సూర్య, ఆర్య బాటలో విక్రమ్‌.. వర్కౌట్‌ అయ్యేనా? | Vikram Chiyaan Mahaan Movie To Release On January 26th In OTT | Sakshi
Sakshi News home page

సూర్య, ఆర్యలను ఫాలో అవుతున్న విక్రమ్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

Published Fri, Jan 7 2022 2:52 PM | Last Updated on Fri, Jan 7 2022 3:12 PM

Vikram Chiyaan Mahaan Movie To Release On January 26th In OTT - Sakshi

సౌత్ లో అత్యధిక పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అయితే ఈ హీరో బాక్సాఫీస్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంతో ఇష్టపడి చేసిన గ్యాంగ్, ఎన్ జీ కే, బందో బస్త్ లాంటి చిత్రాలను థియేటర్లకు తీసుకొచ్చాడు. కాని ఈ సినిమాలన్ని డిజప్పాయింట్ చేసాయి. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆకాశమే నీ హద్దురా మూవీని ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్రపంచంలో సంచలన విజయం సాధించింది.

ఆ తర్వాత జైభీమ్ ని కూడా ఓటీటీలోనే విడుదల చేశాడు. అది కూడా సూపర్‌ హిట్‌ అయింది. ఈ రెండు సినిమాలు సూర్యకు పాన్‌ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. సూర్యకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొత్త చిత్రం ఎత్తారెక్కుమ్ తునిందవన్ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరో తమిళ హీరో ఆర్య కూడా కోలీవుడ్ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే అది బాక్సాఫీస్ మూవీ కాదు. ఓటీటీ మూవీ సార్పట్ట.

ఇలా అటు సూర్య, ఇటు ఆర్య ఈ ఇద్దరు ఓటీటీ మూవీస్ ద్వారానే హిట్ అందుకున్నారు. ఆడియెన్స్ లో మంచి ఆదరణ చూశారు. ఇప్పుడు ఇదే దారిలో మరో కోలీవుడ్ హీరో విక్రమ్ వెళ్లాలి అనుకుంటున్నాడు. కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతో శ్రమిస్తున్నాడు అపరిచితుడు. కనీసం బిలో యావరేజ్ మూవీని కూడా చూడలేకపోతున్నాడు. అందుకే ఈసారి సూర్య దారిలో తాను నటిస్తున్న కొత్త చిత్రాలు మహాన్, కోబ్రో మూవీస్ ను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నాడు. మహాన్ జనవరి 26న ప్రైమ్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మరో మూవీ కోబ్రా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి సూర్య, ఆర్యల మాదిరే విక్రమ్‌ కూడా హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement