watches
-
‘ఫిట్‌లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు.. ధరెంతో తెలుసా..? (ఫొటోలు)
-
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
ధర ‘వాచ్’పోతుంది..!
డబ్బు మనిషిని రాజ్యాలనుఏలే రాజులుగా మారుస్తుంది. రోడ్లపై ఉండే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. దాన్ని ఎలా వాడుతున్నామనేదే ప్రధానం. అయితే సంపాదించిన సొమ్మంతా ఎలా దాచుకుంటున్నామనేది కూడా ముఖ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డబ్బు దాయాలంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది బ్యాంకులు. సేవింగ్స్ స్కీమ్‌లు, రికరింగ్ డిపాజిట్లు, ఎఫ్డీ.. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌మార్కెట్ షేర్లు, రియల్ఎస్టేట్లో పెట్టుబడులు, భవనాలు కొనుగోలు చేయడం.. ఇలా వివిధ మార్గాల్లో డబ్బు దాస్తున్నారు. వీటితోపాటు బాగా డబ్బు సంపాదిస్తున్నవారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేస్తూ వాటిరూపంలో సంపద దాస్తున్నారు. ఇటీవల హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. అయితే తన పేరుతో 214 ఎకరాలు భూమి, తెలంగాణతోపాటు విశాఖపట్నంలో 29 ప్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాంతోపాటు ఖరీదైన గడియారాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు..(ఫోర్బ్స్ డేటా ప్రకారం) 1. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ ధర: రూ.458 కోట్లు ఉపయోగించిన పదార్థం: ప్లాటినం తయారీ సంవత్సరం: 2014 ప్లాటినమ్ బ్రాస్లెట్తో ఉన్న ఈ గడియారాన్ని 110 క్యారెట్ల విభిన్న రంగులతో కూడిన వజ్రాలతో తయారుచేశారు. 2. గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ ధర: రూ.333 కోట్లు ఉపయోగించిన పదార్థం: డైమండ్ తయారీ సంవత్సరం: 2015 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలను కలిగి అరుదైన 38.13 క్యారెట్ల వజ్రం సెంట్రల్ డయల్‌గా పనిచేస్తుంది. 3. పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ రెఫ్. 6300A-010 ధర: రూ.258 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2019 4. బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోయినెట్ ధర:రూ. 250 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1827 ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోయినెట్ కోసం దీన్ని తయారుచేశారని నమ్ముతారు. 1900 చివరలో ఈ గడియారాన్ని కొందరు దుండగులు దొంగలిచారు. ప్రస్తుతం ఇది ఎల్ఏ మేయర్ మ్యూజియంలో ఉంది. 5. జేగర్-లెకౌల్ట్రే జోయిలెరీ 101 మాన్చెట్ ధర: రూ.216 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2012 777 వజ్రాలను ఇందులో అమర్చారు. 6. చోపార్డ్ 201- క్యారెట్ ధర: రూ.208 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు, పసుపు బంగారం తయారీ సంవత్సరం: 2000 ఇది స్ప్రింగ్ లోడెడ్ మెకానిజమ్‌తో పని చేస్తుంది. సమయం తెలుసుకునేందుకు దానిపై నొక్కినప్పుడు మూడు గుండె ఆకారపు వజ్రాలు (15-క్యారెట్ గులాబీ రంగు, 12-క్యారెట్ నీలం రంగు, 11-క్యారెట్ తెలుపు రంగు) పూల రేకుల్లా విచ్చుకుంటాయి. 7. పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్ కాంప్లికేషన్ ధర: రూ.200 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1932 8. రోలెక్స్ పాల్ న్యూమన్ డేటోనా రెఫ్ 6239 ధర: రూ.155 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1968 9. జాకబ్ & కో.బిలియనీర్ వాచ్ ధర: రూ.150 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2015 ఇదీ చదవండి: వాట్సప్‌లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా! 10. పటేక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్ 1518 ధర: రూ.100 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1943 -
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
కేసియో వాచీల తయారీ ఇక భారత్‌లోనూ..
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కేసియో భారత్‌లో తమ వాచీల తయారీపై దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నుంచి దేశీయంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని కేసియో ఇండియా ఎండీ హిడెకి ఇమాయ్ తెలిపారు. స్థానిక భాగస్వామితో కలిసి పని చేస్తున్నామని, ప్రస్తుతం నాణ్యతపరమైన మదింపు జరుగుతోందని ఆయన చెప్పారు. 2023 ఆఖరు నాటికి మేడిన్ ఇండియా శ్రేణి వాచీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హిడెకి వివరించారు. అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో తమ వ్యాపార వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అయిదేళ్లలో భారత విభాగం అత్యధిక వృద్ధి సాధించగలదని హిడెకి ధీమా వ్యక్తం చేశారు. కేసియోకి చెందిన జీ–షాక్, వింటేజ్ కలెక్షన్, ఎన్‌టైసర్ తదితర బ్రాండ్స్ వాచీల ధరలు రూ. 1,500 నుంచి రూ. 3 లక్షల వరకు ఉన్నాయి. -
చేతి వాచీలకు కాలం చెల్లింది.. వేలి వాచీలు వచ్చేస్తున్నాయ్!
గడియారాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో వాటిని నడుముకు వేలాడదీసుకునేవారు. కొంతకాలానికి చేతి గడియారాలు వచ్చాక, ముంజేతికి వాచీలు ధరించడం ఫ్యాషన్‌గా మారింది. మొబైల్ఫోన్లు వచ్చాక చేతికి వాచీలు ధరించే ఫ్యాషన్‌కు దాదాపుగా కాలం చెల్లింది. వాచీల వాడకాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి జాపనీస్ కంపెనీ ‘క్యాసియో’ ఇటీవల ‘స్టాస్టో స్టాండ్ స్టోన్స్’ సంస్థతో కలసి వేలికి ఉంగరాల్లా తొడుక్కునే ఈ వాచీలను అందుబాటులోకి తెచ్చింది. రకరకాల డిజైన్లు, రకరకాల మోడల్స్‌లో రూపొందించిన ఈ వాచీలను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వేలి వాచీల్లో క్యాలికులేటర్, డిజిటల్ డిస్ప్లే వంటి సౌకర్యాలు కూడా ఉండటం విశేషం. వీటి ధరలు మోడల్స్‌ను బట్టి 3 డాలర్ల (రూ.249) నుంచి మొదలవుతాయి. -
ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
Best Smartwatches Under Rs. 1500: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్నాలజీ వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. నేడు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా స్మార్ట్‌వాచ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ. 1500 కంటే తక్కువ ధర వద్ద లభించే లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 (Fastrack Revoltt FS1) రూ. 1200 వద్ద అందుబాటులో ఉన్న 'ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1' ఎక్కువ ప్రజాదరణ పొందిన బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. దీనిని ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 1.83 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందింది. 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. నాయిస్ క్రూ (Noise Crew) మన జాబితాలో రెండవ స్మార్ట్‌వాచ్ 'నాయిస్ క్రూ'. దీని ధర రూ. 1499 మాత్రమే. దీనిని రిటైల్ స్టోర్స్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.38 ఇంచెస్ రౌండ్ డిస్ప్లే కలిగి ఐపీ68 రేటింగ్ పొందుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది. పెబుల్ ఫ్రాస్ట్ ప్రో (Pebble Frost Pro) రూ. 1299 వద్ద లభించే పెబుల్ బ్రాండ్ 'ఫ్రాస్ట్ ప్రో' స్మార్ట్‌వాచ్ మంచి ప్రజాదరణ పొందిన లేటెస్ట్ మోడల్. ఇది 1.96 ఇంచెస్ డిస్ప్లే కలిగి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేటింగ్ వంటి ఆఫ్షన్స్‌తో పాటు వినియోగదారులకు ఆధునిక కాలంలో ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! నాయిస్ ఐకాన్ బజ్ (Noise Icon Buzz) మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఐకాన్ బజ్. రూ. 1299 వద్ద లభించే ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 1.69 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఈ లేటెస్ట్ ప్రొడక్ట్ బ్లూటూత్ కాలింగ్ వంటి వాటితో పాటు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా పొందుతుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! ఫైర్-బోల్ట్ నింజా టాక్ (Fire-Boltt Ninja Talk) ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన నింజా టాక్ ధర రూ. 1499. రౌండ్ డయల్ డిజైన్ కలిగి చూడ చక్కగా కనిపించే ఈ వాచ్ ఎంతోమంది వినియోగద్రూలకు ఇష్టమైన ఉత్పత్తి. 120 స్పోర్ట్స్ మోడ్స్‌తో బ్లూటూత్ కాలిగి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారుని ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!
గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్‌కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్‌గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్డీ, కోటి రూపాయల మెర్సిడెస్‌బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
వామ్మో.. చిరు వాడే వాచ్ అంత కాస్ట్లీనా! ధరెంతో తెలుసా?
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు వాడే కార్లు, దుస్తులు, వాచ్ బ్రాండ్లను, వాటి ధరల గురించి సెర్చ్ చేస్తుంటారు. ఇక ఎక్కువ బ్రాండ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తరచూ వార్తల్లో నిలస్తుంటాడు. ఇక రామ్ చరణ్‌కు వాచ్‌లు అంటే పిచ్చి.. ఇప్పటికే రకరకాల టాప్ బ్రాండ్ వాచ్‌లను తన కలెక్షన్స్‌లో చేర్చేశాడు. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర హాట్‌టాపిక్‌గా మారింది. రీసెంట్గా చిరు నటించిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన తరచూ మూవీ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి రకరకాల బ్రాండ్ వాచ్‌లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కన్ను వాటిపై పడింది. దీంతో మెగాస్టార్ వాడుతున్న ఆ వాచీల బ్రాండ్స్, వాటి ధర గురించి ఆరా తీస్తున్నారు. దీంతో చిరు వాచ్ ధరలను చూసి అభిమానులంతా నోరేళ్ల బెడుతున్నారట. చిరు దగ్గర ఎన్నో బ్రాండ్ వాచీలు ఉన్నాయట. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ అందులో రోలేక్ వాచ్ అత్యంత కాస్ట్లీ అని తెలుస్తోంది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైనే ఉంటుందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది. ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్.. లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు రూ. 33 లక్షల 77వేల పైనే ఉంటుందట. దీంతో చిరు వాచీల ధరలను చూసి అంతా అవాక్కావుతున్నారట. ఆయన ఒక్క వాచీ జీవితమంత లగ్జరీగా బతికేయచ్చంటూ నెటిజన్లు ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు. -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే?
Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB Video Goes Viral: తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం 'వారీసు'(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుస షెడ్యూల్‌తో బిజీగా ఉన్న విజయ్ తాజాగా చిన్న విరామం తీసుకున్నాడు. ఈ విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'ను (BIMBISARA MOVIE) విజయ్ వీక్షించినట్లు సమాచారం. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్ ఏఎమ్‌బీలో చూసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా లీక్ అయి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. విజయ్ను గుర్తించిన పాపరాజీ (ఫొటోగ్రాఫర్స్) ఫటాఫట్మని క్లిక్‌మనిపించారు. అలాగే విజయ్ కారులో వెళ్తుండగా, హీరో డ్రైవర్ అడ్డుగా చేతులు పెట్టడం చూడొచ్చు. సో మొత్తంగా, నందమూరి హీరో సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్లో మరో స్టార్ హీరో విజయ్ వీక్షించడం విశేషం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) కాగా విజయ్ 'వారీసు' చిత్రం 2022 దీపావళికి, లేదా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరదశలో ఉందని సమాచారం. ఇది పూర్తి కాగానే 'విక్రమ్' లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదివరకు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో విజయ్ 'మాస్టర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్‌పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం
సాక్షి, హుజురాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు. జమ్మికుంటలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో టీఆర్ఎస్ యువ నాయకులు వేదికపైకి వచ్చారు. ఈటల రాజేందర్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారని గడియారాలు, గొడుగులు తీసుకువచ్చారు. గడియారాన్ని నేలకేసి కొట్టాడు. గొడుగులను చింపేశాడు. ఇవి ఆర్ధిక భరోసానిస్తాయా? అని ప్రశ్నించారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల చెప్పాడని అయితే తాము నిరాకరించినట్లు యువకులు ఆరోపించారు. అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి -
తిరుమల: 19న వాచీల ఈ–వేలం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయ పని వేళల్లో 0877–2264429 నంబర్లో గానీ, www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in వెబ్సైట్లో గానీ సంప్రదించాలని కోరింది. -
Etela Rajender: గోడ గడియారాలు పగలగొట్టి నిరసన
సాక్షి, వీణవంక(కరీంనగర్): మండలంలోని చల్లూరు, ఎల్బాక గ్రామాల్లో బుధవారం దళితులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో కూడిన గోడ గడియారాలను పగలగొట్టి నిరసన తెలిపారు. మండలానికి చెందిన బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో ఉన్న గోడ గడియారాలను ఇటీవల మండల వ్యాప్తంగా పంపిణీ చేశారు. దళితులను ఈటల పట్టించుకోలేదని, గడియారాలు తమకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరాడని, ప్రజలకు రూ.90 విలువగల గడియారాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తే ఎవరూ లొంగరని అన్నారు. ఆత్మగౌరవం అంటూ చెప్పుకునే ఈటల దళితులపై ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రలోభాలకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. దళితబంధు పథకంతో దళితుల ఆర్థిక సాధికారత చేకూరుతుందని పేర్కొన్నారు. -
ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు
ప్రతీ ఏడాది లాగానే సెప్టెంబరులో నిర్వహించే ఆపిల్ ఈవెంట్ 2020ని కూడా కాలిఫోర్నియాలో నిర్వహించింది. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్ లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఊహించినట్టుగానే ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ ఐప్యాడ్ 8వ జెన్, ఐప్యాడ్ ఎయిర్ (2020)ను లాంచ్ చేశారు. అలాగే ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 12 సిరీస్ తీసుకొస్తున్నట్టు కుక్ ప్రకటించారు. ముఖ్యంగా ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టం 14, వాచ్ఓఎస్ 7 నేడు (సెప్టెంబర్ 16 న) విడుదల చేయనున్నట్లు ఆపిల్ ప్రకటించింది. "టైమ్ ఫ్లైస్" ఈవెంట్ గా పేర్కొన్న వర్చువల్ షోలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 2020ను ఆవిష్కరించలేదు. ఐప్యాడ్ ఎయిర్ 4 టచ్ ఐడి, ఎ14 బయోనిక్ ప్రాసెసర్ యుఎస్బి-సి కనెక్టివిటీని కలిగి ఉన్నడిజైన్తో కంపెనీ విడుదల చేసింది.నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ న్యూరల్ ఇంజిన్‌తో సరికొత్త చిప్‌ను పొందడం దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇదే మొదటిసారి ఐప్యాడ్ ఎయిర్ 4 స్పెసిఫికేషన్స్ 10.9 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ రెటీనా డిస్ప్లే 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 7 మెగాపిక్సెల్ సెల్ఫీ హెచ్డి కెమెరా ఇది అక్టోబరునుంచి ఆపిల్ స్టోర్లలో లభ్యం కానుంది. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై మోడల్స్ ప్రారంభ ధర 54,900 రూపాయలు. వై-ఫై + సెల్యులార్ మోడల్స్ 66,900 రూపాయల నుండి ప్రారంభం. 64 జీబీ, 256 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్ స్కై బ్లూ ఐదు కలర్స్ లో లభ్యం. ఐప్యాడ్ 8 ఇన్ బిల్ట్ టచ్ ఐడి, హోమ్ బటన్ ఫీచర్లతో కొత్త ఐప్యాడ్ 7వ తరం మాదిరిగానే ఉంది. ఏ10 ఫ్యూజన్ చిప్ షాట్ కొత్త అప్‌గ్రేడ్.10 గంటల బ్యాటరీ లైఫ్ మరో ప్రత్యేకత. ఆపిల్ పెన్సిల్, ఐప్యాడ్ ఓస్14, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫేస్‌టైమ్ హెచ్డీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉ న్నాయి. ఏ12 బయోనిక్ చిప్, టచ్ ఐడీ, స్మార్ట్ కీబోర్డ్ కవర్ ఆపిల్ పెన్సిల్ లాంటి వాటితో తీసుకొచ్చింది. వై-ఫై మోడల్ 29,900 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. వై-ఫై + సెల్యులార్ 41,900 రూపాయలు. 32 జీబీ, 128 జీబీ కాన్ఫిగరేషన్లలో సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ ఫినిష్ రంగుల్లో లభ్యం. ఆపిల్ వాచ్ సిరీస్ 6 మిగిలిన అన్ని అద్భుతమైన ఫీచర్లతోపాటు, పల్స్ ఆక్సీమీటర్ అవసరం లేకుండానే పల్స్ తెలుసుకునే ఫీచర్ లో ఇందులో జోడించింది. 40ఎంఎం, 44ఎంఎం సైజుల్లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ప్రాసెసర్ గతంకంటే 20 శాతం వేగంగా పనిచేస్తుంది. రెడ్ బ్యాండ్ ఎడిషన్‌తో తీసుకొచ్చిన తొలి ఆపిల్ వాచ్ ఇది. ఈ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆపిల్ చారిటీలకు అందిస్తుంది. ఏడు రంగులలో లభ్యం. ఆపిల్ వాచ్ సిరీస్ 6 ధర భారతదేశంలో 40,900 రూపాయల నుంచి ప్రారంభం. ఆపిల్ వాచ్ ఎస్ఈ ఆటోమేటిక్ లొకేషన్ నోటిఫికేషన్లు, స్కూల్ టైం మోడ్ లాంటి కొత్త ఫీచర్లతో ఎక్కువగా పిల్లలకు ఆకర్షించనుంది. ఆపిల్ వాచ్ ఫ్యామిలీ సెటప్ తో దీన్ని తీసుకొచ్చింది. ఒకే ఐఫోన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆపిల్ వాచెస్‌ను పెయిర్ చేసుకోవచ్చు. అయితే ఈ స్మార్ట్ వాచెస్ భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టం చేయలేదు. త్వరలోనే అని ప్రకటించింది. ఆపిల్ వాచ్ ఎస్ఇ జీపీఎస్ మోడల్ ధర రూ. 29,900 నుంచి ప్రారంభం సెల్యులార్ మోడల్ 33,900 రూపాయలు. -
'టైమ్ ఫ్లైస్' : ఆపిల్ ఈవెంట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ సరికొత్త ఉత్పత్తులతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల అమెరికాలో 2 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించి సరికొత్త రికార్డులు నమోదు చేసిన ఆపిల్ ఆన్లైన్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. 'టైమ్ ఫ్లైస్' పేరుతో అట్టహాసంగా ఈ నెల(సెప్టెంబర్) 15న బిగ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. వీక్షకులు ఈ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో, యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చని ఆపిల్ వెల్లడించింది. కోవిడ్ సంక్షోభంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నఆపిల్ ఈ సందర్భంగా అయిదు కొత్త మోడల్స్ మార్కెట్లో రిలీజ్ చేయనుంది. సరికొత్త కెమెరాతో 5జీ ఫోన్, అప్ డేటెడ్ వాచీలను ఈ సందర్భంగా తీసుకు రానుంది. ముఖ్యంగా ఆపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు, కొత్త ఐప్యాడ్ ఎయిర్ ను లాంచ్ చేయనుంది. ఆపిల్ వాచ్ కొత్త సిరీస్ 5 తరహాలోనే ఉన్నప్పటికీ, కొత్త హెల్త్ ఫీచర్స్ తో పాటు, డిజైన్ సమగ్రంగా మార్చినట్టు అంచనా. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, ఇంప్రూవ్ ఈసీజీ లాంటి కొత్త ఫీచర్లతో వస్తుంది. సరసమైన, అందుబాటు ధరల్లో ఆపిల్ వాచ్‌ను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆపిల్ కొత్త ఐప్యాడ్‌ను వేగవంతమైన ప్రాసెసర్, థిన్ బెజెల్స్ డిస్ ప్లే తో లాంచ్ చేయనుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల కారణంగా కొత్త ఐఫోన్ 12 మోడళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయ ఫలితాల సందర్భంగా ఆపిల్ ధృవీకరించింది. దీంతో కొత్త ఐఫోన్ 12 ఆవిష్కారంపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఆపిల్ 12 పై ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించే అవకాశం ఉందనే ఆసక్తి మాత్రం భారీగా నెలకొంది. మరోవైపు 100 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను భారతదేశంలో ఎగుమతి చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
నష్టాల మార్కెట్లో టైటన్ మెరుపులు
సాక్షి, ముంబై: నష్టాల మార్కెట్లో టైటన్ కంపెనీ మెరుపులు మెరిపించింది. 250 పాయింట్లకు పైగా సోమవారం నాటి మార్కెట్లో టైటన్ 6 శాతం పుంజుకుని టాప్ గెయినర్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో వాచీలు, జ్యువెలరీ దిగ్గజం టైటన్ కంపెనీ కౌంటర్ జోరందుకుంది. టైటన్ క్యూ2 ఫలితాలు ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో టాటా గ్రూప్ సంస్థ టైటన్ కంపెనీ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 314 కోట్లను ప్రకటించింది. నికర అమ్మకాలు మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 4406 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 5 శాతం పుంజుకుని రూ. 466 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 12.7 శాతం నుంచి 10.6 శాతానికి బలహీనపడ్డాయి. టైటన్ వాచెస్ మార్కెట్ బాగా ఉన్నట్టు చెప్పారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. -
మెగా స్కాం: నీరవ్ మోదీ వాచీల కలెక్షన్ చూస్తే..
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,400 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన విలువైన ఆస్తులను, ఇతర సామగ్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటోంది. అయితే ఈ మెగా స్కాంలో ప్రధాన నిందితుడు మోదీ భారీ ఎత్తున సేకరించిన విదేశీ గడియారాలను చూసి ఈడీ అధికారులే విస్తుపోయారు. వీటితోపాటు రూ.30కోట్ల మిగులు ఉన్న బ్యాంకు ఖాతాలను, రూ.13.86కోట్ల విలువైన షేర్లను సీజ్ చేసింది. తాజా సోదాల్లో పెద్ద మొత్తంలో విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న కళ్లు చెదిరే గడియారాలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.176 స్టీల్ అల్మరాలు, 158 పెద్ద బాక్సులు 60 ప్లాస్టిక్ కంటైనర్లలో ఖరీదైన విదేశీ వాచీలను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా ఒక్క గురువారం నాటి సోదాల్లోనే రూ.100కోట్ల ఆస్తిని స్తంభింప చేసినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మోదీకి చెందిన రోల్స్ రాయిస్, పోర్షే, బెంజ్ సహా తొమ్మిది లగ్జరీ కార్లు , షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నసంగతి తెలిసిందే. -
టిక్.. టిక్.. టిక్ అలుపన్నది లేదు!
చార్మినార్. హైదరాబాద్ మహానగరానికి మణిహారం. చార్మినార్ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. తొలుత కుతుబ్‌షాహీ, అనంతరం అసఫ్‌జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలకులు వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు. గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. గంట గంటకూ గడియారం చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్య ప్రారంభించి ముగించేవారు. బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాతోపాటు పలు నగరాల్లో క్లాక్ టవర్లు నిర్మించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి 1865లో బ్రిటిష్ రెసిడెన్సీ ఆస్పత్రి ప్రాంగణం(ఇప్పుడు సుల్తాన్‌బజార్)లో నగరంలోనే తొలి క్లాక్‌టవర్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ ప్రజల సౌకర్యార్థం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేయించారు. ఒకప్పుడు హైదరాబాద్ దర్పానికి ప్రతీకలుగా నిలిచిన ఈ క్లాక్ టవర్లు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రజల చూపునకు నోచుకోక.. సరైన నిర్వహణ లేక ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. చార్మినార్‌పై ఉన్న నాలుగు గడియారాలు మాత్రం 128 ఏళ్లుగా క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి. నగరంలోని క్లాక్ టవర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. క్లాక్ టవర్లు.. బ్రిటిష్ అనుసరణ 1865లో సుల్తాన్‌బజార్ క్లాక్ టవర్‌ను బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి నిర్మించారు. దానికి పోటీగా.. అప్పటి పాలకుల మన్ననలు పొందడానికి సంస్థాన ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు నగరంలోని ఇతర ప్రదేశాల్లో క్లాక్ టవర్లు నిర్మించి నిజాం పాలకులకు బహూకరించారు. నగరంలో ఉన్న అన్ని గడియారాలు లం డన్లో తయారు చేసినవే. వాటిని ఓడల ద్వారా ముంబైకి.. అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చార్మినార్ ఉత్తర దిశలో ఉన్న గడియారం విలువ అప్పట్లోనే రూ.60 వేలు. మిగతా మూడు గడియారాలు ఒక్కొక్కటీ రూ.30 వేలు. ఇక నగరంలోని మిగతా గడియారాల విలువ రూ.50–60 వేల వరకూ ఉంది. ఫతేమైదాన్ క్లాక్ టవర్.. ఆరో నిజాం సంస్థానంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిం చిన నవాబ్ జఫర్ జంగ్ బహదూర్ ఫతేమైదాన్ క్లాక్ టవర్‌ను 1903లో నిర్మించి ఆరో నిజాంకు బహూకరించారు. ఇది బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ చివరలో ఉంది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ కనుమరుగయ్యే స్థితిలోకి జారుకుంటోంది. ఇక నగరంలోని మొజంజాహీ మార్కెట్ నిర్మాణం అనంతరం 1935లో గడియారం ఏర్పాటు చేశారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిర్మించింది. మిగతా గడియారాలన్నీ ఇతరులు నిర్మించినవే. నగరంలో తొలి క్లాక్ టవర్... కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ పనులు పూర్తయ్యాక రెసిడెంట్ అధికారి 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ నిర్మించారు. ఈ టవర్ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ క్లాక్ ప్రస్తుతం పనిచేయడం లేదు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితిలోకి జారుకుంటోంది. మహబూబ్ చౌక్ క్లాక్ టవర్.. ఈ టవర్‌ను నవాబ్ సర్ ఆస్మాన్‌జా బహదూర్ 1890లో నిర్మించారు. సాలార్జంగ్ చొరవ వల్ల ఈ క్లాక్ టవర్ 1892లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇండోనేíసియా శైలిలో దీనిని నిర్మించారు. చార్మినార్ పశ్చిమ దిశలో లాడ్ బజార్‌కు ముందు మహబూబ్ చికెన్ మార్కెట్(ముర్గీ చౌక్) పక్కన ఇది ఉంది. ఈ క్లాక్ టవర్‌కు 2008లో ఇంటాక్ హెరిటేజ్ అవార్డు లభించింది. చార్మినార్ గడియారం.. చార్మినార్‌ను 1591లో నిర్మించారు. అయితే 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చార్మినార్ మొదటి అంతస్తు మధ్యలో నాలుగు వైపులా గడియారాలు అమర్చారు. ఆ రోజుల్లో పాతబస్తీ ప్రజలు ఈ గడియారం చూసి తమ దినచర్య ప్రారంభించే వారు ముగించే వారు. చార్మినార్‌లో ఉన్న మూడు గడియారాలు ఒకలా ఉంటే.. ఉత్తర దిశలో ఉన్న గడియారం భిన్నంగా ఉంటుంది. ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది. మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ. చార్మినార్ గడియారం గొప్పతనం ఏమిటంటే ఏ రోజు దానిని ప్రతిష్టించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆగకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గడియారాలన్నీ నిలిచిపోయాయి. కానీ చార్మినార్‌పై ఉన్న గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు గడియారంలో సమయాన్ని చూసే భాగ్యం కల్పిస్తోంది. బోసిపోయిన సికింద్రాబాద్ క్లాక్ టవర్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న క్లాక్ టవర్ ప్రస్తుతం పనిచేయడం లేదు. బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1896లో దీనిని నిర్మించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దేశంలోని ఎల్తైన క్లాక్ టవర్లలో మూడోది. దీని ఎత్తు 37 మీటర్లు(120 అడుగులు). 1896లో పది ఎకరాల విశాల స్థలంలో క్లాక్ టవర్ నిర్మించారు. సర్ ట్రెవర్ జాన్ సిచెల్ ప్లోడన్ 1897 ఫిబ్రవరి 1న క్లాక్ టవర్‌ను ప్రారంభించారు. గడి యారాన్ని దివాన్ బహదూర్ సేట్ లక్ష్మి నారాయణ రాంగోపాల్ బహూకరించారు. దీనికి 2005లో హెరిటేజ్ అవార్డు కూడా దక్కింది. 128 ఏళ్లుగా ఎప్పుడూ ఆగలేదు.. నేను 1962 నుంచి చార్మినార్ గడియారం నిర్వహణ చేస్తున్నాను. రోజుకు ఒక్కసారి గడియారానికి ‘కీ’ఇస్తున్నాం. చార్మినార్ గడియారం ఏర్పాటు చేసినప్పటి నుంచీ మా తాత, బాబాయిలు, మా నాన్న రసూల్ ఖాన్‌కు నిజాం ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. చార్మినార్ గడియారం బరువు 25 కేజీలు ఉంటుంది. ఇంగ్లండ్‌లో తయారు చేసిన మెకానికల్ గడియారం ఇది. 128 ఏళ్లుగా గడియారం ఎప్పుడూ ఆగలేదు. – సికందర్ఖాన్ ఆగినా పట్టించుకోని అధికారులు సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్(రాంగోపాల్ పేట్) పోలీస్ స్టేషన్‌పై ఉన్న క్లాక్ టవర్‌ను ఆ రోజుల్లో ప్రముఖ సంఘ సేవకుడు సేట్ రాంగోపాల్ 1900వ సంవత్సరంలో నిర్మించారు. ఈ క్లాక్ టవర్ నిర్మాణం పూర్తిగా యూరోపియన్ శైలితో సాగింది. ఈ క్లాక్ టవర్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా హయాంలో ఈ క్లాక్ టవర్ నిర్మాణం జరిగింది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ పనిచేయడం లేదు. -
డాక్టర్ని చేతికి కట్టేసుకోండి!
వాచీలు బాగానే ఉన్నారుు గానీ... వాటిపై ఆ అక్షరాలేమిటి? గ్రాఫులేమిటి? ఇదేనా మీ సందేహం. ఈ క్రొనోవో వాచీ మీ ఆరోగ్య వివరాలు మొత్తం మీ చేతుల్లో ఉంచుతుంది. స్మార్ట్ఫోన్ల స్థాయిలో ఏర్పాటు చేసిన 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్.. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీల మెమరీలతో ఈ వాచీ ఎన్ని పనులు చేయగలదో చూడండి. అడుగున ఉండే చిన్నసైజు ఎలక్టోడ్ర్లతో ఇది మీ గుండె పనితీరును సూచించే ఈకేజీ గ్రాఫ్‌ను చూపుతుంది. మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఎలాంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తుంది. నడిచే అడుగులు లెక్కపెడుతుంది.. సుఖ నిద్రపైనా ఒక కన్నేసి ఉంచుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల తీరుతోపాటు మీ గుండెచప్పుళ్లల్లో వచ్చే తేడాలనూ పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు అవసరమైన గైరోస్కోపు, యాక్సెలోమీటర్, ఇతర సెన్సర్లు దీంట్లో ఉన్నాయి. ఆండ్రారుుడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటితోనూ పనిచేసే క్రోనోవో వాచీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి దీన్ని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దాదాపు రూ.14 వేలు ఖరీదు చేయగల ఈ హైటెక్ వాచీ టైమ్‌ను ఎటూ చూపిస్తుంది. సంగీతమూ వినిపిస్తుందండోయ్! -
ఆ కార్లు, వాచీలు మీకు ఎవరిచ్చారు?
హెచ్.డి.కుమారస్వామికి ఎమ్మెల్సీ ఉగ్రప్ప ప్రశ్నాస్త్రాలు సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.50 నుంచి 70లక్షల విలువైన వాచ్ విషయాన్ని బహిర్గతం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామిపై కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మాజీ సీఎం కుమారస్వామిపై ప్రశ్నాస్త్రాలను సంధించారు. శనివారమిక్కడ విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి, ఆయన కుటుంబం వినియోగిస్తున్న లగ్జరీ కార్లు, వాచ్‌ల వివరాలతో కూడిన జాబితాను ఉగ్రప్ప విడుదల చేశారు. అనంతరం ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ....‘కుమారస్వామి ఆయన కుటుంబం కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వినియోగిస్తోంది. రూ.8కోట్ల విలువ చేసే లంబోర్గిని, రూ.3కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, రూ.1.2కోట్ల విలువ చేసే ఇన్ఫినేటివ్ ఎఫ్ఎక్స్ కార్లను కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇక వీటితో పాటు మొత్తం ఎనిమిది కారులు కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇందులో రెండు కార్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు’ అని అన్నారు. ఇక కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6కోట్ల విలువ చేసే కారు, రూ.1.3కోట్ల విలువ చేసే డైమండ్ వాచ్‌ను దుబాయ్‌లో ఒక వ్యక్తి నుండి బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు. ఈ బహుమతులు ఆయనకు ఎవరు ఇచ్చారో, ఏ పని చేసినందుకు ప్రతిఫలంగా అందుకున్నారో తెలపాలని కుమారస్వామిని డిమాండ్ చేశారు.ఇవే కాక రూ.50లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్(డైమండ్) వాచ్, రూ.25లక్షలు విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.5లక్షల విలువైన రాడో వాచ్‌లతో పాటు మొత్తం 50 వాచ్‌లను కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కుమారస్వామి ప్రజలకు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హెచ్.ఎం.రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.