ఆ తప్పు జరగనివ్వను | Kareena Kapoor wants son Taimur Ali Khan to complete education first | Sakshi
Sakshi News home page

ఆ తప్పు జరగనివ్వను

Published Sun, Dec 23 2018 3:55 AM | Last Updated on Sun, Dec 23 2018 3:55 AM

Kareena Kapoor wants son Taimur Ali Khan to complete education first - Sakshi

కరీనా కపూర్‌

కథానాయికగా కరీనా కపూర్‌ ఖాన్‌ మంచి విజయాలు సాధించారు. పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ను చూసిన ఆమెను ఓ బాధ వెంటాడుతోంది. చిన్న వయసులో సినిమాల్లోకి రావడంవల్ల చదువుకోలేకపోయానన్న బాధ కరీనాకి ఉంది. ‘‘నేటి ఆధునిక యుగంలో చదువుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నా 17 ఏళ్ల వయసులో నేను కథానాయికగా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. ఆ తర్వాత చదువుకోవడం కుదర్లేదు. అప్పుడు చదువుకోలేకపోయినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.

నా కొడుకు తైముర్‌ విషయంలో ఆ తప్పు జరగనివ్వను. చదువు పూర్తయిన తర్వాతనే తైముర్‌ కోరుకున్న ఫీల్డ్‌లో వర్క్‌ చేసేలా ప్లాన్‌ చేస్తాను’’ అని ఓ రేడియో షోలో కరీనా కపూర్‌ తన ఆలోచనను పంచుకున్నారు. 2000లో ‘రెఫ్యూజీ’ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కరీనా 2012లో నటుడు సైఫ్‌ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సైఫ్‌–కరీనా దంపతులకు తైముర్‌ అనే బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ప్రజెంట్‌ ‘గుడ్‌న్యూస్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు కరీనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement