Kareena Kapoor's Son Taimur Ali Khan Abusing the Camera, Viral Video - Sakshi
Sakshi News home page

Kareena Kapoor Son Taimur: కెమెరామెన్‌పై ఫైర్‌ అయిన తైమూర్‌, వీడియో వైరల్‌

Published Fri, Apr 29 2022 7:48 PM | Last Updated on Fri, Apr 29 2022 8:11 PM

Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi While Take Photos - Sakshi

Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi: బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ పెద్ద కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచి స్టార్‌కిడ్‌ గుర్తింపు పొందిన తైమూర్‌ ఎంతో మందికి ఫేవరెట్‌ కిడ్‌గా మారిపోయాడు. ఇక ఈ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు(కెమెరామెన్‌) పండుగే. తమ కెమెరాలకు పని చెబుతూ వెంటవెంటనే తైమూర్‌ ఫొటోలను క్లిక్‌ మనిపిస్తారు. ఇక చిన్నతనంలో దీనిపై పెద్దగా అవగాహన లేని తైమూర్‌ పాపరాజీలను చూస్తూ క్యూట్‌గా స్మైల్‌ ఇచ్చేవాడు. అలా తైమూర్‌ ఫొటోలు నిత్యం వార్తల్లో నిలిచేవి.

చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తైమూర్‌ వారి కంటపడ్డాడు. తల్లి కరీనాతో పాటు సోదరుడు జైహ్‌తో ఇంటీ బయట కనిపించాడు. వారి వెంట కేర్‌ టేకర్స్‌ కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తైమూర్‌ను పాపరాలజీలు గ్యాప్‌ లేకుండా ఫొటోలు తీస్తున్నారు. ఇది చూసి నీ బుడ్డోడు రియాక్ట్‌ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చే ఈ బుల్లి పటౌడి ఈసారి మాత్రం ఫైర్‌ అయ్యాడు. కెమెరామెన్‌ను చూస్తూ ‘ఇక ఆపండి’ అంటూ గట్టిగా అరిచాడు. పక్కనే తల్లి కరీనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

మరోవైపు కరీనా రెండో కుమార్‌ జెహ్‌ మాత్రం కారుతో ఆడుతూ కనిపించాడు. ఇక తైమూర్‌ రియాక్షన్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఏంటీ ఈ బుడ్డోడు అంత  మాట అనేశాడంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తు‍న్నారు. అలాగే ‘తల్లిదండ్రులు ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడుతారు. అతడి అమ్మనాన్న మాట్లాడటం చూసి తైమూర్‌ నేర్చుకున్నాడు’, ‘అతడి తల్లిదండ్రులు(కరీనా-సైఫ్‌) నేర్పించే సంస్కారం ఇదేనా?’ అంటూ కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరూ పాపరాజీలకు చురకులు అట్టిస్తున్నారు. ఓ చిన్న పిల్లాడి చేత కూడా చెప్పించుకుంటున్నారు.. మీకంటూ ఓ సెల్ఫ్‌ రెస్పాక్ట్‌ లేదా? అంటూ కామెంట్స్‌ చేస్తు‍న్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement