గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు.
సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్‌కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్‌గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా.
ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్‌ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్‌రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్‌డీ, కోటి రూపాయల మెర్సిడెస్బెంజ్ జీఎల్‌ఎస్ 350డీ ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment