మారథాన్ అంటే.. ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు ఇలా.. మనుషులు పరుగెడుతుంటారని అందరికీ తెలుసు. కానీ మనుషులు, రోబోట్‌లు పాల్గొనే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏప్రిల్‌లో జరగనున్న ఈ మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నారు. 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్‌లతో పోటీపడతాయని.. ఇందులో మానవులు లేదా రోబోట్ అనే దానితో సంబంధం లేకుండా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.
త్వరలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనే రోబోట్‌లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్‌లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. రోబోట్‌లు తప్పనిసరిగా 0.5 మరియు 2 మీటర్ల ఎత్తులో నిలబడాలి. కనీసం హిప్-టు-ఫుట్ ఎక్స్‌టెన్షన్ 0.45 మీటర్లు ఉండాలి. రిమోట్ కంట్రోల్, ఆటోమాటిక్ రోబోట్‌లు రెండూ ఈ రేసులో పాల్గొనవచ్చు. రోబోల పనితీరు సజావుగా సాగటానికి కావలసిన బ్యాటరీలను ఆపరేటర్లు భర్తీ చేసుకోవచ్చు.
మారథాన్‌లో పాల్గొనే రోబోట్‌లలో.. చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంది. ఇది గంటకు సగటున 10 కిమీ వేగంగా ముందుకు వెతుందని సమాచారం. ఇది గతంలో కూడా హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మొత్తం రేసులో హ్యూమనాయిడ్‌లు పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.
చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోంది
చైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్‌లను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్‌స్టాల్ చేసారు. త్వరలో వీరు రోబోట్‌లతో స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Comments
Please login to add a commentAdd a comment