Mamatha mohandas
-
స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను
‘‘మహారాజ’ నా కెరీర్లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్వీఆర్ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. నేను క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్ కోసమే ‘మైఖేల్’లో ఓ క్యారెక్టర్ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్ సార్, విజయ్, షారుక్ ఖాన్గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. -
‘లెజెండ్’ సినిమాను గుర్తుచేసుకున్న జగపతిబాబు
'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. -
అవన్ని పుకార్లే.. మీరే చూడండి అలా ఉన్నానా?: హీరోయిన్
‘యమదొంగ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత ఆమె చింతకాయల రవి సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత సడెన్‌గా ఆమె తెరపై కనుమరుగైంది. గొంతు క్యాన్సర్ కారణంగా మమతా మోహన్ దాస్ నటనకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఈ వ్యాధి నుంచి బయట పడిన ఆనంతరం చికిత్స సమయంలో తీసుకున్న తన ఫొటోలను తరచూ షేర్ చేస్తూ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆమె ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మమతా మరోసారి క్యాన్సర్ బారిన పడిందని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ రకరకాలు పుకార్లను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మమత స్పందించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున వార్తలను ఆమె ఖండిచింది. ‘‘ఇటీవల నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసి నా అభిమానులు.. సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వారు నాకు డీఎంఎస్, మెయిల్స్ చేస్తున్నారు. రీసెంట్గా నన్ను ఇంటర్వ్యూ చేశామని చెప్పుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానల్సే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మళ్లీ నేను క్యాన్సర్ బారిన పడలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్పేవరకు ఎలాంటి వార్తలను నమ్మకండి. ఇదిగో నా తాజా ఫొటోలను షేర్ చేస్తున్నాను. ఇందులో నేను అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను మరోసారి క్యాన్సర్‌కు లొంగిపోయేందుకు సిద్ధంగా లేను’’ ఆంటూ ఆమె స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) చదవండి: వైష్ణవిని హీరోయిన్గా పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు -
15 ఏళ్ల తర్వాత బైక్ రైడ్.. ఎన్టీఆర్ హీరోయిన్ వీడియో వైరల్
దర్శకుడు ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ నటి మమతా మోహన్ దాస్. ఆ సినిమాలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే ఎన్టీఆర్ కు గట్టి పోటీని ఇచ్చింది. ఆమె నటనను చూసి దర్శకుడు రాజమౌళి అప్పట్లో షూటింగ్ స్పాట్ లోనే షాక్ అయ్యేవారట. కెరీర్ మొదట్లోనే క్యాన్సర్‌ని జయించిన ఈ మలయాళీ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంది. చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’లో ‘ఆకలేస్తే అన్నంపెడతా’, ఎన్టీఆర్ ‘రాఖీ’లో ‘రాఖీ రాఖీ..’ లాంటి సూపర్ హిట్‌పాటలు ఈ బ్యూటీ పాడినవే. చింతకాల రవి, కేడీ చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మమత.. రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది. ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్నని పోస్ట్ చేసింది. ప్రస్తుతం మమత . తెలుగు - తమిళ్ - మలయాళంలో తెరకెక్కుతున్న 'లాల్ బాగ్' అనే సినిమాలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా విస్తరిస్తున్న సాఫ్ట్ వేర్ అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారాట. ఇక సమ్మర్ లో ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
తెలుగులో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ మమతామోహన్ దాస్. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ భామ..ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. సుధీర్ఘ విరామం తర్వాత లాల్బాగ్ అనే ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో నందినీరాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీ రోల్స్ పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తెరెకక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్స్ విడుదల కావాల్సి ఉంది. చదవండి : ‘బిగ్‌బాస్’ ఆఫర్ వచ్చింది, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' -
Vishal: దుబాయ్ టు చెన్నై
దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు హీరో విశాల్. దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్లో మేజర్‌గా యాక్షన్ సీక్వెన్సెస్‌ను షూట్ చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా దర్శకత్వంలో వచ్చిన ‘అవన్ ఇవన్ ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
మొత్తం మన చేతుల్లోనే!
క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు మలయాళ నటి మమతా మోహన్‌దాస్. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నానంటున్నారు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో పాల్గొన్న పరుగు పందెంలో ఓ మెడల్ కూడా సాధించారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ ‘‘ఓ చిన్న మెటల్ పీస్‌ను ముద్దాడితే ఇంత ఆనందం కలుగుతుందనుకోలేదు. మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అంతా మన చేతుల్లోనే ఉంటుంది. గెలుపు గీతను దాటుతుంటే కలిగిన ఆనందం వర్ణించలేనిది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎల్ ఏ మారతాన్ ట్రిపుల్ సిరీస్ గెలిచాను. నెక్ట్స్ మళ్లీ జనవరిలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్‌తో ‘9’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు మమతా మోహన్‌దాస్. -
స్క్రీన్ టెస్ట్
1. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు నిర్మాతలు సి.అశ్వనీదత్, ‘దిల్’ రాజు. ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) సుకుమార్ బి) వంశీ పైడిపల్లి సి) త్రివిక్రమ్ డి) బోయపాటి శ్రీను 2. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఏయం రత్నం ఒకరు. ఆయన ఏ హీరోయిన్‌కు మేకప్‌మేన్‌గా పని చేశారో తెలుసా? ఎ) విజయశాంతి బి) రాధిక సి) రాధ డి) శ్రీదేవి 3. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుని ‘చి.ల.సౌ’ అనే సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ఎవరతను? ఎ) నవీన్ చంద్ర బి) హను రాఘవపూడి సి) రాహుల్ రవీంద్రన్ డి) అరుణ్ అదిత్ 4. తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఝాన్సీ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) జ్యోతిక సి) శ్రియ డి) అంజలి 5. ‘మృగం’ అనే డబ్బింగ్ చిత్రంలో నటించిన నటుడు ఇప్పుడు తెలుగులో మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఎవరు? ఎ) ఆర్య బి) భరత్ సి) శ్యామ్ డి) ఆది పినిశెట్టి 6. జయం, నిజం, వర్షం చిత్రాల విలన్‌గా నటించారీయన. ఈ హీరో నటించిన 25వ చిత్రం ఇటీవల విడుదలైంది. ఎవరా నటుడు? ఎ) నితిన్ బి) గోపీచంద్ సి) రామ్ డి) తరుణ్ 7. ‘బిVŠ బాస్’ మొదటి సీజన్ విజేత శివబాలాజీ. ఆయన తన మొదటి సినిమాలో ఏ హీరోతో కలిసి పనిచేశారో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) నవదీప్ సి) ‘అల్లరి’ నరేశ్ డి) రవితేజ 8. నితిన్ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) ప్రణీత సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 9 తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ఆర్టిస్ట్‌ని ‘ఇతను మావాడంటే మావాడు’ అని ఓన్ చేసుకున్నారు. ఆ నటుడెవరో? ఎ) ఎన్టీఆర్ బి) ఏయన్నార్ సి) యస్వీఆర్ డి) కాంతారావు 10. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవలను రచించింది యండమూరి. ఆ నవల ఆధారంగా తీసిన చిత్రంలో హీరో ఎవరో గుర్తుందా? ఎ) శ్రీకాంత్ బి) తరుణ్ సి) జేడీ చక్రవర్తి డి) వడ్డే నవీన్ 11. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే పాట ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) కె.వి.మహదేవన్ సి) గాలి పెంచల నరసింహారావు డి) సాలూరి రాజేశ్వరరావు 12. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘గుండుసూది గుండుసూది’ అనే పాటకు స్వరాలు సమకూర్చి, గొంతు కలిపింది యం.యం.కీరవాణి. ఆయనతో పాటు గొంతు కలిపిన లేడీ సింగర్ ఎవరో ఓ సారి గుర్తుపడదామా? ఎ) గీతామాధురి బి) శ్రావణ భార్గవి సి) సునీత డి) ప్రణవి 13. దర్శకుడు సుకుమార్ లెక్చరర్ అని చాలామందికి తెలుసు. ఆయన ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవారో తెలుసా? ఎ) మ్యాథ్స్ బి) సోషల్ సి) తెలుగు డి) ఇంగ్లీష్ 14. రీసెంట్గా తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన నటి ఎవరు? ఎ) మనీషా కోయిరాల బి) సోనాలీ బింద్రే సి) గౌతమి డి) మమతా మోహన్‌దాస్ 15. నాగచైతన్య నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అల్లుడు నాగచైతన్య అయితే అత్తగా నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) భూమిక బి) నదియా సి) వాణీ విశ్వనాథ్ డి) రమ్యకృష్ణ 16. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన చిన్న కుమారునికి నామకరణం చేశారు. ఆ నందమూరి చిన్నారికి ఏ పేరు పెట్టారో తెలుసా? ఎ) అభయ్ రామ్ బి) భార్గవ రామ్ సి) శౌర్య రామ్ డి) తారక్ రామ్ 17. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ‘శ్రద్ధాకపూర్’ నటిస్తున్నారు. మరో బాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) ఎవెలిన్ శర్మ బి) అనుష్కా శర్మ సి) ఆలియా భట్ డి) దీపికా పదుకోన్ 18. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించి, పలు అవార్డులు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిసెస్’ అనే చిత్రం రానుంది. ఆ చిత్రంలో నటిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) కృతీ కర్భందా బి) హెబ్బా పటేల్ సి) రష్మికా మండన్నా డి) నందితా రాజ్ 19. ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) అంజలీదేవి సి) భానుమతి డి) బి. సరోజాదేవి 20. ఈ కింది ఫోటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఇప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సన్నీ లీయోన్ సి) పరిణీతీ చోప్రా డి) సోనాక్షీ సిన్హా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) డి 16) బి 17) ఎ 18) బి 19) సి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
ఏడేళ్ల తరువాత.. ఆ నటి మళ్లీ..!
సాక్షి, చెన్నై: ఏడేళ్ల తర్వాత నూతన ఉత్సాహంతో హీరోయిన్ మమతా మోహన్‌దాస్ మళ్లీ తెరపైకి రానుంది. ఆమె చాలా మంది యువతకు స్పూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ మహమ్మారిని జయించి నిలిచిన అతికొద్ది మందిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పలు చిత్రాలో నటించిన ఈ నటి తాజాగా తన రీఎంట్రీని మొదలెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు అవకాశాలను దక్కించుకుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశం. ఆయన నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం నిర్మాణంలో ఉంది. కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో మెర్కురీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మమతా మోహన్‌దాస్ నటిస్తోంది. ఆ చిత్రానికి ఊమై విళిగల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. పార్థిబన్ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఉళై వెళియో 2 చిత్రంలో ఆయనకు జంటగా నటించబోతుంది. ఈ చిత్రాల విడుదల తర్వాత ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. -
అరుంధతి నేనే అవ్వాల్సింది
తమిళసినిమా: అరుంధతి నేనే అవ్వాల్సిందని అని నటి మమతామోహన్‌దాస్ పేర్కొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ బహుభాషా నటిగా రాణించిన మమతా మంచి గాయని కూడా. తెలుగులో నాగార్జున వంటి స్టార్‌తో జత కట్టి స్టార్ హీరోయిన్గా రాణించిన మలయాళీ భామ ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడింది. అరుంధతి చిత్రాన్ని నటి అనుష్క జీవితంలో మరచిపోలేదు. తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆ చిత్రానికి కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. అంత ఘన విజయం సాధించిన చిత్రం అరుంధతి. నటి అనుష్కకు అంత పేరును ఆపాదించి పెట్టిన ఆ చిత్రం మమతను దాటి అనుష్కకు వచ్చిందట. దీని గురించి మమత ఒక భేటీలో తెలుపుతూ మొదట్లో తాను నటనపై ఆసక్తి చూపలేదని అంది. తొలి నాలుగేళ్లలో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయాను కానీ, చాలా అయోమయంలో ఉండిపోయానని చెప్పింది. మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనేలేదని అంది. అరుంధతిలో నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఆ తరువాత ఆ చిత్రంలో అనుష్క నటించడం ఆమెకా చిత్రం స్టార్డమ్ తెచ్చిపెట్టడం గురించి తెలుసుకున్నానని తెలిపింది. ఆ తరువాతే చిత్రాలపై అవగాహన పెరిగిందని, ఆ తరువాత రెండు నెలల్లోనే జీవితంలో పెద్ద షాక్‌కు గురయానని చెప్పింది. కేన్సర్‌తో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పింది. దీంతో సినిమా కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత నివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతామోహన్‌దాస్ పేర్కొంది. -
వారిని కుక్కపిల్లని పెంచుకోమనండి
మారుతున్న కాలంతో సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం పెంపొందుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఆహ్వానించదగ్గ విప్లవాత్వకమైన ప్రగతి పథమే. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. ఇదీ అందరూ కోరుకుంటున్న అంశమే. అయితే ఇంకా మగువలను ఆటబొమ్మగా చూసే వారు లేకపోలేదు. మరి కొందరు స్త్రీలను కుటుంబ బాధ్యతలకే పరిమితం చేయాలనుకుంటున్నారు. ఇది మంచాచెడా అన్న విషయం పక్కన పెడితే కొందరి సంసారాలు సమస్యల వలయంగా మారుతున్నాయి. విడాకులు అధికం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ సమస్య పెనుభూతంగా మారుతోంది. సమాజం నుంచి తీసుకున్న రకరకాల ఇతి వృత్తాలతో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తున్న తారలు తమ జీవితాల విషయానికి వచ్చే సరికి సర్దుబాటుతనం, పరస్పర అవగాహన, మనసు విప్పి మాట్లాడుకోవడం వంటి విషయాలను పక్కన పెడుతున్నారు. ఇందుకు ఈగో అన్నది పెద్ద అడ్డుగోడగా మారుతుందని చెప్పవచ్చు. ప్రేమించుకునే సమయంలో, పెళ్లి అయిన కొత్తలో తన భర్త సహృదయుడు, తన భార్య అనుకూలవతి అని ఆనందంగా, ఇంకా చెప్పాలంటే గొప్పగా చెప్పుకునే వారు ఆ తరువాత కొద్ది కాలానికే కాపురాలను కలహాలమయంగా మార్చుకోవడం, విడాకుల కోసం కోర్టు గుమ్మాలెక్కడం వంటి సంఘటనలకు గురవుతుండడం బాధాకరం. ఇటీవల నటి అమలాపాల్ సంఘటననే తీసుకుంటే చిత్రరంగప్రవేశం చేసిన కొద్ది కాలానికే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కథానాయకిగా ఎదుగుతున్న సమయంలోనే నటనకు దూరం అవుతున్నారని ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురైనా, సంసార జీవితంలోకి అడుగుపెట్టినందుకు సంతోషించినవారు లేకపోలేదు. పెళ్లైన కొత్తలో విదేశాల్లో హనీమూన్, సరదాగా కాలక్షేపాలు అంటూ జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అయితే ఇలాంటి సంతోషాలకు రెండేళ్లకే కాలం చెల్లింది. ఇప్పుడు విజయ్ అమలాపాల్ మనస్పర్థల కారణంగా విడిపోయారు. అమలాపాల్ ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఇది విజయ్‌కి సుతారంగా ఇష్టం లేదట. ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులు ఇష్టపడడం లేదట.ఈ వ్యవహారంలో కొందరు సన్నిహితుల సంధి కూడా విఫలం అయ్యిందని సమాచారం.దీంతో విజయ్ అమలాపాల్‌ల కాపురం సుఖాంతానికి తెరపడడంతో విడాకులకు సిద్ధం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అమలాపాల్ విడాకుల వ్యవహారంపై నటి ప్రియమణి, మమతామోహన్‌దాస్, నిక్కీగల్రాణిలాంటి వారి స్పందన చూద్దాం. నటి ప్రియమణి స్పందిస్తూ ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎంతో సాధిస్తున్నారు.వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీలు తమ కుటుంబాన్ని, వృత్తిని చక్కగా గమనించుకుంటున్నారు. అలాంటిది నటీమణుల విషయానికొచ్చేసరికి వివాహంతో వారి జీవితం ముగుసిపోయిందని, అభిమానుల ఆదరణ తగ్గిపోతుందనే అపోహ పరిశ్రమలో నెలకొంది.అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. వివాహనంతరం నటీమణులు సాధిస్తున్నారు. హిందీలో కరీనాకపూర్, విద్యాబాలన్ లాంటివారు వివాహానంతరం నటనలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఉత్తమ నటీమణులుగా అవార్డులు అందుకుంటున్నారు. వరుసగా నటిస్తున్నారు. తమిళంలో నటి జ్యోతిక వివాహానంతరం, ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా మళ్లీ నటిస్తున్నారు. నటీమణులు వివాహానంతరం నటించడం తప్పేమి కాదు. నటనకు దూరం అవ్వాలన్నది పాత ఆలోచను. సమాజం పేరుతో నటీమణుల కలల్ని కల్లలు చేయడం సరికాదు అని అన్నారు. రక్షణలేదు నటి మమతామోహన్‌దాస్ మాట్లాడుతూ ప్రతి స్త్రీకి వివాహం అన్నది సంతోషకరమైన విషయమే.అయితే పెళ్లి అయిన తరువాత కుటుంబాన్ని చూసుకోవాలి, భర్త భాగోగులు గమనించాలంటూ పాత చింతకాయ కహానీలు చెబుతుంటారు. ఇక నటి అయితే ఈ పనులతో పాటు తన అందాన్ని కాపాడుకోవాలి. షూటింగ్‌లకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సింటుంది. భర్తలు మాత్రం భార్యకుటుంబ పనులు చూసుకోవాలి అని భావిస్తుంటారు.అవన్నీ సంతృప్తిగా చేస్తే అప్పుడు తన వృత్తికి అనుమతిస్తారు.నిజం చెప్పాలంటే నటీమణులకు రక్షణ లేదని అభిప్రాయపడుతున్నారు. నటీమణులు పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టి తన పనులపై దృష్టి పెట్టాలి అని అన్నారు. స్త్రీలు అణిగిమణిగి ఉండాలని భావించేవారు కుక్కపిల్లల్ని పెంచుకోవాలని అన్నారు. నటి నిక్కీగల్రాణి మాట్లాడుతూ నటీమణులు వివాహానంతరం నటించకూడదనడం హాస్యాస్పదం అన్నారు. -
పాడమని నన్నడగవలెనా..!
చెన్నై : పాడమని నన్నడగవలెనా..పరవశించి నే పాడనా! అంటున్నారు ఈ తరం కథా నాయికలు. పాతతరం తారామణులు తమ పాత్రలకు తామే గాత్రాన్ని ఇచ్చేవారు. సంగీత ప్రవేశం లేకపోవడం, రాగస్వరాలు పలకలేకపోవడం తదితర కారణాలతో ప్లేబ్లాక్ సింగర్స్ వచ్చారు. తాజాగా హీరోయిన్లు పాడడంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. విశేషం ఏమిటంటే పరభాషా తారామణులు సైతం పాడేస్తున్నారు. ఇటీవల నటి ఆండ్రియా, రమ్యా నంబీశన్, మమతా మోహన్‌దాస్ తదితర హీరోయిన్లు నటనతో పాటు పాడడానికి ప్రాముఖ్యమిస్తున్నారు. ఇప్పటికే నటి శ్రుతిహాసన్ గాయనిగా రంగ ప్రవేశం చేశారు. తాజాగా తానేమి తక్కువ తిన్నానా అంటూ గాన రంగంలోకి ప్రవేశించింది నటి నిత్యామీనన్. ఈ మలయాళ బ్యూటీ తమిళంలో నటిస్తున్న తాజా చిత్రంలో ఒక పాట పాడిందట. దీనిపై ఆమె మాట్లాడుతూ తమిళంలో తొలిసారిగా పాడినా, మలయాళంలో ఇప్పటికే పలు పాటలు పాడానని తెలిపారు. కోలీవుడ్‌లో గాయనిగా లభించే ఆదరణను బట్టి తదుపరి తమిళంలో పాడే విషయం ఆలోచిస్తానని చెప్పారు. నటి మేఘ్నారాజ్ కూడా కన్నడంలో ఒక చిత్రంలో పాడారట. అయితే వీరంతా తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకునే విషయంలో కూడా ఆసక్తి చూపాలని సినీ వర్గాలంటున్నాయి.