పాన్‌ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్‌ | RRR Movie Distributors And Veera Dheera Sooran Producer Riya Shibu Details | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాకు నిర్మాతగా రియా

Published Fri, Mar 21 2025 11:32 AM | Last Updated on Fri, Mar 21 2025 11:56 AM

RRR Movie Distributors And Veera Dheera Sooran Producer Riya Shibu Details

రియా షిబు.. 20 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో ట్రెండ్‌ అవుతుంది. హీరోయిన్‌గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా తాను నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'వీర ధీర శూరన్‌'( Veera Dheera Sooran) నుంచి ట్రైలర్‌ విడుదలైంది. చియాన్‌ విక్రమ్‌(Vikram  ) కథానాయకుడిగా నటిస్తున్న 62వ సినిమాలో నటి దుషార విజయన్‌( Dushara Vijayan) నాయకిగా నటిస్తుండగా ఇందులో నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు. హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై రియా షిబు నిర్మిస్తున్నారు.   ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్‌ అరుణ్‌ కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

వీర ధీర శూరన్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. వేదికపై నిర్మాత రియా షిబు మాట్లాడిన మాటలు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు.  ఒక యాంకర్‌ కంటే స్పీడ్‌గా మాట్లాడటమే కాకుండా..  హీరోయిన్‌ కంటే గ్లామర్‌గా కనిపించడంతో అందరిని ఆకర్షించింది. నటి దుషార విజయన్‌ నటన గురించి ఆమె ప్రశంసించిన తీరు అందరినీ మెప్పించేలా ఉంది. అలా ప్రేక్షకులను కట్టిపడేశాల కనిపించడంతో ఈ అమ్మాయి ఎవరంటూ ఆశ్చర్యపోయారు.  ఇంతలో నటుడు ఎస్‌జే సూర్య(S. J. Suryah) మాట్లాడుతూ రియాను మెచ్చుకున్నారు. ప్రముఖ నిర్మాత షిబు వారసురాలిగా ఆమె మరింత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌కు ప్రధాన బలం ఆమె అంటూ ప్రశంసించారు.  ఆమెను హీరోయిన్‌ లేదా ప్రొడ్యూసర్‌ ఎలా పిలవాలో తనకు అర్థం కావడం లేదని సరదాగా అన్నారు. ‌

కోలీవుడ్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' డిస్ట్రిబ్యూటర్‌గా రియా
కోలీవుడ్‌ నిర్మాత, పంపిణీదారుడు షిబు తమిన్స్‌ కుమార్తెనే ఈ రియా షిబు (20).. కేరళకు చెందిన రియా శిబు  చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుతోంది.  రియా శిబు ఒక వైపు చదువులు, మరోవైపు నిర్మాతగా అనేక బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇవన్నీ కాకుండా కప్స్ అనే మలయాళ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. తమ హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ నుంచి పులి,ఇంకొక్కడు, సామీ వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా  ఆర్‌ఆర్‌ఆర్‌(RRR Movie), డాన్‌, విక్రమ్‌, జిగ్రా వంటి సినిమాలను కోలీవుడ్‌లో పంపిణీ చేశారు. ఈ బాధ్యతలన్నీ కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. హెచ్‌ఆర్ పిక్చర్స్ నిర్మిస్తున్న నాల్గవ చిత్రం వీర ధీర శూరన్‌. ఈ నిర్మాణ సంస్థ వెనుక 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి ఉండటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement