు చదువుకోలేకపోయినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నా కొడుకు తైముర్ విషయంలో ఆ తప్పు జరగనివ్వను. చదువు పూర్తయిన తర్వాతనే తైముర్ కోరుకున్న ఫీల్డ్‌లో వర్క్ చేసేలా ప్లాన్ చేస్తాను’’ అని ఓ రేడియో షోలో కరీనా కపూర్ తన ఆలోచనను పంచుకున్నారు. 2000లో ‘రెఫ్యూజీ’ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కరీనా 2012లో నటుడు సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సైఫ్–కరీనా దంపతులకు తైముర్ అనే బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ‘గుడ్‌న్యూస్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు కరీనా. -
ఆ క్రేజ్ ఇంతింత కాదయా
స్టార్స్ అప్లోడ్ చేసిన ఫొటోలన్నిటికీ ప్రశంసలు వస్తాయంటే పొరపాటే. అప్పడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ లాంటి వారు ఆ అనుభవాన్ని చవి చూసినవారిలో కొందరు. వాళ్లు పెట్టిన ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుందంటారు. అందుకే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్ కూడా పెరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజుకో ఫొటో అయినా అప్లోడ్ చేయనిదే కునుకు తీయని నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వివాదం అయినా, విశేషం అయినా ఒకే ట్వీట్‌తోనే, ఇన్‌స్టా స్టోరీతోనే.. ఏదో ఒక సోషల్‌మీడియా యాప్ ద్వారానో తమ అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయబడిన కొన్ని ఫొటోలను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేశారు. దాన్ని బట్టే ఆ ఫొటోల క్రేజ్ ‘ఇంతింత కాదయా’ అనొచ్చు. వాటిలో కొన్నింటిపై లుక్కేద్దాం. ఒకే ఫ్రేమ్‌లోకి బోనీ కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరిలో అతిలోకసుందరి శ్రీదేవి మరణించినప్పుడు సినీలోకం కన్నీరు కార్చింది. బోనీకపూర్ రెండో భార్య శ్రీదేవి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1983లో మోనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. 1996లో బోనీ–మోనా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతనే ఇప్పటి బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్. మోనా నుంచి విడాకులు తీసుకుని 1996లోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. శ్రీదేవికి–బోనీకి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే మొదటి భార్య కుటుంబానికీ, రెండో భార్య కుటుంబానికీ పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి చనిపోయాక రెండు కుటుంబాలూ కలిశాయి. జాన్వీ, ఖుషీలకు అర్జున్‌కపూర్ అండగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏడడుగులు వేసిన సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్ ముంబైలో జరిగినప్పుడు బోనీ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇది హ్యాపీ మూమెంట్ అయితే విషాద సంఘటన శ్రీదేవి అంత్యక్రియల తాలూకు ఓ ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అభిమాన తార చివరి ఫొటోను అభిమానులు పదే పదే చూశారు. చిన్నోడు.. చిన్నారి.. క్రేజ్ బోలెడు బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్–కరీనాకపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్, షాహిద్ కపూర్–మీరా రాజ్‌పుత్ దంపతుల కుమార్తె మిషా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న రెండేళ్లు పూర్తి చేసుకుంది బేబీ మిషా కపూర్. ఈ బర్త్‌డే వేడుకలకు ముందు ముద్దుల కూతురు మిషాతో ఓ ఫొటోషూట్ చేయించుకున్నారు మీరా రాజ్‌పుత్. ఆ ఫొటోలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. చిన్నోడు తైముర్, చిన్నారి మిషాలకు బోల్డంత క్రేజ్. ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి సన్నాయి బాగా వినిపించింది. అందులో సోనమ్ కపూర్–ఆనంద్ ఆహుజాల పెళ్లి ఒకటి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్న తర్వాత సోనమ్–ఆనంద్ ఈ ఏడాది మేలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు క్లిక్‌మన్న ఫొటో నెటిజన్లను బాగా మెప్పించింది. నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా పెళ్లివేడుక సంబరాలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. ఈ నెల 1,2 తేదీల్లో జో«ద్‌పూర్‌లో ఈ జంట రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలకు మొబైల్స్, కెమెరాల అనుమతి లేకపోవడంతో నిక్–ప్రియాంకా ఫొటోలు వారు రిలీజ్ చేసే వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిక్ అండ్ ప్రియాంకా చోప్రా. ఇన్స్టాగ్రామ్ లిస్ట్‌లో ట్వీటర్ అకౌంట్ ఉన్నప్పటికీ కొందరు స్టార్స్ కూడా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమిర్ ఖాన్, కమల్‌హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్... ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ తెరిచిన కొందరు స్టార్స్. ∙ మీరా రాజ్‌పుత్, మిషా ఆనంద్, సోనమ్ నిక్ జోనస్, ప్రియాంక -
నాకూ ఒకటి పంపండి
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్‌కు బాలీవుడ్లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. తైమూర్ బయట కనిపిస్తే కెమెరాలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటాయి. ఒక్కో ఫొటోకు సుమారు 1500 వరకూ చెల్లించి మరీ తీసుకుంటున్నాయి బాలీవుడ్ వెబ్సైట్లు. తైమూర్ బొమ్మలను కూడా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారంటే ఈ బుడతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సైఫ్‌ని అడగ్గా– ‘‘వాడి పేరుని ట్రేడ్ మార్క్ చేసుకోవాలేమో? నాకూ ఓ బొమ్మ పంపండి. వాడి ద్వారా కొందరైనా లాభం పొందుతున్నారంటే అంతకు మించి కావాల్సింది ఏముంది. వీటన్నింటికీ బదులుగా వాడు సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అని పేర్కొన్నారు సైఫ్. -
తైముర్ ఫర్ సేల్
స్టార్ కిడ్స్‌లో తైముర్ అలీఖాన్‌కి బోలెడంత క్రేజ్ ఉంది. సైఫ్ అలీఖాన్, కరీనాల ముద్దుల తనయుడు తైముర్‌కి ఎంత క్రేజ్ ఉందంటే.. ఈ బుడతడు ఎక్కడ కనిపించినా కెమెరాలు క్లిక్మంటాయి. ఇప్పుడు ఏకంగా తైముర్ని పోలిన బొమ్మలను తయారు చేసి, మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. తైముర్ బొమ్మ కేరళలోని దుకాణాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. అమ్మాయిలకు బార్బీ బొమ్మలా.. అబ్బాయిలకు తైముర్ బొమ్మ అన్నమాట. ఇదిలా ఉంటే.. ‘‘తైముర్‌కి నార్మల్ లైఫ్ ఇవ్వాలని మేం అనుకుంటున్నప్పటికీ తనని సెలబ్రిటీలానే చూస్తున్నారు’’ అని కరీనా పేర్కొన్నారు. -
అతడిని నిజంగానే చంపేస్తానేమో అనుకున్నారు!!
సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా, నవాబ్ సైఫ్ అలీఖాన్ జంటగా తెరకెక్కిన ‘సలామ్ నమస్తే’ సినిమాకు నేటితో13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ప్రీతి జింటా గుర్తు చేసుకున్నారు. ‘ వావ్. సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. కెమెరా ముందు, వెనుక కూడా సైఫ్‌తో విపరీతంగా గొడవ పడేదాన్ని. ఒక్కోసారి నటించడం మానేసి జీవించేదాన్ని. దీంతో నేను సైఫ్‌ను నిజంగానే చంపేస్తానేమో అని సిబ్బంది కంగారుపడేవారు. అంతలా కొట్టుకునే వాళ్లం. సైఫ్‌ను మిస్సవుతున్నా. సలామ్ నమస్తేకు 13 ఏళ్లు పూర్తయ్యాయి’ అంటూ ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా ఈ మధ్య సినిమాలు తగ్గించేశారు. కేవలం అతిథి పాత్రలకే పరిమితమయ్యారు. వ్యాపారవేత్తగా సెటిలైన ప్రీతి.. 2016లో తన స్నేహితుడు జీన్ గుడెనఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram Awwww !!! We had so much fun on this film it was insane. Saif and I fought so much on and off camera that the crew didn’t know if we were rehearsing our lines or really wanting to kill each other 🤩 I miss Saif! 😘 #13YearsOfSalaamNamaste #SaifAliKhan #Nick #Amber #Ting! A post shared by Preity G Zinta (@realpz) on Sep 9, 2018 at 1:39am PDT -
వెంటాడే గతం : నేను షారుక్‌ను కాదు..
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ కెరీర్లో అత్యంత మెరుగైన దశను ఎంజాయ్ చేస్తున్నా గతంలో తనకు ఎదురైన గడ్డు పరిస్థితులపై బాహాటంగా ఆవేదన వెళ్లగక్కారు. కరీనా కపూర్, తనయుడు తైమూర్లతో కాలం తెలియకుండా గడుపుతున్న సైఫ్ అలీఖాన్ కెరీర్ తొలినాళ్లలో ఆటుపోట్లతో పాటు అమృతా సింగ్‌తో విడాకుల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2005లో ఓ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ అమృతతో విడాకులు, పిల్లలు సారా, ఇబ్రహిం అలీలను కలుసుకునేందుకు తనను అనుమతించకపోవడంపై మధనపడ్డారు. వీటికితోడు విడాకుల సెటిల్మెంట్లు, భరణం చెల్లింపులతో దాదాపు దివాలా పరిస్థితి ఎదుర్కొన్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పిల్లలను కలిసేందుకు తనను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమృతా సింగ్‌కు విడాకుల పరిష్కారంలో భాగంగా రూ 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆమెకు రూ 2.5 కోట్లు చెల్లించానని తన కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ నెలకు రూ లక్ష చెల్లిస్తానని చెప్పారు. తాను షారుక్ ఖాన్ కాదని, తన వద్ద అంత డబ్బులేదని చెప్పుకొచ్చారు. తాను డేటింగ్లో ఉన్న రోసాతో కలిసి చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నానని చెప్పారు. అలాంటి సైఫ్ ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో పాటు వెబ్‌సిరీస్ విజయాలతో ఊపుమీదున్నారు. కుమార్తె సారాతో అనుబంధం మెరుగుపడి త్వరలోనే ఆమెను బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారు. -
వారసులొస్తున్నారు
సినిమాల్లోకి కొడుకో.. కూతురో.. అల్లుడో... వస్తున్నారంటే పేరెంట్స్ చాలా హ్యాపీ. కానీ, అసలు పండగ అభిమానులదే. కొత్త తరం కొత్త తెరంగేట్రం కావాలనుకుంటారు కదా. అభినయ సుందరి అందం+అభినయం= శ్రీదేవి. ఫ్రమ్ సౌత్ టు నార్త్ శ్రీదేవికి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. అందుకే వారసురాలిపై చాలా అంచనాలు ఉన్నాయి. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టీనేజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ‘ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది’ అని ఒకటే వార్తలు. ఇదిగో.. ఆ సమయం రానే వచ్చేసింది. మరాఠి సూపర్ హిట్ సినిమా ‘సైరట్’ రీమేక్ ‘ధడక్’ ద్వారా హీరోయిన్గా పరిచయం కానుంది జాన్వీ. ఇదే చిత్రం ద్వారా షాహిద్‌కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా జూలై 6న విడుదల కానుంది. తల్లిలానే జాన్వీ అభినయ సుందరి అనిపించుకుంటుందనే అంచనాలున్నాయి. మెగా కల్యాణ్ మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్లో జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆయన చిన్నల్లుడు కల్యాణ్ హీరో ఎంట్రీ ఖరారైంది. అల్లుడు కూడా అభిమానులకు వారుసుడే కదా. ప్రస్తుతం కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మెలకువలు నేర్చుకుంటున్నాడట. ‘జతకలిసే’ ఫేమ్ రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అచ్చన్ పేరు నిలబెట్టే మగ సిక్స్టీ ప్లస్ ఏజ్‌లో వెయిట్ తగ్గడం అంటే మాటలా? కానే కాదు. కానీ మోహన్‌లాల్ చేస్తారు. సినిమా కోసం తగ్గుతారు. ఎందుకంటే సినిమా అంటే ప్యాషన్. అందుకే ఆయన్ను ‘కంప్లీట్ యాక్టర్’ అంటారు. మరి.. ఆయన కుమారుడు ప్రణవ్? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని మలయాళ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘ఒన్నమన్, పునర్జని’ సినిమాల్లో కనిపించారు. ‘పునర్జని’ సినిమాకు ప్రణవ్ కేరళ స్టేట్ అవార్డ్ కూడా సాధించాడు. చిన్నప్పుడు అవార్డు కొట్టేశాడంటే.. హీరోగా వేరే చెప్పాలా? అచ్చన్ (నాన్న) పేరు నిలబెట్టే మగ (కొడుకు) అవుతాడని మోహనల్‌లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆది’ అనే సినిమాతో ఈ నెల 26న హీరోగా స్క్రీన్‌పైకి రాబోతున్నాడు ప్రణవ్. ‘పాపనాశం’ ‘లైఫ్ ఆఫ్ జోసుట్టీ’ సినిమాలకు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ప్రణవ్ ఆయన డైరెక్షన్లోనే ఇంట్రడ్యూస్ కానుండటం విశేషం. విక్రమ్ పుత్రుడు అంధుడు, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి, మల్టిపుల్ డిజార్డర్... ఇలా వెరైటీ రోల్స్ ఏం చేయాలన్నా విక్రమ్ రెడీ. ఈయన టాలెంట్ సూపర్. మరి.. వారసుడు. తండ్రి టాలెంట్ కచ్చితంగా ఉంటుందని ‘ధ్రువ్’పై ఇప్పటికే బోలెడన్ని అంచనాలు. ధ్రువ్ సన్నాఫ్ విక్రమ్ హీరోగా ఎంటర్ కాబోతున్నాడు. అది కూడా సాదాïసీదా సినిమాతో కాదు. సెన్సేషనల్ హిట్ మూవీ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దర్శకుడెవరో తెలుసా? ఎవరి పేరు చెబితే ఆర్టిస్టులకు మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతగాడే. డైరెక్టర్ ‘బాల’. ఆర్టిస్టులను నానా కష్టాలు పెడతాడన్న పేరు బాలాకి ఉంది. కానీ ఆర్టిస్టులకు వచ్చే ‘పేరు’ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. అన్నట్లు.. బాల డైరెక్షన్లో చేసిన ‘శివపుత్రుడు’కే విక్రమ్‌కు నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన డైరెక్షన్లో చేసిన ‘సేతు’ ఆయనకు బోలెడంత పేరు తెచ్చింది. మరి.. ఈ డైరెక్టర్ చేతిలో పడ్డ ధ్రువ్ ‘వర్మ’గా రెచ్చిపోతాడని ఊహించవచ్చు. అదేనండీ.. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌కి ‘వర్మ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ గ్రాండ్ డాటర్ ఎంట్రీ జాహ్నవి ఎవరనేగా మీ డౌట్. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె. మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సినిమా ద్వారా మంజుల కుమార్తె జాహ్నవి టాలీవుడ్‌కి బాలనటిగా పరిచయం అవుతోంది. తాతయ్య కృష్ణ, మేనమామ మహేశ్‌బాబు స్ఫూర్తితో జాహ్నవి బాగా యాక్ట్ చేసిందని ఇండస్ట్రీ టాక్. నానమ్మ బాటలో మనవరాలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్‌ల కుమార్తె సారా అలీఖాన్. చూడచక్కగా ఉంటుంది. హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. 2014 నార్త్ ఇండియా ఉత్తరాఖాండ్‌లో వచ్చిన వరదల ఆధారంగా రూపొందుతున్న ‘కేదార్నాథ్’ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతోంది సారా. అభిషేక్ కపూర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. నానమ్మ షర్మిలా ఠాగూర్ అప్పట్లో పేరున్న కథానాయిక. మనవరాలు కూడా అంత పేరు తెచ్చుకుంటుందా? వెయిట్ అండ్ సీ. డాడీ డైరెక్టర్.. సన్ హీరో డైరెక్టర్ల పిల్లలు డైరెక్టర్లే అవ్వాలని రూలేం లేదు. హీరోలు కూడా అవుతారు. టి.కృష్ణ తనయుడు గోపీచంద్, రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి , పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోలైన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు కె.విజయభాస్కర్ తనయుడు కమల్ హీరోగా అరంగేట్రం చేయనున్నారు. విజయభాస్కర్ అనగానే ‘నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ, మల్లీశ్వరి’ వంటి సినిమాలు గుర్తుకురాక మానవు. తండ్రి ఓ మంచి దర్శకుడైనా కొడుకుని మాత్రం కాళీ అనే ఓ కొత్త దర్శకుడి చేత ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో తన కుమారుడి ఎంట్రీని గ్రాండ్‌గా ప్రకటించనున్నారు విజయభాస్కర్. శివానీ ఎంట్రీ షురూ హీరో కాకముందు రాజశేఖర్ ఎవరు? విలన్. అంతకుముందు డాక్టర్. ఆ తర్వాతే యాక్టర్ అయ్యారు. కుమార్తె శివానీ కూడా తండ్రి ఫుట్స్టెప్స్నే ఫాలో అవుతున్నారు. భవిష్యత్తులో ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎడ్యుకేషన్ కంపల్సరీ కదా. అందుకే జీవితారాజశేఖర్ ముందు శివానీని ఎంబీబీఎస్ పూర్తి చేయమన్నారు. శివానీ కూడా స్టడీస్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు యాక్టర్‌గా టాలెంట్ నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. హిందీ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ ద్వారా శివానీ ఎంట్రీ షురూ అయింది. ఇక, షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. వయసుకి తగ్గట్టు మంచి లవ్‌స్టోరీతో ఇంట్రడ్యూస్ కాబోతున్న శివానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వెంకట్ కుంచం దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అడవి శేష్ హీరో. -
తైమూర్‌తో తలగోక్కున్నారు!
ఎగ్జాక్ట్లీ అండీ. కరీనా కపూర్ దంపతులు తమ అడ్డాల బిడ్డడికి మంగోలు మహారాజు తైమూర్ పేరు పెట్టుకుని సోషల్ మీడియాలో తలవాచిపోయేలా తిట్లు తింటున్నారు. ‘అయినా సరే, అవన్నీ మేము పట్టించుకోము’ అని పొత్తిళ్లలోని బిడ్డను ముద్దాడుతూ మురిపెంగా చెబుతున్నారు కరీనా. తైమూర్ పేరు మీదే మొఘల్ సామ్రాజ్యం అవతరించింది. అతడి అసలు పేరు అమీర్ తైమూర్. ఉజ్బెకిస్థాన్‌లో పుట్టాడు. 68 ఏళ్లు జీవించాడు. (1336–1405). చంగీజ్ఖాన్లా ప్రపంచాన్ని జయించాలని బయల్దేరాడు. దండయాత్రలు చేశాడు. ఐరోపా, చైనా, అరబ్బు రాజ్యాలతో పాటు భారతదేశంలోనూ రక్తపాతం సృష్టించాడు. హిందూదేశంలో ఈ తురుష్క చక్రవర్తి చేసిన ఆగడాలకు అంతేలేదని చరిత్రకారులు రాశారు కూడా. అలాంటి వాడి పేరును పెట్టుకోవడం ఏంటని నెట్ ఇంట ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. ‘వీటన్నిటినీ మేమెలాగైతే పట్టించుకోవడం లేదో, నువ్వూ అలాగే నీ చుట్టూ్ట జరుగుతున్న వాటి గురించి పట్టించుకోవద్దనీ, తల వంచుకుని వెళ్లి, తల వంచుకుని ఇంటికి రమ్మనీ..’ తన కొడుక్కి చెప్తానని కరీనా అంటోంది. అవున్నిజమే అని సైఫ్ కూడా అంటున్నాడు. ఇప్పటికైతే.. తైమూర్‌ని తప్ప ఎవర్నీ పట్టించుకునే తీరికలో లేరు. మంగోలు చక్రవర్తి తైమూర్ -
మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు
న్యూఢిల్లీ: తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది. వైవాహిక జీవితంలో తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపింది. సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అనంతరం.. మీ జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఈ బాలీవుడ్ బ్యూటీ ఇలా స్పందించింది. పెళ్ళి చేసుకొని మూడేళ్ళు అవుతున్నా తమ మధ్య చిన్నపాటి సమస్య కూడా తలెత్తలేదని పెళ్లికి ముందు తన భర్త, సైఫ్ ఎలా వున్నాడో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను మార్చుకోమని ఎపుడూ కోరలేదని, భవిష్యత్తులో కూడా అలా కోరనని కరీనా తెలిపింది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా కరీనా కపూర్ ఖాన్.. . మీడియాతో తన మనసులోని భావాలను ఇలా వ్యక్తం చేసింది. 'మా ఆయన మారాలని నేను ఎపుడూ కోరుకోలేదు...కోరను కూడా.. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి నా జీవితంలో మార్పులు తేవాలని అనుకోలేదు. నేను కూడా పెళ్లికి ముందు ఎలా వున్నానో ఇపుడూ అలాగే ఉన్నాను.. ఉంటాను కూడా... అంటూ వైవాహితక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు ఏ రోజూ ... ఎలాంటి షరతులు పెట్టలేదని, తనని సాధ్యమైనంత వరకు అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. ఈ మూడేళ్ళలో సైఫ్ లో ఎలాంటి మార్పులు తను చూడలేదని, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని పేర్కొంది. భవిష్యత్ లో కూడా ఆ అవసరం రాకుండా చూసుకుంటానంటూ కరీనా వెల్లడించింది . కాగా కపూర్ కుటుంబం నుంచి వచ్చిన కరీనా 2012 లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే. -
ఫెంటాస్టిక్.. ఫాంటమ్
భజ్రంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్‌ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మరో మెరిక లాంటి చిత్రం ఫాంటమ్. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం భారత్‌ను ఎలా ఇబ్బంది పెడుతుందోన్నదని చిత్ర కథ. భారత్ కూడా పాక్ బాటలో నడిచి వారి దేశంలోకి గూఢచారులను పంపడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? అన్న వైవిధ్యమైన కోణంలో కథ ముందుకు సాగుతుంది. ఇంతవరకూ ఇటువంటి పాయింట్‌తో భారత సెల్యులాయిడ్‌పై చిత్రం రాలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే కనిపించినా డైలాగులు మాత్రం తేలిపోయాయి. కథేంటి? 26/11 ముంబై దాడి సూత్రధారులను శిక్షించాలని కోరుతూ భారత్ చేసే ప్రయత్నాలు సఫలం కావు. దీంతో నిందితులకు శిక్ష పడాలంటే ‘ముల్లుకు ముల్లు’ సిద్ధాంతమే సరైనదని భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) నిర్ణయిస్తుంది. దీనికి ఉన్నతాధికారులు అంగీకరించరు. దీంతో రహస్యంగా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయిస్తారు. ఈ పనికోసం సైన్యం నుంచి తీసివేసిన దనియల్ ఖాన్‌ను (సైఫ్ అలీఖాన్) సంప్రదిస్తారు. అతన్ని లండన్‌కు పంపి ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల శిక్షకుడు, లష్కరే తోయిబాకు సహకరించిన సాజిద్‌ను మట్టుబెడతారు. ఇందుకు అమెరికాకు చెందిన ఆయుధాల సరఫరా కంపెనీ ఏజెంట్, ఫార్శీ (ఇరాన్) అయిన నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్) సాయం తీసుకుంటారు. తర్వాత దనియల్ ఖాన్ అమెరికా వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవలో ఇరుక్కుని జైల్లో పడతాడు. ముంబై దాడులకు ముందు ఇండియాలో రెక్కీ నిర్వహించిన డేవిడ్ హెడ్లీ అదే జైలులో ఉంటాడు. ‘రా’ ఆదేశాలతో జైలులోనే ఎవరికీ అనుమానం రాకుండా అతన్ని హతమారుస్తాడు. తర్వాత నవాజ్ (కత్రినా) సాయంతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని పాకిస్తాన్ చేరుకుంటాడు. అక్కడ రా ఏజెంట్ల సాయంతో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను, హిజబుల్ ముజాహిదీన్ అధినేత సయీద్ సలావుద్దీన్‌లను తెలివిగా చంపేస్తాడు. ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన వారందరూ చనిపోతారు. చివరకు దనియాల్, నవాజ్ ఇద్దరే కరాచీ తీరానికి చేరుకుంటారు. సరిగ్గా 26/11 దాడులకు తీవ్రవాదులు ఎలాగైతే భారత్‌కు వచ్చారో, అలాగే దేశం చేరుకోవాలనుకుంటారు. కానీ, ఆ ప్రయత్నంలో దనియాల్ ప్రాణాలు కోల్పోతాడు. నవాజ్ మాత్రమే భారత్ చేరుకుంటుంది. సాంకేతిక వర్గం పనితీరు.. సినిమాకు సాంకేతిక వర్గం తమ అద్భుతమైన పనితీరుతో ప్రాణం పోశారు. ముఖ్యంగా సిరియా ఎన్కౌంటర్, పాకిస్తాన్ సెట్టింగ్‌లు వేయడం మామూలు విషయం కాదు. హాలీవుడ్ స్థాయి పోరాటాలు, సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉన్నాయి. చక్కని నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్‌లు సినిమాను సాంకేతికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగింది. అన్నీ వెరసి హైదరాబాదీ, దర్శకుడు కబీర్ ఖాన్‌కు బాలీవుడ్లో వరుసగా రెండో హిట్ తెచ్చిపెట్టాయి. తేలిపోయిన మాటలు.. సినిమాలో సంభాషణలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో హఫీజ్ మాట్లాడే మాటలు, కత్రినా పాకిస్తాన్లో తన బాల్యాన్ని వివరించే తీరు, రా అధికారుల సంభాషణలు సన్నివేశం బరువుకు తగ్గట్టుగా లేవు. ప్రధాన తారాగణం: సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్, జునే స్మిత్ తదితరులు. సంగీతం: ప్రీతం కెమెరా: అసీమ్ మిశ్రా కథ: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కబీర్ ఖాన్ నిర్మాత: సాజిద్ నదియాద్వాలా డిస్ట్రిబ్యూటర్: యూటీవీ మోషన్ పిక్చర్స్ సందేశం: తీవ్రవాదం ఎక్కడ, ఎలాంటి రూపంలో ఉన్నా సహించకూడదు.