Watch: Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: మహేశ్‌ బాబు థియేటర్‌లో దళపతి విజయ్.. వీడియో వైరల్‌

Published Tue, Aug 16 2022 6:04 PM | Last Updated on Tue, Aug 16 2022 6:32 PM

Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB Video Goes Viral - Sakshi

Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB Video Goes Viral: తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం 'వారీసు'(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుస షెడ్యూల్‌తో బిజీగా ఉన్న విజయ్‌ తాజాగా చిన్న విరామం తీసుకున్నాడు. 

ఈ విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం 'బింబిసార'ను (BIMBISARA MOVIE) విజయ్‌ వీక్షించినట్లు సమాచారం. సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు థియేటర్‌ ఏఎమ్‌బీలో చూసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా లీక్ అయి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో విజయ్‌ బ్లూ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించి, ముఖానికి మాస్క్‌ పెట్టుకున్నాడు. విజయ్‌ను గుర్తించిన పాపరాజీ (ఫొటోగ్రాఫర్స్‌) ఫటాఫట్‌మని క్లిక్‌మనిపించారు. అలాగే విజయ్‌ కారులో వెళ్తుండగా, హీరో డ్రైవర్‌ అడ్డుగా చేతులు పెట్టడం చూడొచ్చు. సో మొత్తంగా, నందమూరి హీరో సినిమాను సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు థియేటర్‌లో మరో స్టార్‌ హీరో విజయ్‌ వీక్షించడం విశేషం. 

చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్‌ ! సిల్క్‌ స్మితగా విద్యా బాలన్ డౌటే ?

కాగా విజయ్‌ 'వారీసు' చిత్రం 2022 దీపావళికి, లేదా 2023  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరదశలో ఉందని సమాచారం. ఇది పూర్తి కాగానే 'విక్రమ్‌' లాంటి సాలిడ్‌ హిట్‌ ఇచ్చిన లోకేష్‌ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదివరకు లోకేష్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ 'మాస్టర్‌' సినిమా చేసిన విషయం తెలిసిందే.  

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement