పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం.
ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్‌లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment