rights
-
మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్‌కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేల్స్, మార్కెటింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళా–2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకుంది. కుంభ మేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనుంది. ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా వెండింగ్, అమ్యూజ్మెంట్ జోన్స్, ఫుడ్ కోర్ట్ సహా పలు కార్యకలాపాల హక్కులు సైతం పొందింది. రూ.6,300 కోట్లతో యూపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ మేళాకు దేశ, విదేశాల నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగే ఈ మెగా ఈవెంట్ భారత చరిత్రలో అత్యంత గొప్ప కుంభ మేళా అవుతుందని శ్రేయాస్ మీడియా ఫౌండర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రకటనలు, బ్రాండింగ్‌కు కంపెనీలు సుమారు రూ.3,000 కోట్లు వెచి్చంచే అవకాశం ఉందన్నారు. మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి సంస్థ తనకున్న అపార అనుభవం, అసమాన నైపుణ్యాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు. -
సూర్య భారీ యాక్షన్ మూవీ.. కంగువా ఏ ఓటీటీకి రానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో నటించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కంగువా. ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచే కంగువాకు పాజిటివ్ టాక్ వస్తోంది.అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. కంగువా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది. తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం. అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కంగువా రెమ్యునరేషన్..కంగువా కోసం సూర్య ఏకంగా రూ.39 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా బడ్జెట్లో పది శాతానికిపైగా సూర్య రెమ్యునరేషన్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ రూ.5 కోట్లు, దిశా పటానీ రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. -
‘అగ్ర’రాజ్యంలో అదే చర్చ
స్త్రీ హక్కులను గుర్తిస్తే.. వాళ్ల నిర్ణయా«ధికారాన్ని సమ్మతించినట్లే! వాళ్ల సాధికారతను గౌరవించినట్లే! అయితే ఇప్పుడు పేచీ అంతా అక్కడే.. మ్యారిటల్ రేప్ నుంచి అబార్షన్ కేస్ వరకు.. అమె చాయిస్‌ను అడిగేవాళ్లు లేరు సరికదా.. ఆమె అలా అడగడమే సరికాదని వాదిస్తున్నారు.. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు! అనిత (పేరు మార్చాం) ఎకనామిక్ ఎనలిస్ట్. ఆంట్రప్రెన్యూర్ కావాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం పెళ్లి, పిల్లలనే జంఝాటాలూ వద్దనుకుంది. కానీ తనంటే చాలా ఇష్టపడే ఓ ఇన్వెస్టర్ పెళ్లి ప్రపోజల్ తేవడంతో, ఇంట్లో వాళ్లూ బలవంత పెట్టడంతో పెళ్లికి ఒప్పుకుంది.. తనకున్న లక్ష్యాన్ని వివరించి, పిల్లల్ని కనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసి మరీ! అందుకు సరే అంటూ అనిత చేయి అందుకున్నాడు అతను. అయితే ఫ్యామిలీ ΄్లానింగ్ ఫెయిలై అనిత గర్భం దాల్చింది. అబార్షన్ ఆప్షన్‌ను ఎంచుకుంది. పెళ్లికి కాంప్రమైజ్ అయినట్టుగా, ప్రెగ్నెన్సీకీ కాంప్రమైజ్ అవమని ఒత్తిడి తెచ్చాడు భర్త. అలా కుదరదని తేల్చిచెప్పి, అబార్షన్ కోసం ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించింది. ‘భర్త అంగీకారం ఉంటేనేప్రోసీడ్ అవుతాను’ అంది డాక్టర్. హతాశురాలైంది అనిత! బాగా చదువుకున్నవాడు, లోకం తెలిసిన అనిత భర్తకే భార్య హక్కు గురించి తెలియకపోతే.. మిగిలిన వాళ్ల పరిస్థితేంటి! తొమ్మిది నెలలు మోసి, కని, పెంచే ఆమె అన్నిరకాలుగా సిద్ధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి! ఎందుకంటే ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ అధికారం! హర్ బాడీ.. హర్ చాయిస్! అందుకే ఇష్టం లేని గర్భాన్ని అవసరంలేదనుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే ప్రధానాంశం అయింది. దీనిమీద.. అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్, కమలా హ్యారిస్‌ల మధ్య వేడిగావాడిగా చర్చ సాగుతోంది. డెమోక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్.. స్త్రీలకు అబార్షన్ హక్కు ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది స్త్రీ నిర్ణయాధికారాన్ని, సాధికారతను సూచిస్తుందని ఆమె అభి్రపాయపడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేమో దీనికి సంబంధించి తన వైఖరిని మాటిమాటికీ మారుస్తూ వస్తున్నారు. నిన్నమొన్న జరిగిన డిబేట్లో కూడా ‘అబార్షన్ రైట్’ అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలనే నిర్ణయానికి మద్దతిచ్చాడు. ట్రంప్ మాటల మీద మిగతా వాళ్ల అభి్రపాయాలెలా ఉన్నా.. స్వయానా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అబార్షన్ అనేది స్త్రీ ఇష్టానికే వదిలిపెట్టాలి, అది ఆమె హక్కు.. ఈ విషయంలో రాజీకి చోటే లేదంటూ స్పష్టంగా చె΄్పారు. అంతేకాదు, ప్రాథమిక హక్కయిన వ్యక్తి స్వేచ్ఛను నేను సంరక్షిస్తాను’ అని చె΄్పారు. దీంతో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్ను వేసి ఉంచిన ప్రపంచం యావత్తూ దీని మీద చర్చనూ మొదలుపెట్టింది. అసలు ఈ అబార్షన్ రైట్ అనేది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నెలవైన అమెరికాలో ఎందుకంత వివాదమవుతోంది? ఆ నేపథ్యం ఏంటంటే.. అమెరికాలో అబార్షన్‌కి సంబంధించి స్త్రీ స్వేచ్ఛను సవాలు చేసేలా ఉన్న నియమ నిబంధనల మీద 1969ప్రాంతంలో పెద్ద ఉద్యమమే సాగింది ‘మై బాడీ.. మై చాయిస్’ నినాదంతో. ఈ క్రమంలో 1973లో ఆ దేశ సుప్రీంకోర్ట్.. రో (ఖ్ఛౌ) వర్సెస్ వేడ్ (గ్చిఛ్ఛీ) కేసులో గర్భస్రావం హక్కునుప్రాథమిక/ రాజ్యాంగ హక్కుగా తీర్పునిచ్చింది. అయితే అదే అమెరికా సుప్రీంకోర్ట్ 2022లో ఆ తీర్పును తిరగరాస్తూ అబార్షన్‌పై 1973 కంటే ముందున్న నియమ నిబంధనలే సరైనవని వ్యాఖ్యానిస్తూ మరో తీర్పునిచ్చింది. దీని మీద అమెరికా అంతటా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి.ఆ తీర్పు తర్వాత దాదాపు రెండువందల మందికి పైగా మహిళల మీద అబార్షన్ నేరం కింద కేసులు నమోదైనట్టు ఓ నివేదిక తెలిపింది. అప్పటి నుంచి అబార్షన్ రైట్ కోసం అమెరికాలోపోరాటం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, వాటిని వ్యతిరేకిస్తూ మెలానియా వెలిబుచ్చిన తన అభి్రపాయంతో మళ్లీ ఒకసారి ప్రపంచంలోని దేశాలన్నీ అబార్షన్‌కి సంబంధించి తమ దేశాల్లోని చట్టాలు, అవి మహిళలకు ఇస్తున్న వెసులుబాటు, వాళ్ల హక్కుల్ని గౌరవిస్తున్న తీరుతెన్నులను పరిశీలించుకుంటున్నాయి. మనమూ మన దగ్గరున్న చట్టాన్ని ఒకసారి పరికిద్దాం!గర్భం దాల్చాలా? వద్దా? అనేది మహిళే నిర్ణయించుకోవాల్సిన విషయం. దీన్ని ఆమె స్వేచ్ఛకే వదిలేయాలని మన చట్టం చెబుతోంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, సెక్షన్ 3 ప్రకారం.. గర్భస్రావం తప్పనిసరైనప్పుడు దానికి గర్భిణి అంగీకారం మాత్రమే చాలు. 2017లో అనిల్‌కుమార్ వర్సెస్ అజయ్ పశ్రీచా కేసులో ‘గర్భం దాల్చాలా వద్దా అనే అంశంలో తుది నిర్ణయం మహిళదే. వైవాహిక బంధానికి సమ్మతించినంత మాత్రాన ఆ పురుషుడి బిడ్డకు తల్లినౌతానని ఆమె అంగీకరించినట్టు కాదు’ అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి అబార్షన్ సమయంలో పురుషుడి అనుమతి అవసరం లేదు. స్త్రీ అంగీకారం మాత్రమే చాలు అని అర్థమవుతోంది. అయితే భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకుంటే అది నేరం కాకపోయినప్పటికీ, ఆ కారణాన్ని చూపి భర్త విడాకులు కోరే అవకాశం ఉంటుంది.మొత్తంగా చూస్తే.. అబార్షన్‌కి సంబంధించిన చట్టాల్లో మనం అమెరికా కంటే మెరుగే అని తెలుస్తోంది. ఆ విషయంలో మన చట్టం.. స్త్రీ హక్కును గౌరవిస్తోంది. ఆచరణలో మటుకు సమాజం ఇంకా చైతన్యవంతం కావాలి. – సరస్వతి రమఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలిమదర్హుడ్ అంటే ఒకరకంగా స్త్రీల మీద టాక్సేషన్ లాంటిదే! ఎందుకంటే తొమ్మిది నెలలు మాత్రమే కాదు పిల్లలు పెరిగి, వాళ్లు ఇండిపెండెంట్ అయ్యే వరకు కూడా స్త్రీల కెరీర్పాజ్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగాల సొసైటీలో ఇదంతా అవరోధంగానే ఉంటుంది. ఇలాంటప్పుడే మదర్‌హుడ్ కావాలా? కెరీర్ కావాలా అని ఎంచుకునే పరిస్థితి ఎదురవుతుంది. రెండూ కావాలనుకునేవాళ్లు ఎన్నోరకాల ఒత్తిడికి లోనవుతుంటారు. ఆర్థికంగా, సామాజికంగా ఆమెకు ఎన్నో సౌలభ్యాలు సమకూర్చితే తప్ప ఆమె రెండు ఆప్షన్స్‌ను ఎంచుకునే వీలుండదు. కానీ ఈ వెసులుబాట్లేమీ లేవు, ఉండవు. అలాంటప్పుడు ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛను ఆమెకివ్వడమే కరెక్ట్. అబార్షన్‌ను ఆమె హక్కుగా గుర్తించి, గౌరవించాలి. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్, ది పర్పుల్ వరండాస్త్రీ యంత్రం కాదుస్త్రీ శరీరం ఒక యంత్రం కాదు. బిడ్డను మోసి, కని, పెంచేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధపడి ఉండాలి. అందుకే అది పూర్తిగా ఆమె స్వేచ్ఛకు సంబంధించిన అంశం. పురుషుడికి ఆ విషయంలో ఎటువంటి హక్కు ఉండదు, ఉండకూడదు. నా ఉద్దేశంలో ఖ్ఛౌ ఠిట. గ్చిఛ్ఛీ కేసును అమెరికా సుప్రీంకోర్టు తిరగరాయడం సమంజసం కాదు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్కలవరపెట్టే విషయం..ఈ మధ్యకాలంలో డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ మధ్య ట్ఛౌ ఠిటఠ్చీఛ్ఛీ పై జరిగిన చర్చ డెవలప్డ్ కంట్రీ అనే పిలవబడే అమెరికా, అక్కడి రాజకీయాల్లోని ఆలోచన ధోరణుల్లోని వ్యత్యాసాన్ని తెలుపుతోంది. అబార్షన్ హక్కులను పరిమితం చేయడానికి ఒత్తిడి తెచ్చిన వాళ్లలో ట్రంప్ ఒకడు. అతని హయాంలో అబార్షన్ హక్కులను పరిమితం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. Roe vs. Wade ఉద్యమానికి అతను మద్దతు ఇచ్చాడు. మరోవైపు పునరుత్పాదక హక్కులు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకి, అలాగే హెల్త్ కేర్ యాక్సెస్కిప్రాథమికం అనే ప్రగతిశీల దృక్పథం కమలది. బిడ్డని కనాలా వద్దా అని నిర్ణయం తీసుకునే హక్కు ఆడవాళ్ళ అధికారాన్ని సమానత్వాన్ని సూచిస్తుందని ఆమె వాదన. అబార్షన్ హక్కులు లేకపోవడం వలన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రజారోగ్యం మీద, సోషియో ఎకనామిక్ స్టేటస్ పైనా ప్రభావం ఉంటుందనే ముఖ్యమైన అంశాన్ని ఆమె లేవనెత్తింది. ఈ చర్చలో వచ్చినవి వ్యక్తిగత అభి్రపాయాలే కాదు, భవిష్యత్తులో అమెరికన్ సమాజం ఎలా ఉండబోతుందో కూడా తెలుపుతున్నాయి. అబార్షన్ హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలుప్రాణాలు కూడా కోల్పోయారు. మహిళల జననాంగాల గురించి పబ్లిగ్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన ట్రంప్ లాంటి పురుషహంకారులకు మహిళల స్వేచ్ఛ ఎలాగూ అర్థం కాదు. ఐతే ఇటువంటి వాదనలను సమర్థించే వాళ్లలో చదువుకున్న వాళ్లు, స్త్రీలూ కూడా ఉండడం కలవరపెట్టే విషయం. – దీప్తి శిర్ల, జెండర్ యాక్టివిస్ట్ -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
రాష్ట్రాలకే మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ: సుప్రీం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై రాయల్టీ పొందే హక్కు విషయమై సుప్రీంకోర్టు నేడు(గురువారం) చారిత్రక తీర్పు వెలువరించింది. ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీని విధించే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే హక్కు కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరికి ఉందన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టులో సీజే డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం 8:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఖనిజ సంపద అధికంగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.రాయల్టీ అనేది పన్నుతో సమానమైనది కాదని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఖనిజ హక్కులపై పన్ను విధించే విషయంలో ఆయా రాష్ట్రాలకు అనుమతి కల్పిస్తే వివిధ రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని అన్నారు. ఇది మార్కెట్ దోపిడీకి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలో మైనింగ్ పై రాష్ట్రాలు పన్ను విధించకుండా అడ్డుకునే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
చైనాలో ‘మీటూ’ఉద్యమంలో పాల్గొన్న మహిళా జర్నలిస్టు హువాంగ్ షుకిన్‌పై దేశద్రోహం ఆరోపణలు చేస్తూ, ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. చైనా జర్నలిస్టుల సంఘం ఈ వివరాలను తెలియజేసింది. ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం షుకిన్‌కు ఒక లక్ష యువాన్ (రూ. 1,155,959) జరిమానా కూడా విధించారు. మూడు సంవత్సరాల క్రితం షుకిన్‌లో పాటు మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మీటూ ఉద్యమం చైనాలో గతంలో ఉధృతంగా సాగింది అయితే ప్రభుత్వం దానిని అణిచివేసింది. ఇలా ఉద్యమాల్లో పాల్గొనే నేతలను, కార్యర్తలను చైనా అజ్ఞాతంలో ఉంచడం గానీ లేదా వారికి జైలు శిక్ష విధించడం గానీ చేస్తుందనే ఆరోపణలున్నాయి. కాగా మహిళా జర్నలిస్టు షుకిన్ విడుదల తేదీ 2026, సెప్టెంబర్ 18గా కోర్టు ప్రకటించింది. ఇదే ఆరోపణలపై ఆమె స్నేహితుడు వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల ఆరు నెలల శిక్ష విధించారు. షుకిన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మహిళా హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ఆమె అభిమానులు మీడియాకు తెలిపారు.ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న షుకిన్ 2018లో తాను యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు, అక్కడి సూపర్వైజర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ మీటూ ఉద్యమం బాట పట్టారు. షుకిన్‌కు జైలు శిక్ష విధించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన చైనా యూనిట్ డైరెక్టర్ సారా బ్రూక్స్ ఖండించారు. ఇది చైనాలో మహిళల హక్కులపై దాడి అని ఆరోపించారు. -
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్‌ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్‌నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్‌పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవో నంబర్ 596 జారీ చేశారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజనల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులివ్వాలి ► డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్లాండ్ అడంగల్, పీఓఎల్ఆర్, పాత అడంగల్, 10 (1) రిజిస్టర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధ్రువీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహశీల్దార్‌దే. కాల క్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదు. ► భూ బదలాయింపు జరగకపోయినప్పటికీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు రిట్ పిటిషన్ 140/2022 ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ► ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి వాటికి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ► డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆదీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. అలాంటి భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి, అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఇలాంటి భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును మార్చవచ్చు. ► అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములను ఇప్పుడు భూ మారి్పడి (లాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి ► ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ► భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి – నాట్ ఎలాటెడ్’గా నమోదై.., వాస్తవానికి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. వెరిఫికేషన్‌లో ఆ భూముల హక్కుల కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ► అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే, జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ► 20 సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్య హక్కులివ్వాలి. ► భూ బదలాయింపు (లాండ్ కన్వర్షన్) జరిగి, అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ► అసైన్డ్ భూములైనా ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని భూములను అసైన్డ్ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తులను స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్ ఉంది. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి. ► రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధ్రువీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధ్రువీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. -
భూ హక్కులకు భరోసా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి. కింది కోర్టులపై తగ్గనున్న భారం కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. -
Children’s Day 2023: పిల్లలకు ఎన్ని హక్కులున్నాయో తెలుసా?
నవంబర్ 14 మన ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ జయంతి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాలబాలికల విద్యను ప్రొత్సహించడంతో పాటు వాళ్ల హక్కుల కోసం పాటుపడ్డారు. అందుకే పిల్లలు ఆయన్ని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. అలా.. ఆయనకు, ప్లిలలకు మధ్య ఉన్న బంధానికి గుర్తుగా.. పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రతీ యేటా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. ఐక్యరాజ్య సమితి మాత్రం నవంబర్ 20ను అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది. కానీ, మనం మాత్రం నెహ్రూ పుట్టిన రోజు తేదీనే బాలల దినోత్సవంగా(బాల దివాస్) నిర్వహించుకుంటున్నాం. బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి.. ఇదీ బాలల దినోత్సవం నాడు ప్రభుత్వాలు చేపట్టే చర్యలు. అలాగే పిల్లలకు కొన్ని హక్కులు ఉంటాయి. చాలామందికి పిల్లలకు హక్కులు ఉంటాయని వినడమేగానీ.. అవేంటన్నది మాత్రం తెలియదు. బాలల దినోత్సవ లక్ష్యాల్లో ఒకటైన వాటి గురించి తెలుసుకుందాం.. భారత రాజ్యాంగంలో బాలబాలికల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని ఆర్టికల్స్(అధికరణలు) ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. ఆర్టికల్ 15 (3).. స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి చట్ట సభలకు అధికారం ఉంది. ఈ అధికరణ ప్రకారం.. ఏదీ అడ్డురాదు. ఆర్టికల్ 21(A).. 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించాలి. భారత రాజ్యాంగంలో 45వ అధికరణ బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. దీనిని అమలు చేయడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని 21-A అధికరణగా పేర్కొన్నారు. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు అన్నమాట. ఆర్టికల్ 24 ప్రకారం.. ఫ్యాక్టరీలు, గనుల్లోనూ 14 సంవత్సరాల వయసులోపు పిల్లలతో పని చేయించడానికి వీల్లేదు ఆర్టికల్ 23 (1)..(2014లో చేసిన సవరణలను కలుపుకుని) మనుషులతో క్రయవిక్రయాలు జరపడం, అడుక్కోవడం లేదంటే మరేయితర రూపంలో బలవంతంగా పని చేయించుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు ఆర్టికల్ 39(E) : ఆర్థిక అవసరాలు, ఇతరత్రా పరిస్థితులు.. ఇలా గత్యంతర లేని కొన్ని పరిస్థితుల్లో పిల్లలు తమ శక్తికి మించి పనిచేస్తుంటారు. ఇలాంటివి ప్రోత్సహించరాదు. ఇది పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా వర్తిస్తుంది ఆర్టికల్ 39-(F) : బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా ఉండాలి. బాలల కోసం గౌరవప్రదమైన స్వేచ్ఛాయుత పరిస్థితుల్ని, వివిధ సౌకర్యాల్ని కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలి. ఆర్టికల్ 45 .. ఆరు నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యనందించాలి ఆర్టికల్ 51A(K): 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. (ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక విధుల్లో చేర్చారు) ఆర్టికల్ 350-A .. భాషా పరమైన మైనార్టీల బాలలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి. బాలల సంక్షేమానికి తెచ్చిన చట్టాలివి.. బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం – 1956: బాలికల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్ని చేయించడం, బాలికల్ని అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం. బాలల చట్టం – 1960 : కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అనాథ బాలలు తప్పుదోవ పట్టిన బాలలు, తల్లిదండ్రులు విస్మరించిన, దుష్పప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సరైనమార్గంలో పెట్టడం, వారి సంక్షేమానికి, ఉన్నతికి సరైన విద్య, శిక్షణ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్(సంరక్షకుల మరియు పర్యవేక్షకుల చట్టం) – 1890 : బాలలకు సంరక్షకుడు ఉన్నప్పుడు .. వాళ్ల సంక్షేమం ఆ గార్డియన్స్ పూర్తి బాధ్యత బాలకార్మికులు నిషేధ చట్టం – 1986 : 14 ఏండ్లలోపు బాలబాలికల్ని ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయించడం నిషేధం న్యాయసేవల చట్టం – 1987 (Legal services authority Act – 1987) : బాలలకు కావల్సిన న్యాయపరమైన సేవల అందజేత శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లయ్ చట్టం 1992 : శిశువులకు కావల్సిన తల్లిపాలకు ప్రత్యామ్నాయ పౌష్టికాహారం అందజేసేందుకు. శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994 : గర్భస్త దశలో ఉన్న శిశువు ఆడ, మగా నిర్ధారించే స్కానింగ్ పరీక్షలు ఈ చట్టం నిషేధిస్తుంది ఆరు నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించడానికి 2009లో భారత పార్లమెంట్ చట్టం చేసింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 (A) గుర్తించింది. జువైనల్ జస్టిస్ చట్టం – 2000: బాల నేరస్తుల రక్షణ, బాగోగులు చూడటం బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 : 1929లో బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో రద్దు చేసి దాని స్థానంలో నూతన బాల్యవివాహ నిరోధక చట్టం – 2006 రూపొందించారు. హక్కులు.. మనుగడ హక్కు విద్యా హక్కు రక్షణ హక్కు యువగొంతుకలకు సాధికారత కల్పించేందుకు.. ఎందులోనైనా పాల్గొనేందుకు హక్కు అభివృద్ధి హక్కు: సంపూర్ణ వృద్ధిని పెంపొందించడం కోసం ఆరోగ్యం& శ్రేయస్సు హక్కు: ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం.. వ్యక్తిత్వ గుర్తింపు హక్కు సృజనాత్మకతను పెంపొందించే క్రమంలో.. వ్యక్తీకరణ హక్కు సమానత్వాన్ని ప్రొత్సహించే క్రమంలో.. వివక్షకు వ్యతిరేకంగా హక్కు సురక్షిత పర్యావరణ హక్కు.. రేపటి ప్రపంచ సంరక్షణ కోసం కింద పేర్కొన్న చట్టాలు బాలల్ని, ఫ్యాక్టరీలలో పనిచేయడం నిషేధిస్తున్నాయి. ►ఫ్యాక్టరీస్ చట్టం – 1948 ►ప్లాంటేషన్ లేబర్ చట్టం – 1951 ►మర్చంట్ షిప్పింగ్ చట్టం – 1951 ►మైనింగ్ చట్టం – 1952 ►మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ చట్టం – 1961 ►అప్రెంటీస్ చట్టం – 1961 ►బీడీ, సిగార్స్ వర్కర్స్ చట్టం – 1966 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ – 2005 : రాజ్యాంగం పార్లమెంట్ బాలలకు కల్పించిన ప్రత్యేక హక్కులు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించే సంస్థ ఇది. బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి న్యాయం అందించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఈ కమిషన్ అవకాశం కల్పిస్తుంది. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం – 2012 (Protection of children from sexual ofference 2012) : బాలలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఈ చట్టం శిక్షిస్తుంది. ఇలాంటి కేసులను సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఇవేగాకుండా..ఐపీసీ, సీఆర్పీసీ, హిందూ వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టం.. తదితరాలు కూడా బాలల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్లను కలిగి ఉన్నాయి. -
పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం
ఇజ్రాయెల్ భద్రతా దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజల భూభాగం, స్వయం ప్రతిపత్తి, గౌరవం, జీవించే హక్కు కోసం తాము దీర్ఘకాలిక మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలు శాంతియుత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేరాలని తమ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పాలస్తీనాకు మద్దతుగా తాజా ప్రకటన వెలువడింది. A resolution in support of Palestine has been passed in the meeting of the “Working Committee”, the highest policy making body of the Congress. “The Congress Working Committee reiterates its support for the rights of the Palestinian people to land, self-governance and… https://t.co/CAGdATJWyD pic.twitter.com/IQl5iKtD0q — The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) October 9, 2023 ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్‌లోని భారత సంతతి చెందిన జే పటేల్‌కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్‌లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
Jawan Film OTT Rights: ఓటీటీకి జవాన్.. కళ్లు చెదిరే ధరకు హక్కులు!
బాలీవుడ్ బాద్ షా తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్రలో మెరిసింగది. ఈనెల 7న బాక్సాఫీస్ బరిలో నిలిచిన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఏడు నెలల గ్యాప్‌లోనే.. పఠాన్ చిత్రం తర్వాత మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇదే ఊపు కొనసాగితే పఠాన్ వసూళ్లను దాటేసే అవకాశముంది. కాగా.. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) అయితే ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి మరో జాక్‌పాట్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ కోసం ఏకంగా రూ.250 కోట్లు మేకర్స్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. స్ట్రీమింగ్ తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి థియేటర్లలో లభిస్తున్న రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో నటించింది. (ఇది చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
అసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా జాబితాలు.. కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు. 1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు. -
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
బ్రో నైజాం రైట్స్ క్లోజ్.. ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాతలు
పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. (ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..) ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి. -
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్‌కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్‌కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
International Mothers Day: ఆలోచింప చేసే అమ్మ కథ
‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ. ‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ. ‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ. ‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ. ‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే. కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన... ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు. డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది. ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది. ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది. అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది. ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు. అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా. ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది. చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ. పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం. ‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా? బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా? అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి. -
చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న చుక్కల భూములపై సంబంధిత రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కనీసం 12 ఏళ్లపాటు ఇనాం భూముల్ని అనుభవిస్తున్న వారికి ఆయా భూములపై సర్వహక్కులు లభించనున్నాయి. కాగా, అద్దె లేదా లీజుదారులు క్లెయిమ్ చేయని ఇనాం భూములు ప్రభుత్వ పరం కానున్నాయి. గ్రామీణ ప్రాంత భూములకు జారీచేసే పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇకనుంచి పట్టణ ప్రాంత భూములకు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్దేశించిన ఏపీ చుక్కల భూములు (పునఃపరిష్కార రిజిస్టర్ ఆధునికీకరణ) సవరణ బిల్లు, ఆంధ్ర ప్రాంత ఇనామ్‌ల (రద్దు, రైత్వారీలోనికి మార్పిడి) సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా.. వీటిపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. వక్ఫ్ భూముల్ని లీజుకిస్తే ముస్లింలకు మేలు గుంటూరు నగరంలోని వక్ఫ్ బోర్డు భూములను నామమాత్రపు ధరలకు లీజుకిస్తే నిరుపేద ముస్లింలకు మేలు కలుగుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారులు ఆ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో సర్టిఫై చేస్తున్నారని, ఈ విధానంలో మార్పు రావాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. తిరుపతిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న 60వేల మందికి హక్కులు కల్పించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోరారు. పలు మఠాలకు చెందిన భూముల్లో ఏళ్ల తరబడి వేలాది మంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని వారికి కూడా హక్కులు కల్పించాలన్నారు. రాయలసీమలో ఎంతో మందికి లబ్ధి వ్యక్తిగత ఇనామ్ భూములను రెగ్యులరైజ్ చేయడంతో రాయలసీమలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవదాయ, సర్వీస్ ఈనామ్ భూముల రెగ్యులరైజేషన్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలని, దేవాలయాలకే తగిన హక్కులు కల్పించాలని సూచించారు. డీకేటీ భూముల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక రకమైన విధానం, ఇక్కడ మరో విధానం అమలులో ఉందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో ఆ భూములు అమ్ముకోవడానికి వీలుందన్నారు. మన దగ్గర కూడా అదే రీతిలో ఆలోచన చేస్తే వేలాది మందికి మేలు జరుగుతుందన్నారు. నాలుగేళ్లలో రెవెన్యూలో ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సమగ్ర భూసర్వే గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన యజమానులకు, పత్రాలు లేని వారికి పూర్తి హక్కులు కల్పిస్తోందన్నారు. చుక్కుల భూములపై చేసే చట్టం వేలాది మందికి గొప్ప వరమన్నారు. ఏళ్ల తరబడి స్వాధీనంలో ఈ చుక్కల భూములను అమ్ముకోవడానికి వీల్లేకుండా ఉందని, 12 ఏళ్లు పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించే ఈ చట్టం చాలా గొప్పదని, వీటిపై అధికారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు: మంత్రి ధర్మాన అవినీతికి ఆస్కారం లేని రీతిలో గ్రామస్థాయిలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. మ్యుటేషన్ కోసం కూడా గ్రామం విడిచి వెళ్లనవసరం లేకుండా చేస్తామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు మూడు ప్రాంతీయ సదస్సులు నిర్వహించామన్నారు. చదవండి: ఉచితంగా ఆధార్ అప్డేట్.. వారికి మాత్రమే ఛాన్స్..! -
Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది
‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘ప్రవాహ్’లో పని చేస్తున్న భావి బరాద్ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది. కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక. ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్’గా ఫస్ట్ బ్యాచ్‌కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్ ఒకరు. ‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్. సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్. స్కూల్, కాలేజీలలో జెండర్ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్ కెరీర్‌కు సంబంధించి ప్యానల్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. ‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..) -
వలస కార్మికుల హక్కులపై వర్క్‌షాప్, టీపీసీసీ నాయకులకు ఆహ్వానం
అంతర్జాతీయ కార్మిక చట్టాలపై బీడబ్ల్యుఐ సంస్థ ఈనెల 17, 18 రెండు రోజుల పాటు చెన్నైలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు తెలంగాణకు చెందిన ఇద్దరు యువ నాయకులకు ఆహ్వానం అందింది. చట్టపరమైన న్యాయవాద శిక్షణ - వలస కార్మికుల హక్కులు (లీగల్ అడ్వకసీ ట్రైనింగ్ - మైగ్రంట్ వర్కర్స్ రైట్స్) శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం (టీపీసీసీ ఎన్నారై సెల్) గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి హాజరవుతున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యుఐ) అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ తన సభ్య యూనియన్ జగిత్యాల జిల్లాకు చెందిన 'ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్' కు ఈ ఆహ్వానం అందజేయగా ఇద్దరు యువ నాయకులను నామినేట్ చేసింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్ లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిడబ్ల్యుఐ భారతదేశంలో దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నది. అంతర్జాతీయ వలసలు, గల్ఫ్ దేశాలలో వలస కార్మికుల హక్కులు అనే అంశంపై చెన్నయిలో శిక్షణ ఇస్తారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల జ్ఞానం పెంపొందించడానికి, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ క్రింది అంశాలపై శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ వలసలను నియంత్రించే చట్టపరమైన విధాన నమూనా (పాలసీ ఫ్రేమ్ వర్క్) వ్యవస్థ భాగస్వాముల అవగాహనను విస్తరించడం. వలస కార్మికుల హక్కులను నిలబెట్టడానికి, సురక్షితమైన వలసలను ప్రోత్సహించడానికి భాగస్వామ్య సంఘాల జోక్యాలపై నవీకరణలు మరియు సురక్షిత సమాచారాన్ని సేకరించడం. కంట్రీస్ ఆఫ్ ఆరిజిన్ (కార్మికులను పంపే మూలస్థాన దేశాలు) మరియు కంట్రీస్ ఆఫ్ డెస్టినేషన్ (కార్మికులను తీసుకునే గమ్యస్థాన దేశాలు) లలో వలస కార్మికులకు అందుబాటులో ఉండి వారికి సహాయాన్ని అందించడానికి కార్మిక సంఘాలు (ట్రేడ్ యూనియన్స్) ఎలాంటి కార్యాచరణ, వ్యూహాలను కలిగి ఉండాలో చర్చిస్తారు. -
దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా " కాంతారా "
-
ICC media rights: రూ. 24 వేల కోట్లకు...
దుబాయ్: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అన్ని మ్యాచ్‌ల హక్కులను డిస్నీ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారం వేలం నిర్వహించగా... దీనిని ఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల కాలానికి (2024–2027) ఈ హక్కులు వర్తిస్తాయి. టీవీ, డిజిటల్ హక్కులు రెండింటినీ సొంతం చేసుకున్న డిస్నీ... ఇందు కోసం సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24 వేల కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. ఈ మొత్తంపై ఐసీసీ ప్రకటనలో వెల్లడించకపోయినా... గత హక్కులతో పోలిస్తే భారీ పెరుగుదల వచ్చినట్లు మాత్రం పేర్కొంది. హక్కుల కోసం డిస్నీతో పాటు సోనీ, వయాకామ్, జీ సంస్థలు కూడా పోటీ పడినా... వారెవరూ కూడా రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధపడలేదని తెలిసింది. ఐసీసీ ఇచ్చిన హక్కుల్లో పురుషుల, మహిళల వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు అండర్–19 ప్రపంచకప్ కూడా ఉంటాయి. డిస్నీ స్టార్ వద్ద ఇప్పటికే ఐపీఎల్, బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా బోర్డు డిజిటల్ హక్కులు కూడా ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌లలో హక్కుల కోసం క్రిస్మస్కు ముందు ఐసీసీ మరోసారి వేలం నిర్వహించే అవకాశం ఉంది. -
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?
‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి. రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?) కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం) - వూకె రామకృష్ణ దొర ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?
Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింతగా పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే థియేటర్లో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసినట్లే సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రీలీజ్ కావట్లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్లో చూసే ఫీల్ మిస్ అవుతారని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ పలు నివేదికల సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న 'విరాట పర్వం' ఓటీటీ రిలీజ్ డేట్‌ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
మనసును హత్తుకున్న '777 చార్లి'.. వచ్చేది ఈ ఓటీటీలోనే..
కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి తాజాగా నటించిన చిత్రం '777 చార్లి'. పెట్ డాగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న విడుదలైంది. కె. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. ఇటీవల ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ గెలుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని సమాచారం. కాగా '777 చార్లి' ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే రక్షిత్ శెట్టి కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తో తెరంగేట్రం చేశాడు. తర్వాత వచ్చి 'అతడే శ్రీమన్నారాయణ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
వందల కోట్లకు షారుక్ ఖాన్ సినిమా డిజిటల్ రైట్స్..
Shahrukh Khan Pathan OTT Rights Sold Worth 200 Crores: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు మూడేళ్లు కావొస్తుంది. ఆయన మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ 'పఠాన్' మూవీతో వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. షారుక్‌తోపాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఈ మూవీ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ కొనుగోలైంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నుంచి ఫ్యాన్సీ అమౌంట్ అందుకుందని సమాచారం. 'పఠాన్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా 'పఠాన్' చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని టాక్. 'జీరో' సినిమా తర్వాత షారుక్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన 'జీరో' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో 'పఠాన్'పై షారుక్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. చదవండి: ఆఖరికి పోలీసులు కూడా వదల్లేదు: షారుక్ ఖాన్ జిరాక్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిలీజ్‌కు ముందే భారీ ధరకు మణిరత్నం సినిమా..
Maniratnam Ponniyin Selvan OTT Rights Release Date Details: స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అయితే 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే సూపర్ ప్రిరిలీజ్ బిజినెస్ చేసింది. 'పొన్నియన్ సెల్వన్' సినిమా రెండు భాగాల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. సుమారు రూ. 125 కోట్లకు ఈ రైట్స్ సాధించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాలతో సూపర్ హిట్ కొట్టి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఒక మంచి సక్సెస్ సాధిస్తే యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందొచ్చని భావిస్తున్న తమిళ ఇండస్ట్రీ ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. -
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించొద్దు!
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించొద్దని ముస్లింలు, సామాజిక కార్యకర్తలు, మానవతావాదులు నినదించారు. హిజాబ్ విషయంలో అనవసర రాద్ధాంతం తగదని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హిజాబ్ ధారణ తమ హక్కు అని నినదించారు. ఈ సందర్భంగా నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఐద్వా నాయకురాలు సావిత్రి, డాక్టర్ నఫీసా, పీజీ స్టూడెంట్ ఆఖిల పర్వీన్ తదితరులు మాట్లాడారు. హిజాబ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ మౌలిక లక్షణమని, దీన్ని దెబ్బతీయడం తగదని అన్నారు. అన్ని మతాలు, జాతులు వారి సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగంకల్పించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ జేఏసీ నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, సాలార్‌బాషా, జాఫర్, గౌస్‌బేగ్, సైఫుల్లాబేగ్, ఖాజా, దాదు, ముష్కిన్, తాజ్, రఫీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు..
పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ! -
అందమైన బాల్యం ..వెట్టిచాకిరీలో
సాక్షి, హైదరాబాద్: మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే .. అవి తమకే’ అని మురిసిపోయేదే బాల్యం. గతించిన అందమైన బాల్యం మళ్లీ తిరిగొస్తే బావుండు అని అనుకోని వారెవరైనా ఉంటారా అందుకే నా సర్వస్వం నీకిచ్చేస్తా... నా బాల్యం నాకు ఇచ్చెయ్యరూ' అన్నారు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత డా. సి నారాయణరెడ్డి కానీ ప్రస్తుత సమాజంలో బాల్యం ఎందరికో భారం. పురిటి కళ్లు తెరవక ముందే ముళ్ళ పొదల్లో బావురుమంటోంది. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా స్పెషల్ వీడియో. -
హక్కుల కోసం గళమెత్తిన ఆఫ్గాన్ మహిళలు
-
ఐపీఎల్‌పై కన్నేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్...!
కరోనా కారణంగా ఐపీఎల్-14 మధ్యలోనే అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇప్పటికే ఐపీఎల్-14 షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఐపీఎల్-14 మ్యాచ్‌లను ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేస్తోంది. వచ్చే ఏడాది నుంది ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను డీల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడం కంపెనీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్ కాస్టింగ్‌పై కన్సేసిన రిలయన్స్..! ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాదితో ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ కాంట్రాక్ట్ ముగియనుంది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నెట్వర్క్ గ్రూప్-18, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఐపీఎల్ మ్యాచ్‌లను బ్రాడ్ కాస్టింగ్ హక్కులను పొందాలని రిలయన్స్ భావిస్తోంది. మొదలైన రిక్రూట్మెంట్ ప్రాసెస్..! ఐపీఎల్‌తో పాటు ఇతర స్పోర్ట్స్‌ను బ్రాడ్ కాస్టింగ్ చేసే ఏర్పాట్లలో భాగంగా అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. సొంత బ్రాడ్ కాస్టింగ్ టీంను కూడా రెడీ చేయనుంది. కాగా ఇతర బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లో పనిచేసే టాప్ ఎగ్జిక్యూటివ్‌లను రిలయన్స్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం డిస్నీ-హాట్‌స్టార్ ఎస్వీపీ అండ్ హెడ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఛీఫ్ గుల్షన్ వర్మ రిసేంట్‌గా జియో యాడ్స్ సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌కు చెందిన మరో యాడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా రిలయన్స్ కంపెనీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై నెట్వర్క్-18 అధికారికంగా స్పందిచలేదు. నెట్వర్క్-18 బ్రాడ్ కాస్టింగ్ సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. గతంలో రిలయన్స్ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం వేలంలో కూడా పాల్గొంది. ఇండియన్ ఎస్వీఓడీ మార్కెట్‌పై మీడియా పార్టనర్స్ ఆసియా (MPA) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. డిస్నీ, అమెజాన్, ఫేస్బుక్, జియో, సోనీ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నాయి. 2022 వరకు ఐదు సంవత్సరాల పాటు ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకోవడానికి స్టార్ ఇండియా 16347.5 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇది ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం మొదటి 10 సంవత్సరాల కోసం సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా చెల్లించిన దాని కంటే దాదాపు రెట్టింపు. -
తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
ఉబర్‌కు ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం కనీస ఉపాధి హక్కులు లభించే కార్మికులుగా తమను గుర్తించాలని దాదాపు 25 మంది డ్రైవర్లు ఒక గ్రూప్‌గా 2016కు ముందు ప్రారంభించిన న్యాయపోరాట ఫలితమిది. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్ లాగ్ ఆన్ అయిన సమయం నుంచి లాగ్ ఆఫ్ అయిన సమయం వరకూ తన డ్రైవర్లను ఉబర్ ‘‘కార్మికులుగానే’’ పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పటికే ఈ మేరకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్, ఎంప్లాయిమెంట్ అప్పీల్ ట్రిబ్యునల్, అప్పీలేట్ కోర్ట్ ఉబర్ డ్రైవర్లకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. తాజా రూలింగ్‌పై ఉబర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు. 2016కు ముందు యాప్‌ను వినియోగించిన డ్రైవర్లందరి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడతామని తెలిపారు. కోర్టు ప్రకటన తరువాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ఉబెర్ షేర్లు 3.4 శాతం పడిపోయాయి. -
న్యాయ వ్యవస్థలో సుపరిపాలన పునాదులు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ తనవంతు కర్తవ్యాన్ని భేషుగ్గా నిర్వర్తిస్తోందని, భారత రాజ్యాంగాన్ని ఇది బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో భారత న్యాయస్థానాలు ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్ న్యాయవ్యవస్థ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా మోదీ తపాలా బిళ్లను విడుదల చేశారు. ప్రత్యక్ష ప్రసారాల ఆరంభం.. కోవిడ్ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిగా ప్రారంభించింది గుజరాత్ హైకోర్టేనని మోదీ చెప్పారు. ‘దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్లైన్ విచారణలు సాధ్యమయ్యాయి’ అని మోదీ అన్నారు. డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మోదీ చెప్పారు. దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని మోదీ తెలిపారు. -
పౌరసత్వం హక్కులకే కాదు.. బాధ్యతలకు కూడా..
నాగ్‌పూర్: పౌరసత్వం అనేది కేవలం హక్కుల కోసం మాత్రమే నిర్దేశించినది కాదని.. సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సైతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే పేర్కొన్నారు. రాష్ట్రసంత్ టుకడోజీ మహరాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీలో (ఆర్టీఎమ్ఎన్యూ) శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తిగత అనుభవంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో మేధాశక్తిని అభివృద్ధి చేయడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే విద్య ప్రాథమిక లక్ష్యమని అన్నారు. క్రమశిక్షణ విద్యలో భాగమని పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఇతరులను కలుపుకుపోవడం, అన్యోన్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సమాజం మన నుంచి ఏం కోరుకుంటుందో అలాంటి లక్షణాలు యువతలో పెంపొందేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఏ వ్యక్తి అయినా కృషితోనే ఓ స్థాయికి చేరుకుంటారని.. ఆ స్థితికి చేరడానికి దోహదపడిన అంశాలను ఇతరులు సృష్టించారనేది గుర్తించాలని చెప్పారు. -
యప్ టీవీకి బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ హక్కులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం యప్‌టీవీ బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని యప్‌టీవీ యూజర్లు తమ ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్‌లను ఈ ఫ్లాట్‌ఫాంపై వీక్షించే వెసులుబాటు కలిగింది. బీసీసీఐ హోం సీజన్లో శ్రీలంక, ఆస్ర్టేలియా, సౌత్ఆఫ్రికా, ఇండియాలు తలపడే మ్యాచ్‌లను క్రీడాభిమానులు లైవ్‌లో చూసే అవకాశం యప్‌టీవీ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూరప్, మధ్య ఆసియా, సార్క్ దేశాలకు చెందిన యూజర్ల చెంతకు ఈ ఆసక్తికర స్పోర్టింగ్ ఈవెంట్‌ను యప్‌టీవీ చేరవేస్తోంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను తమ యూజర్లు లైవ్‌లో యాక్సెస్ చేసుకునేందుకు తాము బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నామని యప్‌టీవీ వ్యవస్ధాపక సీఈఓ ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు యప్టీవీలో వీక్షించవచ్చు. యప్‌టీవీ.కాంను లాగ్ అవడం లేదా స్మార్ట్‌టీవీల్లో యప్‌టీవీ యాప్‌ల ద్వారా వివిధ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డివైజ్‌ల్లో ఆయా మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చని యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?
1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా జరుపుకుంటున్నాం. మరొకచోట తమ జెండా కావాలంటున్న నాగాల డిమాండ్‌ను తోసిపుచ్చుతూనే వారి సాంస్కృతిక ఆకాంక్షలను జాతీయ పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. భారత్ నేడు ఆ స్థితికి చేరుకున్నదనే చెప్పాలి. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. భారత్‌ను ప్రపంచదేశాల దృష్టిలో బలోపేతం చేసిన ఈ అతిశయ జాతీయవాదాన్ని మరింతగా దృఢపరచాల్సిన అవసరం ఉంది. నెపోలియన్ బతికి ఉంటే సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నను సంధించి దాన్ని తిరిగి ఎలా వదిలేసి ఉంటాడు అనే అంశానికి సంబంధించి గూగుల్ మరింత వైవిధ్యపూరితమైన ఊహను నాకు చెబుతోంది. 1970ల నాటి ప్రామాణిక నాటకం వాటర్లూ లో నటించిన రాడ్ సై్టగర్ ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఈ వారం నా మదిలో మెదులుతోంది. సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాడ్ చెప్పిన సింపుల్ సమాధానం ఇలా ఉంటుంది. అది ఫర్నిచర్‌కు చెల్లించిన అధికమొత్తం ధర మాత్రమే. 19వ శతాబ్దం మొదట్లో సింహాసనానికి ఇంకా ప్రాధాన్యత ఉండేది. అయితే ఆధునిక ప్రపంచంలో చాలాచోట్ల సింహాసనం ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు మన చైతన్యంలోంచి మరుగుపడిపోయిన జాతీయ రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు, జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు వంటి చిహ్నాలను నెపోలియన్ ఆలస్యంగానైనా సరే ఉపయోగించి అప్పట్లో జాతీయ స్ఫూర్తిని తిరిగి తీసుకొచ్చాడు. అయితే ఆ గత చరిత్రకు చెందిన చిహ్నాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. చాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా మన క్రీడాకారులు జాతీయ చిహ్నాలకు చాలా ప్రాధాన్యమిస్తుం టారు. అయితే ఆధునిక జాతీయ రాజ్యం మరింత స్థిరంగా, సురక్షితంగా పాతుకుపోయింది కాబట్టి అలాంటి గత చిహ్నాలకున్న విలువ ఇప్పుడు ఒక పురాజ్ఞాపకంగా మాత్రమే కొనసాగుతోంది. కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, చిహ్నాలు కూడా మారుతున్నాయి. జెండా అంటే ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు ఇప్పటికీ మనం విలువ ఇస్తున్నందుకు కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చిరకాలం నుంచి కొనసాగుతున్న రక్తప్లావిత తీవ్రవాదం కొనసాగుతున్న నాగాలాండ్‌లో కొనసాగుతున్న శాంతి చర్చలు చివరికి ముగింపుకొస్తున్న తరుణంలో జెండా అంటే ఏమిటి అనే ప్రశ్నను తిరిగి వేసుకోవలసి వస్తోంది. తాము గతంలో భయంకరమైన తప్పులు చేశానని అటు భారత ప్రభుత్వం, ఇటు నాగాలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. హింస ఇంకా ఎంతోకాలం పనిచేయదని కూడా గ్రహించారు. అయితే నాగాలు తమ సొంత జెండాను ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానికి ఇష్టపడటంలేదు. అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, సాంస్కృతిక, జాతిపరమైన సందర్భాల్లో మీరు మీ జెండాను పట్టుకోవచ్చని ప్రభుత్వం ఇప్పడు అంగీకరిస్తోంది. అలాగయితే తమ జెండాకు ఏ ఎన్జీవో అయినా పెట్టుకునే సాధారణ జెండా గుర్తింపు మాత్రమే ఉంటుందని నాగాలు వాదిస్తున్నారు. అత్యుత్తమ చర్చ ఏదంటే రెండు పక్షాలు అతి తక్కువ అసంతృప్తితో మాత్రమే చర్చల బల్లనుంచి వెళ్లిపోగలగడమే. చర్చల ఫలి తంలో తమకు ప్రాధాన్యత లేనప్పటికీ ఇరు పక్షాలూ తాము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవడం అని దీనర్థం. కానీ ముయ్‌వా నాగాలకు జెండాను గుర్తించకుండా సంధిపై సంతకం చేయడమంటే పెద్ద అవమానంగా కనిపిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ముందు ఉన్న చాయిస్ కూడా కఠినంగానే ఉంది. ఈ అక్టోబర్ 31 గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ జెండాను దింపివేసి సర్దార్ పటేల్ జయంతి కూడా కలిసివస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వేడుకలు జరుపుకుంది. భారతజాతీయ వాదం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిన నేపథ్యంలో కేవలం 30 లక్షల మంది ప్రజలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఆదివాసీ రాజ్యం ముందు కేంద్రం ఎలా తలొగ్గి ఉంటుంది మరి? అయితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దివంగత ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంతో పోల్చడానికి కూడా వీల్లేదు. రాజ్యాంగ పరిధిలోనే చర్చలు కొనసాగాలని భారత్ పట్టుబడితే కశ్మీర్ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించినప్పుడు వాజ్‌పేయి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చారు.. ‘మేం మానవత్వ పరామితులతో చర్చలు జరుపుకుంటాం’. కానీ మోదీ ప్రభుత్వం కాస్త కఠినవైఖరి వైపుకు మళ్లింది. పట్టువిడుపులు లేని దాని వైఖరికి మొరటు జాతీయవాదం కూడా కాస్త తోడైంది. అలాంటి జాతీయవాదం తన చిహ్నాల తొలగింపు పట్ల సుముఖత ప్రదర్శిం చదు. అందుకే ఒక రాష్ట్ర పతాకను దింపిపారవేసిన ఘటనకు గాను అది వేడుక చేసుకుంటోంది. సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ జాతీయ గీతాలాపనను నిలిపివేయడానికి దేశంలో ఏ సినిమా హాల్ కూడా ధైర్యం చేయడం లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు లేచి నిలబడకుంటే అలాంటివారిని మూకుమ్మడిగా వేధిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నూతన తరం భారతీయులు తాము ఒట్టి దేశభక్తులం మాత్రమే కామని జాతీయ వాదులం కూడా అని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది. భారతదేశం మొత్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే చిహ్నం, ఒకే నేత ఉండాలనే తన సైద్ధాంతిక వ్యవస్థాపకుల దార్శనికతకు బీజేపీ చాలా సమీపంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మీరు కూడా నాలాగే 1960లలో పుట్టిన వారే అయితే, ఆ దశాబ్దంలోకి వెళ్లి చూసినట్లయితే భారత్ నేడు చేరుకున్న స్థితి అసాధ్యం అనే భావించేవారు. 1961–71 మధ్య పదేళ్లలో మనం నాలుగు పూర్తి యుద్ధాలను చవిచూశాం. గత అయిదు దశాబ్దాలలో దేశం అన్ని తీవ్రవాద ఉద్యమాలను, వేర్పాటు రాజకీయ ఉద్యమాలను అణిచిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతుందని మనం అప్పట్లో ఊహించి ఉండేవారమా? ఆ ప్రమాదకరమైన దశాబ్దంలో భారత్ నిలువునా చీలిపోగలదని అమెరికన్ స్కాలర్ సెలిజ్ హారిసన్ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మేధావుల అభిప్రాయాలు తప్పని భారత్ నిరూపించింది. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. 2003 కాలానికి వెనక్కు వెళ్లి ఫోక్రాన్ అనంతరం భారత్ అనుసరించిన కఠిన దౌత్య పరిస్థితుల్లోకి వెళ్లి చూడండి. ఇక్కడే భారతీయ వ్యవస్థ మూలమలుపు తిరిగింది. తర్వాత 15 ఏళ్లలో భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలిచేటట్టుగా పరిణతితో వ్యవహరించింది. ఈ క్రమాన్ని వెనక్కు తిప్పడం అంత సులభంకాదు. ఎవరినైనా పక్కకు నెట్టివేయగల శక్తి, ఏ భూభాగాన్నైనా ఆక్రమించుకునే బలం ఇప్పుడు భారత్‌కు ఉన్నాయి. ఈ భద్రతను భారతీయులమైన మనం అనుభవించడంతోపాటు, ఆ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనికి భిన్నంగా మనం కొన్ని పాత అభద్రతా భావాలను లేవనెత్తుతున్నాం. మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ రాజకీయాల్లో మీకు కారణాలు కనిపిస్తాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం, కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా విమర్శకులు ఈ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ, దీన్ని ఎదుర్కోడానికి తగి నంత బలం భారత్‌కు ఉంది. ఆగస్టు 5న కశ్మీర్లో మౌలిక మార్పులు చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఈ రోజు వరకూ ఎప్పుడూ విమర్శించే మూడు దేశాలు తప్ప ఏ ఇతర దేశం ఆ చర్యలను వెనక్కు తీసుకోమని భారత్‌ను కోరలేదు. అది భారతదేశపు అంతర్గత వ్యవహారంగా భావించే మిగిలిన దేశాలన్నీ మౌనం వహించాయి. అంతమాత్రాన, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగదు. కశ్మీర్లో చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి రాజకీయ నాయకులను, ప్రముఖులను ఎంతో కాలం నిర్బంధంలో ఉంచరు. సమాచార నిర్బంధం కూడా తొలగిపోతుంది. లేకపోతే స్నేహపూరిత ప్రభుత్వాలు కూడా మనవైపు నిలిచే పరిస్థితి ఉండదు. సాధారణ స్థితి నెలకొంటే కశ్మీర్ కూడా జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషిస్తుంది. నేడు కశ్మీర్ సమస్య అంటే పాక్ నుంచి ముప్పు, ఇస్లాం ఉగ్రవాదం, జిహాదీ తదితరాలు. ఇది జాతీయ భద్రతకు విచ్చిన్నపరిచే ప్రత్యక్ష ప్రమాదం. వీటిని దృఢంగా ఎదుర్కొంటున్న ఈ అతిశయిం చిన జాతీయవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కోణం నుంచి చూస్తే మనం చాలా బలంగా ఉన్నాం అని చెప్పడానికి ఎన్నికల శాతాలు అవసరం లేదు. ఎందుకంటే, అప్పుడు ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. 1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా చేసుకుంటున్నాం. మరో చోట తమ జెండా కావాలనే వారి ఆకాంక్షలను పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
తల్లి హక్కు
ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు ఒక సహచరుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘అయ్యా! ఫలానా వ్యక్తి ఉదయం నుండి సక్రాత్ స్థితిలో.. అంటే చివరి ఘడియల్లో.. నరకయాతన అనుభవిస్తున్నాడు’’ అని తెలిపాడు.ప్రవక్త (స) ఆ వ్యక్తి వద్దకు వచ్చి, ‘‘ఇతను ఎవరికైనా ఋణ పడి ఉన్నాడా?’’ అని వాకబు చేసారు. అలాంటిదేమీ లేదు అని తెలిసింది. ‘‘మరి ఎవరైనా ఆయనంటే అయిష్టంగా ఉన్నారా?’’ అని అడిగారు. అక్కడ ఉన్న వారు ‘‘ఇతని తల్లి ఇతనంటే కాస్త అయిష్టతగా ఉంది’’ అని తెలిపారు.ప్రవక్త (స) తల్లిని పిలిచి ఆమె కుమారుడ్ని క్షమించవలసిందిగా కోరారు. కాని ఆమె ఎంతకూ వినకపోవడంతో, సహచరులను కట్టెలు పోగేసి మంట రాజేసి అతనిని అందులో వెయ్యమని ఆజ్ఞాపించారు.అప్పుడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తన కొడుకును అగ్నిలో వెయ్యొద్దని ప్రాధేయపడింది. ‘‘చూడు తల్లీ, ఇక్కడ నీ కుమారుడిని మంటల్లో వేయడాన్ని భరించలేక పోతున్నావే, రేపు పరలోకం శాశ్వతంగా నరకాగ్నిలో కాల్చబడటం నీకు ఇష్టమేనా’’ అని అడిగారు ప్రవక్త (స).‘‘లేదు ప్రవక్త (స), లేదు. నేనే కాదు ఏ తల్లి కూడా భరించలేదు. అల్లాహ్ కరుణ కోసం నేను నా కుమారుడ్ని క్షమిస్తున్నాను’’ అని అంది. ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది.‘‘ఈ జీవితం శాశ్వతమైన మరణానంతర పరలోక జీవితానికి ఒక పరీక్ష. ఇక్కడ దైవం హక్కులలో లోటు జరిగినా దైవం క్షమిస్తాడు కానీ సాటి మనుషుల హక్కులలో చిన్న లోపం జరిగినా వారు క్షమించనంత వరకు అల్లాహ్ కూడా క్షమించడు’’ అని ప్రవక్త (స) తెలిపారు.ముఖ్యంగా తల్లితండ్రుల హక్కులు. అందునా తల్లి హక్కు. అందుకే ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది’ అని. కన్నవారి కంట కన్నీరు మన సకల అనర్ధాలకు మూలం అని గ్రహించి వారి సేవలో తరిద్దాం. ఇహ పరాల్లో సాఫల్యం పొందుదాం. – షేక్ అబ్దుల్ బాసిత్ -
అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నారు
నాగ్‌పూర్: ప్రజలు తమ హక్కులు, ప్రయోజనాల విషయంలో మోసపోతుండటానికి, దోపిడీకి గురవుతుండటానికి మూల కారణం వారికి చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన లేకపోవడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ ఆదివారం చెప్పారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రజలకు హక్కుల గురించి, స్వీయ రక్షణ గురించి అవగాహన కల్పించాలని అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల సమావేశంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. అందరికీ న్యాయాన్ని, సంక్షేమ పథకాల ఫలాలను అందించేందుకు, పేదలపై సామాజిక వివక్షను తొలగించేందుకు న్యాయ సేవల సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన న్యాయ సేవలను అందించాలంటే చట్టాలపై అవగాహన, సాంకేతికత అందుబాటులో ఉండటం కూడా ముఖ్యమన్నారు. -
హక్కుల కోసం నినదించడం బాబు గిట్టని అంశం
-
ప్రవక్త దృక్కోణంలో హక్కులు... బాధ్యతలు
సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ముహమ్మద్ ప్రవక్త(స), ప్రజల సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ధర్మం వారికిచ్చినటువంటి హక్కులను కూడా విశద పరిచారు. ముఖ్యంగా మానవ హక్కులను గురించి, వ్యక్తిగత స్వేఛ్ఛను గురించి విడమరిచి చెప్పారు. పరుల సంపదను హరించడం గురించి ఖురాన్ ఆదేశాలను వివరిస్తూ, ‘మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా, అక్రమంగా కబళించకండి’. అని చెప్పారు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది. ‘ఒకజాతి ప్రజలు మరోజాతి ప్రజలను అవహేళన చేయవద్దు. ఒకరికొకరు తమ ప్రతిష్టలకు భంగం కలిగించుకో వద్దు. మారుపేర్లతో ఒకరినొకరు పరిహసించుకోవద్దు. ఒకరి వెనుక ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు. నిందలు వేసుకోవద్దు. ప్రవక్త మహనీయులు తమ చివరి హజ్ యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైనది:’ప్రజలారా! బాగా వినండి. అజ్జానకాలపు దురాచారాలన్నీ అంతమైపొయ్యాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీ సేవకులను తక్కువ దృష్టితో చూడకండి. మీరు తినేలాంటి భోజనమే వారికి పెట్టండి. మీరు ధరించే లాంటి బట్టలే వారికీ సమకూర్చండి. మహిళలూ మీలాంటివారే. మీకు వారిపై ఏవిధంగా హక్కులున్నాయో, అదేవిధంగా వారికీ మీపై హక్కులున్నాయి. పరస్పరం హాని తలపెట్టుకోరాదు. ప్రాణాలు తీసుకోరాదు. ప్రళయకాలం వరకు కూడా..నేను మీకోసం రెండువస్తువులు వదిలి వెళుతున్నాను. మీరువాటిని దృఢంగా పట్టుకోండి. ఎన్నటికీ దారి తప్పరు. ఒకటి పవిత్రఖురాన్, రెండవది సున్నత్, అంటే నా సాంప్రదాయం’. అంతేకాదు, మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోకండి. ఇతరులపై గూఢచర్యానికి పాల్పడకండి. మీ స్వగృహం తప్ప ఇతరుల ఇళ్ళలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి’’ అని హితవు చేశారు. ఏవ్యక్తినైనా శిక్షించాలంటే, న్యాయస్థానంలో అతడి నేరం రుజువుకావాలి. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించాలని ఆదేశిస్తూ, వారి మతవిశ్వాసాలకు, హక్కులకు భంగం కలిగే చర్యలన్నిటినీ ఆయన నిషేధించారు. ఈ విధంగా ప్రవక్తమహనీయులు సమస్త హక్కులనూ నిర్వచించారు. మానవులు ఆ అమృత ప్రవచనాలను అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, సమాజం అన్నిరకాల అసమానతలకు, లోపాలకు అతీతంగా విశిష్ట సత్సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అల్లాహ్ మనందరికీ విజ్ఞానాన్ని, సద్బుద్ధినీ ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘కశ్మీర్‌తో బంధం పూర్తిగా తెగిపోతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35-ఏను భారత ప్రభుత్వం తొలగిస్తే కశ్మీర్‌తో పూర్తి సంబంధాలను తెంచుకున్నట్లు అవుతుందని ఆ రాష్ట్ర 2010 ఐఎఎస్ బ్యాచ్ టాపర్ షా ఫైసాల్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 35-ఏ నిఖానామాతో పోల్చుతూ ఆదివారం ట్వీటర్ పోస్ట్ చేశారు. ‘ఆర్టికల్ 35-ఏ ను తొలగిస్తే కశ్మీర్లో భారత్‌కు అక్కడ మిగిలేది ఏమీ లేదు. కశ్మీర్‌కు ఉన్న హక్కులను రద్దు చేస్తే ఇక చర్చించడానికి కూడా ఏంలేదు. అది ముగిసిపోయిన వివాహం లాంటిది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించినప్పుడు భారత రాజ్యాంగం ఇంకా అమలులోకి రాలేదని, ఒప్పందం ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించారని తెలిపారు. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాల వల్ల దేశ సమగ్రతకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. ఫైసాల్ ట్వీట్‌పై కశ్మీర్ మాజీమంత్రి, పీడీపీ సీనియర్ నేత నయీమ్ అక్తర్ స్పందించారు. ఆర్టికల్ 35-ఏను తొలగించడం మారిటల్ రేప్ లాంటిదని ట్వీట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించడమేనని ఆయన తెలిపారు. కాగా ఈ ఆర్టికల్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా రెండు రోజుల కశ్మీర్ బంద్‌కు ఏర్పాటు వాదులు పిలుపునిచ్చారు. -
ప్రపంచకప్ రేడియో ప్రసార హక్కులు సోంతం చేసుకున్న బీబీసీ
-
కదిలే శవాలుగా మారొద్దు
ఏలూరు (మెట్రో) : బాధ్యతలు విస్మరించి కేవలం హక్కుల కోసం పోరాటం చేసే టీచర్లు ఉన్నంత వరకూ విద్యావ్యవస్థలో మార్పు రాదని, కదిలే శవాలుగా ఎవరూ మారొద్దని కలెక్టర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విద్యాశాఖాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ఎన్ని సంస్కరణలు అమలు చేసినా పనిచేయాలనే భావన లేనప్పుడు భావిభారత పౌరులను తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. నీతికథలు, వ్యాయామ విద్య, స్కిల్ డెవలప్మెంట్ వంటి ప్రత్యేక పుస్తకాలు ప్రింట్ చేసి పాఠశాలలకు అందించినా నేటికీ బోధన జరగలేదన్నారు. సింగపూర్‌లో 99 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా విద్యాబోధన సాగించాలని ఆయన హితవు పలికారు. 20 పాఠశాలల్లో వంటగ్యాస్ బదులు కట్టెల పొయ్యిపై విద్యార్థులకు వంట చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పాఠశాలల్లో క్రీడాప్రాంగణాలు, సభావేదికల నిర్మాణాలు ఈ వేసవిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి పిల్లల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయాలన్నారు. డీఈఓ సి.రేణుక, సర్వశిక్షాభియాన్ పీఓ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పైసా పూర్తిగా వినియోగించండి జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్మాణం చేపట్టే అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి మంజూరైన రూ.1.20 కోట్లలో ప్రతి పైసా పూర్తిగా వినియోగించి అత్యాధునికంగా నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అంబేడ్కర్ భవన నిర్మాణం పూర్తి పారదర్శకతతో చేపట్టాలన్నారు. -
షారుక్ రీమేక్?
కమల్‌హాసన్ రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘హే రామ్’ (2000). ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో తెలిసిందే. మూడు నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. హిందీ–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. విశేషం ఏంటంటే... ఇప్పుడు ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారట. ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ ఇండియాను సందర్శించినప్పుడు అదే వేడుకలో పాల్గొన్న కమల్‌హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు.‘‘అప్పట్లో హే రామ్’ సినిమాను షారుక్ ఖాన్ కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేశారు. ఈ సినిమాలో నటించినందుకు తనకు వాచ్ మాత్రమే ఇవ్వగలిగాను. ఎందుకంటే సినిమా పూర్తయ్యేసరికి అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. కానీ ఇప్పుడు షారుక్ ఓ వాచ్ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ ఇటీవలే భరత్ షా (‘హే రామ్’ సినిమా కో–ప్రొడ్యూసర్) దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ సినిమా మెమొరీస్ అతని దగ్గర ఉండి ఉంటాయి. ఎందుకంటే అతను ఈ సినిమా కోసం ఫ్రెండ్షిప్, సర్వీస్ ఇచ్చాడు కాబట్టి’’ అని పేర్కొన్నారు కమల్. ఇంతకీ ‘హే రామ్’ రైట్స్‌ను షారుక్ సొంతం చేసుకున్నారంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తారని ఊహించవచ్చు. -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోకుంటే మోసపోయే ఆస్కారముందని జాయింట్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సదస్సును జేసీ ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులతో వస్తు సేవలు, కొనుగోళ్ల సందర్భంగా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తు సేవలు, కొనుగోలు వ్యవహారాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ వస్తువుకు రశీ దు తీసుకోవాలని సూచించారు. డీఎస్ ఓ శారదాప్రియదర్శిని మాట్లాడుతూ వినియోగదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, బా ధ్యతలు తెలుసుకోవాలన్నారు. వినియోగదారుల వ్యవహారాల నిపుణు లు, ఎంవీఎస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ మాట్లాడు తూ వినియోగదారులు ప్రశ్నించే తత్వా న్ని అలవర్చుకోవాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ దినేష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్, మున్సిపల్ కమీషనర్ సురేందర్, వినియోగదారుల క్లబ్ కన్వీ నర్ బాల్‌లింగయ్య పాల్గొనగా.. రెవె న్యూ సమావేశ మందిరం ఎదుట పలు శాఖల స్టాళ్లు ఏర్పాటుచేశారు. -
వినియోగదారుడా మేలుకో..!
కొనే ప్రతీ వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాళ్లు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతుంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కులు, ఏర్పాటైన పరిరక్షణ చట్టం, ఫిర్యాదు ఏ విధంగా చేయాలనే వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – ఇందూరు(నిజామాబాద్ అర్బన్) వినియోగదారులెవరు..? వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులమే. చట్టంలో ఏముంది...? భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్ ఫోరమ్స్’ను ప్రతీ జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్‌గా మూడు విభాగాలుగా విభజించారు. జిల్లా స్థాయి కేంద్రానికి రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షుడిగా, మరో ఇద్దరు మెంటర్లుగా ఉంటారు. మెజారిటీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఫోరంలోని కేసులపై తీర్పు ఇస్తారు. వస్తువు లేదా సేవ విలువ, కోరే నష్ట పరిహారం రూ.లక్ష వరకు అయితే కోర్టు ఫీజు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల పైన అయితే రూ.500 నామమాత్రపు కోర్టు ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల హక్కులు... భద్రత హక్కు కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్‌మార్క్, వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే కొనుగోలు చేయాలి. సమాచారం, ఎంపిక హక్కు.. వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత, పరిమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచార పొందటం కూడా ఒక హక్కే. నిర్ణయం తీసుకునే ముందు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే అనేక రకాల వస్తువులు, సేవలను తగిన, సరసమైన ధరలలో పొందటం వినియోగదారుల హక్కు. లభిస్తున్న వస్తువులు, సేవలలో ఏది పొందాలనే ఎంపిక హక్కు కూడా ఉంది. అభిప్రాయం వినిపించే హక్కు.. వినియోగదారుల సంక్షేమార్థం వినియోగదారులు ఎవరైనా సరే వినియోగదారుల వేదికలపై అభిప్రాయాన్ని వినిపించవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాల్లో ప్రాతినిథ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పర్చుకోవడం ప్రాథమిక హక్కు. అలాగే అన్ని విషయాలు తెలిసిన వారు కావడానికి తగిన విజ్ఞానం, నైపుణ్యం, జీవన పర్యంతం పొందడం కూడా ఒక హక్కే. న్యాయం పొందే హక్కు.. అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్దమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు... అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు. పర్యావరణ హక్కు.. పర్యావరణానికి ఏ హానీ కలుగకుండా ఉండే వస్తువులను, సేవలను పొందటం వినియోగదారులకు హక్కే. దీనిపై ప్రశ్నించడానికి సర్వ హక్కులు కల్పించారు. కొనుగోలు విషయంలో సూచనలు... కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చింతగా గమనించాలి. మందులు–ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్ ఉత్పత్తులపై తప్ప కుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్ టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చు. వినియోగదారులు బాధ్యతలు.. - అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి - గుడ్డిగా ఏ వస్తువులు కొనవద్దు - కొనే వస్తువు గురించి సమాచారాన్ని సేకరించాలి - మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్త వహించండి - వస్తువుల నాణ్యతపై రాజీ పడవద్దు, నాణ్యమైనవే కొనాలి - కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదును అడిగి తీసుకోవాలి - వస్తువు విషయంలో గ్యారంటీ/వారంటీ కార్డును షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతాయి - వాసిరకం వస్తువుల పట్ల, మోసపూరిత వ్యాపావస్తుల పట్ల వినియోగదారుల ఫోరాంను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు ఫిర్యాదు చేయడానికి గల కారణాలు.. ఒక వ్యాపారుడి ద్వారా, డీలర్ ద్వారా గాని వినియోగదారుడు నష్టపోయి ఉంటే సదరు వ్యక్తిపై లేదా సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు. వస్తువులో లేదా ప్రొడక్ట్ ఒకటి అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు సర్వీసు విషయంలో డీలర్ అశ్రద్ధ చేసేటప్పుడు, అసలు ధర కంటే ఎక్కువ మొత్తం సదరు వ్యాపారుడు, డీలర్ గాని వసూల్ చేసినప్పుడు, మరి ఏ ఇతర విధంగా నష్టపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ఎలా చేయాలంటే..? ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. ఫిర్యాదులో ఏం రాయాలి..? ఫిర్యాదుదారు పూర్తి పూరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి. పరిహారం బట్టి ఫోరం... - రూ.20 లక్షల విలువ వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. - రూ.20 లక్షల విలువ నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్‌లో.. - రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి. - కొనుగోలు చేసిన లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం చూపినచో ఆపై సంవత్సరం వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ సంప్రదించవచ్చు.. ఎం. రాజేశ్వర్, జిల్లా వినియోగదారులు సమాచార కేంద్రం చైర్మన్ కలెక్టర్ కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ గది పక్కన, నిజామాబాద్ (93964 51999) కృష్ణప్రసాద్, డీఎస్వో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ప్రగతిభవన్ చివరి అంతస్తు, నిజామాబాద్ (80083 01506) -
మహిళా పోరాట ప్రస్థానం
సందర్భం సమాజంలో స్త్రీలకు పురుషులతోపాటు సమాన హక్కులు, అవకాశాలు కావాలని.. నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కావాలని, వనరులు, భూములు, నివాసం, ఉత్పత్తి సాధనాలపై తమ వాటా కోసం పోరు బాటలో నడవటమే మహిళా ఉద్యమాల లక్ష్యం. ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) గత నాలుగు దశాబ్దాలకు పైగా మహిళలపై జరిగే అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మహిళా హక్కుల సాధన కోసం పోరాడుతోంది. మహిళా ఉద్యమాలతోపాటు అనేక పోరాటాలను నిర్వ హించి రాష్ట్రంలో బలమైన సంఘంగా గుర్తింపు పొందింది. స్త్రీలపై జరిగే అన్ని రకాల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పీవోడబ్ల్యూ మహిళా కార్యకర్తల్ని రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో, శ్రామికవర్గ మహిళా ఉద్యమాన్ని నిర్మించే ఆశ యంతో భద్రాద్రి కొత్తగూడెంలో అక్టోబర్ 21, 22, 23 తేదీలలో తెలం గాణ రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహించుకోబోతోంది. సమాజంలో స్త్రీలకు పురుషులతోపాటు సమాన హక్కులు, అవ కాశాలు కావాలని.. నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కావాలని పీవోడబ్ల్యూ పోరాడుతోంది. వనరులు, భూములు, నివాసం, ఉత్పత్తి సాధనాలపై తమ వాటా కోసం, నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం కృషి చేస్తోంది. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు, సామాజిక అణచివేతలకు, రాజ్యహింసకు వ్యతిరే కంగా దృఢతరమైన పోరాటాన్ని సాగిస్తున్నది. శ్రామిక మహిళా విముక్తి లక్ష్యంగా, గ్రామీణ, ఏజెన్సీ మహిళా ఉద్యమ నిర్మాణం ప్రాథమికమైన దిగా భావించి ఆ వర్గాల మహిళలను పోరాటాలలో సమీకరించడానికి కృషి చేస్తున్నది. విద్యార్థినులు, ఉద్యోగినులు, పట్టణ, నగర మధ్య తర గతి మహిళలు తదితర అన్ని సెక్షన్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి పోరాటాలను నిర్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో ప్రజ లను నమ్మించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వా మ్యాన్ని కాపాడుతానని, నక్సలైట్ ఎజెండాను అమలు పరుస్తానని, మహి ళల సంక్షేమాన్ని అమలు చేస్తానని కేసీఆర్ ప్రమాణం చేశారు. సీఎం అయిన తర్వాత ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక్క మహిళకు కూడా క్యాబినెట్లో చోటు కల్పించలేదు. షీ టీమ్స్ పేరుతో ఊదరగొడుతూ మహిళల భద్రతను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఇక్కడి వనరులను, భూములను, సంపద లను ఏవీ వదలకుండా గుంజుకుంటున్నారు. తమ హక్కుల కోసం పోరా డుతున్న ఉద్యమకారులపై లాఠీచార్జీ చేయించి, అక్రమ కేసులు బనాయిం చారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై అణచివేత, లైంగిక దాడులు, హింస పెరుగుతోంది. గత మూడున్నరేళ్లుగా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరివ్వలేదు. వేల ఉద్యోగాలూ ఇవ్వలేదు, ఒక కొత్త పరిశ్రమ స్థాపించలేదు. కానీ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా మార్చి వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణను పోరాడి సాధించుకున్న ప్రజలు అనన్య త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను నేడు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చే ప్రయత్నం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజ్యహింస పెచ్చరిల్లిపోయి తెలంగాణలోని ఆదివాసులు, దళితులు, ప్రజాస్వామికవాదులు బతకలేని పరిస్థితి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాల మీద విపరీతమైన నిర్బంధం ఏర్పరిచింది. దీనిపై ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు వీరోచిత పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం మరింత నిర్బంధం పెంచుతున్నది. ఇందులో భాగంగానే నేరెళ్లలోని దళితులను చిత్రహింసలకు గురిచేయడం. మంతెన మధుకర్ ఘటన, జనగామ నరేష్ సంఘటన, భోంపల్లి శ్యామల ఉదంతం... ఇలా దళితులపై జరు గుతున్న దాడులకు పరాకాష్ట దశను చూస్తున్నాం. తాడ్వాయి మండలం లోని జలంచ గ్రామంలో ఆదివాసీలను చెట్టుకు కట్టేసి కొట్టారు. వారికి నిలువ నీడ లేకుండా చేసి, తిండి పదార్థాలను బుగ్గిపాలు చేసారు. గొత్తి కోయలను వెంటాడి తరుముతూ వారిని ఈ దేశ పౌరులుగా కూడా పరిగణించడం లేదు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో పాటు ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా ధర్నాచౌక్ ఎత్తివేసి రాజ్యాంగ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మహిళలపైనే కాకుండా సమాజం లోని అన్ని వర్గాల ప్రజలపై సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు వ్యతి రేకంగా సమైక్య పోరుకు పిలుపునిస్తున్నాం. (కొత్తగూడెంలో అక్టోబర్ 21, 22, 23 తేదీలలో పీవోడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా) వి. సంధ్య వ్యాసకర్త పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ‘ 98490 18471 -
హక్కును హరిస్తే, బతుకు బజారే!
సమకాలీనం బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్నచోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతోఅంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు హద్దుండదు. కుక్క తోకనూపడమా? తోకే కుక్కనూపడమా? ఏం జరుగుతోందన్నది ముఖ్యం! విశిష్ట గుర్తింపు కార్డు, ఆధార్‌లో పాటించే పద్ధతుల చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిన ‘వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు’ పరిధిలో పరిశీలించాలా? లేక, ఆధార్ ఓ మంచి ప్రక్రియ గనుక దాని నీడలో, అసలు భారత పౌరులకు గోప్యత ప్రాథమిక హక్కేనా అని నిర్ణయించాలా? ఇదీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల సారం. సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఏర్పరచిన తొమ్మండుగురు జడ్జీల ధర్మాసనం ముంది పుడు వాదనలు సాగుతున్నాయి. అవి ముగింపునకు వస్తున్న తరుణంలో, ఈ సంవాదం రేపుతున్న సందేహాలెన్నో! ‘ఆధార్’ను కాసేపు పక్కన పెట్టి చర్చిం చినా, పౌరులకు బోలెడంత వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికనేక పార్శా్వ లుంటాయి. అవి గోప్యంగా ఉంచుకోవాలనే స్వేచ్ఛా భావన ఉంటుంది. సదరు గోప్యతను ప్రభుత్వాలు కాపాడాలనే ఆశ, అనుచితంగా అందులోకి చొరబడే వాళ్లని శిక్షించాలనే ఆకాంక్ష సహజం! వాదనలెలా ఉన్నా ఓ హక్కు, హక్కు కాకుండా ఎలా పోతుంది? పైగా, మారుతున్న కాలమాన పరిస్థి తుల్లో... ఉన్న హక్కులకు భద్రత కల్పిస్తూ, చట్టాలకు పదును పెట్టాల్సింది పోయి వాటిని నీరు గార్చడం దారుణం! సర్కారు కనుసన్నల్లో సమాచార వ్యవస్థను గుప్పిట పట్టిన ప్రయివేటు శక్తులు పౌరుల గోప్యతను గాలికొదిలి, సగటు మనిషిని నిలువునా గుడ్డలిప్పి నడిబజార్లో నిలబెడుతున్న సంధికాల మిది! శాస్త్రసాంకేతికత పుణ్యమా అని ఇతరుల వ్యక్తిగత సమాచార వ్యవస్థ (డాటా) పరిధిలోకి ఎవరైనా చొరబడటం తేలికైన రోజులివి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే కాదంటే, దీనికొక రాజ్యాంగ భద్రతే లేదంటే, కార్పొరేట్ శక్తులు అనుచితంగా చొరబడటం ఒక ఆటవిడుపవుతుంది. కేంద్రీకృతంగా అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే సర్కార్లకు ఇక అడ్డూ అదుపుండదు. తమ వర్తక, వాణిజ్య, రాజకీయార్థిక ప్రయోజనాల కోసం పౌరుల కనీస హక్కుల్ని కాలరాచే తీరు విలువల పతనానికే దారితీస్తుంది. పౌరులది, ముఖ్యంగా బల హీనులది... తమదైనదేదీ కాసింత గోప్యంగా ఉంచుకోలేని బజారు బతుకవు తుంది. వారేదైనా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర తీర్పు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు సుప్రీం ధర్మాసనంపైనే ఉంది. గత అనుభవాల నేపథ్యంలో ఓ చరిత్రాత్మక తీర్పు కోసం దేశం నిరీక్షిస్తోంది. పరిమిత దృష్టితోనే ప్రమాదం హక్కు అప్రతిహతం కాదంటే, పరిమితులు విధించవచ్చు. ఎవరి హక్కులైనా ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదన్నదే రాజ్యాంగ స్ఫూర్తి. దానికి లోబడి సహేతుకమైన పరిమితుల్ని వ్యక్తిగత గోప్యత హక్కుకూ విధించ వచ్చు. ఆధార్ కోసం పౌరుల నుంచి సేకరించిన బయోమెట్రిక్, ఇతర ముఖ్య సమాచారం యథేచ్ఛగా జనబాహుళ్యంలోకి రావడం పట్ల పలువురు అభ్యం తరం వ్యక్తం చేశారు. దురుపయోగమయ్యే ప్రమాదాన్నీ శంకించారు. ఈ విష యమై సుప్రీం సమక్షానికి పలు వినతులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు రావ డంతో ఇది వార్తలకెక్కింది. వ్యక్తిగత గోప్యత అసలు ప్రాథమిక హక్కే కాదని గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. పౌరులకు సంక్రమించిన రెండు హక్కుల మధ్య హెచ్చు–తగ్గుల పోటీ పెట్టి చోద్యం చూసే వింత పంథాను కేంద్రం ఎంచుకుంది. ‘ఏదో కొందరు తమ వ్యక్తిగత గోప్యత హక్కు గురించి మాట్లాడుతున్నారు, మరో వైపు మేం ‘ఆధార్’ ఆసరాతో 27 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం, ఆహారపు హక్కు కన్నా వ్యక్తిగత గోప్యత హక్కు గొప్పదా?’ అన్న ప్రభుత్వ న్యాయవాది మాటల్లోనే సర్కారు వాదన డొల్ల తనం బయటపడింది. ఆధార్‌తో ఎంతో ప్రయోజనం ఉన్నందున, ఆ ప్రక్రియలో తప్పిదాల్ని ప్రశ్నించే మరొకరి హక్కులకు లెక్కే లేదనే వాదన తప్పు. ఆరున్నర దశాబ్దాల మన రాజ్యాంగ చరిత్రలో వ్యక్తిగత గోప్యత అంశం పలు మార్లు ఉన్నత న్యాయస్థానం సమక్షానికి వచ్చింది. ఇది ప్రాథమిక హక్కు కాదని రెండు మార్లు సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. 1954లో ఎంపీ శర్మ కేసులో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, తర్వాత 1962లో ఖరక్ సింగ్ కేసులో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తదనంతర కాలంలో విచారణకు వచ్చిన గోవింద్–మనేక (1975) కేసులో, గోప్యత రాజ్యాంగం నిర్దేశించిన హక్కు అని సుప్రీం తీర్పు స్పష్టం చేసింది. అధికరణం 21లోని జీవించే హక్కుతో పాటు అధికరణం 19లోని పలు ప్రాథమిక హక్కుల్లోనూ వ్యక్తిగత గోప్యత మూలాలు, ఆనవాళ్లు ఉన్నా యని చెబుతూ ఇది రాజ్యాంగపు హక్కని స్పష్టం చేసింది. ఇంకా పలు సందర్భాల్లో, మలక్(1981), రాజగోపాల్ (1994), పీయూసీఎల్ (1997), డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (2005), సుచిత (2009), సెల్వీ(2010), నల్సా (2014) కేసుల్లోనూ వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తిస్తూ తీర్పులు వెలువడ్డాయి. కానీ, రాజ్యాంగంలో ఏదైనా అంశంపై స్పష్టత కొరవడి, సందిగ్ధత నెలకొన్నపుడు సుప్రీంకోర్టు తీర్పులే ప్రామాణికమౌతాయి. గోప్యత ప్రాథమిక హక్కు కాదని అంతకు ముందు తీర్పిచ్చినవి విస్తృత ధర్మాసనాలయినందున, తదనంతర కాలంలో తక్కువ మంది న్యాయమూర్తులతో ఏర్పడ్డ ధర్మాసనాలిచ్చిన గోప్యత అనుకూల తీర్పులు కాల పరీక్షకు నిలువలేదు. ఇప్పుడు విచారిస్తున్నది 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కనుక, ఈ తీర్పు ఇకపై శిరోధార్యమౌతుంది. మాట మార్చింది అందుకేనేమో! గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పిచ్చిన సందర్భాలు వేరు. ఎంపీ శర్మ (1954) కేసు, దర్యాప్తు అధికారులు దాల్మియా సంస్థల్లో జరిపిన సోదాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్. ఖరక్ సింగ్ (1962) కేసు, నేరారో పణలు ఎదుర్కొంటున్న ఖరక్ సింగ్‌పై దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన నిఘా, నియంత్రణ, తనిఖీలను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన సందర్భం. అవన్నీ, ఆరోపణలెదుర్కొంటున్న వారిపై దర్యాప్తు సంస్థలు జరిపే నిఘా, నియంత్రణ, సోదాలకు సంబంధించిన వ్యవహారాల్లో గోప్యత విషయమై వెలువరించిన తీర్పులు. ఆ తీర్పే అన్ని సందర్భాలకూ సరిపోతుందను కోవడం సరికాదు. సగటు మనిషి వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాధాన్యతను, అందుకవసరమైన పరిమితుల్ని నిర్ణయించడమే ప్రస్తుతం ధర్మాసనం ముందున్న కర్తవ్యం. అందుకే, మొత్తానికిది ప్రాథమిక హక్కు అవునా? కాదా? అన్నది తేలితే తప్ప తాము తదుపరి తీర్పు వెలువరించలేమన్న ధర్మాసనం అభిప్రాయానికి అర్థముంది. 2012 నుంచి ఆధార్ వివాదంపై కేసు విచారణ సాగుతోంది. దీని చట్టబద్ధతను కర్ణాటకకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.ఎస్. పుట్టుస్వామి లోగడ ఓ సందర్భంలో సవాల్ చేశారు. తదనంతరం 2016లో చట్టం తీసుకువచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పించిన తీరే ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం ఆధార్ దృష్టి కోణంలోనే కాకుండా, విస్తృతార్థంలో గోప్యత హక్కును నిర్వచించి, పౌరుల హక్కును నొక్కిచెప్పి, ఏ మేరకు పరిమితులు విధించే హక్కు–అధికారం ప్రభుత్వానికుందో తేల్చాల్సిన సందర్భం వచ్చింది. రెంటి మధ్య సమతు ల్యత సాధించాలి. ఇన్నాళ్లూ ఇది ప్రాథమిక హక్కే కాదంటూ వచ్చిన కేంద్రం గొంతు మార్చింది. ప్రాథమిక హక్కు అయితే అయివుండవచ్చు, కానీ, పరిమితులేలేని సంపూర్ణ హక్కేం కాదనే తాజా వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత గోప్యతలోని పలు అంశాలు, ఉప అంశాల్లో కొన్ని అప్రతిహత హక్కే అయినా, ఇంకొన్నిటికి దాన్ని య«థాతథంగా వర్తింపజేయలేమనే వాదనను తెరపైకి తెచ్చింది. ఇలా అన్ని అంతర్గత అంశాలు, ఉప అంశాలకు ఒకే స్థాయి కల్పిస్తే, అవి ఇతర ప్రాథమిక హక్కుల అమలుకు భంగం కల్గించే ప్రమా దముందన్నది కేంద్ర ప్రభుత్వ భావన! ఐటీతో ప్రపంచమే మారింది ఆధునిక శాస్త్రసాంకేతికత వల్ల సమాచార వ్యవస్థే సమూలంగా మారి పోయింది. వ్యక్తిగత గోప్యతకు అర్థం, ప్రాధాన్యం, ప్రభావం అన్నీ మారాయి. ప్రతి వ్యక్తి తన శరీర, ఆరోగ్య, ఆస్తి, ఆలోచన, భావన, సంబంధాలు తదితర వ్యక్తిగత అంశాల్లో గోప్యత ఆశించడం సహజం. అందులో జోక్యం–దానిపై నియంత్రణ ఏదైనా తనకు తెలిసి, తన స్పృహ–ప్రమేయంతో జరగాలనుకోవడమూ న్యాయబద్ధమే!గోప్యతకు చట్ట బద్ధమైన రక్షణ లేకుంటే సగటు మనుషులు తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక, సామాజిక, హోదా–గౌరవపరమైన అంశాల్లో ఇబ్బందులెదురవుతాయి. ఎవ రితో పంచుకోకుండా తమతోనే అట్టేపెట్టుకోగల సొంత విషయాలే లేని దుస్థితి దాపురిస్తుంది. ‘వ్యక్తిగత గోప్యత హక్కు అంటే, తన మానాన తనని బతకనివ్వడం’ అనే ఓ ప్రసిద్ధ నిర్వచనం కూడా ఉంది. ఇది వ్యక్తి గౌరవం, స్వేచ్ఛకు ప్రతీక! ఒకవైపు గోప్యతకు రక్షణ కరువై, మరోవైపు అందులోకి ఇతరులు సులువుగా చొరబడే, అనుచితంగా జోక్యం చేసుకునే, ‘డాటా’ను య«థేచ్ఛగా వాడుకునే ఆస్కారం పెరగటమన్నది ఏ రకంగా చూసినా ప్రమా దకరమే! హక్కు భద్రత లేనపుడు, అటువంటి అనుచిత జోక్యాలు తనకు నిక రంగా నష్టం కలిగించినా, కారకులైన సదరు వ్యక్తులు, సంస్థలు, ప్రభు త్వాల నిర్వాకాల్ని ప్రశ్నించలేని స్థితి పౌరుడికి ఎదురౌతుంది. ఇంటర్నెట్ విస్తృతి పెరిగి, ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ తదితర సామాజిక మాధ్యమాలు మనిషి జీవితంలోకి అతి లాఘవంగా చొచ్చుకు వచ్చాక ‘డాటా’ భద్రత తీరే మారి పోయింది. పోటీ పెరిగిన వ్యాపార ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో వ్యక్తి గోప్యతలోకి చొరబడే యత్నం నిరంతరం సాగుతోంది. ఉచితాల మోజులో పడి మనమే ఎందరెందరికో ఆ ఆస్కారం కల్పిస్తున్నాం. దారపు పోగులా ఓ చిరుబంధం ఏర్పడ్డా చాలు, మనకు సంబంధించిన ఎంత వ్యక్తిగత సమా చారాన్ని జనబాహుళ్యంలోకి లాగుతారో? ఎంతలా మన బతుకును తెరచిన పుస్తకం చేస్తారో? ఆ లెక్కకు అంతే ఉండదు. బహిరంగ వేదిక ‘ఫేస్బుక్’ కన్నా, పరస్పర సమాచార వాహిక ‘వాట్సాప్’ కాస్త సురక్షితం అనుకున్న వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అక్కడ పంచుకున్నారు. వాట్సప్‌ను ఫేస్ బుక్ స్వాధీనపరచుకున్న తర్వాత అంతా బహిరంగమే అయి వినియోగ దారులు భంగపడ్డారు. ఇటువంటివెన్నెన్నో! సంకెళ్లు సరికాదు తరం మారింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తొలిరోజుల నాటి నాయకులు, పాలకులు, వారి ఆలోచనా ధార, హక్కులకై పోరాడే పంథా, విలు వలు... క్రమంగా అన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడవేమీ లేవు. మనిషి బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్న చోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని కళ్లారా చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. ఇక వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతో అంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు ఇక హద్దుం డదు. వ్యక్తిగత గోప్యతను విస్తృతార్థంలో చూసి, సమాజ విశాల హితంలో అన్వయించి ఆ సర్వోన్నత న్యాయస్థానమే గోప్యత హక్కును కాపాడాలి. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నైతికత పెంచే ఆరాధన
రమజాన్ కాంతులు ‘రోజా’ మానవుల ఆత్మను సంస్కరిస్తుంది. హృదయాల్లో దైవభీతిని, భక్తిని పెంపొందిస్తుంది. దైవంపై విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. నైతిక విలువలను, మానవీయసుగుణాలను ప్రోది చేస్తుంది. క్రమశిక్షణాయుత జీవన విధానానికి అలవాటు చేస్తుంది. బాధ్యతా భావాన్ని, జవాబుదారీతనాన్ని జనింపజేస్తుంది. సామాజిక స్పృహను, సమాజం పట్ల అవగాహనను కలుగజేస్తుంది. ఇరుగుపొరుగుల హక్కులు గుర్తుచేస్తుంది. అభాగ్యులు, అగత్యపరులు, అన్నార్తుల పట్ల మన బాధ్యతను నిర్వచిస్తుంది. ప్రేమ, దయ. జాలి, కరుణ, త్యాగం, సహనం, సానూభూతి, పరోపకారం లాంటి అనేక సుగుణాలను వృద్ధిచేస్తుంది. కనుక రమజాన్ కాంతులతో హృదయాలను జ్యోతిర్మయం చేసుకుందాం. దయాగుణం పెంచునట్టి ఆరాధన ఉపవాసం దుర్మార్గపు చేష్టలతో చేయకోయి పరిహాసం! పేదసాద అభాగ్యుల్ని ఆదుకొనుటె మానవత లేకపోతె నీలోపల ఉన్నట్లే దానవత!! – మదీహా అర్జుమంద్ -
ప్రభాస్ 'సాహో'కు భారీ ఆఫర్!
బాహుబలి సినిమా ప్రభాస్ తదుపరి చిత్రం 'సాహో'పై భారీ అంచనాలను పెంచేసింది. ఎంతలా అంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి స్ధాయిలో ప్రారంభం కాకముందే సినిమా దేశవ్యాప్త హక్కుల కోసం ఓ బాలీవుడ్ బడా సంస్ధ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్స్ కోసం రూ.400 కోట్ల మొత్తాన్ని ఆ సంస్ధ ఆఫర్ చేసినట్లు వినికిడి. ప్రభాస్ తదుపరి చిత్రానికి ఇంత భారీ ఆఫర్ రావడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా, సాహోలో కథనాయిక పాత్రకు కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
- ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించం - ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంతకాల సేకరణ - ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ కర్నూలు(అర్బన్): ఆర్యవైశ్యుల్లోని పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్ పరిణయ హాలులో ఆదివారం జిల్లా ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించేది ఆర్యవైశ్యులే అయినా అనేక మంది పేదలున్నారని, వారి కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించడంతో పాటు పాలక, ప్రతిపక్ష నేతలకు ఉత్తరాలు రాస్తామని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణులకు రూ.75 కోట్లు, కాపులకు రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 10 శాతంగా ఉన్న ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ఈ నేపథ్యంలోనే సమితి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన ఇల్లూరు సుధాకర్, ఎం విఠల్‌శెట్టి, కోశాధికారి సత్యనారాయణ, అదనపు కార్యదర్శిగా జవహర్‌బాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ చిన్న వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్యవైశ్యులను ఎకనామికల్ బ్యాక్వర్డ్గా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కమిటీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీజీ శివరాజ్, పెండేకంటి కిరణ్, విట్టా రమేష్, మహిళా అధ్యక్షురాలు టి. జ్ఞానేశ్వరి, పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి కిరణ్, ఇల్లూరు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం కోసం పోరాటం
బనగానపల్లె రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, క్రిష్టియన్ మైనార్టీలకు సామాజిక న్యాయం సిద్ధించే వరకు పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల సాధనకోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి బనగానపల్లెకు చేరింది. ఈ సందర్భంగా పాతబస్టాండ్ సర్కీల్‌లో ఏర్పాటు చేసిన చైతన్య సభలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ముస్లీం, గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించని సీఎం చంద్రబాబు తన కుమారున్ని మంత్రిని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. విషయంపై ప్రశ్నించలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాలవారు హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రామాంజనేయులు, కో కన్వీనర్ జగన్నాథం, నాయకులు ఎర్రబాషా, సుబ్బారెడ్డి, బాలకృష్ణ, పెద్దమునెయ్య, శిల్పి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక చట్టాల అమలుకు డిమాండ్
- యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి డిమాండ్ -శంకరాస్ డిగ్రీ కాలేజీలో డైరీ ఆవిష్కరణ కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీల తరహాలోనే యాదవులకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2017 డైరీని స్థానిక శకరాస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నయాదవ్ మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ బీసీ కులాలకు ఏర్పాటు చేసిన విధంగా ప్రత్యేక ఫైనాన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో యాదవ సొసైటీలకు పదెకరాల భూమిని కేటాయించాలన్నారు. త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో యాదవులకు మేయర్ పదవిని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్యయాదవ్, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డా.బాలమద్దయ్య, వైహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి
హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ తిరుపతి లీగల్: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రమేశ్‌రంగనాథన్ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్‌ను ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ రమేశ్‌రంగనాథన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
బాలికల హక్కులను పరిరక్షించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెప్ జూనియర్ బాలికల కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ముద్రించిన జెండర్ సమానత్వం సాదిద్ధాం అనే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై వివక్ష చూపరాదన్నారు. బాలికలు తమకున్న హక్కులను స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవడానికి సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, అధికారులు, సహకరించాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేయరాదని చెప్పారు. కార్యక్రమంలో బర్డ్స్ జోనల్ కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్, రోషన్, రిటైర్డ్ డీఎస్పీ పాపరావు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలి
– నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు పత్తికొండ టౌన్ : హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పత్తికొండకు వచ్చిన ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సన్మానించారు. జీఓల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులపై ఎండోమెంట్ అధికారులు వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న 3 వేల ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో ఎలక్ట్రానిక్ తబలా, వాయిద్యాలను వాడటం నిలిపివేసి నాయీ హ్మణులను తీసుకోవాలన్నారు. నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో రూ.56కోట్లు నిధులు కేటాయించినా 101 జీఓతో లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరుచేయాలని కోరారు. నాయీ బ్రాహ్మణ సేవాసంఘం గౌరవాధ్యక్షుడు కారన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు సివి.నర్సయ్య, తాలుకా అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి లింగన్న, నాయకులు జయరాముడు, రమేష్, డోలు అంజినయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చైర్మన్లకు ఘనసన్మానం : స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ చైర్మన్ కనకాచారికి తాలుకా అధ్యక్షుడు దామోదరాచారి, మండలాధ్యక్షుడు బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానం చేశారు. సగర(ఉప్పర)సంఘం ఫెడరేషన్ చైర్మన్ ఏడుకొండలు, శాలివాహన సంఘం ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలినాగేంద్రలను స్థానిక ఉప్పరసంఘం నాయకులు యుసీ ఆంజనేయులు, శ్రీనివాసులు, నరసింహమూర్తి, రవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.రజకసంఘం ఫెడరేషన్ చైర్మన్ రాజమండ్రి నారాయణను ఆ సంఘం పట్టణాధ్యక్షుడు నారి ఆధ్వర్యంలో రజకులు ఘనంగా సన్మానించారు. -
బీసీల హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలు
– ప్రకాశం జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నూకపాని బాలాజీ కర్నూలు(అర్బన్): పీడిత, అణగారిన, బీసీ వర్గాల హక్కుల సాధనకు దళిత బహుజనులంతా కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ద్వితీయ ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. మద్దిలేటియాదవ్ ఆధ్వర్యంలో బోయ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బాలాజి మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వినయ్ మాట్లాడుతూ బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వీరశేఖర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రానున్న ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సమాజ్‌వాది జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్ మాట్లాడుతూ పూలే ఆశయాల మేరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం, జిల్లాల అధ్యక్షులు శ్రీరాములు, రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి పోతన తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల వినియోగంతోనే మోసాలకు చెక్
- వినియోగదారుల సంఘాల పటిష్టతకు చర్యలు - పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపు - కర్నూలులో జాతీయ వినియోగదారుల రాష్ట్రస్థాయి వేడుకలు కర్నూలు(అగ్రికల్చర్) : గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వినియోగదారుల సంఘాలను పటిష్టం చేసి వినియోగదారుల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గురువారం కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్రస్థాయి వేడుకలు కనులపండువగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు ఎక్కడెక్కడ ఏ విధంగా మోసపోతున్నారు, కార్బైడ్‌తో మాగించిన, సహజసిద్ధంగా మాగిన పండ్ల తేడాలు, మందుల్లో నకిలీలను గుర్తించే విధానం, తూకాలు, కొలతల్లో అక్రమాలు, కల్తీ విత్తనాలు, ఎరువులను గుర్తించడం తదితర వాటికి సంబంధించి అవగాహన కోసం సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వీటిని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు కర్నూలులో జూట్ బ్యాగుల తయారీ కేంద్రాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో సునీత మాట్లాడుతూ వినియోగదారులు ఏ రూపంలోనూ మోసపోకుండా ఉండాలంటే ముందుగా అందుకు సంబంధించి చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎలాంటి వస్తువును కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. నాణ్యత లేకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చని వివరించారు. గ్యాస్ పంపిణీలో మోసపోకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హక్కుల పరిరక్షణకు కృషి .. రాష్ట్ర వినియోగదారుల ఫోరం జడ్జి జస్టిస్ నౌషద్ అలీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఫోరం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ ఏడాది కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో 1.34 కోట్ల మంది కార్డుదారులున్నారని, వీరందరూ ప్రభుత్వ వినియోగదారులని తెలిపారు. వీరికి ఇచ్చే సరుకుల్లో ఎక్కడా దగాకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసి బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో స్టేట్ ఇన్ఫర్మేషన్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం రావాలని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత సామాన్య కూలీ మొదలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వీరి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి అన్నారు. వీరితో పాటు జంతువులు, పక్షులు కూడా వినియోగదారుల కిందికే వస్తాయని, గాలి, వాతావరణం కలుషితం అవుతుండటం వల్ల ఇవి కూడా దెబ్బతింట్నునాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీపై చర్యలు తీసుకునేందుకు స్థానిక సంస్థలకు సర్వాధికారాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తదితరులు ప్రసంగించారు. కేవీఆర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన 'వినియోగదారుడా... మేలుకో' నాటకం ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ రామ్మోహన్, డీఎస్ఓ శశిదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం ఇన్చార్జి నదీం హుసేన్, జిల్లా వినియోగదారుల రక్షణమండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు వాల్మీకుల సైకిల్ యాత్ర
కర్నూలు (అర్బన్): హక్కుల సాధనకు డిసెంబర్ 11, 12, 13వ తేదీల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్రలను నిర్వహిస్తున్నట్లు భారతీయ వాల్మీకి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, వాల్మీకి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి మద్దిలేటి నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా వాల్మీకి ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు.. వెంటనే ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయుడు, కల్లూరు మండల కన్వీనర్ ధనుంజయనాయుడు, నాయకులు శంకర్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహార్యాలీ
► దివ్యాంగులకు ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ ► గవర్నర్ కార్యదర్శికి వినతి పత్రం సాక్షి, చెన్నై: హక్కుల పరిరక్షణ కోసం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకం అయ్యారుు. దివ్యాంగుల ఐక్యకార్యాచరణ సమాఖ్యగా ముందుకు సాగే పనిలో పడ్డారు. తమ హక్కుల సాధనలో భాగంగా తీసుకొచ్చిన చట్టంలో సాగిన సవరణలను బహిర్గతం చేయాలని, అమల్లో కేంద్రం వైఖరి ఏమిటో?, పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందుకు ఆ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పోరుబాటకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకమై మహార్యాలీగా రాజ్ భవన్ వైపు కదిలేందుకు నిర్ణరుుంచారుు. సైదా పేట కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఉదయం చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ముందుకు కదిలారు. రాజ్ భవన్లో గవర్నర్‌కు వినతి పత్రం అందించేందుకు తగ్గట్టుగా ముందస్తు అనుమతిని దివ్యాంగుల సంఘాల నాయకులు కోరి ఉండడంతో, పోలీసులు వారిని అడ్డుకోలేదు. పోలీసులు భద్రతా ఏర్పాట్లతో పాటుగా, ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాని రీతిలో చర్యలు తీసుకున్నారు. దీంతో ర్యాలీగా రాజ్ భవన్‌కు చేరుకున్న దివ్యాంగుల ప్రతినిధుల్ని మాత్రం లోనికి అనుమతించారు. అక్కడ గవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావు కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో తమిళనాడు దివ్యాంగుల హక్కుల సాధన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఝాన్సీరాణి, ఎస్.నంబురాజన్ మాట్లాడుతూ 1995లో దివ్యాంగుల హక్కుల కోసం అమల్లోకి తెచ్చిన చట్టానికి బదులుగా 2007లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. 2014లో పార్లమెంట్ ముందుకు ఈ చట్టం రాగా, యూఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సవరణలకు చర్యలు తీసుకున్నారని వివరించారు. పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ముందుకు ఆ చట్టం వెళ్లిందని, తదుపరి ఆ చట్టం ఏమైందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్-3 సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీఎంఎన్ దీపక్, పి.శరవణన్, ఎన్‌ఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.రామమూర్తి, ప్రతినిధి పి.మనోహరన్, టీఎస్ఎఫ్డీ ప్రధాన కార్యదర్శి వి.స్వామినాథన్, ఇతర సంఘాల నేతలు రాజీవ్ రంజన్, ఆర్.గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. తమ హక్కుల చట్టం తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చెన్నైలో సోమవారం దివ్యాంగులు మహా ర్యాలీ నిర్వహించారు. రాజ్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం గవర్నర్ కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు దివ్యాంగులు వినతి పత్రం సమర్పించారు. -
ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన
– కార్తీక వనభోజనాల్లో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): బీసీలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగన్నబావి సమీపంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆమె హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే మంచి ఉద్దేశంతో కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ.. బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారి హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు దేశంలో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి ఎం. రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కె. రామకృష్ణ, నాయకులు బుర్రా ఈశ్వరయ్య, కేతూరి మధు, డా.పుల్లన్న, లక్ష్మినారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంముని పాల్గొన్నారు. -
బ్రాహ్మణుల హక్కుల కోసం ఐక్యవేదిక పోరాటం
రామన్నపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 123 బ్రహ్మణ సంఘాలు ఏకమై బ్రాహ్మణుల హక్కులను సాధించడానికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వరంగల్ బట్టలబజార్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన కళ్యాణమండపంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్రహ్మణ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రయత్నించాలన్నారు. ఆగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పాలక ప్రతిపక్షాల పార్టీల దృష్టికి తీసుకుపోవాలని ఆయన సూచించారు.కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందించే విధంగా త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామని ఆయన అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ వద్దిరాజు గణేష్, బ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు, ధన్వంతరీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పంతంగి కమలాకర్‌రావు, సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్, మహిళ అధ్యక్షురాలు రజిత శర్మ, ఆదిశేష బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య నగర శాఖ అ«ధ్యక్షుడు పవన్‌కుమార్, పురుషోత్తం, సముద్రాల పురుషోత్తమచార్యులు పాల్గొన్నారు. -
బీసీల హక్కులను కాలరాస్తున్న కమిషన్
– కమిషన్ చైర్మన్ మంజునాథ ఫోటోలు దహనం కర్నూలు(అర్బన్): కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ బీసీల హక్కులను కాల రాస్తోందని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ ఆరోపించారు. సోమవారం సాయంత్రం స్థానిక మద్దూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య కార్యాలయం ఎదుట మెయిన్‌రోడ్డుపై బీసీ జనసభ నేతలు కమిషన్ చైర్మన్ మంజునాథ ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ.. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న మంజునాథ, కాపులను బీసీ జాబితాలో చేరిస్తే బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పడం దారుణమన్నారు. బీసీ జాబితాలో ఉన్న 125 కులాలు నేటికి అసెంబ్లీ మెట్టు కూడా ఎక్కలేదని, 130 కులాలకు నేటి వరకు పార్లమెంట్లో ప్రాతినిథ్యం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కులానికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరిలో ఐదుగురు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో ప్రజాభిప్రాయం పేరిట బీసీలను లాఠీలతో కొట్టించడం దురదష్టకరమన్నారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ విషయంపై ఎందుకు దష్టి సారించడం లేదన్నారు. త్వరలో రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ జిల్లా కన్వీనర్ వీ భరత్‌కుమార్, విద్యార్థి సమాఖ్య నాయకులు ముక్తార్‌బాషా, శివ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలి
కర్నూలు(అర్బన్): స్రీ, పురుషలతో పాటు హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించాలని హిజ్రా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. మానవులతో సమానంగా హిజ్రాలకు కనీస హక్కులు కల్పించాలన్న డిమాండ్‌పై ఇండియన్ నేషనల్ సమతా హిజ్రా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో హిజ్రాలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 4.5 కోట్ల మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని, వీరి కోసం రూపొందించిన రైట్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్స్–2015 బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో పొందలేదన్నారు. ఈ బిల్లును చట్టబద్ధం చేసి సమాజంలో అందరితో సమానమే అనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో హిజ్రాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శులు స్వప్నమ్మ, దీపారెడ్డి, ఇందు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మయూరి, కర్నూలు నగర నాయకులు ప్రవీణ, స్వప్న, జెస్సీ తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, ఉపాధ్యక్షుడు రామరాజు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. -
ఓసీ హక్కుల కోసం ఉద్యమిస్తాం
ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి కోహెడ: అగ్రవర్ణ పేదల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల భాస్కర్‌రెడ్డి అన్నారు. కోహెడలోని వేంకటేశ్వర గార్డెన్లో మంగళవారం నిర్వహించిన జేఏసీ మండలస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు రూ.10 వేల కోట్లతో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ పథకాలలో పేద ఓసీలకు లబ్ధి చేకూర్చాలన్నారు. ఓసీ సంక్షేమ వసతిగృహాన్ని మంజూరు చేయాలని, 19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కవితారెడ్డి, సలహాదారులు కేశవరెడ్డి, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రమాదేవి, సరోజన, శ్రీధర్, జగన్‌రెడ్డి, భారతమ్మ, నాగలక్ష్మి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హక్కులు హరిస్తూనే స్వేచ్ఛా పలుకులా?
దళిత స్త్రీ శక్తి సభలో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్షి, హైదరాబాద్: హక్కులు హరించి వేస్తున్నవారే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గురించి మాట్లాడుతున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకెళ్లను తెంచుకుందాం’ అనే నినాదంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘అంబేడ్కర్ ఎవరికోసం పోరాడారో, ఎవరికోసం పరితపించారో, ఆ దళితుల బిడ్డలే ఈ దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకుల్లో శవాలై తేలుతున్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో పడి మరణించిన వారి దుఃఖాన్ని దిగమింగుకొనేందుకు వారి శవాల ముందు నా జాతి బిడ్డలు చిందులేస్తున్నారని’ విల్సన్ గద్గద స్వరంతో అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ నినాదం ప్రజల్ని మభ్య పెట్టే ఒక ఎజెండానే తప్ప మానసిక పరివర్తనతో వచ్చింది కాదన్నారు. దేశంలో కేవలం దళితులపైనే దాడులు జరుగుతున్నాయని, ఆ తరువాత వరుసలో ముస్లింలు ఉన్నారన్నారు. బహుజనులు కూడా దళితులను అణచివేసేవారేననడంలో సందేహం అక్కర్లేదన్నారు. రెయిన్ బో హోం నిర్వాహకురాలు అనురాధ మాట్లాడుతూ మానవ మలమూత్రాలను ఎత్తివేసే పనిని దళితులే చేస్తున్నారని, దీనిని ఉపాధి అనడం ఈ సమాజానికే అవమానకరం అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ , దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ, నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటాలతోనే హక్కులను పరిరక్షించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. నాగ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కేఎస్ లక్ష్మణరావు ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి లక్ష్మయ్య కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం రాష్ట్ర ఉమ్మడి జాబితాల నుంచి క్రమేణా కేంద్రీకరణ దిశగా, కేంద్ర పెత్తనంలోకి వెళుతోందని, ఇందుకు నీట్ ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎన్. తాండవకృష్ణ మాట్లాడుతూ జాతీయస్థాయి సమస్యల పరిష్కారానికి ఎస్టీఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందించేందుకు అధికారులు కషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ హక్కుల సంఘం కన్వీనర్ చిట్టిబాబు అన్నారు. ఆత్మకూరు మండలంలోని ఏపీ ప్రోడక్టివిటీ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నూతన ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ చట్టం తెలియక పలువురు బాధితులు ఇబ్బందిపడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. జిల్లా కన్వీనర్ పెంచలనరసయ్య, ఆత్మకూరు నాయకులు వాగాల శ్రీహరి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.లక్ష్మీపతి, మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు దావా పెంచలరావు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ జె.వెంకట్ పాల్గొన్నారు. -
హక్కులకోసం ఉద్యమించాలి
-తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు డప్పు స్వామి తెలకపల్లి : కళాకారులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు డప్పు స్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని యోగా భవనంలో సోమవారం జానపద కళాకారుల డివిజన్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కళాకారులు ఎక్కడున్నా గుర్తించబడతారని, కళాకారుల శ్రమ వృథాగా పోదన్నారు. కళాకారుడిగా ప్రజా సమస్యలను వెలికితీయడం, ప్రజా సమస్యలు ఎత్తి చూపడం వల్లే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలిచ్చినా అందరికి అవకాశం రాకపోవడంతో ఇతర పథకాల్లో భాగస్వాములు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల, మాజీ ఎంపీటీసీ యాదయ్య, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్, రవిశంకర్, భాస్కర్, శివనాగులు, రాంచందర్, రాము, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల కోసం జైలుకెళ్లాం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం జైలుకెళ్లిన ఘనత హెచ్‌ఎంఎస్‌కే దక్కుతోందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 సైటాఫీస్‌లో సోమవారం జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రశ్నించినందుకు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి తనపై పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ లె రిపించారన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా వెనకాడేది లేదని కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. మల్టీడిపార్ట్‌మెంట్‌ల పేరుతో కార్మికులపై పనిఒత్తిడి పెంచుతున్నా గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యంతో చేతులు కలిపారన్నారు. సకలజనుల సమ్మె వేతనాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు రాకుండా ఆపించిన ఘనత టీబీజీకేఎస్ నాయకులకు దక్కిందని పేర్కొన్నారు. వేజ్‌బోర్డులో సభ్యత్వం కోసం లేఖలు రాసి సకాలంలో వేతన కమిటీ ఏర్పాటు కాకుండా అడ్డుకుంది టీబీజీకేఎస్ కాదా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాపాడడంతో విఫలమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తీరును కార్మికులు ప్రశ్నించాలన్నారు. తాము ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన డివిజన్లలో అనేక సమస్యలు సాధించామని యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. గేట్ మీటింగ్‌లో పినకాసి మొగిలి, అజీజుల్లా, కొమ్ము మధునయ్య, బస్విరెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, అశోక్, స్వామి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మాధురి.. ఉద్యమ దీప్తి
అందరిలానే ఆమె ఈ భూమిపైకి వచ్చింది. ఎదుగుతుండగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన లోపాలను గుర్తించింది. తాను ప్రత్యేకంగా ఉన్నానని గమనించింది. ఆ మేరకు తన పేరును రాజశేఖర్గౌడ్కు బదులుగా మాధురిగా మార్చుకుంది. ప్యాంటూ, షర్ట్ బదులుగా లంగా, ఓణి, గాగ్రాచోలీ, పంజాబీ డ్రెస్‌లు వేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమె వ్యవహార శైలిని కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆమె నుంచి ఎవరికీ ఇబ్బంది లేకపోవడంతో చదువుకోవడానికి ప్రోత్సహించారు. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరించగా పోరాడి సాధించుకుంది. ఇప్పుడు పీజీ అడ్మిషన్నూ నిరాకరిస్తున్నారు. ఆమెతో ఉన్న సమాజం మారి ప్రోత్సహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశం కోసం మాధురి ఉద్యమం ప్రారంభిస్తోంది. కర్నూలు : మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కె. మాధురి(రాజశేఖర్‌గౌడ్) తల్లిదండ్రులతో పాటు అక్క, అన్న ఉన్నారు. ఆమె 7వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుంది. 8 నుంచి 10వ తరగతి వరకు మిడుతూరులోని గాం«ధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. ఆ తర్వాత ఇంటర్ మీడియట్, డిగ్రీలను నందికొట్కూరులోని సాయిరామ్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. అయితే బాల్యం నుంచే మగపిల్లలకన్నా ఆమె ఆడపిల్లలతోనే ఎక్కువగా ఆడుకునేది. టీనేజి వయస్సు వచ్చాక అమ్మాయి లక్షణాలు కనిపించాయి. అప్పటి నుంచి ఆమె స్త్రీలు ధరించే వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. ఈ దశలో మొదట్లో పాఠశాల ఉపాధ్యాయులు వ్యతిరేకించినా తర్వాత ఆమె నుంచి ఎవ్వరికీ ఇబ్బంది లేకపోవడంతో అనుశాలు కల్పించేందుకు జీవోలు జారీ మతించారు. పదో తరగతి చదువుతుండగానే ఆమె ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. ఇది తెలిసి ఆమె తండ్రి రెండేళ్ల వరకు మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత అర్థం చేసుకుని ఆమె అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్దే స్వగ్రామంలో నివసిస్తోంది. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరణ డిగ్రీలో చేరేందుకు కళాశాల యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆమె రాయలసీమ యూనివర్సిటీ అధికారులతో పాటు లోక్‌అదాలత్ కోర్టును ఆశ్రయించింది. 8–2–2011 తేదిన జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 653 ప్రకారం ఆమెకు విద్యాభ్యాసం చేసేందుకు అనుమతివ్వాలని కోర్టు మందలించింది. దీంతో మాధురి డిగ్రీ పరీక్షలు రాయగలిగింది. పీజీ అడ్మిషన్ కోసం ఉద్యమం డిగ్రీ పూర్తి చేసుకున్న మాధురి ఆపై పీజీ చేయాలని కలలు కంది. 2015, 2016లలో వరుసగా రెండుసార్లు పీజీ సెట్ పరీక్ష రాసి మంచి ర్యాంకును తెచ్చుకుంది. అయితే ఆమెను అడ్మిషన్ సమయంలోనే యూనివర్సిటీ అధికారులు నిరాకరించారు. మేల్‌గా సీటిస్తాము గానీ ట్రాన్స్‌జెండర్(హిజ్రా)కు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. దీంతో తనకు ఉన్నత విద్యాభ్యాసం చదువుకునేందుకు అనుమతివ్వాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయత్నం చేస్తామని చెప్పడమే గానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వం జీవో చేస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇందుకోసం తాను ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తనకు సీటు రాకపోయినా తనలాంటి వారికోసమైనా పోరాటం చేస్తానని ఆమె చెబుతోంది. సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నదే లక్ష్యం 'సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకు ప్రతిరోజూ గ్రామంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాపై ఎవరూ వివక్ష చూపడం లేదు. నన్ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రభుత్వమూ స్పందించాలి. నాకు ఓటుహక్కుతో పాటు ఆధార్‌కార్డు ఉంది. ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తమిళనాడు ప్రభుత్వమూ మాలాంటిæ వారికి విద్య, ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వమూ సహకరించి ఆదుకోవాలి' అని చెబుతోంది మాధురి. -
రైట్స్ కు నేషనల్ అవార్డు
రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్... కాస్ట్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ (మీడియం) కేటగిరి కింద 13వ నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. దేశ రాజధాని ఢి ల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకుంటున్న రైట్స్ సీఎండీ రాజీవ్ మెహ్రొత్రా. -
ఎన్కౌంటర్ మరణాల్లో భారత్ రికార్డు!
భారతదేశంలో రికార్డు స్థాయిలో అవినీతి విస్తరిస్తోందని, ఎన్కౌంటర్ మరణాలు భారీగా జరుగుతున్నాయని అమెరికా స్టేట్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్ మెంట్ 2015 నివేదికల్లో వెల్లడించింది. అంతేకాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాలెగావ్ పేలుళ్ళ కేసులో హిందుత్వ విషయాలపై మెతకగా వ్యవహరిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు వెల్లడించింది. భారత్ లో 2008-2013 మధ్య కాలంలో పోలీసులు, భద్రతా దళాల ద్వారా 555 ఎన్కౌంటర్ హత్యలు జరిగాయని అమెరికా మానవ హక్కుల నివేదిక వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ లో 138, జార్ఖండ్ లో 50, మనిపూర్ లో 41, అస్సాంలో 33, ఛత్తీస్ ఘడ్ లో 29, ఒడిస్సా 27, జమ్మూ కాశ్మీర్ 26, తమిళనాడు 23, మధ్యప్రదేశ్ లో 20 ఎన్కౌంటర్లు జరిగినట్లు తెలిపింది. దీనికి తోడు సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును కూడా ప్రస్తావించింది. అంతేకాక భారత్ లో జరిగిన మరిన్ని అవినీతి, వేధింపులు, హింసలతోపాటు.. మౌలిక సదుపాయాల లేమి, సమస్యలపై యు హెచ్ఆర్ డి నివేదించింది. భారత్ లోని జైళ్ళు తరచుగా నిండిపోతున్నాయని, జైళ్ళలో ఆహారం, వైద్య సంరక్షణ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిస్థితులు పేలవంగా ఉంటున్నాయని నివేదికలు చెప్తున్నాయి. జైళ్ళలో తాగునీరు అప్పుడప్పుడు సమస్యగా మారుతుంటుందని, ఖైదీలకు తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడమే కాక, వారిని భౌతిక హింసలకు గురి చేస్తున్నట్లు యూహెచ్ఆర్డీ పేర్కొంది. విచారణ కోసం వేచి ఉండాల్సిన వారికంటే రెండు వంతులు ఎక్కువ మందిని జైళ్ళలో నింపుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా భారతదేశంలో మావోయిస్టులు, సాయుధ గ్రూపుల్లో పిల్లలను రిక్రూట్ చేసుకుంటున్నారని యూహెచ్ ఆర్డీ ఆందోళన వ్యక్తం చేసింది. 12 సంవత్సరాల వయసున్న యువత మావోయిస్టు సభ్యులుగా ఉంటున్నట్లు పేర్కొంది. ఒకవేళ పిల్లలు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రతీకారంగా వారి కుటుంబ సభ్యులను హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నారని, సాయుధ దళాలు, భద్రతా బలగాలు తమకు రక్షణ కవచాలుగా పిల్లలను ఉపయోగించుకుంటున్నట్లు నివేదికల్లో వెల్లడించింది. మరోవైపు తమిళనాడువంటి కొన్ని రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు అధికంగా ఉంటున్నాయని, అలాగే పటేళ్ళ ఆందోళన వంటి సమయాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించి స్వేచ్ఛను హరిస్తోందని, భారత్ లో సమస్యలు, హింసపై ఆమెరికా మానవ హక్కుల నివేదికలో పలు విషయాలను వెల్లడించింది.