ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? మండిపడ్డ ఆలియా భట్‌ | Alia Bhatt Gets Furious on Paparazzi As They Enters Her Building | Sakshi
Sakshi News home page

Alia Bhatt: నీడలా వెంబడించిన ఫోటోగ్రాఫర్లు.. ఏకంగా ఆమె బిల్డింగ్‌లోకి..

Published Sat, Sep 7 2024 4:15 PM | Last Updated on Sat, Sep 7 2024 7:30 PM

Alia Bhatt Gets Furious on Paparazzi As They Enters Her Building

బాలీవుడ్‌లో పాపరాజి కల్చర్‌ ఎక్కువగా ఉంటుంది. సెలబబ్రిటీలు గడప దాటి అడుగు బయటపెడ్తే చాలు వాళ్ల వెనకాలే కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు నీడలా ఫాలో అయిపోతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అన్నీ ఆరా తీస్తారు. అన్నింటినీ కెమెరాల్లో బంధిస్తుంటారు. వారికంటూ పర్సనల్‌ స్పేస్‌ ఇవ్వరు. కొన్నిసార్లు ఇది మితిమీరిపోతూ ఉంటుంది.

రావొద్దని వారిస్తున్నా..
తాజాగా అదే జరిగింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ కారు దిగి తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తుంటే .. ఆలియా మేడం, ఒక్క నిమిషం.. అంటూ ఫోటోల కోసం అర్థించారు. ఆ అభ్యర్థనను పట్టించుకోకుండా ఆమె తన బిల్డింగ్‌లోకి వెళ్లిపోయింది. అది ప్రైవేట్‌ బిల్డింగ్‌, ఎవరూ రాకూడదు అని ఆలియా టీమ్‌ సభ్యులు చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు వెనకాలే వెళ్లారు. 

మండిపడ్డ ఆలియా
అది చూసిన ఆలియాకు చిర్రెత్తిపోయింది. ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్‌ భవంతి.. అని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోగ్రాఫర్లు ఆలియా వెంటపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో ఏకంగా ఆమె ఇంట్లో ఉన్న ఫోటోలను సైతం దొంగచాటుగా తీసి నెట్టింట వదిలారు. అప్పుడు కూడా ఆలియా చాలా సీరియస్‌ అయింది.

గతంలోనూ ఇలాగే..
పక్క బిల్డింగ్‌ టెర్రస్‌మీద నుంచి ఇద్దరు నన్ను ఫోటోలు తీశారు. ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా? ప్రతిదానికి ఓ లిమిట్‌ ఉంటుంది. కాని దాన్ని కూడా చెరిపేస్తున్నారు. అని ఆగ్రహించింది. ఇకపోతే ఆలియా భట్‌ ప్రస్తుతం జిగ్రా అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ వచ్చే నెల విడుదల కానుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement