
మమతా మోహన్‌దాస్
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు మలయాళ నటి మమతా మోహన్‌దాస్. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నానంటున్నారు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో పాల్గొన్న పరుగు పందెంలో ఓ మెడల్ కూడా సాధించారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ ‘‘ఓ చిన్న మెటల్ పీస్‌ను ముద్దాడితే ఇంత ఆనందం కలుగుతుందనుకోలేదు.
మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గెలుపు గీతను దాటుతుంటే కలిగిన ఆనందం వర్ణించలేనిది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎల్ ఏ మారతాన్ ట్రిపుల్ సిరీస్ గెలిచాను. నెక్ట్స్ మళ్లీ జనవరిలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్‌తో ‘9’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు మమతా మోహన్‌దాస్.
Comments
Please login to add a commentAdd a comment