chiyan vikram
-
కేజీఎఫ్ దారిలోనే విక్రమ్ తంగలాన్...
-
'తంగలాన్' విడదలపై ప్రకటన.. రెండు తెలుగు సినిమాలతో పోటీ
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగష్టు 15న తంగలాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ ను బ్రిటీష్ వాళ్ల నుంచి తంగలాన్ అనే ఒక తెగ ఎలా కాపాడుకున్నదో ఈ చిత్రంలో చూపించనున్నారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో మేకర్స్ చూపించనున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు.తంగలాన్‌కు పోటీగా ఆగష్టు 15న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. రామ్ పోతినేని, పూరీల డబల్ ఇస్మార్ట్ అందరి కంటే ముందుగా ఆగస్టు 15న విడుదల అని తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియాల MR. బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
విక్రమ్ 'తంగలాన్' ట్రైలర్ విడుదల.. చావుని ఎదురిస్తేనే జీవితం
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' ట్రైలర్ వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్‌తో ఫిదా చేసిన విక్రమ్ తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులను మరో ప్రపంపంలోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించే విధంగా ట్రైలర్ ఉంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ ఎలా ఉందంటే..'తంగలాన్' సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్‌ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా. రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు 'తంగలాన్' ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే 'తంగలాన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
విక్రమ్ సినిమాలో అడుగుపెడుతున్న క్రేజీ నటుడు
తంగలాన్ చిత్రాన్ని పూర్తి చేసిన సియాన్ విక్రమ్ తాజాగా తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఎస్జే సూర్య ముఖ్య పాత్రను పోషించనున్నారు. కాగా తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. హాస్య నటుడిగా బహుళ ప్రాచుర్యం పొంది మూడుసార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందుకున్న సురాజ్ వెంజారమూడు 2016లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఈయన మలయాళంలో నటించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్, డ్రైవింగ్ లైసెన్స్, జన గణమన, ది గ్రేట్ ఇండియన్ కిచ్చెన్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న తన 62వ చిత్రం ద్వారా సురాజ్ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇందులో ఈయన ముఖ్య పాత్రను పోషించనున్నట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పలు ఓటీటీలలో ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కూడా ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ క్రేజీ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
చియాన్ విక్రమ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు... ఫ్యాన్స్ ఫైర్
-
'ఆ స్టార్ హీరోకు అలా నటించడమే రాదు'.. డైరెక్టర్ సంచలన కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా ఇమిడిపోయే ప్రత్యేకత ఆయనకే సొంతం. అపరిచితుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో ఏకంగా మూడు రూపాల్లో కనిపించి అభిమానులను మెప్పించాడు. అంతే కాదు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. గతేడాది మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పా రంజిత్ డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న తంగలాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త ఏడాదిలో జనవరి 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కోలీవుడ్ స్టార్‌పై తమిళ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ తమిళ డైరెక్టర్, నటి దేవయాని భర్త రాజకుమారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ నటనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ రాజకుమారన్ మాట్లాడుతూ..'విక్రమ్ గొప్ప నటుడని నేను అనుకోవడం లేదు. ఉత్తమ నటుడు అని అంగీకరించను కూడా. అతను కమల్ హాసన్, రజనీకాంత్‌లా నటించగలడు అంతే. అలా కాకుండా ఎలా నటించాలో కూడా అతనికి తెలియదు. అతను గెటప్ మార్పులు మాత్రమే మార్చగలడు. క్లోజ్-అప్ షాట్లలో మేక్ఓవర్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా అతనికి ఎలా నటించాలో, ఎలా స్పందించాలో కూడా తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా విక్రమ్ ఆకట్టుకోలేకపోయాడు. నేను తీసిన విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో అతనితో నాకు ఇదే సమస్య వచ్చింది. చేయి విరగగొట్టినట్లుగా, కాలు విరిగినట్లుగా, ఒక కన్ను కప్పినట్లుగా నటించడం నిజమైన నటన కాదు. మంచి నటుడు అలాంటి వాటిపై ఆధారపడకుండా భావోద్వేగాలను పండిచాలి. ముఖ్యంగా క్లోజప్ షాట్ల సమయంలో విక్రమ్ అలాంటి నటనను ప్రదర్శించలేడు.' అని అన్నారు. అయితే రాజకుమారన్ కామెంట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. విక్రమ్ ప్రతిభ ఉన్న నటుడని.. ఆయన అలా మాట్లాడడం తెలివితక్కువ పనేనని నెటిజన్స్ మండిపడుతున్నారు. కాగా.. 2001లో రాజకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కించిన విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో నటించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ఖుష్బు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. I dont agree that Chiyaan Vikram is a best actor. He can mimic act either like Kamal or like Rajini. He Cant act other than these two mode, he only can do getup changes. In Closeup, With plain face & no makeover, he doesnt know how to act or react. I had this issue with him in… pic.twitter.com/q2JjWoXkO2 — Christopher Kanagaraj (@Chrissuccess) January 9, 2024 -
స్టార్ హీరో మూవీ వాయిదా.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం చిత్రం ధృవనచ్చితిరం. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గౌతమ్ మీనన్ అభిమానులకు షాకిచ్చాడు. అయితే తాజాగా ఆయన ఓ లేఖను పోస్ట్ చేశారు. ధృవనచ్చితిరం త్వరలోనే మీ ముందుకు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. దర్శకుడు లేఖలో రాస్తూ.. ''ఒక విజన్, అభిరుచి, అంకితభావంతో ధృవ నచ్చితిరాన్ని తెరకెక్కించాం. మాకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. నవంబర్ 24న విడుదల చేయనందుకు అభిమానులు నిరాశకు గురైన మాట వాస్తవమే. ఇప్పటికీ మేము సినిమా రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు భరోసా ఇవ్వడానికే పోస్ట్ చేస్తున్నా. మూవీకి ఉన్న అడ్డంకులను తొలగించి ధృవ నచ్చితిరమ్‌ను త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం' అని అన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికైనా వివాదాలు తొలగిపోయి మూవీ రిలీజ్ కావాలని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. #DhruvaNatchathiram@OndragaEnt @oruoorileoru pic.twitter.com/Bbcn32sgWM — Gauthamvasudevmenon (@menongautham) November 28, 2023 -
డైరెక్టర్‌ను వీడని కష్టాలు.. స్టార్ హీరో సినిమా రిలీజ్‌పై సస్పెన్స్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంబోలో వస్తోన్న చిత్రం ధృవనచితిరం. తెలుగులో ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమా ప్రకటించి ఎనిమిదేళ్లు పూర్తి కావోస్తోంది. 2016లో ప్రకటించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 24న థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రకాశ్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!) రూ.8 కోట్ల డిమాండ్! ధృవ నచ్చతిరమ్ సినిమా విడుదల కావాలంటే రూ.8 కోట్లు చెల్లించాలని కొందరు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మద్రాస్ కోర్టులో ఉన్న అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డబ్బు చెల్లించాల్సిందిగా కొందరు అడిగినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సినిమా విడుదలకు కొన్ని గంటలే ఉండడంతో రిలీజ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెంగళూరు, కొన్ని ఓవర్సీస్ సెంటర్స్ లో కూడా ధృవ నక్షత్రం సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డైరెక్టర్ గౌతమ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో రూ.8 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. డిస్ట్రిబ్యూటర్స్ మద్దతు అయితే మరోవైపు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ధృవ నచ్చితిరమ్ సాఫీగా విడుదలవుతుందని సమాచారం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ గౌతమ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ చేసేందుకు గౌతమ్ తన ఒంటరి పోరాటం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూల్లో ఒక్కడే పాల్గొంటున్నారు. గౌతమ్ కలల ప్రాజెక్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలల ప్రాజెక్ట్‌గా ధృవ నచ్చితిరమ్ ఎనిమిదేళ్ల తర్వాత తెరకెక్కించారు. తనకు నటనపై ఆసక్తి లేదని.. సినిమా నిర్మించేందుకు నిధుల కోసమే సినిమాల్లో నటించానని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, వినాయకన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
'ఆయనతో పని చేయడం చాలా కష్టం'.. జైలర్ విలన్‌పై డైరెక్టర్ కామెంట్స్!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి స్పష్టంగా వివరించాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్‌కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి ఆ సీన్ ఎలా చేయాలో చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్‌గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. మొదట ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. విలన్‌గా ది బెస్ట్ అనిపించించిదని గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో అతనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్‌కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మీకు తెలియదు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది. ఇందులో విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం.' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్‌గా అలరించనున్నారు. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవ నచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
విక్రమ్ డబుల్ సర్ప్రైజ్.. తంగలాన్ క్రేజీ అప్డేట్!
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్స్ ఇచ్చేశారు. ఓకేసారి టీజర్, మూవీ రిలీజ్ తేదీలను ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీన తంగలాన్ టీజర్ విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A fiery story of a bygone era that’s waiting to be told & cherished #Thangalaan teaser dropping on 1st November &#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/pDfT6HiNs4 — Vikram (@chiyaan) October 27, 2023 A film that will touch your heart & blow away your mind!#Thangalaan coming to you on 26th January 2024🔥🔥🔥 Teaser out on Nov 1st! 💃🏻🔥💃🏻 pic.twitter.com/wEf3MaabqF — Malavika Mohanan (@MalavikaM_) October 27, 2023 -
ఐదేళ్ల తర్వాత విక్రమ్ సినిమాకు మళ్లీ మోక్షం.. సంతోషంలో ఫ్యాన్స్
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్‌లో జరుపుకుంది. (ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం) ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు. తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) -
'పొన్నియిన్ సెల్వన్' ఇదేందయ్యా...అదుర్స్ అన్నారుగా
-
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
రొంబ సూపర్ ఇంటర్వ్యూ విత్ కార్తీ అండ్ విక్రమ్!
-
సుమ నీకు నేను పెద్ద ఫ్యాన్ ని
-
హీరోలపై హీరోయిన్లు పంచులే పంచులు
-
బాహుబలి వల్లే పొన్నియన్ సెల్వన్...!
-
జయం రవి వెటకారం తో నవ్వులతో మోత మోగిన ఆడిటోరియమ్
-
ఇదెక్కడి మాస్ లుక్ రా మావ.. భయపెట్టేశాడుగా!
