సూర్య భారీ యాక్షన్‌ మూవీ.. కంగువా ఏ ఓటీటీకి రానుందంటే? | Kollywood Star Hero Suriya Kanguva Movie OTT Rights Sold Out For Record Price, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

Kanguva OTT Rights: సూర్య కంగువా.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!

Nov 14 2024 10:57 AM | Updated on Nov 14 2024 11:49 AM

Kollywood Star Hero Suriya Kanguva Ott Rights Sold Out Big Deal

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య తన కెరీర్‌లో నటించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కంగువా. ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా శివ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచే కంగువాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

అయితే భారీ బడ్జెట్‌ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. కంగువా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ  వచ్చేస్తున్నాయి.

కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది. తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం. అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. 

కంగువా రెమ్యునరేషన్..

కంగువా కోసం సూర్య  ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా బడ్జెట్‌లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement