Marathan run
-
మనుషులతో.. మరమనుషులు: మారథాన్‌కు అంతా సిద్ధం!
మారథాన్ అంటే.. ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు ఇలా.. మనుషులు పరుగెడుతుంటారని అందరికీ తెలుసు. కానీ మనుషులు, రోబోట్లు పాల్గొనే.. ప్రపంచంలోనే మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఏప్రిల్‌లో జరగనున్న ఈ మారథాన్ బీజింగ్‌లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నారు. 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఇందులో మానవులు లేదా రోబోట్ అనే దానితో సంబంధం లేకుండా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.త్వరలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనే రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. రోబోట్లు తప్పనిసరిగా 0.5 మరియు 2 మీటర్ల ఎత్తులో నిలబడాలి. కనీసం హిప్-టు-ఫుట్ ఎక్స్టెన్షన్ 0.45 మీటర్లు ఉండాలి. రిమోట్ కంట్రోల్, ఆటోమాటిక్ రోబోట్లు రెండూ ఈ రేసులో పాల్గొనవచ్చు. రోబోల పనితీరు సజావుగా సాగటానికి కావలసిన బ్యాటరీలను ఆపరేటర్లు భర్తీ చేసుకోవచ్చు.మారథాన్‌లో పాల్గొనే రోబోట్లలో.. చైనా ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఉంది. ఇది గంటకు సగటున 10 కిమీ వేగంగా ముందుకు వెతుందని సమాచారం. ఇది గతంలో కూడా హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మొత్తం రేసులో హ్యూమనాయిడ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను లేదా ప్రపంచంలోని మొత్తంలో 51 శాతం ఇన్స్టాల్ చేసారు. త్వరలో వీరు రోబోట్లతో స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ -
రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఈవెంట్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. నగరంలోని ఓ హోటల్లో మారథాన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఇందులో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.13వ ఎడిషన్ మారథాన్‌కు వర్లడ్ అథ్లెటిక్స్ గుర్తింపు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా పేర్కొన్నారు. 30 రాష్ట్రాల నుంచి దాదాపు ఈ ఏడాది 25,500 మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని వివరించారు. మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇదని పేర్కొన్నారు.ప్రైజ్‌మనీ.. రూ.48 లక్షలుఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్‌లో మొత్తం రూ.48 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్‌రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు.ఇది హైటెక్స్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచి్చ»ౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచి్చబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా తేజస్వీ సూర్య రికార్డు
BJP MP Tejasvi Surya.. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించారు. ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. ట్రయాథ్లాన్ భాగంగా ఏకంగా 90 కి.మీలు సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి సత్తా చాటుకున్నారు. వివరాల ప్రకారం.. టీమ్ న్యూ ఇండియాలో భాగంగా బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. ఐరన్‌మ్యాన్ 70.3లో సివిల్ సర్వెంట్ శ్రేయాస్ హోసూర్, వ్యవస్థాపకుడు అనికేత్ జైన్‌లతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా హోసూర్ మొదట 1.9 కి.మీల స్విమ్మింగ్ లెగ్‌ని ఈదగా, 2వ లెగ్ ఈవెంట్ కోసం సూర్య 90 కి.మీ సైకిల్ తొక్కాడు, ఆ తర్వాత అనికేత్ జైన్ 21.1 కి.మీ హాఫ్ మారథాన్‌ను పూర్తి చేశాడు. అనంతరం.. తేజస్వీ సూర్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలు, ఫిటెనెస్పై పలు కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్ అనేది మన ఓర్పును పరీక్షించే ఒక వేదిక. మంచి ఆరోగ్యం, ఫిట్నెస్ను పెంపొందించేకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది యువకులు క్రీడలు, ఫిట్నెస్ను కెరీర్‌గా స్వీకరించడానికి ముందుకువస్తున్నారు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అన్నారు. ఇక, ఈ ఛాలెంజ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 33 దేశాల నుండి దాదాపు 1,500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. కాగా, ఐరన్‌మ్యాన్ 70.3.. దీన్ని హాఫ్ ఐరన్‌మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇది స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్‌తో కూడిన ట్రయాథ్లాన్. 70.3 మైళ్లలో పాల్గొనేవారు కవర్ చేసే దూరాన్ని సూచిస్తుంది. మొదటి ఐరన్‌మ్యాన్ 70.3 2019లో గోవాలో జరిగింది. కోవిడ్-19 కారణంగా తదుపరి రెండు ఎడిషన్లు రద్దు చేయబడ్డాయి. Completed Ironman 70.3 Relay Challenge, Goa as I cycled for 90 kms along with teammates Shreyas Hosur who swam & Aniketh Jain who ran, as we represented 'Team New India' Fantastic to see so many youngsters participating.#FitIndia under PM @narendramodi is a growing movement. pic.twitter.com/F77db2r87H — Tejasvi Surya (@Tejasvi_Surya) November 13, 2022 -
ఛాతీలో నొప్పి! గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! ఇప్పుడిలా!
Sunita Meena: ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న చిన్ననాటి కల.. ఏళ్ల తరువాత మధ్యవయసులో నిజం కాబోతుందన్న ఆనందంలో ఉన్న ఆమెను క్యాన్సర్ వ్యాధి కమ్ముకున్నది. అయినా ఏమాత్రం బెదరలేదు. మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే, తన కలను నిజం చేసుకునేందుకు రన్నింగ్ చేస్తోంది సునీతా మీనా. ఒకపక్క కీమో థెరపీ తీసుకుంటూనే మరోపక్క రన్నర్‌గా రాణిస్తోన్న సునీత పరుగుల ప్రయాణం ఆమె మాటల్లోనే.... ‘నేను మధురలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ రేసుల్లో పాల్గొని విజేతగా నిలవాలని అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్ పాస్ అవగానే రైల్వేలో పనిచేస్తోన్న దినేష్ కుమార్‌తో నాకు వివాహం అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికే బాబు పుట్టాడు. ఇంటిపనులు, బాబుతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకుంటానని మా వారిని అడిగాను. ఆయన పెద్దమనసుతో ఒప్పుకోవడంతో డిగ్రీ పూర్తిచేశాను. ఆయన కూడా రన్నర్ కావడంతో... స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. కానీ పెద్దయ్యాక రన్నింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడంతోపాటు, రైల్వే టీమ్‌కు కోచ్‌గా పనిచేసేవారు. రోజూ ఆయన రన్నింగ్‌కు వెళ్తూ రన్నింగ్ గ్రూప్‌తో బిజీగా ఉండేవారు. నన్ను కూడా ‘‘రన్నింగ్ చెయ్యి, ఆరోగ్యంగా ఉంటావు’’ అని చెబుతుండేవారు. నా చిన్ననాటి కోరికే అయినప్పటికీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అప్పుడు వీలుపడలేదు. నా ఎత్తుకంటే, బరువు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు తలనొప్పిగా అనిపించేది. ఇలా ఇబ్బంది పడుతోన్న నాకు ‘‘ఈ సమస్యలన్నింటికి రన్నింగ్ చక్కటి పరిష్కార మార్గం’’ అని ఆయన పదేపదే చెబుతుండేవారు. పిల్లలు కూడా పెద్దవాళ్లు అవడంతో 43 ఏళ్ల వయసులో 2018లో రన్నింగ్ ప్రారంభించాను. ఒకపక్క రన్నింగ్ చేస్తూ బరువు పెంచని పోషకాహారం తీసుకుంటూ ఫిట్‌గా తయారయ్యాను. ఆరునెలల్లో మారథాన్ రన్నర్‌గా.. తెల్లవారుజామున నాలుగంటలకే నిద్రలేచి రన్నింగ్ సాధన చేసేదాన్ని. ఇలా అక్కడక్కడ జరిగే మారథాన్లలో పాల్గొనేదాన్ని. ఇలా పాల్గొంటూ తొలిసారి ఢిల్లీ స్టేట్ మారథాన్‌లో పాల్గొని రెండోస్థానంలో నిలిచాను. ఈ ఉత్సాహంతో ప్రతి మారథాన్‌లో పాల్గొనేదాన్ని. రేస్‌లో ఉన్నప్పుడు నా ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుండేది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ కొన్నిరోజులకు స్తనంలో వాపు కూడా రావడంతో మావారి బలవంతం మీద ఆసుపత్రిలో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి, వెంటనే సర్జరీ చేస్తామన్నారు. అప్పటికి సరిగ్గా వారం తరువాత రష్యాలో రన్నింగ్ రేస్‌లో పాల్గొనాల్సి ఉందని, తర్వాత చేయించుకుంటానని డాక్టర్‌కు చెప్పాను. ‘‘సర్జరీ వెంటనే చేయాలి, సర్జరీ తరువాత మీరు రన్నింగ్ రేస్‌లో పాల్గొన వచ్చు’’ అని అభయం ఇచ్చారు. సర్జరీ తరువాత కొంచం విశ్రాంతి తీసుకుని ఆయనతో కలిసి రష్యావెళ్లి రన్నింగ్‌లో పాల్గొన్నాను. రష్యా నుంచి వచ్చిన తరవాత కీమో తీసుకుంటూనే రన్నింగ్ కూడా చేసేదాన్ని. అలా ఏడు కీమోలు చేశారు. తొలి కీమో చేసిన తరువాత నా జుట్టు ఊడడం మొదలైంది. దీంతో నాకేదో అయిపోతోందని కుంగిపోయేదాన్ని. మా ఆయన, పిల్లలు... ‘‘ఇది శాశ్వతం కాదు కొన్నిరోజులే... తరువాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని ధైర్యం చెప్పడంతో కొంచెం కుదురుకున్నాను. భవిష్యత్‌లో మరిన్ని కిలోమీటర్లు.. ‘‘రన్నింగ్తోపోలిస్తే కీమోథెరపీ వల్ల కలిగే బాధ తక్కువే. అందుకే నువ్వు నీ రన్నింగ్‌ను ఆపాల్సిన పనిఏమీ లేదు. నువ్వు చక్కగా పరిగెత్తవచ్చు’’ అని డాక్టర్లు ధైర్యం నూరిపోశారు. దాంతో రెట్టింపు ∙ఉత్సాహంతో కీమోథెరపీ చేసిన కొద్దిరోజుల తరువాత ఢిల్లీలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ ను గంటా తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేశాను. ఆ తరువాత లద్ధాఖ్‌లో జరిగిన ఏడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది జూన్‌లో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెట్ చాంపియన్ షిప్లో పాల్గొని ఆరోస్థానంలో నిలిచాను. ఇప్పటికీ నేను కేవలం పదికిలోమీటర్ల రేసుల్లోనే పాల్గొంటున్నాను. భవిష్యత్ లో 21 కిలోమీటర్లు దూరం కూడా ప్రాక్టీస్ చేస్తాను. శరీరంలో క్యాన్సర్ మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయంటేనే జీవితం అయిపోయిందనిపిస్తుంది. అలాంటిది తన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ ‘‘... అయితే ఏంటి ..నా పరుగుని అది ఏం చేయలేదు’’ అని 47 ఏళ్ల వయసులో ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిగా నిలుస్తోంది సునీతామీనా. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం! -
వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్ (ఫొటోలు)
-
తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు
మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్కచిక్కిన ముసలమ్మ, ఇద్దరు కరీంనగర్ కుర్రాళ్లు పత్రికలలో స్థలాభావం వల్ల కనపడకుండా పోయారు. ఆ అవార్డులలో వీరికీ స్థానం ఉంది. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్ చేసిన ‘లతా భగవాన్ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం (ప్రత్యేక ప్రస్తావన) దక్కింది. ఆమె విజయమూ వారి విజయమూ మనకు బాగా కనపడాలి... వినపడాలి. ‘నా దృష్టిలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనేవి లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్‌గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయి?’ అంటారు దర్శకుడు నవీన్ దేశబోయిన. ఈ కరీంనగర్ సృజనశీలి ఇప్పుడు జాతీయస్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన ‘లతా భగవాన్ కారే’ మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం (స్పెషల్ మెన్షన్) అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గౌరవం. దాంతో పాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గౌరవం కూడా. ఎవరా సామాన్యురాలు? అంత అసమాన్యమైన పని ఏమి చేసింది? 2013లో పరుగు లతా కారేది మహారాష్ట్రలోని బారామతి. ఆమె భర్త భగవాన్ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురి పెళ్లిళ్లు చేసే సరికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్‌కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయాలి అందుకు 5 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ సమయానికి లతా కారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాపింది లేదు. కాని భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజీ కుర్రాడి ద్వారా బారామతిలో ‘సీనియర్ సిటిజెన్స్ మారథాన్’ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5 వేల రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5 వేల రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామె. 9 గజాల చీరలో పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతా కారే తెల్లవారు జామునే లేచి ఊళ్లో ఎవరూ చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. చాలాసార్లు కింద పడింది. అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకుని 9 గజాల చీర కట్టుకుని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్సూట్లలో, షూలలో ఉండేసరికి ఆమె కూడా కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకుని అనుమతి ఇచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతా కారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్ తెగిపోయింది. ఆమె రెండో స్లిప్పర్ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్ది సేపటిలోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్లు గెలిచింది. సినిమాగా ఈ వార్తను టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలిసినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేతే పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా ‘లతా భగవాన్ కారే’ పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. కారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్ మిత్రుడు కరీంనగర్ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా కారేను వెండి తెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరూ మరాఠి, తెలుగు భాషల్లో లతా కారే జీవితాన్ని సీక్వెల్‌గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం. -
మొత్తం మన చేతుల్లోనే!
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు మలయాళ నటి మమతా మోహన్‌దాస్. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నానంటున్నారు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో పాల్గొన్న పరుగు పందెంలో ఓ మెడల్ కూడా సాధించారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ ‘‘ఓ చిన్న మెటల్ పీస్‌ను ముద్దాడితే ఇంత ఆనందం కలుగుతుందనుకోలేదు. మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గెలుపు గీతను దాటుతుంటే కలిగిన ఆనందం వర్ణించలేనిది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎల్ ఏ మారతాన్ ట్రిపుల్ సిరీస్ గెలిచాను. నెక్ట్స్ మళ్లీ జనవరిలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్‌తో ‘9’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు మమతా మోహన్‌దాస్. -
నెక్లెస్‌రోడ్డులో మెగా మారథాన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ తెల్లవారుజామున పుల్ మారథాన్ ప్రారంభమయింది. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలికి 42 కొలోమీటర్ల పుల్ మారథాన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. పుల్ మారథాన్‌లో 26దేశాలకు చెందిన వేలాది మంది రన్నర్స్ పాల్గొన్నారు. హప్ మారథాన్ జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ప్రారంభించారు. దాదాపు 6,500 మంది హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరుగుతోంది. -
ఆడుకుందాం రండి..
సాక్షి, సిటీబ్యూరో : ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే కొన్ని రోజుల పాటు శరీరాన్ని దానికి సన్నద్ధం చేయాలి. టెన్నిస్/ఫుట్‌బాల్ మరేదైనా క్రీడల్లో పాల్గొనాలంటే కూడా ముందస్తు శిక్షణ తప్పదు. అన్ని రోజుల సమయం వెచ్చించాలంటే ఉద్యోగాలు, బాధ్యతలు ఉంటే కష్టం. అయితే ఏకంగా మనం పనిచేసే కంపెనీలే సెలవులతో పాటు కావాల్సిన వసతులన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తే... ‘ఆటాడుకుందాం రా.. అంటూ పాడేసుకోమా?’ అందుకే మన నగరం కేవలం బిర్యానీలు, ముత్యాలకు మాత్రమే కాదు... ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఆటలకు, మారథాన్‌లకూ కేరాఫ్‌గా మారుతోంది. అత్యధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తద్వారా దేశంలో జరిగే మారథాన్లలో హైదరాబాద్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నారు. కేవలం రెండు మూడు నెలలు తప్ప మిగిలిన ఏడాది మొత్తం చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఔత్సాహిక క్రీడలకు అనుకూలంగా ఉండడం... నగరంలో కార్పొరేట్ స్పోర్ట్స్ కల్చర్ స్థిరపడేందుకు కారణమవుతున్నాయి. మారథాన్... ధనాధన్ రన్నర్స్ ఎప్పుడూ పరుగు తీసే సామర్థ్యానికి సానబెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో కచ్చితమైన సమయపాలన అలవడుతుందని, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌తో ఎనర్జీ మేనేజ్మెంట్ తెలుస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. జీవితకాలాన్ని పెంచడంలో పరుగుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే చురుకైన జీవనశైలి, పనిలో రాణింపునకు కూడా ఇది దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అది మారథాన్ అయినా లేక ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్ట్ వర్క్ అయినా సరే... అంకితభావం, వేగం, సామర్థ్యం, ఓర్పు... ఈ నాలుగూ లక్ష్యసాధనకు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సిటీ మారథాన్లలో తమ ఉద్యోగులు పాల్గొనడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. దాదాపు 11ఏళ్లుగా కొనసాగుతున్న హైదరాబాద్ మారథాన్‌లో అంతకంతకు పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యానికి కారణమిదే. తొలుత 10కె రన్, 5కె రన్లకే పరిమితమైన ఉద్యోగులు ఇప్పుడు హాఫ్, ఫుల్ మారథాన్లకు సైతం సై అంటుండడం విశేషం. దీని వల్ల టైమ్ మేనేజ్మెంట్, క్రమశిక్షణ, లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, క్రమబద్ధమైన కార్యాచరణ వంటి లక్షణాలు బాగా అలవడతాయనే సైకాలజిస్ట్‌ల సూచనలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇదో ఉదాహరణ.. నగరంలోని పలు కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. ‘లివ్ వెల్’ పేరుతో ఆప్టమ్ కార్పొరేట్ కంపెనీ ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమ ఉద్యోగుల పూర్తిస్థాయి ఆరోగ్యంపై కంపెనీ శ్రద్ధ వహిస్తోంది. వీటిలో యోగా, పొగతాగే అలవాటు నుంచి విముక్తి వరకు ఉన్నాయి. అదే విధంగా క్రీడల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి తమ ఉద్యోగుల్లో 5,700 మంది ప్రయోజనం పొందారని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో ఉద్యోగులను ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ మారథాన్‌లో ఈసారి సంస్థ నుంచి 1200 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మారథాన్లలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొంటున్న కంపెనీగా వరుసగా 4 ట్రోఫీలు సైతం దక్కించుకుంది. హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం... ఉద్యోగుల ఆరోగ్యానికే మా తొలి ప్రాధాన్యం. సిటీలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్లలో వీలున్నంత వరకు వారిని మేం ప్రోత్సహించడం వెనుక కారణం ఇదే. మారథాన్‌లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య పరంగా గత నాలుగేళ్లుగా మేం టాప్ ప్లేస్‌లో ఉండడం దీనికో ఉదాహరణ. – క్షితిజి కశ్యప్, వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ -
విజయవాడలో అమరావతి మారథాన్
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో ఆదివారం ఉదయం అమరావతి మారథాన్ నిర్వహించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 21కె, 9కె రన్‌ను ప్రారంభించారు. ఈ మరథాన్ సందర్బంగా బెంజ్ సర్కిల్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీకాంతం, సీపీ గౌతమ్సవాంగ్లతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విజయవాడలో ప్రారంభమైన మారథాన్ రన్
-
విజయవాడలో ప్రారంభమైన మారథాన్ రన్
విజయవాడ: విజయవాడలో ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అమరావతి మరథాన్ రన్ ప్రారంభమైంది. 21,5, 10కె రన్ మూడు రకాల మారథాన్ రన్ ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఏపీ డీజీపీ జేవీ రాముడు పాల్గొన్నారు. ఇందులో 21కె మరథాన్‌ను సీపీ గౌతమ్ సవాంగ్, పాప్ సింగర్ స్మిత ప్రారంభించారు. 10కె మరథాన్ రన్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ మూడు రకాల మరథాన్‌లో భారీ సంఖ్యలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.