తమిళ స్టార్ హీరో విక్రమ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఆయన నటించారు. విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రానికి పీఏ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఇవాళ విక్రమ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తంగలాన్ ఈ చిత్రం నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పాత్ర ఏదైనా సరే చియాన్ విక్రమ్ పరకాయ ప్రవేశం చేస్తాడు. విభిన్న పాత్రల్లో ఒక్కడే అదరగొట్టేస్తాడు. గతంలో కోబ్రా సినిమాలో పది రకాల పాత్రలతో మెప్పించాడు. తాజాగా రిలీజ్ తంగలాన్ చేసిన మేకింగ్ వీడియోలో విక్రమ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదెక్కడి మాస్ లుక్ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పక్కా మాస్ లుక్‌తో విక్రమ్ అతి భయంకరంగా కనిపించారు. మేకింగ్ వీడియోనే ఆ రేంజ్లో ఉంటే ఇక సినిమాపై ఏలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీడియో చివర్లో వచ్చే సీన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఆయన నటించిన పొన్నియిన్ సెల్వన్-2 రిలీజ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ దీనిని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Happy birthday to my #Thangalaan, @chiyaan sir 😊 Presenting you a slice of flesh, a grand making visual video of Thangalaan as our humble tribute to Chiyaan.https://t.co/0cxHldw8Nc#HBDChiyaanVikram #ThangalaanMaking @chiyaan @kegvraja @StudioGreen2 @officialneelam pic.twitter.com/1CHLM4W3fT — pa.ranjith (@beemji) April 17, 2023 -
పొన్నియిన్ సెల్వన్ మరో రికార్డ్.. బాలీవుడ్ సినిమాను దాటేసిన కలెక్షన్స్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?) కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల సునామీ.. వారం రోజుల్లో రూ.325 కోట్లు వసూల్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొడుతోంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోేంది. తమిళంలో గతంలో విడుదలైన రోబో 2.0, విక్రమ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ మూడోస్థానంలో కొనసాగుతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజైంది. పదో శతాబ్దంలోని చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో చిత్రీకరించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలోనూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును అధిగమించింది. (చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్) పొన్నియిన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ ధృవీకరించారు. మణిరత్నం కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్, యష్ కేజీఎఫ్- 2తో పోలిస్తే తక్కువగానే వసూళ్లు సాధించిందని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు రూ.600 కోట్ల కంటే ఎక్కువ నికర వసూళ్లు సాధించాయన్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. -
థియేటర్ వద్ద పొన్నియన్ సెల్వన్ తారల సందడి.. అభిమానుల కోలాహాలం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1'. కల్కి కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ మొదటి భాగం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన నటీనటులు చైన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి మొదటి రోజు మొదటి షోను ఎంజాయ్ చేశారు. అభిమాన నటీనటులు థియేటర్లకు రావడంతో ఫ్యాన్స్ టపాసులు కాలుస్తూ హోరెత్తించారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. #ChiyaanVikram #PonniyinSelvan #FDFS #Aadithakarikalan pic.twitter.com/dtbiCPF2xw — Kavi Kumar (@KaviKum42539573) September 30, 2022 -
చియాన్ విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' చిత్రీకరణ పూర్తి కానుందా?
Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram: చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఐశ్వర్య రాజేష్, నీతూ వర్మ, సిమ్రాన్, నటుడు పార్తీపన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చాలా భాగం విదేశాల్లో నిర్వహించడం, ఆ మధ్య విడుదలైన 'ఒరు మనం' అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉండటం విక్రమ్ అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ఇటీవల దర్శకుడు గౌతమ్ మీనన్‌ను కలిసి 'ధ్రువ నక్షత్రం' చిత్ర షూటింగ్ విషయాల గురించి చర్చించడం శుభ పరిణామం. వీరిద్దరూ కలిసిన ఫొటోలను దర్శకుడు గౌతమ్ మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విక్రమ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన 'కోబ్రా' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన చరిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా తొలిభాగం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మరి 'ధ్రువ నక్షత్రం' ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి మరి. చదవండి: ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్! క్వాలిటీ శృంగారంపై హీరోయిన్‌కు నిర్మాత ప్రశ్న.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ View this post on Instagram A post shared by Gautham Menon (@gauthamvasudevmenon) -
క్రేజీ కాంబినేషన్.. ‘విక్రమ్ 61’ ప్రారంభం
తమిళసినిమా: చియాన్ విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో భారీ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం విక్రమ్‌కు 61వ సినిమా కానుంది. దీనిని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా, నీలం ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇది స్టూడియో గ్రీన్ సంస్థ 22వ చిత్రం. ఇంకా టైటిల్ నిర్ణయించని దీనికి కథ, కథనాన్ని తమిళ్ ప్రభ అందించారు. జి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, కిషోర్‌కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో నటుడు శివకుమార్, ఆర్య, నిర్మాత టి.శివ, ఎస్.ఆర్.ప్రభు, అభినేష్ ఇళంగోవన్, సంతోష్ పి.జయకుమార్, సీవీ కుమార్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ తొలి భాగం సెప్టెంబర్ 30న తెరపైకి రానుంది. చదవండి: Aaditi Pohankar: ఒకప్పుడు రాష్ట్రస్థాయి అథ్లెట్.. ఇప్పుడు స్టార్ నటి.. -
'పొన్నియన్ సెల్వన్' రిలీజ్ డేట్ ప్రకటన.. సూపర్బ్‌గా ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్
Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. Wishing our Producer Allirajah Subaskaran a very happy birthday! The Golden Era comes to the big screens on Sept 30th! 🗡#PS1 #PS1FirstLooks @LycaProductions pic.twitter.com/60XRY8egM6 — Madras Talkies (@MadrasTalkies_) March 2, 2022 దీంతోపాటు ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్‌లను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లలో ఐశ్వర్య రాయ్, త్రిష యువరాణుల్లాగా కనిపించగా విక్రమ్, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ విభిన్నమైన లుక్‌లో అలరించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
అలరిస్తోన్న చియాన్ విక్రమ్ 'మహాన్' మేకింగ్ వీడియో..
Chiyan Vikram Mahaan Movie Making Video Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. 'మహాన్' టీజర్లో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటన అలరించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్ తదితరులు తమ పాత్రల కోసం ఏ విధంగా కష్టపడ్డారో చూపించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. -
హీరోయిన్‌కు షాకిచ్చిన మహాన్, చాలా అన్యాయం !
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, ఛాలెంజింగ్ రోల్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేసే హీరో చియాన్ విక్రమ్. అతడు నటించిన తాజా చిత్రం 'మహాన్'. ఇందులో తనయుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించాడీ స్టార్ హీరో. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వాణి భోజన్ కూడా ఉందని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విక్రమ్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా! కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆమె ఎక్కడా కనిపించనేలేదు. ఆమె నటించిన పార్ట్ అంతా ఎడిటింగ్‌లో తీసేశారు. బహుశా రన్ టైమ్ వల్ల ఆమె సన్నివేశాలు తొలగించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంది. దీనికి వాణి నటించిన సన్నివేశాలు కూడా కలిపితే మూడు గంటలవుతుందని ఆలోచించి వాటిని తొలగించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మహాన్ లాంటి పెద్ద సినిమాలో నటిస్తున్నానని మురిసిపోయిన వాణికి ఇది నిజంగా బాధించే అంశమే. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాణికి అన్యాయం చేశారంటూ ఆమె అభిమానులు నెట్టింట ఫైర్ అవుతున్నారు. కాగా వాణి భోజన్ తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో కథానాయికగా నటించింది. -
మనం పెట్టిందే చట్టం.. ఆసక్తిగా 'మహాన్' టీజర్
Vikram Mahaan Movie Teaser Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. విక్రమ్ గాంధీ మహాన్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం నాటు సారా నేపథ్యంలో సాగనుంది. నాటు సారాకు వ్యతిరేకంగా, గాంధీ బాటలో నడుస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన మహాన్ అదే మద్యానికి బానిస అవడం వంటి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో విక్రమ్ నటన అదిరిపోయిందనే చెప్పవచ్చు. 'ఏపీలో ఎవడు బార్ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం' అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌ది మంచి ప్రభావం ఉన్న పాత్రలా ఉంది. టీజర్ చివర్లో ధృవ్ ఎంట్రీ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కానుంది. -
సూర్య, ఆర్య బాటలో విక్రమ్.. వర్కౌట్ అయ్యేనా?
సౌత్ లో అత్యధిక పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అయితే ఈ హీరో బాక్సాఫీస్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంతో ఇష్టపడి చేసిన గ్యాంగ్, ఎన్ జీ కే, బందో బస్త్ లాంటి చిత్రాలను థియేటర్లకు తీసుకొచ్చాడు. కాని ఈ సినిమాలన్ని డిజప్పాయింట్ చేసాయి. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆకాశమే నీ హద్దురా మూవీని ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్రపంచంలో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత జైభీమ్ ని కూడా ఓటీటీలోనే విడుదల చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు సూర్యకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. సూర్యకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొత్త చిత్రం ఎత్తారెక్కుమ్ తునిందవన్ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరో తమిళ హీరో ఆర్య కూడా కోలీవుడ్ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే అది బాక్సాఫీస్ మూవీ కాదు. ఓటీటీ మూవీ సార్పట్ట. ఇలా అటు సూర్య, ఇటు ఆర్య ఈ ఇద్దరు ఓటీటీ మూవీస్ ద్వారానే హిట్ అందుకున్నారు. ఆడియెన్స్ లో మంచి ఆదరణ చూశారు. ఇప్పుడు ఇదే దారిలో మరో కోలీవుడ్ హీరో విక్రమ్ వెళ్లాలి అనుకుంటున్నాడు. కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతో శ్రమిస్తున్నాడు అపరిచితుడు. కనీసం బిలో యావరేజ్ మూవీని కూడా చూడలేకపోతున్నాడు. అందుకే ఈసారి సూర్య దారిలో తాను నటిస్తున్న కొత్త చిత్రాలు మహాన్, కోబ్రో మూవీస్ ను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నాడు. మహాన్ జనవరి 26న ప్రైమ్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మరో మూవీ కోబ్రా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి సూర్య, ఆర్యల మాదిరే విక్రమ్ కూడా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. -
పొన్నియిన్ సెల్వన్: తొలి భాగం షూటింగ్ పూర్తి, విడుదల ఎప్పుడంటే..
స్టార్ డెరెక్టర్ మణిరత్నం దర్శకతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆమె యువరాణి నందిని పాత్ర పోషిస్తోంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆదివారం (సెప్టెంబర్ 19న) ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసింది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ‘పీఎస్1’ పూర్తయినట్లు, సమ్మర్ కానుకగా 2022లో విడుదల కానున్నట్లు పోస్టర్లో మూవీ టీం వెల్లడించింది. విక్రమ్, కార్తీ, త్రిష, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కల్కి కృష్ణమూర్తి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, గతనెల పీఎస్1 సెట్స్ నుంచి ఐశ్వర్య ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయింది. అందులో ఆమె బంగారు రంగు చీర, భారీ ఆభరణాలతో ఉంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి!
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్న తొలి సినిమా ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘కోబ్రా’ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్ కోసం ఇర్ఫాన్ రష్యా వెళ్లి వచ్చారు. ఈ షెడ్యూల్ గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ– ‘‘మైనస్ 20 డిగ్రీల చలిలో వర్క్ చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఓ సందర్భంలో నా హెడ్క్రాఫ్ తీశాను. అంతే.. వెంటనే నా చెవులు ఎర్రగా మారిపోయాయి. చలితో వణికిపోయాను. కశ్మీర్ వాతావరణం నాకు తెలుసు. కానీ రష్యాలో వాతావరణం ఎలా ఉంటుందనేది ‘కోబ్రా’ సినిమా వల్ల నాకు తెలిసింది. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా రష్యా వచ్చారు. షూటింగ్ లేని సమయంలో ఆ లొకేషన్స్‌ను బాగా ఆస్వాదించాం. నాకు తెలుగు, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా యాక్టర్‌గా ఆఫర్లు వచ్చాయి. కానీ ‘కోబ్రా’ సినిమా విడుదలయిన తర్వాత నా నటనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి, నా క్రికెట్ కమిట్మెంట్స్ లేకపోతే అప్పుడు కొత్త సినిమాలు కమిట్ అవుదామని అనుకుంటున్నాను’’ అన్నారు ఇర్ఫాన్ పఠాన్. -
ఇర్ఫాన్ కొత్త లుక్.. మంచులో ‘కోబ్రా’ షూటింగ్
చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రానికి సంబంధించిన విదేశీ షెడ్యూల్ చిత్రీకరణలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాల్గొన్నారు. ఇర్ఫాన్ ‘కోబ్రా’ చిత్రంలో అస్లాన్ యిల్మాజ్ అనే ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫారిన్ షూటింగ్ ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను ఇర్ఫాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘షూటింగ్లో ఓ అందమైన ప్రాంతం’అని ఆయన కామెంట్ జతచేశారు. చిత్రం బృందం మంచులో చిత్రీకరణ జరుపుతుండగా ఇర్ఫాన్ వింటర్ దుస్తుల్లో నిలబడి కనిపిస్తున్నారు. అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, మియా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్లో పాల్గొనవచ్చని ప్రభుత్వం అనుతించడంతో వారం రోజుల కిత్రం ‘కోబ్రా’ టీం రష్యాలో పయనమైంది. మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ఇది తొలి చిత్రం కావటం విశేషం. View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) చదవండి: సోనూసూద్ మరో మంచి కార్యక్రమం -
‘కోబ్రా’ ఫస్ట్‌లుక్ : ఇర్ఫాన్ పాత్ర ఇదే!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు అజయ్ జ్ఞానముతు సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న(అక్టోబర్ 27)న ఇర్ఫాన్ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్ మంగళవారం ట్వీట్ చేస్తూ ఇర్ఫాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ.. ‘డియర్ ఇర్ఫాన్ సార్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న. మీలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే అస్లాన్ యిల్మాజ్’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్లో ఇర్ఫాన్ బ్లాక్ సూట్ ధరించి స్టైలిష్‌గా కనిపించాడు. ఇందులో ఆయన ఫ్రెంచ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ యిల్మాజ్గా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్ వెల్లడించాడు. Wish you many more happy returns of the day dear @IrfanPathan sir ❤️❤️ Super happy to have met and worked with such a warm and a caring person like you.. Wishing you only the besttt in the year ahead 🤗🤗🤗 #Cobra 🐍🐍 #HBDIrfanpathan #AslanYilmaz pic.twitter.com/JBwIlbzGJM — Ajay Gnanamuthu (@AjayGnanamuthu) October 27, 2020 అయితే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇర్ఫాన్ తనకు నటన అంటే ఇష్టమని పలు ఇంటర్య్వులో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటించి కోలీవుడ్‌తో తన యాక్టింగ్ కేరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సియాన్ విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం మార్చిలో రష్యాకు వెళ్లిన విషయం తెలిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చిత్ర బృందం ఇండియాకు తిరిగి వచ్చింది. భారత్‌తో కూడా షూటింగ్‌లపై నిషేధం విధించిన కేంద్రం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో చిత్రికరించాల్సిన కీలక సన్నివేశాలను చెన్నైలోనే రష్యాను పోలిన సెట్టింగ్‌లతోనే దర్శకుడు షూటింగ్‌ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ‘కోబ్రా’ షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది. విక్రమ్ హరోగా, ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. -
ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ
ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్ పిక్చర్స్ పతారంపై ఆర్.కార్తికేయన్ జగదీశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ. రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్ సెంథిల్, తిథియన్ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్.కరుణ, సాయిరాం ముఖ్యపాత్రల్లో నటించారు. మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్‌తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్ విక్రమ్ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రిమేక్‌గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. -
విక్రమ్‌తో కేజీఎఫ్ హీరోయిన్?
తమిళ సినిమా: కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఇప్పుడు కోలీవుడ్ పిలుస్తోంది. చియాన్ విక్రమ్‌తో జతకట్టే అవకాశం ఆమె ముంగిట వాలిందనేది తాజా సమాచారం. ప్రయోగాలకు బ్రాండ్అంబాసిడర్ నటుడు విక్రమ్ అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పాత్రల కోసం ఎంత వరకైనా వెళ్లే విక్రమ్ కడారం కొండాన్ చిత్రం తరువాత కొత్త చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన ఇమైకా నొడిగళ్ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై నిర్మాత లలిత్‌కుమార్ వైకం 18 స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఇందులో నటుడు విక్రమ్ పలు గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదేవిధంగా దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా తెరరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాభవానీశంకర్‌ను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇండియన్–2లో కమల్ హాసన్‌తో, ఎస్జే.సూర్యకు జంటగా కొత్త చిత్రం అంటూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ప్రియాభవానీశంకర్ విక్రమ్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి అని తెలిసింది. దీంతో తాజాగా నటి శ్రీనిధిశెట్టిని విక్రమ్‌కు జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ కన్నడంలో ఆ మధ్య తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్రంలో నాయకిగా నటించిందన్నది గమనార్హం. కన్నడంలో మంచి స్టార్‌గా రాణిస్తున్న శ్రీనిధిశెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమ్‌కు జంటగా ఆమెను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ఇది నటుడు విక్రమ్‌కు 58వ చిత్రం అవుతుంది. దీనికి శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
అడవుల్లో వంద రోజులు!
రాజుల ఆహార్యం గొప్పగా ఉంటుంది. అందుకే రాజుల కథలతో వచ్చే సినిమాల కోసం హీరోలు తమ లుక్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళ హీరోలు విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి తమ లుక్స్‌ను మార్చుకోబోతున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంతో కూడుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్ నటించనున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్, కీర్తి సురేష్, అమలాపాల్ ప్రధాన పాత్రధారులనే ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, మోహన్‌బాబు కూడా కీలక పాత్రలు చేయనున్నారని కోలీవుడ్ టాక్. సినిమాలోని రాజుల పాత్రకు తగ్గట్లు జుట్టు మీసాలు, గెడ్డాలు పెంచుకోమని మణిరత్నం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులకు చెప్పారట. ఆల్రెడీ విక్రమ్, కార్తీ వంటి నటులు ఈ పని స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ నవంబరులో మొదలు కానుందని తెలిసింది. ముందుగా థాయ్‌ల్యాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట టీమ్. వంద రోజుల పాటు అక్కడి అడవుల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలిసింది. -
హైదరాబాద్‌లో ‘మహావీర్‌కర్ణ’
పాత్రకోసం ప్రాణం పెట్టే నటులు అతికొద్దిమందే ఉంటారు. అందులో ప్రధానంగా తమిళ నటుడు విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. సేతు, శివపుత్రుడు సినిమాల్లో నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. శంకర్ తీసిన ‘ఐ’ సినిమా కోసం తన శరీరాన్ని హూనం చేసుకున్నాడు. ఇలా పాత్రకు తగ్గట్టుగా మారే విక్రమ్.. కర్ణుడి పాత్రను పోషిస్తూ.. ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300కోట్లతో అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహావీర్‌కర్ణ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. కర్ణుడి కోణంలోంచి మహాభారత గాథను చెప్పే ఈ చిత్ర షూటింగ్‌ను హైద్రాబాద్‌లో జరగుతోందని సమాచారం. సామి సినిమాతో ఇటీవలే పలకరించిన విక్రమ్.. గౌతమ్ మీనన్‌తో తెరకెక్కించే ‘ధృవనక్షత్రం’, రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్షన్లో రాబోతోన్న ‘కదరం కొండన్’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. -
నిద్రపోతుండగా త్రిష బుగ్గ గిల్లింది..
సినిమా: నటి త్రిష నా బుగ్గ గిల్లింది అంటున్నాడు నవ కథానాయకుడు ధ్రువ్. సియాన్ విక్రమ్ వారసుడైన ఈయన వర్మ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయన బి.స్టూడియోస్ సమర్పణలో ఈ 4 ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మోడల్ మేఘ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని విడుదల హక్కులను శక్తివేలన్ పొందారు. ఈ సందర్భంగా ఒక భేటీలో నవ నటుడు ధ్రువ్‌ను మీకు ఏ నటితో నటించాలని కోరిక అన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు చిన్నతనం నుంచి నటి త్రిష అంటే చాలా ఇష్టమని, అయితే తానిప్పటి వరకూ ఆమెను కలిసింది లేదని చెప్పాడు. ఒకసారి ప్రివ్యూ థియేటర్లో తాను నిద్రపోతుండగా త్రిష తన బుగ్గ గిల్లి వెళ్లిపోయినట్లు ధ్రువ్ చెప్పారు. త్రిష ధ్రువ్ తండ్రి విక్రమ్ నటించిన స్వామి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందిపుచ్చుకుందన్నది గమనార్హం. -
మళ్లీ మల్టీ స్టారర్ చిత్రం
సినిమా: దర్శకుడు మణిరత్నం అచ్చొచ్చిన బాటలోనే పయనించడానికి మొగ్గు చూపుతున్నారా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌ల్లో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్నా, కోలీవుడ్‌లో ఆ ట్రెండ్ తక్కువేనని చెప్పాలి. ఇటీవలే మణిరత్నం, శంకర్ ఆ తరహా చిత్రాలకు తెర లేపారు. సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్‌లను నటింపజేసి మణిరత్నం సక్సెస్ అయ్యారు. ఇక శంకర్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్‌లతో 2.ఓ చిత్రం చేశారు. నిజానికి కొంతకాలం క్రితమే విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబులతో పొన్నియన్ సెల్వమ్ అనే చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించే ప్రయత్నం చేసినా, అది అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ అటకెక్కిన ఆ స్క్రిప్ట్‌ను దుమ్ముదులిపి వెండితెరపై ఆవిష్కరించడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో ఈ సారి విజయ్, విక్రమ్, శింబులను నటింపజేయడానికి మణిరత్నం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వారు ఈ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ఇది చారిత్రక కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుంది. అయితే ఈ క్రేజీ చిత్రం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇకపోతే మణిరత్నంకు మల్టీస్టారర్ చిత్రాలు కలిసొచ్చాయనే చెప్పాలి. చాలా కాలం క్రితం రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామిలతో రూపొందించిన దళపతి చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల సెక్క సివందవానంతో ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యింది. దీంతో మరోసారి మణిరత్నం అదే బాటలో పయనించి సక్సెస్ కొట్టాలనుకుంటున్నారన్నమాట. -
త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!
సినిమా: సామిస్క్వేర్ చిత్రం వేరే లెవల్లో ఉంటుంది అంటున్నారు చియాన్ విక్రమ్. తాజాగా ఈయన తండ్రీకొడుకులుగా నటించినఫుల్ మాసాలాతో కూడిన యాక్షన్ ఓరి యెంటెడ్ కథా చిత్రం సామి స్క్వేర్. కమర్శియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంతకు ముందు ఇదే కాంబినేషన్లో రూపొంది సంచలన విజయాన్ని సా ధించిన సామి చిత్రానికి సీక్వె ల్. కీర్తీసురేశ్, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఇందులో నటుడు బాబీసింహా ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ప్రభు ముఖ్యపాత్రను పోషించిన ఈ భారీ చిత్రాన్ని తమీన్స్ ఫిలింస్ పతాకంపై శింబు తమీన్ నిర్మించారు. సామిస్క్వేర్ భారీ అంచనాల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. సామి పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గురువారం పత్రికల వారితో ముచ్చటించారు. అవేంటో చూద్దాం. ప్ర: సామి వంటి సంచలన విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సామిస్క్వేర్ చిత్రం ఎలా ఉంటుంది? జ: సామిస్క్వేర్ చిత్రం అంతకంటే వేరే లెవల్లో ఉంటుంది. లవ్, హై ఓల్టేజ్ యాక్షన్ అంటూ చిత్రం జెట్ వేగంలో సాగుతూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ఇందులో నేను తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాను. ప్ర: త్రిష నటించాల్సిన పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటన గురించి? జ: త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది. అయితే ఐశ్వర్యరాజేశ్ నటన ప్రశంసలు అందుకుంటుంది. ప్ర: సామి చిత్ర దర్శకుడు హరికి ఇప్పటి హరికి తేడా చూశారా? జ: హరి గురించి చెప్పాలం టే ఆయన ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్డేట్ అవుతుంటారు. సామిస్క్వేర్ చిత్రాన్ని ఆయన మరింత ట్రెండీగా తెరకెక్కించారు. ఆయనలో వేగం మరింత పెరిగింది. ప్ర: ఏ తరహా పాత్రను చేయాలని కోరుకుంటున్నారు? జ: సేతు, పితామగన్, దైవతిరుమగళ్, ఐ, ఇరుముగన్ ఇలా నా చిత్రాలు గమనిస్తే ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలనే పోషించాను. నటనకు అవకాశం ఉన్న మంచి యాక్షన్ కలిసిన పాత్రలో నటించాలని ఉంది. ప్ర: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అలాం టి చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారా. జ: అలాంటివి అమరాలి. ఇంతకు ముందు ఒకటి రెండు బయోపిక్ చిత్రాల్లో నటించమని అడిగారు కానీ, అవి మెటీరలైజ్ కాలేదు. అయితే సావిత్రి లాంటి బయోపిక్ కథా చిత్రం అమిరితే నటించడానికి రెడీ. ప్ర: మీ అబ్బాయి దృవ్ నటిస్తున్న వర్మ చిత్రం గురించి? జ: వర్మ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ చిత్రం గురించి దర్శకుడు బాలా చూసుకుంటారు. ప్ర: మీరు మీ కొడుకు దృవ్తో కలిసి నటిస్తారా? జ:మంచి కథ లభిస్తే కచ్చితంగా నటిస్తాను. ప్ర: తదుపరి చిత్రాలు? జ: ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాను. తదుపరి హిస్టారికల్ చిత్రం కర్ణన్ చేయనున్నారు. అదే విధంగా కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించనున్నాను. ఇవి పూర్తి అయిన తరువాతే కొత్త చిత్రాలను అంగీకరిస్తాను. -
ఆటోను ఢీకొట్టిన హీరో విక్రమ్ కొడుకు
-
‘వర్మ’ హీరోయిన్ ఇలా ఉండాలట..!
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కోసం ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఓ అమ్మాయి ముఖం కనిపించకుండా షూట్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన హీరో విక్రమ్, ‘ఈమె కనబడటం లేదు. ఒకవేళ ఈమె మీరే అయినా..లేక మీరు ఈమెలాగే ఉన్నా.. మీ ఫొటోలను వీడియోలను మాకు పంపించండి. నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న. సమయం తీసుకోండి. కానీ త్వరపడండి’అంటూ కామెంట్ చేశాడు. హీరోయిన్ ఎంపిక కోసం వర్మ టీం రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. And.. SHE IS MISSING. If you are her or anyone who looks like her, send your pics or videos to varmathemovie@gmail.com. Can't wait to meet you. Take your time, but hurry. #heroinesearch #castingcall #vermas❤️#whostheluckygirl #thesearchbegins # varmathemovie #dirbala #dhruvvikram #E4entertainment. Thank you Shruti for your enchanting voice. Thanks ms AB. 🎥 Sukumar ✂️ Pradeep Jenifer 🎨 Kiran 👗Sathyasuku @shrutzhaasan @dhruv.vikram @mukeshe4e @pradeepjenifer A post shared by Vikram (@the_real_chiyaan) on Nov 11, 2017 at 10:31pm PST -
తమిళ 'అర్జున్ రెడ్డి'కి జోడి ఎవరు..!
తెలుగులో సంచలన విజయం సాదించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవలే విక్రమ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తో పాటు బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మల్లో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జ్యోతిక, జీవి ప్రకాష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాచియార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలా, ఆ సినిమా రిలీజ్ తరువాత డిసెంబర్ నుంచి అర్జున్ రెడ్డి రీమేక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈ లోగా హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
విక్రమ్‌తో రొమాన్స్‌కు రెడీ
సియాన్ విక్రమ్‌తో రొమాన్స్ చేయడానికి మాలీవుడ్ బ్యూటీ మంజిమామోహన్ రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు వరస కడుతున్నాయి. మలయాళంలో ఒకటి రెండు చిత్రాలు చేసిన కథానాయికలకు కోలీవుడ్‌లో మంచి గిరాకీ ఏర్పడడం అన్నది చాలా కాలం నుంచే జరుగుతోంది. అసిన్, నయనతార లాంటి వారంతా ఈ కోవకు చెందిన వారే. తాజాగా మంజిమామోహన్ చేరారు.శింబుకు జంటగా అచ్చంఎన్భదు మడమైయడా చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసిన మంజిమామోహన్‌ను ఆదిలోనే చాలా మంది భయపెట్టారు. అయినా ధైర్యం చేసి ఆయనతో నటించడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం కూడా పలు ఆటంకాల మధ్య చిత్రీకరణను పూర్తి చేసుకోవడంతో మంజిమామోహన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం షూటింగ్లో ఉండగానే విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడమన్నన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో టక్కున ఆ చిత్రాన్ని అంగీకరించారు. శింబు చిత్రం షూటింగ్ జాప్యం కావడంతో మంజిమామీనన్‌కు ముడిచూడ మన్నన్ చిత్రమే మొదట విడుదలవుతుందనుకున్నారు. అయితే గౌతమ్‌మీనన్, శింబుల మధ్య మనస్పర్థలు తొలగడంతో అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందుగా తెరపైకి వచ్చి మంచి ప్రజాదరణ పొందింది. తొలి చిత్రమే శుభారంభాన్నివ్వడంతో మంజిమామోహన్ లక్కీ నాయకి అయిపోయారు. అంతే కాదు శింబు చాలా స్వీట్ పర్సన్ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ముడిచూడ మన్నన్ చిత్రంతో పాటు గౌరవ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా సియాన్ విక్రమ్‌తో నటించే లక్కీఛాన్స్ మంజిమామోహన్‌ను వరించింది. ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విక్రమ్ వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు కీర్తీసురేశ్, సాయిపల్లవి, మంజిమామోహన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కీర్తీసురేశ్ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటి సాయిపల్లవి అడిగిన పారితోషికం దర్శక నిర్మాతలకు ముచ్చెమటలు పట్టించిందట. చివరిగా విక్రమ్‌తో నటించే అవకాశం నటి మంజిమామోహన్‌ను వరించింది. దీంతో నటి కీర్తీసురేశ్‌కు మంజిమామోహన్ పోటీగా తయారవుతున్నారనే టాక్ కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా సాగుతోంది.