paparazzi
-
ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? మండిపడ్డ ఆలియా భట్
బాలీవుడ్లో పాపరాజి కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సెలబబ్రిటీలు గడప దాటి అడుగు బయటపెడ్తే చాలు వాళ్ల వెనకాలే కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు నీడలా ఫాలో అయిపోతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అన్నీ ఆరా తీస్తారు. అన్నింటినీ కెమెరాల్లో బంధిస్తుంటారు. వారికంటూ పర్సనల్ స్పేస్ ఇవ్వరు. కొన్నిసార్లు ఇది మితిమీరిపోతూ ఉంటుంది.రావొద్దని వారిస్తున్నా..తాజాగా అదే జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కారు దిగి తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంటే .. ఆలియా మేడం, ఒక్క నిమిషం.. అంటూ ఫోటోల కోసం అర్థించారు. ఆ అభ్యర్థనను పట్టించుకోకుండా ఆమె తన బిల్డింగ్‌లోకి వెళ్లిపోయింది. అది ప్రైవేట్ బిల్డింగ్, ఎవరూ రాకూడదు అని ఆలియా టీమ్ సభ్యులు చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు వెనకాలే వెళ్లారు. మండిపడ్డ ఆలియాఅది చూసిన ఆలియాకు చిర్రెత్తిపోయింది. ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్ భవంతి.. అని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోగ్రాఫర్లు ఆలియా వెంటపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో ఏకంగా ఆమె ఇంట్లో ఉన్న ఫోటోలను సైతం దొంగచాటుగా తీసి నెట్టింట వదిలారు. అప్పుడు కూడా ఆలియా చాలా సీరియస్ అయింది.గతంలోనూ ఇలాగే..పక్క బిల్డింగ్ టెర్రస్‌మీద నుంచి ఇద్దరు నన్ను ఫోటోలు తీశారు. ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా? ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. కాని దాన్ని కూడా చెరిపేస్తున్నారు. అని ఆగ్రహించింది. ఇకపోతే ఆలియా భట్ ప్రస్తుతం జిగ్రా అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ వచ్చే నెల విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mixes Singh (@mi_xes1234) చదవండి: ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన -
ఆ యాంగిల్లో తీయొద్దని చెప్పా: జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీకపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మాహీతో అలరించిన ముద్దుగుమ్మ మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్తగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తాను చెప్పిన విషయాన్ని గుర్తు ఉంచుకుని పాటిస్తున్నారని జాన్వీ వివరించింది.గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ క్యాప్షన్లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది.కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్‌తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది. -
సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్‌తో వచ్చి క్లిక్ అవడంతో అందరి కళ్లు సౌత్‌పై పడ్డాయి. పాన్ ఇండియా లెవల్లో సౌత్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.సౌత్ వర్సెస్ బాలీవుడ్దీంతో అప్పటినుంచి బాలీవుడ్‌ను సౌత్ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్‌గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా అంటున్నాడు. వీరేందర్ చావ్లా, ఫోటోగ్రాఫర్చెప్పులేసుకుని..అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సెలబ్రిటీలు ఫేక్‌గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్ చేశాడు. సౌత్‌లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటాడు. ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..అతడు హోటల్‌కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆయన్ను క్లిక్‌మనిపించాడు. అందుకాయన నా టీమ్ మెంబర్‌పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్‌బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్‌గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో -
నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!
జాన్వీ కపూర్.. ఈ పేరు చెప్పగానే అందాలన్నీ ఆరబోసే హీరోయినే గుర్తొస్తుంది. ఎందుకంటే నటిగా ఈమె అంత పెద్ద పేరేం తెచ్చుకోలేదు. కానీ గ్లామర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్‌కి మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి న్యాయం చేస్తూనే ఉంటుంది. జాన్వీకి సంబంధించిన చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో చాలావరకు తన అనుమతి లేకుండా తీస్తున్నారని, వాటి వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతోందని అంటోంది.(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్)ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' మూవీ చేస్తున్న జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలోనూ హీరోయిన్గా చేస్తోంది. మరోవైపు ఈమె లేటెస్ట్ హిందీ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ'. మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఈమె తన గురించి చాలా విషయాల్ని బయటపెడుతోంది. అలా తన స్కిన్ షో డ్రస్సలు గురించి కూడా చెప్పింది.'సినిమా ప్రమోషన్స్ కోసమైతే పపరాజీ(ఫొటోగ్రాఫర్స్)ని పిలుస్తాను. కానీ జిమ్‌కి వెళ్లేటప్పుడు మాత్రం అస్సలు పిలవను. అయినాసరే నన్ను ఫాలో అయి వచ్చేస్తుంటారు. జిమ్ దుస్తుల్లో రకరకాల యాంగిల్స్‌లో నా ఫొటోలు తీస్తుంటారు. జనాలు అలాంటి డ్రెస్సుల్లో చూడొద్దని అనుకుంటాను. ఎందుకంటే తర్వాత వీటిపై వాళ్లు ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తారు!' అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ) -
బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి
నటి ప్రియమణి చాలామందికి తెలియని సీక్రెట్ బయటపెట్టింది. బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి జరుగుతున్న ఓ పని వెనక అసలేం జరుగుతుందో మొత్తం బయటపెట్టింది. ఓర్ని అసలు సంగతి ఇదా అని అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ప్రియమణి ఏం చెప్పింది? హిందీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ప్రియమణి.. హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు అంత పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. పలు షోల్లో జడ్జిగా చేస్తూ వచ్చింది. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఈమె ఫేట్ మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఇలా ఓ వైపు మూవీస్‌లో ముఖ్య పాత్రలు చేస్తూ జోరు మీదుంది. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) ఈ మధ్య కాలంలో జవాన్, నెరు, భామా కలాపం 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లు ఇస్తూ బిజీగా ఉంది. అలా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ. బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ బండారం బయటపెట్టింది. చాలామంది హిందీ హీరోయిన్లు.. జిమ్, విమానాశ్రయం, హోటల్ దగ్గర కనిపిస్తుంటే చాలామంది ఫొటోగ్రాఫర్లు వీళ్ల వెంట పడుతుంటారు కదా. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి చేయించుంకుంటారని ప్రియమణి చెప్పింది. 'జవాన్' చేసిన తర్వాత ముంబయికి వెళ్తే.. ఓ ఏజెన్సీ వ్యక్తి నాకు కూడా పపరాజీ కల్చర్‌కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే ఛార్ట్ పంపించాడని చెప్పింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న తెలుగు యువ నటి.. ఫొటో వైరల్) -
Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే?
Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB Video Goes Viral: తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం 'వారీసు'(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుస షెడ్యూల్‌తో బిజీగా ఉన్న విజయ్ తాజాగా చిన్న విరామం తీసుకున్నాడు. ఈ విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'ను (BIMBISARA MOVIE) విజయ్ వీక్షించినట్లు సమాచారం. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్ ఏఎమ్‌బీలో చూసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా లీక్ అయి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. విజయ్ను గుర్తించిన పాపరాజీ (ఫొటోగ్రాఫర్స్) ఫటాఫట్మని క్లిక్‌మనిపించారు. అలాగే విజయ్ కారులో వెళ్తుండగా, హీరో డ్రైవర్ అడ్డుగా చేతులు పెట్టడం చూడొచ్చు. సో మొత్తంగా, నందమూరి హీరో సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్లో మరో స్టార్ హీరో విజయ్ వీక్షించడం విశేషం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) కాగా విజయ్ 'వారీసు' చిత్రం 2022 దీపావళికి, లేదా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరదశలో ఉందని సమాచారం. ఇది పూర్తి కాగానే 'విక్రమ్' లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదివరకు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో విజయ్ 'మాస్టర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్.. భారత్ రెజ్లర్ గ్రేట్ ఖలీ కన్నీటిపర్యంతం అయ్యాడు. అతను ఎందుకు ఏడ్చాడన్నది అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. విషయంలోకి వెళితే.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీని.. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలివ్వాలని అడిగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖలీ చిరునవ్వుతో వారి దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజిచ్చాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే అతని మొహంలో మార్పు కనిపించింది. అప్పటిదాకా సంతోషంగా కనిపించిన ఖలీ.. ఒక్కసారిగా దుఃఖంతో కుమిలిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఖలీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడన్నది ఎవరికి అర్థం కాలేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా 19 సెకెన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారు. భారత్ తరపున వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో పాల్గొని 'ది గ్రేట్ ఖలీ'గా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. 'గ్రేట్ ఖలీ' అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో లెజెండరీ.. హండర్ టేకర్‌ను ఓడించి ఖలీ అప్పట్లో సంచలనం సృష్టించాడు. కాగా ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఖలీ.. 2021లో ''WWE HALL OF FAME''లో చోటు సంపాదించాడు. ఇక పలు బాలీవుడ్, హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన ఖలీ అలియాస్ దలీప్ రాణా.. పంజాబ్ పోలీస్‌లో అసెస్టింట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఇటీవలే రాజకీయ అరంగేట్రం ఇచ్చిన ఖలీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. what made Khali Sir cry? pic.twitter.com/mrFKUTdM5A — Viral Bhayani (@viralbhayani77) August 12, 2022 చదవండి: Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం -
నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం
‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు వరస ఆఫర్లు, స్టార్ హీరో సరసన నటించిన ఆమె ఉన్నట్టుంటి బాలీవుడ్‌కు మాకాం మార్చింది. అక్కడ మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్లోనే సెటిలైపోయింది. అప్పుడప్పుడు 'మిషన్ ఇంపాజిబుల్' వంటి తెలుగు సినిమాలు చేస్తూ పలకరిస్తోంది. కాగా ఇటీవల స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'శభాష్ మిథూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయం సంగతి ఎలా ఉన్న మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది తాప్సి. ఈ సొట్ట బుగ్గల బ్యూటీ నటించిన తాజా చిత్రం 'దొబారా'. ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది తాప్సీ. అయితే ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్లతో తాప్సీకి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ముంబైలో సినిమా ప్రమోషన్ కోసం హాజరైన తాప్సీ గుమ్మం దగ్గర ఉన్న ఫొటోగ్రాఫర్లను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది. వారు వెనుక నుంచి ఎంత పిలిచినా స్పందించలేదు. 'ఇప్పటికే ఆలస్యంగా వచ్చారు. కొద్దిగా ఆగి వెళ్లండి' అంటూ అరుస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది తాప్సీ. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత వారితో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 'నేనేం లేటుగా రాలేదు. నా టైం ప్రకారమే నేను వచ్చాను. నేను ఇప్పటివరకు ప్రతి చోటుకు సరైన సమయానికే వెళ్లాను. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు' అని అడిగింది తాప్సీ. అందుకు వారు 'మేము రెండు గంటల నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాం. కానీ మేము పిలుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి?' అని నిలదీశారు. 'అందులో నా తప్పు ఏముంది? నా పని నేను చేసుకుంటూ.. వెళ్లిపోతున్నాను' అని చెప్పగా 'మేము మీకోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం' అని ఫొటోగ్రాఫర్స్ గట్టిగా అరిచేసరికి 'దయచేసి మీరు నాతో మర్యాదగా మాట్లాడండి. నేను కూడా మీతో మర్యాదాగ మాట్లాడతాను' అంటూ గొడవకు దిగింది. తర్వాత పరిస్థితిని సద్దుమణిగించేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా, తాప్సీ సహనటుడు పావైల్ గులాటి కూడా ఆమె వెనుక నిలబడ్డాడు. 'కెమెరా నాపై ఉంది కాబట్టే నా వైపు మాత్రమే కనిపిస్తుంది. అదే ఒక్కసారి మీపై ఉంటే మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో మీకు అర్థమయ్యేదు. ఎప్పుడు మీరే కరెక్ట్. ప్రతిసారి నటీనటులదే తప్పు' అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంతమంది నెటిజన్స్ 'తాప్సీకి ఎంత పొగరు' అని విమర్శిస్తుంటే, పలువురు 'ఆమె అలా మాట్లాడటంలో తప్పు ఏముంది?' అని సమర్థిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి
Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచి స్టార్కిడ్ గుర్తింపు పొందిన తైమూర్ ఎంతో మందికి ఫేవరెట్ కిడ్‌గా మారిపోయాడు. ఇక ఈ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు(కెమెరామెన్) పండుగే. తమ కెమెరాలకు పని చెబుతూ వెంటవెంటనే తైమూర్ ఫొటోలను క్లిక్ మనిపిస్తారు. ఇక చిన్నతనంలో దీనిపై పెద్దగా అవగాహన లేని తైమూర్ పాపరాజీలను చూస్తూ క్యూట్‌గా స్మైల్ ఇచ్చేవాడు. అలా తైమూర్ ఫొటోలు నిత్యం వార్తల్లో నిలిచేవి. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తల్లి కరీనాతో పాటు సోదరుడు జైహ్తో ఇంటీ బయట కనిపించాడు. వారి వెంట కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తైమూర్‌ను పాపరాలజీలు గ్యాప్ లేకుండా ఫొటోలు తీస్తున్నారు. ఇది చూసి నీ బుడ్డోడు రియాక్ట్ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చే ఈ బుల్లి పటౌడి ఈసారి మాత్రం ఫైర్ అయ్యాడు. కెమెరామెన్‌ను చూస్తూ ‘ఇక ఆపండి’ అంటూ గట్టిగా అరిచాడు. పక్కనే తల్లి కరీనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! మరోవైపు కరీనా రెండో కుమార్ జెహ్ మాత్రం కారుతో ఆడుతూ కనిపించాడు. ఇక తైమూర్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటీ ఈ బుడ్డోడు అంత మాట అనేశాడంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే ‘తల్లిదండ్రులు ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడుతారు. అతడి అమ్మనాన్న మాట్లాడటం చూసి తైమూర్ నేర్చుకున్నాడు’, ‘అతడి తల్లిదండ్రులు(కరీనా-సైఫ్) నేర్పించే సంస్కారం ఇదేనా?’ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ పాపరాజీలకు చురకులు అట్టిస్తున్నారు. ఓ చిన్న పిల్లాడి చేత కూడా చెప్పించుకుంటున్నారు.. మీకంటూ ఓ సెల్ఫ్ రెస్పాక్ట్ లేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేడమ్ యాటిట్యూడ్.. జాన్వీ కపూర్‌పై ట్రోలింగ్
Actress Janhvi Kapoor Trolled For Ignoring Paparazzi: సెలబ్రిటీలు ఏం చేసిన ప్రతిరోజు ఏదో ఒక రకంగా ట్రోలింగ్ గురవుతుంటారు. వారు బాధలో ఉన్న, సంతోషంగా ఉన్న, వేషధారణ, ప్రవర్తన కొంచెం భిన్నంగా కనపడిన నెటిజన్స్ వారి కామెంట్స్‌తో ఆడేసుకుంటారు. వస్త్రధారణ నుంచి యాట్టిట్యూడ్ వరకు విమర్శకులు జడ్జ్ చేయడాన్ని సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య నడకపై ఎన్నో కామెంట్స్ చేశారు నెటిజన్స్. ఆ ట్రోలింగ్‌పై అభిషేక్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. తాజాగా ఈ ట్రోలింగ్ కన్ను అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై పడింది. జాన్వీ కపూర్ తన సోదరి, స్నేహితులతో ఎక్కడికో వెళ్లి రావడం ఫొటోగ్రాఫర్ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫొటోలకు ఫోజులివ్వమని ఫొటోగ్రాఫర్లు అడగ్గా పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుందీ దఢక్ హీరోయిన్. ఈ వీడియను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై కామెంట్స్ రూపంలో జాన్వీని ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు నెటిజన్స్. 'మేడమ్ యాట్టిట్యూడ్ చూడండి' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల ఫ్యాషన్‌కు సంబంధించిన ఓ వీడియోలో మూడు వేర్వేరు కాస్ట్యూమ్స్ ధరించి ఇంటర్నెట్ను షేక్ చేసింది జాన్వీ. ఆ వీడియో ఏదో బ్యూటీ బ్రాండ్ కోసం జాన్వీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన అద్భుతమైన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతారు. ఇన్‌స్టా గ్రామ్‌లో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ్య 14.4 మిలియన్లు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఇలా ప్రవర్తించవద్దు.. క్షమాపణలు చెప్పిన హీరోయిన్.. వీడియో వైరల్
Sara Ali Khan Apologizes For Pushing A Photographer: సినిమా వాళ్లు కనపడితే అభిమానులు, మీడియా, ఫొటోగ్రాఫర్లు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోతారు. ఫ్యాన్స్ అని చూడకుండా వారిపై అరుస్తారు, తిడతారు, కొడతారు కూడా. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన మృదువు స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోమవారం జరిగిన ఒక ఈవెంట్లో నెట్టివేయబడిన ఒకరి కోసం నిలబడింది సారా. సారా అలీ ఖాన్ రాబోయే చిత్రం 'ఆత్రంగి రే'లోని చక్ చక్ పాటను లాంచ్ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఫెస్ట్ 'క్షితిజ్'కు హాజరయింది. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది చూసిన సారా, కారు ఆపి 'ఎవరిని కిందకు తోసారు' అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది. దానికి వారు 'ఎవరూ కింద పడలేదు' అని సమాధానం ఇచ్చారు. దానికి 'లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అప్పటికే వెళ్లిపోయాడు.' అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో 'సారీ చెప్తున్నా, థ్యాంక్యూ' అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో 'ఇలా ప్రవర్తించవద్దు. ఎవరినీ నెట్టవద్దు.' అని స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆత్రంగి రే' చిత్రంలోని ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ 'చక్ చక్'ని విడుదల చేశారు మేకర్స్. ఉల్లాసభరితమైన ఈ పాటలో సారా నియాన్ గ్రీన్, పింక్ చీర ధరించి బీట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సౌత్ ఇండియన్ స్టైల్ సెలబ్రేషన్ ఈవెంట్లో సెట్ చేసిన ఈ పాటలో ధనుష్ నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది చదవండి: బాలీవుడ్ బ్యూటీకి ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్.. ఎంత క్యూట్‌గా నవ్విందో.. వీడియో వైరల్ -
‘‘అంత్యక్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’
Karanvir Bohra Arriving Sidharth Shukla Home In A Ciaz: బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ‘‘ఇక స్నేహితుడు మృతి చెంది.. బాధలో ఉంటే.. పాపరాజీలు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తాము ఎలాంటి కార్లలో వచ్చాం.. అందంగా ముస్తాబయ్యామా లేదా వంటి అంశాలపై తమని విమర్శిస్తూ వార్తలు రాస్తున్నారని.. వారి నీచ మనస్తత్వానికి జాలి పడుతున్నాను’’ అన్నారు నటుడు కర్ణవీర్ బోహ్రా. విషయం ఏంటంటే సిద్ధార్థ్ శుక్లా మరణం అనంతరం కర్ణవీర్ బోహ్రా అతడిని తల్లిని పరామర్శించేందుకు సిద్ధార్థ్ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో కర్ణవీర్ సియాజ్ కార్లో సిద్ధార్థ్ నివాసానికి వచ్చాడు. ఇది చూసి పాపరాజీలు సియాజ్ కారులో వచ్చాడు.. పేదవాడిగా మారాడు అంటూ కామెంట్ చేయసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోని కర్ణవీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) దీనిలో అతడు ‘‘కుమారుడిని కోల్పోయి కుంగిపోతున్న తల్లిని చూడటానికి మేం వెళ్లాం. ఇలాంటి విషాద సమయంలో కొందరు పాపరాజీలు చాలా దారుణంగా మాట్లాడారు. ఇంత బాధలో కూడా మేం ఫైవ్‌స్టార్ అప్పియరెన్స్‌తో కనిపించాలా.. కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా.. సియాజ్ కారులో వచ్చినందుకు నేను పేదవాడిని అయ్యానా.. ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరు’’ అంటూ ఘాటుగా విమర్శించాడా కర్ణవీర్ బోహ్రా. (చదవండి: సిద్దార్థ్‌పై జోక్ చేసిన సల్మాన్, పాత వీడియో వైరల్) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) కర్ణవీర్ బోహ్రా తన భార్యతో కలిసి సిద్ధార్థ్ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాక.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్ధార్థ్ మరణంపై స్పందిస్తూ కర్ణవీర్ ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను చాలా షాక్‌లో ఉన్నాను. ఇది ఎలా జరిగింది. దేవుడు మనతో ఇలాంటి జోక్‌లు చేయడం దారుణం. అతడి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. (చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?!) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) -
వైరల్: బ్యాలెన్స్ తప్పిన కృతి.. నెటిజన్ల ట్రోలింగ్!
సెలబ్రిటీలు ఇల్లు విడిచి కాలు బయట పెడితే చాలు ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుమముడతారు. వీళ్లు ఎక్కడ కనపడినా, తిరిగినా తమ కెమెరాలలో బంధిస్తుంటారు. సీసీ కెమెరా కంటే ఎక్కువ ఫోకస్‌తో ఫాలో అవుతుంటారు. వీరి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక్క చోట కచ్చితంగా దొరికిపోతుంటారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ముంబై నగర వీధుల్లో కంటపడింది. ఓ సెలూన్ సందర్శన కోసం వచ్చిన ఈ బ్యూటీ ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. బ్లాక్ హైహీల్స్‌తో క్యాజువల్ వేర్లో ఉన్న కృతి తన లగ్జరీ కారు నుంచి బయటకు దిగుతుండగా బ్యాలెన్స్ తప్పి పడబోయింది. పూర్తిగా కింద పడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన ఈ భామ చివరి క్షణంలో తిరిగి సరిగా నిలబడింది. తరువాత ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది. అయితే కృతి పడిపోతుండగా వీడియో తీశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. తమ కామెంట్లతో కృతిని ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ ఎత్తు ఉన్న పాదరక్షలు వాడకూడదని ఫ్లాట్ చెప్పులు వాడలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది కృతికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ తప్పడం సాధరణమని, అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: సోషల్ హల్చల్: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు హ్యాట్, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి! -
ఫోటో జర్నలిస్టులను పాప్ స్టార్ తప్పించుకోబోయి..
ఫోటో జర్నలిస్టులను తప్పించుకోవాలనే ప్రయత్నంలో సంచలన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ స్వల్ప కారు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటన బేవెర్లీ హిల్స్ లో చోటు చేసుకుంది. ఫోటో జర్నలిస్టులను తప్పించుకోవాలనే తొందరలో డ్రైవర్ కారును వెనక్కి తీయగా మరో బీఎండబ్ల్యూ కారును ఢీ కోట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు బీబర్ కారు వెనుక సీటులో ఉన్నట్టు సమాచారం. బెవెర్లీ హిల్స్ లో లోని బౌచోన్ రెస్టారెంట్ వద్ద జరిగినట్టు మీడియాలో కథనం వెల్లడైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని.. కేసు కూడా నమోద చేయలేదని బెవెర్లీ హిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. గతంలో వెంటాడుతున్న ఫోటో జర్నలిస్టులను తప్పించుకునే క్రమంలోనే ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. Follow @sakshinews -
మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!
టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబెర్ దక్షిణ అమెరికా పర్యటన వివాదాలతో ముందుకు సాగుతోంది. తాజాగా ఫోటో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. అర్జెంటినాలో కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్న ఫోటో జర్నలిస్ట్ ను కారు డోర్ తో దురుసుగా తోయడం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఇటీవల బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో వేశ్యగృహంలో బీబర్ పట్టుబడిన సంఘటన దక్షిణ అమెరికా అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ సంఘటన తర్వాత రియో డి జెనిరోలోని ఓ ప్రదర్శనలో వాటర్ బాటిల్ తో బీబెర్ ను అభిమాని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఒంటిపై షర్ట్ లేకుండా ఓ రాత్రి గడుపుతూ ఉన్నట్టుగా కనిపించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది.